వరంగల్లో ఏడుచోట్ల ప్రారంభం కాని కౌంటింగ్ | local body counting does not start in warangal | Sakshi
Sakshi News home page

వరంగల్లో ఏడుచోట్ల ప్రారంభం కాని కౌంటింగ్

Published Tue, May 13 2014 3:21 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

local body counting does not start in warangal

వరంగల్ జిల్లాలోని ఏడు కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమే కాలేదు. దీంతో అక్కడి అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం తర్వాత మాత్రమే కౌంటింగ్ ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. వరంగల్ జిల్లాలో కేవలం అతికొద్ది ఎంపీటీసీ స్థానాల ఫలితాలను మాత్రమే ప్రకటించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. పలు మండలాల్లో కౌంటింగ్ ప్రారంభం కాకపోవడంతో విషయం ఏమిటో తమకు తెలియట్లేదని అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఫలితాలు వస్తుండగా, ఇక్కడ మాత్రమే సమస్య ఎందుకొచ్చిందని అడిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement