సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజ య్యను ప్రకటించడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్యకే మళ్లీ టికెట్ ఇవ్వడంపై కొందరు పెదవి విరుస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం గట్టిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీల బృందంలో ఒకరిగా, వరంగల్ లోక్‌సభ పరిధిలో పాత పరిచయాలున్నందున పలువురు నేతలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు.
పోటీపడిన ముగ్గురు నేతల్లో సిరిసిల్ల రాజయ్య మినహా మరో ప్రత్యామ్నా యం లేకుండా పోయిందని టీపీసీసీ ముఖ్య నేతలు చెబుతున్నారు. వివేక్ పోటీ చేస్తే కాం గ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఇంకా ఎక్కువగా ఉండేదంటున్నారు. అభ్యర్థిత్వాన్ని ఆశిం చిన సర్వే సత్యనారాయణ, రాజయ్య మధ్య పోటీలో రాజయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపాల్సి వచ్చిందంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు, హామీలిచ్చి మోసం చేసే టీఆర్‌ఎస్ మధ్య పోరాటమని అంటున్నారు.
ఆఫీసు బేరర్ల సమావేశం
వరంగల్ లోక్‌సభలోని ఒక్కో మండలానికి ఒక్కో ముఖ్య నేతను ఇన్‌చార్జిగా నియమించాలని టీపీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది. ఇం దులో ఉపాధ్యక్షులు ఉద్దెమర్రి నర్సిం హారెడ్డి, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్‌రావు, హరి రమాదేవి, కోలేటి దామోదర్, సి.జె.శ్రీనివాస్, కుమార్‌రావు, వేణుగోపాలరావు, కుసుమకుమార్, జయప్రకాశ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి ఈ ఉప ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేసేలా చూడాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. మండల, నియోజకవర్గ, లోక్‌సభ స్థాయిలో కమిటీలను వేయాలని నిర్ణయించారు. వరంగల్, హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్‌లు, మీడియా సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాయకులందరితో సోమవారం చర్చించిన తర్వాత పని విభజన కూడా పూర్తిచేసుకుందామని ఉత్తమ్ వివరించారు.
కొందరు సై.. మరి కొందరు నై!
Published Mon, Nov 2 2015 4:39 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement