local body election
-
తెలంగాణలో వారం రోజుల్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్!
-
బీసీ రిజర్వేషన్లు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక.. ఈ బాధ్యత బీసీ కమిషన్‌కు అప్పగించటడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
One Nation One Election: ఆచరణ సాధ్యమేనా?
జమిలి. ప్రస్తుతం దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న పదం. అయితే లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నాప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగైదు అసెంబ్లీలకు మాత్రమే లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా అసెంబ్లీలకు విడిగా, వేర్వేరుగానే ఎన్నికలొస్తున్నాయి. వీటన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు పలు అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేయడం, కొన్నింటిని పొడిగించడమో, లేదంటే గడువు తీరాక సుప్త చేతనావస్థలో ఉంచడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనన్న అభిప్రాయముంది. లేదంటే లోక్‌సభ కొత్తగా తొలిసారి కొలువుదీరిన తేదీని ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించి, ఆ తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీల అన్నింటి గడువూ.. వాటి ఐదేళ్ల కాలపరిమితితో సంబంధం లేకుండా.. లోక్‌సభతో పాటే ముగిసే ప్రతిపాదనను అమలు చేయాలి. ఇలా ఒకసారి చేస్తే సరిపోతుందని, ఇక అప్పటి నుంచి జమిలి ఎన్నికలే ఉంటాయని కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందులో ఆచరణపరంగా ఎన్నో ఇబ్బందులున్నాయన్నది నిపుణుల మాట. అంతేగాక అసలు ఈ ప్రతిపాదన రాష్ట్రాల అధికారాల్లో అవాంఛిత జోక్యమే తప్ప మరోటి కాదని పలు పార్టీలు వాదిస్తున్నాయి. పైగా లోక్‌సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే జాతీయాంశాలే తెరపైకి వస్తాయని, రాష్ట్రాల్లోని స్థానికాంశాలు పక్కకు పోతాయని ప్రాంతీయ పారీ్టలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా డీఎంకే వంటి పలు పారీ్టలు జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం కూడా చేశాయి. పైగా హంగ్, అవిశ్వాస తీర్మానం నెగ్గడం వంటి ఏ కారణంతో అయినా గడువుకు ముందే చట్టసభ రద్దయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త సభ ఐదేళ్లు కాకుండా రద్దయిన సభలో మిగిలిన కాలావధి పాటు మాత్రమే కొనసాగాలని కోవింద్ కమిటీ సూచించింది. అలాగైతే జమిలి ప్రక్రియకు భంగం కలగకుండా ఉంటుందని పేర్కొంది. కానీ దీనిపైనా పలు పారీ్టలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రజాతీర్పు కోరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు కొనసాగరాదనడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని వాదిస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేకం: ఖర్గే ‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక మన దేశంలో ఆచరణ సాధ్యం కాదు. ఇలాంటి ఎన్నికలు రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్తకొత్త ఎత్తుగడలు వేయడం బీజేపీకి అలవాటే. ప్రజాస్వామ్య విరుద్ధమైన జమిలి ఎన్నికలను దేశ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరు’’ అది సంఘ్ పరివార్ రహస్య అజెండా ‘‘ఒకే దేశం–ఒకే ఎన్నిక అనేది దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఇది సంఘ్ పరివార్ రహస్య అజెండాలో ఒక భాగమే. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థను మార్చేసి అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని తీసుకురావాలన్నదే సంఘ్ పరివార్ అసలు కుట్ర. భారత పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీయాలన్న ఆలోచనను మానుకోవాలి’’. – పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి ప్రజలంతా వ్యతిరేకించాలి సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నిర్మాణాన్ని దెబ్బతీసే జమిలి ఎన్నికలను ప్రజలంతా వ్యతిరేకించాలి. ఒకే దేశం–ఒకే ఎన్నిక ద్వారా ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ కుతంత్రాలు సాగిస్తోంది. ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే ఏం చేస్తారు? – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనం చేసిన మంచి బతికే ఉంది: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదని స్పష్టం చేశారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రతీ ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందని, మేనిఫెస్టో అమలులో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్14) యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు వైఎస్ జగన్.చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులు వచ్చాయన్నారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్‌ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదన్నారు. యలమంచిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ కేడర్ బలంగా కనిపించడంతో చంద్రబాబులో భయం మొదలైందిదీనివల్లే పోటీనుంచి టీడీపీ విరమించుకుందిగత ఎన్నికలు ఎలా జరిగాయని మీరంతా చూసే ఉంటారుప్రజలకు ఆశ చూపి చంద్రబాబు మోసం చేస్తున్నారుమన ప్రభుత్వ హయాంలో మనంచేసిన మంచి ఎక్కడికీ పోలేదుప్రతి ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందిమేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పాంచంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాడుమన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయివాటికి వడ్డీలు కూడా ఉన్నాయివీటికితోడు కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులూ వచ్చాయిఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదుశ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదుకోవిడ్ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదుఎన్ని కష్టాలు ఉన్నా.. క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశాంఐదేళ్లపాటు క్యాలెండర్ తప్పకుండా పథకాలు అందించాంపథకాలను ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాందేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాంప్రతి కార్యకర్తకూడా ఇప్పటికీ ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలడుచెప్పించి మేం చేయగలిగాం అని చెప్పుకోగలడుఈ రెండున్నర నెలల పాలనలో ఒక ప్రభుత్వం మీద ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదురెండున్నర నెలల కాలంలో తీవ్రమైన ప్రజావ్యతిరేకత కనిపిస్తోందిప్రతి ఇంట్లో కూడా.. జగనే ఉండి ఉంటే.., వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉండే.. అన్న చర్చ జరుగుతోందిఈపాటికే అమ్మ ఒడి అందేది, రైతు భరోసా అందేది, రైతులకు పంటల బీమా అందేది: ఫీజురియింబర్స్మెంట్నేరుగా ఖాతాల్లో పడేదివసతి దీవెన కూడా అందేదిపొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ డబ్బులు పడేవి.. ఇప్పుడు ఇవేమీ అందలేదుపథకాలకోసం ఎవ్వరినీ అడగాల్సిన పనిలేకుండా సాఫీగా అమలు జరగేవిఇప్పుడు ఎవ్వరికీ ఏమీ రాకపోగా, చాలా దుర్మార్గాలు చేస్తున్నారుస్కూళ్లలో టోఫెల్ పీరియడ్‌ను ఎత్తివేశారు ఇంగ్లిషుమీడియం నడుస్తుందన్న ఆశ లేదుమధ్యాహ్న భోజనం ప్రశ్నార్ధకం అయ్యిందిడిసెంబర్లో ఇచ్చే ట్యాబులు లేనట్టేఇప్పుడు ఆర్డర్‌కూడా ఇవ్వలేదు ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతిందిఆరోగ్య శ్రీ బకాయిలు రూ.1800 కోట్లపైనే దాటిందిప్రభుత్వాసుపత్రుల్లో జీరో వేకెన్సీ అమలు చేశాంఇప్పుడు డాక్టర్లు ఉన్నారా? లేదా? అన్న పరిస్థితి కనిపిస్తోందిఆరోగ్య ఆసరా ఊసే లేదుమందులు లేవు, పరిశుభ్రత అంతకన్నా లేదుఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదురైతులు మళ్లీ క్యూలలో ఉండాల్సిన పరిస్థితి విత్తనాలకోసం ఇ- క్రాప్ పక్కనపడేశారుఉచిత పంటల బీమాను వదిలేశారుబియ్యం డోర్ డెలివరీ లేదుతెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, మళ్లీజన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది రెడ్ బుక్ పాలన కొనసాగుతోందిగ్రామస్థాయిలో కక్షలను ప్రోత్సహిస్తున్నారుమీరు చేయండి.. మేం చూసుకుంటాం అంటున్నారుదిశ యాప్ ఏమైందో తెలియడంలేదుదిశ నొక్కగానే 10 నిమిషాల్లో వచ్చేవారుఅన్నీ కూడా రెండున్నర నెలల్లోనే జరిగాయిఎక్కడా అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా ప్రజలకు మంచి చేశాంఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండిచంద్రబాబు మోసాలు చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుకష్టాలు లేకుండా సృష్టే ఉంటుందిచీకటి తర్వాత కచ్చితంగా వెలుగు వస్తుందిరాత్రి తర్వాత పగలు కచ్చితంగా వస్తుందినన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా కష్టపెట్టారు అయినా సరే.. మనం నిబ్బరంతో నిలబడగలిగాంమన వ్యక్తిత్వమే మనకు శ్రీరామ రక్షపార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెనక్కితగ్గాడుచంద్రబాబు సహజ నైజం ఇది కాదుఫోన్లు చేసి… అది ఇస్తా, ఇది ఇస్తా అనేవాడు ఎన్నికల సమయంలోకూడా చంద్రబాబు ఇదే తరహాలో ప్రచారం చేసేవాడునీకు 15వేలు, నీకు 18 వేలు అని ప్రచారంచేశాడుఅందర్నీ మోసం చేసి ఇప్పుడు అందరికీ క్యాబేజీలు పెట్టాడుఅలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరికీ కాల్స్ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపెట్టే ఉంటాడుకాని ధర్మం, న్యాయం గెలిచిందిమీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదుసంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీపెడాననటమే తప్పుకాని మీరంతా ఒక్కటిగా ఉండడం వల్లే విజయం సాధ్యమైంది. భీమిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఈ ఎన్నికల్లో ధర్మం, న్యాయానికి పాతరవేయాలని చూశారుఅదే అజెండాతో యుద్ధంచేయాలని చూశారుకాని మనం అంతా ఐకమత్యంగా ఉన్నాంప్రలోభాలకు లోనుకాకుండా మీరంతా గట్టిగా నిలబడ్డారుచివరకు అధర్మ రాజకీయాలు చేయాలనుకునేవాళ్లు తలొగ్గారు:సహజంగా పోటీపెట్టాలనే ఆలోచనకూడా వాళ్లకి రాకూడదుమనకు అంత మెజార్టీ ఉందిపార్టీ సింబల్మీద జరిగిన ఎన్నికల్లో వీళ్లంతా గెలిచారుపోలీసులను పెట్టి బెదిరించాలని చూశారుఏకంగా సీఎం ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారుమొన్న జరిగిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అన్నీ అబద్ధాలు చెప్పారు:నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు, రైతు కనిపిస్తే నీకు రూ.20వేలు అంటూ మోసపూరితమైన క్యాంపెయిన్ చేశారుచంద్రబాబు చెప్పిన అబద్ధాలకు కొంతమంది ఆశపడ్డారని అనిపిస్తుందిఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారుఐదేళ్ల పాలనలో మనం చేసిన మంచి ఎక్కడకీ పోలేదుఇవ్వాళ్టికీ మన కార్యకర్తలు, నాయకులు తలెత్తుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతారు:చంద్రబాబు అప్పుల భారాన్ని, వడ్డీలభారాన్ని మనంకూడా మోసాంకరోనా లాంటి మహమ్మారి కారణంగా రాష్ట్రం ఆదాయాలు పెరిగిపోయాయిఖర్చులు కూడా పెరిగిపోయాయికాని శ్వేతపత్రాల పేరుతో సాకులు చెప్పలేదు చంద్రబాబు అప్పులుగురించి, ఆ అప్పులు వడ్డీల గురించి మనం ఏరోజూ చెప్పలేదుమేనిఫెస్టోలో మనం చేసిన ప్రతి మాటనూ అమలు చేశాంచంద్రబాబులా చెత్తబుట్టలో వేయలేదుదేశచరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో క్యాలెండర్ పెట్టి అమలు చేశాంపథకాలను నేరుగా డోర్‌డెలివరీ చేశాంఇప్పడు ఏ ఇంట్లో చర్చ జరిగినా.. జగన్ ఉండి ఉంటే.. అన్నదానిపై చర్చ జరుగుతోందిజగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశచూపాడని అంటున్నారుచివరకు పలావు పోయింది, బిర్యానీ పోయిందనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందిజగనే ఉండి.. ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండి.. ఉంటే.. అన్న చర్చ జరుగుతోందిటీడీపీ వచ్చాక పథకాలు రాకపోగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయిప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి వైఎస్సార్సీపీ పాలనలో పెన్షన్ నేరుగా ఇంటికే అందేదిఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నదీ ప్రజలంతా చూస్తున్నారుకక్ష తీర్చుకోండి… పోలీసులు మీకు అండగా ఉంటారని టీడీపీ నాయకులు బాహాటంగా చెప్తోందిరెడ్బుక్ పాలన కనిపిస్తోందిప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితిలా అండ్ ఆర్డర్ నుంచి గవర్ననెన్స్, ఆరోగ్య రంగం, వ్యవసాయం, విద్యారంగం… ఇలా ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోతోందిమరో మూడు నెలల్లో టీడీపీ కార్యకర్త ఏ గడపకూ వెళ్లలేని పరిస్థితి ఉంటుందిప్రతి కుటుంబం కూడా టీడీపీని నిలదీసే పరిస్థితి వస్తుందినువ్వు చెప్పింది ఏంటి.. ఇప్పుడు జరుగుతన్నది ఏంటని అడిగే పరిస్థితికష్టాలు అనేవి ఉంటాయి, కాని అవి శాశ్వతం కాదుకష్టాలు ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలిప్రజలకు మనం తోడుగా ఉంటే చాలు.. వాళ్లే మనల్ని ఆదరిస్తారుటీడీపీ అబద్ధాలు, మోసాలతో విసుగెత్తిపోయే పరిస్థితి ఉంటుందివైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తొగ్గలేదు, ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి.. చంద్రబాబే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. -
‘స్థానిక’ ప్రక్రియ వేగవంతం చేయండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి కొత్త ఓటర్ల జాబితా అందిన వారంలోగానే ఆయా స్థానిక సంస్థలకు తగినట్లుగా ఓటర్ల జాబితాలు రూపొందించాలని చెప్పారు. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి నిర్దిష్ట గడువులోగా బీసీ కమిషన్ సైతం తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు, ఎన్నికలు సత్వరం నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టడానికి ఉన్న ఆటంకాలు ఏమిటని అధికారులను సీఎం ప్రశ్నించారు. దీంతో కొత్త ఓటర్ల జాబితా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు జాబితాలు పంపిందని, మనతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు మరో వారంలోగా జాబితాలు పంపించనుందని వివరించారు.కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వపరంగా కసరత్తు పూర్తయితే..అక్టోబర్ లేదా నవంబర్ చివర్లోగా ముందుగా పంచాయతీ, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె.కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకు ళాభరణం కృష్ణమోహన్‌రావు, సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, వేముల శ్రీనివాసులు, సంగీత సత్యనారాయణ, అజిత్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగానే రిజర్వేషన్లు?కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా లెక్కించి, ఆయావర్గాల వారీగా స్థానిక రిజర్వేషన్ల ఖరారుకు చాలా సమయం పడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇటీవలే ముగిసిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జారీ చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు పూర్తి చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లకు అనుగుణంగా ఓటర్ల జాబితాను రూపొందించి, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కాస్ట్ ఎన్యూమరేషన్ (కుల గణన) పద్ధతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై స్పష్టత సాధించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అదే సమయంలో ఓటర్ల జాబితాను అనుసరించి ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాపై ఒక అంచనాకు రావడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురవుతాయా అన్నది కూడా పరిశీలించనున్నట్టు తెలిసింది. కాగా వారం రోజుల్లో తాజా ఓటర్ల జాబితాలు అందగానే, వాటి ప్రాతిపదికన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రక్రియలో భాగంగా బీసీ కమిషన్ ఆధ్వర్యంలో తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బహిరంగ విచారణ పద్ధతుల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఇవి ముగిశాక రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీలు, సంఘాలతో నిర్వహించే అఖిలపక్ష భేటీల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఎన్నికల తేదీలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం స్పష్టతనిస్తుంది. ఆ వెంటనే ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రారంభించి, నెలన్నర, రెండునెలల వ్యవధిలోనే ప్రక్రియను పూర్తి చేయనుంది. -
జాతివాదం, మతవాదం కాదు 'రైతువాదం కావాలి'
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో, అన్ని జిల్లా పరిషత్‌లలో బీఆర్ఎస్ పోటీచేసి గులాబీ జెండాను ఎగురవేస్తుంది. గ్రామాల్లో మీ బలాన్ని చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇంతకుముందు తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని 80 గ్రామాల సర్పంచులు తీర్మానం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం భయపడిపోయింది. ఎంతో సంపద ఉన్న మహారాష్ట్రను పది పదిహేనేళ్లలో శక్తివంతమైన రాష్ట్రంగా మార్చవచ్చు. – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశంలో జాతివాదం, మతవాదాన్ని విడిచిపెట్టి.. రైతువాదాన్ని చేపట్టాలని.. అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు, రైతులకు న్యాయం జరగలేదని.. రైతు సర్కారు వచ్చినప్పుడే మన సమస్యలు తీరుతాయని చెప్పారు. మహారాష్ట్రలో తన సభకు జనం రాకుండా కొందరు ప్రయత్నాలు చేశారని, రైతులు తుపాన్‌లా విజృంభించినప్పుడు అలాంటి కుట్రలు పనిచేయవని స్పష్టం చేశారు. తనతో కలసి ఉద్యమించేందుకు రావాలని, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత తనదని చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలోని కాంధార్ లోహలో ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మీరు తెలంగాణలో పనిచేయండి, ఇక్కడేం పని అని నన్ను అడుగుతున్నారు. నేను భారత పౌరుడిని. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నాకు పని ఉంది. గతంలో నాందేడ్ పర్యటనకు వచ్చినప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడ మీకేం పని అని ప్రశ్నించారు. రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత సాగునీరు, ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు వంటివి అమలు చేసేంత వరకు మహారాష్ట్రలో రైతులతో కలిసి నా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ తరహాలో ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షల సాయం అందజేసే దళితబంధు పథకం అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర గడ్డపై అమలయ్యేంత వరకు వస్తూనే ఉంటా. నాందేడ్ ప్రజల ప్రేమ నన్ను ప్రతీసారి ఇక్కడికి వచ్చేలా చేస్తోంది. చంద్రాపూర్, షోలాపూర్, పశ్చిమ మహారాష్ట్రతోపాటు మరెన్నో చోట్లకు రావాలంటూ నాకు వినతులు అందుతున్నాయి. ఇక్కడ నా సభకు ప్రజలు రాకుండా చేసేందుకు మేకలను కోస్తూ దావత్‌లు ఇస్తున్నారు. రైతులు తుఫాన్‌లా విజంభించినప్పుడు ఇలాంటి కుట్రలు పనిచేయవు. నా అంచనా ప్రకారం మహారాష్ట్రలో త్వరలో విప్లవం వస్తుంది. ఆదివారం మహారాష్ట్రలోని కాంధార్–లోహలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తా.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. పార్టీలు, పాలకులు మారుతున్నా.. ప్రజల స్థితిగతుల్లో మార్పులు రావడం లేదు. స్వాతంత్య్రం తర్వాత మొరార్జీ, వీపీ సింగ్, చరణ్‌సింగ్, దేవేగౌడ వంటి కొందరు తప్పించి మిగతా 70 ఏళ్లలో.. 54ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్ల పాటు బీజేపీ పాలన సాగినా ప్రజల పరిస్థితిలో తేడా లేదు. దేశంలో సమృద్ధిగా సాగుయోగ్య భూమి, నీటి వనరులున్నా వ్యవసాయ రంగం దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. నదుల్లో వేలాది టీఎంసీల నీరు ప్రవహిస్తున్నా.. మహారాష్ట్ర సహా ఎన్నో ప్రాంతాల్లో తాగు, సాగునీరు లభించడం లేదు. వనరులను సద్వినియోగం చేయడంలో ఇక్కడి ముఖ్యమంత్రి, దేశ ప్రధాని ప్రతిబంధకంగా మారారనే విషయాన్ని గుర్తించండి. నాతో కలిసి ఉద్యమించండి. ప్రతీ ఎకరానికి నీరు అందించే బాధ్యత నాది. నా మాటలను ఇక్కడే వదిలి వెళ్లకుండా మీ గ్రామాల్లో, మీ కుటుంబాల్లో చర్చించండి. గులాబీ జెండా బలం తెలుసుకోండి రైతాంగ సమస్యలపై రైతులు 75 ఏళ్లుగా పోరాడుతున్నారు. నేటికీ మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్నారు. మరి వారు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎక్కడ పడుకున్నారు. రైతులు 13 నెలల పాటు ధర్నా చేసి 750 మంది ప్రాణాలు కోల్పోతే ఒక్కమాట మాట్లాడని ప్రధాన మంత్రి.. యూపీ, పంజాబ్ ఎన్నికలు రావడంతో తీయటి మాటలతో క్షమాపణ చెప్పాడు.మనం ఏకమై లక్ష్యం కోసం ఉద్యమించి బలాన్ని చూపినప్పుడు ఇలా నిప్పు మీద నీళ్లు చల్లినట్టుగా డ్రామాలు ఆడుతుంటారు. దేశంలో కులం, మతం పేరు మీద విభజింపబడి ఎంతకాలం పాలింపబడతామో అప్పటిదాకా మనం ఇలాగే మధనపడాల్సి వస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. రైతులు ఎవరికో ఒకరికి వేటు వేస్తారు కదా అనే ధీమాతో దేశంలోని రాజకీయ పార్టీలున్నాయి. రైతుల ఐకమత్యమే వారి దుస్థితికి విరుగుడు. గులాబీ జెండా బలం తెలుసుకుని మనమే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలమవుదాం. ఎంతవరకు మనం ఏకమవుతామనే విషయంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో, అన్ని జిల్లా పరిషత్‌లలో బీఆర్ఎస్ పోటీచేసి గులాబీ జెండాను ఎగురవేస్తుంది. గ్రామాల్లో మీ బలాన్ని చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇంతకుముందు తెలంగాణ మోడల్‌ను ఆమలు చేయాలని 80 గ్రామాల సర్పంచులు తీర్మాణం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం భయపడిపోయింది. తొమ్మిదేళ్ల క్రితం దారుణ స్థితిలో ఉన్న తెలంగాణ ఇప్పుడు గొప్ప ప్రగతితో ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటిది ఎంతో సంపద ఉన్న మహారాష్ట్రను పది పదిహేనేండ్లలో శక్తివంతమైన రాష్ట్రంగా మార్చవచ్చు. జై తెలంగాణ.. జై మహారాష్ట్ర.. జై భారత్’’ అంటూ కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు. సభలో ఎంపీలు బీబీ పాటిల్, సంతోష్‌కుమార్, దామోదర్‌రావు, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, షకీల్ అహ్మద్, బీఆర్ఎస్ కిసాన్‌సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హిమాంశు తివారీ తదితరులు పాల్గొన్నారు. కాంధార్, లోహ పట్టణాలు గులాబీమయం బీఆర్ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో కాంధార్, లోహ పట్టణాలు గులాబీమయంగా మారాయి. ప్రధాన రహదారుల వెంట బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలు కట్టారు. ఈ సభలో పాల్గొనేందుకు కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాంధార్ లోహకు వెళ్లారు. తొలుత కాంధార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న ధోంగ్డే నివాసానికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. తర్వాత ప్రత్యేక బస్సులో ర్యాలీగా లోహలోని బైల్‌బజార్ మైదానం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. వేదికపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, బసవేశ్వరుడు, బీఆర్ అంబేడ్కర్, అన్నా బాహుసాతే, మహాత్మా పూలే, అహిల్యాబాయి హోల్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సాయంత్రం 4.20కు బహిరంగ సభ ముగిశాక హైదరాబాద్‌కు తిరుగుపయనమైన కేసీఆర్ 5.45 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. బీఆర్ఎస్లో నేతల చేరిక సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు శంకరన్న ధోండ్గే, మాజీ ఎంపీ హరిభావ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ జాదవ్, డాక్టర్ వసంతరావు బోండేతోపాటు నాగ్నాథ్ ఘిసేవాడ్, సురేష్ గైక్వాడ్, యశ్పాల్ భింగే, జకీర్ చావ్స్, ప్రహ్లాద్ రొఖండో తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
అలహాబాద్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండానే అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ సౌరవ్ లావానియాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్ 5న ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 200 మున్సిపల్ కౌన్సిల్లో 54 ఛైర్పర్సన్ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 18 మహిలకు కేటాయించింది. అలాగే 545 నగర పంచాయతీల్లో 147 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించింది. అందులో 49 మహిళలకు కేటాయించారు. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో సుప్రీం కోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములానూ అనుసరించకుండానే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్లు. రిజర్వేషన్లు కల్పించే ముందు రాజకీయంలో ఓబీసీలు వెనకబడి ఉన్నారనే అంశంపై ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు సూచనలను ప్రభుత్వం అనుసరించలేదని కోరారు. అయితే, తాము రాపిడ్ సర్వే నిర్వహించామని, అది ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అనుసరిస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ పిల్‌పై శనివారం విచారించిన డివిజన్ బెంచ్ ఇరువైపుల వాదనలు విని తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. తాజాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఇదీ చదవండి: బూస్టర్ డోస్‌గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే? -
ఏపీ: మిగిలిన స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
'చెత్త డిబేట్లు.. సొల్లు కబుర్లతో శునకానందం'
-
సొల్లు కబుర్లతో శునకానందం: కొడాలి నాని
సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో టీడీపీ అండ్ కోకు బట్టలు ఊడిపోయాయని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. 'పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు అఖండమైన తీర్పు ఇచ్చారు. ప్రాంతాలు.. పార్టీలు.. వర్గాలు.. కులాలు చూడకుండా సీఎం వైఎస్ జగన్ సంక్షేమాన్ని అందించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మమ్మల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. జనసేన, టీడీపీ లోపాయికారీ ఒప్పందం వల్ల వారికి ఫలితం లేకుండా పోయింది. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారు. అన్ని చోట్ల అభ్యర్థులే లేకుండా 4 శాతం గెలిచామనటం హాస్యాస్పదం. కులగజ్జి ఉన్నవాళ్లు తప్ప చంద్రబాబుని ఎవరూ నమ్మడం లేదు. ప్రజా చీత్కారాన్ని తట్టుకోలేక బాబు దద్దమ్మలా మాట్లాడుతున్నారు. చెత్త డిబేట్లు, సొల్లుకబుర్లుతో కొంతమంది శునకానందం పొందుతున్నారు. ఎవరెన్ని పాట్లు పడ్డా మరో ముప్పై ఏళ్ళు వైఎస్ జగనే సీఎంగా ఉంటారు' అని కొడాలి నాని తెలిపారు. -
పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప మార్పులు
సాక్షి,విజయవాడ: పంచాయితీ ఎన్నికలలో స్వల్ప మార్పులు చేసినట్లు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఎన్నికలు జరగాల్సిన పంచాయితీలలో మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్ లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. మిగిలిన ఐదు మండలాలకు రెండవ దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. పంగులూరు, కోరిశపాడు, ఎస్.మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాలలో పంచాయితీలకి ఫిబ్రవరి 9కి బదులు 13వ తేదీన రెండవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలానికి 3వ దఫాకు బదులుగా 2వ దఫాలోనే ఎన్నికలు నిర్వహించనుండగా.. ఏలూరు డివిజనులోని నాలుగు మండలాలకు నాల్గవ దఫా బదులుగా మూడవ దఫాలోనే ఎన్నికలు జరపనున్నారు. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం,టి.నర్సాపురం మండలాలలోని పంచాయితీలకి ఫిబ్రవరి 21 బదులు ఫిబ్రవరి 17న మూడవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా పశ్చిమలో మిగిలిన మండలాలకు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం నాల్గవ దఫాలో ఎన్నికలు జరపనున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. -
'సంఘాలు ఏర్పడింది నిమ్మగడ్డ భజన కోసం కాదు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. 'సంఘాలుగా ఏర్పడింది నిమ్మగడ్డకు భజన చేసేందుకు కాదు.. ఉద్యోగుల హక్కుల కాపాడేందుకే ఏర్పడ్డాయి. ప్రభుత్వం చెబుతున్న వాదనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదో అర్థం కావడం లేదు. భయభ్రాంతులకు గురిచేసి ఉద్యోగులతో పనిచేయించలేరు. నిమ్మగడ్డ హెచ్చరికలకు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు.. ఉద్యోగులకు అండగా మేముంటాం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దురుద్దేశంతోనే నిమ్మగడ్డ ఉన్నారు. రాజ్యాంగం నిమ్మగడ్డ ఒక్కరికే కాదు.. ప్రతి పౌరుడికీ రాజ్యాంగ హక్కు ఉంది. ఉద్యోగుల పట్ల బెదిరింపు ధోరణి కుదరదు.. బెదిరించే తత్వాన్ని తాము ఎంత మాత్రం అంగీకరించం 'అని పేర్కొన్నారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం: చంద్రశేఖర్ రెడ్డి) -
టీడీపీకి, నిమ్మగడ్డకు ఎందుకంత తొందర?
సాక్షి, కాకినాడ : టీడీపీలో జాతీయ అధ్యక్షుడికి, రాష్ర్ట అధ్యక్షుడి మాటలకు పొంతనే లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 'కరోనా లేదు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అచ్చెంనాయుడు అంటే..కోవిడ్ రెండవ దశలో ఉందని చంద్రబాబు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడు చెప్పింది రాష్ట్ర అధ్యక్షుడు ఫాలో అవుతాడా? లేక రాష్ట్ర అధ్యక్షుడు చెప్పింది జాతీయ అధ్యక్షుడు ఫాలో అవుతున్నాడో అర్ధం కావడం లేదు. 26 కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు ఆపేస్తే నిమ్మగడ్డను ప్రశంసించారు. ఇప్పుడు రోజుకు 26 వేలకు పైగా కేసులు నమోదు అవుతుంటే మాత్రం టీడీపీకి, నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించాలన్న తొందర ఎందుకు వచ్చింది? చంద్రబాబు కార్యాలయం నుండి నిమ్మగడ్డకు ఆదేశాలు వస్తాయి. ఆ ఆదేశాలను నిమ్మగడ్డ పాటిస్తారు. ప్రజల్ని మోసగించడంలో పేటెంట్ తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు' అని వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. -
ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ‘నోటా’కు ఆస్కారం లేదు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్న చోట ‘నోటా’కు ఏ మాత్రం అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని తెలిపింది. ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ‘నోటా’ను ఉపయోగించుకోవచ్చునంది. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ‘నోటా’ను వినియోగించుకోవడానికి నిబంధనలు అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన నిబంధనలు రూపొందించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న చోట నోటాను వినియోగించుకునే అవకాశాన్ని ఓటర్లకు ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీవీ భద్ర నాగశేషయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. -
జనం దృష్టిలో తనే దోషి!
ప్రజాస్వామ్యంలో ప్రజాభిమానమే పాల నను నిర్ధారించే గీటురాయి. మాయదారి ఎత్తు గడలు, చౌకబారు వ్యూహాలతో తాత్కాలిక గెలుపు సంబరం సాధ్యమేమో కాని, అవే తుది విజయాలు కాజాలవు. పైగా పరాభవాలు తప్పవు! ఇది చరిత్ర చెప్పిన సత్యం. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలే నట్టే... కుట్రపూరిత ఎత్తుగడలతో ప్రజాహిత సత్కార్యాన్ని నిలువరించలేమన్నది రాజకీయ నేతలు గ్రహించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విపక్షనేత చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సిన పాఠమిది. శాశ్వతంగా, చివరకు తాత్కాలికంగానైనా ప్రజా ప్రయోజనాలకు అడ్డు తగలడం రాజకీయాల్లో ఆత్మహత్యా సదృశం! 1999 ఎన్నికలప్పుడు ‘దీపం’ పథకం విషయంలో కాంగ్రెస్ చేసిన వ్యూహపరమైన తప్పిదానికి ‘లబ్దిదారు’ అయిన చంద్ర బాబుకీ విషయం బాగా తెలుసు. బడుగులకు రాజకీయ సాధికారత, గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపన, పాతిక లక్షలకు పైబడ్డ కుటుంబాలకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టివ్వడం... ఇలా బహువిధ కార్యాచ రణ మొగ్గతొడిగి ఏపీలో ఇప్పుడిపుడే ప్రగతి రూపుదిద్దుకుంటోంది. అసాధారణ పథకాలతో దేశానికే ఏపీ దిక్సూచి అయ్యే సందర్బాన్ని దిగ్విజయంగా అడ్డుకున్నామనే సంబరం కొన్ని రాజకీయ పక్షాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ దుర్యోచన మేళానికి చంద్రబాబు కేంద్ర బిందువు! వాయిదాపడిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబం ధించి... వాతావరణం ఎలా ఉండింది, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చేసిందేమిటి, సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది, చివరకు ఏం జరుగుతోందన్నది తెలుగు ప్రజలు గమనిస్తున్నారు. కరోనా వ్యాధి నివారణ కోసమే ఎన్నికల వాయిదా ఆశిస్తే, చంద్ర బాబు ఆయన పరివారం చంకలు గుద్దుకొని సంబరపడాల్సిందేమీ లేదు! రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించి కరోనా మహమ్మారి పెనుముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు గంభీరంగా నిలబడాల్సిన సమయమిది. కానీ, అందుకు భిన్నంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. తాము ఆశించినట్టే ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఇది పాలకపక్షానికి ‘షాక్’ అని తెగ సంబరపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల సత్వర అమలును, కేంద్రం నుంచి నిధుల రాకను వాయిదా వేస్తున్నామన్న వాస్తవాన్ని సదరు శక్తులు గ్రహిం చడం లేదు. వారి చర్య, ప్రస్తుత ప్రగతి రథానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే! నిజానికి, ఈ పరిణామాన్ని కాస్త లోతుగా విశ్లేషిస్తే... రాజకీయంగా తామెదుర్కోబోయే ఘోర పరాజయ పరాభవాన్ని ఓ ఆరు వారాలు వాయిదా వేసుకోవడమే తప్ప బాబు–బృందం సాధించేది ఏమీ ఉండదు. ఇది క్షేత్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితి! శాసనసభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఇటువంటి వాస్తవాలనెన్నింటినో గ్రహించని చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నారు. రాజకీయంగా ఓ పతనం నుంచి మరో పతనానికి జారిపోతున్నారు. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, తన రాజకీయ శవపేటికపై తానే చివరి మేకు దిగ్గొట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నట్టు మేధావి వర్గం విశ్లేషిస్తోంది. రాష్టం ఎంతో నష్టపోయింది... స్థానిక స్వపరిపాలనపై బాబుకు సదభిప్రాయం లేదని గడచిన పాతి కేళ్ల రాజకీయ చరిత్ర చెబుతోంది. ఆయన పద్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా ఉంటే, తన హయాంలో స్థానిక సంస్థలకు ఒకే మారు (2001) ఎన్నికలు జరిపించారు. మిగతా అన్ని మార్లూ వాయిదాలే! పైగా రాజ్యాంగ లక్ష్యానికి, రాజీవ్‌గాంధీ హయాంలో జరిపించిన 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం నుంచి స్థానిక సంస్థలకు అధికారాలు, నిధుల బదలాయింపులకు ఆయనెప్పుడూ విముఖమే! అందుకే, ఏనాడూ ఈ బదలాయింపులకు ముందుకు రాలేదు. బాబు హయాం ముగిసి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతే సదరు బదలా యింపులు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత తాను తిరిగి ముఖ్య మంత్రి అయ్యాక కూడా స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరుగక ఆర్థికంగా రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2018 లో, ఎంపీపీ, జడ్పీలకు ఎన్నికలు 2019 లోనే జరిగి ఉండాల్సింది. ఈ జాప్యం వల్ల పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రావాల్సినంత రాలేదు. పదిహేనో ఆర్థిక సంఘం నిధులూ దక్కని ప్రమాదానికి పరిస్థితిని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండేళ్లుగా దాదాపు అయిదువేలకోట్ల రూపాయల నిధులు రాకుండా పోయాయి. ఇంకా జాప్యం జరిగితే, మరో రెండు వేల కోట్లకూ ఇబ్బందే! తన స్వీయ అనుభవంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెబుతున్నట్టు, తర్వాత కూడా ఆ నిధులు రాబట్టుకోవచ్చనేది నిజమే కావచ్చు! కానీ, సర ళంగా నిధులు వచ్చే అవకాశాన్ని చేజార్చుకొని, ప్రత్యేక వినతులతో కేంద్రం వద్ద పడిగాపులు గాచే పరిస్థితి అంత గొప్పదేం కాదు. వచ్చి తీరుతాయన్న నమ్మకం కూడా లేదు. అదే నిజమైతే, పద్నాలుగో ఆర్థిక సంఘం రెండో విడత రావాల్సిన వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటి వరకూ ఎందుకు రాలేదు? న్యాయస్థానం లోగడ నిర్దేశించినట్టు ఎన్ని కల ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు జరిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి తాజా పరిణామాలతో గండి పడింది. తేటతెల్లమైన దురుద్దేశాలు వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ తిరిగి ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎస్ఈసీకి సుప్రీంకోర్టు నిర్దేశించింది. సంప్రదించకుండానే ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని తప్పబట్టింది. అమల్లో ఉంటుందన్న ఎన్నికల నియమావళి (కోడ్)ని రద్దు చేయాలనీ నిర్దేశించింది. కోడ్ కొనసాగించడంలో హేతుబద్ధత ఏమిటన్న న్యాయ స్థానం ప్రశ్నకు ఎస్ఈసీ వద్దగాని, విపక్షం దగ్గర గానీ సమాధానమే లేదు. రాష్ట్రంలో విప్లవాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను ఎన్నికల ముందు అడ్డుకోవాలన్నది ప్రతిపక్ష పార్టీ తలంపు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఆశించిన పౌర సదుపాయాలు కల్పించ కూడదనేది వారి ఆశ! అందుకనుగుణంగానే, రాష్ట్రంలో కొనసాగు తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలిగించేలా ఎస్ఈసీ వ్యవహరించిందనేది పాలకపక్షం అభియోగం. ఎన్నికల నియమావళిలో చెప్పి, ప్రభుత్వం ఏర్పడగానే పథకం రచించి, నిధులు కేటాయించి, భూసేకరణ జరిపి, లబ్దిదారుల్ని గుర్తించి, ఉగాదికి ముహూర్తం ఖరారు చేసిన ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను ఈసీ నిలిపివేయమనడమే ఆశ్చర్యకరం. ఎన్నికల్ని వాయిదా వేస్తూ నియ మావళిని కొనసాగించడం సదరు దురుద్దేశాన్ని రుజువుపరిచింది. సర్వోన్నత న్యాయస్థానం కోడ్ అమలు వద్దంది. తదుపరి షెడ్యూల్ ఖరారైనపుడే కోడ్ అమల్లోకి తేవాలని నిర్దేశించింది. ఫలితంగా, ఇప్పుడు పాతిక లక్షల కుటుంబాల్లో సంతోషం ఉగాది ఉషస్సుగా మారనుంది. సొంతంగా స్థలాలున్న వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం, లేని వారికి ఇప్పుడు స్థలాలు ఇచ్చి, రానున్న నాలుగేళ్లలో ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఈ పథకం సమగ్ర స్వరూపం. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలుంటే, సుమారు 30 లక్షల కుటుం బాలకు సొంతిళ్లు లేవని, దేశంలో మరెక్కడా లేని విధంగా వారందరికీ (సంపూర్ణ/సంతృప్తికర స్థాయి) ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి విఘ్నం తొలగినట్టే! అందుకే, ఎటూ పాలుపోని విపక్షం ఇప్పుడొక కొత్త ‘లేఖా ప్రహసనా’నికి తెరలేపింది. రాజ్యాంగ, రాజకీయ, ఆశ్రిత మీడియా వ్యవస్థల నడుమ అదొక అంతర్నాటక మని తేలిపోతోంది. ఉనికికి ప్రమాదమనే! పంచాయతీ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా జన్మభూమి కమిటీలంటూ సమాంతర రాజ్యాంగేతర వ్యవస్థల్ని నడిపిన వారికి నిజంగానే కష్ట కాలమొచ్చింది. ఇప్పుడు పాలకపక్షం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముంగిట్లోకి తెచ్చింది. అన్ని పౌర సదు పాయాలు ఊళ్లోనో, వార్డులోనో దొరుకుతున్నాయి. కుల ధ్రువీకరణ నుంచి భూ యాజమాన్య హక్కుల వరకు, బర్త్ సర్టిఫికేట్ నుంచి వైద్య సదుపాయాల వరకు అన్నీ ముంగిట్లోనే లభించే వ్యవస్థ నెలకొంది. ఇవన్నీ కూడా ప్రజలతో ఎన్నికైన సర్పంచ్‌లు, కౌన్సిలర్ల నియంత్రణ లోనే జరుగుతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయ కుల చుట్టూ తిరగాల్సిన పని పౌరులకు లేదు. పైరవీ కారుల్ని ప్రాధే యపడే అవసరం రాదు. అధికారులకు లంచాలివ్వాల్సిన దురవస్థ అంతకన్నా తలెత్తదు. చనువున్న పాకలపక్ష నాయకులే కొందరు ముఖ్యమంత్రి వద్ద సనుక్కుంటున్నారు. ‘అన్నా... ప్రజలు మా వైపు చూడట్లేదు, వారికి ఎక్కడికక్కడే అన్ని పనులూ జరిగిపోతున్నాయి’ అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా చట్టాలు చేయడం, విధానాలు రూపొందించడం, వాటి అమలు కృషి వంటి రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి నాయకులకు ఏర్పడింది. ప్రజలు హర్షిస్తు న్నారు. విపక్షాలకిది గిట్టినట్టు లేదు. ఈ వ్యవస్థ ఇంతే సజావుగా సాగితే, ఇక తమ రాజకీయ ఉనికికే ప్రమాదమన్న భయం పట్టుకున్న ట్టుంది. లేకుంటే, వీటిని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అంతా గ్రహిస్తున్నారు నూరు వేటల్ని తిన్న రాబందు ఒక్క గాలివానతో కూలిందని సామెత! చిన్న చిన్న ఈదురు గాలుల్లో తప్పించుకున్నా... పెద్ద గాలివానలో నేల కూలడం ఖాయం. గత ఎన్నికల్లో వెల్లువలా వచ్చిన ప్రజాతీర్పును కూడా మన్నించకుండా, అన్నిసార్లూ తమ కుయుక్తులే ఫలిస్తాయను కోవడం రాజకీయ అవివేకం! వాయిదాలు తాత్కాలిక తృప్తినిస్తా యేమో గాని తుది విజయాల్ని అందించవు. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనలో గ్రామమే గుండెకాయ. సదరు గ్రామ పరిపాలన రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్య పంథాలో సాగే ప్రక్రి యల్ని అడ్డుకోవడం రాజకీయంగా తన గొయ్యి తానే తవ్వుకోవడం వంటిది! ఈ వైఖరి మార్చుకోకుంటే, సంక్షేమ–అభివృద్ధి కార్యక్ర మాల్ని ఆశించే సగటు పౌరుల దృష్టిలో చంద్రబాబు నిరంతర దోషిగా నిలవటం ఖాయం! పదేపదే తగిన మూల్యం చెల్లించడం అనివార్యం! వ్యాసకర్త : దిలీప్‌రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
'సీట్ల కేటాయింపులో వారికి పెద్దపీట వేశాం'
సాక్షి, విజయవాడ : విజయవాడ తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్లో బుధవారం వైఎస్సార్సీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రవల్లిక, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి 2, 3, 5, 6, 7 డివిజన్ల కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని డివిజన్ల అభ్యర్థులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపుల్లో యువకులకు, విద్యావంతులకు పెద్ద పీఠవేశామని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే వాయిదాకు కుట్ర పన్నారని విమర్శించారు. కరోనాను సాకుగా చూపి ఎన్నికల కమిషన్‌ను మేనేజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. బాబు ఎన్ని కుట్రలు పన్నినా విజయవాడ మేయర్ సీటును కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఉన్న 21 కార్పొరేషన్ స్థానాలు వైసీపీనే కైవసం చేసుకోనుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రూ. 135 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పేదలకు త్వరలోనే 25 వేల ఇళ్లపట్టాలను ఇవ్వనున్నామని, అమ్మ ఒడి పథకం ద్వారా నియోజకవర్గంలోని మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
'ఎన్నికల కోడ్ ఎత్తివేతను స్వాగతిస్తున్నాం'
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఎత్తివేయడం వలన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం యధాతధంగా జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసే మంచి పనిని అడ్డుకోవాలని ఎన్నికల సంఘం భావించదన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం వలన రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుందన్నారు. కాగా ఎన్నికలను వాయిదా వేసే ముందు విధిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనే విషయం ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గుర్తుచేసిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారని దుయ్యబట్టారు. -
ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలి : సుప్రీంకోర్టు
-
‘పరిపాలన స్తంభింప చేసే హక్కు ఈసీకి ఎక్కడుంది’
సాక్షి, కాకినాడ: చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలే అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఎన్నికల కమిషనర్ తరఫున చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యకరమని..ఎన్నికల కమిషనర్ పక్షపాత వైఖరి అవలంభించారని ఆయన మండిపడ్డారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సంక్షేమం దిశగా వెళ్తుందనే చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించారనే అక్కసు చంద్రబాబుకు ఉందన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు లేదని ఆయన మండిపడ్డారు. పరిపాలన స్తంభింప చేసే హక్కు ఈసీకి ఎక్కడుందని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. మీ ఇష్టానుసారం ఆదేశాలు ఎలా ఇస్తారని కన్నబాబు నిలదీశారు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో బాబు ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. కుల ఉన్మాదం చంద్రబాబులో మాత్రమే ఉందని కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు కుల ఉన్మాదం ఖండాంతరాలకు వ్యాపించిందని విమర్శించారు. అధికారం పోయిందనే నిరాశతో టీడీపీ నేతలు ఉన్నారని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సాఆర్సీపీ సత్తా చాటుతుందని కన్నబాబు ఆశావాదం వ్యక్తం చేశారు. వ్యవస్థలోని వ్యక్తులు తప్పులు చేస్తే ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
గోవాలో స్థానిక సంస్థల ఎన్నికలు
-
‘ఏపీ నాశనానికి చంద్రబాబు కంకణం’
సాక్షి, అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్ని శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఐదు వేల కోట్లకు పైగా నిధులు ఆగిపోతున్నాయన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించే అంశం అని పేర్కొన్నారు. కరోనా బూచి చూపించి ఎన్నికలను వాయిదా వేయడం దారుణమన్నారు. అసలు ఏపీలో కరోనా వైరస్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. (‘కుట్రలకు చంద్రబాబు మారుపేరు’) ఎలా వాయిదా వేస్తారు..? కనీసం హెల్త్ సెక్రటరీ, సీఎస్ ను సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం సరికాదన్నారు. రాజ్యాంగ విలువలు పాటించలేదన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావన్నారు. రాజ్యాంగ విలువలు గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసంతో ప్రజలు గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదని విమర్శించారు. మార్చి నెలాఖరులోపు ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావని తెలిసి కుట్రపూరితంగా ఎన్నికలను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన నీచపు పనిని ఆయన సమర్థించుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. (బెదిరించ లేదు, ఇది వాస్తవం: అంబటి) చంద్రబాబుకు కడుపు మండి పోతుంది.. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథాన నడవడం చూసి చంద్రబాబుకు కడుపుమండిపోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని’ ఆయన విమర్శించారు. ‘‘చంద్రబాబు హయాంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏకగ్రీవాలు జరగలేదా.. గతంలో 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి.. నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది నువ్వు కాదా’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడి వాయిదా వేయించిన అసమర్థుడిగా చంద్రబాబును ఉమ్మారెడ్డి అభివర్ణించారు. ‘‘ప్రజా బలంతో 151 స్థానాలు సాధించాం. సీఎం వైఎస్ జగన్‌పై చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే’ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. (చంద్రబాబు కనుసన్నల్లో రమేష్ కుమార్..) -
‘కుట్రలకు చంద్రబాబు మారుపేరు’
సాక్షి,అనంతపురం: కుట్రలకు మారుపేరు చంద్రబాబు అని.. స్థానిక ఎన్నికలను ఆయనే వాయిదా వేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభంజనం చూసి చంద్రబాబు భయపడ్డారని తెలిపారు. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ చౌదరి చంద్రబాబు మనిషి. కావాలనే ఇంటిపట్టాల పంపిణీ ఆపించి వేశారు. ఏపీలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుకున్నారని’’ నిప్పులు చెరిగారు. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే సీపీఐ నేతలు ముఖానికి మాస్క్‌లు కట్టుకుని నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారన్నారు. కరోనా వైరస్‌పై ఎల్లో మీడియాతో ప్రముఖంగా వార్తలు రాయించారని విమర్శించారు. వ్యూహాత్మకంగానే స్థానిక ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని ఆయన మండిపడ్డారు. (కరోనాకు, ఎన్నికల వాయిదాకు సంబంధమేమిటి?) దేశ ఎన్నికల చరిత్రలో చీకటి రోజు: తలారి రంగయ్య.. దేశ ఎన్నికల చరిత్రలోనే నేడు చీకటి రోజు అని..చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పనిచేయడం దురదృష్టకరమని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. స్థానిక ఎన్నికలు జరిగితేనే ఏపీకి ఐదువేల కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని ఆపే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదా.. వైఎస్సార్సీపీ మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవం అయితే ఎన్నికలు నిలిపేస్తారా అంటూ ఎంపీ రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. (చంద్రబాబు కనుసన్నల్లో రమేష్ కుమార్.. ) -
‘మరో 10 మంది వచ్చినా ఆశ్చర్యం లేదు’
సాక్షి, విజయవాడ: ఓటమి భయంతోనే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రలన్నీ ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. మీడియాలో కనిపించకపోతే ఆయనకు నిద్రపట్టదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై అన్నివర్గాలు సంతృప్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. (బాబు ఎంతకైనా దిగజారతాడు : విజయసాయిరెడ్డి) బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డారు.. చంద్రబాబుకు వత్తాసు పలికే పత్రికలు అసత్య కథనాలు రాస్తున్నాయని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు మోకాలడ్డారని ధ్వజమెత్తారు. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు పిటిషన్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో రకంగా అభివృద్ధిని అడ్డుకునేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబును నిజ జీవితంలో మహా నటుడిగా మంత్రి పెద్దిరెడ్డి అభివర్ణించారు. గవర్నర్‌ను కలిసి ఆయన అసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. (కడపలో టీడీపీకి మరో బిగ్‌షాక్) ఆ పరిస్థితికి టీడీపీ దిగజారింది.. సీఎం జగన్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితికి టీడీపీ దిగజారిందని ఆయన విమర్శించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు విబేధాలు సృష్టిస్తున్నారు. ఉగాది నాడు 25 లక్షలు మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు. ఈసీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని వికేంద్రీకరణతో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రాంతాల వారీగా చంద్రబాబు విబేధాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చూసి రాష్ట్రంలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదాను కూడా నిలుపుకునేటట్లు లేరని.. టీడీపీ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన ఆశ్చర్యం లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీకి ఓటమి తప్పదు: పార్థసారథి
సాక్షి, విజయవాడ: పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలు మాచర్ల ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. దివ్యాంగుడిని కారుతో ఢీకొట్టి టీడీపీ నేతలు పారిపోయే ప్రయత్నం చేశారని.. టీడీపీ నేతల వైఖరిపై స్థానికులు కోపోద్రిక్తులయ్యారని పేర్కొన్నారు. (‘ఆ స్థితికి టీడీపీ దిగజారిపోయింది’) గతంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమా ఐఏఎస్ అధికారిపై దాడి చేశారని పార్థసారథి గుర్తు చేశారు. గొడవలు సృష్టించడానికే 10 కార్లలో టీడీపీ నేతలు వచ్చారని ఆరోపించారు. గతంలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు ఇష్టారీతిన దాడులకు దిగారని దుయ్యబట్టారు. దౌర్జన్యం చేసి స్థానిక ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. డబ్బు,మద్యం పంపిణీ ఉండకూడదని చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. భయానక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని పార్థసారథి పేర్కొన్నారు. -
స్ధానిక ఎన్నికలు
-
లోకల్ వార్.. టీడీపీ బేర్
పల్లెపోరు వేడెక్కింది. గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ దూకుడుతో వెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. టీడీపీకి మాత్రం లోకల్ వార్ చెమటలు పట్టిస్తోంది. సరైన అభ్యర్థులు దొరక్క ఆ పార్టీ ఆపసోపాలు పడుతోంది. ఎంపీటీసీల పరిస్థితైతే మరింత దయనీయంగా ఉంది. క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు గ్రామాల్లో ముందుకు రావడం లేదు. ఓడిపోతామన్న భయం వారిని పట్టుకుంది. జెడ్పీటీసీల విషయంలోనైతే ఎక్కడా క్లారిటీ లేదు. ఇంతవరకు అభ్యర్థుల ఎంపికపై సమావేశం కావడం లేదంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. సమయం దగ్గరపడటంతో ఎవరో ఒకర్ని నిలబెట్టి, మమ అనిపించేద్దామనే అభిప్రాయానికొచ్చేశారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ ఒకపక్క నీరసంతో కుదేలు కాగా.. వైఎస్సార్సీపీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని భావిస్తున్నది. నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం ఒక ప్లస్ అయి తే, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందడం మరో ప్లస్‌గా నిలిచింది. ఈ రెండింటికన్నా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం మరింత అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడెక్కడ చూసినా వైఎస్సార్సీపీ తరపున పోటీ చేయాలన్న ఆత్రుతే కనబడుతున్నది. విజ యం సాధిస్తామన్న ధీమాతో ఆశావహులు పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జ్‌లకు అప్పగించడంతో ఆశావహుల తాకిడి మరింత ఎక్కువైంది. అయినప్పటికీ ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో అభ్యర్థుల ఎంపిక సులువైంది. నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలా స, పాతపట్నం నియోజకవర్గాల్లో దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా చోట్ల సోమవారం రాత్రి ఖరారు చేయనున్నారు. టీడీపీ పరిస్థితి దయనీయం ఒకప్పుడు జిల్లాలో ఆధిపత్యం చెలాయించిన టీడీపీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. చేసిన తప్పులు ఊరకనే పోవు అన్నట్టుగా ఆ పార్టీ క్లిష్ట పరిస్థితిలోకి వెళ్లిపోయింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలు, వనరుల దోపిడీ, జన్మభూమి కమిటీల ముసుగులో చేసిన అరాచకాలు టీడీపీ నేతలను వదలడం లేదు. జిల్లాలో ఎక్కడా వారికి సానుకూల స్పందన లేదు. ప్రతిచోట ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు పార్టీ అధిష్టానం అమరావతిని తలకెత్తుకోవడం మరింత ఇబ్బందిగా మారింది. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు నినాదంతో ముందుకెళ్లడం వలన ప్రజలు హర్షించడం లేదు. ఎక్కడికెళ్లినా నిరసనలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి ప్రతికూలంగా మారడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నారు. పోటీ చేసి ఓడిపోవడం కన్న తప్పుకోవడం మంచిదనే ఆలోచనకొచ్చారు. దీంతో ఆ పార్టీలో బలమైన నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడే నాయకులంతా ఇప్పుడు గమ్మున ఉంటున్నారు. ఇప్పుడీ పరిస్థితుల్లో పోటీ చేయడం అనవసరమని పక్కకు తప్పుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడా అభ్యర్థుల విషయంలో స్పష్టత లేదు. సాక్షాత్తు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో కూడా సరైన అభ్యర్థులు దొరకక అపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న ఇచ్ఛాపురంలో కూడా అదే పరిస్థితి నెలకుంది. జెడ్పీటీసీలకే ఇలా ఉందంటే ఎంపీటీసీల విషయంలో మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో పోటీ చేయడానికే భయపడుతున్నారు. పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించండని పెద్దగా ముందుకు రావడం లేదు. తప్పని పరిస్థితుల్లో పోటీ.. అధికారం ఉన్నంతకాలం బలమైన నాయకులుగా చెలామణి అయిన వారంతా ఇప్పుడు పోటీకి వెనకాడటంతో ఎవరో ఒకర్ని నిలబెట్టి బరిలో ఉన్నామనిపించుకునేందుకు టీడీపీ నేతలు ప్రస్తుతం ఆరాటపడుతున్నారు. కొందర్ని బతిమలాడి బరిలోకి దించేందుకు ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరికీ నయానో భయానో చెప్పి ఒప్పిస్తున్నారు. మొత్తానికి జిల్లాలో ఉన్న 38 జెడ్పీటీసీ స్థానాలకు, 668 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలబెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పోటీ చేస్తే చాలు మిగతావన్నీ తాము చూసుకుంటామంటూ భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ ఎందుకొచ్చిందని పలుచోట్ల వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపికపై సిట్టింగే కావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో గెలుపు సంగతి పక్కన పెడితే అభ్యర్థుల నిలబెట్టడమే సవాల్‌గా టీడీపీ నేతలు తీసుకుంటున్నారు. -
‘బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది ఆయనే’
సాక్షి, విజయవాడ: బీసీలకు పార్టీపరంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు చేయలేని పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారని అభినందించారు. బీసీలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వేలల్లో పదవులు బీసీలకు వస్తాయని తెలిపారు. (బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తున్నాం) స్థానిక ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెబుతారు.. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అడ్డుకుంది చంద్రబాబేనని.. ఆయనే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించారని మండిపడ్డారు. రిజర్వేషన్లు అడ్డుకున్న టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెబుతారని కృష్ణయ్య పేర్కొన్నారు.(బీసీలకు 10 % అదనం) -
ఎన్నికలకు ముందే చంద్రబాబు చేతులెత్తేశారు
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ముందే చేతులు ఎత్తేశారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారని విమర్శించారు. కోరోనా అంటూ ఎన్నికలను వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరడాన్ని విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. ఎన్నికలకు భయపడే చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో లేకపోయినప్పటికీ.. కరోనా అంటూ టీడీపీ అధికార ప్రతినిధులు విపక్షాలను బలహీన పరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. -
ఏపీ స్థానిక ఎన్నికలకు హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు అందజేసింది. మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎన్నికల సంఘం కార్యదర్శి పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జనవరి 17 నుంచి ఫిబ్రవరి 15 మధ్యలో పూర్తి చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 8 నుంచి మార్చి 3 మధ్యలో నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 10న ఎన్నికల సన్నాహాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని.. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశం అవుతామన్నారు. జనవరి 13న రాజకీయ పార్టీలతో భేటీ కానున్నట్టు తెలిపారు. అఫిడవిట్‌ను పరిశీలించిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతి ఇచ్చింది. (చదవండి: జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు మహిళలకే) ఈసీ అఫిడవిట్‌లోని అంశాలు.. జనవరి 17న ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 15లోగా ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి ఫిబ్రవరి 8న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి జనవరి 10న ఉన్నతాధికారులతో ఈసీ సమావేశం జనవరి 13న రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అత్యంత కీలకమైన రిజర్వేషన్లను సైతం ఖరారు చేసింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనమే లక్ష్యంగా సర్కారు పని చేస్తుందని చెప్పారు. మంత్రి నాని వివరించిన మంత్రివర్గ నిర్ణయాలు ఇలా.. ►2011 జనాభా గణన ఆధారంగా బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల దామాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం– 1994 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. ►ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి చేరవేసి, మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రాణాలు కాపాడాలనే ఉన్నతాశయంతో నాడు దేశంలో ప్రప్రథమంగా దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు గత అయిదేళ్లలో దారుణంగా తయారయ్యాయి. నిర్వహణ బాగోలేక వాహనాలకు కాలం చెల్లింది. జీతాల్లేక డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడం వల్ల గత అయిదేళ్లలో ఎందరో చనిపోయారు. ఈ నేపథ్యంలో 412 సరికొత్త 108 సర్వీసు వాహనాలను వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా రూ.71.48 కోట్లతో కొనుగోలు చేయాలి. ►ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 సర్వీసుల కోసం 656 వాహనాలను రవాణా వ్యయంతో కలిపి మొత్తం రూ.60.51 కోట్లతో మార్చి ఆఖరులోగా కొనుగోలు చేయాలి. ►కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో 6.04 ఎకరాలు కేటాయింపు. మార్కెట్ విలువ ఎకరా రూ.43 లక్షలు ఉన్నప్పటికీ ఎకరా రూ.లక్షకే కేటాయించాలని నిర్ణయం. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు బదలాయించేందుకు ఆమోదం. ►మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ ఇన్‌క్యాబ్ సీఎండీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించడం కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు అనుమతి. ►రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం సముద్ర ముఖపరిధిని కుదించాలని నిర్ణయం. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు కొత్త పాలసీ రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులు, 150 ఉప మార్కెట్ యార్డులు.. మొత్తం 341 చోట్ల వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేవలం కోతల సమయంలోనో, వ్యవసాయ ఉత్పత్తులు చేతికొచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులూ ఇవి పనిచేసేలా నూతన విధానం అమలవుతుంది. పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య (కొర్ర, అండుకొర్ర, అరిక, వరిగ, ఊద, సామలు) పంటలకు నేటికీ కనీస మద్దతు ధర కరువైన తరుణంలో ఏటా సాగు సీజన్‌కు ముందే వీటికి కనీస మద్దతు ధరలను ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది క్వింటాలు మిర్చికి రూ.7 వేలు, పసుపు రూ.6,350, ఉల్లి (కనీసం) రూ.780, చిరుధాన్యాలకు రూ.2,500గా కనీస మద్దతు ధర ఖరారు చేసింది. టమాటా, చీని, అరటి, నిమ్మ పంటలకు మద్దతు ధర ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటన్నింటికీ విధి విధానాలు ఖరారు చేయాలంటూ వ్యవసాయ మార్కెట్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. -
దత్తపుత్రుడు ఆరాట పడుతున్నాడు: బాలినేని
సాక్షి, కావలి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో సంపూర్ణ విజయాన్ని సాధిస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి చెప్పారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత మొట్ట మొదటిసారిగా జిల్లాకు వస్తూ కావలిలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జిల్లాలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటిని కూడా కచ్చితంగా అమలు చేసే తీరుతామని చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అభివృద్ధి పనులన్నీ కూడా అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉందని, జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు పది స్థానాల్లో వైఎస్సార్సీపీనే ప్రజలు గెలిపించారని మంత్రి గుర్తు చేశారు. దానికి ప్రతిఫలంగా తమ వంతుగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అటవీశాఖ అభ్యంతరాలు వల్ల దశాబ్దాలుగా నిలిచి పోయిన సాగునీటి కాలువలు నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని, అటవీ శాఖ అధికారులను అమరావతికి పిలిపించి సాగునీటి కాలువలు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం సీఎం అన్ని చర్యలు తీసుకొంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాలు రావడంతో వరదలు వచ్చి అన్ని చోట్ల నీరు ప్రవహిస్తుంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇసుక కొరత అంటూ రాజకీయాల కోసం రాద్ధాతం చేస్తున్నారని మంత్రి మండి పడ్డారు. పవన్‌కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని, చంద్రబాబు కోసం ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తే, తాను వెళ్లి సినిమాలు చేసుకొంటానని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. మరీ పవన్‌కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారంటే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నట్లే కదా అని మంత్రి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనపై సర్వే చేస్తే, సంక్షేమ పథకాల్లో 80 శాతం రాష్ట్రంలోని ప్రజలు ఆమోదం తెలిపారని మంత్రి వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కొండూరు అనీల్ బాబు, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
మున్పిపల్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్
-
మున్పిపల్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అందుకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 128 మున్సిపాలిటీలలో 121 మున్సిపాలిటీలతో పాటు 10 మున్సిపల్ కార్పొరేషన్లు అయిన కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, బడంగ్‌పేట, నిజాంపేట, బండ్లగూడ, జవహర్‌నగర్, మీర్‌పేటలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సాంకేతిక కారణాల దృష్యా, గడువు తీరక మరికొన్ని మున్సిపాలిటీల్లో తర్వాత జరగనున్నాయి. అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట, పాల్వంచ, మందమర్రి, మణుగూరు వంటి ఏజెన్సీ ప్రాంతాలు ఈ కేటగిరిలో ఉన్నాయి. కాగా, రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మున్సిపాలిటీలో ఉన్న జనాభా ప్రకారం ఒక పోలింగ్ కేంద్రానికి 800 ఓటర్లను కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ముందు లేదా తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాన్ని తీసుకోనుంది. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనుంది. -
మళ్లీ ఓటరు గణన
సాక్షి,కల్వకుర్తి : మున్సిపల్ ఎన్నికలను జూలైలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టీకే శ్రీదేవి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు గణనను ప్రారంభించాలని సర్క్యూలర్ జారీ చేశారు.వచ్చే నెల 2న మున్సిపాలిటీల పాలకవర్గ పదవీకాలం పూర్తి కానుంది.దీంతో పాలకవర్గం పూర్తయిన వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు గణన పూర్తి చేసి, జాబితాను రూపొందించేలా చూడాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో.. కల్వకుర్తి మున్సిపాలిటీలలో ఓటరు గణనను ఆయా మున్సిపాలిటీ అధికారులు,సిబ్బంది ప్రారంభించారు. మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేశారు. ఆయా గ్రామాల ఓటరు గణనను కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మహిళా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓటరు గణనను చేసి, గడువులోగా మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి పంపించాలని, మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ తిరిగి ఓటర్లను కులాల వారీగా గుర్తించాలని సర్కులర్లో ఉంది. అలాగే కులాల వారీగా గుర్తించిన ఓటర్ల వివరాలను మున్సిపాలిటీ పరిధిలోని రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలకు, ఆయా కార్యాలయాలలో ఓటరు జాబితాను ప్రదర్శించాలి. ఇంటింటికి తిరగకుండానే.. మున్సిపాలిటీలో గతంలో కులాల వారీగా నిర్వహించిన ఓటరు జాబితాను మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు. అయితే మున్సిపల్ సిబ్బంది మాత్రం వారికి ఇష్టం వచ్చినట్లుగా ఇంటింటికి తిరగకుండానే, ఓటరు గణను పూర్తి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారైన మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటరు గణను నిర్వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ∙ఈనెల 21న మున్సిపాలిటీ పరిధిలోని బీఎల్ఓలకు ఓటరు గణనను ఎలా నిర్వహించాలనే విషయమై శిక్షణ తరగతులు. ∙22నుంచి జూలై 4వరకు ఇంటింటికీ తిరిగి కులాల వారీగా ఓటరు గణనను చేయాలి. ∙జూలై 5న కులాల వారీగా ఓటరు జాబితా తయారు చేయాలి. ∙జూలై 6న డ్రాఫ్ట్ పబ్లికేషన్ పోలింగ్ బూత్ వారీగా తయారుచేసి సంబంధిత మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓటరు జాబితాను అందజేయాలి. ∙జూలై 7 నుంచి 11వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ. ∙జూలై 12 నుంచి 14వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలి. ∙జూలై 15నుంచి 16వరకు వచ్చిన అభ్యంతరాలపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, వాటిని గుర్తించాలి. ∙జూలై 17న అన్ని అభ్యంతరాల పరిశీలన తర్వాత ఓటరు జాబితాను తయారు చేయాలి. ∙జూలై 18న కులాల వారీగా ఫైనల్ ఓటరు జాబితాను తయారు చేయాలి. ∙జూలై 19న ప్రతిపాదిత ఫార్మాట్లో ఓటరు జాబితాను మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి పంపించాలి. ఓటరు గణన చేపడుతున్నం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి ఆయా మున్సిపాలిటీల్లో కులాల వారీగా, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతో కలుపుకొని ఓటరు జాబితాను సిద్ధం చేయమని సర్క్యూలర్ వచ్చింది. కులాల వారీగా మహిళా ఓటర్లను గుర్తించి వాటికి సంబంధించిన ఓటరు గణన పూర్తి చేసి, గడువులోగా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించాలని దేశాలు వచ్చాయి. దీంతో మున్సిపాలిటీలో విలీన గ్రామాలతో పాటు, పట్టణంలో ఓటరు గణనను ప్రారంభించాం. – చింత వేణు, కమిషనర్, కల్వకుర్తి మున్సిపాలిటీ -
ముగ్గురు పిల్లల గండం!
సాక్షి, చీమకుర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకుల ఆశలను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతూనే ఉంది. స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థలైన సర్పంచ్‌లు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల ఆటంకం అడ్డుగా మారిందనే ఆందోళన కొన్నేళ్లుగా పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు ఇబ్బందిగా మారింది. 1995 మే 29వ తేదీ తర్వాత నుంచి ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు అనర్హులు. అదే 1995 మే 29కి ముందు ముగ్గురు పిల్లలు కాదుగదా ఎంత మంది ఉన్నా పట్టింపు లేదు. అందుకే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 1995 మే డెడ్‌లైన్‌గా మారిందనే ఆవేదన పోటీల్లో ఉండే ఔత్సాహికుల్లో వ్యక్తమవుతోంది. ఒక వేళ పోటీ చేయాలనుకున్న వారికి డెడ్‌లైన్ తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నా వారిలో ఒకరు అనుకోకుండా చనిపోతే మళ్లీ వారు పోటీకి అర్హులే. ఇద్దరు పిల్లలు ఉండి పోటీ చేసే సమయానికి భార్య గర్భిణిగా ఉన్నా భర్త అయినా, భార్య అయినా పోటీచేయవచ్చు. స్థానిక సంస్థలపై మక్కువ తీరక కొంతమంది అత్యుత్సాహం చూపించి తమ ముగ్గురు పిల్లల్లో ఒకరిని బంధువులకు దత్తత ఇచ్చినట్లుగా చూపి తమకు ఇద్దరు పిల్లలే అని చెప్తుంటారు. కానీ దత్తత ఇచ్చినా దత్తత బిడ్డను కూడా మూడో బిడ్డగానే పరిగణించి పోటీకి అనర్హులుగానే అధికారులు పరిగణిస్తారు. మరికొంత మంది తమకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో తెలివిగా ఒక బిడ్డను వేరే బంధువుల ఇంటి పేరుతో పేరు మార్చి వేరే వారి లెక్కలో పెంచుతారు. అప్పుడు అలా ఇంటి పేరు మార్చిన తర్వాత అధార్ కార్డు, రేషన్‌కార్డులో తమ మూడో బిడ్డను వేరే ఇంటి పేరుతో చూపించి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద సంఘటనలు కోర్టుకు వెళ్లి తేల్చుకునే సరికి అడ్డదారిలో తమ బిడ్డ ఇంటి పేరు మార్చి గెలిచిన వ్యక్తి పదవీ కాలం కూడా పూర్తి కావస్తుందనే నమ్మకంతో బరితెగించి ఇలా అడ్డదారుల్లో పోటీకి దిగుతుంటారనే విమర్శలు కొంతమందిలో వ్యక్తం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి దాదాపు 6 నెలలు పైనే అయింది. మరో నెల రోజుల్లో మండల పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల అభ్యర్థుల పదవీకాలం పూర్తి కావస్తుంది. ఇప్పటికే చీమకుర్తి మండలంలో 23 పంచాయతీల్లో సర్పంచ్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో దాదాపు 85 సర్పంచ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. మరో నెల వ్యవధిలో 60 ఎంపీటీసీ సభ్యులు, నలుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలంతో పాటు చీమకుర్తి నగర పంచాయతీలో 20 మంది కౌన్సిలర్ల పదవీకాలం పూర్తికా వస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లల గండం స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో మళ్లీ చర్చకు తావిస్తోంది. కొత్తగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి సీఎంగా కొలువుదీరిన నేపథ్యంలో గతంలో 1995లో ఆ నాటి ప్రభుత్వం పెట్టిన జీవోను అలాగే ఉంచుతారా? లేక కొత్త ప్రభుత్వం చేస్తున్న పలు సంస్కరణల నేపథ్యంలో ముగ్గురు పిల్లల గండం జీవోను తొలగిస్తారా..? అనే ఆసక్తికరమైన చర్చ చోటామోటా నాయకుల్లో జరుగుతుంది. రేషన్ డీలర్లు పోటీకి అర్హులే కొన్ని గ్రామాల్లో రేషన్ షాపుల డీలర్లుగా ఉన్న వారు ఎలా పోటీ చేస్తారంటూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి రేగింది. ముగ్గురు పిల్లల జీవో ప్రకారం రేషన్ షాపుల డీలర్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ షాపులకు రాజీనామా చేయకుండానే పోటీ చేయవచ్చు. అంగన్వాడీ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు పోటీ చేసేందుకు అనర్హులుగా చట్టం చెబుతోంది. స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థల చైర్మన్లు, మతిస్థిమితం లేని వ్యక్తులు పోటీకి అనర్హులు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే వారిపై విధించిన శిక్షాకాలం ఐదేళ్ల లోపు వారు పోటీ చేసేందుకు అనర్హులు. కోర్టు విధించి శిక్షలపై స్టే, బెయిల్ తెచ్చుకున్నా పోటీకి అనర్హులే. ఉద్యోగులు పోటీ చేయాలంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన తర్వాత.. దాన్ని అమోదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. స్వగ్రామంలో ఓటు ఉంటేనే పోటీకి అర్హులు ముగ్గురు పిల్లల గండాలను అధిగమించి ఆసక్తి కలిగిన అభ్యర్థులెవరైనా పోటీ చేయాలంటే తప్పనిసరిగా వారు పోటీ చేసే పంచాయతీలో ఓటరుగా తమ పేరు నమోదై ఉండాలి. పోటీ చేయడంతో పాటు పోటీ చేసిన వారిని ప్రతిపాదించాలన్నా కూడా ప్రతిపాదించే వారికి కూడా ఓటు హక్కు అదే గ్రామ పంచాయతీలో ఉండాలి. పోటీ చేసే ముందు ముగ్గురు పిల్లల పరిస్థితిని చూసుకోవడమే కాకుండా ఓటరుగా తమ పేరు నమోదై ఉందా..? క్రిమినల్ కేసుల్లో ఎలాంటి చిక్కులు లేకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తేనే స్థానిక సంస్థల్లోలో పోటీచేసేందుకు అర్హులుగా నిలుస్తారు. పోటీ చేసిన అభ్యర్థిపై విజయం సాధించాలంటే విజయ మొక్కటే కాదు ముందుగా ముగ్గురు పిల్లల గండంతో పాటు ఓటు హక్కు, క్రిమినల్ కేసుల గొడవలన్నీ లేకుండా చూసుకుంటేనే స్థానిక సంస్థలకు రారాజులవతారని విశ్లేషకులు తమ అభిప్రారం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ హవా.. బీజేపీకి షాక్
సాక్షి బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 29న స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పుంజుకుంది. సార్వత్రిక సమరంలో విజయఢంకా మోగించిన బీజేపీ రెండోస్థానానికి పడిపోయింది. జేడీఎస్ ఒంటరిగా పోటీ చేసి మూడోస్థానంతో సరిపెట్టుకుంది. నగర, పురసభల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలువగా.. పట్టణ పంచాయతీల్లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఫలితాలు విడుదలైన 1,221 వార్డులకు కాంగ్రెస్ 509, బీజేపీ 366, జేడీఎస్ 174, బీఎస్పీ 3, సీపీఐ (ఎం) 2, ఇతరులు 7, స్వతంత్రులు 160 వార్డుల్లో విజయం సాధించారు. మొత్తం 63 స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ జారీ చేశారు. బెంగళూరు రూరల్, శివమొగ్గ స్థానాలకు ఈనెల 3న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 61 స్థానిక సంస్థల్లోని మొత్తం 1,326 వార్డులకు 30 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 1,296 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. కొన్ని వార్డుల్లో ఎన్నిక రద్దు కావడంతో రీపోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం 1,221 వార్డులకే ఫలితాలు వచ్చాయి. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ దాదాపు 42 శాతం దక్కించుకుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యాలతో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ఆ పార్టీ వెనుబడటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. (చదవండి: మోదీ మంత్రం.. కాషాయ విజయం) -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
సాక్షి, అనంతపురం సిటీ: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తన నివాసంలో నగరంలోని డివిజన్ కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అందరూ సమష్టిగా కృషి చేయడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూపాలన్నారు. నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని, 50 డివిజన్లలోనూ విజయఢంకా మోగించాలని ఆకాంక్షించారు. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూ చించారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను ఇప్పటికే విడుదల చేశారని, మార్పులు, చేర్పులు ఉంటే పరిశీలించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారని, కార్యకర్తలంతా కష్టపడి జాబితాలో చేర్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. పదవుల విషయంలో ఎవరికీ అనుమానాలు, భయాలు వద్దని, కష్టపడి పని చేసేవారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు విజయం సాధిస్తే సరిపోదని, కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటేనే నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లవచ్చన్నారు. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయామని, ప్రస్తుతం అలాంటి తప్పు జరగకుండా డివిజన్లలో కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్లాలన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే పోలింగ్ శాతం మరింత పెరిగేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా పొరపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే అన్నింటినీ కలిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం, పార్టీ సీనియర్ నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పెన్నోబుళేసు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, సాకే చంద్ర, కార్పొరేటర్లు బాలాంజనేయులు, జానకి, గిరిజ, శ్రీదేవి, డివిజన్ కన్వీనర్లు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆపేది లేదు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల వివాదాన్ని కారణంగా చూపుతూ స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియను నిలిపేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పంచాయతీరాజ్ చట్ట సవరణ, తదనుగుణ జీవో 81 చట్టబద్ధతను తేలుస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని, దీనికి అనుగుణంగా జారీ చేసిన జీవో 81ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ, చట్ట సవరణ తీసుకొచ్చిన ప్రభుత్వం, బీసీల రిజర్వేషన్ల విషయంలో స్పష్టతనివ్వలేదని తెలిపారు. చట్టంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం, ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించిన తరువాత మిగిలిన దానిని బీసీలకు ఇస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో ఒకలా, బీసీల విషయంలో మాత్రం భిన్నమైన వైఖరిని అనుసరిస్తోందన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే 50 శాతం ఇవ్వాల్సి ఉంటుందని, ప్రస్తుతం బీసీలకు 16 శాతం మేర రిజర్వేషన్లు దక్కుతున్నాయని, ఇది అన్యాయమన్నారు. బీసీల జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని ఇదే హైకోర్టు ఆదేశాలిచ్చినా, ప్రభుత్వం వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అలా అయితే మూడు వారాల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిస్తామని తెలిపింది. దీనికి కృష్ణమూర్తి స్పందిస్తూ, అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ధర్మాసనం నోటిఫికేషన్ ఇవ్వకుం డా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. తాము చట్ట సవరణ, జీవో 81 చట్టబద్ధతను తేలుస్తామంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
స్థానిక సమరానికి కాంగ్రెస్ సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల పోరుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల కోసం 32 జిల్లాలకు రాష్ట్ర సమన్వయకర్తలను నియమించారు. ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షులను, సమన్వయకర్తలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆదేశించారు. 16, 17 తేదీల్లో స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక అభ్యర్థుల నియామకాలపై చర్చలు జరపాలని సూచించారు. 18వ తేదీన 32 జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తుది అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని, 19వ తేదీన తుదిజాబితాను టీపీసీసీకి నివేదించాలని స్పష్టం చేశారు. -
ఎన్నికల బరిలో నిలిచేదెవరో..?
సాక్షి, సంస్థాన్ నారాయణపురం : ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో మరో సారి రాజకీయ వేడి మొదలైంది. పార్టీ ఎన్నికల గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో మండలంలో పోరు రసవత్తరంగా మారనుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైనవారు, అవకాశం లభించని ఆశావహులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎవరి ప్రయత్నలు వారు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా రిజర్వేషన్ కేటగిరి నాయకులు ఇప్పటికే పెద్ద నాయకులను సంప్రదించి తమకే సీటు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో సమరం నువ్వా నేనా? అనేవిధంగా సాగనుంది. గ్రామాల్లో అభ్యర్థుల ఎంపికపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు అభ్యర్థులు పార్టీ టిక్కెట్ ఇవ్వకున్నా స్వతంత్రగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులు పెట్టుకోవాలా.. వద్దా? సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. అవే పొత్తులు కొనసాగించాలా..లేదా? పార్టీ గుర్తుల ఎన్నికలు కాబట్టి ఒంటరి పోరులో ఉందామా? అని ఆలోచన చేస్తున్నారు. మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో సంస్థాన్ నారాయణపురం–1, జనగాం, పుట్టపాక, వావిళ్లపల్లి, గుజ్జ ఎంపీటీసీ స్థానాల్లో ఇతర గ్రామపంచాయతీలు లేవు. మిగతా 8 ఎంపీటీసీ స్థానాలలో పలు గ్రామపంచాయతీలు కలిసి ఉన్నాయి. అయితే ఎంపీటీసీగా పోటీ చేయనున్న అభ్యర్థులు పక్క గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లు, వచ్చిన ఓట్లు అంచనా వేసుకుంటున్నారు. పార్టీ గుర్తు వల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకొంటున్నారు. ఎన్నికలకు ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించాలని, దాంతో ఓటర్లకు దగ్గర అవుతారని కొంతమంది నాయకులు ఆలోచిస్తున్నారు. మరికొంత మంది నాయకులు మాత్రం ముందుగా ప్రకటిస్తే అభ్యర్థులకు ఖర్చు అధికమవుతుందని వాదిస్తున్నారు. బయటకు ప్రకటించకుండా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రకటించాలని కొంతమంది నాయకులు కోరుతున్నారు. రిజర్వేషన్లు ఇవే... జెడ్పీటీసీ సభ్యులు–జనరల్ మహిళ, ఎంపీపీ– జనరల్ మహిళ 1, చిల్లాపురం – ఎస్టీ జనరల్, 2.గుడిమల్కాపురం– జనరల్ మహిళ, 3. గుజ్జ– జనరల్, 4. జనగాం– ఎస్సీ మహిళ, 5. పల్లగట్టుతండా–ఎస్టీ మహిళ, 6. కంకణాలగూడెం– జనరల్ మహిళ, 7.నారాయణపురం 1–జనరల్, 8. నారాయణపురం–2– జనరల్, 9. పుట్టపాక–జనరల్ మహిళ, 10. సర్వేల్–1– ఎస్సీ జనరల్, 11. సర్వేల్–2– జనరల్ మహిళ, 12. వాయిలపల్లి– బీసీ జనరల్, 13 పొర్లగడ్డతండా– ఎస్టీ జనరల్ గా రిజర్వేషన్ ఖరారు చేశారు. -
పల్లెల్లో ‘స్థానిక ఎన్నికల’ సందడి
సాక్షి, భువనగిరి : పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కాకముందే మండల, జిల్లా పరిషత్ స్థానాలకు రిజర్వేన్లు ఖరారు కావడంతో నియోజకవర్గంలోనిమండలాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా ఖరారైన రిజర్వేషన్లపై చర్చ కొనసాగుతుంది. కాగా పలువురు ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండు నెలల పాటు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరగనుండడంతో పల్లెలో ఇప్పటినుంచే రాజకీయం వేడెక్కుతోంది. పోటీకి సై అంటున్న ఆశావహులు.. మండలపరిషత్ స్థానాలకు సంబంధించిన రిజర్వేన్లు ఖరారుకావడంతో నియోజకవర్గంలోని భువనగిరి, బీబీనగర్, వలిగొండ, భూదాన్ పోచంపల్లి మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలపై పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కొంత మందికి రిజర్వేషన్ కలిసిరావడంతో పోటీలో దిగేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థులు ఎంపీటీసీ ఎన్నికల్లోనైనా పోటీచేసి గెలుపొందాలని ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నియోజకవర్గంలో ఇలా.. భువనగిరి నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో 4 జెడ్పీటీసీ, 4 ఎంపీపీ, 54 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వలిగొండలో 17, భువనగిరిలో 13, బీబీనగర్‌లో 14, భూధాన్‌పోచంపల్లిలో 10 ఎంపీటీసీ స్థానాల చొప్పున ఉన్నాయి. -
ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు!
సాక్షి, అచ్చంపేట: వరుస ఎన్నికలతో మరోసారి పల్లెలు సందడిగా మారనున్నాయి. లోక్‌సభతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ వరకు ఎన్నికల కోలాహలం ఉండడంతో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ఇక అధికారులు ఓటర్లు, మున్సిపల్ వార్డులు, పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో తంతు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మమ్మురమైంది. ఇప్పటికే ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలోని 71మండల ప్రజాపరిషత్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఒక మండలం ఏజెన్సీ ఏరియాలో ఉంది. మిగిలిన 70మండలాల్లో 50శాతం అంటే 35మండలాల ఎంపీపీ స్థానాలను జనరల్‌కు కేటాయించారు. మిగిలిన వాటిలో ఏడు ఎస్టీలకు, 14 ఎస్సీలకు, 14 బీసీలకు రిజర్వ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన, బీసీ రిజర్వేషన్లు ఓటర్ల ప్రకారం నిర్ణయించారు. గతంలో ఇలా.. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీలు జిల్లా పరిషత్‌లో నామినేషన్లు వేయగా, ఎంపీటీసీలు ఆయా మండలాల్లో సమర్పించేవారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని సవరించి జెడ్పీటీసీలు మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మూడు ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించి నామినేషన్లు స్వీకరించే విధంగా నిర్ణయించారు. దీంతో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ అభ్యర్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో జిల్లాలో దూర ప్రాంతాల నుంచి జిల్లాకేంద్రానికే వచ్చి నామినేషన్ల పత్రాలు సమర్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఎన్నికల సంఘం వెసులుబాటు కలిగించడంతో ఊరట కలగనుంది. 600–700మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం 600 మంది నుంచి 700 మంది ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతు కావడంతో వాటిని తిరిగి చేర్పించేందుకు ఓటర్ల నమోదు ముసాయిదా నిర్వహించారు. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ ఓటర్లతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు 2లక్షల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాను ఆధారంగా చేసుకునే ఈ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్లను విభజించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల నూతనంగా తయారు చేసిన ఓటర్ల జాబితాను కలెక్టర్ ద్వారా తీసుకున్నారు. దాని ఆధారంగానే గ్రామాల వారీగా ఆయా వార్డుల జాబితాను తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీటి ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. అనంతరం ఎంపీటీసీల నియోజకవర్గాల వారీగా తయారు చేసి ఈ నెల 27న తుది జాబితాను ప్రకటించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొత్తగా పదర, చారకొండ, పెంటవెల్లి, ఊర్కొండ, వనపర్తి జిల్లాలో చిన్నంబావి, మదనాపురం, శ్రీరంగాపూర్, జోగుళాంబ జిల్లాలో కేటీ దొడ్డి, రాజోళి, ఉండవెల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మరికల్, మూసాపేట, రాజాపూర్, కృష్ణా మండలాలు ఏర్పడ్డాయి. పాత మండల పరిషత్‌లో ఉన్న ఈ మండలాల్లో కొత్త పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఏ జిల్లాకు ఆ జిల్లా జెడ్పీటీసీలతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపి ప్రస్తుతం 71 జెడ్పీటీసీ, 804 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్లకు లక్కీడిప్.. గద్వాల అర్బన్: ఎట్టకేలకు జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీనికోసం మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో కలెక్టర్ కె.శశాంక ఆధ్వర్యంలో లక్కీడిప్ తీశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాములు, డీపీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు నేడే
సాక్షి, నల్లగొండ : స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 5వ తేదీలోగా రిజర్వేషన్లను ఖరారు చేసి నివేదికలు పంపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్‌లతోపాటు మండలాలను నోటిఫైడ్ చేస్తూ గెజిట్‌ను కూడా విడుదల చేసింది. దీంతో జిల్లా పరిషత్ అధికారులు రిజర్వేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి అందించాల్సి ఉంది. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కోసం తయారు చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మొదట నిర్ణయించింది. ఆ మేరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించాలని గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించాలని ప్రస్తుతం నిర్ణయించింది. దీంతో ఆ ఓటర్ల జాబితా ప్రకా రమే రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. నేడు రిజర్వేషన్లు ఖరారు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను కలెక్టర్, ఆర్డీఓల ఆధ్వర్యంలో ఎంపీడీఓలు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ 5వ తేదీలోగా రిజర్వేషన్ తయారు చేసి నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్ ప్రక్రియను ఆయా కలెక్టర్లు, ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రక్రియ ముగియనుంది. వెంటనే అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే జిల్లా ఎంపీపీల రిజర్వేషన్ కోటా ఖరారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఆయా జిల్లాలకు కేటాయించిన ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో మొత్తం 71 మండలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం ఎస్సీలకు 12 ఎంపీపీ స్థానాలు, ఎస్టీలకు 10, బీసీలకు 13, అన్ రిజర్వ్డ్ కింద 36 ఎంపీపీ స్థానాలను రిజర్వ్ చేశారు. ఈ జాబితాను ఇప్పటికే ఆయా కలెక్టర్లకు పంపించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లకు ఫైనల్ అథారిటీ కలెక్టర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు ఇప్పటికే ఆయా జిల్లాకు కేటాయించిన ఎంపీపీ రిజర్వేషన్లను ఏయే మండలాలకు కేటాయించాలనేది మంగళవారం నిర్ణయిస్తారు. అదే విధంగా జెడ్పీటీసీ రిజర్వేషన్‌కు సంబంధించి కూడా రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. జి ల్లా యూనిట్‌గా తీసుకొని జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ చేయనున్నారు. ఎంపీటీసీల రిజర్వేషన్ బాధ్యత ఆర్డీఓలకు... ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఆర్డీఓల ఆధ్వర్యంలో చేయనున్నారు. ఆయా డివిజన్లలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో రిజర్వేషన్ ఎంపీడీఓలు చేడతారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ జనాభా ఆధారంగా చేస్తుండగా, బీసీ రిజర్వేషన్ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా చేపట్టనున్నారు. జెడ్పీ అధ్యక్షుడు, ఎంపీపీలు రాష్ట్ర యూనిట్‌గా.. జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీల రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్‌గా తీసుకొని చేయనున్నారు. ఇప్పటికే ఎంపీపీల కోటా ఏ జిల్లాకు ఎవరెవరికి ఎన్ని స్థానాలనేది ప్రకటించారు. జిల్లా పరిషత్ అ«ధ్యక్షుల రిజర్వేషన్ మాత్రం ప్రకటించలేదు. తేలిన ఉమ్మడి జిల్లా ఎంపీపీల రిజర్వేషన్ కోటా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 మండలాలు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 31 మండలాలు ఉండగా అందులో ఎస్సీలకు 5, ఎస్టీలకు 6, బీసీలకు 4, జనరల్ కేటగిరీలో 16 కేటాయించారు. సూర్యాపేట జిల్లాలో 21 మండలాలకు ఎస్సీ 4, ఎస్టీ 3, బీసీ 4, జనరల్ 12 కేటాయించారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు ఎస్సీ 3, ఎస్టీ 1, బీసీ 5, జనరల్ 8 స్థానాలుగా జిల్లా కోటాను నిర్ణయించారు. -
‘బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్ : బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా కేసీఆర్ అడ్డు పడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హన్మంతరావు ఆరోపించారు. శుక్రవారమిక్కడ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఆలోచనే పంచాయతీ ఎన్నికలని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ దాన్ని తగ్గించాడని ఆరోపించారు. బీసీల జనాభా 53 శాతం ఉంటే.. 33 శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమిళనాడులో ఇచ్చినట్లు తెలంగాణలో కూడా 69 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలను సర్పంచ్‌లు, జడ్పీటీసీలుగా కాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముస్లీంలకు ఎలాను రిజర్వేషన్లు పెరగవు.. బీసీలకైనా రిజర్వేషన్లు పెంచాలని కోరారు. కేసీఆర్‌కి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే రిజర్వేన్లు పెంచి.. 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి గురించి మీటింగ్‌లో చర్చించిన తరువాత కారణాలు చెప్తామని తెలిపారు. పార్టీలో కోవర్ట్లున్నారని.. ఈవీఎంల సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. -
స్థానిక సమరం.. ఖర్చు అధికం
సాక్షి, మచిలీపట్నం/చిలకలపూడి : స్థానిక సంస్థల సమరానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2018, జులై నెలాఖరుతో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్నాహాలు మొదలు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకు ఉత్తర్వులు అందాయి. జనాభా ప్రతిపదికన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారుచేసే అంశమై జిల్లావ్యాప్తంగా కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికకు ప్రధానమైన వ్యయం అంశంలో అధికారులు స్పష్టతకు వచ్చారు. వివిధ ఖర్చులకు గానూ రూ.17.72 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలకు రూ.4 కోట్లు మాత్రమే వెచ్చించారు. ప్రస్తుతం నిత్యావసరాలు, వివిధ సామగ్రి, ఇంధనం తదితర ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఎన్నికలకు ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో గత ఎన్నికల వ్యయానికి, ప్రస్తుత వ్యయానికి రూ.13.72 కోట్ల మేర వ్యత్యాసం ఏర్పడింది. గత ఎన్నికల ఖర్చు : రూ.4 కోట్లు ప్రస్తుత ఖర్చు : రూ.17.72 కోట్లు మొత్తం పంచాయతీలు : 970 పూర్తిస్థాయిలో పాలకవర్గంలేనిది : 1 ఉప సర్పంచ్ల ద్వారా నడుస్తున్నవి : 30 జిల్లావ్యాప్తంగా.. జిల్లాలో 49 మండలాలు, వాటి పరిధిలో 970 పంచాయతీలు ఉన్నాయి. అందులో 120 మేజర్ పంచాయతీలు. 2013లో అన్ని పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ప్రస్తుతం 49 పంచాయతీలను విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ముసాయిదా మేరకు రిజర్వేషన్ల కల్పన ఆయా గ్రామాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా విభజన జరగనుంది. ఈనెల 1వ తేదీ నుంచే ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం తీవ్రంగా కృషిచేస్తోంది. తద్వారా ఓటర్ల ముసాయిదా జాబితా వెలువడితే.. ఓటర్ల జాబితాను పంచాయతీల వారిగా రూపొందించి, ఓటర్లను కులాలవారీగా విభజించనున్నారు. విభజించిన ఓటర్ల జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పంచాయతీల్లో కులాలవారీగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతారు. ఎన్నికలా.. ప్రత్యేక పాలనా? ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్లనుందా? లేక ప్రధాన ఎన్నికల అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? అప్పటివరకు పాలనా సౌలభ్యం కోసం ప్రత్యేకాధికారుల పాలనతో కాలం వెల్లదీస్తారా? అన్న వాదనలు వినవస్తున్నాయి. పాలకవర్గాలు లేని వాటికీ ఎన్నికలు పంచాయతీ పాలక వర్గాలు లేని వాటికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1 పంచాయతీలో మాత్రమే పూర్తి స్థాయిలో పాలకవర్గం లేదు. మిగిలిన 30 పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లతో పాలన కొనసాగుతోంది. పాలకవర్గం లేని పంచాయతీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఓట్ల వివరాలు 2011 జనాభా లెక్కల ఆధారంగా, 29,25,100 మంది ఓంటర్లు ఉండగా, అందులో 14,68,763 మంది పురుషులు, 14,56,451 మంది మహిళలు ఉన్నారు. కానీ, ఈసారి ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 49 మండలాల పరిధిలో ఎస్టీ పురుషులు 51,331, మహిళలు 50,733 మంది ఉన్నారు. ఎస్సీ పురుషులు 3,50,376, మహిళలు 3,48,831 మంది. ఇతరులు 10,67,056 మంది పురుషులుండగా, 10,56,847 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల ఖర్చు రూ.17.72 కోట్లు ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు టీఏ, డీఏ, స్టేషనరీ కొనుగోలు, పోస్జేజీ, వాహనాలు, పబ్లికేషన్, ఎన్నికల బూత్‌ల వద్ద ఏర్పాట్లు, అధికారుల పర్యవేక్షణకు వినియోగించే వాహనాలకు ఇంధనం ఖర్చులకు రూ.17.72 కోట్లు అవసరమని పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వాటిలో ఖర్చు వివరాలు పరిశీలిస్తే.. సామగ్రి ఖర్చు ఓటర్ల జాబితా తయారీ రూ.90,21,290 ఎన్నికల సిబ్బందికి టీఏ, డీఏ రూ.4,57,83,600 స్టేషనరీ కొనుగోలు రూ.2,95,95,000 పోస్టేజీ, టెలిఫోన్ బిల్లులు రూ.2,00,000 వాహనాలు రూ.55,17,000 పబ్లికేషన్ రూ.3,22,00,000 పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లు రూ.5,34,35,000 ఇంధనం (వాహనాలకు పెట్రోల్, డీజిల్) రూ.14,16,000 న్యాయవాదుల ఫీజులు రూ.1,00,000 -
గుజరాత్ ప్రభుత్వం వినూత్న బిల్లు!
ఆహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన ప్రతిపాదనతో ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టనుంది. స్ఠానిక సంస్థల ఎన్నికల్లో ఓటు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. ఓటు వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిబంధనను బిల్లులో పెట్టనున్నారు. అయితే గుజరాత్ సీఎం ఆనందిబెన్ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. Follow @sakshinews -
‘స్థానిక’ పీఠాలకు ఎన్నికలు
-
వరంగల్‌లో ఏడుచోట్ల ప్రారంభం కాని కౌంటింగ్
వరంగల్ జిల్లాలోని ఏడు కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమే కాలేదు. దీంతో అక్కడి అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం తర్వాత మాత్రమే కౌంటింగ్ ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. వరంగల్ జిల్లాలో కేవలం అతికొద్ది ఎంపీటీసీ స్థానాల ఫలితాలను మాత్రమే ప్రకటించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. పలు మండలాల్లో కౌంటింగ్ ప్రారంభం కాకపోవడంతో విషయం ఏమిటో తమకు తెలియట్లేదని అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఫలితాలు వస్తుండగా, ఇక్కడ మాత్రమే సమస్య ఎందుకొచ్చిందని అడిగారు. -
ఓటుకు ‘జానా’ దూరం!
నాగార్జునసాగర్,న్యూస్‌లైన్ : మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్ కూడా ఉంది. కానీ ఆయన ఓటు వేయలేకపోయారు. అది ఎలాగనుకుంటున్నారా? నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సిబ్బంది నివాసం ఉండడానికి క్వార్టర్లు నిర్మించారు. కాలక్రమేణా ఇతరులూ ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. నాటి నుంచి నేటి వరకు సాగర్‌ను అధికారులు అటు గ్రామపంచాయతీగాను, ఇటు మునిసిపాలిటీగాను గుర్తించలేదు. దీంతో ఇక్కడి వాసులకు కేవలం సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే ఓటేసే అవకాశముంది. నల్లగొండ జిల్లా పరిధిలోకి వచ్చేసాగర్లోని హిల్‌కాలనీలో 6,150 మంది, పైలాన్‌కాలనీలో6,248 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో జానారెడ్డి కుటుంబసభ్యులూ ఉన్నారు. 89వ పోలింగ్ కేంద్రం పరిధిలో 897 వరుస సంఖ్య నుంచి జానారెడ్డి కుటుంబసభ్యుల ఓట్లు నమోదై ఉన్నాయి. -
వారం ఆగాల్సిందే
సాక్షి, నెల్లూరు : పుర ఎన్నికల ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత నెల 30న జిల్లా వ్యాప్తంగా పురపాలక ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలపై ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయని, వాటి ఫలితాలను వాయిదా వేయాలని కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న కౌంటింగ్ జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ప్రజానీకానికి మరో వారం పాటు టెన్షన్ తప్పదు. జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన రాజకీయపార్టీల మధ్య హోరాహోరీగా పోరులో విజయాలు ఎవరిని వరిస్తాయో తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంది. జిల్లాలో ఏ నలుగురు ఒకచోట కలిసినా ఎన్నికల ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూంల వద్ద బందోబస్తు పోలీసులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది ఎప్పుడెప్పుడు తమ బాధ్యతలు పూర్తవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మరి కొద్ది రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల పర్వం పూర్తయిందనిపిస్తే ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతలు చూడాల్సి ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ తంతు త్వరగా ముగించాలని చూస్తోంది. అయితే మరో వారంకైనా ఫలితాలు విడుదలవుతాయా? లేక సుప్రీంకోర్టులో అడ్డంకి ఏర్పడుతుందా అనే అనుమానం లేకపోలేదు. -
ఐదేళ్లకోమారు ఎన్నికలంటే చట్టం మార్చాలి
స్థానిక సంస్థల పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: చట్టసభల మాదిరిగా స్థానిక సంస్థలకూ క్రమం తప్పకుండా ఐదేళ్లకోమారు ఎన్నికలు నిర్వహించాలంటే.. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉందని, అది రిజర్వేషన్లు ప్రకటిస్తే తప్ప.. తాము ఎన్నికల నిర్వహణకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలు ప్రతీ ఆర్నెల్లకో మారు వాయిదా వేసుకొంటూ పదేళ్లపాటు నిర్వహించకుండా వెళ్లే అవకాశం ప్రభుత్వానికి ఉందని ఆయన వివరించారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకోవడానికి అవకాశం ఉందన్నారు. రిజర్వేషన్లను ఖరారు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగిస్తే తప్ప ఎన్నికలు సకాలంలో జరిగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల తరుణంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రమాకాంత్‌రెడ్డి వెల్లడించిన ముఖ్యాంశాలు... ప్రజా ప్రభుత్వం ఉన్నంత కాలం స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటించలేదు. పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా, అధికారులతో మాట్లాడినా ఎలాంటి స్పందనా లేదు. అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. వారి బాధ్యత ముఖ్యమంత్రికి ఫైలు పంపించడం వరకే. రిజర్వేషన్ల ఖరారుకు ముఖ్యమంత్రి అనుమతించకపోతే వారు చేసేదేముంది. ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే తప్ప ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. ప్రత్యేక పరిస్థితులను సాకుగా చూపి ప్రతీ ఆర్నెల్లకోమారు వాయిదా వేస్తూ పదేళ్ల వరకు పొడిగించుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. ్హ రాష్ట్రపతి పాలన విధించిన 24 గంటల్లోనే రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం. రెండు రకాల ఎన్నికలు ఒకేసారి రావడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని ఉన్నతాధికారులతోపాటు, ఎన్నికల సంఘంలోని అధికారులం కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. పనిచేసే సమయం పెంచుకుని ఎన్నికలు సజావుగా సాగడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి తేదీలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. రెండు దశల్లో ఎన్నికలు ఏ ప్రాంతంలో ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయించాం. సుప్రీంకోర్టు తీర్పు చూసిన తరువాత వాటిని ప్రకటిస్తాం. -
జేసీ చెప్పారు.. అధికారులు సరే అన్నారు
తాడిపత్రి: న్యూ డ్యూస్ సర్టిఫికెట్ ఇచ్చి.. తీరా నామినేషన్ల పరిశీలన రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారనే కారణంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. తాడిపత్రిలోని 10, 18 వార్డులకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డి కౌన్సిలర్‌గా నామినేషన్ వేశారు. మునిసిపాలిటీలోని మొత్తం 34 వార్డులకు వైఎస్సార్సీపీ తరఫున 99 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో జేసీ సోదరులకు అత్యంత సన్నిహితంగా ఉన్న తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, మాజీ కౌన్సిలర్ రమేష్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం వైఎస్సార్సీపీలోకి చేరి, చురుకైన పాత్ర పోషించి అన్ని వార్డులకూ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి శనివారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా రమేష్‌రెడ్డి మునిసిపాలిటీకి బకాయిపడ్డారని లిఖిత పూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆరు గంటల హైడ్రామా అనంతరం రమేష్‌రెడ్డి నామినేషన్లను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరామకష్ణ ప్రకటించారు. ఇది అన్యాయమని వైఎస్ఆర్సీపీ నేతలు రమేష్‌రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, అశోక్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి మునిసిపల్ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. -
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణ: సీఈసీ
* హైదరాబాద్ వచ్చిన సంపత్.. నేడు తిరుమలకు సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తేదీల్లో ఎలాంటి మార్పులుండవని జాతీయ ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ స్పష్టం చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉండడంవల్ల సార్వత్రిక ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. శనివారం ఉదయం ఇక్కడి నుంచి తిరుపతి బయలుదేరనున్నట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయంలో సంపత్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్వాగతం పలికారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో బస చేసిన సంపత్‌కు రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను భన్వర్‌లాల్ వివరించారు. ఆయన శనివారం ఉదయం బయలుదేరి తిరుమల వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ నేరుగా వెళ్తారు. -
కోర్టును ధిక్కరిస్తున్నారా?
* పంచాయతీరాజ్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం ఆగ్రహం * మీరు తలచుకుంటే 24 గంటల్లో నోటిఫికేషన్ ఇవ్వగలరు * 3 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుంటే ఎలా? * గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు కూడా మీరు పాటించలేదు * లోక్‌సభ ఎన్నికలతో మీకొచ్చిన ఇబ్బందేంటి? * సోమవారానికల్లా నోటిఫికేషన్‌పై చర్యలు తీసుకోండి * లేదంటే కోర్టు ధిక్కరణగానే భావిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. గత ఏడాది ఫిబ్రవరి 18నే తాము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినా ఇప్పటివరకు నిర్వహించకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుచేయకపోవడంపై న్యాయవాది ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, గోపాలగౌడలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. దాదాపు 15 నిమిషాలసేపు ఈ కేసును న్యాయస్థానం విచారించింది. లోక్‌సభ ఎన్నికలతో సంబంధమేంటి? ‘గత ఏడాది ఫిబ్రవరి 18నే న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కానీ మీరు ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు..’ అని న్యాయమూర్తులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. దీనికి ఎన్నికల సంఘం తరపు న్యాయవాది మనోజ్ సక్సేనా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. జూన్ 30లోపు ఈ ఎన్నికలు నిర్వహిస్తాం. అందుకు అవకాశం ఇవ్వాలి.. ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్రం ఖరారు చేయలేదు. దీనిపై పలు లేఖలు రాశాం..’ అని విన్నవించారు. దీనికి న్యాయమూర్తులు స్పందిస్తూ ‘లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏంటి.. వాటికి వీటికి సంబంధం ఏంటి.. రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు తీసుకోవచ్చు..’ అని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున న్యాయవాది సుచరిత మాట్లాడుతూ.. గత ఫిబ్రవరి 18 తరువాత నుంచి ఇప్పటివరకు ఇందుకు ప్రభుత్వం తరఫున జరిగిన ప్రక్రియను వివరించారు. జులైలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించామని, కొన్ని ప్రాంతాల్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ముగిసినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగుల సమ్మె కారణంగా చేయలేకపోయామని వివరించారు. ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడమే మిగిలి ఉందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు విన్న న్యాయమూర్తులు.. మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటిఫికేషన్ విషయంలో సోమవారానికల్లా సానుకూల చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ.. కేసును సోమవారానికి వాయిదావేశారు. -
‘పంచాయతీల విలీనం’పై ఈసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రభుత్వం 15 పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో విలీనం చేసిన విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.అసంతృప్తి, అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి రెండు రోజుల కిందట లేఖ రాశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేయడంవల్ల తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల(అబయన్స్) చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. గతంలో పలు గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలు, సంస్థల్లో విలీనం చేస్తామని చెప్పినప్పుడు వాటికి ఎన్నికలు జరగకుండా ఆపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రేటర్‌పరిధిలో గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి ఎన్నికల సంఘం ఆగస్టు 12, 23 తేదీల్లో ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదని తప్పుపట్టారు. ఈలోగా ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొందరు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తమ దృష్టికి రాగానే పంచాయతీరాజ్, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులతో సమావేశం నిర్వహించి.. పరిస్థితిని వివరించామని వీలైనంత త్వరగాా విలీన ప్రక్రియ ముగించాలని చెప్పామని పేర్కొన్నారు. సెప్టెంబర్2లోగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని వారికి గడువు విధించినట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు. రెండో తేదీన ఒకటిన్నర వరకు వేచి చూసి రంగారెడ్డి జిల్లాలో 14, మహబూబ్‌నగర్ జిల్లాలో 3 పంచాయతీలకు, ఆ మరుసటి రోజు రంగారెడ్డి జిల్లాలోని మరో రెండింటికి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. ఆరో తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితుల్లో ఐదో తేదీ సాయంత్రం పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు వచ్చాయన్నారు. విలీనం చేసే అంశాన్ని కనీసం తెలియచేయలేదని ఆక్షేపించారు. ఎన్నికలకు తాము జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునే పరిస్థితుల్లోకి ప్రభుత్వం తమను నెట్టిందనే అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం కమిషనర్ వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడానికే ఈ లేఖ రాస్తున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ పేర్కొనడం గమనార్హం. -
కాంగ్రెస్ ఓటమే లక్ష్యం కుమారస్వామి ప్రకటన
బెంగళూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తన లక్ష్యమని, దీని కోసం ఎవరితోనైనా పొత్తులకు సిద్ధమని ప్రతిపక్ష నాయకుడు కుమారస్వామి ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నాలుగైదు స్థానాలకు పరిమితం చేస్తామని ప్రతినబూనారు. బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానానికి ఈ నెల 21 జరుగనున్న ఉప ఎన్నికలో తన సతీమణి అనితకు మద్దతునివ్వాల్సిందిగా కోరడానికి హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఏ. నారాయణ స్వామి నివాసానికి మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా కుమార విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఉప ఎన్నికలు జరుగనున్న మండ్య, బెంగళూరు గ్రామీణల్లో ఇది కనబడుతోందని తెలిపారు. అడ్డదార్లలో గెలుపును సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. తమ అభ్యర్థికి మద్దుతునివ్వాలని బీజేపీ కార్యకర్తలను కోరినప్పుడు, తమ నాయకుని అనుమతి కావాలని చెప్పారని తెలిపారు. అందుకనే నారాయణ స్వామిని కలవడానికి వచ్చానన్నారు. బీజేపీ అభ్యర్థి రంగంలో లేనందున, తమ అభ్యర్థికి మద్దుతునివ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు నిర్ణయించారని తెలిపారు. అంతేకానీ పొత్తులు లాంటివి ఏమీ లేవన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే వర్గ పోరు మొదలైందని, ఏడాదిలోగా ముఖ్యమంత్రి మారడమో లేక ప్రభుత్వం పడిపోవడమో సంభవిస్తుందని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి ఎవరెవరితో అవగాహన కుదుర్చుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. నారాయణ స్వామి మాట్లాడుతూ తమ పార్టీకి జేడీఎస్‌తో ఎటువంటి పొత్తు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడానికి ఇరు పార్టీల కార్యకర్తలు కలసి పని చేస్తున్నారని చెప్పారు. అనంతరం కుమారస్వామి అక్కడే అల్పాహారం తీసుకుని ప్రచారానికి బయల్దేరారు. ఈ సందర్భంగా బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. -
ఎన్నికలు ప్రశాంతం
జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన ఐదు పంచాయతీల ఎన్నికలు గురవారం ప్రశాంతంగా జరిగాయి. కడెం మండలం ఉడుంపూర్లో టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి జొన్నల సావిత్రి, ఖానాపూర్ మండలం ఇటిక్యాలలో టీఆర్ఎస్ బలపర్చిన వెన్నెలవారి లలిత గెలుపొందారు. సిర్పూర్(యు) మండలం పంగిడిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం జలీంషావ్ సర్పంచ్‌గా గెలుపొందారు. ఉట్నూర్‌లో 68శాతం పోలింగ్ నమోదైంది. గురువారం రాత్రి వరకూ కౌంటింగ్ కొనసాగుతోంది. భీమిని మండలం లక్ష్మీపూర్‌లో సర్పంచ్ అభ్యర్థి ఒకరు హైకోర్టును ఆశ్రయించడంతో కౌటింగ్ వాయిదా పడింది .ఉడుంపూర్లోకడెం, న్యూస్‌లైన్ : మండలంలోని ఉడుంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక గురువారం ప్రశాంతంగా జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత నెల 31న ఎన్నికలు నిర్వహించగా వర్షాల కారణంగా గ్రామ పంచాయతీ పరిధిలోని మిద్దెచింత, ఇస్లాంపూర్ గ్రామాలకు వెళ్లే రహదారికి అడ్డంగా వాగులు ఉప్పొంగడంతో అక్కడి ప్రజలు ఓటు వేయలేకపోయారు. దీంతో ఎన్నికను గురువారానికి వాయిదా వేశారు. 31న జరిగిన పోలింగ్‌లో..1,550 ఓట్లకు గాను 1,085 పోలయ్యాయి. గురువారం 265 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్‌గా టీడీపీ బలపర్చిన జొన్నల సావిత్రి తన ప్రత్యర్థి బి.రాధికపై 606 ఓట్ల తేడాతో విజయం సాధించింది. పది వార్డులకు గాను నాలుగు వార్డుల్లో దోసండ్ల వెంకటి, కుర్ర నర్సవ్వ, అజ్మీర రాజేశ్వరి, గంగాధర బుచ్చవ్వ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగితా ఆరు వార్డుల్లో దరూర్ నర్సయ్య, కుర్ర లక్ష్మణ్, ఆత్రం దేవరావు, బెడద విజయ, దేశినేని సోను, దేశినేని భాగ్యలక్ష్మి గెలుపొందారు. అనంతరం ఉప సర్పంచ్‌గా దరూర్ నర్సయ్యను ఎన్నుకున్నారు. సాయంత్రం సర్పంచ్ సావిత్రి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాగా, తహశీల్దార్ లోకేష్, ఎంపీడీవో విలాస్, ఎసై్స మల్లేశ్ పోలింగ్ కేంద్రం వద్ద మకాం వేసి పరిస్థితిని సమీక్షించారు. ఉట్నూర్‌లో.. ఉట్నూర్టౌన్, న్యూస్‌లైన్ : మొదటి, రెండో విడతల్లో వాయిదా పడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికలను గురువారం నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఉట్నూర్ గ్రామ పంచాయతీ పరిధి వంకతుమ్మ, రాజంపేట్, దేవ్‌నగర్ గ్రామాల ప్రజలు వాగు దాటి రాలేక ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఎన్నికలను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడూ భారీ వర్షం కురువడంతో 8వ తేదీకి వాయిదా వేసి పోలింగ్ నిర్వహించారు. అధికారుల సూచనలతో ప్రజలు వాగులు దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 18వార్డుల్లో ఓటు వేయలేని వారు గురువారం ఓటు వేశారు. 68 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, కౌంటింగ్ కొనసాగుతోంది. పంగిడిలో.. జైనూర్(సిర్పూర్(యు)), న్యూస్‌లైన్ : సిర్పూర్(యు) మండలం పంగిడి పంచాయతీ సర్పంచ్ ఎన్నిక గురువారం జరిగింది. 70శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఆత్రం జలీంషావ్ 259 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి గెడాం మారుతి 505 ఓట్లు వచ్చాయి. ఇటిక్యాలలో.. ఇటిక్యాల(ఖానాపూర్), న్యూస్‌లైన్ : మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత నెల 31న జరిగిన ఎన్నికల్లో వర్షం కారణంగా పోలింగ్ తక్కువ నమోదైంది. మొత్తం 927 మంది ఓటర్లు ఉండగా 305 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో ఎన్నికలు గురువారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. 305 మందికి గాను గురువారం జరిగిన పోలింగ్‌లో 204 మంది ఓటు వేశారు. మొత్తంగా 89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎంపీడీవో సిహెచ్.రాధారాథోడ్, తహశీల్దార్ కనకయ్య, జోనల్ అధికారి శంకరయ్య, ప్రత్యేకాధికారి గజ్జరాం, రిటర్నింగ్ అధికారి చంద్రహాస్ తెలిపారు. గుమ్మెన, ఎంగ్లాపూర్, కోలాంగూడ గ్రామాల నుంచి మహిళలు, వృద్ధులు, వికలాంగులు నానా అవస్థల మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు ట్రాక్టర్లు, ఆటోలు, వివిధ వాహనాల్లో తరలివచ్చారు. కాగా, టీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వెన్నెలవారి లలిత తన సమీప ప్రత్యర్థి ఉప్పు శంకర్‌పై 146 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో పది వార్డులకు గాను ఎనిమిది ఏకగ్రీవం కాగా.. రెండు వార్డుల్లో మద్దెల మహేందర్, బి.విలాస్ గెలుపొందారు. ఉప సర్పంచ్‌గా చంద్రబాను ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.