పోటీ చేయలేను, అభ్యర్థిని మార్చండి: రాజయ్య | Siricilla Rajaiah Unable to contest warangala by-elections | Sakshi
Sakshi News home page

పోటీ చేయలేను, అభ్యర్థిని మార్చండి: రాజయ్య

Published Wed, Nov 4 2015 8:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పోటీ చేయలేను, అభ్యర్థిని మార్చండి: రాజయ్య - Sakshi

పోటీ చేయలేను, అభ్యర్థిని మార్చండి: రాజయ్య

వరంగల్ : ఇప్పుడున్న పరిస్థితిలో తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని, అభ్యర్థిని మార్చాలని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య అన్నారు. తనను క్షమించండి అంటూ ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరారు.   సిరిసిల్ల రాజయ్య ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.  ఈ దుర్ఘటనలో కోడలు సహా ముగ్గురు మనవళ్లు సజీవ దహనమయ్యారు. ప్రస్తుతం రాజయ్య.. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబసభ్యులు నలుగురూ ఒకేసారి చనిపోవడం ఇటు రాజకియంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది.

దీంతో రాజయ్య ఇంట్లో విషాదం కారణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చే యోచనలో ఉంది. దీనిపై పా్టీ ముఖ్య నేతలు హైకమాండ్‌తో చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement