సాక్షి ప్రతినిధి, వరంగల్ : సార్వత్రిక ఎన్నికల పోరులో జిల్లాలోని సిట్టింగ్ లోక్‌సభ అభ్య ర్థులకు ఎదురుగాలి వీస్తోంది. ఐదేళ్ల పనితీరు కొలమానంగా ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు 2009లో అనూహ్యంగా సిరిసిల్ల రాజయ్య, పోరిక బలరాంనాయక్ ఎంపీలుగా గెలిచారు. రెండోసారి వీరే బరిలో ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఆశించిన మేర పనులు చేయకపోవడంతో ఆ ఇద్దరిలో గుబులు నెలకొంది.
లంబాడ వర్గంలో ఓట్ల చీలిక
మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో లంబాడ, కోయ వర్గాల ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. ఈ వర్గాల ఓటర్లు ఎవరికి మద్దతు ప్రకటిస్తే... విజయం వారిదే అన్నట్లుగా పరిస్థితి ఉంది. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్ సెగ్మెం ట్లు వరంగల్ జిల్లాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో మహాకూట మి, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. మహాకూటమి నుంచి కోయ సామాజికవర్గానికి చెందిన కుంజా శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుంచి లంబాడ సామాజిక వర్గానికి చెందిన బల రాంనాయక్ బరిలో ఉన్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో లంబాడ సామాజికవర్గం బలరాంనాయక్‌కు మద్దతుగా నిలిచింది. లంబాడ ఓటర్లు ఎక్కువగా ఉండే మహబూబాబాద్‌లో 30,593, డోర్నకల్‌లో 23,277, నర్సం పేటలో 5,633 ఓట్ల మెజార్టీని ఆయన సాధించారు.
సొంత నియోజకవర్గం ములుగులోనే బలరాంకు తక్కువగా 4,323 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ మెజార్టీలుగా ఉన్న కోయ సామాజికవర్గ ఓటర్లు కుంజా వెంటనడిచారు. ఇప్పుడు వీరంతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ తరఫున ప్రొఫెసర్ సీతారాంనాయక్, టీడీపీ నుంచి మోహన్‌లాల్ బరిలో నిల్చున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేస్తుండడంతో ఓట్లు చీలే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బలరాంనాయక్‌కు ప్రతికూలంగా మారనుంది. అంతేకాదు.. కాంగ్రెస్‌లోని తిరుబాట్లు నాయక్‌కు ఇబ్బందులు తెచ్చాయి. ఇన్నాళ్లు బలరాం నాయక్‌కు తోడుగా ఉన్న దొంతి మాధవరెడ్డి టికెట్ రాకపోవడంతో నర్సంపేటలో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉన్నా రు. దొంతికి నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం లో ఉండగా సొంత వర్గం ఉండగా.. వారంతా ప్రస్తుతం కాం గ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో బలరాంనాయక్‌కు ఇక్కడ ఐదువేలకు పైగా మెజార్టీ వచ్చింది. దొంతి ఎఫెక్ట్‌తో ఈసారి బలరాంనాయక్‌కు ఈసారి సందేహంగా మారింది. ఇన్ని ఇబ్బందులున్నా బలరాంనాయక్ ప్రచారం లో అంతంతగానే వ్యవహరించారు.
రాజయ్యకు ఇంటాబయట సమస్యలు
వరంగల్ లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు పని తీరు కొలమానం ఇబ్బందిగా మారింది. గత హామీలు నెరవేర్చకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఐదేళ్లు ఎంపీ గా ఉన్న రాజయ్య జిల్లాకు చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్టు కూ డా తీసుకురాలేదు. రైల్వే వ్యాగన్ వర్క్‌షాపు అతీగతి లేకపో గా.. తెలంగాణలో రెండో విమానాశ్రయంగా పేరున్న మా మునూరు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకల ప్రక్రియ అడుగు ముందుకుసాగలేదు. పనితీరుతో పాటు కాంగ్రెస్ అ సెంబ్లీ అభ్యర్థులతోనూ ఆయనకు విభేదాలు ఉండడం ప్రతి కూలంగా కనిపిస్తోంది. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎమ్మెల్యే అభ్యర్థులు రాజయ్యపై అసంతృప్తిగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా ‘సహకారం’ అందించడం లేదని వాపోతున్న వీరు.. ప్రచారంలోనూ ఉపయోగం ఉండడం లేదంటున్నారు. ఎన్నికల తరుణంలో రాజయ్య కుటుం బవ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది.
సిట్టింగ్ ఎంపీలకు ఎదురుగాలి
Published Tue, Apr 29 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM
Advertisement
Advertisement