టీఆర్ఎస్ లోకి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు | mptc's zptc's and surpanches join in trs party | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ లోకి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు

Published Fri, Mar 25 2016 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

టీఆర్ఎస్ లోకి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు

టీఆర్ఎస్ లోకి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు

పార్టీలోకి ఆహ్వానించిన కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం

కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సమక్షంలో గురువారం పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న జలగం క్యాంపు కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు టీఆర్‌ఎస్ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సింగభూపాలెం సర్పంచ్ భూక్యా జ్యోతి, కారుకొండ పంచాయతీ సర్పంచ్ మాళోతు భారతి, అనిశెట్టిపల్లి సర్పంచ్ ఈసం రామారావు, పెనుబల్లి సర్పంచ్ హాలావత్ రుక్మిణి, రుద్రంపూర్ సర్పంచ్ గొగ్గెల లక్ష్మి, సీతంపేట సర్పంచ్ లావుడ్య మంగమ్మ, వెంకటేష్‌ఖని సర్పంచ్ తాటి సావిత్రి, గౌతంపూర్ ఎంపీటీసీ-3 భూక్యా రుక్మిణి, రుద్రంపూర్-1 ఎంపీటీసీ అజీజ్‌ఖాన్, లక్ష్మీదేవిపల్లి ఎంపీటీసీ తేజావత్ భద్రమ్మ, చుంచుపల్లితండా ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ మాళోతు ఈరి, కొత్తగూడెం మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ బండి నర్సింహారావు, 33వ వార్డు కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్,  కొత్తగూడెం నియోజకవర్గంలో  ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement