
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న తెలుగుదే శం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. గజ్వేల్‌లోని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన ఉదయం 11.30 గంటలకు గులాబీ తీర్థం తీసుకోనున్నా రు.
యాగం జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయక్షేత్రం వద్ద నెలకొన్న భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో ఆయన అనుచ రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో టీటీడీపీ పోటీ చేయరాదని పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో విభేదిస్తూ జ్ఞానేశ్వర్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాగా వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యరి్థగా లేదా రాజ్యసభ ఎంపీగా అవకాశమిస్తామని జ్ఞానేశ్వర్‌కు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హామీనిచి్చనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment