సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్ | Police Arrested Siricilla Rajaiah and his Family Member: sarika's e mail reveals | Sakshi
Sakshi News home page

సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్

Published Thu, Nov 5 2015 10:37 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్ - Sakshi

సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్

వరంగల్ :   అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక..న్యాయవాదికి  పంపిన ఈ మెయిల్స్ 'సాక్షి' టీవీ సంపాదించింది. రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక 2013, 2014లో సారిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించడంతో పాటు తనకు న్యాయం చేయాలంటూ మామ ఇంటి ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. 2014 ఏప్రిల్ 25న బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌లో గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది.

 

భర్త, అత్తమామలపై ఫిర్యాదుకు ముందు సారిక తన కష్టాలను ఈ మెయిల్‌లో న్యాయవాదికి వివరించింది. న్యాయం కోసం తుదివరకూ పోరాడిన ఆమె బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె...ముగ్గురు కొడుకులు అభినవ్, శ్రీయాన్, అయాన్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement