సాక్షి, విజయవాడ: బీసీలకు పార్టీపరంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు చేయలేని పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేశారని అభినందించారు. బీసీలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వేలల్లో పదవులు బీసీలకు వస్తాయని తెలిపారు. (బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తున్నాం)
స్థానిక ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెబుతారు..
బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అడ్డుకుంది చంద్రబాబేనని.. ఆయనే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించారని మండిపడ్డారు. రిజర్వేషన్లు అడ్డుకున్న టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెబుతారని కృష్ణయ్య పేర్కొన్నారు.(బీసీలకు 10 % అదనం)
Comments
Please login to add a commentAdd a comment