అందుకే సమగ్ర కులగణనకు చర్యలు వేగవంతం చేశాం
దసరా పండుగ తర్వాత సర్వే ప్రక్రియ ప్రారంభిస్తాం
బీసీ కుల సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వారి జనాభాకు అనుగుణంగా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలగోనీ బాలరాజుగౌడ్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా బీసీ ప్రతినిధుల బృందానికి డిసెంబర్‌లోగా కుల గణన సర్వే పూర్తి చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై బీసీ కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉండటం పట్ల బీసీ సంక్షేమసంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులను సందర్భంగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment