సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబు.. కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2018 లో కాంగ్రెస్‌తో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు.. 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదని, బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఈటల అన్నారు.
కాగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తోక ముడిచింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా కూడా చేశారు. చంద్రబాబు, లోకేష్ తీరుపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
‘టీడీపీ ఇక్కడ పోటీ చేయొద్దనడం వెనుక ఎవరున్నరో గానీ, మన చౌదరీలే కాంగ్రెస్‌కు ఓటేయమని క్లియర్‌గా చెబుతున్నరు. బాబును మొన్న కలిసినప్పుడు మన కమ్మ వాళ్లే పోటీ చేయడం లేదని ప్రచారం చేస్తున్నరని క్లియర్‌గా చెప్పిన. టీడీపీ వాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయమని చెబితే ఎట్ల. వీళ్లు ప్రచారం చేసినా.. కొందరే కాంగ్రెస్ అంటున్నరు. మిగతా వాళ్లు బీఆర్‌ఎస్‌కు ఓటేయాలంటున్నరు’’ అంటూ కాసాని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఓ లెక్క. జనరల్ ఎన్నికల్లో చేయకపోతే ఎట్ల?’ అంటూ కాసాని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment