ఓటుకు ‘జానా’ దూరం!
నాగార్జునసాగర్,న్యూస్‌లైన్ : మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్ కూడా ఉంది. కానీ ఆయన ఓటు వేయలేకపోయారు. అది ఎలాగనుకుంటున్నారా? నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సిబ్బంది నివాసం ఉండడానికి క్వార్టర్లు నిర్మించారు. కాలక్రమేణా ఇతరులూ ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
నాటి నుంచి నేటి వరకు సాగర్‌ను అధికారులు అటు గ్రామపంచాయతీగాను, ఇటు మునిసిపాలిటీగాను గుర్తించలేదు. దీంతో ఇక్కడి వాసులకు కేవలం సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే ఓటేసే అవకాశముంది. నల్లగొండ జిల్లా పరిధిలోకి వచ్చేసాగర్‌లోని హిల్‌కాలనీలో 6,150 మంది, పైలాన్‌కాలనీలో6,248 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో జానారెడ్డి కుటుంబసభ్యులూ ఉన్నారు. 89వ పోలింగ్ కేంద్రం పరిధిలో 897 వరుస సంఖ్య నుంచి జానారెడ్డి కుటుంబసభ్యుల ఓట్లు నమోదై ఉన్నాయి.