BC Reservations
-
ఇప్పటికిప్పుడు బీసీ కోటా అసాధ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఇప్పటికిప్పుడు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరని, వచ్చే నెల తొలివారంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలని సవాల్ చేశారు.రాష్ట్రంలో సమగ్రంగా కులగణన చేపట్టామని, అది దేశానికే ఒక రోడ్ మ్యాప్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. కులగణనలో సేకరించిన వివరాల ఆధారంగానే కమిషన్ లేదా అధికారులతో కమిటీ వేసి భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనంతరం అక్కడి తుగ్లక్‌రోడ్డులోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మేం చేపట్టిన కులగణనలో బీసీలు ఆరు శాతం పెరిగారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే చూపారు. అందులో బీసీలు 51 శాతం, ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతంకాగా.. మిగతా వాళ్లను ఓసీలుగా చూపారు. మేం చేసిన సర్వేలో మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించాం. మా సర్వే ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56 శాతం ఉన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం.కేసీఆర్ సర్వేలో ఎస్సీల్లో 82 కులాలున్నాయని చెప్పారు. కానీ ఉన్నవి 59 కులాలే. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా దాన్ని మరో కులంగా చూపారు. లేని కులాలను ఇప్పుడు చూపెట్టాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన నేను పట్టించుకోను. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. 1994లో ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని నేను చెప్పాను. నేను చేసిన వ్యాఖ్యలను కూడా అంగీకరించాను. కాకపోతే తేదీ, సమయం విషయంలో కొంత తేడా వచి్చంది. కిషన్‌రెడ్డి చెప్పింది నేను అంగీకరిస్తున్నా.. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. ఆయన హోదాను తగ్గించలేదు. అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. రాహుల్ గాందీయే నా బాస్.. కాంగ్రెస్ సీఎంగా నేను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు నడుచుకుంటా. ఆయన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తా. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోను. కేవలం రాహుల్ గాంధే నా బాస్. ఆయన చెప్పినట్టు నడుచుకుంటా. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ నాపై అనేక ఫిర్యాదులు, విమర్శలు వచి్చనా పట్టించుకోలేదు. రాహుల్ ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. పీసీసీ, మంత్రివర్గ విస్తరణ అంశాల్లో కొందరు నాపై అబద్ధపు ప్రచారాలు, ఊహాగానాలు వ్యాప్తిచేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు..’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.శనివారం సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహరాజ్ నిలిచారని కొనియాడారు.ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాల్సి ఉందని.. ఈ విషయంలో అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలను పాటిస్తామని రేవంత్ చెప్పారు. కేటీఆర్ తానే కోర్టు అన్నట్టుగా మాట్లాడుతున్నారని, కోర్టు తీర్పు రాకముందే తీర్పులు ఇచ్చేస్తున్నారని విమర్శించారు. న్యాయ ప్రక్రియకు లోబడే ఈ విషయంలో ముందుకు వెళతామని తెలిపారు. అయితే దానం నాగేందర్ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ గుర్తుపై పోటీచేసిన రుజువులున్నాయి కదా అని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ‘గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచారు? ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారు? నేను ఈ అంశంపై ఫిర్యాదులు చేసినా ఏం జరిగింది?’అని రేవంత్ పేర్కొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర: కవిత
సాక్షి, ఖమ్మం జిల్లా: కేసీఆర్‌పై కక్షతో రైతులను బాధపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీసి రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని.. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. 46 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న కవిత.. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు.మూడు బిల్లులు పెట్టకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టే. మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్‌గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మూడు బిల్లులు పెట్టండి. రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటారు. ఖమ్మంకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. నిజామాబాద్‌లో మంత్రే లేడు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాం. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. -
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్న వించారు. గురువారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజు ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వినయ్ కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, దాసు సురేశ్ తదితరులు సమావేశమయ్యారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనని వారికి.. ఈ నెల 16 నుండి 28 తేదీల మధ్య అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. 25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు: కృష్ణయ్యఈ నెల 25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి గురువారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడంపై కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. -
మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయం
-
‘స్థానికం’.. ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడమే తరువాయి అన్నంతగా నెలకొన్న ఉత్కంఠ ఒక్కసారిగా చల్లారిపోయింది. రాష్ట్రంలో మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయించడం, బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని భావించడమే దీనికి కారణం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సమయం పట్టే అవకాశం ఉందని, దీనితో మే లేదా జూన్ నాటికి ‘స్థానిక’ఎన్నికలు జరగవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో విడత కులగణన సర్వే.. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం (దాదాపు 16 లక్షల మంది) వివరాల నమోదు కోసం మరో విడత సర్వే నిర్వహించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. ఆ సర్వే తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధిస్తామని తెలిపారు. తద్వారా ‘స్థానిక’ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు పరోక్షంగానే బయటపెట్టారనే చర్చ జరుగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి పార్లమెంట్‌కు పంపడం, అక్కడ ఆమోదం పొందడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు కాక స్థానిక ఎన్నికలు మరికొన్ని నెలలు వాయిదా పడవచ్చని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, మే లేదా జూన్‌లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వడివడిగా అడుగులు వేసినా.. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేగంగా అధ్యయనం పూర్తి చేసి సర్కారుకు నివేదిక అందజేయడం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక అందడం, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చర్చ వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈనెల 15వ తేదీలోగా వస్తుందని కొందరు మంత్రులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు కసరత్తు చేపట్టాయి. సిబ్బందికి శిక్షణ, జిల్లా కలెక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత వారం రోజుల వ్యవధి ఇచ్చి పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రచారం జరిగింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపర్లపై ‘నోటా’ గుర్తు చేర్పు అంశంపై రాజకీయ పారీ్టల ప్రతినిధులతో సమావేశం కూడా జరిగింది. ఎన్నికలపై భిన్నాభిప్రాయాల మధ్య స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలా, వద్దా అన్న అంశంపై బుధవారం సీఎం ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని తెలిసింది. తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని కొందరు మంత్రులు ప్రతిపాదించగా.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు రిజర్వేషన్లపై బీసీలకు ఇచి్చన మాట నిలబెట్టుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకెళ్లాలని వారు స్పష్టం చేశారని సమాచారం. స్థానిక సంస్థలకే కాకుండా విద్య, ఉద్యోగపరంగా కూడా బీసీలకు తగిన రిజర్వేషన్లను కల్పించాలని వారు అభిప్రాయపడ్డారని తెలిసింది. మరోవైపు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి అందాల్సిన విధులు రావని.. వీలైనంత త్వరగా నిర్వహించాలని కొందరు మంత్రులు సూచించారని సమాచారం. అయితే ఈ అంశం చాలా సున్నితమైనదని.. బీసీల రిజర్వేషన్లు కీలకమని, ఈ విషయంలో విధుల కంటే కాంగ్రెస్ పారీ్టకి ఉన్న నిబద్ధత ముఖ్యమని సీఎం రేవంత్‌తోపాటు మరికొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో ఈ అంశాన్ని పొందుపరచాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారని సమాచారం. -
‘స్థానిక’ తేదీలపై నేడు స్పష్టత!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపైనా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదికను సమర్పించిన నేపథ్యంలో, నివేదికపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అదే జరిగితే అయిదారు రోజుల్లోనే అంటే ఈ నెల 17 లోగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) విడుదల చేయవచ్చని చెబుతున్నారు. అలాగే ముందుగా ఏ ఎన్నికలు జరపాలి?, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలా..?, లేక గ్రామపంచాయతీ ఎన్నికలా?.. ఏయే తేదీల్లో వీటిని నిర్వహించాలి? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.వారం తేడాతోనే రెండు ఎన్నికలు!ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించినా లేదా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించినా, వారం రోజుల తేడాతోనే రెండు ఎన్నికలూ నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. షెడ్యూల్‌ను ప్రకటించాక 21 రోజుల్లోనే ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా ముగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి వీలుగా వారం రోజుల్లో సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించవచ్చని తెలిసింది.తదనుగుణంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లేదా ప్రత్యక్షంగా ఎస్ఈసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను మండలాలు, జిల్లా పరిషత్‌లలో ప్రదర్శించారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా మొదలైంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ ఈ నెల 15 కల్లా పూర్తవుతాయని, షెడ్యూల్ వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యరంగంలోకి దిగుతారని పంచాతీరాజ్, ఎస్ఈసీ అధికారులు చెబుతున్నారు.తొలుత ఎంపీటీసీ ఎన్నికలే..?పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరంగా క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లు, అధికారులు, సిబ్బంది పరంగా నిర్వహిస్తున్న సమీక్షలను బట్టి చూస్తే మాత్రం ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే జరిగే సూచనలున్నాయి. బుధవారం ఉదయం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), ఆర్డీవోలు, సీఈవోలకు పంచాయతీరాజ్ శాఖ శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు కమిషనరేట్ కార్యాలయం నుంచి లేఖ పంపించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోటా ఖరారు చేయగానే.. వచ్చే 3,4 రోజుల్లోనే పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల స్థాయిల్లో (స్థానికంగా జీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు) జనాభాకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పీఆర్ శాఖ నిర్ణయించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా కాకుండా...స్థానికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రకారం హెచ్చుతగ్గుల్లో ఉంటాయని అధికార వర్గాల సమాచారం. -
మిగిలింది రిజర్వేషన్ల లెక్కే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో అమలు చేసే రిజర్వేషన్ల లెక్క తేలడమే మిగిలింది. బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ బీసీ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. సోమవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరగనుంది. కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉండటంతో.. ఆ మేరకు రిజర్వేషన్లకు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలు 5,817, ఎంపీపీలు 570, జెడ్పీటీసీ స్థానాలు 570 ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సైతం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసుకుంది.బీసీ రిజర్వేషన్లు 23శాతంలోపే..!రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రకారం.. రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 17.43 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 10.45 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదు. దీనితో ఎస్సీలకు 17.43 శాతం, ఎస్టీలకు 10.45 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటిని మినహాయిస్తే.. బీసీలకు 22.12 శాతమే రిజర్వేషన్లు అందుతాయి. ఇందులో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇచ్చే నివేదికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధంస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఈ నెల 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ రాణీ కుముదిని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై 11న జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా కొనసాగుతోంది. ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించనున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. -
వారంలో ‘స్థానిక’ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్(Election schedule) ఈ నెల 15వ తేదీ లోగా వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల(BC ReservationBC ReservationBC Reservation)BC ReservationsBC ReservationsBC ReservationBC Reservationsకు సంబంధించి ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ నివేదికపై చర్చించాక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. అనంతరం రిజర్వేషన్ల ఖరా రుతో పాటు ఎన్నికల తేదీలపైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయనుంది.వెంటనే ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్(election notification) జారీ చేయనుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, అదే నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. టెన్త్ పరీక్షలకు ఎక్కువగా పరీక్షా కేంద్రాలు అవసరం కాబట్టి, ఇవి మొదలు కావడానికి అయిదారు రోజుల ముందే... అంటే మార్చి 17, 18 లోగానే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మూడు కాదు..రెండు విడతల్లోనే ‘పంచాయతీ’ ఈ నెల 15వ తేదీ లోగా నోటిఫికేషన్ జారీచేస్తే..ఆ తర్వాత 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే తొలుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేసేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ఈ లెక్కన ఫిబ్రవరి చివర్లోగా ఈ ఎన్నికలు పూర్తయితే..తర్వాత మార్చి 17, 18 లోగానే రెండు విడతల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2019లో పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించగా, ఈసారి కూడా అలాగే జరిపేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం.అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలేవీ పెద్దగా లేవు కాబట్టి రెండు విడతల్లోనే పంచాయతీ పోరు ముగించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థలకు నోడల్ ఏజెన్సీ అయిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా కూడా ఎన్నికల దిశగా అన్నిరకాల కసరత్తును వేగవంతం చేశారు. 11న కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ భేటీ ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా అందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండేలా ఎస్ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు చేస్తున్న సన్నాహాలు, సన్నద్ధమౌతున్న తీరుపై ఈ నెల 11న జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీ కుముదిని సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 10 తేదీన...ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ శుక్రవారం రాణీ కుముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు.అలాగే గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే నాగర్‌కర్నూల్ జిల్లాలోని నరసింహాపురం ఎంపీటీసీ, కొల్లాపూర్ జడ్పీటీసీ, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లి ఎంపీటీసీ, ఖమ్మం రూరల్ జడ్పీటీసీ స్థానాలు మినహా ప్రచురించాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ దాకా గ్రామ పంచాయతీ ఫొటో ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చడం, తొలగింపు, దిద్దుబాటు వంటివి చేసే అవకాశం ఉన్నందున చట్టంలోని అంశాలకు లోబడి ఆ ప్రక్రియను చేపట్టాలని ఆమె సూచించారు.ఇదిలా ఉంటే.. ఈ నెల 10వ తేదీకల్లా రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియామకం, 12వ తేదీలోగా ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లా, మండల స్థాయిల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది (రిటర్నింట్ ఆఫీసర్లతో సహా)కి శిక్షణా తరగతులు చేపట్టాలని ఎస్ఈసీ సూచించింది. 15వ తేదీలోగా పోలింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు(ఏపీవో) శిక్షణ తరగతులు పూర్తి చేయాలని తెలిపింది. 15న పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రచురణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించాలని జిల్లా కలెక్టర్లు / జిల్లా ఎన్నికల అధికారులకు (హైదరాబాద్ మినహా) ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సీఈవోలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలకు సర్క్యులర్ జారీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారుల (కలెక్టర్లు) నుంచి ఆమోదం లభించాకే వాటిని ప్రచురించాలని సూచించారు. ఎంపీడీవోలు, ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్ల కోసం ప్రతిపాదిస్తున్న భవనాలను స్వయంగా పరిశీలించి, స్టేషన్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయనే నిర్థారణకు రావాలన్నారు. 23 శాతంలోపే బీసీ రిజర్వేషన్లు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నప్పటికీ.. ఆ మేరకు సాధ్యమయ్యే అవకాశాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి న ట్రిపుల్ టెస్ట్ ఆదేశాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించాలని (1), మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని (2), డెడికేటెడ్ కమిషన్‌ను నియమించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని (3) న్యాయ నిపుణులు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం మొదట్లో వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతంగా ఉన్నారు. జనాభాకు అనుగుణంగా వీరికి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నందున ఈ రెండు వర్గాలకు 27.88 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని, 50 శాతంలో ఇంకా మిగిలింది 22.12 శాతమేనని చెబుతున్నారు. ఇక డెడికేటెడ్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించకుండానే రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
తెలంగాణ అసెంబ్లీలో బీసీ జనాభా లెక్కల నివేదికపై చర్చ
-
Telangana: స్థానిక పోరుకు రెఢీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా లేదా మార్చి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనితో వచ్చే నెల చివర్లోగానీ, ఆ రెండు పరీక్షల మధ్య సమయంలో (మార్చి 17, 18 నాటికి)గానీ ఎన్నికల ప్రక్రియ ముగించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 5న కేబినెట్ భేటీ ఉంటుందని, స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మొదలైన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చా అన్న సందేహాలున్నా.. ఆ కోడ్ స్థానిక ఎన్నికలకు అడ్డుకాబోదని ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. స్థానిక ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగానే సమగ్ర కుల సర్వే నివేదిక ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉప సంఘానికి చేరనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉప సంఘం ఆ నివేదికపై చర్చించి తగిన ప్రాధాన్యతాంశాలతో మంత్రివర్గానికి నివేదిక అందిస్తుందని వెల్లడించాయి. ఫిబ్రవరి 5న జరిగే కేబినెట్ భేటీలో ఉప సంఘం నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులపై చర్చించనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 6 లేదా 7వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించనున్నట్టు సమాచారం. ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు మొదలుపెట్టాయి. రెవెన్యూ మండలాల పరిధి, స్థాయికి తగినట్టుగా మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల పునర్విభజన చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు గురువారం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 3వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండేలా రూపకల్పన (కార్వింగ్) చేయాలని సూచించారు. 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ‘కార్వింగ్’ చేయాలని ఆదేశించారు. శుక్రవారం వరకు ఎంపీటీసీ స్థానాల ముసాయిదా ప్రచురించి.. శుక్ర, శనివారాల్లో అభ్యంతరాలకు గడువు ఇవ్వాలని.. శని, ఆదివారాల్లో వాటిని పరిష్కరించి 3వ తేదీన తుది ప్రచురణ చేయాలని సూచించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, రెవెన్యూ మండలాలకు తగ్గట్టుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం వల్ల ఎంపీటీసీ స్థానాలు ప్రభావితమైన చోట, నిర్ణీత జనాభాకు మించి, లేదా తక్కువగా ఉన్నచోట పక్కనే ఉన్న స్థానాలతో సర్దుబాటు చేయడం, లేక కొత్త స్థానాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లలో ఎస్ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎదురుచూస్తోంది. తేదీలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి... రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలపెట్టినట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్‌కు ఏర్పాట్లతోపాటు సర్పంచ్ పదవికి 30దాకా, వార్డు మెంబర్లకు 20 దాకా వివిధ ఫ్రీసింబల్స్ (ఎన్నికల చిహ్నాలను) సిద్ధం చేసినట్టు జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం, బ్యాలెట్ బాక్స్‌లను సైతం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పెంపు సాధ్యమేనా? బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు చర్యలు చేపట్టింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50శాతం మించరాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరుగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం కాకుండా... ఎక్కడికక్కడ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిధిలోని జనాభా ప్రామాణికంగా వేర్వేరుగా రిజర్వేషన్లు అమలు చేసే యోచన కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే ఎస్సీ, ఎస్టీల జనాభా అధికంగా ఉన్నచోట బీసీలకు తక్కువగా, బీసీల జనాభా ఎక్కువగా ఉన్నచోట 42 శాతం దాకా రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. కానీ ఇది ఆచరణ సాధ్యమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం నుంచి 50 శాతం దాకా టికెట్లు ఇవ్వవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
బీసీ రిజర్వేషన్లు పెంచాకే ‘స్థానిక’ ఎన్నికలు జరపాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని అమలు చేయకుంటే ఉద్యమిస్తామన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో జనవరి 3న ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. 40కి పైగా బీసీ సంఘాల నాయకులతో శుక్రవారం కవిత తన నివాసంలో భేటీ అయ్యారు.బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఆమె బీసీ సంఘాల నాయకులతో చర్చించారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాతో పంచుకున్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు’అని కవిత పేర్కొన్నారు.జనవరి 3న సినిమా చూపిస్తాం ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతాం. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పణ, బీసీల జనాభా సంఖ్యను వెల్లడించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తంగా బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో జనవరి 3న జరిపే సభ ద్వారా ప్రభుత్వానికి సినిమా చూపిస్తాం’అని కవిత ప్రకటించారు. -
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యా ఉద్యోగాల్లో అమలు చేసినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాతినిధ్యానికి నోచుకోని కులాలు, సంచార జాతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు డీఆర్డీఎస్ రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ కేవీ రావు, రిటైర్డ్ అడిషినల్ డీసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, ఎంబీసీ ప్రతినిధి మహేశ్ వినతిపత్రం సమర్పించారు. 35 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యంత వెనుబడిన కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. బీసీల్లోని 8 నుంచి 9 కులాలే రాజకీయాల్లో రిజర్వేషన్ల ఫలాలను మొత్తం అనుభవిస్తున్నాయని.. అత్యంత వెనుకబడిన వర్గాలకు కనీసం వార్డు మెంబర్ పదవులు కూడా ఇప్పటికీ దక్కడం లేదన్నారు. ఏబీసీడీ వర్గీకరణ అమలుతోనే రాజకీయాల్లో ఎంబీసీలకు ప్రాతినిధ్యం దక్కుతుందని వివరించారు.తెలంగాణలో 56 శాతం వరకు బీసీలు ఉన్నారని.. దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందన్నారు. కులగణన తర్వాత దాషామా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు. రాష్ట్రంలో 93 బీసీ కులాలు ఉండగా 90 శాతం రిజర్వేషన్లు 9 కులాలే దక్కించుకుంటున్నాయని, మిగతా 10 శాతం రిజర్వేషన్లను 15 కులాలకు చెందిన వారు దక్కించుకున్నారని వివరించారు. అత్యంత వెనుకబడిన బీసీ-ఏ కులాలకు, సంచార జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం శూన్యమని తెలిపారు. ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉండాలంటే ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడం ఒక్కటే మార్గమని నొక్కి చెప్పారు. ఎంబీసీల సామాజిక సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం ఎంతో కీలమని తేల్చిచెప్పారు.చదవండి: నిరుపయోగంగా 50 ఎకరాలు... నెరవేరని ప్రభుత్వ లక్ష్యం -
బీసీ కేటగిరీల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని కులాలను పునర్వ్యవస్థీకరణ (రీకేటగిరైజేషన్) చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పది జిల్లాల్లో నిర్వహించిన బీసీ కమిషన్ బహిరంగ విచారణల్లో ఈ అంశంపైనే ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయని వెల్లడించారు. లోతైన విచారణ చేపట్టిన తర్వాతే పునర్వ్యవస్థీకరణ సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, బాల లక్షి్మ, తిరుమలగిరి సురేందర్‌లతో కలిసి నిరంజన్ మీడియాతో మాట్లాడారు.‘‘బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ చేపట్టాం. ఇప్పటివరకు 1,224 విజ్ఞప్తులు అందాయి. వాటిని కంప్యూటరీకరిస్తున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తోంది. సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, కుల విభాగాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. ప్రారంభ రోజుల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ప్రస్తుతం ప్రజల నుంచి స్పందన బాగుంది. కొన్ని విభాగాలకు సంబంధించిన ప్రశ్నలకు సరైన జవాబులు అందడం లేదని వార్తలు వస్తున్నాయి. బీసీ కులాల పునర్వ్యవస్థీకరణ చేయాలంటే వారి ఆర్థిక స్థితి కూడా తప్పకుండా తేల్చాలి. అందుకే ఈ సర్వే ఎంతో కీలకంగా మారింది..’’అని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. అనుమానాలకు ప్రభుత్వం వివరణ ఇస్తుంది.. సమగ్ర సర్వే ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. తార్నాక వద్ద రోడ్లపై సర్వే ఫారాలు లభ్యమైనట్లు వచి్చన వార్తలపై స్పందించి, సూపర్వైజర్ను సస్పెండ్ చేసి, జవహర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామని వివరించారు. సర్వే ఫారాలను కంప్యూటరీకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సర్వేపై ఎలాంటి అనుమానాలున్నా ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌తో నష్టంపై వినతులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలు నష్టపోతున్నారనే వినతులు సైతం పెద్ద సంఖ్యలో వచ్చాయని నిరంజన్ తెలిపారు. 2– 4 శాతం కూడా జనాభా లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా... జనాభాలో సగం ఉన్న బీసీలకు అత్యల్పంగా రిజర్వేషన్లు కలి్పంచారంటూ వాదనలు వచ్చాయని వివరించారు. ఇటీవల డీఎస్సీలో బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయంటూ వినతుల్లో ప్రస్తావించారని వెల్లడించారు. వచ్చే నెల 9న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ ఉందని.. ఆరోజు నాటికి రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ తరపున నివేదిక సమర్పించనున్నామని తెలిపారు. కమిషన్ తరఫున కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాం బహిరంగ విచారణ ప్రక్రియలో వచ్చిన అంశాలన్నీ ప్రభుత్వానికి నివేదిస్తామని జి.నిరంజన్ వెల్లడించారు. ‘‘కుమ్మర కులస్తులకు మట్టి కేటాయింపులపై జారీ చేసిన జీవోలను క్షేత్రస్థాయి అధికారులకు పంపేలా చర్యలు.. రంగారెడ్డి జిల్లా బండ రావిర్యాలలో వడ్డెరలకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేయడం, సంచార జాతులు, ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు.. గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న కుల బహిష్కరణలపై కఠినంగా వ్యవహరించడం, ఆరె కటికల కోసం మీట్ కార్పొరేషన్ ఏర్పాటు, మద్యం దుకాణాల్లో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్లు, ట్యాంక్‌బండ్ వద్ద భగీరథుడి విగ్రహం ఏర్పాటు, రజకులను ఎస్సీ కేటగిరీలో చేర్చడం తదితర అంశాలపై వచ్చిన వినతుల ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదన లు చేస్తాం’’అని వివరించారు.బీసీ సంక్షే మ వసతి గృహాల్లో వ సతులు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. ఇటీవల బహిరంగ వి చారణ ప్రక్రియలో భాగంగా కొన్ని హాస్ట ళ్లను సందర్శించామని.. కొన్నిచోట్ల ఏళ్ల త రబడి అద్దె చె ల్లించని పరిస్థితి ఉంద ని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో బా లురు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్లను పూర్తిస్థాయి వసతులతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ (ప్రత్యేక) కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఈ కమి షన్‌కు చైర్మన్‌గా వ్యవ హరిస్తారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం, రిజర్వేషన్లలో లోటుపాట్లు, ఇతర అంశాలపై కమిషన్ సమగ్ర విచారణ చేపట్టనుంది. రాజ్యాంగంలో ని నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులుజారీ చేశారు. బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్య దర్శి బి.సైదులు ఈ కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తూ సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలకు కట్టుబడి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెపె్టంబర్ 6వ తేదీన జి.నిరంజన్ చైర్మన్‌గా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం తన నివాసంలో లోతుగా చర్చించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమాచారాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి తాజాగా ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ అధ్యయనం పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే క్రమంలో గతంలో నియమించిన బీసీ కమిషన్లు సేకరించిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కమిషన్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు, ప్రముఖులు, కీలక వ్యక్తుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు గణాంకాలు తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. అవసరాన్ని బట్టి నిపుణులు, పరిశోధకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, అధ్యయనానికి సంబంధించి పర్యటనలు చేపట్టవచ్చని, పరిశోధన సంస్థల నుంచి సమాచారం తీసుకోవచ్చని తెలిపింది. డెడికేటెడ్ కమిషన్‌కు అవసరమైన సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. వివిధ శాఖల్లో విశేష సేవలు వెనుకబడిన తరగతులకు చెందిన బూసాని వెంకటేశ్వరరావు బీఈ (ఎలక్ట్రానిక్స్), ఎంఈ (సాలిడ్ స్టేట్ ఎల్రక్టానిక్స్), ఎల్ఎల్బీ చదివారు. ఈయన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1987లో గ్రూప్–1 (స్టేట్ సివిల్ సరీ్వసు) టాపర్‌గా నిలిచి ప్రభుత్వ అధికారిగా ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా, పర్సనల్ అడ్మిని్రస్టేషన్ అండ్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్‌గా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శిగా, ఏపీ హ్యాండీక్రాఫ్టŠస్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా, రెవెన్యూ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా, మత్స్య శాఖ కమిషనర్‌గా, జీఏడీ (సర్వీసెస్–హెచ్ఆర్ఎం) కార్యదర్శిగా, చివరిగా తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ(డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం ముఖ్య కార్యదర్శిగా సేవలందించి 2019 డిసెంబర్–31న పదవీ విరమణ పొందారు. -
ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కల్పనకు సేకరించే వివరాల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ వి చారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా బుధవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల బెంచ్ తీర్పునకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న అత్యున్నత న్యా యస్థానం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, రెండు వారాల్లో స్థాయీ నివేదిక న్యాయస్థానం ముందు ఉంచాలని స్పష్టం చేశారు. వాదనలు ఇలా..: పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. బీసీ కమిషన్నే ప్రత్యేక కమిషన్‌గా ప్రభుత్వం పేర్కొనడం డాక్టర్ కె.కృష్ణమూర్తి, వికాస్ కిషన్‌రావు గవాలి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధమని తెలిపారు. బీసీలకు కల్పించిన రిజర్వేషన్ల సమీక్ష నిమిత్తం బీసీ కమిషన్ ఏర్పాటవుతుందన్నారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన నిమిత్తం వాస్తవ గణాంకాల సేకరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మహారాష్ట్రలో బీసీ కమిషన్నే ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌గా నియమించగా, అది ఇచ్చిన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాంథియా కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక రిజర్వేషన్ల పునఃసమీక్షకు తప్ప రాజకీయ రిజర్వేషన్ల కల్పనకు గణాంకాలుగా పరిగణించరాదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసమే జీవో: ఏజీ వాదనల అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేయగా, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై పునరాలోచన చేసి మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి మధ్యాహ్నం న్యాయమూర్తిని కోరారు. రెండున్నర నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన దశలో ఈ ఉత్తర్వులు సరికాదన్నారు. 2021లో ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని తెలిపారు. ఈ జీవో అమలు నిమిత్తం తిరిగి జీవో 47 జారీ చేస్తూ గణాంకాల సేకరణకు విధివిధానాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ జీవోలు జారీ చేసినందున సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని చెప్పడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 9న జీవో 47 జారీ చేసిందన్నారు. ఈ జీవోను పిటిషనర్లు సవాలు చేయలేదని తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది బీఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా వెనుకబడిన వర్గాల వాస్తవ గణాంకాల సేకరణకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఒకవేళ అభ్యంతరాలుంటే కౌంటరుతోపాటు పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పారు. బీసీ కమిషన్నే ప్రత్యేక కమిషన్‌గా పరిగణించాలంటూ ఇచ్చిన జీవో 47 సరికాదని, ఇది సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగంతో విభేదిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాగా, హైకోర్టు తీర్పుపై ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తీర్పును గౌరవించి వెంటనే నిపుణులతో కూడిన డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలని కోరారు. -
బీసీ రిజర్వేషన్లు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక.. ఈ బాధ్యత బీసీ కమిషన్‌కు అప్పగించటడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
బీసీ రిజర్వేషన్ల పెంపే మా ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీసీలకు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వారి జనాభాకు అనుగుణంగా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలగోనీ బాలరాజుగౌడ్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బీసీ ప్రతినిధుల బృందానికి డిసెంబర్‌లోగా కుల గణన సర్వే పూర్తి చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై బీసీ కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉండటం పట్ల బీసీ సంక్షేమసంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులను సందర్భంగా కోరారు. -
తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కూడా విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా పోరాడుతామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లను పరిశీలించేందుకు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో బీఆర్ఎస్కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ చైర్మన్లు రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం చెన్నైలో అక్కడి అధికారులతో సమావేశం అయ్యారు. తమిళనాడులో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తద్వారా తమ వద్ద జరుగుతున్న రిజర్వేషన్ల అమలు తీరును బీఆర్ఎస్ నేతలకు వివరించారు. శాస్త్రీయంగా ఇంటింటి సర్వే నిర్వహించి బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. తమిళ తరహాలో రిజర్వేషన్ల సాధనకు పోరాటం: మధుసూదనాచారి తెలంగాణలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు దక్కాలంటే తమిళనాడు తరహా రిజర్వేషన్ల అమలు ఒక్కటే అంతిమ పరిష్కార మార్గమని మధుసూదనాచారి అన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో స్పష్టం చేశారని, సమావేశం ముగిసిన తరువాత మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణలో తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధాన మంత్రి మోదీని పలుమార్లు కేసీఆర్ కోరారన్నారు. 42 శాతం అమలయ్యే దాకా.. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వి. శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్నలు మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగాల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేదాక బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లు, అభివృద్ధి పథకాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పుట్టమధు, కోరుకంటి చందర్, అలాగే జూలూరు గౌరీశంకర్, డా.ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్, తుల ఉమ, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాగేందర్ గౌడ్, రవీంద్రసింగ్, బాలరాజు యాదవ్, సుభప్రద పటేల్, కిశోర్‌గౌడ్, దాసోజు శ్రీనివాస్, చెరుకు సుధాకర్, రాజ్యలక్షి్మ, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, విద్యార్థి సంఘం నేత దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీం మార్గదర్శకాల మేరకు..బీసీ రిజర్వేషన్లను నిర్ధారించండి
సాక్షి, హైదరాబాద్: వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్లను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనానికి రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలి.. సామాజిక, రాజకీయ అంశాలు, వెనుకబాటుతనం లాంటి అంశాలను పరిశీలించి జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు నిర్ధారించాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లన్నీ 50 శాతానికి మించకూడదు’ అని వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొన్న ఈ మూడు సూత్రాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. దీన్ని అమలు చేసేందుకు మూడు నెలల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి కోరారు. దీంతో తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలను సేకరించడానికి, సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను అధీకృత సంస్థగా ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమని.. రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లను నిర్ణయించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ధర్మేశ్ డీకే జైస్వాల్, శ్రీనివాస్ యాదవ్, కౌటూరు పవన్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్, కేంద్రం తరఫున డీఎస్జీ గాడి ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లోని పేరా 13 అమలుపై వివరాలు తెలుసుకుని చెబుతామని గత విచారణ సందర్భంగా ఏజీ వెల్లడించారు. మంగళవారం విచారణ సందర్భంగా మూడు అంశాలు అమలు చేయడానికి ఎంత సమయం కావాలని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి అధ్యయనానికి 3 నెలల సమయం కావాలని కోరడంతో అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఆ 21 కులాలు రాష్ట్రమంతటా బీసీలే
సాక్షి, అమరావతి: కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులు (బీసీ)గా పరిమితమైన 21 కులాలు, వాటి ఉప కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితులను తొలగించి రాష్ట్ర మంతటా బీసీలుగానే పరిగణిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు. వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న 138 కులాల్లో 31 కులాలు వాటి కార్యకలాపాలపై ప్రాంతం, భౌగోళిక పరిమితులను కలిగి ఉన్నాయి. వాటిలో పది బీసీ కులాలు తెలంగాణాలో, 21 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 21 కులాలను కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బీసీలుగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో వచ్చిన అనేక అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితిని తొలగించడం ద్వారా రాష్ట్రం అంతటా బీసీలుగా గుర్తించే అవకాశం దక్కింది. ఆ కులాలకు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కల్లుగీతపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఇది వర్తించదు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాలకు కొన్ని ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు పొందేలా 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవకాశం కల్పిస్తే, ఇప్పుడు 21 కులాలకు, వాటి ఉప కులాలకు రాష్ట్రమంతటా బీసీలుగా పరిగణిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆ 21 కులాలు ఇవీ.. ► బీసీ–ఏ గ్రూప్‌లో ఆరు కులాలు, వాటి ఉపకులాలు ఉన్నాయి. అవి కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలు ఉన్నాయి. ► బీసీ–బీ గ్రూపులో నాలుగు కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. వాటిలో అచ్చుకట్లవాండ్లు, గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమ మినహా అంతంటా), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల (గుడ్లయ) కులాలు ఉన్నాయి. – బీసీ–డీ గ్రూపులో 11 కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. వాటిలో మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ కోమటి(కలింగ వైశ్య) కులాలు ఉన్నాయి. -
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు చర్చించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వినతించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని అమిత్‌షా అన్నారు. క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని, జాతీయ జనగణనలో బీసీ కులగణన చేయాలని ఆర్.కృష్ణయ్య కోరారు. భేటీ అనంతరం ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ దేశంలో 2,640 బీసీ కులాలున్నాయి. కుల, చేతి, సేవా వృత్తులు పోయాయి. యంత్రాలు, పరిశ్రమలు, గ్లోబలైజేషన్, ఇండస్ట్రీయలైజేషన్‌తో పెనుమార్పులు సంభవించాయన్నారు. చదవండి: Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి.. సీఎంకు ప్రవీణ్‌కుమార్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వే షన్లను 27% నుంచి 50 శాతానికి పెంచా లని, బీసీ జన గణన ను చేపట్టాలని ప్రభు త్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశా రు. తెలంగాణలో బీసీల జనాభా 50 శాతా నికిపై ఉన్నా విద్య, ఉద్యోగాలు సహా అన్ని రంగాల్లో బీసీల వాటా 27శాతమే ఉందన్నారు. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వే షన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 50% నిధులను బీసీలకు కేటా యించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను తక్షణ మే పరిష్కరించకపోతే ప్రభుత్వం రాజీనామా చేసి గద్దెదిగాలని లేఖలో డిమాండ్ చేశారు. చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
‘వెన్నెముక’పై విషపు రాత
బీసీలంటే చంద్రబాబుకు ఎంత ప్రేమంటే.. తలా ఇస్త్రీ పెట్టె, కత్తెర ఇచ్చి ఇదే ఆదరణ అంటూ అవమానించేంత. ఓటేసేంత వరకు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి, అమిత ప్రేమ ఒలకబోయటం, వారి ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత చీదరింపులు, అవమానాల పాలు చేయడం. బాబు వంచనకు తట్టుకోలేకపోయిన బీసీలు ఇదేమి ఆదరణ అని ప్రశ్నిస్తే.. ‘మీ తోకలు కత్తిరిస్తా.. పిచ్చాటలు ఆడితే తోలుతీస్తా..’ అంటూ కళ్లెర్రజేసి, వేలు చూపించి బెదిరించడం. ఆ చంద్రబాబుకు ప్రజలే అధికారాన్ని కత్తిరించి దీటైన బదులిచ్చారు. నేడు.. వెనుకబడిన కులాలను అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలబెడుతూ వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తాత్కాలిక ఉపశమనాలతో సరిపెట్టకుండా బీసీలను ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దేలా సరికొత్త వివ్లవానికి నాంది పలికారు సీఎం వైఎస్ జగన్. అందుకే బీసీలంతా వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకొని ఈరోజు సీఎం వైఎస్ జగన్‌కు అండదండగా నిలుస్తున్నారు. టీడీపీ, ఎల్లో బ్యాచ్‌కు మాత్రం ఇది ఓ దురవస్థ. వాస్తవాలను జీర్ణించుకోలేని కడుపు మంట. వైఎస్ జగన్‌కు బీసీల మద్దతు కొనసాగితే చంద్రబాబుకు, టీడీపీకి పుట్టగతులుండవన్న ఏడుపు. అందుకే టీడీపీ, దాని ఎల్లో మీడియా విషం కక్కుతోంది. పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. తాజాగా ‘పైసా పనికాలేదు.. పదవీ కాలం ముగిసిపోయింది’ అంటూ ఈనాడు అబద్ధాలను వండి వార్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న బీసీల సమగ్రాభివృద్ధిని గమనిస్తే పచ్చ పత్రిక వంకర రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అవగతమవుతుంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో బీసీల పురోగతిపై వాస్తవాలు ఇవి.. -సాక్షి, అమరావతి బీసీల కోసం నిలబడటం అంటే ఇదీ.. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో, ఏ బీసీ ముఖ్యమంత్రి సైతం చేయని విధంగా బీసీల పక్షాన నిలబడింది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. ఇది ఓ రికార్డు. అధికారంలోకి రాక ముందు బీసీల సమస్యల అధ్యయానికి కమిటీ వేసి వారి సూచనలను మేనిఫెస్టోలో చేర్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీనీ అమలు చేశారు సీఎం వైఎస్ జగన్. బీసీల సమస్యల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా శాశ్వత కమిషన్ వేసి కార్యదక్షతను చాటారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ పార్లమెంట్లో ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టించిన ఘనత జగన్‌కే దక్కింది. 38 బీసీ ఉప కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, వారి సంక్షేమానికి రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణలో సైతం కులం కాలమ్ చేర్చి కుల జనగణన చేపట్టాలని, తద్వారా జనాభా (దమాషా) ప్రాతిపదికన బీసీల వాటా బీసీలకు కేటాయించి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి చరిత్ర సృష్టించారు. బీసీల ప్రయోజనాల పరిరక్షణ, వారి అభ్యున్నతికి పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు చేస్తున్న కృషి మరువరానిది. తిరుమల ఆలయంలో సన్నిధి గొల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయ హక్కును కల్పించి ఏడుకొండలస్వామిని సేవించుకొనేలా జీవో జారీ చేయడం విశేషం. బీసీల సామాజిక సాధికారతకు బాటలు రాష్ట్రంలో రాజకీయంగానూ బీసీలకు ప్రముఖ స్థానం కల్పించారు సీఎం జగన్. రాష్ట్ర మంత్రివర్గంలో ఏకంగా 11 మంత్రి పదవులు బీసీలకే ఇచ్చారు. ఇందులో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది. 136 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతికి బాటలు వేశారు. దేవాలయాల ట్రస్టు బోర్డులు, మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, వారికి ఉన్నత స్థానాలు కల్పించారు. నామినేషన్ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ల పద్ధతిలో బీసీలకు కేటాయించేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేసి మరీ అమలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు, మరో 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, మరోవైపు ఆరోగ్య రంగం, అవుట్సోర్సింగ్ విభాగంలో దాదాపు లక్ష మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 2.60 లక్షల మంది వాలంటీర్లలో సగానికిపైగా బీసీలే కావడం గమనార్హం. ఇలా అనేక రంగాల్లో వారి బీసీల అభ్యున్నతికితో డ్పడి, తలరాతలు మార్చి, సామాజిక సాధికారతను సాధించి పెట్టారు సీఎం వైఎస్ జగన్. సంక్షేమంలోనూ సగానికి మించి.. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు పదవుల్లోనే కాదు. సంక్షేమంలోను సగానికిపైగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయ నిర్మాతగా వారి మన్ననలు అందుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ నవరత్నాలతో బీసీల్లో నవోదయం తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల ద్వారా బీసీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయమైన లబ్ధి చేకూరింది. ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రతి యేటా రూ.15 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి అంతకు మించి ఖర్చు చేస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ఒక్క బీసీలకే డీబీటీ (ప్రత్యక్షంగాను), నాన్ డీబీటీ (పరోక్షంగాను) ద్వారా ఏకంగా రూ.1.63 లక్షల కోట్లు లబ్ధిని చేకూర్చి రికార్డు సృష్టించారు. 2019 జూన్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు చేసిన మొత్తాన్ని గమనిస్తే ఏకంగా 51 శాతంపైగా నిధులు బీసీలకు దక్కడం విశేషం. రాష్ట్రంలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం 10,20,17,931 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల కింద రూ.3,19,227.86 కోట్ల ప్రయోజనం కలిగితే వారిలో 5,05,32,725 మంది బీసీ లబ్ధిదారులకు రూ.1,63,344 కోట్లు లబ్ధి కలిగింది. ప్రత్యక్షంగా (డీబీటీ) 7,46,80,150 లబ్ధిదారులకు రూ.1,77,585.51 కోట్లు లబ్ధి కలిగితే వారిలో బీసీలు 3,72,56,695 మందికి రూ.85,915.06 కోట్లు ప్రయోజనం కలిగింది. పరోక్షంగా 2,73,37,781 లబ్ధిదారులకు రూ.1,41,642.35 కోట్లు లబ్ధి కలిగితే వారిలో బీసీలు 1,32,76,030 మందికి రూ.77,429.10కోట్ల ప్రయోజనం కలిగింది. దగా చేసిన బాబుకు ఈనాడు బాకా ఊదుతోంది ఇవి ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేని వాస్తవాలు. చంద్రబాబు 14 ఏళ్లే కాదు.. ఎన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, బీసీలకు మేలు చేయడానికి మనసు రాదన్నది సత్యం. ఇందులో పదో వంతు మేలు కూడా చేయలేరన్నది నిజం. అందుకే చంద్రబాబు హయాంలో బీసీలు దగా పడ్డారన్నది సుస్పష్టం. మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేక ఆదరణ పేరుతో ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, షేవింగ్ కిట్లు, పనిముట్లు ఇచ్చి బీసీలను బురిడీ కొట్టించారు. బీసీలకు 2014లో చంద్రబాబు 114 హామీలు ఇచ్చి పది శాతం కూడా అమలు చేయకుండా దగా చేశారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలను మాఫీ చేస్తానని దగా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒక ప్రహసనంగా మార్చారు. కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలకు ఉచిత చదువులను అటకెక్కించారు. ప్రధానంగా బీసీ సబ్‌ప్లాన్ తెచ్చి ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తానని నమ్మించిన బాబు కనీసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయకుండా వంచించారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగమని, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి అని నమ్మబలికి మోసం చేశారు. బీసీల వెన్నెముక విరిచారు. ఇప్పడు బడుగువర్గాల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు చేస్తున్న మేలు చూసి ఈనాడు వెన్నులో వణుకు పుట్టింది. జన్మలో చంద్రబాబు సీఎం కాలేరన్న నిజం నెత్తికెక్కడంతో జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది. బీసీలను అడుగడుగునా దగా చేసిన చంద్రబాబును భుజాన వేసుకుంది. మరోమారు బీసీలను మభ్యపెట్టి, సాధికారితను దెబ్బకొట్టి, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే వారిగా మార్చాలని అబద్ధపు వార్తలు రాస్తోంది. అయినప్పటికీ, ప్రజలు వాస్తవాలు గ్రహించారు. ఈనాడు వంకర రాతలను నమ్మేస్థితిలో లేరు. ఇది పచ్చి నిజం. -
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి
నాంపల్లి: బీసీ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏసీగార్డ్స్ అడ్వకేట్స్ కాలనీలోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు–బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, క్రీమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. కాలేల్కర్, మండల్ కమిషన్ల సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో దేశవ్యాప్తంగా బీసీల కోసం 8617 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నా ఉద్దేశపూర్వకంగా 4821 పోస్టులను ఖాళీగా ఉంచారని నిందించారు. దర్యాప్తులు, ఐటీ దాడుల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. పథకం ప్రకారమే రెండు ప్రభుత్వాలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ఫారెస్టు అధికారులను చంపుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం నుంచి తమ పార్టీ కార్యాచరణ ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ అబ్రార్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, అధికార ప్రతినిధులు సాంబశివగౌడ్, అరుణ, డాక్టర్ వెంకటేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?
ఓబీసీ కులాల వర్గీకరణ ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017 అక్టోబర్ 2న జస్టిస్ రోహిణి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జాతీయ కమీషన్‌ను ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పాటు చేసింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) కోటాలో విద్యా, ఉద్యో గాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2640 కులాలను వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఈ కమిషన్‌కు మొదట 12 వారాల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఆ గడువును ఇప్పటికి 13 సార్లు పొడిగించి చివరగా నివేదిక సమర్పించడానికి 2023 జనవరి 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రాజకీయంగా నష్టపోతామనే భయంతో బీజేపీ ప్రభుత్వం ఓబీసీలను వర్గీకరించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజ ర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలను పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏ ఓబీసీ కులం అయితే జనసంఖ్య అధికంగా కలిగి సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా బలంగా ఉంటుందో ఆకులం వారు.. వారి జనాభాకు మించి రిజర్వేషన్లు అనుభవించడం జరుగుతోంది. గత సంవత్సరం మార్చిలో కొన్ని పత్రికలకు లీకులు వదిలారు. వీటి ప్రకారం... ఓబీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏమేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జన సంఖ్యను పరిగణలోకి తీసుకొని జస్టిస్ రోహిణి కమీషన్ ఓబీసీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించింది. గ్రూప్–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్– బీలో 534 కులాలకు 6 శాతం, గ్రూప్–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటా యించిది. అయితే ఈ లీకుల్లో నిజమెంతో తెలియదు. 1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే, ఓబీసీలో బాగా వెనుకబడిన కొన్ని కులాలకైనా న్యాయం జరిగి ఉండేది. మండల్ కమిషన్ నివేదికపై తీర్పులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించకుండా అమలు చేయడం వలన వీరిలో ఐక్యత లోపించింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 1994 నుండి బీసీలకు ఉమ్మడిగా అమలుపరుస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ బీసీ కులాలు ఉద్యమాలు చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం 110కి పైగా బీసీ కులాలు రాజకీయ రిజర్వేషన్లు పొందలేదు, వారికి చెందని రిజర్వేషన్ల కోసం వారు ఎందుకు కొట్లాడుతారు? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఓబీసీల వర్గీకరణపై నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఓబీసీల వర్గీకరణ వల్ల అత్యంత వెనుకబాటుకు గురైన కులాలవారూ ప్రయోజనం పొందడానికి మార్గం సుగమం అవుతుంది. (క్లిక్ చేయండి: విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?) - కోడెపాక కుమార స్వామి సామాజిక విశ్లేషకులు -
‘దేశంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం ఏపీ’
సాక్షి, ఏలూరు: దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు ఇంకా లభించలేదు. 45 ఏళ్ల పోరాటం ఫలితంగా విద్యాహక్కు సాధించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. కాగా, కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో 30 లక్షల మంది బీసీ విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. బీసీలకు కూడా జనాభా ప్రకారం 56 శాతం రిజర్వేషన్‌కు పెంచాలి. దేశంలో 16 రాష్ట్రాల నుండి కనీసం ఒక్క ఎంపీ కూడా లేదు. బీసీల బిల్లు ఆమోదానికి దేశంలో అన్ని పార్టీలు పార్లమెంట్లో మద్దతివ్వాలి. బీసీలు భరత మాత ముద్దు బిడ్డలు. జనాభా ప్రాతపదికన మా వాట మాకు కావాలి. ఈ నెల 24 ఛలో ఢిల్లీకి పిలుపునిస్తున్నాము. దేశంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం ఏపీనే. దేశంలో ఎక్కడా లేని పథకాలు బీసీలకు ఇచ్చారు . మంత్రి పదవులు ఇచ్చారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బీసీలను ఓటర్లుగా చూస్తే.. సీఎం వైఎస్ జగన్ సొంత మనుషుల్లా చూశారు అంటూ కామెంట్స్ చేశారు. -
వారికి రిజర్వేషన్లు సహేతుకం కాదు!
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు పదిశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ 2019 జనవరి 8న పార్లమెంట్ చేసిన 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీం కోర్ట్ 2022 నవంబర్ 7న తీర్పు ఇచ్చింది. దీంతో రిజర్వేషన్ అంశం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ రవీంద్రభట్‌లు ఈడబ్ల్యూఎస్ కోటాను విభేదించగా... జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది సమర్థించారు. మొత్తం మీద 3:2 మెజారిటీతో 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ఎస్సీ, ఎస్టీ బీసీలు కాని వారిలో పేదలు... అనగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో తరతరాలుగా సామాజికంగా, విద్యాపరంగా; అంటరానితనం, వివక్షతలను అనుభవిస్తున్న కులాలకు కల్పించవలసిన రిజర్వేషన్లు... ఆర్థికపరంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం కల్పించడం రాజ్యాంగ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, ఆ సవరణను రద్దు చేయాలనీ సుమారు 40 మంది సుప్రీం కోర్టులో కేసులు వేశారు. జస్టిస్ యు.యు. లలిత్ కుమార్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ సమయంలో దీన్ని ప్రభుత్వం సమర్ధించుకుంటూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంతకు ముందే రిజర్వేషన్లు కల్పిస్తున్నందున వారికి కేటాయించిన 50 శాతం కోటాకు ఈ 10 శాతం అదనంగా ఉంటుందనీ, వీటితో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధం లేదనీ, ఇది రాజ్యాంగబద్ధమే అనీ చెప్పింది. ఈ కోర్టు తీర్పు రాగానే అధికార, ప్రతిపక్ష, వివిధ రాజకీయ పార్టీలు క్రెడిట్ మాదంటే మాది అని ప్రకటించుకోవడం సిగ్గుచేటు. 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్ 15 (6), 16 (6) క్లాజు లను చేర్చడం ద్వారా దేశ జనాభాలో 8 నుంచి 10 శాతం ఉన్న అగ్ర వర్ణాలకు అందులో కేవలం మూడు శాతం ఉన్న పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ విధంగా సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎసీ,్ట బీసీలలో ఉన్న నిరుపేదలు పేదలు కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలలో ఎలాంటి స్థిరాస్తులు కలిగి లేకుండా ఏడాదికి రూ. 2.5 లక్షల ఆదాయం ఉన్న వారిని పేదలుగా గుర్తించినప్పుడు... అగ్రవర్ణాలకు మాత్రం 5 ఎకరాల లోపు భూమీ, సంవత్సరాదాయం రూ. 8 లక్షల లోపు ఆదాయం... అంటే నెలకు 60 వేల ఆదాయం ఉండా లని నిర్ణయించడం వివక్ష కాదా? నెలకు 60 వేల ఆదాయం సంపాదించే వారు ఎలా పేదలవుతారో తెలపాలి. పేదలు ఎవరైనా పేదలే అన్న ప్పుడు ఈ వివక్ష ఎందుకో సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్సీలలో 38 శాతం, ఎస్టీలలో 48.4 శాతం, బీసీలలో 13.8 శాతం, ఓసీలలో 3 శాతం పేదలు ఉన్నారు. పేదరికం, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఓసీలలో ఉన్న మూడు శాతం పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న పేదలకు ఎందుకు ఇందులో అవకాశం ఇవ్వరు? వీరు పేదలు కాదా? కేవలం అగ్రవర్ణాల్లోనే పేదలుంటారని ఈడబ్ల్యూఎస్ కోటా నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీలను తప్పించడం రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కును కాలరాయడమే. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వే షన్లను కొందరికే ఎలా వర్తింపచేస్తారని రాజ్యాంగ నిపుణులు అంటు న్నారు. ఉదాహరణకు దివ్యాంగులకు ఏ కులం వారికైనా రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు. నిరుపేదలు ఏ కులంలో ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్లు వర్తింపజేయాలి కదా! ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వలేదు. పైపెచ్చు 1992లో ఇందిరా సహాని కేసులో తొమ్మిది మంది సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లు 50 శాతానికి దాటడానికి వీలులేదని తీర్పునిచ్చింది. ఇదే సందర్భంలో ప్రమోషన్లలో రిజర్వేషన్లను కూడా తొలగించి, బీసీలకు క్రిమిలేయర్ ని వర్తింపజేసింది. దేశంలో 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా ప్రస్తుత ఈడబ్ల్యూఎస్‌లకు ఇస్తున్న 10 శాతం కలిపితే 59.5 శాతం అవుతున్నది. అయితే ఓ న్యాయమూర్తి 50 శాతం అనేది లక్ష్మణరేఖ కాదని పేర్కొనడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలోనూ అనేక అన్యాయాలు జరగుతు న్నాయి. 2018లో హైకోర్టు జీవో నంబర్ 26ను సమర్థిస్తూ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 26ను తొలగిస్తూ జీవో నంబర్ 247ను తీసుకు రావడం జరిగింది. దీనివల్ల దళిత, గిరిజన ఉద్యోగుల ప్రమోషన్లకు అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇదిలా ఉండగా మరో అన్యాయాన్ని గమనిస్తే (ఈడబ్ల్యూఎస్) అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ఓపెన్ కేటగిరిలో వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పది శాతం రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. ఇటీవలే జరిగిన కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియలో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ పాటించక పోవడం వల్ల అన్యాయానికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చేయడం... ఈ అంశం అసెంబ్లీలో చర్చకు రావడం వల్ల తిరిగి వాటిని సరిచేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ నియమకాల ఫలితాలలో ఎస్సీలకు –82.50, ఎస్టీలకు –76.50, బీసీ లకు 110.50, ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు – 51.25 మార్కులు కటాఫ్ మార్కులుగా కేటాయించారు. ఇలా నిరుపేదలు, వికలాంగుల కంటే కూడా ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు తక్కువ కటాఫ్ మార్కులు కేటాయిం చడం అన్యాయం. ఈ విధంగా కూడా దళిత గిరిజనులకు, బహుజను లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇలా ఒక్కొక్కటిగా రాజ్యాంగ రక్షణలు అన్నిటిని కూడా పెకిలించివేస్తున్న చర్యలను వివిధ సామాజిక వర్గాల మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సామాజిక వెనుకబాటే ఆర్థిక వెనుకబాటుకు కారణం కాబట్టి ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ సాధన కోసం సామాజికంగా, విద్యా పరంగా... వివక్ష, అంటరానితనం అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. రిజర్వేషన్లు ఆర్థిక ఉద్దీపన కోసం కాదన్న విషయం గమనించాలి. కాబట్టి ఆర్థిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పించలేమన్న విషయాన్ని గుర్తించాలి. అగ్రవర్ణ పేదలపై ఎవరికీ వ్యతిరేకత లేదనేది గమనించాలి. వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటే కాదనేది ఎవరు? ఆ దిశలో కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) - బైరి వెంకటేశం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి, తెలంగాణ -
భిక్ష కాదు... వాటా కావాలి!
స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు దాటినా, 56 శాతం జనాభా గలిగిన బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం 28 ఏళ్ల క్రితం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికి బీసీలకు 15 శాతం కూడా వాటా లేదు. చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అనేక రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా తీర్మానం చేశాయి. ప్రజాస్వామ్యం సుస్థిరంగా కొనసాగాలంటే అన్ని సామాజిక వర్గాలకూ, వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సామాజిక రంగాలలో వారి వాటా వారికివ్వాలి. బీసీలకు కావలసింది భిక్ష కాదు... రాజ్యాంగబద్ధంగా వాటా! త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా గణనలో కుల గణన కూడా చేయా లనీ, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. జనాభా గణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయి. కుల గణన చేస్తే అదనంగా ఇంకొక కాలమ్ మాత్రమే చేరుతుంది. దీనికి రూపాయి కూడా ఖర్చు కాదు. ఒక్క కాలమ్ పెట్టడానికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 70 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుంది? జనాభా గణనలో కుల గణనను భాగం చేస్తే బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నట్లుంది. అలాగే కొత్తగా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్ ముందుకు వస్తుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కులాలవారీ జనగణనకు వెనకాడుతోం దని రాజకీయ పరిశీలకుల భావన. ఇది నిజమే కావచ్చు. కానీ అంత మాత్రాన బీసీ కులాలకు ఇవ్వవలసిన ప్రజాస్వామ్య వాటా ఇవ్వ కుండా ఎన్ని రోజులు దాటవేస్తారు? స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు దాటినా, 56 శాతం జనాభా గలిగిన బీసీలకు రిజర్వేషన్ల కేటాయిం పులో అన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మేరకు, ఈ దేశంలోని 2,648 బీసీ కులాలలో దాదాపు 1,800 కులాలు చాలా పేదరికంలో, దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నాయి. ఈ కులాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్యం ఇప్పటివరకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగం లోని 340 ఆర్టికల్ ప్రకారం 1953లో కాకా కలేల్కర్ కమిషన్‌ను నియమించారు. కానీ దాని సిఫార్సులను అమలు చేయకుండా తొక్కి పెట్టారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ 1978లో మండల్ కమిషన్‌ను నియమించి; ఈ కులాల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులఫై అధ్యయనం చేశారు. బీసీ కులాల అభివృద్ధికి మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం మూడు సిఫార్సులు మాత్రమే అమలు చేశారు. మిగతా 37 సిఫార్సులు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. బీసీ కులాలను అభివృద్ధి చేయకపోతే ఈ దేశం అగ్రదేశంగా ఎలా రూపుదిద్దుకుంటుంది? బీజేపీ కలలుగనే అఖండ భారత్‌లో బీసీలు భాగం కారా? రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇవ్వడం లేదు. ఇంతవరకు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బడ్జెటు కేటా యింపులు లేవు. కనీసం ఐఐటీ, ఐఐఎం తదితర కోర్సులు చదివే వారికి స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంటు స్కీమూ లేవు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో జనాభా ప్రకారం ప్రజాస్వామిక వాటా దక్కడం లేదు. దీనికోసం రాజకీయ పార్టీలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసిన సమయం ఆసన్నమైనది. బీసీలకు చట్టసభలలో జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇందుకోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి. చట్ట సభ లలో, అసెంబ్లీ – పార్లమెంటు ఎన్నికలలో బీసీలకు 33 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని అనేక రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేశారు. ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 1996లో, 2008లో, 2010లో బీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేశారు. 2014 తర్వాత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలూ వీటిపై తీర్మానం చేశాయి. చట్ట సభలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టారు. కానీ బీసీలకు కల్పించ లేదు. దేశంలో 2,642 బీసీ కులాలు ఉంటే 2,560 బీసీ కులాలు ఇంతవరకు పార్లమెంటులో ప్రవేశించలేదు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో 14 శాతం కూడా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి బీసీ కులాలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెడితే తప్ప వారికి ప్రజాస్వామిక వాటా లభించదని తేలుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వే షన్లను 34 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజ్యాంగ సవరణ మాత్రమే. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. రాజ్యాంగాన్ని సవరించి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం, బీసీ రిజర్వేషన్లకు ఒక్కసారైనా రాజ్యాంగాన్ని సవరించిందా? పాలనారంగంలో బీసీల ప్రాతినిధ్యం ఇప్పటికీ 15 శాతం దాటడం లేదు. కేంద్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని కేటగిరీలతో కలిసి బీసీల శాతం 15 మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపు తున్నాయి. కేంద్రంలోని 54 లక్షల ఉద్యోగాలలో బీసీలు కేవలం 7 లక్షల 62 వేలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మండల్ కమిషన్ సిఫా ర్సుల ప్రకారం 28 సంవత్సరాల క్రితం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికి బీసీలకు 15 శాతం కూడా వాటా లేదు. కాబట్టి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీల ప్రాతినిధ్యం పెరగదనేది ఇన్నేళ్ల అనుభవం ద్వారా కనిపిస్తున్న నిజం. అలాగే కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయవల సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని 16(4)ఎ ఆర్టికల్ ప్రకారం జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. జనాభా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని పలు సందర్భాల్లో కోర్టులూ తీర్పులు చెప్పాయి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. కేంద్రస్థాయిలో బీసీల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అనేక చట్టపరమైన, న్యాయపరమైన వివాదాలు వస్తున్నాయి. అనేక స్కీములను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉంది. కేంద్ర బడ్జెట్ 34 లక్షల కోట్లు కాగా, 70 కోట్ల మంది బీసీల అభివృద్ధికి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ఈ దేశంలో బీసీలను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ బడ్జెట్‌తో బీసీలకు బిస్కెట్లు కూడా సరిపోవు. ఇక బీసీల అర్థికాభివృద్ధి ఎలా జరుగుతుంది? కేంద్ర స్థాయిలో బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, ఫీజుల మంజూరు, పోటీ పరీక్షలకు కోచింగ్ లాంటి అనేక ఇతర స్కీములు పెట్టవలసిన అవసరం ఉంది. బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించి బడ్జెటులో కేటాయింపులు చేయవలసిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములకు 80 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వవలసిన అవసరం ఉంది. స్కాలర్షిప్ మంజూరు, పూర్తి ఫీజుల మంజూరు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠ శాలల ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కేంద్రీయ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఈ రిజర్వేషన్ల కింద సీట్లు పొందినవారు ఫీజులు కట్టే ఆర్థిక స్థోమత లేని వారు. కాగా ఐఐటీ, ఐఐఎం లాంటి కోర్సుల ఫీజులు సంవత్సరానికి రూ. 90 వేల నుండి 1,70,000 వరకు ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తం ఫీజులను పేద కులాలైన బీసీలు కట్టే పరిస్థితి లేదు. ఇందుకు ఏటా లక్ష కోట్ల రూపా యలను కేంద్ర బడ్జెట్లో కేటాయించాల్సిన ఆవశ్యకత ఉంది. కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శి స్తోంది. ప్రజాస్వామ్యం సుస్థిరంగా, శాంతియుతంగా కొనసాగా లంటే అన్ని సామాజిక వర్గాలకు, వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సామాజిక రంగాలలో వారి వాటా వారికివ్వాలి. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన డిమాండ్. పీడిత ప్రజానీకం ఎదురు తిరుగుతున్న ప్రపంచ చరిత్రను చూస్తున్నాం. సమన్యాయం పాటించకపోతే ఇక్కడా అదే జరుగుతుంది! ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్: 90000 09164 -
బీసీబంధు పథకంపై కేసీఆర్ స్పందించాలి
కవాడిగూడ (హైదరాబాద్): బీసీ కులాలకు బీసీబంధు ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్ష చేపట్టారు. దీక్షను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ యాంత్రీకరణ, కార్పొరేటీకరణ, ఆధునీకరణ ద్వారా వృత్తులు కోల్పోయి అనేక కులాలు రోడ్డునపడ్డాయని, వీటిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో ఉపాధిలేక 46 మంది మనోవేదనకు గురై చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దీక్షలకు మధుయాష్కీ, కోదండరాం, దాసోజు శ్రావణ్, వి.హనుమంతరావు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా సంఘీభావం తెలిపారు. బీసీబంధు ప్రకటించకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు లాల్‌కృష్ణ, అరుణ్‌కుమార్, జనార్దన్, నీల వెంకటేశ్, సత్యనారాయణ, అంజి పాల్గొన్నారు. -
లక్ష మందితో పార్లమెంటును ముట్టడిస్తాం: ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్(హైదరాబాద్): ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో బీసీ సంఘాల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 27న బీసీల డిమాండ్లపై లక్షమందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో 48 బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలి
రాజమహేంద్రవరం సిటీ (సీటీఆర్ఐ)/పాలకొల్లు అర్బన్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 55 శాతం జనాభా కలిగిన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా అణచివేస్తున్నారన్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టడానికి 14 పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులోనే ఈ బిల్లు పాసవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీసీ కావడంతో ఆయనపైనే బీసీలు ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. మోదీ హయాంలో ఈ బిల్లు పెట్టకపోతే చరిత్ర ఆయనను క్షమించదన్నారు. లోక్‌సభలో 94 మంది బీసీ ఎంపీలున్నారని, పార్టీలకతీతంగా వీరందరూ బిల్లుకు మద్దతివ్వాలని, లేకుంటే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2021–22 జనగణనలో కులాల వారీగా బీసీ జనాభాను లెక్కించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. జాతీయ స్థాయిలో రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలపై విధించిన షరతులను ఎత్తివేయాలని కోరారు. పంచాయతీరాజ్‌లో సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని, వీటికి రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానించారు. -
ఈ ఎత్తుగడ కోటా ఎత్తివేతకేనా?
కేంద్ర ప్రభుత్వం తన పరిధి తగ్గించుకుంటూ క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అవి బడా కార్పొరేట్ల అధీనంలోకి వెళ్లిపోతాయి. అలా జరిగితే వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. అంటే చట్టబద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇది. దీని మూలంగా వందల సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న కులాలకు అధికారంలో వాటా దక్కకుండా అన్యాయం చేయడమే అవుతుంది. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే రాజ్యాంగ లక్ష్యాలను ఇది విస్మరించడమే. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగని పని. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, పోస్టల్, బీహెచ్ఈఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బడా కార్పొరేట్ దిగ్గజాల అధీనంలోకి వెళ్లిపోతాయి. ప్రభుత్వ రంగ సంస్థల వాటా 51 శాతం అమ్మిన, యాజమాన్య హక్కులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పిన వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. దీని మూలంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన రిజర్వేషన్లకు తిలోదకాలు ఇచ్చినట్లు అవుతుంది. చట్ట బద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేయడం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో రెండు కోణాలున్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా తన పరిధిని తగ్గించుకొని బలహీన పరుచుకోవడం. తద్వారా ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. రెండవది, సామాజిక న్యాయా నికి గండికొట్టడం. దీని మూలంగా వందల సంవత్సరాలుగా వివక్ష, అణచివేతల వల్ల అధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు అధికారంలో ఇప్పటికీ వాటా దక్కకుండా అన్యాయం చేయడం. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే లక్ష్యా లను ఇది విస్మరించడమే. చట్ట ప్రకారం రిజర్వేష న్లను రద్దు చేయ కుండా, దొడ్డి దారిన ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 245 సంస్థలు ఉన్నాయి. ఇందులో దాదాపు 26 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రైల్వేలో 13 లక్షలు, ఎల్ఐసీలో 2 లక్షలు, బీఎస్ఎన్ఎల్లో 3 లక్షలు, బీహెచ్ఈఎల్లో లక్షా 90 వేలు– ఇలా మొత్తం 26 లక్షల ఉద్యోగాలు పోతాయి. 51 శాతం వాటాలను కార్పొరేట్ సంస్థలకు అమ్మితే ప్రభుత్వం యాజమాన్య హక్కును కోల్పోతుంది. దీనితో ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నియంత్రణ ఉండదు. రిజర్వేషన్ల అమలు ఉండదు. ఇది ఇలా ఉండగా మరోవైపు జాతీయ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టారు. దీనితో బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యో గాల సంఖ్య తగ్గి రిజర్వేషన్ల కోటా తగ్గిపోతుంది. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా బలంగా ముందుకు వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను పక్కన పెట్టి, ఉన్న రిజర్వేషన్లకే గండికొట్టే కుట్రకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రంగాల్లో– విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, న్యాయ రంగాల్లో జనాభా ప్రకారం కోటా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కోటా కల్పించారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో, రాజ్యసభ, కౌన్సిల్, నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం కోటా కల్పిం చలేదు. ఇక బీసీలకు స్వాతంత్య్రం వచ్చిన 36 ఏళ్ల తర్వాత మండల్ కమిషన్ నివేదిక ప్రకారం, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత కేంద్ర విద్యా సంస్థలలో 27 శాతం రిజర్వే షన్లు పాక్షికంగా ప్రవేశ పెట్టారు. జాతీయ స్థాయిలో బీసీల జనాభా 56 శాతం ఉంటే 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టడం లేదు. అనేక సాకులు చూపుతూ దాటవేస్తున్నారు. కానీ రాజ్యాంగంలో లేని అగ్ర కులాల్లోని పేదలకు మాత్రం ఆగమేఘాల మీద రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే ఆటోమేటిగ్గా రిజ ర్వేషన్లు పోతాయి. దీనివల్ల 17 నుంచి 20 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యోగాలు కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 14 లక్షల ఉద్యోగాలను కొన్నేళ్లుగా భర్తీ చేయకుండా పెండింగులో పెట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యో గాల్లో 1993 నుంచి మండల్ కమిషన్ ప్రకారం రిజర్వేషన్ల కోటా ప్రారంభించిన తర్వాత ఉద్యోగాల భర్తీ ఆపేశారు. దీంతో రిజర్వేషన్లు ఉన్నా ఆయా వర్గాలకు ఉపయోగం లేకుండా పోయింది. మండల కమిషన్ అమలు తర్వాత ఈ 37 సంవత్సరాల కాలంలో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2016 నాటికి ఓబీసీ ఉద్యోగులు 14 శాతం దాటలేదు. ప్రత్యేకంగా క్లాస్–1 ఉద్యోగుల్లో ఓబీసీలు 9 శాతం దాటలేదు. సివిల్ సర్వీసులో పూర్తిస్థాయి ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఐఏఎస్‌లో 1657 ఖాళీలు, ఐపీఎస్‌లో 1420 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఇన్ని ఖాళీలున్నా నాణ్యత తగ్గుతుందనే సాకుతో ఏటా ఐఏఎస్‌లో 100 లోపు, ఐపీఎస్‌లో 120 లోపు ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తున్నారు. రక్షణ, బ్యాంకింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. దీని మూలంగా రిజర్వేషన్ కోటా భర్తీ కాక ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నా మొత్తం ఉద్యోగాల్లో ఇప్పటి వరకూ 12 శాతం దాటలేదు. ఎస్టీలకు 7.5 శాతం అమలు చేస్తున్నా జాతీయ స్థాయిలో 5 శాతం దాటడం లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కేంద్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 56 లక్షలు కాగా ఇందులో 26 లక్షల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు పోతే, మిగిలేది 30 లక్షల ఉద్యో గాలు మాత్రమే. పెరుగుతున్న జనాభా, బడ్జెట్, సంక్షేమ అభివృద్ధి పథకాలకు తగ్గట్లుగా ఉద్యోగాల సంఖ్య పెరగాలి. ప్రభుత్వరంగ వ్యవ స్థను విస్తరించడం, బలోపేతం చేయడం ప్రజాస్వామ్య లక్షణం. కుదిం చడం, ప్రైవేటీకరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగదు. ఒకవైపు అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుండగా మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ’ సామెతను గుర్తుతెస్తోంది. ఆర్థికమాంద్యంతో దెబ్బతిన్నందువల్లే ఆర్థిక వనరులు పెంచు కోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు విక్రయిస్తున్నామనే కేంద్ర ప్రభుత్వ వాదన సరికాదు. బడ్జెట్ పెంచుకోవడానికి అనేక మార్గాలు న్నాయి. నగదు ముద్రించడం, డిపాజిట్లు సేకరించడం, విదేశీ రుణాలు తేవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. ఎన్నికలకు ముందు బీజేపీ దేశ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెస్తామని ప్రకటించింది. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు దేశంలో ఉన్న నల«్లధనాన్ని వెలికితీయడానికి అవరోధాలు ఏమిటి? నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. 50 శాతం కేంద్రానికీ, మిగతాది ఆయా వర్గాలకూ ప్రోత్సాహకాల కింద క్రమబద్ధీకరణ చేసుకొమ్మని పిలుపునిస్తే దేశంలోని పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టు రంగాల నుంచి 60 లక్షల కోట్ల నల్ల ధనం ప్రభుత్వ ఖాతాలో చేరుతుంది. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. ఇలాంటి పథకాలు పెట్టడానికి అవరోధాలు ఏమిటి? ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకోవడం కంటే ప్రభుత్వరంగ ఆస్తులను చౌకగా కార్పొరేటు వర్గాలకు ధారాదత్తం చేయడమే లక్ష్యంగా కనబడుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికార చట్రంలోకి వస్తున్న సమయంలోనే ఈ సంస్థలను ప్రైవేటీకరించడం, పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవడం జరుగుతోంది. 2014లో తాము అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. కోటి ఉద్యోగాలు దేవుడెరుగు! ఖాళీ ఉద్యోగాల భర్తీయే లేదు. ప్రభుత్వరంగ సంస్థలను కొనసాగించడం, కొత్తవి ప్రారంభించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. అలా చేయకుండా రైల్వేను కూడా ప్రైవేటీకరిం చడం విచిత్రమైన విషయం. రైల్వేకు లక్షల కోట్ల భూములు, భవ నాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటిని చౌక ధరలకు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం న్యాయమా? ఏటా వేల కోట్ల లాభాలు ఆర్జించే సంస్థ, ఏటా కోట్లమంది పేద ప్రజలకు తక్కువ చార్జీలకు సేవలందిస్తున్న సంస్థను ప్రైవేటీకరించడంలో హేతుబద్ధత ఉందా? 40 కోట్ల మంది పాలసీదారులకు అండగా నిలిచే ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఉందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్ల అప్పులు ఆపత్కాలంలో ఇచ్చి ఆదుకున్న సంస్థ అది. లాభాల్లో నడిచేవాటిని ప్రైవేటీకరణ చేయడంలో ఉన్న రహస్య మేమిటో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు మరిన్ని సేవలు అందించే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడం న్యాయమా? అధికారంతో ఏది చేసినా చెల్లు తుందని అనుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్. కృష్ణయ్య మొబైల్: 90000 09164 -
బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కుట్రలు చేశారు
-
చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదు
-
రాజ్యాంగబద్ధతే ‘రిజర్వేషన్ల’కు రక్షణ
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ రిజర్వేషన్ల గరిష్ట పరిమితిపై ప్రతిసారి న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూడవలసిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తాజాగా టీడీపీ నేత పిటిషన్ కారణంగా రిజర్వేషన్లను హైకోర్టు మళ్లీ తగ్గించినప్పటికీ వైఎస్ జగన్ స్థానిక ఎన్నికల్లో తన పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పాటించాలని ఆదేశించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీతోపాటు ఇతర పార్టీలైన, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు పాటించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ/ఎస్టీ/బీసీల రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పడంతో రిజర్వేషన్ల సమస్య మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఆశతో తెలుగుదేశం–ఇతర ప్రతిపక్షాలు చూస్తున్నాయే తప్ప ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరి స్తామని ఆలోచించకుండా రాజకీయంగా ఎలా వాడుకుందామని కుట్రలు చేస్తున్నాయి. కానీ ఈ తీర్పు కొత్తదేమీ కాదు. 1993 మండల్ కేసు – ఇందిరా సహాని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసు నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 26 కేసులలో ఇదే తీర్పులు వచ్చాయి. సుప్రీం కోర్టు 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక స్టేట్ కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత 2010 నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతంకు తగ్గించాయి. తెలంగాణ ప్రభుత్వం 2019 ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించి ఎన్నికలు జరి పింది. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాలు తగ్గించినప్పటికీ ఈ వర్గాలకు రిజర్వేషన్లు తగ్గరాదనే ఆలోచనతో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. దీనికనుగుణంగా 2019 డిసెంబర్ 28న జీవో నం.176 జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రతాప్ రెడ్డి అనే టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు సలహా మేరకు దీన్ని విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లను 50 శాతంకు కుదించాలని తీర్పు చెప్పింది. టీడీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి సవాల్ చేయకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరికట్టగలిగి ఉంటే ఈ పాటికి ఏపీలో 34% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగేవి. కానీ చంద్రబాబు అలా చేయకుండా ఈరోజు వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేయడాన్ని బీసీలు అసహ్యించుకుంటున్నారు. కాగా, ఈ అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. ఇంతకు పూర్వం గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాయి. కానీ ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు 50 శాతంకి మించి రిజర్వేషన్లు ఉండరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మరలా సుప్రీం కోర్టుకు వెళితే ఈ తీర్పు పునరావృతం అవుతుంది. కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు. సామాజిక న్యాయం పట్టదా? సుప్రీంకోర్టు, హైకోర్టులు మొదటినుంచి ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి. ఇలా కోర్టులు తీర్పులు ప్రకటిం చిన ప్రతిసారీ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తూ వస్తున్నారు. మొట్టమొదట రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే 1951లో తమిళనాడుకు చెందిన చంపకం దొరై రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు ఈ వర్గాలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. దీంతో 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ప్రారంభమయింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో సాగిన సామాజిక న్యాయం కేసుల విషయంలో సుప్రీంకోర్టు సరైన విధంగా స్పందించడం లేదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 2010 సుప్రీంకోర్టు తీర్పు రాగానే దేశంలోని స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అమలులో ఉన్న 25 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో వెంటనే బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి తగ్గించారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న కర్ణాటక, బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ 2013–2014 మధ్యలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18–22 శాతం వరకు తగ్గించారు తప్ప బీసీ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చట్టాలను తయారు చేయలేదు. కానీ వైఎస్ జగన్ తనకున్న అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికి బీసీ రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయడానికి మరోసారి జీవో నం.176ను జారీ చేశారు. కానీ టీడీపీ నేత చర్య కారణంగా అంతిమంగా ఏపీ హైకోర్టు కూడా ఈ జీవోకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలో ఏముంది...? కేంద్ర ప్రభుత్వం 73–74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయత్ రాజ్ మున్సిపల్ చట్టం తెచ్చింది. ఈ రాజ్యాంగ సవరణలో రాజ్యాం గంలోని ఆర్టికల్ 243( ఈ–6), 243 ( ఖీ–6) ఆర్టికల్స్ పొందుపరిచి బీసీలకు కూడా జనాభా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెట్టాలని, అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు చేయాలని ఆదేశించింది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఖరారు చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఇచ్చారు. దీని ప్రకారం 1993లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీసీలకు 34 శాతం ఖరారు చేసింది. ఈ శాతమే ఇంతవరకు అమలు చేస్తూ వచ్చారు. 1980 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన పలు ఉద్యమాల ప్రభావంతో 1992లో వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆధారంగా నాటి సీఎం విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. కొత్తగా గ్రామ పంచాయతీలకు 34% రిజర్వేషన్లు పెట్టారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసనసభలకు వదిలిపెట్టడం తప్పితే స్పష్టంగా రాజ్యాం గంలోనే జనాభా ప్రకారం పెట్టాలని పేర్కొనక పోవడంతో ప్రతిసారి న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలో ఇంతవరకు ఏ సీఎం కూడా చేయని విధంగా వైఎస్ జగన్ బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీసీలు, దళితులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవడం లేదు. జగనన్న వసతి దీవెన–విద్యా దీవెన– అమ్మ ఒడి పథకాలు ఎస్సీ/ఎస్టీ/బీసీలలో చదువుల విప్లవం తీసుకొస్తాయి. దీర్ఘకాలంలో ఈ పథకాల వలన ఎస్సీ/ఎస్టీ/బీసీల మౌలిక జీవన విధానంలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ/ఎస్టీ/బీసీల సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు అనేక స్కీములు పెట్టారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులలో 50 శాతం కోటా కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే కాంట్రాక్ట్ వర్క్‌లలో 50 శాతం కోటా, పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా కల్పించి, ఎస్సీ/ఎస్టీ/బీసీల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారు. ఇదొక గొప్ప మలుపు. అలాగే గత ఏడాది మార్చి నెలలో వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్ – పార్టీ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుంది. దేశంలోని 70 కోట్ల మంది బీసీలు ఇప్పుడు వైఎస్ జగన్ అభిమానులుగా మారిపోయారు. పరిష్కారం ఏమిటి? రిజర్వేషన్ల గరిష్ట పరిమితిపై ప్రతిసారి న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరి ష్కారం చూడవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది. దీంట్లో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగంలో 9వ షెడ్యుల్ రిజర్వేషన్లను పెట్టింది. అదే విధంగా ఇప్పుడు అన్ని పార్టీలు చొరవ తీసుకుని రాజ్యాంగ సవరణ చేయాలి. అలాగే రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సమయం తీసుకుంటుంది కాబట్టి తాత్కాలిక పరిష్కారంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో బీసీల జనాభా ప్రకారం జనరల్ సీట్లలో బీసీలకు సీట్లు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ప్రతిపాదనను అన్ని రాజకీయ పార్టీల ముందు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర ప్రతిపక్షాలు బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆచరణలో ఈ ప్రతిపాదనను అంగీకరించాలి. జనరల్ సీట్లలో బీసీలకు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. హైకోర్టు రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు పాటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఏపీలోని ప్రతిపక్ష పార్టీ టీడీపీతోపాటు ఇతర పార్టీలైన, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు కూడా 34% రిజర్వేషన్లు పాటించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. వ్యాసకర్త: ఆర్. కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్ : 90000 09164 -
సీఎం జగన్ నిర్ణయం పై బీసీల హర్షం
-
కేసు వేయించింది చంద్రబాబే
-
చంద్రబాబుకు బీసీలపై ఉన్నది కపటప్రేమ
-
‘బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది ఆయనే’
సాక్షి, విజయవాడ: బీసీలకు పార్టీపరంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు చేయలేని పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారని అభినందించారు. బీసీలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వేలల్లో పదవులు బీసీలకు వస్తాయని తెలిపారు. (బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తున్నాం) స్థానిక ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెబుతారు.. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అడ్డుకుంది చంద్రబాబేనని.. ఆయనే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించారని మండిపడ్డారు. రిజర్వేషన్లు అడ్డుకున్న టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెబుతారని కృష్ణయ్య పేర్కొన్నారు.(బీసీలకు 10 % అదనం) -
చంద్రబాబు బీసీ ద్రోహి
-
ఏపీ: బీసీలకు సాధికారత
సాక్షి, అమరావతి: ‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుంటే వెనుకంజ వేస్తామా! సాంకేతిక కారణాలతో బీసీలకు తగినంత రిజర్వేషన్లు ఇవ్వడం కుదరకపోతే మిన్నకుండిపోతామా?.. కానే కాదు.. వైఎస్సార్సీపీ తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తాం. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని అందిస్తాం..’ అని సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో తొలి నాయకుడు.. బీసీల సాధికారత, సామాజిక న్యాయం దిశగా సత్వరం స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దేశవ్యాప్తంగా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను టీడీపీ న్యాయ వివాదాలతో అడ్డుకున్నా సీఎం జగన్ వెనుకంజ వేయకుండా, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ పరంగా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఇస్తామని వెంటనే నిర్ణయం తీసుకున్నారని బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. దేశంలో ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న తొలి నాయకుడు సీఎం జగన్ అని పేర్కొంటున్నాయి. దేశంలోని అన్ని పార్టీలూ ఇదే విధానాన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాకారమవుతుందని సూచిస్తున్నాయి. బీసీలను వంచిస్తూ కపట నాటకాలాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరోసారి కోలుకోలేని గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయం క్షేత్రస్థాయి నుంచి రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం నుంచి దామాషా ప్రకారం రాజకీయ అధికారాన్ని కోరుతున్న బీసీ వర్గాలు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. బీసీల పక్షపాతి వైఎస్ జగన్ బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకున్న నేతలనే ఇన్నాళ్లూ చూశాం. బీసీల అభ్యున్నతిపై చిత్తశుద్ధితో వ్యవహరించిన నేతను ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలో మాత్రమే చూశామని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీసీల సంక్షేమం, రాజ్యాధికారం దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గాలకు 34 శాతం సీట్లు రిజర్వు చేసేందుకు వీలుగా మొత్తం రిజర్వేషన్లను 59.85 శాతంగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే జీవో 176 జారీ చేయడం తెలిసిందే. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ నిరీక్షణ ఫలించిందని బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఆ జీవోను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టును ఆశ్రయించడం, 59.85 శాతం రిజర్వేషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో బీసీ వర్గాలు తీవ్ర నిస్పృహకు గురయ్యాయి. సత్వరమే స్పందించారు.. న్యాయస్థానం ఉత్తర్వుల కారణంగా బీసీలకు చట్టప్రకారం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇలాంటి స్థితిలో మరో నేత ఎవరైనా అధికారంలో ఉంటే సాంకేతిక, న్యాయపరమైన అంశాలను సాకుగా చూపించి బీసీలకు రిజర్వేషన్లను తగ్గించేవారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీల అభ్యున్నతిపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. న్యాయపరమైన అంశాల కారణంగా బీసీలకు చట్టప్రకారం 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నందున పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. అద్భుత నిర్ణయం రిజర్వేషన్లపై కోర్టు కేసులతో కాలయాపన చేయాలన్న టీడీపీ ఎత్తుగడలకు లొంగకుండా ముఖ్యమంత్రి జగన్ పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు ప్రకటించడం అద్భుత నిర్ణయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా గతంలోనే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం బీసీలపట్ల సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. చంద్రబాబు టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో కేసు వేయించి ఆ జీవోను అడ్డుకున్నారని విమర్శించారు. మళ్లీ బీసీలను మోసగించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి డ్రామాకు తెర తీశారని దుయ్యబట్టారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్టీపరంగా 34 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం ద్వారా బీసీలకు తగిన న్యాయం చేశారని చెప్పారు. చిత్తశుద్ధితో అధిగమించిన సీఎం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రవచించిన స్ఫూర్తిని సీఎం వైఎస్ జగన్ ఆచరణలో చూపించారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ బీసీలకు తగినన్ని సీట్లు కేటాయించడం లేదని, చిత్తశుద్ధితో దీన్ని అధిగమించవచ్చని సీఎం వైఎస్ జగన్ నిరూపించారని ప్రశంసిస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసేవరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విధాన నిర్ణయాన్ని దేశంలోని ఇతర నేతలు కూడా అనుసరించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ‘పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఎన్నికల కోసం రాజకీయ డ్రామాలాడటం వైఎస్సార్సీపీ విధానం కాదు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వైఎస్సార్సీపీ ఇప్పటికే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీల తరపున ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇదే రీతిలో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు కూడా కృషి చేయాలని కోరుతున్నా’ తొలి సీఎం జగన్.. – జస్టిస్ ఈశ్వరయ్య, అఖిల భారత బీసీ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ‘సామాజిక న్యాయ సాధనలో ముఖ్యమంత్రి జగన్ చుక్కానిలా నిలిచారు. దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే. దేశంలో మరే సీఎంగానీ, పార్టీ అధ్యక్షుడుగానీ ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్‌ను చొరవను అభినందిస్తున్నాం’ దేశానికి ఆదర్శం.. – హనుమంతు లజపతిరాయ్, మాజీ వీసీ, అంబ్కేడర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం ‘పార్టీపరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం దేశానికి ఆదర్శప్రాయం. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు దీన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాధ్యపడుతుంది’ బీసీ గర్జన హామీ చిత్తశుద్ధితో అమలు.. జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని పదవుల్లోనూ పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’లో ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఇతర పార్టీల కంటే అత్యధికంగా బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. ఎన్నికల ముందు దక్కిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవిని బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలో బీసీలకు అగ్రస్థానం కట్టబెట్టారు. బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, బీసీ ‘ఈ’ కేటగిరీకి చెందిన మైనార్టీ నేత అంజాద్ బాషను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. కీలకమైన రెవెన్యూ, పురపాలక, జలవనరులు, రోడ్లు–భవనాలు, మార్కెటింగ్, కార్మిక, మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖలను వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. స్పీకర్ పదవికి బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా కృషి చేశారు. తాజాగా క్షేత్రస్థాయి నుంచి రాజ్యాధికారాన్ని అందించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో బీసీ కులాలకు ఎంతో మేలు జరుగుతుంది. టీడీపీ హామీ ఇచ్చి మోసం చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుని అండగా నిలుస్తోంది. బీసీలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు. – గదుల వెంకట్రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం బీసీలకు సముచిత స్థానం బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు, బడ్జెట్, సీట్ల కేటాయింపులో బీసీలకు సముచిత స్థానం కల్పించి గత 30 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా అమలు చేస్తున్నారు. అద్భుతమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు – మహంతి శ్రీరవి, తూర్పుకాపు అభినందనీయం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అదనంగా 10 శాతం సీట్లు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు, మంత్రివర్గంలో చోటుతోపాటు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది. – శంకరయ్య, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యాయం జరుగుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. పార్టీ తరపున 10 శాతం అదనంగా సీట్లు కేటాయించడం అభినందనీయం. రాజ్యాంగబద్ధంగా అదనపు రిజర్వేషన్లు పొందలేని బీసీలకు దీనివల్ల న్యాయం జరుగుతుంది. – అనుమోలు చుక్కయ్య, బీసీ సంఘం కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షుడు బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టు.. బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టులా బలహీన వర్గాలకు అదనంగా 10 శాతం సీట్లు వైఎస్సార్సీపీ తరపున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించడం అభినందనీయం. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతుంది. – కోలా అశోక్, కృష్ణబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట నిలబెట్టుకున్నారు బీసీలకు ఇచ్చిన మాటను జగనన్న నిలబెట్టుకున్నారు. బీసీలను ఎదగనివ్వకుండా కుయుక్తులు పన్నుతున్న టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. కోర్టు తీర్పుతో రిజర్వేషన్లు తగ్గినప్పటికీ వైఎస్సార్సీపీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు పది శాతం అదనంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం. – ప్రకాష్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక చరిత్రాత్మక నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున బీసీలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. బీసీలు సీఎంకు రుణపడి ఉంటారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి. బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. – లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం మహిళలకు అవకాశం బీసీలకు సీట్లు పెరగడం వల్ల ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన గృహిణులు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. – మానేపల్లి వీరేష్, స్వర్ణకారుడు, అమలాపురం బాబుది కాటు తంత్రం .. జగన్‌ది సామాజిక మంత్రం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నిన కుట్రలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థంగా తిప్పికొట్టారని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బలహీన వర్గాలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంటని ప్రశ్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో గుణపాఠం నేర్పినా బుద్ధి మారని టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. -
వ్యవస్థలో మార్పునకు సీఎం శ్రీకారం
-
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిచడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్ణయించిన 34 శాతానికి బదులుగా.. బీసీలకు 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం సీట్లు పార్టీ తరుపున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకున్న 10 శాతం పదవులను పార్టీ బీ ఫామ్‌ల ద్వారా అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు మొత్తం 34 శాతం రిజర్వేషన్లు పొందనున్నారు. (రిజర్వేషన్లు 50% మించొద్దు) ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ నేతలతో కలిసి శనివారం వెల్లడించారు. సీఎం జగన్ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జీవో 176ను జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. (ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు) ఆయా వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధమని ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. టీడీపీ నేతల కుట్ర కారణంగా బీసీలు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే వెనుకబడిన బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలని సుధీర్ఘ ఆలోచన చేసిన సీఎం జగన్.. పార్టీ నుంచి అదనంగా 10శాతం సీట్లును బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ముందే సంకల్పించిన విధంగా బీసీలకు మొత్తం 34శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి. -
కరోనా వచ్చింది రాష్ట్రానికి కాదు.. టీడీపీకి‘
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమని సవాల్ చేసిన చంద్రబాబు ఎందుకు మాట మార్చుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా ముందు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీని చిత్తుగా ఓడించమని ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఎందుకు ఓడించాలో కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకు వైఎస్సార్సీని ఒడించాలా.. బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ఓడించాలా అని జోగి రమేష్ చంద్రబాబును ప్రశ్నించారు. (స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల) చంద్రబాబును ప్రజలు ఓడించిన సిగ్గు లేకుండా మళ్లీ మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెబుతున్నారని ఆయన విమర్శించారు. కరోనా వైరస్ రాష్ట్రానికి రాలేదని, టీడీపీకి వచ్చిందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని, అభ్యర్థులు దొరికిన డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ పక్షాన ఉన్నారన్నారు. (‘ఏ క్షణంలో ఎన్నికలైనా మేము సిద్ధం’) గత ఎన్నికల్లో చంద్రబాబు అనే శనిని బీసీలు వదిలించుకున్నారని జంగా కృష్ణమూర్తి దుయ్యబట్టారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆయన నిజ స్వరూపం బీసీలు తెలుసుకున్నారని అన్నారు. బాబు బీసీల ద్రోహి అని, బీసీలకు మూడవ వంతు నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పదివేల కోట్లు ఇస్తానని చెప్పి, బీసీ కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టాడని మండిపడ్డారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌లో పెట్టిన ఒక్క హామీ అయినా నెరవేర్చరా అని నిలదీశారు. 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వలేదని చంద్రబాబే సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారని గుర్తు చేశారు. బీసీలకు సీఎం జగన్ అండగా ఉన్నారన్న దురుద్ధేశంతోనే బీసీ రిజర్వేషన్లు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిది అని ప్రశంసించారు. (ఎప్పటికైనా ఆ ఒక్కడినే అనుమతిస్తా: కరీనా) -
చంద్రబాబుకు మల్లాది విష్ణు సవాల్..
సాక్షి, విజయవాడ : చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అందుకే ఎన్నికలు ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆయనమండిపడ్డారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు గురుంచి ఇన్నాళ్లు మాట్లాడని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికలు జరిపాలని చూస్తుంటే, స్టేల కోసం టీడీపీ నాయకులు యత్నిస్తున్నారని మండిపడ్డారు.బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు కోల్పోయారన్నారు. (‘బీసీల పట్ల ప్రేమ అంటూనే కోర్టుకు వెళ్తారా..’) అధికారంలో ఉండగా చంద్రబాబు బీసీలకు చేసిందేమి లేదని, గడిచిన ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. టీడీపీ నాయకులు ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం కనుచూపు మేరలో కూడా కనిపించదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే లోకేష్ ఏడుపు గొట్టు మాటలు మాట్లాడుతున్నారని, అధికారం కోల్పోయారని తండ్రి కొడుకు కడుపు మంటతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు 90 శాతం అమలు చేశామని తెలిపారు. (టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలి: మంత్రి బొత్స) ‘‘బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చిదాం. మీరు సిద్దమేనా...? గత ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాల మతాల ప్రస్తావనతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ పారదర్శకంగా పాలన సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టారు. ఒక్కరోజులోనే 95 శాతం పింఛన్లు పంపిణీ చేసిన ఘనత మాది. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి చంద్రబాబు. విద్య, వైద్య రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలని సీఎం చూస్తున్నారు. బోండా ఉమా నిరాశలో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు. విడతల వారిగా మద్యం నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి,నిజాయితీ ఉంటే మీ అయిదు సంవత్సరాల పాలనపై, మా తొమ్మిది నెలల పాలపై చర్చకు సిద్దమా...?’’ అంటూ చంద్రబాబుకు మల్లాది విష్ణు సవాల్ విసిరారు. -
చంద్రబాబుపై భగ్గుమన్న బీసీలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: కుట్రపూరితంగా కేసులు వేయించి తమ రిజర్వేషన్లను అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు భగ్గుమన్నారు. మేమంటే ఇంత ద్వేషమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు రాకుండా తీరని ద్రోహం చేసిన టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామంటూ గురువారం వాడవాడలా కదం తొక్కారు. ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ర్యాలీలు, ధర్నాలకు దిగి చంద్రబాబు దుర్బుద్ధిని ఎండగట్టారు. టీడీపీ నేతల నిర్వాకం వల్ల రిజర్వేషన్లు కోల్పోయామని మండిపడుతూ శ్రీకాకుళంలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తమకు మంచి చేసేందుకు అదనంగా రిజర్వేషన్లు తీసుకొస్తే.. అడ్డుకుంటారా అంటూ టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ నేతల ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున తగలబెట్టారు. వారి చిత్రపటాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌తో కేసులు వేయించడం ద్వారా చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓటు బ్యాంకుగా చూస్తున్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రకాశం, నెల్లూరు జిల్లాల బీసీ విద్యార్థులు, నాయకులు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్వాకంతో బీసీలు 15 వేలకు పైగా పదవులను కోల్పోవాల్సి వస్తోందని కర్నూలు జిల్లా బీసీ సంఘాల నాయకులు వాపోయారు. టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తామని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన బీసీలు, విద్యార్థులు ప్రతినబూనారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను ఉరి తీసి తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. తమను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్న చంద్రబాబుకు తమ సత్తా ఏంటో స్థానిక ఎన్నికల్లో చూపిస్తామంటూ వైఎస్సార్ జిల్లా బీసీలు, ప్రజలు హెచ్చరించారు. (చదవండి: బీసీల కోటాపై టీడీపీ ఆట) -
టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం
-
‘బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్నారు’
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలను 35 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారని నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం బీసీలను వాడుకుని వదిలేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు నైజమని వ్యాఖ్యానించారు. కుళ్లు, కుతంత్రాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీ కమిషన్ వేస్తానని మోసం చేశారని పేర్కొన్నారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..) నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని మంత్రి ప్రశంసించారు. కేబినెట్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు శాశ్వత ప్రాతిపదికన కమిషన్ ఏర్పాటు చేశారని, స్థానిక ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు నష్టపోతామని తెలిపారు. (డ్రామాలొద్దు బాబూ) ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు 59 శాతం రిజర్వేషన్ ఇస్తామంటే అడ్డుపడుతున్నారని, బిర్రు ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తితో హైకోర్టులో పిషన్ వేయించారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు ప్రభుత్వంలో పదవి పొందిన వ్యక్తి అని, బీసీలపై ప్రేమ ఉంది అంటూనే కోర్టులో పిటిషన్లు వేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు గుంటనక్కలా మాట్లాడుతున్నారని, బీసీలపై సవితి ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2018లో బాబు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను వేశారని, సమయంలో చంద్రబాబు కోర్టుకు 2013 వరకు మాత్రమే పెంచిన రిజర్వేషన్లు పరిమితమని చెప్పారన్నారు. (బడుగుల ద్రోహి చంద్రబాబు) చదవండి : ఈయన వైఎస్సార్సీపీ నాయకుడట! బాబు వల్లే సీట్ల కోత -
బీసీ సీట్లలో కోత
-
బాబు వల్లే సీట్ల కోత
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు కారణమైన బీసీలను చంద్రబాబు నిలువునా మోసం చేశారు. మాటల్లో మాత్రం వారిపై కపట ప్రేమను కురిపిస్తూ ‘స్థానిక’ ఎన్నికలలో వారికి దక్కాల్సిన పదవులకు భారీగా గండికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే.. దానిని తప్పుపడుతూ టీడీపీ నేతలతో సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. ఆ కేసుల కారణంగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి బీసీలకు రిజర్వేషన్లు తగ్గే పరిస్థితి వస్తే.. తగ్గించడానికి వీలు లేదు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిందేనంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది చంద్రబాబేనని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ధైర్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు కొత్త జీవో తీసుకొచ్చారు. కానీ.. టీడీపీ కుతంత్రం వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గిపోయాయి’ అని బీసీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది జనవరి 8వ తేదీన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వెలువడిన రెండు రోజులకు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి కేసు వేసింది టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి. ఇప్పుడు టీడీపీ నేతలందరూ ప్రతాప్‌రెడ్డికి, టీడీపీకి ఏమీ సంబంధం లేదని వక్రభాష్యం చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అదే వ్యక్తిని రాష్ట్ర ఉపాధి హామీ పథకం కౌన్సిల్ సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిసారీ బీసీలకు అన్యాయమే రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు అమరనాథ్ గౌడ్, అభినవ్‌కుమార్ చావలి, గంగారావు, డీవీ సోమయాజులు, విజయలక్ష్మి, కేశవరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీం కోర్టు జడ్జిల కొలీజయం కేంద్రానికి సిఫార్సు చేస్తూ.. ఆ ఆరుగురు న్యాయవాదులపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబును కేంద్ర న్యాయ శాఖ కోరింది. బీసీ వర్గాలకు చెందిన అమర్నాథ్గౌడ్, అభినవ్‌కుమార్ చావలి, ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డీవీ సోమయాజులుకు విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వం లేవని, వారు సచ్ఛీలురు కారంటూ మార్చి 21, 2017న సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. దేవదాయ శాఖ అధీనంలో ఉండే పలు ఆలయాల వద్ద క్షౌ రవృత్తి చేసే నాయీబ్రాహ్మణులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర సచివాలయం వరకూ వెళ్లి తమకు గౌరవ వేతనం చెల్లించాలని అడిగితే ‘మీ తోక కత్తిరిస్తాం’ అంటూ అవమానించారు. ఎస్సీ, ఎస్టీలన్నా చులకనే.. ఎస్సీ, ఎస్టీలన్నా చంద్రబాబుకు చులకనే అని పలు ఘటనలు నిరూపించాయి. 2016 ఫిబ్రవరి 8వ తేదీన చంద్రబాబు విలేకరుల సమావేశంలో ‘ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు. అందరూ సంపన్ను వర్గాలోనే పుట్టాలనుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలు ఏలవచ్చనుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికొచ్చే నిధులకూ మోకాలడ్డు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా రావాల్సిన రూ.3,710.46 కోట్ల నిధులకు ప్రతిపక్ష నేత చంద్రబాబు మోకాలడ్డుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపితే గానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ నిధులను విడుదల చేయదు. సర్పంచుల పదవీ కాలం 2018లో ముగిసినా అప్పట్లో సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా టీడీపీ అధికారంలో ఉన్న 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు విడుదల చేయాల్సిన రూ.1,089.33 కోట్లను కేంద్రం నిలిపివేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో గ్రామాలకు ఇవ్వాల్సిన రూ.2,622.13 కోట్లను కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఈ మొత్తం నిధులు రూ.3,710 కోట్లను మున్సిపాలిటీలకు విడుదల చేయాల్సిన నిధులతో కలుపుకుంటే ప్రస్తుతానికి రూ.5,000 కోట్లు వరకు మార్చి నెలాఖరులోగా విడుదల చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా నిధులు విడుదల కాకుంటే.. ఆ మొత్తం మురిగిపోయే పరిస్థితి ఉంది. 14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఆ తర్వాత 14 ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించటం ద్వారా గ్రామాలకు, మున్సిపాలిటీలకు సంబంధిత నిధులు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయగా.. టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులతో కోర్టులలో కేసులు వేయించి ఎన్నికల జరక్కుండా అడ్డుపడ్డుతున్నారు. బీసీల కోసం వైఎస్ జగన్ ధైర్యం చేసి జీవో తెస్తే.. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ధైర్యంతో 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు కొత్త జీవో తీసుకొచ్చారు. కానీ, ఆ జీవోపై టీడీపీ నేత సుప్రీంకోర్టులో వేసిన కేసు కారణంగానే ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి. కోర్టు వెళ్లకపోతే బీసీల రిజర్వేషన్లు తగ్గేవి కాదు. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోలేని నిర్ణయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకుంటే.. టీడీపీ వాళ్లు దానిని అమలు కాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు తగ్గకూడదంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేయడం ఒక్కటే మార్గం. దానికి కొంత సమయం పడుతుంది. ఇదిలా ఉంటే జనాభా ప్రతిపాదికన బీసీలకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టింది కూడా జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఒక్కటే. పార్లమెంట్లో బీసీలకు పెద్దపీట వేసేది తామేనని చెప్పుకునే చాలా పార్టీలున్నా, అవి కూడా చేయని పని జగన్మోహన్రెడ్డి చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు టీడీపీ నేతల్లో అసంతృప్తి 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో కేసు దాఖలు చేసిన బిర్రు ప్రతాప్‌రెడ్డి టీడీపీ నాయకుడనే విషయం బహిర్గతమవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు రకరకాల ప్రచారాలకు తెరలేపారు. చంద్రబాబు కావాలని వ్యూహాత్మకంగా ఇదంతా చేయించినట్లు బట్టబయలు కావడంతో టీడీపీలోని బీసీ నాయకులు, బీసీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచ్ల సంఘం, ఎంపీటీసీల సంఘాలు నడిపిన టీడీపీ నాయకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ అనుచరుడిగా ప్రతాప్‌రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తి. అతనితో కోర్టులో కేసు వేయించి ముందుకు నడిపించింది టీడీపీ లీగల్ సెల్‌లోని ముఖ్య నాయకులనే విషయం బహిరంగ రహస్యమే. టీడీపీ కార్యాలయంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ప్రతాప్‌రెడ్డి పాల్గొనేవారు. అతనికి ఉపాధి హామీ పథకం డైరెక్టర్ పదవి ఇచ్చింది కూడా చంద్రబాబే. తమ పార్టీకి చెందిన వ్యక్తి, తనతో తిరిగిన అనుచరుడినే తమ వాడు కాదని చెప్పాల్సి రావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ప్రతాప్‌రెడ్డి తమ నాయకుడు కాదని చెప్పక తప్పడం లేదని పలువురు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..
సాక్షి, మచిలీపట్నం: బీసీలు టీడీపీకి పట్టుగొమ్మ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వారికి చేసిందేమీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవో తీసుకొచ్చారన్నారు. ఈ తరుణంలో తన మనుషులతో హైకోర్టులో పిటిషన్ వేయించి చంద్రబాబు మోకాలొడ్డారని ధ్వజమెత్తారు. సోమవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అధ్యక్షతన జరిగిన మల్లేశ్వరం మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన చంద్రబాబు ద్వంద్వ నీతిపై మండిపడ్డారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే అన్నారు. చంద్రబాబుకు గుణపాఠం నేర్పాలి: బాబు నిర్వాకం వల్ల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సోమవారం హైకోర్టు తీర్పు నివ్వడంతో ఆ మేరకు బీసీల రిజర్వేషన్లు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెలలోనే 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళతామని చెప్పారు. వరుసగా నెల రోజుల్లో çపరిషత్, పంచాయతీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లోనూ గుణపాఠం నేర్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ కమిటీలు గత పభుత్వ హయాంలో ఉత్సవ విగ్రహాలుగా ఉండేవన్నారు. -
బీసీ జనగణన ఎప్పుడు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు.. ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధికై అనేక స్కీములు అమలు జరుపుతున్నాయి. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నాయి. కానీ బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. బీసీ జనాభా లెక్కలు లేని కారణంగానే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేనందువలన రిజర్వేషన్లను ఎంత శాతం నిర్ణయించాలనే అంశంపై మొదటినుంచి బీసీ కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం కులాల ప్రాతిపదికన ఎస్సీ/ఎస్టీ/బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ సామాజిక వర్గాల పేరుమీద జనాభా గణన మొదటి నుంచి తీస్తున్నారు. అలాగే లింగ విభజన పేరుమీద మహిళా–పురుష జనాభా గణన ఉంది. కానీ బీసీ కులాల జనాభా వివరాలు కావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నా, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా, హైకోర్టు–సుప్రీంకోర్టులు ఆదేశిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఒక బీసీ కులాల కాలమ్ పెట్టడానికి ముందుకు రావడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2021లో భారతదేశ జనగణన చేపట్టడానికి విడుదల చేసిన నమూనా పట్టికలో వివరాల కోసం 32 కాలమ్స్ నమూనా పత్రం విడుదల చేశారు. కేంద్రప్రభుత్వం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ/ఎస్టీల వివరాలు కాలం, అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల వివరాలు ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ నమూనా పత్రాన్ని జారీ చేశారు. కానీ ఈ జనాభా లెక్కల పట్టికలో బీసీ కులాల వివరాలకు సంబంధించిన కాలమ్ పెట్టలేదు. బీసీ జనాభా లెక్కల వివరాలు సేకరించవలసిన ఆవశ్యకత ఉంది. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కేటాయింపు–పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీ జనాభా లెక్కల వివరాలు అవసరం అవుతున్నాయి. జనాభా లెక్కలు లేనందున సుప్రీంకోర్టు–హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలనే విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక, న్యాయపరమైన చట్టపరమైన కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిటీని నియమించింది. బీసీ కులాలవారీగా జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకరణ చేసి ఏయే గ్రూపుకు ఎంత శాతం రిజర్వేషన్లు నిర్ణయించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటి? 1931లో అంటే 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీయడానికి ఊగిసలాడుతూ వచ్చింది. బీసీ సంక్షేమ సంఘం అనేక వీధి పోరాటాలు న్యాయపోరాటాలు చేసిన తర్వాత స్పందించి 2010లో కులాల వారీ లెక్కలు తీయడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. దీనితో ప్రత్యేకంగా బీసీ జనాభా లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 8 వేల కోట్లు కేటాయించి కులాల వారీ జనాభా లెక్కల్ని ప్రత్యేకంగా తీశారు. ఈ లెక్కలతో సమగ్ర పట్టిక తయారు చేయడానికి మాజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌తో ఒక కమిటీ వేశారు. కానీ ఆ తర్వాత వాటి వివరాలు, జనాభా సంఖ్య ఇంతవరకు ప్రకటించలేదు. గతంలో అంటే 2010లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బీసీ జనాభా కులాల వారిగా లెక్కలు తీయాలని భారతీయ జనతాపార్టీ పార్లమెంటులో డిమాండ్ చేసింది. బీజేపీ కోరినం దుకే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. కావున కులాలు వారీ లెక్కలు తీయవలసిన బాధ్యత అవసరం–ఆవశ్యకత ఉంది. పైగా దీనికి ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదు. ఒక రూపాయి ఖర్చు లేకుండా జనాభా లెక్కలు వస్తాయి. 01.08.2018 నాడు అప్పటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ రెండవ సారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ఎందుకు మార్పు వచ్చింది?. జనాభా లెక్కలు తీస్తే తరాలుగా అణచివేతకు గురైన కులాలు తామే అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిస్తే వారు తిరగబడి.. దేశవనరుల్లో, అధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని అడుగుతారేమోనని పాలకవర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతే కాదు.. వేల సంవత్సరాలు తమ అగ్రకులాలకు సేవలు చేస్తున్న ఊడ్చేపని, స్కావెంజర్ పని, వంట చేసే పని, బట్టలుతికే వారు, హెయిర్ కటింగ్ చేసే వారు ఇలా ఇంటి పని, పొలం పనులు చేసే వారు దొరకరని భయపడి జనాభా లెక్కలు తీయడం లేదా!! అలాగే ఇన్ని రోజులు తమ కాళ్ళ కాడ పడి ఉన్న ఈ పేద కులాల వారికి అధికారంలో వాటా ఇస్తే వీరు కలెక్టర్, ఆఫీసర్, ఎమ్మెల్యే, మంత్రులయి తమ పక్కన కూర్చుంటారని భయమా!! అలాగే జనాభా లెక్కలు తేలితే విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లు పెంచాలని అలాగే స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ బలంగా ముందుకు వస్తుందని భయమా! భయపడవలసిన అవసరం లేదు. మీరు జనాభా లెక్కలలో కులాల వారీ లెక్కలు తీసినంత మాత్రాన ఈ కులాలు తమ డిమాండ్లను తెరమీదకి తీసుకురావు. ఇప్పటివరకు రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ఏమైనా అవలక్షణాలు దొర్లాయా? రాజ్యాంగం రక్షణ సదుపాయాలు రాజ్యాంగంలోని 15 (4) (5) మరియు 16 (4) (5) ప్రకారం బీసీ కులాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా ఉంది. జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెడతారు? రాజ్యాంగంలోని 243 డి–(6) 243–టి–6 ప్రకారం స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. కానీ జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్ల శాతం ఎలా నిర్ణయిస్తారు? రాజ్యాంగంలోని 339–బి–ప్రకారం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ బీసీల సమగ్రాభివృద్ధికి ఏ సిఫార్సు చేయాలన్నా జనాభా లెక్కలు కావాలి. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు, రక్షణలు, రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలు అవసరం. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రోవిజన్స్–ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే బీసీ కులాల లెక్కలు కావాలి. కోర్టు తీర్పు ప్రకారం లెక్క తీయాలి రిజర్వేషన్లు ప్రవేశపెట్టినపుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో హైకోర్టు–సుప్రీంకోర్టులు జోక్యం చేసుకొని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారని లేదా పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మండల్ కమిషన్ కేసు సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో ప్రతీ రాష్ట్రంలో నియమించిన ప్రతి కమిషన్ జనాభా లెక్కలు తీయాలని సిఫారసు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అనేక రాష్ట్రాలు కులాల వారిగా జనాభా లెక్కలు తీశాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు కోసం, ఇతర రిజర్వేషన్ల కోసం ఇతర అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలు బీసీ జనాభా లెక్కలు తీశాయి. కానీ వీటికి చట్టబద్ధత లేదని కోర్టులు కొట్టివేశాయి. ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనాభా గణన ద్వారా సేకరిస్తున్నారు. చివరకు పులులు–జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ బీసీ కులాల వారిగా జనాభా లేకపోవడం అన్యాయం. బీసీ జనాభా లెక్కలు సేకరిస్తే జరిగే నష్టం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు లేదు. కేవలం ఊహాజనితంగా కులాల వారి లెక్కలు తీయడం వలన కులతత్వం పెరుగుతుందని పసలేని విమర్శలు చేస్తుంటారు. ఇది ఊహమాత్రమే; ఎందుకంటే మతాల లెక్కలు తీస్తున్నారు. మతతత్వం పెరుగుతుందా! అలాగే ఎస్సీ/ఎస్టీ కులాల వారి లెక్కలు తీయడం లేదా? ఏమైనా కులతత్వం పెరిగిందా? ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలన సౌకర్యంకోసం కులాల వారీ లెక్కలు ఉపయోగపడుతాయి. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారి లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. జనాభా గణన కాలమ్స్‌లో ఒక కాలమ్ పెరుగుతుంది. ఒక పైసా అదనంగా ఖర్చు కాదు. పైగా ప్రభుత్వానికి చట్టపరమైన, పాలనాపరమైన, అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి కులాల వారి కాలమ్ చేర్చాలని ప్రజలు–అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం -
‘సుప్రీం’ తీర్పునకు లోబడే ‘స్థానిక’ రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: వెనుకబడిన తరగతులకు (బీసీ) తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా చట్టాలు తీసుకువచ్చే అధికారం తమకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకు అనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు జరిగాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా.. వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించామని, కానీ బీసీలకు మాత్రం 1995 చట్ట సవరణను అనుసరించి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని వివరించింది. 1995లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు, 1991 జనాభా లెక్కల ప్రకారం బీసీ జనాభా ఆంధ్రప్రదేశ్‌లో 39 శాతం మేర ఉందని తెలిపింది. రాష్ట్ర విభజన తరువాత ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ నిర్వహించిన సర్వేలో బీసీ ఓటర్లు 48.13 శాతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అందువల్ల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ మాత్రం తప్పుకాదని.. పైగా వారి జనాభా కన్నా తక్కువ రిజర్వేషన్లే కల్పించామని స్పష్టంచేసింది. పైపెచ్చు కృష్ణమూర్తి కేసులో అధికరణ 243డి(6)కి భాష్యం చెబుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సర్కారు వివరించింది. అలాగే, నిర్ణీత కాల వ్యవధిలోపు పంచాయతీ, మునిసిపాలిటీల ఎన్నికలను పూర్తిచేయడం ప్రభుత్వాల రాజ్యాంగ విధి అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించిన హైకోర్టు.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు. ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నిధులివ్వదు.. ‘పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ వృథా అవుతాయి. 2018–19, 2019–20 సంవత్సరాలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూ.4,065.79 కోట్లు కేటాయించింది. ఇందులో మొదటి వాయిదా కింద రూ.858.99 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంవల్ల రెండో వాయిదా విడుదల చేయలేదు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎన్నికలు నిర్వహించకుంటే అవి రావు. దీంతో పంచాయతీలు తీవ్రంగా నష్టపోతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేయండి.’ అని ద్వివేది తన కౌంటర్లో కోరారు. రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉంది ‘పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77, బీసీలకు 34 శాతం మొత్తం కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించాం. అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 50 శాతం రిజర్వేషన్లు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దాటొచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. విధాన నిర్ణాయక వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించడంవల్లే రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయి. గత పాతికేళ్లుగా రిజర్వేషన్లు 50 శాతం దాటుతూనే ఉన్నాయి. విద్యా, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న తీర్పును రాజకీయాలకు వర్తింపచేయడానికి వీల్లేదు. రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.’ అని ద్వివేది తన కౌంటర్లో వివరించారు. అంత జనాభా ఉన్నా.. చట్ట ప్రకారమే నడుచుకున్నాం అలాగే, ‘ఎక్కువ ఓటర్లు ఉన్న వర్గాలకు వాస్తవ అధికారాన్ని నిరాకరిస్తే, అది నిజమైన ప్రజాస్వామ్యం కాదని కూడా ‘సుప్రీం’ తెలిపింది. దీని ప్రకారం జనాభాలో వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అందుకనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో చట్ట సవరణ జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు వారి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తున్నప్పటికీ, బీసీలకు మాత్రం జరగడంలేదు. తాజాగా బీసీల జనాభాను తేల్చకుండా వారి రిజర్వేషన్లు తేల్చడం సరికాదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ, మేం బీసీల లెక్కలు తేల్చాం. ఆ ఓటర్లు 48.13 శాతం ఉన్నప్పటికీ, చట్ట నిబంధనలకు లోబడి వారికి 34 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చాం’ అని గోపాలకృష్ణ ద్వివేది తన కౌంటర్లో పేర్కొన్నారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో వందలాది మంది బీసీలు జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ‘ఓట్లు బీసీలవి.. సీట్లు అగ్రకులాలకా?’అంటూ నినదించారు. ధర్నాను ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం 30 ఏళ్లుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని పేర్కొన్నారు. 16 రాష్ట్రాల నుంచి బీసీలకు ప్రాతినిధ్యమే లేదని వాపోయారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ధనస్వామ్యమని ఆరోపించారు. పార్లమెంట్లో 96 మంది బీసీ సభ్యులున్నా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. బీసీల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర సామాజిక, న్యాయ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌ను బీసీ సంఘాల నేతలు కలిశారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.1,050 కోట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ జేఏసీ చైర్మన్ నీరడి భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
షెడ్యూల్ ప్రకారమే ‘స్థానిక’ ఎన్నికలు
పిటిషనర్: రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. కానీ అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదు. అడ్వొకేట్ జనరల్: రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటంపై దాఖలైన వ్యాజ్యాన్ని గతంలో ఇదే ధర్మాసనం కొట్టివేసింది. చట్టాన్ని అనుసరించే ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైకోర్టు: షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సిందే. నిలిపివేసే ప్రసక్తే లేదు. సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మంథాట సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌ల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ చట్టంలోని 9, 15, 152, 153, 180, 181 సెక్షన్లను సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో 176ని కూడా ఆయన సవాలు చేశారు. ఈ జీవోను సవాలు చేస్తూ మరో రెండు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. బీసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వ విచక్షణే పిటిషనర్ ప్రతాప్‌రెడ్డి తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని కె.కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో తప్పులేదని, అయితే బీసీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటాయన్నారు. ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనం, బీసీ జనాభా గణన లాంటి వాటిని తేల్చిన తరువాత రిజర్వేషన్లు కల్పిస్తే అభ్యంతరం లేదని నివేదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రిజర్వేషన్లు 50 శాతానికి లోబడే ఎన్నికలు నిర్వహించాలని చెప్పిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత పూర్తిస్థాయి విచారణ జరుపుతామని పేర్కొంది. ఎన్నికలను నిలుపుదల చేసే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనికి ప్రణతి స్పందిస్తూ ఎన్నికలను ఆపాలని తాము కోరడం లేదని, కేవలం రిజర్వేషన్లు 50 శాతానికి మాత్రమే పరిమితం చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. జీవో 176ని సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు చెప్పిన తరువాత అమలు చేసి తీరాల్సిందేనన్నారు. అయితే ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోందన్నారు. చట్ట ప్రకారమే ఇలా చేస్తున్నామని చెబుతోందని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పంచాయితీరాజ్ చట్ట నిబంధనలు చెల్లవన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించేలా ఏవైనా చట్టాలు ఉంటే వాటిని సవరించుకోవాలని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనానికి నివేదించారు. చట్ట ప్రకారమే రిజర్వేషన్లు... రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటంపై ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ఒక వ్యాజ్యాన్ని ఇదే ధర్మాసనం కొట్టి వేసిందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. మరో వ్యాజ్యంలో ధర్మాసనం నోటీసులు జారీ చేసి, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు. చట్టాన్ని అనుసరించే జీవో 176 జారీ అయిందని తెలిపారు. ధర్మాసనం ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పిటిషనర్లు చివరి దశలో కోర్టుకు వచ్చారని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే ఎన్నికల నోటిఫికేషన్ వల్ల తమ వ్యాజ్యాలు నిరర్థకమవుతాయని, ఈ విషయం కోర్టుకు తెలుసని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొనగా తమకు చాలా విషయాలు తెలుసని, స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడాదిన్నర దాటినా కూడా ఎన్నికలు నిర్వహించని విషయం కూడా తమకు తెలుసని ధర్మాసనం ఒకింత ఘాటుగా వ్యాఖ్యానిస్తూ దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
బీసీలకు 31 శాతం!
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కొంత స్పష్టత వచ్చింది. బీసీలకు 30–31 శాతం, ఎస్సీలకు 13–14 శాతం, ఎస్టీలకు 4–5 శాతం మేయర్, చైర్మన్ స్థానాలు రిజర్వుకానున్నాయి. మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న చైర్మన్/మేయర్ల స్థానాలను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం ఉదయం తన కార్యాలయంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేసి ప్రకటించనున్నారు. దీంతో మున్సిపాలిటీలు యూనిట్‌గా, మున్సిపల్ కార్పొరేషన్లు యూనిట్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న చైర్మన్, మేయర్ స్థానాలకు సంబంధించిన కచ్చితమైన రిజర్వేషన్ల లెక్కలపై స్పష్టత రానుంది. నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటినీ యూనిట్‌గా తీసుకుని చైర్మన్ స్థానాలకు, మున్సిపల్ కార్పొరేషన్లన్నింటినీ యూనిట్‌గా తీసుకుని మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్/మేయర్ స్థానాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా, 16–18 స్థానాలు ఎస్సీలకు, 4–5 స్థానాలు ఎస్టీలకు, 37–39 స్థానాలు బీసీలకు, మిగిలిన స్థానాలు జనరల్‌కు రిజర్వు కానున్నాయి. అదే విధంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనుండగా, ఎస్సీ లకు 1–2, ఎస్టీలకు 1, బీసీలకు 3–4 మేయర్ స్థానాలు రిజర్వయ్యే అవకాశాలున్నాయి. వార్డులు/డివిజన్లవారీగా రిజర్వేషన్లు... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న వార్డులు, డివిజన్ల సంఖ్యను ప్రకటిస్తూ శనివారం శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీని యూనిట్‌గా పరిగణించి స్థానిక వార్డుల రిజర్వేషన్లను, మున్సిపల్ కార్పొరేషన్‌ను యూనిట్‌గా తీసుకుని డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఒక్కో పురపాలికలో స్థానికంగా నివసించే ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలుపుకుని మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయిస్తారు. ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీల్లో మొత్తం 2,727 వార్డులుండగా, ఎస్సీలకు 386, ఎస్టీలకు 159, బీసీలకు 802 వార్డులను కేటాయించారు. ఎన్నికలు జరుగనున్న 10 మున్సిపల్ కార్పొరేషన్లలో 385 డివిజన్లుండగా, ఎస్సీలకు 49, ఎస్టీలకు 12, బీసీలకు 131 స్థానాలు వచ్చాయి. చాలా పురపాలికల్లో ఎస్టీలు ఒకరిద్దరు మాత్రమే ఉన్నా నిబంధనల ప్రకారం వారికి కనీసం ఒక వార్డు/డివిజన్‌ను కేటాయించారు. దీంతో ఎస్టీలకు సగటున 4.50 శాతం వరకు వార్డు/డివిజన్ స్థానాలు రిజర్వయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. అదే విధంగా సగటున బీసీలకు 31 శాతం, ఎస్సీలకు 14 శాతం వార్డు/డివిజన్ స్థానాలు రిజర్వయ్యాయని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు కానున్న వార్డులు/డివిజన్లను స్థానిక జిల్లా కలెక్టర్లు ఆదివారం ఉదయం డ్రా పద్దతిలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా, 22న పోలింగ్ జరుగనుంది. 25న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. -
సమైక్య ఉద్యమం
సాక్షి, హైదరాబాద్ : జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అదే ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదని, నిర్దేశిత 28% రిజర్వేషన్లు తప్పనిసరి చేయాల్సి ఉంటే 6–11% మాత్రమే అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కలి్పంచిన హక్కులను సాధించుకునేందుకు బీసీలు చేపడుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. బుధవారం సరూర్‌నగర్ స్టేడియంలో జరి గిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీలంతా కలిసికట్టుగా రిజర్వేషన్ ఉద్యమాలు చేపట్టాలన్నారు. జాతీయ బీసీ సదస్సు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీసీలకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీలకు రూ.1000 కోట్లు కేటాయించిందని, ఖర్చు విషయాన్ని పక్కనపెడితే బీసీల పట్ల కేంద్రం కంటే ఉదారంగా రాష్ట్రం వ్యవహరిస్తుందన్నారు. కేటాయించిన నిధులను తర్వాతైనా ఖర్చు చేయాల్సిందేనన్నారు. రాజ్యాంగం కలి్పంచిన హక్కులన్నీ సాధించుకునే వరకు ఉద్యమాన్ని ఆపొద్దని పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అన్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు ఐక్యంగా పోరాడితేనే డిమాండ్లు సాధించుకోవచ్చని అన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు వినతులు ఇచ్చే స్థాయిలో ఉంటే.. అతి తక్కువ జనాభా ఉన్న వర్గాలు మాత్రం పరిపాలించే స్థాయిలో ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి మహదేవ జనార్దన అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ప్రతి బీసీ ఉద్యమకారుడిగా ఎదగడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని అన్నారు. బీసీ జనగణన చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఈ ప్రక్రియ పూర్తి చేసి వివరాలను బహిర్గతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ డిక్లరేషన్ ఏమైంది?: జస్టిస్ ఈశ్వరయ్య రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ చేపట్టాలని జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ‘ఒక్క సంతకంతో ఈ డిమాండ్లన్నీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ.. దాని ఊసేలేదు. బీసీ డిక్లరేషన్ అమలు కావటం లేదు. దేశవ్యాప్తంగా బీసీల జనాభాను తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమం చేస్తేనే హక్కులు రక్షించబడతాయి. పాఠశాల విద్యను జాతీయం చేయాలి. ప్రాథమిక ఆరోగ్య విధానం మెరుగుపర్చాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కలి్పంచాలి. క్రిమిలేయర్‌ను వెంటనే తొలగించాలి. బీసీల అభ్యున్నతికి పలు కమిషన్లు ఇచ్చిన సూచనలు, రిపోర్టులు తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాం’అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. బడుగు, బలహీనవర్గాల నుంచి చట్టసభలకు ఎన్నికైతేనే వారి డిమాండ్లను ప్రభుత్వానికి చెప్పే అవకాశం వస్తుందన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులంతా ఐక్యంగా ఉద్యమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బీసీల సంక్షేమానికి కేంద్రం పలు సంక్షేమ పథకాలను తీసుకొచి్చందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు దేవేందర్ గౌడ్, బూర నర్సయ్య గౌడ్, సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు మహారాష్ట్ర, కేరళ, పాండిచేరీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 18 రాష్ట్రాల ఓబీసీ నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. చదువుతోనే చైతన్యం వస్తుందని, బీసీలంతా తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహించాలని సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. జాతీయ ఓబీసీ మహాసభ ముఖ్యమైన తీర్మానాలివే! కులాల వారీగా బీసీ జనాభాను ప్రభుత్వం బహిర్గతం చేయాలి వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ వర్గాలకు చెందిన వారికే ఈ శాఖ పగ్గాలు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన కేటాయించాలి బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి బీసీ రిజర్వేషన్లకున్న క్రిమిలేయర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కలి్పంచాలి ఎస్సీ, ఎస్టీల మాదిరిగా పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వ విభాగాల్లో ఉన్నత స్థానాల్లోని పోస్టుల్లోనూ బీసీ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలి బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇవ్వాలి -
బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే రాజకీయ సునామీనే..
సాక్షి, ఖమ్మం: బీసీలకు రిజర్వేషన్ తగ్గిస్తే రాజకీయ సునామీ సృష్టిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గింపును నిరసిస్తూ బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేకల సుగుణారావు అధ్యక్షతన ఆదివారం ఖమ్మం బైపాస్‌రోడ్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు, మహారాష్ట్రలో, ఏపీలో 60 శాతం పైగా రిజర్వేషన్ అమలు చేస్తుంటే, అక్కడ లేని నిబంధన తెలంగాణలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీసీలపై తీవ్రమైన రాజకీయ వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. 34 శాతం ఇస్తున్న రిజర్వేషన్లు సరపోవని, వాటిని 52శాతం పెంచాలని తాము డిమాండ్ చేస్తుంటే 22 శాతం తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో 18 జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ సభ్యుడు కూడా బీసీలు లేరని అన్నారు. 1980 సర్పంచ్ పదవులు సైతం కోల్పోయామన్నారు. 32 జెడ్పీ చైర్మన్ సీట్లలో బీసీలకు ఆరు మాత్రమే వచ్చాయని తెలిపారు. మహబూబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లో ఒక్క ఎంపీపీ కూడా బీసీలకు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది బీసీలు ఉండాల్సి ఉండగా, 22 మంది మంది మాత్రమే కొనసాగుతున్నారని వివరించారు. ఇది బీసీలను రాజకీయంగా సమాధి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారం సాధించుకునే దిశగా బీసీలు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ తగ్గించడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ తగ్గించడం వలన అత్యధికంగా నష్టపోయింది ఖమ్మం జిల్లా బీసీలేనన్నారు. 583 సర్పంచ్ పదవులు జిల్లాలో ఉంటే 240 మంది బీసీ సర్పంచ్‌లు ఎన్నిక కావాల్సింది, కేవలం 58 మంది మాత్రమే ఎన్నికయ్యారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లు తమ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, బీజేపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్ల వెంకటనర్సయ్య, టీజేఎస్ నాయకులు సోమయ్య, బీసీటీయూ రాష్ట్ర అధక్షుడు సుంకర శ్రీనివాస్, పంచవృత్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వినయ్‌కుమార్, వెంకటరమణ, విజయకుమార్, గాంధి, మామిడి వెంకటేశ్వర్లు, సోమన్నగౌడ్, రజకసంఘం నాయకులు సీతారామయ్య, లిక్కి కృష్ణారావు, శెట్టిరంగారావు, యాకలక్ష్మి, డాక్టర్ కేవీ.కృష్ణారావు, పాల్వంచ రామారావు, రామ్మూర్తి, శ్రీనివాస్, బచ్చల పద్మాచారి, ఆవుల అశోక్ పాల్గొన్నారు. -
ఒకటి అడిగితే సీఎం జగన్ రెండు చేస్తున్నారు..
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టించారని బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో బీసీల పార్టీలుగా చెప్పుకునే వాళ్లంతా బీసీలను మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిపారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పెట్టారు. కేంద్రం ఆ బిల్లును పెండింగ్‌లో పెట్టినా బీసీ బిల్లు కోసం పోరాడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చదవండి: బీసీ బిల్లుకు కేంద్రం నో బడ్జెట్లో కూడా బీసీలకు అత్యధికంగా రూ.15వేల కోట్ల నిధులు కేటాయించారు. అమ్మ ఒడి, విద్యార్థులకు రూ.20వేల మెస్ ఛార్జీలు, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాగైతే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో బీసీల జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే వైఎస్ జగన్ ప్రతి పథకంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అత్యధికంగా లబ్ది చేకూరేలా చేశారు. మంత్రివర్గంలో 60శాతం పదవులే కాకుండా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చారు. బీసీల కోసం నేను ఒకటి అడిగితే రెండు చేస్తున్నారు. సీఎం జగన్ వల్ల నాకు పోరాటం చేయడానికి సబ్జెక్టే లేకుండా పోయింది’ అని అన్నారు. కాగా చట్టసభల్లో ఓబీసీల జనాభా నిష్పత్తికి అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ‘ప్రైవేట్’బిల్లుపై జూన్ 21న సభలో సుదీర్ఘ చర్చ జరిగిన విషయం తెలిసిందే. -
కీలక బిల్లుపై ఓటింగ్‌కు విజయిసాయి రెడ్డి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం వాడీవేడీ చర్చ జరిగింది. ఆయన ప్రతిపాదించిన బిల్లుకు మెజారిటీ రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. బిల్లుపై ఓటింగ్ జరపాలని తొలుత విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. దానికి కాంగ్రెస్ మిత్రపక్షాలతో సహా అనేక పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే బిల్లుపై స్పందించిన కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిని నిరాకరించిన విజయసాయి రెడ్డి.. ఎట్టిపరిస్థితుల్లో కూడా బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. తాను ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అభ్యంతరం తెలపని ప్రభుత్వం.. ఓటింగ్ సమయంలో అడ్డుచెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. బిల్లును మరింత సమగ్రంగా ప్రవేశపెడతామని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 60 శాతం పదవులు వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామని రాజ్యసభలో ప్రస్తావించారు. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున సభలో సగం మంది సభ్యులు ఉండాలని సభ వైస్ ఛైర్మన్, సభ నాయకుడు వివరించారు. దీంతో బిల్లుపై ఓటింగ్ సాధ్యం కాదని మంత్రి రవిశంకర్ ప్రకటించారు. కేంద్రమంత్రి తీరుతో అసంతృప్తి వ్యక్తం చేసిన.. విజయసాయి రెడ్డి దానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై మరింత పోరాటం కొనసాగిస్తామన్నారు. -
కీలక బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక బిల్లును ప్రవేశపెట్టారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ.. రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. సభలో దీనిపై చర్చ ప్రారంభించిన ఆయన.. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్పీ, ఎస్టీ తరహాలోనే వెనుకబడిన వర్గాలైన బీసీలకు కూడా సమాన హక్కులను కల్పించాలన్నారు. అదే విధంగా బీసీలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. స్కిల్ డెవలెప్మెంట్ శాఖ కింద ఉన్న నిధులను వృత్తిపరమైన కులాలకు అందజేయాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాగా అంతకుముందు సభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి మరో మూడు ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. నేర శిక్షాస్మృతి సవరణ బిల్లు 2018, జనన మరణ రిజిస్ట్రేషన్ల సవరణ బిల్లు 2018, ది అన్ ఫైర్ టర్మ్స ఇన్ కాంట్రాక్ట్ బిల్లు 2018లను సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ అనుమతితో ఆయన సభలో సంబంధిత బిల్లులపై ప్రసంగించారు. -
జూన్ చివర్లో ‘పుర’ పోరు!
సాక్షి, హైదరాబాద్: పురపోరుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియగానే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. జూన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో పట్టణ, పురపాలకశాఖ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది. ఆలోపే కొత్త పురపాలక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుండటంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని భావించిన కేసీఆర్ సర్కారు.. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు కార్పొరేషన్లు, 136 మున్సిపాలిటీల్లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట పురపాలక సంఘాలు మినహా మిగతా వాటి పాలకవర్గాల పదవీకాలం జూలై ఒకటితో ముగియనుంది. ఈ నెలాఖరుకు ముసాయిదా... పురపాలక చట్టం ముసాయిదాపై కుస్తీ పడుతున్న ప్రభుత్వం.. ఈ నెలాఖరుకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు, పురపాలకశాఖ మాజీ డైరెక్టర్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), పురపాలక శాఖలు కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేసిన యంత్రాంగం.. పౌర సేవలు, పట్టణ ప్రణాళిక, ప్రజాప్రతినిధుల బాధ్యతపై చట్టంలో స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాకే పురపోరుకు వెళ్లనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో నయా చట్టానికి ఆమోదముద్ర వేసే దిశగా ఆలోచన చేస్తోంది. నూతన చట్టం మనుగడలోకి వచ్చాక వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలాఖర్లో లేదా జూలై మొదటి వారంలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వడివడిగా వార్డుల విభజన! వార్డుల పునర్విభజన ప్రక్రియపై పురపాలకశాఖ అంతర్గత కసరత్తును ప్రారంభించింది. ఎన్నికలపై ప్రభుత్వం సంకేతాలివ్వడం, కొత్త చట్టంలో పొందుపరిచే అంశాలపై కూడా స్పష్టత ఉండటంతో దానికి అనుగుణంగా వార్డుల డీలిమిటేషన్‌ను చేపడుతోంది. చట్టానికి ఆమోదముద్ర పడటమే తరువాయి ఎన్నికలకు వెళ్లడానికి అడ్డంకులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత పాటించలేదు. ఒక్కో వార్డులో 1,500 నుంచి 15 వేల వరకు జనాభా వరకు ఉంది. దీంతో తాజా చట్టంలోనూ వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను పొందుపరచనున్నారు. వార్డుల్లోని జనాభా ఒకే తరహాలో ఉండేలా శాస్త్రీయంగా విభజించనున్నారు. అలాగే మున్సిపాలిటీల గ్రేడింగ్పైనా స్పష్టత ఇవ్వనున్నారు. గతంలో ఐదు గ్రేడ్లుగా మున్సిపాలిటీలను వర్గీకరించారు. సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 మున్సిపాలిటీలు ఉండేవి. వాటిని గతేడాది మున్సిపల్ చట్ట సవరణలో తొలగించగా తాజాగా మళ్లీ గ్రేడింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా మూడు గ్రేడ్లకే పరిమితం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ గ్రేడ్లకు అనుగుణంగా పురపాలికల్లో వార్డుల సంఖ్య ఉండనుంది. బీసీల రిజర్వేషన్లే అసలు సమస్య... స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లలో ప్రధానంగా రెండు సామాజికవర్గాలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయన్న అభిప్రాయంతో మిగిలిన బీసీ వర్గాలు ఉన్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు బీసీ రిజర్వేషన్లను అన్ని కులాలవారీగా విభజించి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదు. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పును సమర్థించింది. అయినా ఈ రిజర్వేషన్లు అమలు కాలేదంటూ ఇటీవలే మళ్లీ ఆ వర్గాలు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఈ రిజర్వేషన్ల అంశం మరోసారి బయటకు వస్తే ఎన్నికలు మరికొంతకాలం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
‘స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలి’
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల సమస్య పరిష్కారమయ్యే వరకూ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 22% నుంచి 34% వరకు పెంచిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీ భవన్లో శనివారం చెరుకుల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లు లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారని, దీనిపై అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరుమెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లు యథాతథంగా అమలు జరపొచ్చని, దీనిపై సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరిపాలని కోరారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు చట్ట సభలు, స్థానిక సంస్థల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ డిమాండ్ చేశారు. చట్ట సభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఆదివారం ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు ఏళ్లుగా అన్యాయం జరుగుతున్నా శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతూ హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తుచేశారు. బీసీల హక్కుల గురించి అంతర్జాతీయ వేదికలకు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. త్వరలో దేశంలోని 29 రాష్ట్రాల్లో పర్యటించి బలమైన బీసీ ఉద్యమాన్ని తయారు చేస్తామని వెల్లడించారు. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల్లో బీసీలంతా జగన్ వెంటే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. జగన్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో 41 మంది బీసీలకు, ఎంపీ అభ్యర్థుల్లో ఏడుగురు బీసీలకు చోటు కల్పించడం హర్షించదగ్గ పరిణామం అని అన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీ మేరకు టికెట్లను కేటాయించడంతో మాట తప్పడు మడమ తిప్పడు అని మరోసారి రుజువైందని కృష్ణయ్య అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్‌కి తాము పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామని ఉద్ఘాటించారు. ఏపీ సీఎం చంద్రబాబు దుర్మార్గుడు అని.. అతడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు. -
బీసీలకు 94 ఎంపీపీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. మొత్తం 32 జిల్లా ప్రజాపరిషత్‌ల పరిధిలోని 535 మండల ప్రజాపరిషత్ (రాష్ట్రంలోని గ్రామీణ రెవెన్యూ మండలాలు)లలో 33 మండలాలు షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్నాయి. మిగతా నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని 502 మండలాల్లో 50 శాతం అంటే 251 మండలాల్లోని ఎంపీపీ స్థానాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వాటిలో ఎస్టీలకు 59 రిజర్వ్‌కాగా, ఎస్సీలకు 98, బీసీలకు 94 రిజర్వ్ అయ్యాయి. ఈ కేటగిరిలన్నింటిలోనూ మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వ్ చేశారు. మిగతా 251 అన్ రిజర్వ్డ్గా పరిగణిస్తుండగా అందులోనూ మహిళలకు 50 శాతం ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కేటగిరీలో మహిళలకు 125, పురుషులు/మహిళలు పోటీపడే విధంగా 126 ఎంపీపీ స్థానాలు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని వివిధ మండలాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఈ వర్గాల ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేశాక ఓటర్ల జాబితా ఆధారంగా బీసీలకు ఎంపీపీ స్థానాలు కేటాయించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్డు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 32 జిల్లాల్లోని మండలాలవారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు సందర్భంగా ఈ లెక్కలు తేలాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారీ ప్రసాద్ ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లను ఖరారు చేశారు. మహిళలకు 267 ఎంపీపీ స్థానాలు రిజర్వ్ అన్ని కేటగిరిల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించాలన్న నిబంధన నేపథ్యంలో వివిధ ఎంపీపీల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు సంబంధించి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాలు కలుపుకుని ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించి మొత్తం 142 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల మండలాల్లోని ఎంపీపీల్లో మహిళలకు 16, నాన్ షెడ్యూల్డ్ మండలాల్లో 30 ఎంపీపీలు ఎస్టీ మహిళలకు, 49 ఎస్సీ మహిళలకు, 47 బీసీ మహిళలకు ఎంపీపీ అధ్యక్ష స్థానాలు రిజర్వయ్యాయి. అంతేకాకుండా అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 125 ఎంపీపీ స్థానాలు మహిళలకు కేటాయించారు. మొత్తం కలిపి మహిళలకు 267 ఎంపీపీ అధ్యక్ష స్థానాలు ఖరారయ్యాయి. ఇవే కాకుండా మిగతా అన్ రిజర్వ్డ్ ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లోనూ పురుషులతో మహిళలు పోటీ పడే అవకాశాలున్నాయి. పునర్విభజనతో మారిన పలు మండలాల లెక్కలు... జిల్లా, మండల పరిషత్‌ల పునర్విభజన సందర్భంగా షెడ్యూల్డ్ మండలాలుగా ఉన్న బయ్యారం, గార్ల, గంగారంలను సరిగ్గా లెక్కించ లేదు. తాజాగా దాన్ని సరిచేయడంతో వాటిని షెడ్యూల్డ్ మండలాల జాబితాలో చేర్చారు. గతంలో జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేర్చడంతో జనగామ జిల్లా నుంచి ఆ మండలాన్ని మినహాయిం చారు. దీంతో ఆ జిల్లాలో మండలాల సంఖ్య 12కు తగ్గింది. కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో బీసీలకు మరో ఎంపీపీ స్థానాన్ని అదనంగా కేటాయించారు. ఆ మేరకు ఆ జిల్లాలో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఒక స్థానం తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ రిజర్వేషన్లలో మార్పుల కారణంగా మహిళా రిజర్వేషన్లలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో చోటుచేసుకున్న మార్పుల గురించి పీఆర్ కమిషనర్ తెలియజేశారు. -
శరద్‌పవార్‌తో బీసీ నేతల భేటీ..
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా రాబోయే యూపీఏ ప్రభుత్వం కచ్చితమైన హామీ ఇస్తుందని, ఇందుకు తగ్గట్టుగా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ వాగ్దానాన్ని చేరుస్తామని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ హామీ ఇచ్చినట్టు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం ఇక్కడ శరద్ పవార్‌ను ఆయన నివాసంలో బీసీ నాయ కులు కలిశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర బీసీ సంఘాల నేతలను ఆహ్వానించి బీసీ సమస్యలపై పవార్ అరగంట సేపు చర్చలు జరిపారని కృష్ణయ్య వివరించారు. అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారని పవార్ దృష్టికి తీసుకెళ్లారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇస్తే తప్ప ఈ కులాలకు న్యా యం జరగదన్నారు. దీనిపై పవార్ స్పందిస్తూ బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీల పక్షాన నిలబడతానని హామీనిచ్చినట్టు తెలిపారు. బీసీల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్ట డానికి అంగీకరించారన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, రవీందర్, నీల వెంకటేశ్, భూపేశ్ సాగర్, తాండూరు గోపీనాథ్ పాల్గొన్నారు. -
ఏం చేసారని బీసీ సభలు నిర్వహిస్తున్నారు?
-
నమ్మలేం బాబూ..!
-
‘నిబంధనలకు అనుగుణంగానే పంచాయతీరాజ్ ఆర్డినెన్స్’
సాక్షి, న్యూఢిల్లీ : పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ముందు పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను కుదిస్తూ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కృష్ణయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
ఆర్డినెన్స్ ప్రతులు చించిన బీసీ నేతలు
హైదరాబాద్: 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 22 శాతంకు తగ్గించి ఆగమేఘాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయడం హేయకరమైన చర్య అని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కన్వీనర్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సోమవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్ వద్ద ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రతులను చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 22 శాతంకు తగ్గించి మాకు బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీలను కలచివేస్తుందన్నారు. పంచాయతీలన్నీ ఏకగ్రీవం కావాలని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం రిజర్వేషన్లను కల్పించినట్లయితే కేటీఆర్ అన్న మాటను మేము ఆహ్వానించేవాళ్లమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తామంతా వ్యతిరేకంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బీసీ నేతలు పాల్గొన్నారు. -
సమైక్యంగా ఉద్యమిద్దాం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలతోనే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆగిపోదని, భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల కోత తప్పదని పలువురు నాయకులు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు, హక్కులకై పార్టీలకతీతంగా జెండాలు పక్కనపెట్టి బీసీలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుని టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని, ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజలను చైతన్యం చేయా లని బీసీ సంఘాలు, కుల సంఘాలను కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపును నిరసిస్తూ తెలంగాణ జన సమితి బీసీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిరాహా రదీక్షలు నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్తున్న సీఎం, పంచాయతీ ఎన్ని కల్లో ఇప్పటివరకు అమలు అవుతున్న 34% రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 50% దాటవద్దనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీ సంఘాలు, కుల సంఘాలు ఎవరి సంఘం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప బీసీలను సంఘటితం చేద్దా మనే చిత్తశుద్ధి కనబడడంలేదని వాపోయారు. టీజే ఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ తగ్గింపు పంచాయతీ ఎన్నికలకే పరిమితం కాదని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందన్నారు. రిజర్వేషన్లు ఆత్మగౌరవ హక్కుగా గుర్తించి దాన్ని కాపాడుకునేందుకు బీసీలు ఉద్యమించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, మంత్రివర్గం లేకుండానే బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం శోచనీయమన్నారు. కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లు తగ్గించారని.. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్య త్వ రద్దుపై రూ. 50 లక్షలు ఖర్చుచేసి, పెద్దపెద్ద అడ్వొకేట్లతో కోర్టులో వాదించిన ప్రభుత్వం రిజర్వేష న్ల తగ్గింపుపై మాత్రం స్థానిక అడ్వొకేట్లతోనే సరిపె ట్టిందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు తగ్గించే ఆర్డినెన్స్‌పైనే తొలి సంతకం చేయడం ద్రోహం చేయడమేనన్నారు. ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గం: దాసోజు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ దళితులు సామాజిక అంటరానితనానికి గురవుతుంటే, బీసీలు రాజకీయ అం టరానితనానికి గురవుతున్నారన్నారు. అసెంబ్లీలో, అఖిలపక్షంతో, కుల, బీసీ సంఘాలతో చర్చించకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గమన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఎందుకుండకూడదని అన్న కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు 22 శాతంకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం అన్యాయమన్నారు. సీపీఐ నాయకులు సుధాకర్, కాంగ్రెస్ నాయకులు వినయ్‌కుమార్, సీపీఐ (ఎంఎల్) నాయకురాలు ఝాన్సీ, టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, కె.దిలీప్‌కుమార్, పీఎల్ విశ్వేశ్వర్రావు, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ నాయకులు ఎదగకుండా చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్ : బీసీ నాయకులను ఎదగకుండా చేసే కుట్రలో భాగంగానే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపునకు నిరసనగా తెలంగాణ జనసమితి ధర్మాచౌక వద్ద ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు బీసీ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుత రిజర్వేషన్లే.. ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే రాజకీయ వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలపై ఉన్న కసితోనే కేసీఆర్.. రిజర్వేషన్లు తగ్గించారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం నుంచి 22 శాతం తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు జరిపించిందని గుర్తు చేశారు. జాతిని అమ్ముకుని టీఆర్ఎస్ బీసీ నేతలు రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేయాలన్నారు. ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం కాదని, బడి పిల్లలకు బడిలు కట్టివ్వాలని సూచించారు. రిజర్వేషన్లు తగ్గించడం వలన 1500 మంది బీసీలు సర్పంచ్ అయ్యే అవకాశం కోల్పోయారన్నారు. అన్ని పార్టీలు బీసీల రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాల నాయకులు ఉద్యమించాలని, ప్రపంచంలో చాలా మంది నేతలను చూసామని, కేసీఆర్ అంత కన్నా గొప్పవాడేమి కాదన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
బెర్త్‌లు ఎవరికి?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్లో పదవుల ముచ్చట్లు మొదలయ్యాయి. శాసనసభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన నేతలను శాసన మండలిలో ఏర్పడనున్న ఖాళీలు ఊరిస్తున్నాయి. ఎన్నికల ముందు అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేందుకు ఎమ్మెల్సీ ఆశలు కల్పించారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం చెప్పినట్టే వినడానికి పలువురు నాయకులు రాజీపడ్డారు. ఇప్పుడు శాసన సభ ఎన్నికలు ముగియడం, అనూహ్యమైన ఫలితాలు టీఆర్ఎస్కు రావడం, తమ తమ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపులో తమవంతు కృషి ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి నల్లగొండనుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత కర్నె ప్రభాకర్, నకిరేకల్ నియోజకవర్గంనుంచి మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పూల రవీందర్ ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్ స్వతంత్ర ఎమ్మెల్సీ అయినా, ఆయన టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నారు. ఇక, స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేసినా, ఇటీవల ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగుస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు జిల్లానుంచే రెండు ఖాళీలు ఉన్నాయి. ఇవే కాకుండా గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన స్థానాలు మరికొన్ని ఉన్నాయి. ఆశగా ఎదురుచూపులు వివిధ సందర్భాల్లో పార్టీ నాయకత్వం పలువురు నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చింది. ఆ సమయం ఇప్పుడు రావడంతో హామీలు పొందిన నేతలంతా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. స్థానిక సంస్థల నియోజకవర్గానికి పోటీ చేసి ఎన్నిక కావాల్సిందే. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పదవీ కాలం మరో ఆరు నెలలు ఉంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల సభ్యులు ఓటర్లుగా మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, కేవలం ఆరు నెలల గడువే మిగిలి ఉండడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతుందా..? లేక, స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలు వచ్చాక జరుగుతుందా..? అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చితో ముగియనుండగా, మరోమారు పూల రవీందర్ టికెట్ ఆశిస్తున్నా రు. ప్రస్తుతానికి ఆ పార్టీకి చెందిన ఉపాధ్యాయ నేతలెవరి పేర్లూ టీచర్ ఎమ్మెల్సీ పదవి కోసం తెరపైకి రాలేదు. ఇక, గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటాలో తమకు అవకాశం దక్కుతుందా, లేదా అన్న చర్చ కొందరు నేతల్లో మొదలైంది. రేసులో వేనేపల్లి ... వేముల ! కోదాడ నియోజకవర్గం నుంచి చివరి నిమిషం దాకా టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేక పోతున్నామని, మరో విధంగా ఆయన సేవలను వినియోగించుకుంటామని టికెట్ల ఖరారు సమయంలో పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. నామినేషన్ల ఆఖరి రోజు అభ్యర్థిత్వం ఖరారైన బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపులో వేనేపల్లి కృషి ఉందని, ఆయన ఎమ్మెల్సీ రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే మాదిరిగా, నకిరేకల్ నియోజకవర్గంనుంచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి గెలిపిస్తే.. వేముల వీరేశాన్ని ఎమ్మెల్యే కంటే పెద్ద పదవిలో చూస్తారని ఎన్నికల ప్రచార సభలో పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో వేముల ఓటమి పాలయ్యారు. పార్టీలో సంస్థాగతంగా వివిధ సమీకరణలు, అవసరాల రీత్యా వేముల పేరును ఎమ్మెల్సీ పదవికి పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డికి గతంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీ నెరవేరలేదు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన నల్లగొండ లోక్‌సభస్థానం నుంచి ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరును పరిశీలిస్తారా..? లేదా అన్న చర్చ జరుగుతోంది. సాగర్ నుంచి టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ నియోజకవర్గం నాయకుడు చాడా కిషన్ రెడ్డి తదితరులు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నవారి జాబితాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో ఒకరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మందికి చోటు కల్పించే అవకాశాల్లేవని, ఈ లెక్కన మరికొందరిని స్థానిక సంస్థల కోటా జరిగే ఎన్నిక వరకు వెయిటింగ్లో పెట్టే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘గుత్తా’కు చోటు దక్కేనా ? నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్ కేబినెట్లో బెర్తును ఆశిస్తున్నారు. ఆయనను శాసన మండలికి తీసుకుని మంత్రి పదవి కట్టబెడతారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఆయన పార్టీలో చేరే ముందు ఇదే హామీ ఇచ్చారని, గత ప్రభుత్వంలో అవకాశం కల్పించలేక పోయినందున, ఈసారి ఎమ్మెల్సీగా తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో గుత్తా ఎన్నికల బాధ్యతలు చూసిన దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దేవరకొండలో టీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించింది. ఈ రెండు స్థానాలతో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ ఆయన కొంత బాధ్యత మోశారు. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని మండలిలో గుత్తాకు చోట దక్కుతుందా..? లేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. -
ఆమెకు అందలం
జెడ్పీ సెంటర్, మహబూబ్‌నగర్ : మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో రాణించడం ద్వారా సమస్యల పరిష్కారం సులువవుతుంది.. అంతేకాకుండా సాధికారత కూడా సాధ్యమవుతుంది.. ఇదే భావనతో ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కేటాయించడంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నారీమణులు సిద్ధమవుతున్నారు. ఈనెలలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించగా.. జనరల్ స్థానాల్లో వారు పోటీ చేసేందుకు వెసలుబాటు ఉంది. తద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో అతివలకు కేటాయించిన 359 స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో కూడా వారు పోటీకి గెలిస్తే మహిళా సర్పంచ్ స్థానాల సంఖ్యే ఎక్కువగా ఉండనుంది. 26 మండలాల్లో 359 స్థానాల కేటాయింపు మహబూబ్‌నగర్ జిల్లాలో 26 మండలాలు ఉండగా.. 721 గ్రామపంచాయితీల్లో ఎన్నికల జరగనున్నాయి. ఇందులో 359 గ్రామపంచాయితీలు మహిళలకు రిజర్వేషన్ కావడంతో పోటీకి సిద్ధమవుతున్నారు. నూతన పంచాయితీ రాజ్ చట్టం ద్వారా మహిళలకు పెద్దపీట దక్కగా.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. అత్యధికంగా జిల్లాలో నవాబుపేట మండలంలో 27 స్థానాలకు మహిళలకు రిజర్వ్ కాగా, ఆ తర్వాత గండీడ్‌లో 25, మద్దూరులో 24, జడ్చర్లలో 23, మక్తల్‌లో 21, కోయిల్‌కొండలో 20 స్థానాలు దక్కాయి. అత్యల్పంగా మూసాపేట, కృష్ణా మండలాల్లో ఏడు చొప్పున స్థానాలకు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఇక మిగిలిన స్థానాల్లో కూడా పురుషులతో పాటు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతివల ఆనందం పంచాయితీ ఎన్నికల్లో సగం స్థానాలు దక్కడంతో నారీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మహిళలపై శ్రద్ధ కనబర్చి ఈ నిర్ణయాన్ని తీసుకుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. కలిసొచ్చిన రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల్లోని పలువురు మహిళలు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధికారత పంచాయతీల్లో రిజర్వేషన్ కారణంగా వేలాది మంది మహళలు రాజకీయం రంగంలోకి వస్తున్నారు. నాయకత్వం వహించాలని, రాజకీయాల్లో రాణించాలనే తపన ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు వరంగా మారాయి. సర్పంచ్‌లు గా, వార్డు మెంబర్లుగా గెలిచిన పలువురు ఇప్పటికే ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ మేరకు వారి స్ఫూర్తి, కలిసొ చ్చిన రిజర్వేషన్లు ఉపయోగించుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. సమస్యలు కూడా... చట్ట ప్రకారం మహిళలకు పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్ అందుతున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉంటం లేదనే విమర్శలున్నాయి. మహిళా రిజర్వేషన్ వచ్చిన చోట అప్పటికే ప్రజాప్రతినిధులుగా, రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్న వారు తమ కుటుంబం నుంచి మహిళను పోటీకి దింపి గెలిపించాక మళ్లీ తామే పెత్తనం చెలాయిస్తుండడం గమనార్హం. అయితే, సొంత తెలివితేటలు, కుటుంబ సభ్యుల సహకారం మాత్రమే తీసుకుంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న వారు కూడా ఉన్నారు. రాజకీయంగా రాణించేందుకు అవకాశం పంచాయితీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో రాజకీయంగా రాణించేందుకు ఎంతో దోహదపడుతుంది. ఇంటికే పరిమితమైన మహిళలు పలువురు రాజకీయల్లో రాణించేందుకు అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. రాజకీయాల్లో ఎదగాలంటే పల్లె స్థాయిలోనే మొదటి అడుగు పడాలి. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. – తిరుపతమ్మ, పీలేరు -
మోగిన పంచాయతీ నగరా
సాక్షి, వరంగల్ రూరల్: పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21, 25, 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ప్రకటించారు. జిల్లాలోని 16 మండలాల్లో 401 గ్రామ పంచాయతీలు, 3,544 వార్డులు ఉన్నా యి. మొత్తం ఓటర్లు 4,64,199 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,33,052, పురుషులు 2,31,138, ఇతరులు 9 మంది ఉన్నారు. అందులో బీసీలు 2,71,027, ఎస్సీలు 81,557, ఎస్టీ ఓటర్లు 72,363, జనరల్ 39,242 మంది ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ఎస్సీలకు 75, ఎస్టీలకు 101, బీసీలకు 69, అన్‌రిజర్వ్‌డ్‌కు 156 గ్రామపంచాయతీలు కేటాయించా రు. అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. ఈ ప్రక్రియనంతా డిసెంబర్ 29న పూర్తి చేశారు. మూడు విడతల్లో.. జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న మొదటి విడతలో 145 గ్రామపంచాయతీలు, 1,264 వార్డులకు, ఈ నెల 25న రెండో విడతలో 136 గ్రామపంచాయతీలు, 1,210 వార్డులకు, ఈ నెల 30న మూడో విడతలో 120 గ్రామ పంచాయతీలు, 1,070 వార్డులకు ఎన్నికలకు జరగనున్నాయి. మొదటి విడత.. మొదటి విడతకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 10న స్క్రూట్నీ, 11న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. గుర్తుల కేటాయింపు తర్వాత జనవరి 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. రెండో విడత రెండో విడత ఎన్నికలకు ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14న స్క్రూట్నీ, 15న ఉపసంహరణ ఉంటుంది. జనవరి 25న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడత మూడో విడతకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న స్క్రూట్నీ, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. జనవరి 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం ఎన్నికలు.. సాయంత్రం ఫలితాలు.. గ్రామపంచాయతీ ఎన్నికలను ఎప్పటిలాగే ఉదయం నిర్వహించి సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ను నిర్వహిస్తారు. మధ్నాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ప్రకటిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. గ్రామంలోని వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వార్డుల వారీగానే ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. వార్డుల లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించి అప్పటికప్పుడే ఫలితాలను ప్రకటిస్తారు. పూర్తిగా బ్యాలెట్ పేపర్లతో జరుగనున్న ఎన్నికలు కావడంతో కొన్ని గ్రామాల్లో ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఫలితంపై పోటీలో ఉన్న అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తే రీకౌంటింగ్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్‌కు రూ.2 వేలు డిపాజిట్.. జనరల్ స్థానంలో గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా పోటీ చేసే వారు రూ.2 వేలు, వార్డు మెంబ ర్కు రూ.500, రిజర్వేషన్ అయిన గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.1,000, వార్డు మెంబర్ స్థానాలకు రూ.250 డిపాజిట్ చెల్లించా ల్సి ఉంటుంది. ఐదు వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థులు రూ.50 వేలకు మించి ఖర్చు చేయొద్దు. 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థులు రూ.30 వేలకు మించి ఖర్చు చేయొద్దు అని రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది. తొలిసారిగా ‘నోటా’ ఎన్నికల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్న ఎన్నికల సంఘం తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటాను ప్రవేశపెట్టింది. ఇది బ్యాలెట్ పేపర్లో చివరి స్థానంలో ఉంటుంది. సర్పంచ్, వార్డు ఎన్నికల్లో ఒక్క ఓటుతోనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ సారి నోటా ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. మండలం పేరు జీపీలు వార్డులు చెన్నారావుపేట 30 258 నెక్కొండ 39 340 ఆత్మకూరు 16 152 దామెర 14 132 గీసుకొండ 21 188 మొత్తం 401 3,544 మండలం పేరు జీపీలు వార్డులు పరకాల 10 94 నడికుడ 14 138 శాయంపేట 24 212 నల్లబెల్లి 29 252 ఖానాపురం 20 178 రాయపర్తి 39 336 -
పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మంగళవారం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను ప్రభుత్వం 34 శాతం నుంచి 22శాతానికి తగ్గించిందని, ఈ నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల మూడో తేదీన (గురువారం) తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ అంశంపై కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. -
బీసీల లెక్కలు తేల్చాకే ‘పంచాయతీ’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకొని అసభ్యకర భాషలో విమర్శిస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సుప్రీంకోర్టుకు బీసీ జనాభా లెక్కలు సమర్పించి రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడి ఆదర్శ్‌నగర్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ద్వారా జరిగే మార్పులు ఏమీ ఉండవని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు తీవ్ర ప్రభావం చూపిందన్నారు. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల సంక్షేమం గురించి కేసీఆర్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. వివిధ పత్రికలు, చానెళ్లను చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో యాజమాన్యాలను బెదిరించడం అప్రజాస్వామికమన్నారు. సుధాకర్ సమక్షంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధికార ప్రతినిధి కాసుల కృష్ణ ఇంటి పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఇంటి పార్టీయేనని, అందుకే ఈ పార్టీలో చేరుతున్నానని కాసుల కృష్ణ తెలిపారు. సమావేశంలో ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్వర్లు, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, నేతలు కొమురయ్య, హరీశ్‌యాదవ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పంచాయతీ’పై రాద్ధాంతం ఎందుకు?: కరుణాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం తగదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22.79 శాతానికి పరిమితం చేయడాన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ఆదివారం ఇక్కడ ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నిరకాల రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించకుండా ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమిళనాడులో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్లున్నాయని, బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్లు లేవని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓసీలకు అన్యాయం జరగకుండా ఓసీలు అత్యధిక జనాభా ఉన్న గ్రామాలను ఇతర వర్గాలకు కేటాయించకుండా జనరల్ స్థానాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు రాజశేఖర్‌రెడ్డి, విశ్వేశ్వర్, ప్రవీణ్ కుమార్, విజయానంద్ పాల్గొన్నారు -
బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ రద్దు చేయాలి
హైదరాబాద్: పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపు ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్ 22కు తగ్గించడం హేయమైన చర్య అని విమర్శించారు. బీసీలను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్‌పై 15 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అఖిలపక్ష నాయకులు, న్యాయనిపుణులతో 10 నిమిషాలు మాట్లాడే సమయం కూడా సీఎంకు లేదా అని ప్రశ్నించారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు వి.జి.ఆర్. నారగోని మాట్లాడుతూ కేసీఆర్ బీసీలను దుర్మార్గమైన పరిస్ధితుల్లోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. 94 పంచాయతీరాజ్ చట్టంలో 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉందని, ఈ హక్కును తీసేసి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని సామాజికవేత్త ఉ.సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు ఎ.ఎల్.మల్లయ్య, లెల్లెల బాలకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామగౌడ్, ఓయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జాజుల లింగం, ప్రొఫెసర్ వెంకటేశ్, ఎం.జీతయ్య, ఎం. రాజేందర్, డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.