Sirisilla Rajaiah
-
రాజయ్యకు నిరాశ
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ పై గురువారం రెండవ అదనపు జిల్లా కోర్టు లో న్యాయమూర్తి రేణుక విచారణ చేపట్టారు. గత నెల 4న సారిక, ఆమె ముగ్గురు కుమారుల మతి ఘటనపై సుబేదారీ పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్, రాజయ్య దంపతులు, సనా ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నసంగతి తెలిసిందే. బెయిల్ కోసం రాజయ్య, ఆయన భార్య గతంలోనే వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్ మొదటిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, రాజయ్య దంపతులు రెండోసారి బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ రెండు పిటిషన్లను విచారించిన కోర్టు తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. -
అందరం బాగానే కష్టపడ్డాం
♦ వరంగల్ ఉప ఎన్నికపై టీపీసీసీ సంతృప్తి ♦ రాజయ్య ఇంట్లో ‘దుర్ఘటన’ జరగకుంటే పరిస్థితి మెరుగయ్యేదని అంచనా ♦ అయినప్పటికీ నేతలంతా ఐక్యంగా పనిచేశారని విశ్లేషణ ♦ గెలుపోటములు ఎలా ఉన్నా భవిష్యత్తుపై ధీమా సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ నేతల పనితీరుపై టీపీసీసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ అధికారంలో లేకున్నా సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్న ఈ సమయంలో జరిగిన ఉప ఎన్నికలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ నేతలు ఐక్యంగా పనిచేశారని అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా తొలుత ప్రకటించిన అభ్యర్థి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన ‘దుర్ఘటన’ తాలూకూ షాక్ నుంచి త్వరగా తేరుకోవడంతోపాటు పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఇతర ముఖ్య నేతలు జాగ్రత్తగానే వ్యవహరించారని విశ్లేషిస్తోంది. అలాగే పార్టీ జాతీయస్థాయి నేతలైన మీరాకుమార్, సచిన్ పైలట్, సుశీల్‌కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ తదితరులు ప్రచారానికి తగిన సమయాన్ని కేటాయించినట్టుగానే పేర్కొంటోంది. గెలుపోటములు ఎలా ఉన్నా పార్టీ నేతలు చూపిన ఐక్యత, పోరాటస్ఫూర్తితో భవిష్యత్తుపై ధీమాగా ఉంది. ఆ సంఘటన జరగకపోయి ఉంటే.... పార్టీ వరంగల్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ తొలుత ప్రకటించడం...ఆయన నామినేషన్ వేయడం తెలిసిందే. అయితే నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ఆయన నివాసంలో కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద రీతిలో అగ్నిప్రమాదంలో మరణించడంతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం సిరిసిల్ల రాజయ్య స్థానంలో మరో నేత సర్వే సత్యనారాయణకు టికెట్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో టీపీసీసీ నేతలతోపాటు జిల్లా నేతలు, అటు జాతీయ నేతలు కూడా వేగంగా స్పందించి నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ఎన్నిక అనివార్యమని తేలిన తర్వాత వరంగల్ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ మండల స్థాయి నుంచి సమావేశాలను నిర్వహించింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ, అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. అయితే చివరి రోజున జరిగిన సంఘటనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చడం, పార్టీ శ్రేణులు కోలుకోవడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఆ సంఘటన జరగకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు మరికొంత మెరుగ్గా ఉండేదని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ను కట్టడి చేయగలిగినట్టే... సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ దాదాపు 4 లక్షల మెజారిటీతో చేజిక్కించుకోగా ఈసారి దాన్ని చాలా వరకు తగ్గిస్తామని టీపీసీసీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్కు మూడున్నరేళ్లపాటు అధికారం ఉన్న ఈ సమయంలో జరిగిన ఉప ఎన్నిక సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని టీపీసీసీ నేతలు అంగీకరిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకుగాను టీఆర్ఎస్కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండటం, అన్ని పార్టీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన మండల స్థాయి నాయకులు కూడా పలువురు టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీకి కలసివచ్చేలా ఉందని చెబుతున్నారు. అలాగే ఓటర్లను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఒకవేళ గెలిచినా గతంలో వచ్చిన మెజారిటీని భారీగా తగ్గిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి, పరకాల వంటి నియోజకవర్గాల్లో పార్టీకి మెజారిటీ వస్తుందని టీపీసీసీ నేతలు విశ్వసిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ను బాగానే కట్టడి చేయగలిగినట్టుగా అంచనా వేస్తున్నారు. -
రాజయ్య కుటుంబాన్ని ఉరి తీయాలి
సారిక తల్లి డిమాండ్.. కుమార్తె అస్తికల సేకరణ పోచమ్మమైదాన్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల అస్తికలను సారిక కుటుంబసభ్యులు ఆదివారం తీసుకెళ్లారు. వాటిని బాసర వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేస్తామని సారిక తల్లి లలిత తెలిపారు. సారిక మృతి చెంది ఆదివారానికి ఐదురోజులు కావడంతో కర్మకాండలు చేశారు. అనంతరం అస్తికలను తీసుకెళ్లారు. ఆమె కుమారులు అభినవ్, శ్రీయోన్, అయోన్‌లను ఖననం చేసిన ప్రదేశంలోని మట్టిని సైతం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ.. తన కూతురు, మనువళ్లను రాజయ్య కుటుంబసభ్యులే హత్య చేశారని ఆరోపించారు. వారిని ఉరి తీయాలని కోరారు. పోస్ట్‌మార్టం నివేదిక రాకముందే ఆత్మహత్య అని పోలీసులు ఎలా నిర్ధారిస్తారని ఆమె ప్రశ్నించారు. రాజకీయ ప్రోద్బలంతో కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆమె వెంట సారిక సోదరి అర్చన, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సొల్లేటి క్రిష్ణమాచారి, గజ్జెల వీరన్న, మహిళా సంఘం నాయకురాలు ఇందిర, పద్మావతి ఉన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల సందర్శన..! సారిక కుమారులను ఖననం చేసిన ప్రదేశానికి ఆదివారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినట్లు తెలిసింది. మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించే అవసరం ఏర్పడుతుందేమోననే అనుమానంతో ఖననం చేసిన మృతదేహాలను అక్కడి నుంచి తరలించేందుకు వారు ప్రయత్నించినట్లు సమాచారం. -
ఆ మృతదేహాలపై గాయాలు?
వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు చిన్నారుల సజీవదహనం ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి చేస్తున్న దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అయితే సారిక ఛాతీ భాగంలో ఓ ఎముక విరిగినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారని సమాచారం. ఇద్దరు చిన్నారులు కాళ్లు సైతం విరిగినట్లు తెలుస్తోంది. అయితే వారు కాలిపోతుండగా ఎముకలు విరుగుతాయని కొందరు వైద్యులు అంటుండగా, బతికుండగానే ఆమెను ఎవరైనా గాయపరిచి ఉండొచ్చని మరికొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆనంతరమే అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయన్న విషయం తెలిసిందే. -
పోటీ చేయలేను, అభ్యర్థిని మార్చండి
-
అగ్నిప్రమాదం.. అనుమానం!
-
పోటీ చేయలేను, అభ్యర్థిని మార్చండి: రాజయ్య
వరంగల్ : ఇప్పుడున్న పరిస్థితిలో తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని, అభ్యర్థిని మార్చాలని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య అన్నారు. తనను క్షమించండి అంటూ ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరారు. సిరిసిల్ల రాజయ్య ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో కోడలు సహా ముగ్గురు మనవళ్లు సజీవ దహనమయ్యారు. ప్రస్తుతం రాజయ్య.. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబసభ్యులు నలుగురూ ఒకేసారి చనిపోవడం ఇటు రాజకియంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో రాజయ్య ఇంట్లో విషాదం కారణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చే యోచనలో ఉంది. దీనిపై పా్టీ ముఖ్య నేతలు హైకమాండ్‌తో చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అగ్నిప్రమాదం.. అనుమానం!
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్, అయోన్, శ్రీయోన్ ల మృతిపై సారిక కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాము వచ్చేంతవరకు మృతదేహాలను కదిలించవద్దని పోలీసులను అభ్యర్థించినట్లు సమాచారం. ప్రస్తుతం అగ్నిప్రమాదంగా భావిస్తున్న ఈ సంఘటనలో.. ఇంటి మొదటి అంతస్తులోగల బెడ్రూమ్లో ఉన్న నలుగురూ మరణించారు. దీనిపై పలుకోణాల్లో దర్యాప్తుచేసేందుకు పోలీసులు సంసిద్ధులయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాజయ్య కుమారుడు అనిల్ తో సారిక వివాహం 2006లో జరిగింది. వీరిది ప్రేమ వివాహమని తెలిసింది. ఈ దంపతులు కొంతకాలం విదేశాల్లోనూ నివసించారు. రాజయ్య ఎంపీగా కొసాగిన సమయంలో, అనిల్.. యూత్ కాంగ్రెస్ లో క్రియాశీల పాత్ర పోశించారు. ఈ క్రమంలోనే ఆయనకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. తనను, పిల్లలను పట్టించుకోవడంలేదని సారిక.. కొద్ది నెలల కిందట భర్త అనిల్ పై పోలీసులకు ఫిర్యాదుచేసింది. అత్తమామలైన రాజయ్య, ఆయన భార్య కూడా తనను వేదిస్తున్నట్లు సారిక ఫిర్యాదులో పేర్కొంది. కోడలు వేధింపుల కేసు పెట్టడంతో రాజయ్యపై అనేక విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా, కొద్ది రోజులుగా భార్యభర్తలు ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఇంతలోనే బుధవారం సారిక, ముగ్గురు పిల్లలు అనుమానాస్పదరీతిలో అగ్నికి ఆహుతయ్యారు. ఈ సంఘటన జరిగినప్పుడు రాజయ్య, అనిల్ లు ఇంట్లోనే ఉన్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నందున అగ్నిప్రమాదం జరిగిన మొదటి అంతస్తులోకి పోలీసులు మీడియాను అనుమతించడంలేదు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీద్ బాబు స్వయంగా సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజయ్య కోడలు, మనవళ్ల మృతితో వారు నివసిస్తున్న ప్రాంతంలో తీవ్రవిషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ నెలలో జరగనున్న వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల్లో రాజయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పటీచేస్తుండటం తెలిసిందే. ఈరోజు ఆయన రెండో సెట్ నామినేషన్ దాఖలుచేయాల్సిఉంది. కోడలు, మనవళ్ల మృతితో మనస్థాపానికి గురైన రాజయ్య ఇంటి వరండాలో కూలబడిపోయి రోదిస్తున్న దృశ్యాలు కనిపించాయి. -
రాజయ్య ఇంట్లో దారుణం: నలుగురి సజీవదహనం
-
కొందరు సై.. మరి కొందరు నై!
సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజ య్యను ప్రకటించడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్యకే మళ్లీ టికెట్ ఇవ్వడంపై కొందరు పెదవి విరుస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం గట్టిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీల బృందంలో ఒకరిగా, వరంగల్ లోక్‌సభ పరిధిలో పాత పరిచయాలున్నందున పలువురు నేతలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. పోటీపడిన ముగ్గురు నేతల్లో సిరిసిల్ల రాజయ్య మినహా మరో ప్రత్యామ్నా యం లేకుండా పోయిందని టీపీసీసీ ముఖ్య నేతలు చెబుతున్నారు. వివేక్ పోటీ చేస్తే కాం గ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఇంకా ఎక్కువగా ఉండేదంటున్నారు. అభ్యర్థిత్వాన్ని ఆశిం చిన సర్వే సత్యనారాయణ, రాజయ్య మధ్య పోటీలో రాజయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపాల్సి వచ్చిందంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు, హామీలిచ్చి మోసం చేసే టీఆర్ఎస్ మధ్య పోరాటమని అంటున్నారు. ఆఫీసు బేరర్ల సమావేశం వరంగల్ లోక్‌సభలోని ఒక్కో మండలానికి ఒక్కో ముఖ్య నేతను ఇన్చార్జిగా నియమించాలని టీపీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది. ఇం దులో ఉపాధ్యక్షులు ఉద్దెమర్రి నర్సిం హారెడ్డి, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్‌రావు, హరి రమాదేవి, కోలేటి దామోదర్, సి.జె.శ్రీనివాస్, కుమార్‌రావు, వేణుగోపాలరావు, కుసుమకుమార్, జయప్రకాశ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి ఈ ఉప ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేసేలా చూడాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. మండల, నియోజకవర్గ, లోక్‌సభ స్థాయిలో కమిటీలను వేయాలని నిర్ణయించారు. వరంగల్, హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్‌లు, మీడియా సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాయకులందరితో సోమవారం చర్చించిన తర్వాత పని విభజన కూడా పూర్తిచేసుకుందామని ఉత్తమ్ వివరించారు. -
సిట్టింగ్ ఎంపీలకు ఎదురుగాలి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సార్వత్రిక ఎన్నికల పోరులో జిల్లాలోని సిట్టింగ్ లోక్‌సభ అభ్య ర్థులకు ఎదురుగాలి వీస్తోంది. ఐదేళ్ల పనితీరు కొలమానంగా ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు 2009లో అనూహ్యంగా సిరిసిల్ల రాజయ్య, పోరిక బలరాంనాయక్ ఎంపీలుగా గెలిచారు. రెండోసారి వీరే బరిలో ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఆశించిన మేర పనులు చేయకపోవడంతో ఆ ఇద్దరిలో గుబులు నెలకొంది. లంబాడ వర్గంలో ఓట్ల చీలిక మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో లంబాడ, కోయ వర్గాల ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. ఈ వర్గాల ఓటర్లు ఎవరికి మద్దతు ప్రకటిస్తే... విజయం వారిదే అన్నట్లుగా పరిస్థితి ఉంది. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్ సెగ్మెం ట్లు వరంగల్ జిల్లాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో మహాకూట మి, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. మహాకూటమి నుంచి కోయ సామాజికవర్గానికి చెందిన కుంజా శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుంచి లంబాడ సామాజిక వర్గానికి చెందిన బల రాంనాయక్ బరిలో ఉన్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో లంబాడ సామాజికవర్గం బలరాంనాయక్‌కు మద్దతుగా నిలిచింది. లంబాడ ఓటర్లు ఎక్కువగా ఉండే మహబూబాబాద్‌లో 30,593, డోర్నకల్‌లో 23,277, నర్సం పేటలో 5,633 ఓట్ల మెజార్టీని ఆయన సాధించారు. సొంత నియోజకవర్గం ములుగులోనే బలరాంకు తక్కువగా 4,323 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ మెజార్టీలుగా ఉన్న కోయ సామాజికవర్గ ఓటర్లు కుంజా వెంటనడిచారు. ఇప్పుడు వీరంతా వైఎస్సార్సీపీ అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ తరఫున ప్రొఫెసర్ సీతారాంనాయక్, టీడీపీ నుంచి మోహన్‌లాల్ బరిలో నిల్చున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేస్తుండడంతో ఓట్లు చీలే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బలరాంనాయక్‌కు ప్రతికూలంగా మారనుంది. అంతేకాదు.. కాంగ్రెస్‌లోని తిరుబాట్లు నాయక్‌కు ఇబ్బందులు తెచ్చాయి. ఇన్నాళ్లు బలరాం నాయక్‌కు తోడుగా ఉన్న దొంతి మాధవరెడ్డి టికెట్ రాకపోవడంతో నర్సంపేటలో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉన్నా రు. దొంతికి నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం లో ఉండగా సొంత వర్గం ఉండగా.. వారంతా ప్రస్తుతం కాం గ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో బలరాంనాయక్‌కు ఇక్కడ ఐదువేలకు పైగా మెజార్టీ వచ్చింది. దొంతి ఎఫెక్ట్‌తో ఈసారి బలరాంనాయక్‌కు ఈసారి సందేహంగా మారింది. ఇన్ని ఇబ్బందులున్నా బలరాంనాయక్ ప్రచారం లో అంతంతగానే వ్యవహరించారు. రాజయ్యకు ఇంటాబయట సమస్యలు వరంగల్ లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు పని తీరు కొలమానం ఇబ్బందిగా మారింది. గత హామీలు నెరవేర్చకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఐదేళ్లు ఎంపీ గా ఉన్న రాజయ్య జిల్లాకు చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్టు కూ డా తీసుకురాలేదు. రైల్వే వ్యాగన్ వర్క్‌షాపు అతీగతి లేకపో గా.. తెలంగాణలో రెండో విమానాశ్రయంగా పేరున్న మా మునూరు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకల ప్రక్రియ అడుగు ముందుకుసాగలేదు. పనితీరుతో పాటు కాంగ్రెస్ అ సెంబ్లీ అభ్యర్థులతోనూ ఆయనకు విభేదాలు ఉండడం ప్రతి కూలంగా కనిపిస్తోంది. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎమ్మెల్యే అభ్యర్థులు రాజయ్యపై అసంతృప్తిగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా ‘సహకారం’ అందించడం లేదని వాపోతున్న వీరు.. ప్రచారంలోనూ ఉపయోగం ఉండడం లేదంటున్నారు. ఎన్నికల తరుణంలో రాజయ్య కుటుం బవ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. -
ఎంపీ రాజయ్య తల్లి శాంతమ్మకు కన్నీటి వీడ్కోలు
ఎంపీకి పలువురి పరామర్శ అశ్రునయనాల మధ్య పూర్తరుున అంత్యక్రియలు సుబేదారి, న్యూస్‌లైన్ :వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తల్లి శాంతమ్మ(80) మరణంతో ఆయన కుటుంబ సభ్యు లు, బంధువులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయూరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు న్న ఆమె ఆదివారం తెల్లవారుజామున కన్నమూశారు. సుబేదారిలోని రెవెన్యూ కాలనీలో ఉన్న రాజయ్య స్వగృహంలో ఆమె భౌతికకాయూన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించా రు. మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణరెడ్డి, మార్తినేని ధర్మారావు, మాజీ మంత్రి విజయ రామారావు, జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పరమేశ్వర్, యాదగిరి, ఐఎన్టీయూసీ యంగ్ వర్కర్స్ అర్బన్ అధ్యక్షుడు మహ్మద్ అంకూస్ ఆయనను పరామర్శించారు శివముక్తిధామ్‌లో అంత్యక్రియలు హన్మకొండ చౌరస్తా : శాంతమ్మ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం హన్మకొండ పద్మాక్షి కాలనీలోని శివముక్తిధామ్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగాయి. రాజయ్య ఇంటి నుంచి పద్మాక్షి కాలనీ వరకు కొనసాగిన అంతిమయాత్రలో కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాడె మోశారు. అంతక్రియల్లో ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే బోనగిరి ఆరోగ్యం, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, నాయకులు రాజారపు ప్రతాప్, ఎడ్ల రాంబాబు, కట్టా హరి, బిన్ని లక్ష్మణ్, తాడిశెట్టి మధు, సీతా శ్యాం, మండల సమ్మయ్య, పలువురు మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. పాల్గొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్ట -
యాదగిరిగుట్ట-వరంగల్ నాలుగు లేన్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే జాతీయ రహదారి 202లో యాదగిరిగుట్ట నుంచి వరంగల్ వరకు నాలుగు లేన్ల హైవే విస్తరణ పనులకు అనుమతి లభించినట్టు ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటివిడతలో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు పనులు పూర్తయ్యూయన్నారు. యాదగిరిగుట్ట-వరంగల్ మధ్య 99 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1,486 కోట్లు మంజూరైనట్టు రాజయ్య తెలిపారు. -
మంచి మనసుతో మద్దతివ్వండి
* టీ బిల్లుపై బీజేపీకి టీ కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మంచి మనసుతో మద్దతిచ్చి.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీజేపీకి టీ కాంగ్రెస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. సభలో గందరగోళం లేకుంటేనే మద్దతు ఇస్తామని బీజేపీ చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఉభయ సభల్లో విభజన బిల్లుకు ఆమోదం లభించడంలో కాంగ్రెస్‌కు ఎంత బాధ్యత ఉందో.. ప్రతిపక్షం బీజేపీకి అంతే బాధ్యత ఉందన్నారు. పార్లమెంటు వెలుపల బుధవారం తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ తెలంగాణను అడ్డుకోవడానికి జాతీయ నేతలను కలుస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కిరణ్ ఢిల్లీలో దీక్ష చేపట్టడం స్వార్థరాజకీయాలకు నిదర్శనమన్నారు. -
యువ సైంటిస్టులకు ఘన సన్మానం
చౌళ్లపల్లి(ఆత్మకూరు), న్యూస్‌లైన్ : ఊపిరితిత్తులకు సంబంధించిన పల్మనరీ హైపర్ టెన్షన్ అనే వ్యాధికి మందును కనుగొని జర్మనీలో ఉత్తమ యువసైంటిస్ట్ అవార్డు అందుకున్న మండలంలోని చౌళ్లపల్లికి చెందిన సవాయి రాజ్‌కుమార్, ఆయన సతీమణి సోనీని గ్రామప్రజలు, ప్రముఖులు ఆదివారం ఘనంగా సన్మానించారు. సర్పంచ్ కుక్కముడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథిగా వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరై మాట్లాడుతూ వరంగల్ కీర్తిని ప్రపంచానికి చాటిన ఘనత యువసైంటిస్టు దంపతులు సవాయి రాజ్‌కుమార్, సోనీలదేనని అన్నారు. దేశంలో వరంగల్‌కు ఎంతో ప్రాముఖ్యముంద ని ఈ కీర్తిని మరింత పెంచడంలో ఈ శాస్త్రవేత్తలు కృషి చేశారని అన్నారు. పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు పరిశోధనకు అధిక మొ త్తంలో నిధులు కేటాయించాలని అన్నారు. టీ డీపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా ధర్మారెడ్డి, పీసీసీ అధికారప్రతినిధి సాంబారి సమ్మారావు, ఐఎంఏ రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి యువసైంటిస్టుల సేవలను కొనియాడారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో వైద్యసేవలకు తగిన ప్రాధాన్యం కల్పించాలన్నారు. సన్మాన కార్యక్రమంలో లింగారెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ రవీందర్రావు, ప్రొఫెసర్ సురేందర్‌కుమార్, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్రావు, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు రవీందర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు పాదాభివందనం.. సన్మాన గ్రహీత రాజ్‌కుమార్ తన భార్యతో కలిసి తల్లిదండ్రులు సవాయి అయిలయ్య, కొంరమ్మ, అన్నలు రవి, శ్రీనివాస్‌కు పాదాభివందనం చేశారు. తాము ఈ స్థాయికి ఎదగడానికి తమ తల్లిదండ్రులు, అన్నలే కారణమని రాజ్కుమార్లిపారు.