four burnt alive
-
కారులో అగ్నికీలలు.. నలుగురి ఆహుతి
- ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం - డివైడర్‌ను ఢీకొన్న కారు.. చెలరేగిన మంటలు - డోర్లు తెరుచుకోకపోవడంతో సజీవదహనమైన నలుగురు మిత్రులు - స్నేహితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపి వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం - మృతుల్లో ఒకరిది బెల్లంపల్లి, ముగ్గురిది వరంగల్ జిల్లా - శోకసంద్రంలో మునిగిన కుటుంబీకులు హైదరాబాద్/పరకాల/హన్మకొండ/బెల్లంపల్లి: ఔటర్‌పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపి తిరిగి వస్తున్న నలుగురు మిత్రులు కారులోనే సజీవ దహనమయ్యారు. డివైడర్‌ను ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డోర్లు తెరుచుకోకపోవడంతో అందులోనే వారంతా అగ్ని కీలలకు ఆహుతయ్యారు. సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డుపై ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతులంతా 30 ఏళ్లలోపు వారే. వారిలో ఇద్దరు వివాహితులు. ఒకరికి మూడు నెలల కూతురు, మరొకరికి 11 నెలల బాబు ఉన్నాడు. సాగనంపేందుకు వచ్చి మృత్యు ఒడికి.. వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన బుద్ద శివక్రిష్ణ(26), విజ్జిగిరి శ్రీకాంత్(24), పరకాల మండలం నర్సక్కపల్లెకు చెందిన సురావ్ రాజు(25), మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శశిధర్(27)లు స్నేహితులు. పరకాల మండలం రాజీపేటకు చెందిన వీరి స్నేహితుడు భాస్కర్ కోయంబత్తూరులో హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి భాస్కర్ కోయంబత్తూరు వెళ్తుండడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను దింపేందుకు అంతా కలిసి శివకృష్ణకు చెందిన ఆల్టో కారులో వరంగల్ నుంచి బయల్దేరారు. రాత్రి 3 గంటల సమయంలో భాస్కర్‌ను ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టారు. తిరిగి వరంగల్‌కు వస్తుండగా సోమవారం తెల్లవారుజామున 4.30-5 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట ఔటర్ కూడలి వద్దకు రాగానే కారు అదుపు తప్పి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బయటపడేందుకు యత్నించినా డోర్లు తెరుచుకోలేదు. మంటలు విపరీతంగా చెలరేగడంతో ఆర్తనాదాల మధ్య ప్రాణాలు విడిచారు. ప్రమాదం సంగతి తెలుసుకున్న ఔటర్, పోలీస్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్‌ను రప్పించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కారులోని నలుగురు యువకులు కాలిబూడిదయ్యారు. సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నాలుగు మృతదేహాలకు బంధువులు, పోలీసుల సమక్షంలో సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం పూర్తిచేశారు. మృతదేహాలన్నీ కాలిపోయి ముద్దగా మారిపోవడంతో వాటి గుర్తింపు పోలీసులకు కష్టంగా మారింది. దీంతో చివరికి రక్తనమూనాలు సేకరించి మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. ఎల్బీనగర్ డీసీపీ తప్సీర్ ఇక్బాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తల్లడిల్లిన కుటుంబీకులు ప్రమాదం వార్త తెలియగానే నలుగురు యువకుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ మిత్రుడు భాస్కర్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరై వస్తామని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారుు. మృతుల్లో పరకాలకు చెందిన శివకృష్ణ.. బీటెక్ చదువుతూ మధ్యలో ఆపేశాడు. ప్రస్తుతం హన్మకొండలో తన తండ్రి శంకరయ్యకు చెందిన మెడికల్ షాపు నిర్వహణలో పాలుపంచుకుంటున్నాడు. ఆయనకు భార్య, మూడు నెలల కూతురు ఉంది. శ్రీకాంత్, రాజు, శశిధర్ గ్రూపు పరీక్షలకు హన్మకొండలో గదిని అద్దెకు తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు. శ్రీకాంత్ తండ్రి సమ్మయ్య భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బీటెక్ చదివిన శ్రీకాంత్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. బెల్లంపల్లికి చెందిన శశిధర్ ఏడాది కిందట బీటెక్ పూర్తి చేశాడు. ఈయన తండ్రి కూడా సింగరేణి కార్మికుడే. నర్సక్కపల్లికి చెందిన సురావు రాజుకు మూడు సంవత్సరాల కిందటే కృష్ణవేణితో పెళ్లయింది. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. కారు ప్రమాదం సమయంలో మంటల్లో చిక్కుకొని రక్షించాలంటూ నలుగురు మిత్రులు అరుస్తున్న దృశ్యాలు వాట్సప్‌లో ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన వారి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటున్నారు. -
సారిక కేసు దర్యాప్తు వేగవంతం
వరంగల్ : అనుమానాస్పద స్థితిలో ముగ్గురు పిల్లలతో పాటు మృతి చెందిన సారిక కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య నివాసాన్ని మరోసారి ఫోరెన్సిక్స్ నిపుణులు, పోలీసులు శుక్రవారం పరిశీలించారు. సారికతో పాటు ముగ్గురు చిన్నారుల సజీవ దహనమైన ఘటనలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే కీలకంగా మారనుంది. సారిక ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురయ్యిందా అనే అంశం నిర్ధారించడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే ముఖ్యమని చెప్పొచ్చు. దీంతో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో వెలుగు చూసిన అంశాలు, మృతదేహాల భాగాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. వీటిని పరిశీలించాక ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక పంపిస్తే తప్ప సారిక, ఆమె కుమారులది హత్యా, ఆత్మహత్యా అనేది ధృవీకరించడం సాధ్యం కాదని పోలీసులతో పాటు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తీసుకున్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా అనే కోణంలోనూ పోస్టుమార్టం సందర్భంగా నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా నలుగురి మృతికి కారణమైన భారీ మంటలు ఎలా వ్యాపించాయనేది ఈ కేసులో మిస్టరీగా మారింది. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన సజీవ దహనం ఘటనకు సంబంధించి నాలుగు మృతదేహాలకు గురువారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
కన్నీటి ’సారిక’లు!
-
వరంగల్ జైలుకు రాజయ్య
-
కన్నీటి ’సారిక’లు!
పోచమ్మమైదాన్: అశ్రునయనాల మధ్య వరంగల్‌లో మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనవళ్ల అంత్యక్రియలు ముగిశాయి. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని పోతన శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. గురువారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తరుున తర్వాత ఆస్పత్రి నుంచి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. మహిళలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి.. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలి అని నినదించారు. సాయంత్రం 5.15 గంటలకు సారిక చితికి తల్లి లలిత నిప్పంటించారు. తర్వాత అభినవ్, శ్రీయాన్, అయాన్ మృతదేహాలను ఖననం చేశారు. మనవళ్లను ఖననం చేశాక లలిత బిగ్గరగా రోదిస్తూ కుప్పకూలిపోయింది. అంత్యక్రియలలో సారిక సోదరి అర్చన, కుటుంబ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి, మహిళా సంఘం నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ వద్ద సారిక తల్లిని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పరామర్శించారు. సారిక మృతిపై సీబీఐ విచారణ చేరుుంచాలని ఆయన డిమాండ్ చేశారు. -
వరంగల్ జైలుకు రాజయ్య
సాక్షి, హన్మకొండ: కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌కు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గురువారం 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరిని వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకుముందు వారిని పోలీసులు మామూనూరు పోలీసు స్టేషన్లో ఏసీపీ మహేందర్, హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 10.30 సమయంలో వరంగల్ ఆరో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అజేశ్‌కుమార్ ఎదుట హాజరుపరిచారు. కోర్టుకు తీసుకువచ్చే ముందు ఈ ముగ్గురికి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సారిక, ముగ్గురు పిల్లల మృతి కేసులో ఆమె భర్త అనిల్, అత్త మాధవి, మామ రాజయ్య, అనిల్ రెండో భార్య సనాను నిందితులుగా పేర్కొన్నారు. వారిపై సుబేదారి పోలీసు స్టేషన్లో ఐపీసీ 306, 498ఏ, 174 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. కాగా అనిల్ రెండో భార్యను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. వీడియోలో పోస్టుమార్టం చిత్రీకరణ సారిక, ముగ్గురు పిల్లల మృతదేహాలకు గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. మృతదేహాలను తీసుకునేందుకు సారిక తల్లి, బంధువులు నిరాకరించారు. రాజయ్య కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే నచ్చచెప్పడంతో మృతదేహాలను సాయంత్రం 4:40 గంటలకు తీసుకున్నారు. రాజయ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు రాలేదు. భోజనంలో మత్తు పదార్థాలు కలిశాయా? ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. పోస్టుమార్టం సమయంలో మృతదేహాలకు సంబంధించిన ఆవయవాలను హైదరాబాద్‌లోని ఫోర్స్న్సిక్ ల్యాబ్ పంపించారు. ఈ నివేదిక వెల్లడైతే తప్ప ఇది హత్యా లేదా ఆత్మహత్య అనేది తేలుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తిన్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా? అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మంటల కారణంగా వ్యాపించిన పొగలో సారిక ముగ్గురు చిన్నారులు కొట్టుమిట్టాడినట్లు తెలుస్తోంది. మృతుల శ్వాసనాళాల్లో పొగ ఆనవాళ్లు వైద్యులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన గదిలో గంటపాటు నిర్విరామంగా మంటలు చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంటల వ్యాప్తిలో ఒకే సిలిండర్ కాలిపోయినట్లు కానరావడం.. మరో సిలిండర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
అత్తింట్లో నరకం
తన లాయర్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక గోడు * అత్తామామ, భర్త కలసి తీవ్రంగా వేధించారు * అడుగడుగునా అవమానాలే.. * భర్త బలాదూర్‌గా తిరిగాడు.. నా డబ్బులన్నీ వాడుకున్నాడు * వివాహేతర సంబంధంపై ప్రశ్నిస్తే కొట్టేవాడు * పిల్లల్ని ఏనాడూ పట్టించుకోలేదు.. పాల డబ్బాలు కొనాలన్నా ఇబ్బందే * వంటగదికి తాళం వేసేవారు.. పస్తులు అలవాటైపోయాయి * భర్త కోసం త్యాగాలు చేయాలని రాజయ్య అనేవారు * ఆయన మాటలకు చచ్చిపోవాలనిపించేది సాక్షి, హన్మకొండ: ప్రేమ పేరుతో సారిక జీవితంలోకి ప్రవేశించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ అనుక్షణం ఆమెకు నరకాన్ని చూపించాడు. భర్తగా కష్టసుఖాల్లో తోడుండాల్సిన వ్యక్తి బాధ్యతలను గాలికొదిలి బలాదూర్‌గా తిరిగాడు. సారిక కష్టార్జితాన్ని ఇష్టారీతిగా వాడుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తప్పు దారిలో వెళ్తున్న కొడుకును మందలించాల్సిన తల్లిదండ్రులు కూడా ఆయనకే వత్తాసు పలికారు. సూటిపోటి మాటలు, భౌతిక దాడులతో సారికకు అనుక్షణం నరకం చూపించారు. భర్త, అత్తమామాలు పెడుతున్న ఇబ్బందులను తన తరఫున న్యాయవాదికి, షాహిన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక పూసగుచ్చినట్టు వివరించింది. ఆ వివరాలివీ.. నా కొడుకును పెళ్లి చేసుకో.. అనిల్, నేను ఉద్యోగాలు తెచ్చుకుంటే మా వాళ్లను, అనిల్ కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నా. పెళ్లికి ముందు మా అత్తగారు మాధవి నన్ను తన కాలేజీకి (కేయూలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో) తీసుకెళ్లి మాయ మాటలు చెప్పింది. నన్ను మా అమ్మవాళ్ల ఇంట్లోంచి బయటకొచ్చి, వాళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది. చదువుకున్న వ్యక్తి, లెక్చరర్, మంచీచెడు అన్ని తెలిసిన పెద్దావిడ అని తల్లిలా భావించాను. ఆమె చెప్పినట్లే ఇంట్లోంచి వచ్చేసి అనిల్‌ను పెళ్లి చేసుకున్నా. ఆవిడ మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. ఘోరమైన తప్పుడు స్టెప్ వేశాను. ఒక తప్పుడు నిర్ణయంతో జీవితం ఎలా నాశనం చేసుకుంటామన్నదానికి నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా భర్త ఇంట్లో ప్రతీ క్షణం నన్ను అవమానించాడు. నా కష్టార్జితాన్ని వాడుకున్నారు. నన్ను, నా పిల్లలను పట్టించుకోలేదు. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ఆస్పత్రికి వెళ్లడం నాకో పెద్ద పరీక్ష. ఇంట్లో మూడు కార్లు ఉన్నా.. ఒక్కటీ తీసేవారు కాదు. చివరికి పాల డబ్బాలు, మందులు కొనడం కూడా ఇబ్బందిగా ఉండేది. ఇంట్లో వంటగదికి తాళం వేసేవారు. వండిన వంటలో అడుగుకు మిగిలినవే నాకు నా బిడ్డలకు దక్కేవి. రెండోసారి గర్భిణిగా ఉన్నప్పుడు ఇంట్లో అన్ని గదులకు తాళం వేసి నన్ను హాల్లోనే ఉంచేవారు. బాత్రూమ్కి వెళ్లడం కష్టంగా ఉండేది. బట్టలుతికే స్థలంలో స్నానం చేయాల్సి వచ్చేది. పెద్ద పొట్టతో హాల్లో నేను ఇబ్బంది పడుతుంటే ఇంట్లోకి వచ్చిన అత్తామామలు.. పెద్దవాళ్లు వచ్చినప్పుడు లేచి నిలబడాలని తెలియదా? అంటూ తిట్టేవాళ్లు. ఇద్దరు కవల పిల్లలు పుట్టాక పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పాలు, సెరిలాక్ డబ్బా కొనడానికి కూడా నేను ఇబ్బంది పడాల్సి వచ్చేది. పస్తులు కామన్ అయ్యాయి.. అనిల్‌తో 2006లో జరిగిన పెళ్లితో నా నరకప్రాయమైన జీవితం మొదలైంది. ఇంట్లో ఎవరూ నన్ను తిన్నావా? అని అడిగేవారు కాదు. అన్నానికి కూడా పిలిచేవారు కాదు. పస్తులు ఉండటం కామన్ అయిపోయింది. నా డబ్బులు రూ.20 లక్షలు, 10 తులాల బంగారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. మా అమ్మ వాళ్లతో మాట్లాడేప్పుడు ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయమనేవాడు. కాల్‌లాగ్ చెక్ చేసేవాడు. మీ చెల్లెలితో మాట్లాడావా.. అంతసేపు ఏం మాట్లాడావు? అంటూ ఆరా తీసేవాడు. ఇదీ అని చెబితే, నాకు చెప్పింది 5 నిమిషాలే కదా.. మిగతా 25 నిమిషాలు ఏమి మాట్లాడావని అడిగేవాడు. ఇలాంటివెన్నో భరించాను. ఎక్కడా ఎప్పుడు ఎవరితో చెప్పుకునేదాన్ని కాదు. మా అమ్మవాళ్లతో కూడా ఏమీ చెప్పలేదు. పెళ్లైనప్పట్నుంచీ అనిల్ ఇంతవరకు ఒక్క పని చేయలేదు. జాబ్ చేయమని ఎంతో నచ్చ చెప్పేదాన్ని. రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, ఇంటర్వ్యూ తేదీలు ఇలా ఏ టూ జడ్ పనులు చేసినా ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండేవాడు. మా అత్తమామలు తలచుకుంటే ఏదైనా మంచి బిజినెస్, జాబ్ పెట్టించి ఉండొచ్చు. కానీ ఏదీ చేయలేదు. 2007 నుంచి 2010 వరకు కలకత్తా, ముంబై, పుణేలో మూడేళ్లు జాబ్ చేశాను. ఆ సమయంలో ఏటీఎం అనిల్ దగ్గరే ఉండేది. సేవ్సింగ్స్ లేకుండా డబ్బులన్నీ వాడుకున్నాడు. 2010లో పుణేలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని. ముందుగా ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకున్నాడు. తప్పులను ప్రశ్నిస్తే చాలు.. నాపై చేయి చేసుకునేవాడు, ఒకసారి నా జుట్టు పట్టుకుని నన్ను విసిరేస్తే, మంచం చివర తగిలి పెద్ద గాయమైంది. అత్తామామకు ఈ విషయం చెబితే పట్టించుకోలేదు సరికదా అనిల్‌కే మద్దతుగా నిలిచారు. అత్త పచ్చి బూతులు తిట్టేది అత్త మాధవి ఈసడింపు మాటలు, బూతులు, చిన్నదానికీ పెద్ద దానికీ వంకలు పెడుతూ తిట్టేది. చీటికీమాటికీ ‘నా మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నావు. బయటకు పంపేస్తాను. గేట్ బయట నించోని మాట్లాడు. పచ్చి బూతులు తిట్టేది. మా మామయ్య, నా భర్త ఏనాడూ ఆవిడను అడ్డుకునేవారు కాదు. ఒకసారి మా అమ్మ నాకు చీర పెట్టింది. ఆ చీర చూసి, నానా రభస చేసి ‘ఎవడేమీ ఇచ్చినా ఇలాగే తీసుకో’ అంటూ ద్వంద్వార్థాలతో మాట్లాడింది. ‘ఇప్పటికిప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్లిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అంటూ నాపైకి వచ్చేసి, వస్తువులు మీదకు విసిరేసి, చేయి చేసుకుని ఇంట్లోంచి గెంటేసింది. నాలుగు జతల బట్టలు తీసుకుని వెక్కివెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. అనిల్ కూడా వాళ్లమ్మకే వంత పాడేవాడు. త్యాగం చేయాలన్న మామ కుటుంబ పెద్దగా మామయ్య సిరిసిల్ల రాజయ్య ఏనాడూ నాకు అండగా నిలవలేదు. ‘‘ఎంతో మంది మహిళలు భర్త కోసం, భర్త కుటుంబం కోసం త్యాగాలు చేస్తున్నారు. నువ్వు కూడా త్యాగం చేయాలి’’ అని అనేవాడు. పనివాళ్లు, పార్టీ కార్యకర్తల ముందే ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా తిట్టేవాడు. దీంతో పైప్రాణం పైనే పోయేది. ఆ మాటలకు ఒక్కోసారి చచ్చిపోవాలనిపించేది. మామయ్య నా పేరు మీద నా అకౌంట్లో రూ.8 లక్షలతో కార్ లోను తీసుకున్నాడు. చేతిఖర్చులకు నా డబ్బులు వాడుకునేవాడు. -
రాజయ్య, కుటుంబ సభ్యులకు 14 రోజుల రిమాండ్
వరంగల్: కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కుటుంబ సభ్యులను పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాజయ్య సహా భార్య, కుమారుడు అనిల్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించిన అనంతరం వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు జరిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, వారి కుమారుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి ఇంటివద్దే విచారణ సాగించిన తర్వాత.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజయ్యపై ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు పెట్టారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు రాజయ్య, ఆయన భార్య, అనిల్ ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారని, డ్రైవర్లు కూడా అక్కడే ఉన్నారని సీపీ వివరించారు. ఈ కేసు అనుమానాస్పద మృతిగా తేలడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. విచారణను శాస్త్రీయంగా సాగిస్తామని, వైద్యులు ఇచ్చే నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారని సీపీ చెప్పారు. అగ్నిప్రమాదం వల్లే సారిక, పిల్లలు మరణించారని, అయితే అది ఎలా జరిగిందన్న విషయాన్ని మాత్రం అప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఇది హత్యా.. ఆత్మహత్యా అన్న విషయం విచారణలో మాత్రమే తేలుతుందని చెప్పారు. -
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
-
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక... తన తరఫు న్యాయవాది రెహానాకు 22 పేజీల ఈ మెయిల్ పంపింది. తనను మానసికంగా, శారీరకంగా హింసలను భరిస్తున్నానంటూ ఆమె ఈ మెయిల్లో పేర్కొంది. భర్త అనిల్ వ్యవహారాన్ని సారిక పూసగుచ్చినట్లు మెయిల్లో వివరించింది. ఈ మెయిల్ సారాంశం..ఇదే... 'ఇల్లు విడిచి వెళ్లాలంటూ పదే పదే అత్త, భర్త వేధించేవారు. తిట్లు అరుపులు, కేకలతో రోజు అత్త విరుచుకుపడేది. నా తల్లి ఇచ్చిన చీరను కూడా తీసుకోనివ్వలేదు. రాజయ్య ఎంపీ అయ్యాక వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. ఇంట్లో పనివాళ్లు, పరిచయస్తుల ముందే తిట్టేవారు. అనిల్‌కు వివాహేతర సంబంధాలున్నాయి. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు వెళ్లిపోతాడో తెలియదు. కుటుంబం పట్ల కనీస బాధ్యత లేదు. ఎక్కడకు వెళ్లావని అడిగితే చాలు..భౌతిక దాడులకు దిగేవాడు. ఇంత జరుగుతున్నా...అత్తమామలు పట్టించుకునే వాళ్లు కాదు. వండుకోవడానికి కనీసం సరుకులు కూడా అనిల్ తెచ్చేవాడు కాదు. నేను, పిల్లలు చాలాసార్లు ఆకలితో అలమటించాం. పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి బిల్లులు కట్టేవాడు కాదు. నా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లలతో మాట్లాడేందుకు అనిల్ ఒప్పుకునేవాడు కాదు. నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి పంపిద్దామా? అన్నదే అత్త, మామల ఆలోచన. పిల్లలు నేను హాల్లోనే ఉండేవాళ్లం. నిరంతరం వేధింపులకు గురి చేసేవారు. ఏమైనా అడిగితే ఇంటి నుంచి వెళ్లిపో అనేవారు. జీవితాన్ని త్యాగం చేయాలంటూ రాజయ్య కూడా అనేవారు. చాలామంది మహిళలు... భర్తలు, అత్తమామల కోసం జీవితాలను త్యాగం చేశారని రాజయ్య చెప్పేవారు. రాజయ్య మాటలకు చాలాసార్లు బాధపడ్డా. జీవితాన్ని ఇప్పటితో ముగించాలన్న ఆలోచన అనేకసార్లు వచ్చేది. ఈ షాక్, ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టేది.' అని సారిక పేర్కొంది. -
ఆత్మహత్య కాదు...కచ్చితంగా హత్యే: రెహానా
హైదరాబాద్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆమె తరఫు న్యాయవాది రెహానా అన్నారు. భర్త అనిల్, అత్తమామలపై ఆమె 2014లో గృహహింస చట్టం కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే. సారిక తరఫున న్యాయవాది రెహానా వాదిస్తున్నారు. సారిక అనుమానాస్పద మృతిపై రెహానా గురువారమిక్కడ మాట్లాడుతూ 'పనిమనిషిగా చూస్తున్నారని సారిక నాకు చాలాసార్లు చెప్పింది. కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని నా దగ్గర చాలాసార్లు ఏడ్చింది. అనిల్-సనా అక్రమ సంబంధం గురించి చెప్తూ బాధపడింది. నెల రోజుల క్రితం సారిక నాతో ఫోన్లో మాట్లాడింది. 15 రోజుల క్రితం వచ్చి వ్యక్తిగతంగా కలిసింది. చివరిసారి కలిసినప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఎలాగైనా న్యాయం చేయాలని విలపించింది. కోడలి సంపాదనను కూడా రాజయ్య ఇన్‌కంట్యాక్స్‌లో చూపించారు' అని తెలిపారు. -
సారిక సజీవ దహనం కేసులో మరో ట్విస్ట్
-
'ఆత్మహత్య కాదు..కచ్చితంగా హత్యే'
-
సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్
-
సారిక సజీవ దహనం కేసులో మరో ట్విస్ట్
వరంగల్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు సజీవ దహనం కేసులో మరో కొత్త కోణం బయటపడింది. రాజయ్య నివాసంలో ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. సారిక, పిల్లలు తిన్న అన్నంలో మత్తుమందు కలిపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనమవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వంటగదిలో ఉండాల్సిన రెండు గ్యాస్ సిలిండర్లు బెడ్రూమ్కు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. కుటుంబ తగాదాల కారణంగా సారిక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లను బెడ్రూమ్కు తీసుకొచ్చి ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. వంట గ్యాస్ పూర్తిగా లీక్ కావడం వల్లే పేలిన శబ్దం రాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు సిలిండర్లలోని గ్యాస్ మొత్తం బయటికి వచ్చినా ఎవరూ పసిగట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో వారు తిన్న ఆహారంలో ఎవరైనా మత్తుమందు కలిపారా? అందుకే గ్యాస్ లీక్ అయినా ఆ వాసనను కూడా గుర్తించలేకపోయారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు వారు తిన్న ఆహారాన్ని సేకరించి ...పరీక్షలకు పంపారు. ఇక మాజీ ఎంపీ రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్... మామూనూరు పోలీసులు అదుపులో ఉన్నారు. సారిక, ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాజయ్య కుటుంబసభ్యులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ నిమిత్తం హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి మామూనూరుకు తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్ రెండో వివాహం చేసుకున్న సనా అనే మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా విచారణ నిమిత్తం మామునూరు పోలీస్ స్టేషన్ నుంచి వారిని మరోచోటుకు తరలించే అవకాశం ఉంది. -
సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్
వరంగల్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక..న్యాయవాదికి పంపిన ఈ మెయిల్స్ 'సాక్షి' టీవీ సంపాదించింది. రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక 2013, 2014లో సారిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించడంతో పాటు తనకు న్యాయం చేయాలంటూ మామ ఇంటి ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. 2014 ఏప్రిల్ 25న బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. భర్త, అత్తమామలపై ఫిర్యాదుకు ముందు సారిక తన కష్టాలను ఈ మెయిల్లో న్యాయవాదికి వివరించింది. న్యాయం కోసం తుదివరకూ పోరాడిన ఆమె బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె...ముగ్గురు కొడుకులు అభినవ్, శ్రీయాన్, అయాన్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
సారిక చితికి నిప్పంటించిన తల్లి
-వరంగల్‌లోనే రాజయ్య కోడలు, మనువళ్లు అంత్యక్రియలు -అంత్యక్రియలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు -భారీగా తరలివచ్చిన మహిళలు, స్థానికులు -రాజయ్యకు వ్యతిరేకంగా నినాదాలు పోచమ్మమైదాన్ : వరంగల్ నగరంలోని పోతన స్మశాన వాటికలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనువళ్లు అభినవ్, శ్రీయాన్, అయాన్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోతన స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆస్పత్రి నుంచి స్మశానవాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి... కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్యను సస్పెండ్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. మానవత్వం కలిగిన వారందరూ ఆ నలుగురుకి ఆత్మ బంధువులు అయ్యారు. కుతురు సారికకు తల కొరివి పెట్టేందుకు కుండ పట్టుకుని అంతమయాత్రలో తల్లి లలిత సాగుతుంటే అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. సాయంత్రం సారిక చితికి తల్లి లలిత నిప్పు అంటించారు. తరువాత అభినవ్, శ్రీయాన్, అయాన్ మతదేహాలను ఖననం చేశారు. మనువళ్లను ఖననం చేశాకా లలిత బిగ్గరగా రోధిస్తూ కుప్పకూలిపోయింది. అత్యక్రియలలో సారిక సోదరి అర్చన, కుటుంబ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్రోజు బిక్షపతి, సోల్లేటి కష్ణమాచార్యులు, కట్ట ఈశ్వరాచారి, చిట్టిమల్ల రమేశ్ బాబు, కలకోట భాస్కరచారి, గన్నోజు జగన్, కర్ణకంటి కమార్, కొక్కోండ రవి, శ్రీరాముల సతీష్, బెజ్జంకి విశ్వనాథం, సత్యనారాయణ, బండ్ల సురేందర్, మహిళా సంఘం నాయకురాలు ఇందిర పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ వద్ద సారిక తల్లిని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కష్ణమాదిగ పరామర్శించారు. సారిక మతిపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. -
సారికను తీవ్రంగా వేధించారు
-
సారికను తీవ్రంగా వేధించారు
దర్యాప్తులో తేల్చిన బేగంపేట మహిళా పోలీసులు భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సారికను ఇంట్లోకి రానీయకుండా విడిగా ఉంచారు 2014లో కోర్టు ఆదేశం మేరకు కేసు నమోదు అత్తింటి వేధింపులపై కింద టేడాది రాజయ్య కోడలు ఫిర్యాదు హైదరాబాద్: మాజీ ఎంపీ రాజయ్య కుమారుడు అనిల్, వారి కుటుంబసభ్యులు సారికను తీవ్రంగా వేధించారని హైదరాబాద్‌లోని బేగంపేట మహిళా పోలీసుస్టేషన్ అధికారులు నిర్ధారించారు. ఆమె భర్త సనా అనే యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ సారికను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని తేల్చారు. 2014 ఏప్రిల్‌లో సారిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అనిల్‌పై సెక్షన్ 498 (వేధింపులు), సెక్షన్ 494 (వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు) కింద అభియోగాలు నమోదుచేశారు. అప్పట్లో న్యాయస్థానం ద్వారా వస్తే తప్ప సారిక ఫిర్యాదు కేసుగా మారలేదు. తనను వేధించిన వారిలో భర్తతోపాటు మామ రాజయ్య, అత్త మాధవి, సనా కూడా ఉన్నారని సారిక తన ఫిర్యాదులో ఆరోపించింది. వీరు తనను పనిమనిషి కంటే హీనంగా చూస్తున్నారని తెలిపింది. దర్యాప్తులో రాజయ్య ప్రమేయం వెలుగులోకి రాకపోవడంతో మిగతా ముగ్గురిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. సారికను ఇంటి పైఅంతస్తులో విడిగా ఉంచిన రాజయ్య కుటుంబం నెలవారి ఖర్చులకూ డబ్బు ఇవ్వకుండా వేధించిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఆమెతో సహా పిల్లల్నీ ఇంట్లోకి రానీయలేదని, పిల్లల చదువులకు అవసరమైన డబ్బులూ అందించకుండా నిత్యం అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారని అభియోగాలు మోపారు. ఇన్స్పెక్టర్ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు బాగానే ఉన్నప్పటికీ సనా అనే యువతితో అనిల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పట్నుంచి వారి ఇంటి పైఅంతస్తులో సారికను విడిగా ఉంచారు. వీటిని తాళలేక సారిక కోర్టును ఆశ్రయించింది. వరంగల్‌లో రాజయ్య తన రాజకీయ పలుకుబడితో కేసును నీరుగారుస్తారని, ఈ కేసును తాను వివాహం చేసుకున్న మారేడ్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంతానికి సిఫారసు చేయాలని సారిక అప్పీలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే వివాహం జరిగిన ప్రాంతం ఆధారంగా కోర్టు బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు కేసును అప్పగించింది. అనంతరం పలుమార్లు అనిల్, సారికలకు పోలీసులు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ అనిల్‌లో మార్పు రాలేదని తనకు, పిల్లలకు న్యాయం చేయాలంటూ సారిక మళ్లీమళ్లీ పోలీసుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో జరిగిన విచారణలో భాగంగా భర్త అనిల్, అత్త మాధవితో పాటు సనాపైనా చార్జీషీటు దాఖలు చేశారు. -
బతుకమ్మకు పుట్టింటికి వచ్చి..
కుటుంబీకులతో సంతోషంగా గడిపిన సారిక మృతితో తల్లడిల్లిన తల్లిదండ్రులు అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాద ఛాయలు సదాశివనగర్: బతుకమ్మ, దసరా పండుగకు నిజామాబాద్ జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని తన పుట్టింటికి వచ్చిన సారిక... తల్లిదండ్రులు, బంధువులతో సంతోషంగా గడిపింది. పుట్టింటి నుంచి వెళ్లిన కొద్దిరోజులకే తన కూతురు పిల్లలతో సహా సజీవ దహనమైందన్న సంగతి తెలిసి తల్లి హృదయం తల్లడిల్లింది. అనారోగ్యంతో ఉన్న తండ్రికి విషయం తెలియనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. వంగల శ్రీనివాస్‌చారి, లలిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. అర్చన, సారిక, దీపిక. సారిక రెండో కూతురు. బుధవారంనాటి ఘటన తెలియగానే అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో విషాదం అలుముకుంది. ముగ్గురు పిల్లలు కూడా సజీవ దహనం కావడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతు న్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అంటున్నారు. అత్తింటి వారే చంపారు.. తమ కూతురు సజీవదహనం కావడానికి భర్త అనిల్, అత్త మాధవి, మామ రాజయ్యలే కారణమని సారిక తల్లి లలిత, సోదరి అర్చన ఆరోపించారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘మా కూతురు ముగ్గురు కుమారులను చూసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కావాలనే కక్షతోనే చంపేశారు. సారిక భర్త, అత్త, మామలపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని లలిత అన్నారు. అర్చనతో కలిసి బుధవారం సాయంత్రం లలిత వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు. ‘నా బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఆమె విలపించారు. పిల్లల స్కూల్ ఫీజులు సైతం చెల్లించకుండా సారికను ఇబ్బంది పెట్టారని అర్చన తెలిపారు. -
మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘోరం..!
కోడలు, ముగ్గురు మనవళ్లు అగ్నికి ఆహుతి తెల్లవారుజామున గ్యాస్ లీకేజీతో ప్రమాదం! మూడేళ్లుగా కుటుంబ తగాదాలు.. మరో వివాహం చేసుకున్న రాజయ్య కొడుకు అనిల్ 2014లో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోడలు అత్తింటివారు వేధింపులకు పాల్పడుతున్నారంటూ కేసు సారిక మృతిపై అనేక అనుమానాలు.. వంటింట్లో ఉండాల్సిన సిలిండర్లు బెడ్రూంలోకి ఎలా వచ్చాయి? ఎవరూ ఊహించని పరిణామం.. వరంగల్ ఉప ఎన్నికల ముంగిట పెద్ద షాక్.. అందరినీ నిశ్చేష్టులను చేసే దిగ్భ్రాంతికర ఘటన.. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు! బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కొడుకులు అభినవ్, శ్రీయాన్, అయాన్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటు చేశారు. రాజయ్య, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల్లో విచారణ నివేదిక రానుంది. కాగా వరంగల్ ఉప ఎన్నిక బరి నుంచి రాజయ్య తప్పుకున్నారు. సాక్షి, హన్మకొండ: రాజయ్య నివాసంలో తెల్లవారుజామున 4, 5 గంటల మధ్య అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకే గదిలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. సారికతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలు పడక గది తలుపు వద్ద నేలపై, మరో బాలుడి మృతదేహం బెడ్‌పై పడి ఉన్నాయి. ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘అగ్ని ప్రమాదం జరిగినట్లు రాజయ్య ఇంటి నుంచి ఐదు గంటల సమయంలో ఫోన్‌కాల్ వచ్చింది. మేం వచ్చి చూసేసరికి ఇంటి మొదటి అంతస్తులో కాలిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. ఈ మరణాలపై శాస్త్రీయంగా విచారణ జరిపిస్తాం.’’ అని తెలిపారు. ఘటన చోటుచేసుకున్న గది వద్దకు పోలీసులు.. మీడియాతో పాటు ఇతరులెవరినీ అనుమతించలేదు. రాజయ్య ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మూడేళ్లుగా గొడవలే.. రాజయ్య, మాధవి దంపతులకు అనిల్ ఒక్కడే సంతా నం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అనిల్‌కు నిజామాబాద్ జిల్లా అడ్లూరుకు చెందిన సారికతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ క్లాస్మేట్స్. కాలేజీ హాస్టల్లోనే ఉండేవారు. ఆ సమయంలోనే ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఎవరికీ తెలియకుండా 2002లో హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. 2003లో చదువుల నిమిత్తం అనిల్ లండన్ వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్ది రోజులకే సారిక కూడా లండన్‌కు వెళ్లింది. 2005లో తిరిగి వచ్చిన తర్వాత వీరి వివాహ విషయం తెలుసుకున్న రాజయ్య కుటుంబీకులు అందరి సమక్షంలో యాదగిరిగుట్టలో పెళ్లి చేశారు. కొన్నాళ్లపాటు బాగానే ఉన్న వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అనిల్.. సనా అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. దీంతో గత మూడేళ్లుగా రాజయ్య కుటుంబ సభ్యులు, సారిక మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక 2013, 2014లో సారిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించడంతో పాటు తనకు న్యాయం చేయాలంటూ మామ ఇంటి ఎదుట ధర్నా చేసింది. బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. సొంతింటికి రావడంతో: గొడవల కారణంగా రాజయ్య హన్మకొండ రెవెన్యూ కాలనీలోని తన సొంత ఇంటిని కోడలికి ఇచ్చి కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఓ అపార్టుమెంట్లో కొంతకాలంగా ఉంటున్నారు. రాజయ్య భార్య మాధవి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ రాజయ్యతోపాటే ఉంటున్నారు. భర్త అనిల్ సారిక ఇంటికి రావడం మానేశాడు. కనీసం ఇంటి ఖర్చులకు సైతం డబ్బులు ఇచ్చేవారు కాదని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. మంగళవారం రాత్రి సమయంలో అనిల్, సారికకు మధ్య గొడవ జరిగిందని తెలిసింది. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ రావడంతో మూడ్రోజుల క్రితమే రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో అపార్టుమెంట్ కంటే సొంత ఇళ్లు బాగుంటుందని భావించిన ఆయన... ఇటీవలే రెవెన్యూ కాలనీలోని తన సొంతింటికి మారా రు. కింది పోర్షన్లో రాజయ్య దంపతులు, ఒకటో అంతస్తులో సారిక కుటుంబం ఉంటోంది. రెండో అంతస్తులోని పెంట్‌హౌస్‌కు అనిల్ వచ్చి వెళ్తుంటారని తెలిసింది. అందరూ ఒకేచోట చేరడంతో రెండ్రోజులుగా గొడవలు జరుగుతున్నాయని సమాచారం. బెడ్రూంలోకి సిలిండర్లు ఎలా వచ్చాయి? సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనమవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వంటగదిలో ఉండాల్సిన రెండు గ్యాస్ సిలిండర్లు బెడ్రూమ్కు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. కుటుంబ తగాదాల కారణంగా సారిక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లను బెడ్రూమ్కు తీసుకొచ్చి ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. వంట గ్యాస్ పూర్తిగా లీక్ కావడం వల్లే పేలిన శబ్దం రాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు సిలిండర్లలోని గ్యాస్ మొత్తం బయటికి వచ్చినా ఎవరూ పసిగట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తన కూతురు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. రాజయ్య కుటుంబీకులే తన కూతురి మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. నాలుగు మృతదేహాలు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్నాయి. సాయంత్రం 6:30 గంటలకు సారిక తల్లిదండ్రులు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. సమయం మించిపోవడంతో పోస్టుమార్టంను వైద్యులు గురువారానికి వాయిదా వేశారు. పోటీ నుంచి తప్పుకుంటున్నా: రాజయ్య వరంగల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు రాజయ్య తెలిపారు. కోడలు, ముగ్గురు మనవళ్లు సజీవ దహనమైన సంగతి తెలియగానే పార్టీ శ్రేణులు పెద్దఎత్తున రాజయ్య నివాసానికి తరలివచ్చాయి. జిల్లా కాంగ్రెస్ నేతలు, మాజీ ఎంపీలు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా.. ‘‘ఉప ఎన్నికల్లో నేను నిలబడను.. పోటీ నుంచి విరమించుకుంటాను’’ అని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా నేతలు పీసీసీ అధ్యక్షుడికి వివరించడంతో మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సంప్రదింపులు జరిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం నార్త్‌జోన్ ఐజీ నవీన్‌చంద్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఘటనాస్థలి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయి. దర్యాప్తు తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. -
'డబ్బు ఆశతోనే నా బిడ్డను చంపిన్రు'
వరంగల్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్యకు డబ్బు పిచ్చి చాలా ఎక్కువ అని సారిక తల్లి తెలిపారు. తన కూతురు చాలా ధైర్యవంతురాలు అని, తాను బతికుండగానే ఎన్నో కష్టాలను స్వయంగా భరించిందని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వివరించారు. తన కూతురు జాబ్ చేసిన పైసలన్నీ రాజయ్య కుటుంబానికే ఇచ్చిందని, ఒక్క పైస కూడా తన వద్ద ఉంచుకునేది కాదని తెలిపారు. ప్రేమ వివాహం కారణంగా కట్నం లేదని వారు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తారో అని నిత్యం కష్టపడి వారికి ప్రతి రూపాయి ఇచ్చిందని పేర్కొన్నారు. 'నేనుండగానే ఎన్నో బాధలు పడ్డది నా బిడ్డ. ఆమె చాలా ధైర్యవంతురాలు. మొన్నే ఫోన్ చేసింది. మంచిగానే ఉన్నా.. ఏమైనా గొడవైతే నేనే చూసుకుంటాను. మీరు రాకండి అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నాయన ఆరోగ్యం కూడా మంచిగ లేదు అని చెప్పింది. నా బిడ్డను వీళ్లే చంపిన్రు.. నా మనవళ్లను కూడా వీళ్లే హత్య చేసిర్రు. నా బిడ్డనాకే ధైర్యం చెప్పేది. నేను అన్ని సరుకులు పంపించినా. ఆమెకు ఎలాంటి అవసరాలు ఉన్నా అందించినా. నా బిడ్డకు వాళ్లు ఏనాడు సరిగా సహాయపడలేదు.. సరిగా చూసుకోలేదు. వాళ్ల అత్తమామకు(రాజయ్య ఆయన భార్య) డబ్బు ఆశ ఎక్కువ. వాళ్లే చంపేశారు' అంటూ ఆమె తీవ్రంగా రోధించింది. బుధవారం తెల్లవారుజామున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. -
'సారికను చంపిన వాళ్లను అలాగే చంపాలి'
-
అసలు రాజయ్య ఇంట్లో ఏం జరిగింది ?
-
'సారికను చంపినవాళ్లను అలాగే చంపాలి'
వరంగల్: తన కూతురు సారికను, తన మనవళ్లను చంపినవాళ్లను అలాగే చంపాలని సారిక తల్లి అన్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె చెప్పారు. బుధవారం తెల్లవారుజామున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తన కూతుర్ని, మనవళ్లను చిత్ర హింసలు పెట్టి హత్య చేశారని సారిక తల్లి ఆరోపించారు. రాజయ్య కొడుకు అనిల్ రెండో పెళ్లి చేసుకున్నాడని.. తన కూతురు, మనవళ్లను వైదొలగించుకోవడానికి వారి ప్రాణాలు తీశాడని సారిక తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నిజామాబాద్ జిల్లా వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన సారికను రాజయ్య కుమారుడు అనిల్ 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. సారిక, ఆమె కొడుకుల మరణవార్త తెలుసుకున్న సారిక పుట్టింటివారు వరంగల్ వచ్చారు. -
’హత్యా..ఆత్మహత్యా అనేది విచారణలో తెలుస్తుంది’
-
పోలీసుల అదుపులో రాజయ్య కుటుంబసభ్యులు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, వారి కుమారుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి ఇంటివద్దే విచారణ సాగించిన తర్వాత.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజయ్యపై ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు పెట్టారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, రాజయ్య తదితరులను తరలించే సమయంలో పలువురు మహిళలు పోలీసు వాహనాలకు అడ్డు రాగా, వారిని తోసేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఘటన జరిగినప్పుడు రాజయ్య, ఆయన భార్య, అనిల్ ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారని, డ్రైవర్లు కూడా అక్కడే ఉన్నారని సీపీ వివరించారు. ఈ కేసు అనుమానాస్పద మృతిగా తేలడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. విచారణను శాస్త్రీయంగా సాగిస్తామని, వైద్యులు ఇచ్చే నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారని సీపీ చెప్పారు. అగ్నిప్రమాదం వల్లే సారిక, పిల్లలు మరణించారని, అయితే అది ఎలా జరిగిందన్న విషయాన్ని మాత్రం అప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఇది హత్యా.. ఆత్మహత్యా అన్న విషయం విచారణలో మాత్రమే తేలుతుందని చెప్పారు. సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
పోలీసుల అదుపులో రాజయ్య కుటుంబసభ్యులు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, వారి కుమారుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి ఇంటివద్దే విచారణ సాగించిన తర్వాత.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజయ్యపై ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు పెట్టారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, రాజయ్య తదితరులను తరలించే సమయంలో పలువురు మహిళలు పోలీసు వాహనాలకు అడ్డు రాగా, వారిని తోసేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఘటన జరిగినప్పుడు రాజయ్య, ఆయన భార్య, అనిల్ ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారని, డ్రైవర్లు కూడా అక్కడే ఉన్నారని సీపీ వివరించారు. ఈ కేసు అనుమానాస్పద మృతిగా తేలడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. విచారణను శాస్త్రీయంగా సాగిస్తామని, వైద్యులు ఇచ్చే నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
నా సోదరిని వాళ్లే చంపేశారు...
వరంగల్ : సారిక మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని సారిక సోదరి అర్చన ఆరోపించారు. గతంలోనూ సారికను చాలాసార్లు వేధించారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. సారిక స్వస్థలం నిజామాబాద్ జిల్లా అడ్డూరు ఎల్లారెడ్డి. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అత్త మామ, భర్తే సారికను హతమార్చారని సోదరి అర్చన వ్యాఖ్యానించారు. రాజయ్య కుటుంబ సభ్యులను వదలొద్దని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా కూతురితో పాటు మనవళ్లు అగ్నికి ఆహుతి అవటంతో సారిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అత్త, మామ, భర్త...తన బిడ్డను మొదట్నించి వేధిస్తున్నారని మృతురాలు సారిక తల్లి లలిత కంటతడి పెట్టారు. దసరా పండుగకు తమ ఇంటికి వచ్చి వెళ్లిన బిడ్డ...ఇప్పుడు విగత జీవిగా మారిందంటూ విలపించారు. -
నలుగురు పూర్తిగా కాలిపోయారు..
-
విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి: సీపీ
వరంగల్ : కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మరణంపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ... ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ దుర్ఘటనపై ఇప్పటికిప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని సీపీ అన్నారు. ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు పూర్తిగా కాలిపోయారని, గ్యాస్ ఎలా లీక్ అయిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సారిక మృతికి సంబంధించి వివరాలను ఆమె ...అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా సారిక భర్త అనిల్ నిన్ననే హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చినట్లు సమాచారం. గత రాత్రి రాజయ్య కుటుంబ సభ్యులకు, సారిక మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. -
కోడలితో రాజయ్య కుటుంబానికి గొడవలు
-
కోడలితో రాజయ్య కుటుంబానికి గొడవలు
వరంగల్ : ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్-సారికలది ప్రేమ వివాహం. 2006లో పెద్దవాళ్లకు తెలియకుండా ఆర్య సమాజ్‌లో పెళ్లిచేసుకున్న వీరు... అమెరికా వెళ్లిపోయారు. అక్కడ సారిక ఉద్యోగం చేసేది. ఆమె సంపాదనతోనే భర్త అనిల్ జల్సాలు చేసేవాడని సమాచారం. కొన్నాళ్ల తర్వాత ఇండియా వచ్చిన వీరు... తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో రాజయ్య కుటుంబం... సారికను ఇంట్లో నుంచి గెంటేశారు. కొద్దిరోజుల తర్వాత రాజీ కుదిరి యాదగిరిగుట్టలో పెద్దలంతా కలిసి మళ్లీ అనిల్-సారికల పెళ్లి చేశారు. ఆ తర్వాత సారిక-అనిల్‌ను చిలకలగూడలో ఓ ఫ్లాట్ తీసుకుని కాపురం పెట్టారు. అయితే అనిల్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడంతో.... విసుగు చెందిన సారిక భర్తతోపాటు వరంగల్‌లోని అత్తింటికి వచ్చేసింది. ఆ తర్వాత చిలకలగూడలోని ఫ్లాట్‌లో... అనిల్ మరో అమ్మాయితో వుంటున్నాడని తెలుసుకున్న సారిక... అతనితో గొడవపడింది. అనిల్ తల్లిదండ్రులు కూడా కొడుకునే సపోర్ట్ చేయడంతో సారిక పోలీసులను ఆశ్రయించింది. ఇల్లు వదిలి వెళ్తే పరువు పోతుందని... ఇంట్లో ఉంటూనే భర్త, అత్తమామలపై చాలాసార్లు కేసు పెట్టింది. 2002 సంవత్సరంలో రాజయ్య కొడుకు అనిల్‌తో సారికకు పరిచయం ఏర్పడింది. 2006లో అనిల్, సారిక ప్రేమ వివాహం జరిగింది. రాజయ్య కోడలు సారికది నిజామాబాద్ జిల్లా. తనను, తన పిల్లలను సరిగా చూసుకోవడం లేదని, గతంలో అనేక సార్లు సారిక నిరసనకు దిగింది. కోర్టులో కేసు వేయగా అది విచారణలో ఉంది. కొద్దిరోజుల కిందట రాజయ్య ఇంటిముందు ధర్నాకు దిగారు. ప్రమాదం జరిగిన సమయంలో రాజయ్యతో పాటు ఆయన కుమారుడు అనిల్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై సారిక కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాము వచ్చేంతవరకు మృతదేహాలను కదిలించవద్దని పోలీసులను అభ్యర్థించినట్లు సమాచారం. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నందున అగ్నిప్రమాదం జరిగిన మొదటి అంతస్తులోకి పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీద్ బాబు స్వయంగా సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజయ్య కోడలు, మనవళ్ల మృతితో వారు నివసిస్తున్న ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. -
పోటీ చేయలేను, అభ్యర్థిని మార్చండి
-
పోటీ చేయలేను, అభ్యర్థిని మార్చండి: రాజయ్య
వరంగల్ : ఇప్పుడున్న పరిస్థితిలో తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని, అభ్యర్థిని మార్చాలని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య అన్నారు. తనను క్షమించండి అంటూ ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరారు. సిరిసిల్ల రాజయ్య ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో కోడలు సహా ముగ్గురు మనవళ్లు సజీవ దహనమయ్యారు. ప్రస్తుతం రాజయ్య.. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబసభ్యులు నలుగురూ ఒకేసారి చనిపోవడం ఇటు రాజకియంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో రాజయ్య ఇంట్లో విషాదం కారణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చే యోచనలో ఉంది. దీనిపై పా్టీ ముఖ్య నేతలు హైకమాండ్‌తో చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజయ్య ఇంట్లో దారుణం: నలుగురి సజీవదహనం