anil
-
నీ ఇంటికొచ్చి కొడతా నా కొ...కా...!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘నీ ఇంటికి వచ్చి కొడతా నా కొ...క... మరోసారి పొట్టి శ్రీరాములు గురించి మెసేజులు పెడితే బాగుండదు’ అంటూ ఒంగోలు (Ongole) ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ (Damacharla Janardhana Rao) పీఏ అనిల్... పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పేరకం నాగాంజనేయులుపై బెదిరింపులకు దిగడం సంచలనం సృష్టించింది. బాధితుడు తెలిపిన కథనం ప్రకారం... ఒంగోలులో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పేరకం నాగాంజనేయులుకు పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం ఉంది. రెండు రోజుల క్రితం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు సంబంధించిన ఓ వీడియోను అందరితో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏ అనిల్‌కు కూడా పంపారు. దీంతో అనిల్ రెచ్చిపోయాడు. ఫోన్ చేసి తిట్లదండకం అందుకున్నాడు. ‘అడుక్కుతినే నా కొ...క. మరోసారి మెసేజ్ పెడితే బాగుండదు.. ఇంటికొచ్చి కొడతా..’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నాగాంజనేయులపై టీడీపీ నేతలు దాడి చేశారని, అయినా తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని నాగాంజనేయులు ‘సాక్షి’కి తెలిపారు.చదవండి: మొత్తానికి రెడ్‌బుక్‌పై కన్నెర్ర.. కూటమికి ఇక బ్యాడ్ టైం! -
బడ్జెట్‌పై ఏపీ భారీ ఆశలు
-
ప్రైవేట్ వ్యక్తి చేతిలో ‘పోలింగ్’ ప్రక్రియ
సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన ఓటర్ల జాబితా ప్రక్రియ పర్యవేక్షణ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌గా ప్రైవేట్ వ్యక్తి బోడపాటి అనిల్‌ను నియమించడం చర్చ నీయాంశమైంది. తొలుత ఏడాది పాటు ఔట్ సోర్సింగ్ విధానంలో నెలకు రూ.1.40 లక్షల వేతనంతో ఈయన పని చేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎంపిక కమిటీ సిఫారసుతో ఈయన్ను నియమించామని తెలిపారు. ఎంపిక కమిటీలో ఎవరున్నారనేది ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్–నెట్‌ను ఐటీ ప్రాజెక్టు మేనేజర్ అమలు చేస్తారని తెలిపారు. ఈవీఎంలు, సాప్ట్వేర్ ట్రాకింగ్‌తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సర్వం ఇకపై బోడపాటి అనిల్ పర్యవేక్షణలో ఉంటాయి. తద్వారా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతకు పాతర వేయడమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.ఐటీ ప్రాజెక్టు మేనేజర్ విధులు ఇలా.. » ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏటా నిరంతర నవీకరణ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ–సేవా, మీ–సేవా కేంద్రాల ద్వారా ఎలక్టోరల్ రోల్స్‌లో పేరు చేర్చడం, పీవీసీ కార్డుల జారీ కోసం పౌర సేవల దరఖాస్తు అమలు స్థితిని రోజువారీ పర్యవేక్షించడం. » రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వివిధ సమస్యలను పర్యవేక్షించడం. » ఎస్ఎంఎస్ గేట్‌వే ఏకీకరణ, ఎస్ఎంఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయడం. » కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ అమలు పర్యవేక్షణ. ఐటీ అప్లికేషన్స్ (ఇఆర్ఓ–నెట్, సైబర్ సెక్యూరిటీ, ఈ–రోల్ పర్యవేక్షణ), ఫామ్ 1–8 డేటా పర్యవేక్షణ, జిల్లా అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం. » కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ల పర్యవేక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్, కౌంటింగ్ అండ్ ఇండెక్స్ కార్డు అప్లికేషన్ల పర్యవేక్షణ. » కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలతో ఆన్లైన్ కార్యకలాపాలు, ఐటీ సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణ. వీటితో పాటు ఓటర్ల జాబితా సవరణకు ముందు తీసుకోవాల్సిన చర్యలను పూర్తి చేయడం. -
చెప్పలేని మాటల్లో దుర్భాషలాడుతూ.. మంత్రి ఫరూక్ పీఏ వీరంగం
నంద్యాల, సాక్షి: ‘‘లం..కొడకల్లారా..మీకు కళ్లు కనపడవా..ఒక్కొక్కడికి ఉందిరా.. ఎవరి ఆస్తో తెలియకుండానే ట్యాక్స్ వేస్త్రారా’’ అంటూ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పీఏ అనిల్ నంద్యాల మునిసిపల్ అధికారులపై రెచ్చిపోయారు. నంద్యాలలోని మునిసిపల్ కార్యాలయానికి మంత్రి పీఏ అనిల్ కొంతమంది అనుచరులతో మంగళవారం వచ్చారు. వెంటనే రెవెన్యూ ఆఫీసర్ వెంకట కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గులాం హుస్సేన్‌లను మునిసిపల్ చాంబర్‌కు పిలిపించారు. వారు చాంబర్లోకి అడుగుపెట్టగానే తాళం వేసి ఇష్టమొచ్చినట్లు తిట్టారు. గట్టిగా అరుస్తూ మీ అంతు తేలుస్తా.. ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తా అంటూ బూతుపురాణం అందుకున్నారు. కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఎదుటే సిబ్బందిని తిడుతున్నా ఆయన కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. నంద్యాలలోని పద్మావతినగర్‌లో మంత్రి ఫరూక్‌కు చెందిన స్థలం ఉంది. దీనికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను మునిసిపల్ సిబ్బంది వేరొకరి పేరు మీద వేశారు. విషయం తెలుసుకున్న పీఏ అనిల్ రెచ్చిపోయారు. మునిసినల్ చాంబర్‌కు తాళాలు వేసి అధికారులను చెడామడా తిట్టారు. గంట సేపు అటువైపు ఎవ్వరినీ రానివ్వలేదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం మంత్రి పీఏ అనిల్ చేసిన రభసపై మునిసిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా..‘అదేదో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ. నాకు పూర్తిగా తెలియదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. -
తిరిగొస్తున్న బింబిసారుడు, కాకపోతే కథలో చిన్న ట్వీస్ట్
-
అమ్మానాన్న బొమ్మను రక్తంతో గీసి...
యాక్రలిక్, ఆబ్స్ట్రాక్ట్, పాప్ ఆర్ట్, పెయింటర్లీ, వాటర్ కలర్, ఆయిల్ పెయింట్, పేస్టల్స్ కాదేదీ పెయింటింగ్‌కు అనర్హం అన్నట్లు... విచిత్రంగా రక్తంతో బొమ్మలు గీసి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.. నగరానికి చెందిన అనిల్ కుమార్. కొందరు కాన్వాస్‌పై యాక్రిలిక్‌తో అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తే మరికొందరు మట్టిముద్దలతో శిల్పాలను రూపొందిస్తున్నారు.. ఇటీవల ఈ క్రియేటివిటీ మరింత పెరగడంతో ఒక్కొక్కరూ ఒక్కో వైవిధ్యమైన రీతిలో కళాకారులు మ్యాజిక్ చేస్తున్నారు. నగరానికి చెందిన యువ చిత్రకారుడు అనిల్ కుమార్ దీని కోసం బ్లడ్‌ను ఉపయోగిస్తూ... ‘రక్త’ సంబంధాలను సరికొత్తగా పునర్నిర్వచిస్తున్నాడు. అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. బ్లడ్ ఆర్ట్ అనే పదం వినడానికి ప్రత్యేకంగా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే ‘బ్లడ్ పెయింటింగ్ భావోద్వేగాలను పంచుకునేందుకు సాటిలేని మార్గం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ప్రేమికులు...తమ మధ్య ఉన్న బలమైన సంబంధాలను తెలియజెప్పేందుకు ఓ శక్తివంతమైన సాధనమని’ అనిల్ అంటున్నాడు. దైవకృపతో అబ్బిన కళ... దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అనిల్ కుమార్‌కు ఎటువంటి చదువు, సాధన లేకుండా చిత్రకళ అబ్బింది...అతని కళాత్మక ప్రయాణం 2019లో బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా ప్రారంభమైంది. ‘చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడం హాబీ..అలా అలా పోట్రెయిట్స్ గీయడం అలవాటైంది. బీటెక్ పూర్తి చేసినా ఏదో ఒక ఉద్యోగంలో ఇమడలేక పోట్రెయిట్ (పెన్సిల్ స్కెచింగ్) కళలో ప్రావీణ్యం సంపాదించాను. అప్పుడు నేను పెన్సిల్స్ (మైక్రో ఆర్ట్) మీద పేర్లు చెక్కడం ప్రారంభించాను’ అని అనిల్ చెప్పాడు. అయితే ఫేస్ డ్రాయింగ్లు మైక్రో ఆర్ట్ ద్వారా ప్రొఫెషనల్ అనిపించుకున్నప్పటికీ సరైన ఆర్డర్స్ లేక ఏదో ఒక ఉద్యోగం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమ్మాయి ‘కళ్ల’తో పుట్టిన కళ... బెంగుళూర్‌కు చెందిన మైక్రో ఆర్ట్ కస్టమర్ తన సోదరి కళ్లను తన రక్తంతో గీయమని అడిగారు. ‘తొలుత నేను ఒప్పుకోలేదు. బాగా రిక్వెస్ట్ చేయడంతో చేసిన ఆ వర్క్‌ని నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే బాగా రీచ్ వచ్చింది. అయినా అప్పుడు కూడా బ్లడ్ ఆర్ట్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత మా అమ్మానాన్నల మ్యారేజ్ డే రోజున నా రక్తాన్ని ఉపయోగించి వారిద్దరి చిత్రాలనూ గీశాను. అది వారి మనసుకు హత్తుకోవడం మాత్రమే కాదు నా భవిష్యత్తును మార్చేసింది’ అని అనిల్ గుర్తు చేసుకున్నాడు. దేశవిదేశాల నుంచి... అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. వేలాది మంది తమ ప్రియమైన వారి బ్లడ్ పెయింటింగ్స్ కోసం నాకు మెసేజ్ చేయడం ప్రారంభించారు. ‘దాంతో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనీసం కొన్ని వారాల పాటు సమయం తీసుకోవాల్సి వస్తోంది’ అని అనిల్ చెప్పాడు. జాగ్రత్తలు తప్పనిసరి..‘ఈ మాధ్యమాన్ని ఉపయోగించి చిత్రాలు గీసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రభావితమయ్యే మొదటి వ్యక్తి చిత్రకారుడే.. కాబట్టి.. గ్లవ్స్, మాస్క్ ధరించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి’ అని అనిల్ కుమార్ స్పష్టం చేశాడు. రక్తాన్ని సేకరించడం నుంచి గోడపై కళాకృతిని అలంకరించడం వరకూ... ప్రతీది కఠినమైన పరిశుభ్రతతో జరుగుతుందని చెప్పాడు. తమకు కావాల్సిన పోట్రెయిట్‌ను గీయించుకోవాలనుకున్న కస్టమర్స్... అనుభవజ్ఞులైన ల్యాబ్ టెక్నీషియ సాయంతో చిన్న ట్యూబ్ ద్వారా సేకరించిన బ్లడ్ (సుమారు 3 నుంచి 4గ్రా) అనిల్‌కు అందిస్తారు. దానిని కనీసం వారం రోజుల వరకూ భద్రంగా నిల్వచేసే అవకాశం ఉంటుంది. రోజుకు ఒక పోర్ర్టెయిట్ను మాత్రమే పూర్తి చేస్తున్నానని అనిల్ చెబుతున్నాడు. కస్టమర్ తీసుకెళ్లేవరకూ దుర్వాసన లేదా తేమను గ్రహించకుండా ఆర్ట్‌వర్క్‌ను సంరక్షించడానికి ఫిక్సేటివ్ స్ప్రేని ఉపయోగిస్తామన్నాడు. ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతితో వేసిన సిసలైన చిత్రకళ అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఏఐ కూడా రీ క్రియేట్ చేయలేని బ్లడ్ ఆర్ట్ భవిష్యత్తులో మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది’ అంటున్నాడు అనిల్. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే హత్య చేసిందో తల్లి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ రవీందర్ రెడ్డి, పటాన్చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పుల్కంపేటకు చెందిన స్వాతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో భర్త కుమార్ మృతి చెందాడు. వీరికి విష్ణువర్ధన్ (8)అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో స్వాతి ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్‌తో కలసి ఉంటోంది. మూడు నెలల నుంచి వీరు పాత రామచంద్రపురంలో నివాసం ఉంటున్నారు. అయితే తల్లి వ్యవహార శైలిపై కొడుకు నిలదీసేవాడు. ఈ క్రమంలో 10వ తేదీన తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కొడుకు తమకు అడ్డుగా ఉన్నాడని కోపం పెంచుకున్న స్వాతి తాగిన మైకంలో కొడుకు గొంతు నులిమి హత్య చేసింది. అనిల్‌కు తన కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నమ్మబలికింది. ఇద్దరూ కలసి మృతదేహాన్ని అదేరోజు రాత్రి పటాన్చెరు మండలం ముత్తంగి సర్వీస్ రహదారి పక్కన పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు పాత రామచంద్రపురానికి చెందిన బాలుడని తేలడంతో పోలీసులు స్వాతి ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల భయంతో స్వాతి, అనిల్ శుక్రవారం రాత్రి వారు ఉంటున్న గదిని ఖాళీ చేసేందుకు రాగా పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో కొడుకును తానే హత్య చేసినట్లు విచారణలో స్వాతి ఒప్పుకోవడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. -
రఫాలో ఇజ్రాయెల్ సైన్యం దాడి..భారత మాజీ సైనికాధికారి మృతి
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో భారతీయ మాజీ సైనికాధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే(46) బలయ్యారు. గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో అతడు ప్రయాణిస్తున్నవాహనం ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన అనిల్ కాలే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ విచారం వ్యక్తం చేసింది. తమ సైన్యం చేసిన దాడిపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. అనిల్ కాలే ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బి.ఎ. చదివాడు. ‘బిహేవియరల్ సైన్స్’, ‘ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియల్ లా’లో డిగ్రీలు సాధించారు.ఐఐఎం–లక్నో, ఐఐఎం–ఇండోర్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. 2004 ఏప్రిల్‌లో భారత సైన్యంలో చేరారు. 2009, 2010లోఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కంటింజెంట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సేవలందించారు. సైనికుడిగా జమ్మూకశీ్మర్‌లో పని చేశారు. 2022లో భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితమే ఐక్యరాజ్యసమితి డిపార్టుమెంట్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ(డీఎస్ఎస్)లో సెక్యూరిటీ కో–ఆర్డినేషన్ ఆఫీసరుగా చేరారు.అనిల్ కాలే సోమవారం ఉదయం ఐక్యరాజ్యసమితి వాహనంలో మరో డీఎస్ఎస్ అధికారితో కలిసి రఫాలోని యూరోపియన్ హాస్పిటల్‌కు బయలుదేరగా ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో అనిల్ కాలే మృతిచెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. ఐరాస సెక్రెటరీ జనరల్ గుటేరస్ ది్రగ్బాంతి కల్నల్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర విషాదానికి గురిచేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిల్ కాలే మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేశారు. అనిల్ కాలే కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. గాజాలో విధి నిర్వహణలో ఉన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందిపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను గుటేరస్ ఖండించారు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు.బందీలను విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. కల్నల్ వైభవ్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితిలోని భారత ప్రతినిధి బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంగళవారం సంతాపం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటం మొదలైన తర్వాత గాజాలో ఇప్పటివరకు 190 మందికిపైగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది మరణించారు. గాజాలో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన తొలి విదేశీయుడు అనిల్ కాలే కావడం గమనార్హం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన అనిల్ కాలే కుటుంబం పుణేలో స్థిరపడింది.మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయతి్నస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యుడు రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రశాంత్ కర్దే చెప్పారు. పుణేలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. అనిల్ కాలేకు భార్య అమృత, కుమారుడు వేదాంత్, కుమార్తె రాధిక ఉన్నారు. ఆయన సోదరుడు విశాల్ కాలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెపె్టన్‌గా పనిచేస్తున్నారు. సోదరుడి వరుసయ్యే కల్నల్ అమేయ్ కాలే భారత సైన్యంలో పనిచేస్తున్నారు. -
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
లేడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం 'శబరి'. ఈ చిత్రాన్ని మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ చిత్రం ద్వారా అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కాట్జ్ ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. 'శబరి' ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది?నాలుగైదేళ్ల క్రితమే 'శబరి' ఆలోచన వచ్చింది. ప్రాణానికి మించి మనం దేనిని అయినా ప్రేమిస్తే... అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది' ఇదీ నేను చెబుదామనుకున్న పాయింట్! మారుతున్న సమాజంలోనూ ప్రేమకు స్వచ్ఛమైన రూపం మాతృత్వంలో మాత్రమే ఉంది. పిల్లల విషయంలో చెడ్డ తల్లి ఉండదు. తల్లి ప్రేమలో నిజాయతీ ఉంటుంది. ఈ నేపథ్యంలో, తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఆ పాయింట్ చెబితే బాగుంటుందని కథ రాసుకున్నా.'శబరి' టైటిల్ పెట్టడం వెనుక కారణమేంటి?రామాయణం తీసుకుంటే శబరికి రాముడు సొంత కొడుకు కాదు.. ఆయన వస్తారని ఎన్నో ఏళ్లు ఎదురు చూసింది. రుచిగా ఉన్న ఫలాలు మాత్రమే ఇవ్వాలని.. ఒకవేళ ఆ ఫలాల వల్ల ప్రమాదం ఉందేమోనని ఎంగిలి చేసి ఇస్తుంది. ఆవిడ ప్రేమలో ఓ నిజాయతీ ఉంది. ఏపీలో శబరి పేరుతో నది ఉంది. కేరళలో శబరిమల పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు. సంస్కృతంలో శబరి అంటే 'ఆడ పులి' అని అర్థం. నా ప్రధాన పాత్రలో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకే ఆ టైటిల్ పెట్టాను.వరలక్ష్మీ శరత్ కుమార్‌ను ఎంపిక చేయడానికి గల కారణం?స్త్రీ ప్రధాన పాత్రల్లో చేయగల సత్తా ఉన్న ఆరిస్టులు ఇండియాలో తక్కువ మంది ఉన్నారు. ఆ కొందరిలో 'శబరి' చేయగల, సినిమా లీడ్ రోల్లో వేరియేషన్స్ అన్నిటినీ పండించగల ఆర్టిస్ట్ ఎవరున్నారని చూస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించారు. 'పందెం కోడి 2', 'తార తప్పటై', 'విక్రమ్ వేద', 'సర్కార్'లో మంచి పెర్ఫార్మన్స్ చేశారు. ఆవిడ హీరోయిన్గా కూడా సినిమాలు చేశారు. కానీ వరలక్ష్మి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కూడా చేశారు. ఆవిడ ఇంటర్వ్యూలు చూశాకే ఆఫ్ స్క్రీన్ క్యారెక్టరైజేషన్ నచ్చింది. దర్శకుడిగా ఆ స్వార్థంతో ఆమెను సంప్రదించా. చెన్నైలో కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదు. గోపీసుందర్ మ్యూజిక్ గురించి!'ఎంత మంచివాడవురా' చేసినప్పుడు ఆయన పరిచయం ఏర్పడింది. మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆయన ఇతర భాషల్లో చేసే సినిమాల పాటలు కూడా నాకు పంపిస్తారు. మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత మూవీ కంప్లీట్ అయ్యాక రీ రికార్డింగ్ చేశారు. సినిమా బాగుందని మెచ్చుకున్నారు.అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిందనే నిజమేనా?కథ విశాఖ నేపథ్యంలో సాగుతుంది. అంటే కథ రాసేటప్పుడు హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ అనుకున్నా. థ్రిల్లర్ సినిమాల్లో హిల్ స్టేషన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. వరలక్ష్మి మాకు డేట్స్ టైంలో మేం విశాఖ వెళ్లేటప్పటికి అక్కడ వాతావరణం మేం కోరుకున్న విధంగా లేదు. అప్పుడు కొడైకెనాల్ వెళ్లాం. అందువల్ల కొంత బడ్జెట్ ఎక్కువైంది. 'హనుమాన్' వంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువైనా విజయం సాధించిన తర్వాత అందరూ హ్యాపీ. 'శబరి'తో మా సినిమా టీమ్, ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ అవుతారని ఆశిస్తున్నా.పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ముందే అనుకున్నారా?నేను కథ అనుకున్నప్పుడు తెలుగులో తీయాలని అనుకున్నా. వరలక్ష్మికి తమిళంలో మార్కెట్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో చేస్తే బాగుంటుందని అనుకున్నా. మా నిర్మాత మహేంద్రనాథ్ పాన్ ఇండియా రిలీజ్ చేద్దామన్నారు. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. కథలో యూనివర్సల్ అప్పీల్, ఆ పొటెన్షియల్ ఆయన చూశారు. దీంతో ఓకే చెప్పా. 'శబరి' గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నా. మిగతా ప్రపంచాన్ని, మన బాధల్ని మర్చిపోయి చూస్తాం కదా! ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని 'శబరి' తీశా. ఇది థ్రిల్లర్ మాత్రమే కాదు... చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కేవలం భయపెట్టాలని ప్రయత్నిస్తే ప్రేక్షకులు థ్రిల్ అవ్వరు. తెరపై పాత్రలతో కనెక్ట్ అవ్వాలి. అది పాత్రలో ప్రేక్షకుడు తనని తాను ఊహించుకోవాలి.'శబరి' మంచి థ్రిల్ ఇస్తుంది. -
‘మా అబ్బాయి ఓడిపోవాలి’.. కేంద్ర మాజీ మంత్రి
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోక్‌సభ ఎన్నికలో ఓటమిపాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీ తరఫున పతనంతిట్ట పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడు అనిల్ ఆంటోని అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ పతనంతిట్ట సెగ్మెంట్లో ఓడిపోతుంది. అక్కడ నా కుమారుడు అనిల్ ఆంటోని ఓడిపోవాలని ఆశిస్తున్నా. అదేవిధంగా కేరళ సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆంటో ఆంటోనీ గెలుస్తారు. కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీ చేరటం చాలా పెద్ద తప్పు. ..కాంగ్రెస్ పార్టీనే నా మతం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ... ప్రధానమంత్రి మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పోరాడుతోంది. సీఎం పినరయి విజయన్ చేసే ఆరోపణలను కేరళ ప్రజలు అంత సీరియస్ తీసుకోరు. ఆ మాటలను కేరళ ప్రజలు అస్సలు నమ్మరు’ అని ఏకే ఆంటోని అన్నారు. బీజేపీ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని..ప్రతిపక్షాల ఇండియా కూటమికి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏకే ఆంటోని జోష్యం చెప్పారు. ఇక.. 2023లో అనిల్ ఆంటోని బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్వో రాజేష్,ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. సోమవారం హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐదుగురు సెల్ఫోన్లు ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. ఇదీ చదవండి: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు -
Shiv Sena: శివసేన ఎమ్మెల్యే అనిల్ మృతి.. సీఎం షిండే దిగ్భ్రాంతి
ముంబై: మహారాష్ట్రలో సీనియర్ రాజకీయనాయకుడు, శివసేన ఎమ్మెల్యే అనిల్ బాబర్(74) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇక, ఆయన మృతిపట్ల సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, గత కొద్దిరోజులు అనిల్ బాబర్ అనారోగ్యం కారణంగా సంగ్లీ జిల్లాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం కన్నుమూశారు. ఇక, అనిల్ మృతిపై సీఎం ఏక్నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షిండే.. బాబర్ మృతితో ఒక మార్గదర్శిని, సన్నిహితుడిని కోల్పోయినట్టు కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర ఒక సీనియర్ ప్రజాప్రతినిధిని కోల్పోయిందన్నారు. అలాగే, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని షిండే తెలిపారు. Shiv Sena MLA Anil Babar passes away at a hospital in Sangli district of Maharashtra. He was not keeping well for the last few days. Today's State cabinet meet has been cancelled. CM is leaving for Sangli to meet Babar's family. (Pic: Anil Babar's 'X' account) pic.twitter.com/EMLV24O271 — ANI (@ANI) January 31, 2024 మరోవైపు.. అనిల్ బాబర్ అకాల మరణం నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన మహారాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. అనిల్ మృతి పట్ల సంతాపం తెలియజేసేందుకు ఆయన కుటుంబ సభ్యులను సీఎం షిండే పరామర్శించనున్నారు. ఈ క్రమంలో సంగ్లీలోని అనిల్ నివాసానికి షిండే వెళ్లనున్నారు. ఇక, అనిల్ బాబర్ ప్రస్తుతం సంగ్లీ నియోజకవర్గం నుంచి శివసేన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
ప్రేమకు జై
అనిల్ బురగాని, ఆర్. జ్వలిత జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకు జై’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ని ప్రముఖ పాటల రచయిత శివశక్తి దత్త విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. నూతన నటీనటులు చాలా బాగా నటించారనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హీరో హీరోయిన్లతో పాటు ప్రతినాయకుడు దుబ్బాక భాస్కర్ బాగా నటించారు. మా సినిమాని నూతన సంవత్సరంలో విడుదల చేయనున్నాం’’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు, లైన్‌ప్రోడ్యూసర్: మైలారం రాజు. -
లవ్.. యాక్షన్.. రొమాన్స్
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు అనిల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘లవ్.. యాక్షన్.. రొమాన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక ప్రస్తుతం ‘నా సామిరంగ’ చిత్రంతో బిజీగా ఉన్నారు నాగార్జున. -
తొలి ప్రయత్నంలోనే హిట్టవడం ఆనందం
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పాలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ నెల 3న విడుదల చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా ముందుకు వెళ్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా వంశీ నందిపాటిని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అభినందించారు. వంశీ మంచి అభిరుచిగలవాడని, మొదటి ప్రయత్నంలో చిరస్మరణీమైన హిట్ అందుకోవడం తనకు ఆనందంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ యూనిట్ నవంబరు 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుందని కూడా ఆయన వెల్లడించారు. -
మా కష్టాన్ని మర్చిపోయే విజయం లభించింది
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా రూపోందిన హారర్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మా ఊరి పోలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ నెల 3న రిలీజ్ చేశారు.శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం వంశీ, గౌరీకృష్ణ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మా ఊరి పోలిమేర 1’ ఓటీటీలో విడుదలైనా, పార్ట్ 2 థియేటర్స్‌లో రిలీజై ఇంతటి ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం గౌరీకృష్ణ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మమ్మల్నిప్రోత్సహించిన ‘బన్నీ’ వాసు, వంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, అనిల్ విశ్వనాథ్. ‘‘ఈ సినిమా విషయంలో మూడు రోజుల నుంచి మేం చాలా కష్టపడ్డాం. ఆ కష్టాన్ని మర్చిపోయేలా మంచి విజయం దక్కడం హ్యాపీగా ఉంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘కలెక్షన్స్ రిపోర్ట్స్ చూసి హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు కామాక్షి. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులపై దాడి! అల్లుడిని దారుణంగా..
సాక్షి, సంగారెడ్డి: నెల రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులపై కత్తులతో దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. హత్నూర మండల పరిధిలోని నస్తీపూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నీరుడి అనిల్ రామచంద్రాపురం మండలంలోని స్టేషన్ నాగులపల్లి గ్రామానికి చెందిన అశ్విని (దగ్గరి బంధువులు) నెల రోజుల క్రితం ఇరువురి కుటుంబాలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. తమకు ప్రాణభయం ఉందని పోలీసులను ఆశ్రయించగా ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో అప్పటినుంచి నస్తీపూర్‌లోని అనిల్ ఇంటి వద్దే నూతన దంపతులు ఉంటున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నవంబర్ 5న పెద్దల సమక్షంలో వివాహం జరిపించేందుకు యువకుడి కుటుంబీకులు నిశ్చయించి పెళ్లిపత్రికలు ముద్రించారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు, బంధువులు సోమవారం తెల్లవారుజామున నస్తీపూర్‌లోని అనిల్ ఇంటిపై దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్తున్న క్రమంలో అడ్డుకోబోయిన భర్త అనిల్‌పై కత్తితో తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన అనిల్‌ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనిల్ తండ్రి నీరుడి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుకుమార్ తెలిపారు. ఇవి చదవండి: 'తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో..' ఇంకేదో కారణంతోనే అంటూ కన్నోళ్ల శోకం! -
‘రుద్రంకోట’ మూవీ రివ్యూ
టైటిల్: రుద్రంకోట నటీనటుటు: జయలలిత, అనీల్, విభీష, అలేఖ్య ,బాచి, రమ్య తదితరులు నిర్మాత:అనిల్ ఆర్కా కండవల్లి దర్శకత్వం: రాము కోన సంగీతం: సుభాష్ ఆనంద్, నిరంజన్ నేపథ్య సంగీతం: కోటి సినిమాటోగ్రఫీ: ఆదిమల్ల సంజీవ్ ఎడిటర్: ఆవుల వెంకటేష్ విడుదల తేది: సెప్టెంబర్ 22, 2023 రుద్రంకోట కథేంటంటే.. రుద్రంకోట ఊరిలో కోటమ్మ(సీనియర్ నటి జయలలిత)చెప్పిందే వేదం. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే.. స్త్రీలను కూడా శిక్ష విధిస్తుంది. ఆ ఊరికి కాపాలాగా రుద్ర(అనిల్ ఆర్కా కండవల్లి) ఉంటాడు. ఆయన కళ్లుగప్పి ఎవరూ ఊరు దాటలేరు. కోటమ్మ తప్ప మిగతా ఏ మహిళను కూడా రుద్ర కన్నెత్తి చూడడు. మాట్లాడడు. స్మశానంలోనే ఉంటూ ఊరికి కాపాలా కాస్తుంటాడు. అదే ఊరికి చెందిన శక్తి(విభీష)కు రుద్ర అంటే చచ్చేంత ప్రేమ. పట్నం నుంచి ఊరికి వచ్చిన కోటమ్మ మనవరాలు ధృతి(అలేఖ్య) రుద్రపై మోజు పడుతుంది. కానీ రుద్ర మాత్రం ధృతి కోరికను తిరస్కరిస్తాడు. ఇదిలా ఉంటే ఊరి చివర్లో కొంతమంది యువకులు ఓ అఘాయిత్యానికి పాల్పడతారు. అదేంటి? రుద్ర ప్రాణంగా ప్రేమించిన శక్తికి ఏం జరిగింది? అసలు రుద్ర నేపథ్యం ఏంటి? అమ్మాయిలంటే ఎందుకు గిట్టదు? శక్తి ప్రేమ సఫలం అయిందా లేదా? రుద్రపై పగ పెంచుకున్న ధృతి..చివరకు ఏం చేసింది? తప్పు చేసిన వాళ్లకు రుద్ర ఎలాంటి శిక్ష విధించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రమిది. లవ్ అండ్ లస్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాము కోన. కామంతో కొందరు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారనేది ఈ చిత్రంలో చూపించారు. అయితే ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ హీరో పాత్రను తీర్చి దిద్దిన తీరు బాగుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ.. దాని చుట్టు అల్లుకున్న కథలో మాత్రం బలం లేదు. కోటమ్మ పాత్ర పరిచయంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రుద్రగా హీరో ఎంట్రీ సీన్ బాగుంటుంది. ఎలాంటి సాగదీత లేకుండా మొదట్లోనే ముఖ్యమైన పాత్రలు..వాటి నేపథ్యాన్ని చూపించారు. దీంతో కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఆసక్తిని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనం నెమ్మదిగా సాగుతుంది. రొటీన్ సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. శక్తి, రుద్ర మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. డైలాగులు పేలవంగా ఉండడం సినిమాకు మైనస్. కోటమ్మ, రుద్ర పాత్రల నేపథ్యాన్ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. హీరోగా అనీల్‌కు తొలి సినిమా అయినా..ఎక్కడా తడబడకుండా నటించాడు. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన యువకుడు రుద్ర పాత్రలో ఒదిగిపోయాడు. కోటమ్మ పాత్రకు సీనియర్ నటి జయలలిత న్యాయం చేశారు. అమె పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. పల్లెటూరి అమ్మాయి శక్తిగా విభీష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న ధృతి పాత్రని అలేఖ్య న్యాయం చేసింది. తెరపై అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. సాంకేతిక విషయాలకొస్తే.. కోటి నేపథ్య సంగీతం జస్ట్ ఒకే. సుభాష్ ఆనంద్, నిరంజన్ అందించిన పాటు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా తన కెమెరాలో బంధించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
వాస్తవ ఘటనలతో...
నికిత శ్రీ, పృథ్వీరాజ్ (పెళ్లి), థర్టీ ఇయర్స్ పృథ్వీ, నాగమహేష్, జయవాణి కీలక పాత్రల్లో టీవీ రవి నారాయణన్ దర్శకత్వంలో ‘భ్రమర’ సినిమా షురూ అయింది. జి. మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత బెక్కం వేణు గోపాల్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత టి. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భ్రమర’’ అన్నారు టీవీ రవి నారాయణన్. ఈ చిత్రానికి సహనిర్మాత: కల్యాణ్ చక్రవర్తి. -
స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథే 'రుద్రంకోట'
అనిల్ ఆర్క కండవల్లి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రుద్రంకోట’. నటి జయలలిత ఓ కీలక పాత్రలో నటించి, చిత్ర సమర్పకురాలిగా వ్యవహరించారు. రాము కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విభీష, రియా హీరోయిన్లు. ఏఆర్కే విజువల్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాని ఈ నెల 22న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ– ‘‘స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది.భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటిగారు మా చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిమల్ల సంజీవ్, సంగీతం: సుభాష్ ఆనంద్, నిరంజన్. -
శ్మశాన వాటికలో పనిచేసే యువకుడి ప్రేమ కథే `రుద్రంకోట`
అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ కె విజువల్స్ పతాకంపై అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్నారు. సీనియర్ జటి జయలలిత సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర సెప్టెంబర్ 22న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర హీరో, నిర్మాత అనిల్ ఆర్కకండవల్లి మీడియాతో మాట్లాడుతూ..శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. ప్రేక్షకులకు కూడా మా చిత్రం కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని అన్నారు. -
ఎమ్మెల్సీ కవితను కలిసిన జాన్సన్‌నాయక్
ఖానాపూర్: బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్థిగా ఎంపిక అనంతరం బుక్యా జాన్సన్‌నాయక్ ఇప్పటికే జిల్లా మంత్రి ఐకేరెడ్డితో పాటు జి ల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులను రా ష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి పు ష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తె లిపారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే టికె ట్ను కేటాయించిన సీఎం కేసీఆర్‌తో పా టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జాన్సన్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన అనిల్ జాదవ్ నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని బోథ్ ని యోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. -
ఆప్టెక్ సీఈవో అనిల్ పంత్ కన్నుమూత
Aptech CEO Anil Pant passes away: ఆప్టెక్ (Aptech) ఎండీ, సీఈవో అనిల్ పంత్ (Anil Pant) మంగళవారం (ఆగస్టు 15) కన్నుమూశారు. ఈ మేరకు ఆప్టెక్ కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలియజేసింది. "కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ అనిల్ పంత్ మరణించారని తెలియజేయడానికి కంపెనీ విచారం వ్యక్తం చేస్తోంది. డాక్టర్ పంత్ సహకారం, శక్తిని కంపెనీ కోల్పోతోంది. కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు అందరూ ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు" అని ఆప్టెక్ కంపెనీ పేర్కొంది. గత జూన్ నెలలో అనిల్ పంత్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో నిరవధిక సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో తాత్కాలిక సీఈవోను ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఐటీ, కమ్యూనికేషన్ రంగంలో విశేష అనుభవం అనిల్ పంత్ 2016 నుంచి ఆప్టెక్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. దీనికి ముందు ఆయన సిఫీ టెక్నాలజీస్, టీసీఎస్‌లలో పనిచేశారు. ఐటీ, కమ్యూనికేషన్ రంగంలో పంత్‌కు 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆయన సేల్స్, నాణ్యత, డెలివరీ, మార్కెటింగ్, ఉత్పత్తి నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వహించారు. పంత్ మలేషియాలోని లింకన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీహెచ్‌డీని కూడా పొందారు. -
కరెంటుషాక్‌తో ఒకరు.. భయంతో మరొకరు..
కల్వకుర్తి టౌన్: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు నీటిగుంతలో కరెంటుషాక్‌కు గురై మరణించగా, మరొకరు భయంతో ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. కల్వకుర్తికి చెందిన అనిల్(18), రాజేశ్ వాటర్ప్లాంట్లలో ఆటోడ్రైవర్లు. తమ పనులు ముగిసిన తర్వాత కల్వకుర్తి తిమ్మనోనిపల్లి వద్ద ఉన్న నరసింహారెడ్డి వ్యవసాయ పొలంలోని నీటిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. పక్క పొలంలో ఉన్న కుర్మిద్దకు చెందిన శివ (22)ను సైతం ఈత కొట్టడానికి పిలిచారు. ముగ్గురు కలిసి నీటిగుంతలోకి దిగారు. అయితే అది లోతుగా ఉండటంతో నీటిని బయటకు తోడేందుకు విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. నీళ్లు తోడేస్తుండగా మధ్యలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వారు గుంతలోకి దిగి ఈత కొడుతున్నారు. కొద్దిసేపటికి కరెంటు సరఫరా కావడంతో అనిల్ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో భయాందోళనకు గురైన శివ సమీపంలోని మరో వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కొత్త ప్రపంచంలోకి వెళ్తారు
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఈ సినిమా నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. నెక్ట్స్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా, ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయబోతున్నాను’’ అని అన్నారు. -
హెచ్ఐవీ బాధితులా? డోంట్ వర్రీ.. సంబంధం చూసి పెడతారు
కొన్ని రకాల ఆరోగ్య సమస్యల పేరు పలకడానికి సైతం కొంతమంది సిగ్గుపడుతుంటారు. అలాంటిది ఆ రోగంతో బాధపడుతోన్న రోగికి మరో రోగి భాగస్వామి అయితే ఆ జంట మరికొంతకాలం సంతోషంగా జీవిస్తారని భావించిన అనిల్ వాలివ్ అలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లి సంబంధాలు కుదురుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాడు. పుణేకు చెందిన యాభైఏళ్ల అనిల్ వాలివ్ ప్రస్తుతం డిప్యూటీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి (ముంబై)గా పనిచేస్తున్నాడు. అది 2005... అనిల్‌కు ఎంతో ఇష్టమైన స్నేహితుడు హెచ్ఐవీ సోకి తన కళ్లముందే చనిపోవడం. అతని కొడుకుకి కూడా హెచ్ఐవీ సోకడం అనిల్‌ను ఎంతో బాధించింది. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక... ‘‘హెచ్ఐవీ వచ్చినంత మాత్రాన అంతటితో జీవితం అయిపోదు. వాళ్లకు భాగస్వామి ఉంటే జీవితం మరికొన్నాళ్లపాటు బావుంటుంది’’ అన్న ఉద్దేశ్యంతో 2005లో పాజిటివ్ సాథి వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో తన పైఅధికారులు కూడా ప్రోత్సహించడంతో వెబ్‌సైట్‌తోపాటు.. వివాహ వేదికలూ నిర్వహించేవాడు. అలా మొదలైన పాజిటివ్ సాథీ డాట్‌కామ్ క్రమంగా విస్తరించి నేడు వేలమంది పాజిటివ్ రోగుల పెళ్లిళ్లకు వారధిగా నిలుస్తోంది. బ్రెయిన్ సర్జరీ అయినప్పటికీ.. ఒకపక్క ఉద్యోగం... మరోపక్క సామాజిక సేవచేస్తోన్న అనిల్‌కు 2015లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సర్జరీ చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తరువాత కూడా సామాజిక సేవలో మరింత మునిగి పోయాడు. తాను చేసే సాయం సమాజం మెరుగుపడడానికి ఉపయోగపడాలని నిర్ణయించుకుని హెచ్ఐవీ రోగులకు పెళ్లి సంబంధాలు కుదర్చడాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. హెచ్వీ రోగికి మరో హెచ్ఐవీ జతను జోడిస్తూ ఇప్పటిదాకా వేలమంది పెళ్లిళ్లకు సాయపడుతూనే ఉన్నాడు. అంటరానివారిగా చూస్తుండడంతో... ఆర్టీవో అధికారిగా అనేకమందిని కలుస్తుంటాడు అనిల్. ఒకరోజు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి వస్తువులు రవాణా చేసే డ్రైవర్లకు ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ట్రక్కు డ్రైవర్లలో దాదాపు అందరు హెచ్ఐవీ సోకిన వారే అని తెలిసింది. హెచ్ఐవీ అని తెలియగానే..కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు అంటరానివారుగా చూస్తూ, తమని వదిలేశారని అనిల్‌కు కన్నీటితో తమ బాధను వెళ్లబోసుకున్నారు డ్రైవర్లు. ముందునుంచి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులపై ఉన్న సానుభూతితో...హెచ్ఐవీ సోకిన డ్రైవర్ల జాబితా తీసుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లి వారికి ట్రీట్మెంట్ అందించాలని కోరాడు. కొంతమంది ముందుకు రావడంతో వాళ్లతో డ్రైవర్లకు వైద్యం అందిస్తూ సామాజిక కౌన్సెలింగ్‌ను అందిస్తున్నాడు. వీరిలో ఆసక్తి ఉన్నవారికి జతను వెదికిపెడుతున్నాడు. ఎన్నిసైట్లు వెతికినా... పాజిటివ్ అమ్మాయిలకోసం ఎన్ని మ్యాట్రిమొనీ సైట్లు వెతికినా ఎక్కడా హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నవారికి సంబంధాలు చూసే సైటు ఒక్కటీ కనిపించలేదు. దీంతో తనే స్వయంగా సైటుని ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకోసం ఆసుపత్రులలోని హెచ్ఐవీ రోగుల డేటాను సేకరించాడు. వారి అనుమతితోనే positivesaathiను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సైట్లో కొన్ని వేలమంది తమ జతకోసం రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఇప్పటిదాకా మూడు వేలమందికిపైగా ఈ సైట్ ద్వారా వివాహం చేసుకున్నారు. అర్ధంతరంగా పోకుండా.. సైట్ నిర్వహణ అంత సులభంగా లేదు. కొంతమంది నకిలీ ప్రొఫైల్స్ తో రిజిస్టరు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లన్నీ సరిచూసుకోవడం కష్టం. ఎక్కువమంది తమ కులానికి చెందిన వారిని మాత్రమే పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ పాజిటివ్ రోగులకు జతను వెతికే పనిలో నేను బిజీగా ఉన్నాను. ఇలా పెళ్లిళ్లు జరిగితే హెచ్ఐవీ వ్యాప్తి కొంతవరకైనా నిరోధించవచ్చవచ్చు. వాళ్లు అంటరాని వాళ్లలా అర్ధంతరంగా చనిపోకుండా, కొంతకాలం అయినా తోడుతో ఆనందంగా జీవిస్తారు. – అనిల్ వాల్వి -
మంత్రిని ఆహ్వానించడానికి విద్యార్థులే దొరికారా?
ముంబై: మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు బృందం నుండి మంత్రి వర్గంలో కొత్తగా చేరిన అనిల్ భైడాస్ పాటిల్ సొంతూరు అమల్నెర్ తిరిగి వస్తున్న క్రమంలో ఆయనను స్వాగతించేందుకు స్కూలు పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా రెండు గంటల పాటు అమానుషంగా నిలబెట్టారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలోని ఒక వర్గం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ బృందంలో అనిల్ భైడాస్ పాటిల్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనిల్ మొదటిసారి ఆయన సొంతూరు అమల్నెర్ తిరిగొస్తున్న నేపథ్యంలో ఆయనను స్వాగతించడానికి స్థానిక ఆశ్రమశాల పాఠశాల పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టారు ఆ స్కూలు టీచర్లు. మంత్రి కాన్వాయ్ రావడం ఆలస్యం కావడంతో పిల్లలు అలాగే మంచినీళ్లు కూడా తాగడానికి లేనిచోట రెండు గంటలపాటు అలాగే కూర్చుని ఎదురుచూశారు. తీరా చూస్తే చాలాసేపు నిరీక్షణ తర్వాత వచ్చిన మంత్రి పిల్లలకు కనీసం అభివాదమైనా చేయకుండా వెళ్లిపోయారు. మంత్రి గారిని స్వాగతించడానికి పిల్లల్ని నిలబెట్టడమేమిటని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పాటిల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల పట్ల మంత్రి తీరు అమానుషమని దీనిపై వెంటనే విచారణ జరిపిస్తామని తెలిపారు జల్గావ్ జిల్లా అధికారులు. ఇదిలా ఉండగా తనకోసం చేసిన ఈ ఏర్పాట్ల గురించి తనకసలు తెలియదని అనిల్ పాటిల్ అన్నారు. Ridiculous. Young school students made to sit on roadside for 2 hours to welcome newly sworn in NCP rebel minister Anil Patil, returning to his City Amalner in Maharashtra. pic.twitter.com/413bOMFQhd — Nasreen Ebrahim (@EbrahimNasreen) July 9, 2023 ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్ గా మారిన రైల్వే స్టేషన్ -
గాజు ముక్కతో కళ్లలో పొడిచి.. బురదలో తొక్కి చంపి..
పరిగి: కలకలం రేపిన శిరీష మృతి మిస్టరీ కేసు వీ డింది. సొంత అక్క భర్తే హత్య చేసినట్లు విచారణ లో తేలిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలో మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాల ను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు యాదమ్మ, జంగయ్య దంపతులకు ఇద్దరు కూతు ళ్లు, పెద్ద కుమార్తె శ్రీలతను పరిగి పట్టణానికి చెందిన ఎర్రగడ్డపల్లి అనిల్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అనిల్‌కు వికారాబాద్‌లో నర్సింగ్ చేస్తున్న మరదలు శిరీష(18)పై కన్ను పడింది. ఈ క్రమంలో శిరీష ఫోన్లో వేరే యువకుడితో మాట్లాడుతోందని ఆమెపై కోపం పెంచుకున్నాడు. కాగా, ఇటీవల శిరీష తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను నగరంలో ని ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఇంట్లో ఉంటు న్న శిరీష ఈనెల 10న ఫోన్లో మాట్లాడుతుండటంతో తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ మందలించారు. ఇదే అదనుగా అనిల్ కూడా శిరీషను ఫోన్లో మందలించడంతో పాటు జంగయ్యతో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి పారిపోయిన శిరీష తీవ్ర మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఆమెను వెతికే క్రమంలో గోనె మై సమ్మ గుడివద్ద శిరీష ఉందన్న సమాచారం మేరకు అనిల్ అక్కడికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇన్ని రోజులూ తనతో కలవడానికి నిరాకరించి వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడతావా అంటూ కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. పగిలిన బీరు సీసా ముక్కతో కళ్లలో పొడిచాడు. పడిపోయిన శిరీషను పక్కనే ఉన్న నీటి కుంటలోకి లాక్కెళ్లి బురదలో తొక్కి.. చనిపోయిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. తొందరగా శిక్ష పడేట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
శారీరక సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదనే శిరీష హత్య
సాక్షి, వికారాబాద్:సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థిని శిరీష హత్యకేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్ అని పోలీసులు తేల్చారు. శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరించారు. శిరీషకు శారీరకంగా దగ్గరై, ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని అనిల్‌కు దురాలోచన ఉంది. అయితే శిరీష అతనికి సహకరించలేదు. శిరీష తరచూ ఫోన్లలో మరో వ్యక్తితో చాటింగ్ చేయడం, మాట్లాడుతుండటంతో అనిల్‌లో కోపం పెరిగింది. ఈ విషయంలో ఆమె తండ్రి, సోదరుడు.. బావ అనిల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పలుమార్లు అనిల్ ఆమెపై దాడి చేశాడు. హత్యకు ముందు రోజు సాయంత్రం అనిల్ కొట్టడంతో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. శిరీష వెనుకాలే ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అనిల్ ఆమెతో గొడపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు బీరు సీసాతో దాడిచేసి నీటికుంటలో ముంచి హతమార్చాడు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరుపుతామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో శిరీష పై అత్యాచారం జరగలేదని వెల్లడైనట్టు ఎస్పీ చెప్పారు. జరిగింది ఇదే.. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్ పూర్తిచేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తల్లి యాదమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు శిరీష అన్న శ్రీకాంత్ హైదరాబాద్‌లో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నాడు. ఇంటి వద్ద తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ ఉంటున్నారు. భోజనానికి ఇబ్బంది అవుతోందని భావించిన తండ్రి.. రెండు నెలల కిందట కుమార్తెను కాళ్లాపూర్‌కు రప్పించాడు. ఆమె తమ్ముడు శ్రీనివాస్ శనివారం రాత్రి పరిగిలో ఉంటున్న తన మరో అక్క భర్త అనిల్‌కు ఫోన్ చేసి.. శిరీష వంట చేయడంలేదని తెలిపాడు. దీంతో వెంటనే కాళ్లాపూర్ వచ్చిన అనిల్.. శిరీషను మందలించి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదే విషయమై తండ్రి కూడా శిరీషను కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై రాత్రి పదిన్నర తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. ఆమె రెండు కళ్లను పొడిచి, గొంతుకోసినట్లు, తలకు బలమైన గాయాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధానంగా శిరీష కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం కావడంతో ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బావపై అనుమానం బలపడటంతో, లోతుగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఇదీ చదవండి: భర్తతో విడిపోయినవాళ్లే ఆ బాబా టార్గెట్ -
రాజన్న సిరిసిల్లలో ముగిసిన జవాన్ అనిల్ అంత్యక్రియలు
-
దుఃఖంలోనూ భర్తకు సెల్యూట్ చేసిన భార్య సౌజన్య
బోయినపల్లి(చొప్పదండి): జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన అనిల్ అంతిమయాత్ర కుటుంబ సభ్యుల రోదనలు, బంధువులు, ప్రజాప్రతినిధుల ఆశ్రునయనాల మధ్య ముగిసింది. శనివారం ఉదయం అనిల్ భౌతికకాయం ఆయన స్వగ్రామమైన మల్కాపూర్‌లోని ఇంటికి చేరడంతో మండలవ్యాప్తంగా జనం భారీగా తరలివచ్చారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి గంగాధరకు చేరుకుంది. అక్కడ పలువురు యువకులు జాతీయ జెండాలతో స్వాగతం పలికి ర్యాలీగా మల్కాపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆర్మీ అధికారులు సైనికలాంఛనాలతో గౌరవ వందనం చేశారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభించారు. అనిల్ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మీ సిబ్బంది గౌరవ వందనం చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. అనిల్ పెద్ద కుమారుడు అయాన్ తండ్రి చితికి నిప్పంటించాడు. నిన్ను విడిచి ఎలా ఉండాలే బావా.. అనిల్ భార్య సౌజన్య రెండురోజులుగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉంది. ‘బావా నిన్ను విడిచి నేనెలా ఉండాలే బావా.. పిల్లలను ఎట్ల సాదాలే బావా.. అని రోదించడం చూసేవారిని కంటతడి పెట్టించింది. ‘నన్ను పోలీస్‌గా చూడాలని అంటివి. నీ మాటతోనే ఎస్సై పరీక్ష రాసిన బావ..’ రెండు నెలలైతే దగ్గరికి బదిలీ చేయించుకుంట అంటివి.. అంతలోనే ఘోరం జరిగిందా బావా..’ అంటూ భర్త ఫొటో ఉన్న ఫ్లెక్సీ వద్ద విలపించింది. అనిల్ తల్లి లక్ష్మి, అనారోగ్యంతో ఉన్న తండ్రి మల్లయ్య ఏడుస్తుండడాన్ని ఆపడం ఎవరితరమూ కాలేదు. కుమారులు అయాన్, అరయ్ సైతం తండ్రి శవపేటిక వద్ద విలపించారు. అమరుడైన భర్తకు భార్య సెల్యూట్ అనిల్ భౌతికకాయాన్ని చితిపై పెట్టిన అనంతరం సైనికులు గౌరవ వందనం చేశారు. సైనిక గీతం ఆలపించిన సమయంలో అంతులేని దుఃఖంలోనూ సౌజన్య భర్త భౌతికకాయానికి సెల్యూట్ చేయడం అక్కడున్నవారిని మరింత కంటతడి పెట్టించింది. తండ్రి చితికి ఆయన పెద్ద కుమారుడు అయాన్ నిప్పు పెట్టాడు. అనిల్ సైనిక యూనిఫాంను ఆర్మీ అధికారులు సౌజన్యకు అందించారు. హాజరైన మంత్రి గంగుల, ఎంపీ సంజయ్ అనిల్‌కు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ తదితరులు నివాళులు అర్పించారు. అంత్యక్రియలు ముగిసేవరకూ అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ అనిల్ పాడె మోశారు. అంతిమయాత్రలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, వేములవాడ ఆర్డీఓ పవన్‌కుమార్, రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీలు కత్తెరపాక ఉమ, నాగం కుమార్, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, సర్పంచు కోరెపు నరేశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, ఎంపీడీఓ నల్లా రాజేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, బోయినపల్లి ఎస్సై మహేందర్ బందోబస్తు నిర్వహించారు. అనిల్ కుటుంబాన్ని ఆదుకుంటాం అనిల్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అనిల్ అంత్యక్రియలు పూర్తయిన అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన కుటుంబాన్ని పరామర్శించామని, యువ జవాన్‌ను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
జవాన్ అనిల్ కు కన్నీటి వీడ్కోలు..
-
రాజన్న సిరిసిల్లలో ఆర్మీ జవాన్ పీ.అనిల్ అంత్యక్రియలు
-
స్వగ్రామానికి జవాన్ అనిల్ భౌతికకాయం.. నేడు అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/బోయినపల్లి(చొప్పదండి): జమ్మూ కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన ఆర్మీ జవాన్ పి.అనిల్ భౌతికకాయం శనివారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. అనిల్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనిల్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్. ఇక, హైదరాబాద్‌కు చెందిన ఆర్మీ అధికారులు శుక్రవారం మల్కాపూర్‌ను సందర్శించారు. జమ్మూకశ్వీర్, హైదరాబాద్ నుంచి సైనికాధికారులు రానున్నారని, అంత్యక్రియల స్థలం విశాలంగా ఉండేలా చూడాలని కుటుంబ సభ్యులను కోరారు. అంతకుముందు.. శుక్రవారం సాయంత్రం హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు అనిల్ పార్థీవదేహం చేరుకుంది. ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన అనిల్ పార్థివదేహానికి తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా హెడ్–క్వార్టర్స్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ రాకేశ్ మనోచ నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన అనిల్ జమ్మూకశ్మీర్‌లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. హెలికాప్టర్ కూలి ఓ నదిలో పడిన ప్రమాదంలో అనిల్ మృతిచెందాడు. అయితే, ఇటీవలే 45 రోజుల పాటు లీవ్‌లో ఉండి పదిరోజుల క్రితమే మళ్లీ త్వరలోనే వస్తానని చెప్పి అనిల్ వెళ్లిపోయాడు. ఇంతలోనే ప్రమాదంలో ఇలా మృతిచెందడంతో మాల్కాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్ అనిల్ మృతి పట్ల రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువ జవాన్‌ను కోల్పోవడం బాధాకరమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది కూడా చదవండి: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
ఎమ్మెల్సీ కవితపై కీలక అభియోగాలు మోపిన ఈడీ.. తెరపైకి భర్త అనిల్ పేరు..
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులోలో అరుణ్ పిళ్లైపై ఈడీ కీలక అభియోగాలు నమోదు చేసింది. సౌత్ గ్రూప్ హవాలా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చేరినట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సే కల్వకుంట్ల కవితపై కూడా ఈడీ కీలక అభియోగాలు మోపింది. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర కీలకంగా ఉందని తెలిపింది. ఈ గ్రూప్‌నకు లాభం కలిగేలా ఆప్ నేతలు వ్యవహరించినట్లు తెలిపింది. లిక్కర్ స్కాంలో కవితకు ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించినట్లు అభియోగపత్రంలో పేర్కొంది. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో హైదరాబాద్‌లో భూములు కొన్నట్లు గుర్తించామంది. మూడో ఛార్జ్‌షీట్‌లో ఫీనిక్స్ పేరును ఈడీ తెరపైకి తెచ్చింది. దీని ద్వారానే భూములు కొన్నట్లు తెలిపింది. ఫీనిక్స్ శ్రీహరి పాత్రపై ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ పేరును కూడా ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. కాగా.. ఆడిటర్ బుచ్చిబాబు మార్చి 28న ఈడీ ముందు కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కవిత ఆదేశాల మేరకే భూముల కొనుగోలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ సంస్థ నుంచి 25 వేల అడుగుల ప్రాపర్టీ ఎంగ్రోత్ సంస్థ కొనుగోలు చేసిందని, ఫినిక్స్ శ్రీహరి ద్వారా ఈ కొనుగోలు తతంగం జరిగిందని తెలిపింది. 'బయటి రేటు కంటే తక్కువ ధరకు కవిత భూములను కొనుగోలు చేశారు. మార్కెట్ ధర అడుగుకు రూ.1,760 అయితే, కవిత డిస్కౌంట్ కు కొనుగోలు చేసిన ధర అడుగుకు రూ.1,260 మాత్రమే. ఎంగ్రోత్ సంస్థలో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ భాగస్వామి. ఆమె పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో భూములను చౌక ధరకు కొనుగోలు చేయగలిగారు. నల్లధనాన్ని వైట్‌గా మార్చేందుకే భూముల కొనుగోలు చేశారు.' అని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. చదవండి: రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..! -
అదానీ, ఐదుగురు నేతలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
-
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ రాజీనామా
కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అనిల్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్ ఆంటోనీ పోస్టు చేయగా.. తన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ అతనికి కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ఒత్తడి ఎదురైంది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. మోదీపై డాక్యుమెంటరీపై విమర్శించిన మరుసటి రోజే అనిల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలని విపరీతమైన ఒత్తిడి చేశారు. అది కూడా వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారి నుంచి వచ్చింది. కానీ దానికి నేను నిరాకరించాను. ప్రేమను ప్రచారం చేసే వారే ఫేస్బుక్లో నాపై ద్వేషాన్ని వెల్లగక్కుతున్నారు. దీనినే హిపోక్రసీ అంటారు. జీవితం సాగుతూనే ఉంటుంది’ అంటూ ట్విటర్లో రాజీనామా లేఖను కూడా పోస్టు చేశారు. ‘నిన్నటి నుంచి సంఘటనలను పరిశీలిస్తే కాంగ్రెస్‌లోని నా అన్ని పదవులను వదిలేయడానికి సరైన సమయమని నమ్ముతున్నాను. కేపీసీసీ డిజిటల్ మీడియా కన్వీనర్, ఏఐసీసీ సోషల్ మీడియా- డిజిటల్ కమ్యూనికేషన్ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఇక్కడ ఉన్న కొద్ది కాలంలో నాకు సహరించిన కేరళ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, నేతలకు, పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఎంపీ శంశిథరూర్‌కు ధన్యవాదాలు.’ అని తెలిపారు. ఇక ఇప్పటికే మోదీపై ‘ఇండియా ద మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. భారతీయ సంస్థలపై బ్రాడ్‌కాస్టర్ అభిప్రాయాలను వెల్లడించడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ లోని వివిధ విభాగాలు ప్రకటించిన తరుణంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. చదవండి: కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW — Anil K Antony (@anilkantony) January 25, 2023 -
BBC Documentary On Modi: కాంగ్రెస్ నాయకుడి కొడుకు ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదంలో మోదీకి ఊహించని వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. అందులో భాగంగా మోదీకి ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొడుకు నుంచి ఆశ్చర్యపరిచే రీతిలో సపోర్టు లభించింది. ఈ మేరకు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని ఆ డాక్యుమెంటరీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ సంస్థలపై బ్రాడ్‌కాస్టర్ అభిప్రాయాలను ఉంచడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మన స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా మన సంస్థలపై పెత్తనం చెలాయించి, సార్వభౌమాధికారిన్ని అణగదొక్కేలా చేసేందుకు అనుమతించకూడదన్నారు. మన గ్రంథాలు ఉపనిషత్తులు, భగవద్గీత చదివితే గనుక సత్యం ఎప్పటికైనా.. బయటకు వస్తుందన్న విషయం తెలుస్తుందన్నారు. పతిక్రలను అణిచివేసి, సంస్థలు నియంత్రించి, ఆఖరికి ఈడీ, సబీఐలు ఉపయోగించకోవచ్చు, కానీ నిజం ఎప్పటికీ నిజమే అని చెప్పారు. అది ప్రకాశవంతంగా ఉంటుందని, దానికి బయటకు వచ్చేసే దుష్ట అలవాటు ఉందని అన్నారు. ప్రజలను ఎన్ని అణివేతలకు గురిచేసి భయబ్రాంతులకు గురిచేసినా.. నిజాన్ని బయటకు రాకుండా ఆపలేమని నొక్కి చెప్పారు. ఇటీవల భారత జోడో యాత్రలో రాహుల్ ఆ డాక్యుమెంటరీని నిరోధించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశ్నించిన రోజునే అనుహ్యంగా సీనియర్ నాయకుడు కుమారుడు అనిల్ ఆంటోని నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. తన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి విరుద్ధంగా యూటర్న్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే కేంద్రం ఆ వివాదాస్పద డాక్యుమెంటరీ లింక్‌లకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్ట్‌లను తొలగించాలని ఆదేశించింది. అలాగే విదేశీ మంత్రిత్వ శాఖ సైతం నిష్పక్షపాతం లేని వలసవాద మససతత్వానికి నిదర్శనం అంటూ బీబీసీని తిట్టిపోసింది. (చదవండి: ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ) -
ఉత్తమ్ ముసుగు వీరుడు.. కౌశిక్ రెడ్డికి రూ.8 కోట్లు ఇచ్చాడు: అనిల్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం ముదిరిన వేళ అసంతృప్త సీనియర్ నేతలపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎల్పీ, మాజీ పీసీసీ సహా ఇతర నేతలు రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను, రేవంత్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముసుగు వీరుడని అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరు నారాయణ రెడ్డిని బీజేపీలోకి పంపించిందే ఉత్తమ్ అని ఆరోపించారు. సీనియర్ నేత పొన్నాలకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారని పేర్కొన్నారు. సీఎల్పీ పదవి రాలేదని తెలంగాణలో కాంగ్రెస్‌ను ఉత్తమ్ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డికి ఆయన రూ.8కోట్లు ఇచ్చారని అన్నారు. కోవర్టుగా పనిచేసినందుకే కౌశిక్ టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ అయ్యారని పేర్కొన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టా కాదా? అని ప్రశ్నించారు. ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ ప్రాణాళికలు సిద్ధం చేస్తుంటే.. దాన్ని దెబ్బ తీయాలని కొందరు సొంతపార్టీ నేతలు చూస్తున్నారని అనిల్ ఆరోపించారు. పార్టీ ముగుసు వీరులు ఇప్పుడు బయటకు వచ్చారని పేర్కొన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తుకు రాలేదని అనిల్ ప్రశ్నించారు. ఆనాడు పీసీసీగా ఉన్నవాళ్లు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఉత్తమ్ ఏం చేశారని ప్రశ్నించారు. సీనియర్లంతా పార్టీకోసం పనిచేస్తే మునుగోడులో 50వేల ఓట్లతో కాంగ్రెస్ గెలిచేదని వ్యాఖ్యానించారు. కాగా.. పీసీసీ కమిటీల్లో టీడీపీ వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన 12 మంది నేతలు పదవులకు రాజీనామా చేశారు. చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 13 మంది రాజీనామా -
గ్రీన్కో గ్రూప్ సంస్థ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
యాక్టర్‌గా మారిన టీచర్.. ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్న యూట్యూబర్ అనిల్
సాక్షి, కరీంనగర్(మల్యాల): అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే విజయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదంటున్నాడు.. యూట్యూబ్ స్టార్ అనిల్ జీల. టీచర్ కావాల్సిన వ్యక్తి యాక్టర్‌గా సక్సెస్ అయ్యాడు. మారుమూల పల్లెనుంచి వచ్చిన వ్యక్తి తనప్రతిభతో దేశంలోనే నంబర్‌వన్ వెబ్‌సిరీస్ తీస్తున్నాడు. అంకితభావం, పట్టుదల, స్వయంకృషి, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చంటూ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. జన్మనిచ్చింది దర్గాపల్లి అయితే యూట్యూబ్ వైపు అడుగులు నేర్పింది మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. నటుడు, ఎడిటర్, సినీ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్న ట్రెండ్ సెట్టర్ అనిల్‌పై సండే స్పెషల్.. వ్యవసాయ కుటుంబం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గాపల్లి గ్రామానికి చెందిన జీల మల్లేశం–నిర్మల పెద్ద కుమారుడు అనిల్. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. ఆది నుంచి అన్నింటిలో ముందుండాలనే సంకల్పం, క్రమశిక్షణతో అందరి మన్ననలు పొందాడు అనిల్. స్వయం కృషితో తనదైన లోకాన్ని సృష్టించుకున్నాడు. సెల్‌ఫోన్ వాడటం తెలిసిన యువతకు అనిల్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ చోట తనదైన ముద్ర అనిల్ జీల జీవితంలో ప్రతి చోట తనదైన ముద్ర వేసుకున్నాడు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు హోటల్లో పనిచేస్తూ చదువు కొనసాగించాడు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు టీ అమ్మేవాడు. సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రి 8గంటల వరకు హోటల్లో పనిచేస్తూ చదువుకుని పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. ఇంటర్లో సైతం టాపర్‌గా నిలిచి సత్తా చాటాడు. అనంతరం బుక్స్టాల్లో సేల్స్ బాయ్‌గా పనిచేసి తన ఆలోచనలకు పదును పెడుతూ సామాన్యులకు పుస్తకాలను చేరువ చేశాడు. చదవండి: నో కాంట్రవర్సీ కామెంట్స్.. ఆద్యంతం నవ్వులు పండించిన మునావర్ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభం అనిల్ జీల కరీంనగర్‌లోని ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో టీటీసీ పూర్తిచేశాడు. అనంతరం జమ్మికుంటలోని ఆవాసంలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తనలోని నటనా ఆసక్తి, ఆలోచలనకు రూపం ఇస్తూ, షార్ట్‌ఫిల్మ్స్ చిత్రీకరణ ప్రారంభించాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగాలనే తనలోని ఆలోచనలకు అనుగుణంగా ఆచరిస్తూ విద్యార్థులకు బోధించాడు. అనంతరం లంబాడిపల్లికి వచ్చి షార్ట్‌ఫిల్మ్‌లో నటించడం ప్రారంభించి తనలోని నటనతో ప్రపంచాన్ని మెప్పించాడు. వ్లాగ్ నుంచి సినిమాల వైపు.. అనిల్ సహజసిద్ధ నటన పల్లెటూరి సామాన్యుల నుంచి సినీ ఇండస్ట్రీని సైతం ఆకర్షించింది. హాస్యం, జానపద పాటలు, డాక్యుమెంటరీ ఇలా అన్నిరకాల కేటగిరీల్లో ప్రతిభ కనబర్చాడు. దీంతో యువకులకు క్రేజీ హీరోగా మారాడు. అనిల్ ఏది చేసినా ట్రెండింగ్‌గా మారడంతో ట్రెండింగ్ స్టార్‌గా ముద్రపడింది. గతంలో హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించాడు. ఎస్ఆర్ కల్యాణ మండపంలో ప్రధానపాత్రలో, డిగ్రీ కాలేజ్, ఫ్రెషర్ కుక్కర్, అర్ధ శతాబ్దం వంటి సినిమాల్లో సైతం నటించాడు. పెళ్లిలో సైతం ప్రత్యేకతే.. అనిల్ పెళ్లి సైతం ప్రత్యేకత సంతరించుకుంది. తెలంగాణ యాసలో రాసిన పత్రిక వైరల్‌గా మారింది. ‘శుభలేకలో శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు స్థానంలో శానిటైజర్ ఫస్టు.. మాస్కు మస్టు.. సోషల్ డిస్టాన్స్ బెస్ట్ అంటూ కరోనా కాలంలో పాటించాల్సిన నియమాలు రాశారు. తల్వాలు పడ్డంక ఎవరింట్ల ఆళ్లే బువ్వ తినుండ్రి. బరాత్ ఉంది కాని ఎవరింట్ల వాళ్లే పాటలు పెట్టుకుని ఎగురుండ్రి. కట్నాలు మాత్రం గూగుల్ పే, ఫోన్ పే చేయుండ్రి’ అంటూ తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు. కట్నాల రూపంలో వచ్చిన సుమారు రూ.80వేలకు మరో రూ.20వేలు కలిసి కరోనా కాలంలో బాధపడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఇంటింటికీ తిరిగి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు అనిల్ జీల. ఇండియాలో నంబర్ 1 అనిల్ అడుగడుగునా అంకితభావం, పట్టుదల, సాధించాలనే తపనతో ముందుకుసాగుతున్నాడు. నిహారిక కొణిదెల నిర్మాతగా హలో వరల్డ్ వెబ్ సిరీస్ ఇండియా మొత్తంలో జీ5 నిర్మించిన అన్ని వెబ్‌సిరీస్‌లలో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోకెల్లా అనిల్ నటించిన హలో వరల్డ్ వెబ్‌సిరీస్ నంబర్ 1గా నిలిచింది. ఇప్పటికే మై విలేజ్ షోలో సుమారు 100 షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించాడు. హుషారు పిట్టలు వెబ్ సిరీస్‌లో సైతం నటించి మెప్పించాడు. ఒకరిని మించి ఒకరు అనిల్ జీల వ్లాగ్‌కు లక్షల్లో సబ్స్క్రైబర్లు, వీక్షకులుండగా సెలబ్రిటీలకు ఇచ్చే గ్రీన్సైన్ లభించింది. అలాగే అతడి జీవిత భాగస్వామి ఆమని చేసే రీల్స్, ప్రమోషన్ పాటలకు సైతం వీక్షకులు లక్షల్లో ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రాంకు 1.17 లక్షల మంది ఫాలోవర్సు ఉన్నారు. వీరి అనురాగానికి ప్రతీకైన ఆరునెలల మేధాన్‡్ష ఇన్‌స్టాగ్రాంకు సైతం 3,000 మంది ఫాలోవర్సు ఉండడం విశేషం. అనిల్ వ్లాగ్‌కు సబ్స్క్రైబర్లు: 7.70 లక్షల మంది నటించిన షార్ట్ ఫిల్మ్స్ : 100 ఇన్‌స్టాగ్రాంకు ఫాలోవర్లు: 3.80 లక్షల మంది వీక్షకులు: 25 లక్షల మంది -
రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్ సీఈవోగా
విజయనగరం (రాజాం సిటీ): ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెడుతూ కుంగదీసినప్పటికీ వెనక్కు తగ్గకుండా చదువుపై శ్రద్ధ కనబరిచాడు. డిగ్రీ చదువుకునే రోజుల్లో కుటుంబ బాధ్యత తీసుకుని, పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ నెట్టుకొచ్చాడు. పట్టుదలే ఆయుధంగా చేసుకుని జీవితం అయిపోయిందనుకునే స్థాయి నుంచి అమెరికా దేశం గుర్తించేలా నిలిచి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ట్యాక్స్ ప్లానింగ్ అండ్ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించి 2022లో టాప్ 20 సీఈఓలలో ఒకరుగా సీఈఓ పబ్లికేషన్ ఆయనను గుర్తించింది. ఆయనే రాజాం పట్టణానికి చెందిన గ్రంధి అనిల్. బాల్యంలోని ఆయన చదువు నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందినంత వరకు ఆయన ప్రస్థానం ఆయన మాటల్లోనే.. రాజాంలో ప్రాథమిక విద్య చదువుతున్న నేను నాలుగో తరగతి నుంచే వ్యాపారంపై మక్కువ పెంచుకున్నాను. రాజాంలోని భారతీయ విద్యాభవన్‌లో 5వ తరగతి, 6వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో, 7 నుంచి 10వ తరగతి వరకు ఏజేసీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్లో ఎంపీసీ చదివి ఇంజనీర్ కావాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు సలహాలు ఇచ్చినప్పటికీ డాక్టర్ కావాలనే బలమైన కోరికతో బైపీసీలో జాయిన్ అయ్యాను. ఇంటర్ మొదటి సంవత్సరం గరివిడి శ్రీరామ్ జూనియర్ కళాశాలలో, ద్వితీయ సంవత్సరం దాకమర్రిలోని రఘు కళాశాలలో పూర్తిచేశాను. అంతే ఉత్సాహంతో ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాను. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్ చదవలేకపోయాను. అదే సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూ చదువు కొనసాగించాలనే కృతనిశ్చయంతో జీసీఎస్ఆర్ కళాశాలలో బీకాం డిగ్రీలో చేరాను. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఎదురీది డిగ్రీ పూర్తిచేసి బీకాంలో సిల్వర్ మెడల్ పొందాను. పార్ట్ టైం జాబ్‌తో ఊరట ఓ వైపు డిగ్రీ చదువుతుండగానే మరో వైపు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుండేవాడిని. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఒడిదొడుకుల మధ్య డిగ్రీ పూర్తిచేశాను. తరువాత ఎంబీఏ చేయాలనుకున్నప్పటికీ అధ్యాపకుల సలహాతో సీఏ చేశాను. ఉద్యోగం ప్రస్థానం 2008లో ఐసీఏఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్) చెన్నై క్యాంపస్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మంచి జీతంతో ఎంపికయ్యాను. అక్కడి నుంచి శివ గ్రూపులో ఫైనాన్స్ కంట్రోలర్‌గా మూడేళ్లు పనిచేశాను. తరువాత తారస్ క్వస్ట్ కంపెనీలో ఫైనాన్స్ హెడ్‌గా ఉద్యోగం, యూఎస్ఏకు చెందిన సన్ ఎడిషన్ ఫైనాన్స్ కంట్రోలర్‌గా రెండేళ్లు పనిచేశాను. అక్కడ నా ప్రతిభ ఆధారంగా యూఎస్ హెడ్ఆఫీస్ నుంచి పిలుపురావడంతో వెళ్లి ట్రెజరీ ఆపరేషన్స్ దిగి్వజయంగా పూర్తిచేయగలిగాను. ఆ తరువాత అమెజాన్‌లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం లభించింది. దీంతో నా స్కిల్స్ మరింత డెవలప్ చేసుకోగలిగాను. తరువాత స్టార్‌బక్స్ కంపెనీలో చేరి ఖాళీ సమయంలో ట్యాక్స్ బిజినెస్ డెవలప్ చేసుకోగలిగాను. కరోనా సమయంలో సహాయం కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న కంపెనీలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రుణ సౌకర్యం కలి్పంచింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని బిజినెస్ యజమానులకు హెల్ప్ చేయగలిగాను. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ హెల్పింగ్ నేచరే అమెరికాలో గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత ఏజీ ఫిన్ టాక్స్ అనే ట్యాక్స్ ప్లానింగ్ సరీ్వస్ ప్రారంభించాను. ట్యాక్స్ ప్లానింగ్ అండ్ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించిన సీఈఓ పబ్లికేషన్ 2022లో టాప్ 20 సీఈఓలలో ఒకరిగా గుర్తించిందని గ్రంధి అనిల్ వివరించారు. -
మూఢ నమ్మకాల వల్ల జరిగే అనర్థాల నేపథ్యంలో ‘లాకెట్’
అనిల్, విభీష హీరోహీరొయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘లాకెట్’. ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ పటేల్ సమర్పణలో ఇంద్రకంటి మురళీధర్ అఖిల్ విజన్ మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ప్రదర్శన హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాల పై వాటి వల్ల జరిగే అనర్దాలపై ఈ చిత్రం లో వివరించడం జరిగింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్ర సమర్పకులు మహేష్ పటేల్ తో పాటు శివలాల్ పటేల్, చందూలాల్ పటేల్, భరత్ పటేల్, చమన్ పటేల్, ఘనశ్యం పటేల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజు అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ సీఈవో రాజీవ్ మాట్లాడుతూ .. దర్శకుడికి ఇది తొలి చిత్రమైన ఎంతో అనుభవం ఉన్న వాళ్లలా తెరకెక్కించారని మెచ్చుకున్నారు. మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుదందని కితాబిచ్చాడు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ లో ఉండే 17 ఓటీటీ లలో 569 వ సినిమాగా లాకెట్‌ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమా చిత్రం ద్వారా టీం అందరికీ మంచి పేరు వస్తుంది అన్నారు. చిత్ర సమర్పకుడి గా మహేష్ పటేల్ మాట్లాడుతూ.. మనం ఇంకా అంధ విశ్వాసాలలో ఉంటె సొసైటీ మీద మనకు ఏమి విశ్వాసం ఉంటుంది ? అని సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ దర్శక నిర్మాతలు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు . మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు. చిత్ర నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ మాట్లాడుతూ .. తనతో 30 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను . దర్శకుడు ఫణి కుమార్ అద్దేపల్లి చెప్పిన ఒక కాన్సెప్ట్ తో కథను రెడీ చేసుకోవడంతో నేను ఈ సినిమా నిర్మించాను . తనతో ఇంకా చాలా సినిమా లు చేసే అవకాశం ఉంది . ఈ సినిమా ధియేటర్ రిలీజ్ రైట్స్ , ఆడియో , వీడియో రైట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి . త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం తప్పక గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. -
టోటల్‌ఎనర్జీస్‌తో అదానీ జట్టు
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో చేతులు కలిపింది. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో అదానీ గ్రూప్ కర్బనరహిత ఇంధన తయారీని చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో ఈ రంగంలో అనుబంధ విభాగాలతో కలిపి 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ గ్రూప్ కొత్త ఇంధన బిజినెస్ విభాగం అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఏఎన్ఐఎల్)లో టోటల్ఎనర్జీస్ 25 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అయితే డీల్ విలువను రెండు సంస్థలూ వెల్లడించకపోవడం గమనార్హం. ఏఎన్ఐఎల్లో 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టోటల్ఎనర్జీస్ ప్రకటించింది. 2030కల్లా ఏఎన్ఐఎల్ వార్షికంగా మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంటీపీఏ) గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టోటల్ఎనర్జీస్ పేర్కొంది. తొలి మైలురాయికింద 30 గిగావాట్ల కొత్త పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకునే ప్రణాళికలున్నట్లు తెలియజేసింది. ఈ జనవరిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కోసం అదానీ గ్రూప్ ఏఎన్‌ఐఎల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దశాబ్ద కాలంలో.. నూతన ఇంధన విభాగంలో రానున్న 10 ఏళ్ల కాలంలో 70 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. దీనిలో భాగంగా 2022–23కల్లా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఈఎల్) ఏడాదికి 2 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. కాగా.. టోటల్ ఎనర్జీస్ ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీతో జట్టు కట్టింది. -
క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందని ఫోన్.. ఆధార్ వివరాలు చెప్పినందుకు
ఉద్యోగి అయిన మహిజకు క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందని, కార్డ్‌ని మళ్లీ పంపించేందుకు వివరాలు అవసరమని ఫోన్ కాలర్ చెప్పింది. ఫోన్లో ఆధార్ నెంబర్, ఇతర వివరాలనూ పంచుకున్న మహిజ మరుసటి రోజు తన క్రెడిట్‌కార్డ్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్టు గమనించింది. స్కామర్లు మీ ఆధార్‌ను యాక్సెస్ చేయకుండా అడ్డుకట్ట వేయాలంటే... మీకు అందుకు తగిన సమాచారమూ తెలిసి ఉండాలి. మోసగాళ్లు బ్యాంక్ ఖాతాదారుల డబ్బు స్వాహా చేసినందుకు వారి ఆధార్ నంబర్లను రాబట్టేందుకు మభ్యపెట్టడంలో ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టరు. మీ ఆధార్ నంబర్ లేదా OTP లేదా పాస్వర్డ్ కోసం బ్యాంక్ అధికారులమని చెప్పుకునే వ్యక్తులు మీకు ఎప్పుడైనా కాల్ చేసినట్లయితే, వారు మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్న స్కామ్‌స్టర్ అయ్యే అవకాశం ఉంది. 1) మొబైల్/ఇ–మెయిల్ నమోదు ఇటీవలి కాలంలో ఆధార్ వల్ల మీ వివరాలను మార్చడం సులభం అయ్యింది. ఆధార్‌లో నమోదు చేసిన మీ ఫోన్ లేదా ఇ–మెయిల్ ఐఈకి వన్ టైమ్ పాస్వర్డ్ (OTP )తో ప్రక్రియలో ఎలాంటి జాప్యం కూడా ఉండటం లేదు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు మీ ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా మీ మొబైల్ నంబర్‌ను మార్చుకున్నా, ఇతరులు మీ వివరాలతో మిమ్మల్నే మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, మీ ఆధార్ కార్డ్‌ను అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. 2) ఆధార్ బయోమెట్రిక్స్ లాకింగ్ ఐరిస్ స్కాన్లు, వేలిముద్రలు, ఫోటోగ్రాఫ్‌లు వంటి బయోమెట్రిక్‌లు ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యాయి. ఈ అంశంలో మోసం చేయడం చాలా కష్టమైనప్పటికీ, వ్యక్తి బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి వేలిముద్రలను నకిలీ చేసిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో బయోమెట్రిక్ లాకింగ్ ఆప్షన్‌తో ఆధార్ బయటకు వచ్చింది. UIDAI దాని కార్డ్ హోల్డర్లకు బయోమెట్రిక్‌ను లాక్ చేసి ఉంచాలని సలహా ఇస్తుంది. దీన్ని వెబ్సైట్ లేదా mAadhaar యాప్ ద్వారా చేయవచ్చు. 3) మాస్క్డ్ ఆధార్, వర్చువల్ ID (VID) eKYC సేవను నిర్వహించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆధార్ నంబర్ స్థానంలో 16 అంకెల సంఖ్యను వాడచ్చు. అప్పుడు వర్చువల్ ట్రాన్స్యాక్షన్స్కి మీ ఆధార్ నంబర్‌ను జత చేయాల్సిన అవసరం పడదు. 4) రెగ్యులర్‌గా తనిఖీ మీ ఆధార్ ధ్రువీకరణకు UIDAI పోర్టల్‌కి వెళ్లి, ప్రామాణీకరణను తనిఖీ చేయాలి. మీ భద్రత– సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి UIDAI ప్రవేశపెడుతున్న కొత్త విధానాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో మరొక ఆధార్ కార్డ్‌ని పొందవచ్చు. ఆన్లైన్లో ఇది సాధారణంగా మూడు దశల ప్రక్రియలో ఉంటుంది. మూడు దశల ప్రక్రియ దశ 1: అధికారిక UIDAI పోర్టల్‌కి వెళ్లి, వెబ్సైట్లో కుడివైపు ఎగువన, డ్రాప్‌డౌన్ మెనూ నుండి "My Aadhaar' ను ఎంచుకోవాలి. దశ 2: ఆధార్ నంబర్ని ధ్రువీకరించాలి. ఎంపికను ఎంచుకొని, మీరు దీన్ని ‘ఆధార్ సర్వీసెస్’ విభాగంలో కనుక్కోవాలి. దశ 3: ఇది మిమ్మల్ని కొత్త పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు క్యాప్చాతో పాటు 12అంకెల ఆధార్ నంబర్(UDI)ని నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని నమోదు చేసిన తర్వాత, దిగువన ఉన్న ‘ధ్రువీకరణకు’ బటన్‌ను క్లిక్ చేయాలి. ఇది మీకు మరో ఆధార్ కార్డ్ చెల్లుబాటు స్థితిని సూచించే పేజీని చూపుతుంది. ఈ కార్డును eKYcకే ఉపయోగిస్తారు. ఆధార్ స్కామ్‌ల బారిన పడకుండా... ►మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం.. ఫోన్ ద్వారా ఆధార్ కార్డ్, ఇతర వివరాలను బహిర్గతం చేయకుండా ఉండాలి. ►భారతదేశంలో ఆధార్ కార్డుకు సంబంధించిన మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అమాయకుల నుండి డబ్బును స్వాహా చేసేందుకు స్కామ్స్టర్లు కొత్త, వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఆధార్ స్కామ్‌ల కారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరికలు జారీ చేయవలసి వచ్చింది. ►ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్స్ (AIBOC) మాజీ జనరల్ సెక్రటరీ డి థామస్ ఫ్రాంకో వాట్సాప్‌లోని బ్యాంకింగ్ గ్రూప్‌లో సంభాషణ రూపంలో ఈ హెచ్చరిక వచ్చింది, ఇందులో ఒక అమాయక ఆధార్ కార్డ్ హోల్డర్ తన మొత్తాన్ని వదులుకోవడానికి మోసగించిన సంఘటనలను వివరించాడు. బ్యాంకు అధికారిగా నటిస్తున్న స్కామ్స్టర్ల ద్వారా ఖాతాదారుల డబ్బు లావాదేవీలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశారని స్పష్టం చేశారు. ►కిందటేడాది డిసెంబర్ 21న జరిగిన ఒక సంఘటనలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్‌గా నటిస్తున్న వ్యక్తి నుండి డాక్టర్ లాల్మోహన్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అతని ఆధార్ నంబర్ కోసం డాక్టర్ లాల్మోహన్ను అడిగి, మొదట రూ. 5,000 ఆ పై రూ. 20,000 బదిలీ చేశాడు. అతని ఖాతా బ్లాక్ చేసిన తర్వాత కూడా నగదు బదిలీలు జరిగాయి. డాక్టర్ లాల్మోహన్ తన పాస్‌వర్డ్‌ను ఎవరికీ చెప్పనప్పటికీ, స్కామ్స్టర్లు అతని ఆధార్ నంబర్‌ను ఉపయోగించి పాస్వర్డ్ లేదా OTP అవసరం లేకుండా ►నేరుగా అతని బ్యాంక్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసినట్లు తేలింది. మీకు అనుమానంగా ఉంటే వెంటనే ఖాతాతో లింక్ చేయబడిన ఆధార్‌ను డీ లింక్ చేయమని వెంటనే బ్యాంక్‌ని అడగాలి. మీ ఆధార్ నంబర్, పాస్వర్డ్ లేదా ఏదైనా బ్యాంకింగ్ వివరాలను ఫోన్లో ఎవరితోనూ పంచుకోవద్దు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్ ఇచ్చారంటే ఇక అంతే!
Cyber Crime Prevention Tips- మెయిల్ ఓపెన్ చేయగానే కొన్ని స్పామ్ మెయిల్స్ మనకు కనిపిస్తాయి. డిస్కౌంట్ అనో, బ్యాంక్ సిబిల్ స్కోర్ ఫ్రీ అనో, మరేవో ఆఫర్లు అనో.. ఇ– మెయిల్స్ ఊరిస్తుంటాయి. ఇవన్నీ వ్యాపార సంబంధమైనవిగా ఉంటాయి. పది మిలియన్ స్పామ్ మెయిల్స్ పంపడానికి కూడా పది పోస్టల్ సందేశాలు పంపడానికి అయ్యేంత ఖర్చు మాత్రమే అవుతుంది. దీంతో వ్యాపార సందేశాలు దాదాపుగా స్పామ్ మెయిల్స్‌ను ఎంచుకుంటుంటాయి. వీటికి ఆకర్షితులై, ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్ ఇచ్చారంటే మిమ్మల్ని మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. స్పామ్ మెయిల్స్‌తో మీరే స్కామ్‌లో ఇరుక్కోవచ్చు. స్పామ్ నుంచి ప్రమాదం భారత జాతీయ న్యాయ చట్టంలో స్పామ్ గురించిన ప్రస్తావన లేదు. దీంతో వాక్‌స్వేచ్ఛను రక్షించాలనే విషయంలో, చట్టపరమైన పరిష్కారాలను అమలు చేయడంలో ఇది మరింత కష్టంగా మారుతోంది. అందుకే, మనమే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రోజన్ హార్స్: వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తాయి. నకిలీ లింక్‌లు, డౌన్‌లోడ్స్‌లో మారువేషంలో ఉండి తమ మోసపూరిత పనిని చక్కబెడుతుంటారు. జాంబీస్: మీ వ్యక్తిగత కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇతర కంప్యూటర్లను స్పామ్ చేసే సర్వర్‌గా మార్చేసుకుంటారు. ఫిషింగ్ : మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ఫలితంగా గోప్యత, కీర్తి, డబ్బు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మధ్యవయస్కులు, రిటైర్మెంట్ బాధితులు ఎక్కువ ఉంటున్నారు. ఇంటర్నెట్ స్కామ్‌లు: మీరు కొంత బహుమతి రూపంలోనో, ఉద్యోగం, వివాహం, ప్రేమ.. గెలుచుకున్నట్లు ఇ–కామర్స్ చూపుతుంటాయి. తెలుసుకోవడం సులువు ►స్పామ్ మెయిల్స్ లేదా ఎస్సెమ్మెస్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థిస్తుంటాయి. దీనిని బట్టి అది నకిలీ మెయిల్ అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. సాధారణంగా చిరునామా, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ లేదా బ్యాంకింగ్ సంబంధిత సమాచారం వంటి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలేవీ ఇవ్వకూడదు. ►అనుమానాస్పద డొమైన్ పేరుతో అసాధారణమైన అక్షరాలను ఉపయోగిస్తారు. ►అనేక నకిలీ ఇ–మెయిల్లు ప్రభుత్వ అధికారులు, బ్యాంకింగ్ అధికారులు లేదా చట్టబద్ధమైన కంపెనీల నుండి, వ్యక్తుల నుండి వచ్చినట్టు చూపుతాయి.. ►మెసేజ్ సబ్జెక్ట్ లైన్న్లో ‘అత్యవసరం‘, ‘ప్రత్యుత్తరం‘, ‘అవకాశం‘, ‘తక్షణం‘, ‘ముగింపు తేదీ‘.. వంటి పదాలు ఇ–మెయిల్లో ప్రధానాంశాలుంగా ఉంటాయి. ►స్పామ్ ఇ–మెయిల్లో అక్షరదోషాలు ఉంటాయి. చాలా నకిలీ ఇ–మెయిల్లు ప్రాథమిక అక్షరదోషాలు, పేరు తప్పుగా రాయడం, పేలవమైన వ్యాకరణంతో ఉంటాయి. మోసపూరిత ఇ–మెయిల్ చిరునామా తెలిసినవారి ఇ–మెయిల్ చిరునామాకు చాలా దగ్గరి పోలిక ఉంటుంది. స్పామ్ అని గుర్తించడానికి.. అన్ని రకాల మెయిల్స్, అనేక ఇతర వ్యాపార ఇ–మెయిల్ కార్యకలాపాలు అంతర్నిర్మిత అల్గారిథమ్‌లను కలిగి ఉంటాయి. ఇవి స్పామ్, జంక్ మెయిల్లను స్పామ్ ఫోల్డర్లోకి తరలిస్తే ఫిల్టర్ అవుతాయి. మీ మెయిల్లో స్పామ్ ఇ–మెయిల్లు పుష్కలంగా వస్తున్నట్లు చూసినట్లయితే, మీరు వాటిని పై విధంగా ఫిల్టర్ ద్వారా వదిలించుకోవచ్చు. ►జిమెయిల్ స్పామ్‌ని క్లిక్ చేసి, ఆ ఫోల్డర్లోకి ఇ–మెయిల్‌ను మాన్యువల్‌గా తరలించండి. ఎఝ్చజీ∙కూడా అనుమానాస్పద ఇ–మెయిల్స్‌ను గుర్తిస్తుంది. స్పామ్ హెచ్చరిక లేబుల్‌లను రెడ్ మార్క్‌లో ఉంచుతుంది ► ఆపిల్ మెయిల్ రిపోర్ట్ స్పామ్లో ’గీ’ గుర్తు ఉన్న ట్రాష్ క్యాన్ (జంక్ మెయిల్) చిహ్నంపై క్లిక్ చేయాలి. ►యాహూ మెయిల్ స్పామ్ ఫోల్డర్లోకి ఇ–మెయిల్‌ను మాన్యువల్‌గా తరలించాలి. అప్పుడు యాహూ అనుమానాస్పద ఇ–మెయిల్లను గుర్తిస్తుంది. ఆ ఇ–మెయిల్లను డిఫాల్ట్ స్పామ్ ఫోల్డర్లో ఉంచుతుంది. ►మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ ఇ–మెయిల్‌కు ముందు చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి, మెనూలోని జంక్ ఇ–మెయిల్ ఎంపికలపై క్లిక్ చేయాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.. ►మెయిల్ అకౌంట్‌కు కనెక్ట్ చేసిన ఫొటోలు, ఈవెంట్ల వివరాలు, ఇతర ఇ–మెయిల్ చిరునామాలు భద్రంగా ఉండటానికి భద్రతను చెక్ చేసుకోవాలి. మీ ఎంపికల ఆధారంగా ఫీచర్లను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి టాగిల్ స్విచ్‌లను అడ్జస్ట్ చేయాలి. వ్యక్తిగత సమాచారం, గోప్యతా సెట్టింగ్‌లను కూడా తనిఖీ చేయాలి. ►అకౌంట్ సురక్షితంగా ఉండటానికి యాప్ పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవడంతో పాటు అవసరం లేనప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంచాలి. ►కంప్యూటర్ భద్రతా పద్ధతులను అమలు చేయడం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ కంప్యూటర్ను ఉపయోగించనప్పుడు ఇంటర్నెట్ నుండి డిస్కనెక్ట్ (లాగ్ ఆఫ్) చేయండి. ►ఏవైనా అనవసర లింక్‌లను ఓపెన్ చేయడం, మెయిల్ ద్వారా వచ్చిన ఫైల్లు లేదా లింక్‌లను డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అలాంటి మెయిల్స్‌ను ఓపెన్ చేయకపోవడమే శ్రేయస్కరం. ►అత్యంత విశ్వసనీయత గలవాటి నుంచే ఉచిత సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయాలి. ఉచిత సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే గేమ్‌లు, ఫైల్ షేరింగ్, స్కానర్లు ప్రోగ్రామ్‌లు, ఇతర అనుకూల ఉచిత వ్యాపార అప్లికేషన్లు .. మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ►అవసరం లేని వాటిని ఇ మెయిల్ నుండి తీసివేయండి. ఎందుకంటే స్పామ్ మెయిల్స్ మధ్యలో మీరు మీ అతి ముఖ్యమైన ఇ–మెయిల్‌ను కోల్పోయే అవకాశం ఉంది. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
కాంగ్రెస్ నేత అనిల్ అరెస్ట్
-
Karimnagar: సిల్వర్ స్క్రీన్‌పై కరీంనగర్ వెలుగులు
ఒక్కచాన్స్.. ఒకేఒక్క చాన్స్ అంటూ వీళ్లు క్రిష్ణానగర్ చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు.. సినిమాల్లో అవకాశం కోసం ఏళ్లకేళ్లు ఎదురుచూడలేదు. చేస్తున్న పనిని, అన్నం పెడుతున్న ఊరును వదిలిపెట్టలేదు. ఉన్నచోటు నుంచే తమ ప్రతిభను ప్రదర్శించారు. అవకాశాన్ని.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. యూట్యూబ్‌లో సొంతంగా ఒక వేదికను ఏర్పాటుచేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రయివేటు ఆల్బంల ద్వారా తమ టాలెంటును మొదట ప్రజలు గుర్తించేలా కష్టపడ్డారు. ఆ కష్టమే ఇప్పుడు వారిని స్టార్లను చేసింది. అనతికాలంలోనే సినిమాల్లో, పెద్దపెద్ద రియాలిటీషోల్లో అవకాశం వచ్చేలా చేసింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై ఉమ్మడి కరీంనగర్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మై విలేజ్ షో ద్వారా ఫేమ్ అయిన బిగ్‌బాస్ గంగవ్వ, అనిల్ జీల సినిమాల్లో బిజీగా మారారు. మరికొందరు యాక్టర్లు, సింగర్లు, డైరెక్టర్లు పలు సినిమాల్లో ప్రతిభ చూపి స్టార్.. స్టార్.. సూపర్‌స్టార్ అనిపించుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా రంగుల ప్రపంచంలో ప్రస్థానం ప్రారంభించి వెండితెరపై వెలుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ కళాకారులపై ‘సాక్షి’ వీకెండ్ స్పెషల్..!!] పేరు: గంగవ్వ యూట్యూబ్ చానల్ మై విలేజ్ షో షార్ట్‌ఫిల్మ్: 120కి పైగా సినిమాలు: 4 ‘ఇస్మార్ట్’ గంగవ్వ మల్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్‌షో గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే. బడిముఖం చూడని గంగవ్వ కష్టాల కడలిని ఈదింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. కల్మషం లేని ఆమె మనసు.. ఆరు పదుల వయసులో ప్రపంచానికి స్టార్‌గా పరిచయం చేశాయి. ఇదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ ప్రారంభించిన మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ గంగవ్వ జీవితాన్ని మార్చివేసింది. 120కిపైగా వీడియోల్లో, నాలుగు పెద్ద సినిమాల్లో నటించింది. ఓ రియాలిటీ షోతో మరింత ఫేమస్ అ యిన గంగవ్వ.. ఇల్లు కట్టుకోవాలనే తనకలను నెరవేర్చుకుంది. జీవితమంతా.. ముళ్లబాటే గంగవ్వ జీవితమంతా ముళ్లబాటలోనే సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బీడీలు చేస్తూ తమ్ముళ్లకు ఆసరాగా నిలిచింది.ఐదేళ్లలో బాల్య వివాహం జరిగింది. అత్తాగారిల్లే జీవితమైంది.భర్త గంగయ్య పదిహేనేళ్లపాటు గల్ఫ్ వెళ్లాడు. ఐదేళ్లపాటు దుబాయ్ నుంచి కబురు లేకపోవడంతో ఉన్నాడో లేడో కూడా తెలియని వేదనతో గడిపింది. మరో పదేళ్లు గల్ఫ్ వెళ్లినా నయాపైసా పంపలేదు. ఇక్కడి నుంచే అప్పుచేసి, పైసలు పంపిస్తే ఇంటికి తిరిగివచ్చాడు. కలోగంజో తాగి, పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి, రాత్రి బీడీలు చేస్తూ పిల్లలను పెద్ద చేసింది. ఆరుపదుల వయసులో.. గంగవ్వకు మై విలేజ్ షో మరో జన్మనిచ్చింది. అవ్వలోని సహజ నటిని మై విలేజ్ షో దర్శకుడు శ్రీరాం శ్రీకాంత్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంటర్నెట్ కష్టాలు అనే షార్ట్‌ఫిల్మ్‌తో యూ ట్యూబ్‌లో అడుగుపెట్టి.. సుమారు 120కిపైగా లఘుచిత్రాల్లో నటించింది. సినీ నటులుసైతం గంగవ్వతో సెల్ఫీకోసం ఎదురుచూసేలా ఎదిగింది. గంగవ్వ సహజ నటనను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, రాజరాజచోర, లవ్‌స్టోరీలో తనేంటో నిరూపించుకుంది. రెండు టీవీ రియాలిటీషోల్లో అదరగొట్టింది. గంగవ్వ మాట తీరు..ఆప్యాయత..కల్మ షం లేని తన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఏ అవసరం ఉన్నా ఇప్పటికీ ప్యాసింజర్ ఆటోల్లో వెళ్తుండడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం. ‘చిన్నప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్లతోనే గడిపిన. పొద్దంతా వ్యవసాయ పనికి వెళ్లివచ్చి, బీడీలు చేసేదాన్ని. సదువు అసలే రాదు. ఎక్కడెక్కడి నుండో నా దగ్గరికి అచ్చి.. సెల్ఫీలు దిగుతున్నరు. ఇంటికాడ ఉంటే శ్రీకాంత్ అచ్చి, నేను చెప్పినట్టు చేత్తవా గంగవ్వ అని, షూటింగ్ మొదలు పెట్టిండు. ఇంట్ల టీవీ కూడా లేదు. సినిమాలో నటిస్తా అని అనుకోలేదు. ఇప్పటికి నాలుగు సినిమాలు విడుదల ఐనయ్. ఇంకా వేరే సినిమాలో నటిస్తున్న.. ఇప్పుడు కూడా ఊటీలో షూటింగ్లో ఉన్న.. నాకు తెలిసింది ఒక్కటే. నా పని నేను సేత్త’ అని గంగవ్వ చెప్పుకొచ్చింది. పేరు: రాదండి సదయ్య యూట్యూబ్ చానల్ సదన్న కామెడీ షార్ట్‌ఫిల్మ్‌లు: 200కి పైగా సినిమాలు: 10 ఆర్ఎస్ నందా.. కామెడీకి ఫిదా విద్యానగర్(కరీంనగర్): ఆర్ఎస్ నంద.. యూట్యూబ్ ప్రపంచానికి పరిచయం కాకముందే ఇతని కామెడీ షార్ట్‌ఫిల్మ్‌లను సిడీల రూపంలో అభిమానులు వీక్షించేవారు. రెండు వందలకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లు తీసిన ఆర్ఎస్ నందకు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నటన అంటే ప్రాణం ఓదెల మండలం కనగర్తికి చెందిన రాదండి సదయ్యకు చిన్నతనం నుంచే నటన అంటే ప్రాణం. పదేళ్ల వయసులోనే బుర్రకథలు చెప్పేందుకు ఆసక్తి చూపేవాడు. 2007నుంచే లఘుచిత్రాలు తీయడం ప్రారంభిచాడు. యూట్యూబ్ హవా ప్రారంభం కావడంతో 2013లో కోడెం సంతోశ్‌తో కలిసి ‘సదన్న కామెడీ’ చానెల్ ద్వారా ‘గుట్టల్లో గుసగుస’తో యూట్యూబ్‌లో తొలి అడుగువేశాడు. ఇప్పటివరకు దాదా పు 200కు పైగా విలేజ్ కామెడీ షార్ట్ఫిలిమ్స్ చేశాడు. కామెడీ స్టార్‌గా దేశవిదేశాల్లో గుర్తింపు సాధించాడు. సినిమా అవకాశాలు కూడా రావడంతో బతుకమ్మ, నానీ బుజ్జి బంగారం, తుపాకీ రాముడు, సంత, చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలో, నేనేసరోజన, గున్నమామిడి కొమ్మ మీద తదితర 10కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లోనూ బిజీగా ఉన్నట్లు తెలిపాడు. పేరు: అనిల్ జీల యూట్యూబ్ చానల్: మై విలేజ్ షో షార్ట్‌ఫిల్మ్‌లు: 200 కి పైగా సినిమాలు: 5 క్రేజీహీరో.. అనిల్ మల్యాల(చొప్పదండి): ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా సేవచేసేందుకు లంబాడిపల్లి వెళ్లి.. యూట్యూబర్‌గా తనలోని ప్రతిభకు పదును పెట్టుకుని.. ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించి, యువతకు క్రేజీ హీరోగా మారాడు అనిల్ జీల. ఉపాధ్యాయుడిగా విద్యాబుద్ధులు బోధిసూ్తనే తన ఆలోచనలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ.. సహచరుడు, మై విలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీరాం శ్రీకాంత్‌తో జట్టుకట్టాడు. మై విలేజ్ షోలో నటిస్తూ.. తనలో దాగిఉన్న ప్రతిభను చాటుకున్నాడు. స్వయంగా వ్లాగ్ నిర్వహిస్తూ ఏకంగా 7లక్షల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూనే.. యూత్ ఐకాన్‌గా నిలిచాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన నిర్మల–మల్లేశం కొడుకు అనిల్ జీల. టీటీసీ చేసేటప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా లంబాడిపల్లికి వచ్చాడు. అప్పుడే శ్రీరాం శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. జమ్మికుంటలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఐదేళ్లక్రితం వేసవిసెలవుల్లో లంబాడిపల్లికి వచ్చిన అనిల్ జీల శ్రీకాంత్ దర్శకత్వంతో పాటు ఇతర లఘుచిత్రాలు సుమారు 200లకుపైగా నటించారు. కికీ చాలెంజ్ తన జీవితాన్ని మలుపు తిప్పగా, రైతు పడుతున్న కష్టాల వీడియోతో అనిల్‌కు ఫాలోయింగ్ పెరిగింది. ఏడు లక్షల ఫాలోవర్స్.. మై విలేజ్ షో వీడియోలతోపాటు తన వ్యక్తిగత జీవిత విశేషాలను అప్లోడ్ చేసేందుకు అనిల్ జీల వ్లాగ్ ప్రారంభించాడు. షూటింగ్లో.. ఇంట్లో.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ విశేషాలు తెలిసేలా వ్లాగ్‌లో పెడుతుండడంతో ప్రస్తుతం అనిల్‌కు 7లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. యూట్యూబ్ వీడియోల్లో నటిసూ్తనే సినిమాల్లో చాన్స్ కొట్టేశాడు అనిల్. ఇతడి సహజమైన నటనతో నేటియువతకు హీరోగా మారాడు. అనిల్ నటనకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్‌తోపాటు, ఎస్ఆర్ కల్యాణ మంటపం సినిమాలు ఇప్పటికే రిలీజ్ కాగా, దర్శకుడు నవీన్ బేతిగంటి తీస్తున్న ‘రామన్న యూత్’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. మై విలేజ్ షో తీస్తున్న ఓ వెబ్సిరీస్లోసైతం నటిస్తున్నాడు. పాటల మాంత్రికుడు మల్లిక్ గొల్లపల్లి(ధర్మపురి): పల్లెపదాలు ఆయన పాటలకు ప్రాణాలు. తాను రాసే పాటలోని ప్రతీ అక్షరం గ్రామీణ జీవన సుమధురం. మట్టిమనుషుల మధ్య బాధలు, బంధుత్వాలను జానపదాలుగా మలిచి చిత్రీకరిస్తూ.. జానపద ఆణిముత్యంగా రాణిస్తున్నాడు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన ఎస్వీ మల్లిక్‌తేజ. ఎస్వీ మ్యూజిక్ చానల్ ద్వారా 150కి ప్రయివేటు పాటలు రాసి, పాడిన, వీక్షకులకు అందించగా.. ఆరులక్షల మంది పాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు మల్లిక్‌తేజ. ఇటీవల వచ్చిన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. చిన్నతనం నుంచే.. మల్లిక్‌తేజ డిగ్రీవరకు చదివాడు. చిన్నతనం నుంచి అమ్మమ్మవాళ్ల ఊర్లో పెరిగాడు. తాత మ్యాకల వెంకయ్యతో గొర్రెలు మేపేందుకు వెళ్లి జానపదాలు నేర్చుకున్నాడు. ఆ పాటలనే స్కూళ్లో పాడేవాడు. ఇంటర్‌లోనే పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. అప్పుడే జగిత్యాలకు వచ్చిన సుద్దాల అశోక్‌తేజ మల్లిక్పాటకు ముగ్దుడయ్యాడు. మల్లిక్‌ను హైదరాబాద్ పిలిపించుకుని మెలకువలు నేర్పించాడు. తరువాత యూట్యూబ్‌లో ఎస్వీ మ్యూజిక్ చానల్‌ను ప్రారంభించాడు. 2018 జనవరిలో తీసిన ‘నేనొస్తాబావ’ పాటకు 3కోట్లవ్యూస్ను సాధించాడు. ‘మదనాసుందారి’ పాట అత్యంత ప్రేక్షక ఆదరణ సాధించింది. ఎస్వీ మ్యూజిక్ చానల్ద్వారా 150కి పైగా ప్రయివేటు పాటలు చిత్రీకరించాడు. ఆరులక్షల పాలోవర్స్ ఉన్నారు. సినిమాల్లో అవకాశం రావడంతో 2019 ఏప్రిల్‌లో విడుదలైన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. కన్నడంలో భన్నదకనుసు, రంగిన దునియాకు మ్యూజిక్ డైరెక్టరుగా పరేషాన్ సినిమాలో పాట పాడాడు. పాటే రమేశ్ ప్రాణం గొల్లపల్లి(ధర్మపురి): యక్షగానం నుంచి పుట్టిన జానపద కళాకారుడు గడ్డం రమేశ్. జగిత్యాల జిల్లా చిన్నాపూర్కు చెందిన రమేశ్ తండ్రి అనంతం యక్షగానం చేస్తుండేవాడు. తండ్రిని అనుకరిస్తూ రమేశ్ తాను చదువుతున్న పాఠశాల వేదికపై యక్షగానం ప్రదర్శిస్తుండేవాడు. తరువాత జానపద పాటలు పాడిన రమేశ్ స్థానికంగా పేరు సంపాదించాడు. 2002లో రమేశ్ ప్రతిభను గుర్తించిన ధర్మపురి సీఐ హోంగార్డుగా ఉద్యోగం కల్పించాడు. పోలీసు కళాబృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రజలను చైతనం చేస్తున్నాడు. 2011లో రేలారెరేలా కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు. తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో యూట్యూబ్‌లో గడ్డం మ్యూజిక్ చానల్ ప్రారంభించాడు. ‘నీలమ్మ నిమ్మసుక్క రాయిడు సోలో’ పాట మంచి గుర్తింపు పొందింది. ‘అత్తకొడుకా.. ముద్దల మారెల్లయ్య’ పాట 37లక్షల వ్యూస్ దాటింది. రమేశ్ ప్రతిభను జగిత్యాల జిల్లాకు చెందిన డైరెక్టర్ రాజ్నరేంద్ర, నిర్మాత గుగ్గిల్ల శివ ప్రసాద్ గుర్తించి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇలా సింగర్‌గా సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. అంచెలంచెలుగా.. ఇల్లందకుంట(హుజురాబాద్): ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఆ కుర్రాడికి సిని మాలంటే పిచ్చి. చూసిన ప్రతీ సినిమాను ‘అక్కడ ఆ సీన్ ఉండాల్సింది కాదు.. అక్కడ ఆ ఫైట్ ఇలా తీయాల్సి ఉండే’ అంటూ స్నేహితులతో పంచుకునేవాడు. అలా సినిమాలపై అతడికి ఉన్న ఆసక్తి డైరెక్టర్‌గా కావాలని సంకల్పిచింది. మొదట్లో అవకాశం రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా లఘుచిత్రాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు జమ్మికుంటకు చెందిన సూర్యతేజ. తన ప్రతిభను గుర్తించిన చాలా మంది నిర్మాతలు డైరెక్టరుగా అవకాశం కల్పించారు. గుంటూరుకు చెందిన రాములు– శ్రీదేవి కుటుంబం 20ఏళ్ల క్రితమే కరీంనగర్‌కు వచ్చింది. రాములు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వంటమనిషిగా చేసేవాడు. వీరికొడుకు సూర్యతేజకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. స్నేహితులు తమాషాగా సినిమా పిచ్చోడు అంటూ ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. అవకాశం కోసం తిరిగితే ఎవరూ ఆదరించలేదు. సినిమారంగంపై ఉన్న మక్కువతో సొంతంగా కెమెరా కొనుక్కుని లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాడు. పోలీసు డిపార్టుమెంటు చేస్తున్న సేవలపై 500కు పైగా లఘుచిత్రాలు తీశాడు. 2013లో తీసిన దేశం కోసం లఘుచిత్రం పేరుతెచ్చి పెట్టింది. తరువాత దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేశాడు. ఆనంద్‌సాయి, ఈశ్వర్, పైడిరమేతో పాటు పెద్దదర్శకుల వద్ద సలహాలు తీసుకుని సొంతంగా సినిమాలు చేస్తున్నాడు. 2019లో షైన్పిక్చర్స్ బ్యానర్‌పై తీసిన ‘తలచినదే జరిగిందా’ సినిమా సూర్యకు గుర్తింపునిచ్చింది. వెండితెరపై మరెందరో.. విద్యానగర్(కరీంనగర్): కళలు, కళాకారులకు వేదికైన కరీంనగర్ నుంచి చాలామంది వెండితెరపై సైతం వెలుగుతున్నారు. కరీంనగర్‌లోని మార్కెండేయకాలనీకి చెందిన జి.రాధిక ఇంటర్‌నుంచే నటనలో పేరు సాధించింది. భర్త ప్రోత్సాహంతో లఘుచిత్రాల్లో నటించడం ప్రారంభించింది. తక్కువ సమయంలో పేరు సంపాదించి, సహజనటిగా వెలుగొందుతోంది. ఇప్పటి వరకు 700కు పైగా షార్ట్‌ఫిల్మ్‌లతో పాటు దొరసాని, విరాటపర్వం, భిక్ష, గల్లీగ్యాంగ్, స్కైలాబ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సితార బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాలో కీరోల్ చేస్తోంది. గోదావరిఖనికి చెందిన ఏదుల స్వప్న 250 లఘుచిత్రాల్లో నటించింది. గల్లీగ్యాంగ్, పరేషాన్, నువ్వునేను ఒక్కటైతే, బతుకంతాబ్రహ్మచారి, బిచ్చగాడా మజాకా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బైరాన్‌పల్లి సినిమాలో నటిస్తోంది. వేములవాడకు చెందిన గోలి శివరామ్‌రెడ్డి నాటకాల్లో నటిస్తారు. 15 షార్ట్‌ఫిల్మ్‌లు చేశారు. పరేషాన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇటీవల నటించిన తుపాకులగూడెం సినిమా విడుదలకు సిద్ధమైంది. -
ప్యాకెట్లలో బండరాళ్లు, పెంకులు
సైదాపూర్ (హుస్నాబాద్): తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఓ నలుగురు యువకులు. వీరి వ్యవహారంపై పైస్థాయి ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు చేసిన మోసం బయటపడింది. ఈ కేసు వివరాలను హుజురాబాద్ ఏఎస్పీ వెంకటరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రం, వెన్కెపల్లి గ్రామానికి చెందిన నీర్ల కల్యాణ్(24), అనగోని వికాస్(23), కనుకుంట్ల అనిల్(26), తూటి వినయ్ (22) హుజూరాబాద్‌లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బోయ్స్‌గా 3 నెలల నుంచి పని చేస్తున్నారు. వీరు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనుకున్నారు. దీని కోసం ఆన్లైన్లో మోసం చేయడం ఎలా అని యూట్యూబ్‌లో వెదికారు. ఆ తర్వాత ఆన్లైన్లో విలువైన వస్తువుల్ని వీరి స్నేహితుల ఫోన్నంబర్ల నుంచి బుక్ చేసుకున్నారు. ఆ వస్తువులు హుజూరాబాద్ ఫ్లిప్‌కార్టు హబ్‌కు రాగానే డెలివరీ ఇచ్చేందుకు వారిపేరున అసైన్ చేసుకుని సైదాపూర్‌కు తీసుకొచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ వస్తువులు తీసేసుకుని, రిటర్న్‌ల పేరిట ఆ కవర్లో బండరాళ్లు, పెం కులు నింపి వెనక్కి పంపించేశారు. కాజేసిన వస్తువుల్ని అమ్ముకుని ఆ సొమ్ముతో జల్సాలు చేశారు. అనుమానంతో కదిలిన డొంక వీరి వ్యవహారంపై టీంలీడర్ నవీన్‌కు అనుమానం వచ్చి సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వీరి మోసం బయటపడింది. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకోవడంతో వారినుంచి రూ.9లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
ఎల్బీ శాస్త్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఏర్పాటైన ఎల్బీ శాస్త్రి ట్రస్టు హైదరాబాద్‌లో నైపుణ్యాభివృద్ది సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్రస్టు చైర్మన్, ఎల్బీ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో మంగళవారం బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) భాగస్వామ్యంతో ఈ సంస్థను నిర్వహిస్తామని అనిల్ శాస్త్రి ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు విద్యారంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ.. రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం వివిధ కోర్సులను ఈ సంస్థ ద్వారా అందిస్తామని, తమ కార్యకలాపాలకు హైదరాబాద్ అనువైనదిగా గుర్తించామని అనిల్ శాస్త్రి వెల్లడించారు. నైపుణ్యాభివృద్ది సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సాయం అందిస్తామని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటంపట్ల సీఎస్ హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ట్రస్టు బాధ్యులు శ్రీవాస్తవ, పాండురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైరల్‌గా మారిన 'మై విలేజ్ షో' అనిల్ లగ్నపత్రిక
నంగునూరు (సిద్దిపేట): సాధారణంగా ఏ పెళ్లి పత్రికలో చూసినా శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అంటూ మొదలుపెడతారు. కానీ ఇది ఈ పెళ్లి పత్రికలో మాత్రం శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అని ఉంది. అసలే కరోనా టైంలో పెళ్లి కదా..అందుకే ఇలా వినూత్నంగా వెడ్డింగ్ కార్డును రూపొందించారు. 'వధూవరులకు కరోనా నెగిటివ్, మరువకుండా మీ ఫోన్ల 1-జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా..ఐసోల్లు..ముసలోల్లు అందరూ ఫోన్ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్లైన్లో ఆశీర్వదించగలరు. విందు..లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి. బరాత్ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి..దాన్ని వ్లోగ్‌లో పెడతాం. ఇక కట్నాలు, కానుకలు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా క్యూఆర్ స్కాన్ చేసి పంపండి' అంటూ రూపొందించిన ఈ ఫన్నీ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పెళ్లి పత్రిక మరెవరిదో కాదండీ..ప్రముఖ యూట్యూబర్, మై విలేజ్ షో సభ్యుడు అనిల్‌ది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్ జీల అనిల్..మే1న తన వివాహం ఉందని ఈ తంతును అందరూ ఆన్లైన్లో తప్పకుండా వీక్షించాలని కోరుతూ ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’ అంటూ క్రియేటివ్‌గా వెడ్డింగ్ కార్డును రూపొందించారు. అంతేకాకుండా పెళ్లికి సమర్పించే కట్న, కానుకలను కరోనా కాలంలో తిండి లేకుండా బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించబడుతుందని పేర్కొన్నారు. మై విలేజ్ షోతో పాపులర్ అయిన అనిల్ కరోనా కాలంలో తాము చేసుకునే పెళ్లి సమాజానికి ఆదర్శంగా నిలవాలని భావించి ఇలా క్రియేటివ్‌గా డిజైన్ చేయించారు. View this post on Instagram A post shared by ANIL GEELA (@myvillageshow_anil) -
అసెంబ్లీ బయట ర్యాలీలు, బేడీలతో డ్రామాలు
సాక్షి, అమరావతి : గ్రామాల్లో డ్రామాలు చేసినట్లుగా టీడీపీ నాయకులు అసెంబ్లీ బయట ర్యాలీలు, బేడీలు వేసుకుని డ్రామాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దళితద్రోహి అని, ఎస్సీలను కూలీలుగా చూశారని అన్నారు. ఆయన దళితుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో కైలే అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీల్లో ఎవరు పుడతారన్న వ్యక్తి చంద్రబాబు.. ఎస్సీలు శుభ్రంగా ఉండరన్న నాయకులు టీడీపీ నాయకులు.. కళ్యాణి అనే ఆర్ అండ్ బీ ఉద్యోగిని కాలుతో తన్నిన వ్యక్తి అచ్చెన్నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాలతో ఎక్కువగా దళితులే లబ్ది పొందుతున్నారన్నారు. సీఎం జగన్.. జన్మభూమి కమిటీల్లాగా ప్రజలను బానిసలు చేయలేదని, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి సంక్షేమ పథకాలు పేదల గడప వద్దకే చేర్చారని అన్నారు. ( ఏపీ అసెంబ్లీ: కీలక బిల్లుల ఆమోదం ) సీఎం జగన్ దళితులను పారిశ్రామిక వేత్తలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ నవశకం పథకానికి శ్రీకారం చుట్టారని, ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం చట్టం తెచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో దళారులు, బ్రోకర్లు మాత్రమే లబ్ది పొందారని, బాబు దళిత పక్ష పతి అయితే టీడీపీలో ఒక్క దళిత శాసనసభ్యడు మాత్రమే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 22 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. -
సైకో థ్రిల్లర్
అనిల్, జాస్మిన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపాల్ రెడ్డి కాచిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ శ్రీ శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై టీఎమ్ఎస్ ఆచార్య నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆధ్యాత్మిక గురువు హరిప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎమ్ఎస్ ఆచార్య మాట్లాడుతూ– ‘‘ఆసక్తికర కథతో గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా ఇది మా మొదటి ప్రయత్నం’’ అన్నారు. ‘‘ఆసక్తికరమైన మలుపులతో సాగే సైకో థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు గోపాల్ రెడ్డి కాచిడి. ‘‘నాకు హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు థ్యాంక్స్’’ అన్నారు అనిల్. ‘‘తెలుగులో ఇది నా రెండో సినిమా’’ అన్నారు సబీనా జాస్మిన్. ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమెరా: సీతా రామాంజనేయులు ఉప్పతల. -
దిశపై అసభ్యకర కామెంట్లు చేసిన వ్యక్తి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ‘దిశ’ అత్యాచారం తర్వాత ఫేస్బుక్లో ఆమెకు న్యాయం చేయాలని మద్దతుగా ఓ మహిళ పెట్టిన పోస్టుపై అసభ్యకర కామెంట్లు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తన ఫేస్బుక్ ఖాతాలో అనిల్ కుమార్ అంబాలా డిసెంబర్ 1న ఈ కామెంట్ చేశాడని రాయదుర్గానికి చెందిన విజయా కేసరి అనే మహిళ ఈ నెల 2న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు ఫేస్బుక్ ఖాతా ఆధారంగా నిందితుడు నల్గొండ జిల్లా, గుండ్రంపల్లికి చెందిన అనిల్ కుమార్ అంబాలాగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’
యథార్థ అంశాలు ఆధారంగా తెరకెక్కిన ‘బైలంపుడి’ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. చీడికాడ మండలంలోని బైలంపుడి గ్రామంలో జరిగిన వాస్తవ విషయాలు ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సబ్బవరానికి చెందిన అనిల్ పల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు వాస్తవ అంశాలను సినిమాగా మలచడంలో విజయవంతం అయ్యారు. తద్వారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. శనివారం ఆయన సబ్బవరం వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు. సినిమా రంగం వైపు ఎలా వెళ్లారు? తొలి నుంచి సినిమాలపై నాకు ఆసక్తి ఉంది. అందుకే హైదరాబాద్ వెళ్లాను. ఏడాది కాదు రెండు ఏళ్లు కాదు 20 ఏళ్లు ఒంటరి పోరాటం చేశా. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. కెమెరా మెన్‌గానే 20 ఏళ్ల పనిచేశాను. చాలా కష్టపడ్డాను.. కష్టాలు పడ్డాను. బైలంపుడి విజయం నాకు చాలా సంతోషాన్ని అందించింది. కెమెరా మెన్‌గా ఎలా మారారు? వాస్తవానికి సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఆ ఉద్దేశంతోనే హైదరాబాద్ వెళ్లా. అయితే అనుకోకుండా కెమెరా డిపార్టుమెంట్లో చేరడం జరిగింది. అసిస్టెంట్ కెమెరామెన్‌గా నా సినీ ప్రయాణం మొదలైంది. డాక్యుమెంటరీలు, సీరియళ్లు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగా. ప్రముఖ చాయాగ్రాహకులు వీఎస్ఆర్ స్వామి, ఎంవీ రఘుతో పాటు మరికొంతమంది ప్రముఖుల వద్ద అసిస్టెంట్ కెమెరామెన్‌గా, అసోసియేట్ కెమెరా మెన్ పనిచేసే అదృష్టం దొరికింది. దర్శకుడిగా ఎందుకు మారాలనిపించింది? దర్శకత్వం అంటే నాకు కొంత ఇష్టం కొనసాగేది. కొంతమంది పెద్దల ప్రోత్సాహంతో దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకున్నా. తద్వారా ఇటు వైపు వచ్చా. దర్శకత్వం చాలా పెద్ద సవాల్. జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. 30 చిత్రాలలో అసిస్టెంట్ కెమేరామెన్, అసోసియేట్ కెమేరామెన్ పనిచేశాను. మొదటి సారిగా ప్రభాష్ హీరోగా నటించిన అడవిరాముడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. స్వర్ణ సుబ్బారెడ్డి దర్శకత్వంలో వచ్చిన విజయేంద్రవర్మ, నితిన్ నటించిన అల్లరిబుల్లోడు చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్‌గా ఉన్నాను. అలాంటి తరుణంలో పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మాతగా నాకు దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఆయన నన్ను ప్రోత్సహించారు. బైలంపుడి చిత్రం తీయడం వెనుక నేపథ్యం ఏమిటి? జిల్లాలోని చీడికాడ మండలంలోని ఓ గ్రామం బైలంపుడి. ఇక్కడ గంజాయి వ్యాపారం అధికంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కథను తీసుకోవడం జరిగింది. అక్కడ జరిగిన పలు యధార్థ ఘటనల ఆధారంగానే సినిమా తీశా. కేవలం 28 రోజుల్లో సింగిల్ షెడ్యూల్‌తో చిత్రీకరణ చేయడం జరిగింది. ఇది నాకు సంతోషాన్ని ఇచ్చింది. సినిమాకు రూ.కోటి 60 లక్షలతో చిత్రం పూర్తి చేశాం. చోడవరంలోని లక్ష్మీపురం, ద్వారకానగర్, అడ్డూరు, వెంకన్నపాలెం, సబ్బవరం మండలంల్లో బైలంపుడి చిత్రీకరణ జరిగింది. చోడవరం దగ్గర బంగారమ్మపాలెంకు చెందిన ఉత్తరకుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు? బైలంపూడి సినిమాలో 20 మంది కళాకారులకు అవకాశం కల్పించాను. సినిమా విజయవంతానికి వారంతా సంపూర్ణ సహకారం అందించారు. చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. నిర్మాత బ్రహ్మానందరెడ్డితో పాటు యూనిట్ సభ్యులంతా సంతోషంతో ఉన్నాం. ప్రస్తుతం కొంతమంది నిర్మాతలు అవకాశాలు ఇస్తామని ముందుకు వచ్చారు. దానిపై కసరత్తు జరుగుతోంది. మంచి కథను తయారు చేసుకునే పనిలో ఉన్నా. వచ్చిన ఏ అవకాశాన్ని వదలకూడదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోవాలి. -
ఎస్ఐనంటూ యువతికి వల..!
సాక్షి, గుంటూరు: విజిలెన్స్ ఎస్ఐనంటూ యువతిని ప్రేమలోకి దింపి మోసగించిన ఓ హోంగార్డు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనకు పరిచయం ఉన్న గన్మెన్ల వద్ద ఉన్న తుపాకులు తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చి, వాటిని యువతికి పంపి ప్రేమలోకి దించాడు. తర్వాత ఆమె తల్లి వద్ద రూ.12.50 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే తనపైనే నిందలు వేసి నిరాకరించడంతో మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె తల్లి మంగళవారం గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. నరసరావుపేటలో హోంగార్డుగా పనిచేస్తున్న అనిల్ ఫేస్బుక్లో రిక్వెస్టులు పెట్టి పరిచయమై తాను విజిలెన్స్ ఎస్ఐనంటూ తుపాకీ పట్టుకున్న ఫొటోను, ఓ నకిలీ ఐడీని యువతికి పంపాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. అతను ఎస్ఐ అని నమ్మిన యువతితో పాటు ఆమె తల్లి కూడా పెళ్లికి అంగీకరించారు. బ్యాంకు లోను కింద రూ.15లక్షలు కట్టాల్సి ఉందని, డబ్బు ఇవ్వాలని కోరాడు. వారు బంగారాన్ని తాకట్టు పెట్టి, మరికొంత అప్పు చేసి విడతలుగా రూ.12.50 లక్షలు అనిల్‌కు ఇచ్చారు. కొంతకాలం తరువాత పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో మీ అమ్మాయి మంచిది కాదంటూ ఆరోపణలు చేశాడు. తన స్నేహితుడితో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కనీసం తమ డబ్బు అయినా ఇవ్వమని అడిగితే ఇవ్వాల్సింది రూ.6 లక్షలే అంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. గట్టిగా మాట్లాడితే తాను చావడమో, మిమ్మల్ని చంపడమో చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనిల్ ప్రవర్తన తో తన బిడ్డ జీవితం నాశనమైందని, పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది. -
జననం
అనిల్, భవ్యశ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జననం’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘మాగ్నెట్’ మూవీ డైరెక్టర్ ఆదిశేష సాయిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకుడు లారెన్స్ క్లాప్ ఇచ్చారు. శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘డైరెక్టర్ శ్రీనివాస్‌తో గత మూడేళ్లుగా నాకు పరిచయం ఉంది. మంచి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నేను హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు అనిల్. భవ్యశ్రీ, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
పండుగకు వెళ్తూ పరలోకానికి
గీసుకొండ(పరకాల): వరంగల్ రూరల్ జిల్లా చెన్నారాపుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సింగారపు యాకోబు, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు అనిల్(35), అశోక్, ఇద్దరు కుమార్తెలు అరుణ, కరుణ ఉన్నారు. యాకోబు పెద్ద కుమారుడు అనిల్ కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ లేబర్‌కాలనీలో నివాసం ఉంటూ గొర్రెకుంటలోని కేకుల తయారీ కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అరుణకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె, కుమారుడు జల్లి గ్రామంలోనే ఉండగా.. మరో కూతురు గొర్రె సాత్విక(09) అనిల్ ఇంటిలోనే ఉంటూ ధర్మారంలోని ప్రైవేట్ పాఠశాలలో ఇటీవలే 3వ తరగతి పరీక్షలు రాసింది. ఈ క్రమంలో స్వగ్రామం జల్లిలో ఈస్టర్ పండుగ చేసుకోవడానికి సింగారపు అనిల్(35) శనివారం సాయంత్రం కవలలైన తన ఇద్దరు కూతుర్లు జాహ్నవి, జాస్నవి(జాస్విన్)(6)లతో పాటు చెల్లి అరుణ కూతురు సాత్వికను వెంటతీసుకుని బైక్‌పై బయలుదేరాడు. సాయంత్రం 4 గంటల సమయంలో గీసుకొండ మండలం వరంగల్–నర్సంపేట రహదారిలో కొమ్మాల ప్రాంతానికి చేరుకోగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అనిల్‌తో పాటు అతడి కూతురు జాస్విన్, చెల్లెలి కూతురు గొర్రె సాత్విక అక్కడే మృతి చెందారు. అనిల్ మరో కూతురు జాహ్నవి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. మద్యం మత్తులో కారు డ్రైవర్ కారు డ్రైవర్ మద్యం తాగి అతి వేగంగా నడపడంతో ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారు ప్రమాద స్థలికి వచ్చే కొద్ది దూరంలో తాగిన ఖాళీ బీరు సీసాలను పంటచేలలోకి విసిరి వేసినట్లు చెబుతున్నారు. అలాగే కారు రోడ్డు సగం భాగం దాటి దూసుకు వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ కారు దిగటంతో అక్కడ గుమికూడిన వారు తాగి ప్రాణాలు తీసావంటూ అతడిని కొట్టినట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ సీఐ సంజీవరావు, ఎస్సై అబ్దుల్ రహీం సందర్శించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు కుటుంబాల్లో విషాదం చెన్నారావుపేట: ఒకే కుటుంబంలోని తండ్రీ కూతురుతోపటు తోబుట్టువు కూతురు మృత్యువాత పడడంతో జల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలియగానే కుటుంబాల సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. అనిల్ భార్య సునీత 6 నెలల గర్భవతి కావడంతో ఆమె ఇంటి వద్దనే ఉంది. బంధువులు, కుటుంబ సభ్యులు జల్లి గ్రామంలోని ఇంటి వద్ద రోదిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కలిచివేసింది. అరుణ కుమారుడు, కుమార్తె ఏం జరిగిందో తెలియని స్థితిలో అమాయకంగా దిక్కులు చూస్తుండ చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. -
ప్రభుత్వ పరీక్షల సక్సెస్ ‘అడ్డా’ 247
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి లక్ష్యం. కానీ, సాధించేది కొందరే! నిరంతర అభ్యసనం, అదృష్టం రెండూ ఉంటే తప్ప అవి దరిచేరవు. అలాంటిది పాకెట్ మనీ ఖర్చు చేసినంత సులువుగా గవర్నమెంట్ జాబ్‌ను సాధించేలా చేస్తుంది అడ్డా 247. కంపెనీ ప్రారంభించిన రెండేళ్లలో 35 వేలకు పైగా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల బాట వేసింది. మరిన్ని వివరాలు కో–ఫౌండర్ అనిల్ నగర్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది ఉత్తర్ ప్రదేశ్‌లోని ధన్‌కౌర్ అనే కుగ్రామం. ఐఐటీ చదవాలన్నది నా కల. కానీ, మా గ్రామంలో సరైన శిక్షణ సంస్థలు, గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేరు. దీంతో చాలా ఇబ్బందిపడ్డా. ఎలాగైనా ఐఐటీలో సీటు సంపాదించాలని ఢిల్లీకి వెళ్లి కోచింగ్ సెంటర్లో చేరా. ఫలితంగా 1988లో వెయ్యి ర్యాంక్‌తో ఐఐటీ బనారస్ హిందూ యూనివర్సిటీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేరా. చదువుతున్న సమయంలో నాకర్థమైనదేంటంటే.. ఉన్నత చదువు కోసం నాలా చాలా మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి మెట్రో నగరాలకు వలస వస్తున్నారని! దీనికి పరిష్కారం చూపించేందుకే 2010లో మరొక స్నేహితుడు సౌరభ్ భన్సల్‌తో కలిసి రూ.5 లక్షల పెట్టుబడితో ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్ కెరీర్ పవర్‌ను ప్రారంభించా. 2016లో దీన్ని అడ్డా 247గా పేరు మార్చి ఆన్‌లైన్‌లోకి అడుగుపెట్టాం. త్వరలో యూపీఎస్సీ, సీటీఈటీ, ఎన్డీఏ ప్రస్తుతం అడ్డా 247లో బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్ఎస్సీ) రెండు రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షల్లో శిక్షణ అందిస్తుంది. వీడియో కోర్సులు, ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు, ఈ–పుస్తకాలు, ప్రాక్టీస్ మెటీరియల్స్, సందేహాల నివృత్తి వంటి 360 డిగ్రీల్లో సేవలందిస్తుంది. వీటి ధరలు రూ.400 నుంచి రూ.12 వేల వరకుంటాయి. ఈ ఏడాది ముగింపు నాటికి సెంట్రల్ యూపీఎస్సీ, టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటీఈటీ), నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షల సిలబస్‌లను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 60 ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్లున్నాయి. 30 కోట్ల వీడియో క్లాస్‌లు.. ప్రస్తుతం అడ్డా 247లో 4 కోట్ల మంది యూజర్లున్నారు. ఇందులో 4 లక్షల మంది పెయిడ్ యూజర్లు. ఇప్పటివరకు 30 కోట్ల వీడియో క్లాస్‌లు, 1380 కోట్ల మాక్ టెస్ట్‌లను నిర్వహించాం. రోజుకు 50 లక్షల మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. వచ్చే ఏడాది కాలంలో 10 లక్షల మంది పెయిడ్ యూజర్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ఇప్పటివరకు 35 వేల మందికి పైగా అభ్యర్థులు వివిధ ప్రభుత్వ పరీక్షల్లో ఎంపికయ్యారు. హైదరాబాద్ టాప్.. భౌతిక కోచింగ్ సెంటర్లలో 25–26 శాతం మార్జిన్లు ఉంటే.. ఆన్లైన్ కోచింగ్‌తో 50 శాతం వరకు మార్జిన్లుంటాయి. మా మొత్తం యూజర్లు, వ్యాపారంలో హైదరాబాద్ టాప్‌లో ఉంది. ఇక్కడి నుంచి 37 లక్షల మంది యూజర్లున్నారు. మా మొత్తం ఆదాయంలో 10 శాతం వాటా నగరానిది. ఆ తర్వాత పాట్నా, ఢిల్లీ, లక్నోలది. ఐదేళ్లలో రూ.1,000 కోట్లకు.. మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రూ.51 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. 2019–20 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.100 కోట్లకు, వచ్చే ఐదేళ్లలో రూ.1,000 కోట్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ‘‘ప్రస్తుతం మా కంపెనీలో 250 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో 500 మందికి చేర్చుతాం. ఇప్పటివరకు 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. ఈ ఏడాది ముగింపు నాటికి పెద్ద మొత్తంలోనే పెట్టుబడులను పొందనున్నాం. ఒకట్రెండు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని’’ అనిల్ వివరించారు. -
‘తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య బాబు చిచ్చు’’
హైదరాబాద్: తెలంగాణాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనిల్ కుమార్ విమర్శించారు. ఏపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. డేటా చోరీ కేసులో ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజల ఓటు హక్కును ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారని ఆరోపించారు. డేటా చోరీలో కేసులో ప్రధాన నిందితుడు అశోక్‌ను తప్పించడానికి చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. తెలంగాణాలో ఉన్న సెటిలర్లును బాబు ఇబ్బందులు పెడుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉన్నా అధికారంతో తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. సుజానా చౌదరీ జీఎస్టీ పన్ను ఎగవేసినా చంద్రబాబు స్పందించరని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. కేటీఆర్, వైఎస్ జగన్‌ను కలవడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, కేటీఆర్, జగన్‌ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసమే వైఎస్ జగన్‌ను కేటీఆర్ కలిసి ఉండవచ్చు కదా అని అన్నారు. ఏపీ ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేయడానికే వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. -
అనిల్ సేవలు ఆదర్శం
నెల్లూరు(సెంట్రల్): నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సేవలు ఆదర్శమని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కొనియాడారు. నగరంలోని 9వ డివిజన్ చిన్నబాలయ్యనగర్లోని పత్తివారి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్మించిన 1000 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యేతో కలిసి వేమిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వాటర్‌ప్లాంటు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి కారణం నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉం టూ అనిల్ చేపడుతున్న సేవలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. అనిల్‌ను రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో ఎంపీ నిధులతో పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాటర్‌ప్లాంట్‌ను రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బూత్‌కమిటీ సభ్యులకు సూచించారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మాట్లాడుతూ తాగునీటి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎంపీ నిధుల నుంచి వాటర్‌ప్లాంటు మంజూరు చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలకు తనకు చేతనైన సహాయసహకారాలు అందించడంలో ముందుంటానన్నారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ రాజశేఖర్, వంగాల శ్రీనివాసులురెడ్డి, ఈదల ధనూజారెడ్డి, తంబి, బట్టా కోటేశ్వరరావు, సుబ్బారెడ్డి, మల్యాద్రి, పొడమేకల సురేష్, నాగూర్ నాయుడు, వీపీఆర్ ఫౌండేషన్ సీఈఓ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘వాస్కోడగామా’గా ఆకాష్..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన మెహబూబా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న పూరి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పూరి నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే వాస్కోడగామా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్ సరసన గాయత్రి భరద్వాజ్ అనే మోడల్‌ను హీరోయిన్గా పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
అర్చకుల వివాదంపై ఈవో స్పందన
సాక్షి, తిరుమల : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో ప్రకారమే 65 ఏళ్లు నిండిన అర్చకులతో పదవీ విరమణ చేయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. అర్చకుల వివాదంపై ఈవో మాట్లాడారు. 2013లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే ఆలయంలోని ముగ్గురు అర్చకులు పదవీ విరమణ చేసినట్లు చెప్పారు. అలా పదవీ విరమణ చేసిన భక్తవత్సలం, నర్సింహ దీక్షితులు, రామచంద్ర దీక్షితులతో పాటు మరో తొమ్మిది మంది హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. అర్చకుల పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం అర్హత, ఖాళీలు చూసుకుని అవకాశాలు కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం అర్చుకుల పదవీ కాలం 25 ఏళ్లకు తక్కువ కాకుండా, 65 ఏళ్లకు ఎక్కువ కాకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురికి ప్రధాన అర్చకుల పదవులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఏటా నలుగురు ప్రధాన అర్చకులు సహా మిగతా అర్చకులు స్వామివారి కైంకర్యాలు చేస్తూ వస్తున్నారని వివరించారు. అర్చకుల పదవీ విరమణ తర్వాత మిగతా వారికి అవకాశం కలుగుతుందని చెప్పారు. కాగా, అర్చకులకు వయో పరిమితి విధించడంపై అర్చక సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా చేయడంలో ఆగమశాస్త్ర నిబంధనలను ఉల్లంఘించడమేనని అంటున్నాయి. వయో పరిమితి నిబంధన కారణంగా ప్రధాన అర్చక పదవి నుంచి రిటైరైన రమణ దీక్షితులు వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాల నిర్వహణ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సేవా కార్యక్రమాలు, నగల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆయన వ్యాఖ్యానించారు. వీటిపై స్పందించిన సింఘాల్ స్వామి వారి ఆభరణాలను ప్రజల ముందు ఉంచేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. స్వామివారి ఆభరణాలపై జస్టిస్ వాద్వా, ఎం. జగన్నాథరావు కమిటీలు వేశారని చెప్పారు. 1952 నుంచి తిరుమలలో ఉన్న ఆభరణాలు, దస్త్రాలను కమిటీ పరిశీలించిందని తెలిపారు. స్వామి వారి ఆభరణాలు అన్నింటినీ భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు. -
పెళ్లిరోజే పరలోకాలకు..
వారు గతేడాది ఫిబ్రవరి 15న పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. తొమ్మిదిరోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. ఏడాది క్రితం ఇద్దరుగా ఉన్నతాము ముగ్గురిగా మారామని సంతోష పడ్డారు. ప్రసవం సమయంలో ఆ తల్లి ఆపరేషన్ కాగా.. వైద్యులు కొన్ని కుట్లు తొలగించి.. మరికొన్ని అలాగే ఉంచారు. బంధువులు, కుటుంబసభ్యుల మధ్య పెళ్లిరోజును ఘనంగా జరుపుకుందామని భావించి మిగిలిన కుట్లు తొలగించుకునేందుకు ఆ తల్లి ఆసుపత్రికి చేరింది. కుట్లు తొలగించిన తర్వాత ఇంటికి చేరిన ఆమె.. పదినిమిషాలు కూడా ఉండలేకపోయింది. కళ్లు తిరిగి పడిపోవడం.. ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించడం.. అక్కడ వైద్యులు పరీక్షించేలోపే.. కన్నుమూయడం నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి. జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం జరిగిన ఈ సంఘటన కంటతడి పెట్టించింది. జమ్మికుంట(హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఓగ్గు రమ్యకు అదే గ్రామానికి చెందిన అనిల్‌తో గతేడాది ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. రమ్య గర్భం దాల్చినప్పటినుంచి పట్టణంలోని శ్రీవిజయసాయి ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటోంది. ఈ నెల 7న పురిటి నొప్పులు రావడంతో బంధువులు ఆమెను అదేరోజు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేసి పండంటి పాపకు పురుడు పోశారు. ఆపరేషన్ సమయంలో కుట్లు వేసిన వైద్యులు.. ఈనెల 12న కొన్నికుట్లు విప్పి ఇంటికి పంపించారు. ఫిబ్రవరి 15న పెళ్లిరోజు కావడంతో బంధువుల మధ్య ఘనంగా జరుపుకుందామనే ఉద్దేశంతో రమ్య మిగితా కుట్లు విప్పించుకునేందుకు గురువారం ఆస్పత్రికి వచ్చింది. అనిల్ గోదావరిఖనిలో పండ్లు విక్రయించేందుకు వెళ్లాడు. కుట్లు విప్పిన తర్వాత రమ్యను ఇంటికి పంపించారు. ఏం జరిగిందోగానీ.. ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే రమ్య కళ్లు తిరుగుతున్నాయంటూ కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంటనే ఆటోలో మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి రాగా వైద్యుడు రమ్యను పరీక్షించి స్ట్రెచర్‌పై ఆక్సిజన్ ఏర్పాటు చేశాడు. కొద్ది సేపటికే మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన రమ్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కోపంతో ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్ సంఘటనస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు. మృతదేహం ఆస్పత్రిలోనే ఉంది. పెళ్లిరోజే పరలోకాలకు వెళ్లావా బిడ్డ.. సరిగ్గా ఏడాది క్రితం రమ్యకు అనిల్‌తో వివాహం కా గా.. తిరిగి అదేరోజు కన్నుమూయడంపై బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘అయ్యో దేవుడా.. ఎంతపనిచేస్తివి.. పాపకు జన్మనిచ్చి.. కడుపార చూసుకోకముందే.. కానరాని లోకాలకు తీసుకెళ్లా వా..’ అంటూ బంధువులు, కుటుంబసభ్యులు రోదించిన తీరు కన్నీరు తెప్పించింది. గోదావరిఖని నుంచి వచ్చిన అనిల్ భార్య మృతదేహంపై ఏడుస్తుండగా ఆపడం ఎవరితరమూ కాలేదు. -
థ్రిల్లర్ జానర్లో ‘ఇదం జగత్’!
సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిన అక్కినేని వారసుడు సుమంత్ ఇటీవల మళ్ళీరావా సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్‌ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. మళ్ళీరావా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలకు ఓకె చెప్పాడు సుమంత్. ప్రస్తుతం అనిల్ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అంజు కురియెన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సుమంత్ ఫొటో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సుమంత్ కొత్త స్టైల్లో కనిపించనున్న ఈసినిమాకు ‘ఇదం జగత్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
తాజ్‌మహల్ ఓ అందమైన శ్మశానం
-
ఇయర్ ఫోన్స్ చావును పిలిచింది!
► పాటలు వింటూ వాహనం నడపడంతో ప్రమాదం ► చినకాకాని ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద మరణించిన జిల్లావాసి మంగళగిరి: ఇయర్ ఫోన్స్‌లో పాటలు వింటూ ద్విచక్రవాహనం నడిపిన యువకుడు నడి రోడ్డుపై ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన రాయపూడి సూరిబాబు, అన్నపూర్ణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. సూరిబాబు కొంతకాలం క్రితం మృతి చెందగా కుటుంబానికి పెద్ద దిక్కుగా అతని కుమారుడు అనిల్ (30) వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్ కొని జీవనం సాగిస్తున్నారు. అనిల్‌కు ఇంకా వివాహం కాలేదు. అతని సోదరి స్రవంతిని విజయవాడలో ఓ ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితం అన్నపూర్ణమ్మ విజయవాడలోని కుమార్తె ఇంట్లో ఉంటోంది. వ్యవసాయ పనుల నిమిత్తం బావకు తెలిసిన బంధువుల వద్ద అనిల్ అప్పుగా కొంత నగదు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం శనగలు విక్రయించగా నగదు వచ్చింది. దీంతో ఆ నగదును తీసుకుని విజయవాడ వెళ్లి అప్పులు చెల్లించి తల్లిని తీసుకువస్తానని ఆదివారం ఉదయం గ్రామంలోని తన పిన్నికి, స్నేహితులకు చెప్పి విజయవాడకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ముఖానికి మఫ్లర్ ధరించడంతో పాటు చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వాహనం డ్రైవ్ చేస్తున్నాడు. మరో అర గంట ప్రయాణిస్తే విజయవాడలోని తల్లి దగ్గరకు చేరుకునేవాడు. అయితే చినకాకాని ఎన్ఆర్ఐ జంక్షన్ ఫ్లై ఓవర్ దాటుతుండగా ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ స్లో చేసి వెళుతున్నాడు. దానిని గమనించని అనిల్ నేరుగా లారీని ఢీకొట్టి రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయం అయింది. 108 రావడం ఆలస్యం కావడంతో హైవే పెట్రోలింగ్ ఎస్ఐ ఎం. కృష్ణ పోలీసు వాహనంలో పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు అతని బ్యాగును, అందులోని రూ.1.66 లక్షల నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతి సమాచారం అందుకున్న తల్లి, సోదరితో పాటు బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి చేరుకుని విలపించిన తీరు చూపరులను కలచివేసింది. -
మా కుమారుడిని కాపాడండి
సౌదీలో అక్రమ కేసులో చిక్కుకున్న అనిల్ తల్లిదండ్రుల వేడుకోలు హైదరాబాద్: సౌదీలో అక్రమ కేసులో చిక్కుకున్న తమ కుమారుడు అనిల్‌ను కాపాడాలని, స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల రాజన్న జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన కరికె లచ్చవ్వ, రాజయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... సౌదీలో కపిల్ అనే వ్యక్తి చేసిన తప్పును తమ కొడుకుపై రుద్ది జైలుపాలు చేశారన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించామని, దానికి ఆయన స్పందించి అక్కడి రాయబార కార్యాలయంలో మాట్లాడి రప్పించే ప్రక్రియ వేగవంతం చేశారని తెలిపారు. కాని, అనిల్‌కు ఈ నెల ఆఖరు వరకు వీసా గడువు ముగుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమను పోషించేందుకు కొడుకు సౌదీ వెళ్లి అక్కడ కేసులో ఇరుక్కుపోవడంతో మరింత కుంగిపోతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ కుమారుడిని వెంటనే స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నారు. -
సత్యవ్యాఖ్యోపదేశం 4th june 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 28th May 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 21st May 2017
-
చంద్రబాబుపై ప్రజలకు భ్రమలు తొలగాయి
- వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ సునీల్ కరప : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రజలు పెట్టుకున్న భ్రమలు తొలగిపోయాయని, గ్రామాల్లో, నగరాల్లో ఎక్కడ చూసినా వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్టినేటర్ చలమలశెట్టి సునీల్ అన్నారు. బుధవారం కరప వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన విధంగా నవ్యాంధ్ర ప్రదేశ్‌ను కూడా అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మి గెలిపించారన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరు చెప్పి ప్రచారం చేసుకోవడమే కానీ చేసిందేమీ కనిపించడంలేదన్నారు. అమలు సాధ్యంకానీ వాగ్దానాలతో అధికారం చేజిక్కించుకున టీడీపీ వాటిని అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జన్మభూమి కమిటీలు నియమించడంతో అవినీతిని గ్రామస్థాయికి తీసుకుపోయారని సునీల్ విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రధాని నరేంద్రమోదీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించి, దీన్ని అధికార పార్టీ నాయకులు, మంత్రులు రాజకీయం చేయడం తగదన్నారు. ప్రధానిని ఎవరైనా కలవవచ్చన్న రాజకీయ పరిజ్ఞానం కూడా లేకపోవడం శోచనీయమన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ టీడీపీ సాగిస్తున్న అవినీతి పాలనపై జగన్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. -
మాజీ డ్రైవర్ ఫ్యాషన్ డిజైనర్ గొంతు కోశాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఫ్యాషన్ డిజైనర్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతుకోశాడు. ప్రస్తుతం ఆమె అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గతంలో ఆమె వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తే ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసుల సమాచారం ప్రకారం ఢిల్లీలోని శివాలిక్ అపార్ట్మెంట్లో కావేరి లాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ తన తల్లి రేఖాతో కలిసి ఉంటోంది. వీరి వద్ద గతంలో అనిల్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే, ఇటీవలె వారివద్ద పని మానేశాడు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో కావేరీ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన అనిల్ ఇంటి డోర్ బెల్లు కొట్టాడు. అతడి తల్లి ఎందుకొచ్చావని అడగగా తాను ఇదే అపార్ట్మెంట్లోని మరో ఇంట్లో ఉద్యోగం చేస్తున్నానని, వారి కారు పార్క్ చేసేందుకు కారు అడ్డుగా ఉందని చెప్పాడు. అయితే, కావేరీ తల్లి కారు తాళం ఇచ్చే సమయంలో తాను వెళ్లి పార్క్ చేస్తానని కావేరీ వెళ్లింది. ఆమె వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చోగానే తనతో తెచ్చుకున్న కత్తితో అనిల్ దాడి చేశాడు. ఆమె గొంతు కోశాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న విద్యార్థులు గట్టిగా అరవడంతో అతడు పారిపోయాడు. ప్రస్తుతం కావేరి సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో కోలుకుంటోంది. గతంలో అనిల్ ప్రవర్తన బాగా లేకపోవడంతో ఉద్యోగంలో నుంచి తొలగించారని పోలీసులు చెప్పారు. ఆ కక్షతోనే దాడికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. -
సత్యవ్యాఖ్యోపదేశం 14th May 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 7th May 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 30th April 2017
-
సీఐ, ఎస్సై, ఏఎస్సై సస్పెండ్
కరీంనగర్: అదిలాబాద్ వన్‌టౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్ చేస్తూ.. కరీంనగర్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ తగాదాలో తలదూర్చారనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్ నివేదిక ఆధారంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై బి. అనిల్, ఏఎస్సై జి. అప్పారావులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ రేంజ్ డీఐజీ సి. రవివర్మ ఆదేశాలు జారీచేశారు. -
సత్యవ్యాఖ్యోపదేశం 23rd April 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 16th April 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 9th April 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 26th March 2017
-
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
తిరుమలగిరి(సూర్యాపేట జిల్లా): మండలకేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందాడు. నకిరేకల్ మండలానికి చెందిన అనిల్ కుమార్(17) ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి గురువారం బైక్‌పై తిరుమలగిరి వెళ్లాడు. బైక్‌పై వెళ్తుండగా మండలకేంద్రంలో వెనక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సత్యవ్యాఖ్యోపదేశం 19th March 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 12th March 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 5th March 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 26th Feb 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 12th Feb 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 5th Feb 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 29th January 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 22nd January 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 8th January 2017
-
క్వార్టర్స్‌లో అపూర్వ, అనిల్
క్యారమ్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: వీఏ శర్మ, ఇందిరాంబ స్మారక క్యారమ్స్ టోర్నమెంట్లో అపూర్వ, అనిల్ కుమార్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో వరల్డ్ చాంపియన్ అపూర్వ (ఎల్ఐసీ) 25-0, 25-0తో శ్రీవాణిపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో టాప్ సీడ్ అనిల్ కుమార్ (ఏజీఏపీ) 13-25, 21-13, 25-14తో కె. కృష్ణపై గెలుపొందగా... రెండో సీడ్ వి. శివానంద రెడ్డి 16-19, 25-23, 15-25తో మొహమ్మద్ వసీమ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నందిని (డెలారుుట్) 25-0, 25-0తో తేజస్వి (వీపీజీ)పై, బి. సునీత 25-0, 15-24, 19-16తో రుక్సర్ (డెలారుుట్)పై, బి. శ్రీవిద్య 25-9, 25-4తో జ్యోతిపై, తేజస్వి (ఆక్సెంచర్) 25-0, 25-8తో ఉమాదేవి (ఏఎంసీ)పై, మాధవి 25-0, 25-17తో రమశ్రీ (పోస్టల్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు ఆదిత్య 13-25, 25-15, 25-13తో హకీమ్‌పై, శ్రీనివాస్ 25-3, 25-4తో జుబేర్ ఖాన్‌పై, ప్రసాద్ 18-12, 25-1తో మునావర్‌పై, మొహమ్మద్ అహ్మద్ 25-11, 25-2తో రాణాపై, గోపీకృష్ణ 22-20, 10-25, 24-23తో సూర్యప్రకాశ్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ మూడోరౌండ్ ఫలితాలు సందీప్- కృష్ణ జోడీ 25-12, 25-14తో శశి-కల్యాణ్ జంటపై, మునీర్ అహ్మద్-సాహిల్ జోడీ 25-12, 25-5తో రమేశ్-సుమన్ జంటపై, నరేశ్- సారుు జోడీ 25-8, 25-10తో జుబేర్- ఖదీర్ జంటపై, వసీమ్-ఎస్.కే. జఫర్ జోడీ 1-25, 25-11, 25-4తో హకీమ్- సుహృత్ జంటపై, నవీన్- నందకుమార్ జోడీ 25-1, 25-10తో స్వామి- పవన్ జంటపై, శివానంద రెడ్డి-ఆదిత్య జోడీ 25-0, 25-0తో శ్యామ్- రఘు జంటపై, జైకుమార్-సూర్యప్రకాశ్ జోడీ 25-4, 25-0తో వెంకటేశ్-అనంత నారాయణ్ జంటపై, అహ్మద్-మొహమ్మద్ జోడీ 25-9, 25-1తో తాల్-షఫీక్ జంటపై, అబ్దుల్-ఖైజర్ జోడీ 21-7, 23-9తో హరి-శ్రీకాంత్ జంటపై, వినోద్-శ్రీనివాస్ జోడీ 25-6, 25-17తో నాగభూషణం-ప్రసాద్ జంటపై గెలుపొందారు. -
సత్యవ్యాఖ్యోపదేశం 25th December 2016
-
సత్యవ్యాఖ్యోపదేశం 18th December 2016
-
సత్యవ్యాఖ్యోపదేశం 11th December 2016
-
సత్యవ్యాఖ్యోపదేశం 4th December 2016
-
సత్యవ్యాఖ్యోపదేశం 27th November 2016
-
యువకుడు ఆత్మహత్య
శెట్టూరు : తల్లిదండ్రులు మందలించారన్న కారణంగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండల పరిధిలోని ఐదుకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. మాలేపల్లికి చెందిన అనంతమ్మ, చండ్రాయుడు ఐదుకల్లులో ఓ వ్యవసాయ తోటలో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో అనిల్(17) చివరి వాడు.ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఏ పని చేయకుండా మిన్నకుండేవాడన్నారు. కళాశాలకు వెళ్లి చదువుకోవాలని పలుమార్లు తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇంట్లో ఖాళీగా ఉండి ఎలా సంపాదిస్తావని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్ ఐదుకల్లులోని ఓ వ్యవసాయ తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శెట్టూరు ఎస్ఐ శ్రీకాంత్, ఏఎస్ఐ కుళ్లాయప్ప తెలిపారు. -
సత్యవ్యాఖ్యోపదేశం 20th November 2016
-
సత్యవ్యాఖ్యోపదేశం 13th November 2016
-
సత్యవ్యాఖ్యోపదేశం 6th November 2016
-
సత్యవ్యాఖ్యోపదేశం 30th October 2016
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని పాత ఆంధ్రాబ్యాంకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. బైక్‌పై ముగ్గురు విద్యార్థులు రంపచోడవరం నుంచి గోకవరం వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన నరేష్(20), తూర్పుగోదావరి జిల్లా కొంకుదూరు గ్రామానికి చెందిన అనిల్(20) అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. రవికుమార్(20) అనే మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రేమభిక్ష పెట్టింది ఎవరు?
అనిల్, శ్రుతిలయ జంటగా ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు నిర్మిస్తున్న సినిమా ‘ప్రేమభిక్ష’. ప్రస్తుతం కర్ణాటకలోని కోలార్‌లో షూటింగ్ జరుగుతోంది. నవంబర్‌లో పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘అనంతపురంలోని భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా చిత్రం రూపొందుతోంది. యువ జంట ప్రేమకు అడ్డు నిలిచింది ఎవరు? ప్రేమభిక్ష పెట్టింది ఎవరు? అనేది ఆసక్తికరం. సీనియర్ నటుడు సుమన్, షఫీ, దేవిశ్రీ గురూజీల నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: ప్రమోద్, సంగీతం: ఘంటాడి కృష్ణ. -
పెళ్లి కొడుకు గొంతు కోసి..
►దేవాలయం ప్రాంగణంలోనే వరుడి దారుణ హత్య ► వధువు సోదరుడు, అతడి స్నేహితుల దాడి ► అడ్డుకోబోయిన వరుడి తండ్రిపైనా దాడి ► అమ్మాయిని తీసుకొని పరారైన కుటుంబీకులు ► ప్రేమ పెళ్లిలో దారుణం ► కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలో కాలనీలో ఘటన కరీంనగర్ క్రైం/మానకొండూర్: పెళ్లి బట్టలపై రక్తం చిందింది! కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహం ఇష్టం లేని అమ్మాయి కుటుంబీకులు దేవాలయం ప్రాంగణంలోనే అతడిని గొంతు కోసి చంపేశారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే పెళ్లి దుస్తుల్లో ఉన్న ఆ యువకుడిని కిరాతకంగా హతమార్చారు. అడ్డొచ్చిన వరుడి తండ్రిపైనా దాడికి పాల్పడ్డారు. సుమారు గంటపాటు రణరంగం సృష్టించి అమ్మాయిని తీసుకొని పరారయ్యారు. గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం విజయపురి కాలనీకి చెందిన మహంకాళి ఎల్లయ్యకు నలుగురు సంతానం. చిన్నవాడైన మహంకాళి అనిల్(24), అదే గ్రామానికి చెందిన అస్తపురం శ్రీనివాస్-తిరుమల దంపతుల కూతురు మౌనిక(19) రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. ఏడాదిన్నర క్రితం ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయారు. అప్పుడు మౌనిక మైనర్ కావడంతో హైదరాబాద్‌లోని మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రెండు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అరెస్టయిన తర్వాత అనిల్ చర్లపల్లి జైల్లో ఏడాదిపాటు శిక్ష అనుభవించిన కొద్దికాలం కిందటే బయటకొచ్చాడు. స్థానికంగా ఓ వాటర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. మేజర్ అయిన మౌనిక ఇటీవల అనిల్ ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి అక్కడే ఉండిపోయింది. దీంతో మౌనిక కుటుంబ సభ్యులు కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గుడిలోంచి లాక్కొచ్చి.. గొంతు కోసి.. గురువారం మధ్యాహ్నం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు అనిల్, మౌనిక చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అనిల్ తండ్రి ఎల్లయ్య, బంధువులు మల్లయ్య, రవితోపాటు కొందరు మహిళలు వచ్చారు. అనిల్, మౌనిక కొత్తబట్టలు ధరించి పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో మౌనిక సోదరుడు వంశీక్రిష్ణ ఉరఫ్ లడ్డు, అదే గ్రామానికి చెందిన టింకు, సాయిరాంతోపాటు సుమారు ఇరవై మంది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాహనాలపై అక్కడికి వచ్చారు. పెళ్లికి సిద్ధమైన అనిల్‌ను ఆలయంలో నుంచి ఈడ్చుకెళ్లారు. గుడి పక్కనే దారుణంగా రాడ్‌తో కొట్టారు. తర్వాత కత్తితో పొడిచి, గొంతు కోశారు. అడ్డుకోబోయిన అనిల్ తండ్రి ఎల్లయ్యపైనా రాడ్‌తో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం వారు మౌనికను అక్కడనుంచి తీసుకొని పారిపోయూరు. స్థానికులు గమనించి ఎల్లయ్యను కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మౌనిక సోదరుడు, అతడితో పాటు వచ్చినవారు సుమారు గంటసేపు రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న ఆలయం వద్ద రణరంగం సృష్టించారని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారిని భయబ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ జె.రామారావు, సీఐలు వెంకటరమణ, విజయసారథి ఘటనా స్థలానికి చేరుకొని అనిల్ మృతదేహాన్ని పరిశీలించారు. హత్య ఎలా జరిగిందనే విషయూలను అనిల్ బంధువులతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సీపీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. -
‘హంస’ గౌరవ సలహాదారునిగా అనిల్
అనంతపురం మెడికల్ : ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హంస) రాష్ట్ర గౌరవ సలహాదారునిగా మన జిల్లాకు చెందిన ఎయిడ్స్ అండ్ లెప్రసీ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ అనిల్‌కుమార్ నియమితులయ్యారు. విజయవాడలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నూతన అధ్యక్షుడు యోగీశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆరవపాల్ అధ్యక్షతన నిర్వహించారు. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరవగా అనిల్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎంపికపై ‘హంస’ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. -
సత్యవ్యాఖ్యోపదేశం 09th Oct 2016
-
మద్యం మత్తులో బైక్ నడిపి..
మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన మరో ఘటన ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సమయంలో సోమేష్ అనే వ్యక్తి నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న రాజేష్, అనిల్‌తోపాటు సోమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సోమేష్‌ను కామినేని ఆస్పత్రికి, మిగతా ఇద్దరిని నక్షత్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని బాధితుడు అంటున్నాడు. -
మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్
నృత్యం చేస్తున్న మహిళను వేదిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి షీటీం పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం... సఫీల్‌గూడ మిని ట్యాంక్‌బండ్ వద్ద వినాయక నిమజ్జనం జరుగుతున్న సమయంలో మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేసే మల్కాజిగిరికి చెందిన ఆర్. అనిల్ (32) నృత్యాలు చేస్తున్న మిహ ళలను వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు అక్కడే విధులు నిర్వహిస్తున్న షీటీం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షీటీం పోలీసులు అనిల్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
గుండెపోటుతో బస్సులో వ్యక్తిమృతి
మన్ననూర్ : హైదరాబాద్ నుంచి (పికెట్ డిపో) శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గురువారం గుండెపోటుతో గోరిట అనిల్(45) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మన్ననూర్ వద్ద చోటుచేసుకుంది. బస్సు కండక్టర్ ఎస్ఎస్ కుమార్ తెలిపిన వివరాలు... రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామానికి చెందిన అనిల్‌తో పాటు మరోవ్యక్తి శ్రీశైలం వెళ్లేందుకు విడివిడిగా టికెట్ తీసుకున్నారని తెలిపారు. బస్సు మన్ననూర్‌కు చేరుకోగానే బస్సులోని మొత్తం 25మంది ప్రయాణికుల్లో 9మంది దిగిపోయారని చెప్పారు. ఈ క్రమంలో బస్సులో మిగిలి ఉన్న ప్రయాణికులను లెక్కించుకునేందుకు వెనక్కి వెళ్లగా, వెనక నుంచి రెండోసీట్లో కూర్చున్న వ్యక్తి మృతి చెందినట్లు గమనించిన కండక్టర్ బస్సుడ్రైవర్ యాదయ్యకు తెలిపాడు. బస్సును అక్కడే ఆపి, వెంటనే అమ్రాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమర్టం కోసం అదేబస్సులో అమ్రాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. -
గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి
వేములవాడ : వేములవాడ మండలం నాంపల్లిలో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్‌కు కరెంట్ వైర్లు తగిలాయి. దీంతో వాహనంలో ఉన్న 10 మందికి కరెంట్ షాక్ తగిలింది. వారిలో ఉన్న అనిల్ (13) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా వారికి స్వల్పగాయాలు అయ్యాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను వేములవాడ ఆసుపత్రికి తరలించారు. అనిల్ మృతతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
దూసుకొచ్చిన వారసుడు
ముంబై: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ క్యాపిటల్ కంపెనీలోకి కొత్త వారసుడు దూసుకొచ్చాడు. రిలయన్స్ గ్రూప్ అధ్యక్షుడు అనిల్ ధీరూబాయ్ అంబానీ పెద్ద కొడుకు జై అన్మోల్ అంబానీ (24) ఎడిషనల్ డైరెక్టర్ గా నియమితుడయ్యారు. ఈ మేరకు కంపెనీ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. రిలయన్స్ క్యాపిటల్ బోర్డు ఆధ్వర్యంలోని నామినేషన్ అండ్ కాంపన్సేషన్ కమిటీ సిఫారసులకు మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్మోల్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో గత రెండేళ్లుగా తనకున్న అనుభవం వ్యాపారవృద్ధిలో తనకు సహాయపడనుందని తెలిపారు. ఫాస్ట్ లెర్నర్ గా వివిధ నిర్ణయాలసందర్భంగా యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉన్న అన్ మోల్ ను ఆహ్వానిస్తున్నామని, రిలయన్స్ కాపిటల్ ఈడీ, గ్రూప్ సీఈవో సామ్ ఘోష్ ఆయనకుస్వాగతం పలికారు. కాగా జై అన్మోల్ 2014 నుంచి రిలయన్స్ క్యాపిటల్ తన సేవలను అందించారు. 'వార్విక్ బిజినెస్ స్కూల్' నుంచి డిగ్రీ పొందిన ఇతడికి ఫైనాన్స్ రంగంపై ఆసక్తి ఎక్కువ. ఈ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ వివిధ కంపెనీలను టేకోవర్ చేస్తూ దూసుకెడుతున్న సంగతి తెలిసిందే. -
అయ్యో పాపం అనిల్...
పాడైపోయిన రెండు కిడ్నీలు వారానికి మూడు సార్లు డయాలసిస్ ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు సంగెం : విధి ఆడిస్తున్న వింత నాటకంలో పాత్రదారైన యువకుడు రోజులు లెక్క పెట్టుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాడు... ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు... మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి బర్ల యాకమ్మ, చొక్కయ్య దంపతులకు కూతురు కోమల, కుమారుడు అనిల్(25) ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు కులవృత్తి బట్టలు ఉతుకుతూ ఉన్నంతలో పిల్లలను పెంచిపోషించారు. అప్పు చేసి కూతురుకు పెండ్లి జరిపించారు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన కొడుకు అనిల్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండడంతో ఇక తమ జీవితానికి ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుందని తల్లిదండ్రులు ఆనందపడిపోయారు. అనిల్‌కు పెండ్లి చేద్దామనుకుంటున్న సమయంలో అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించిన తల్లిదండ్రులకు పిడుగులాంటి చేదు వార్త.. అనిల్ రెండు కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు చెప్పారు. దీంతో వారికి ఏమి చేయాలో పాలుపోలేదు. అనిల్ ఆరోగ్యం రోజురోజుకు క్షిణించిపోతుండడంతో కారు నడపడానికి వెళ్లడం లేదు. ఇప్పటికే లక్ష రూపాయల వరకు ఖర్చు చేశామని అత డి తల్లిదండ్రులు చెబుతున్నారు. వారానికి మూడు మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తున్నదని, ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నప్పటికీ ఖర్చులు,మందులకు వారానికి రూ.5వేలు అవుతున్నాయని వాపోతున్నారు. అయినప్పటికీ అనిల్ జీవితానికి బరోసా లేదని రెండు నెలల్లో కిడ్నీని మా ర్చితేనే బతుకుతాడని, లేకుంటే ఫలితం లేదని డాక్టర్లు చెబుతున్నారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన కొడుకు బతికించుకోవడానికి కిడ్నీని ఇవ్వడానికి తల్లి యాకమ్మ ముందుకు వస్తున్నది. అయిన పరీక్షలు చేయించుకోవడానికి, ఆపరేషన్, మందుల కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందిస్తేనే తమ కుమారుడిని బతికించుకుంటామని, మనస్సు ఉన్న మహా రాజులు సాయం అందించాలని దీనంగా వేడుకుంటున్నా రు. ఆర్థిక సాయం అందించే వారు 9959876752లో ఫోన్ నంబర్లో సంప్రదించాలని అతడి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 31st July 2016
-
మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దు
మండ్య: జీవితంలో ఎదేరయ్యే సమస్యల ఒత్తిడిని జయించలేక నేటి యువత మాదకద్రవ్యాలకు బానసలవుతున్నారని మండ్య యూత్ గ్రూప్ అధ్యక్షుడు అనిల్ విచారం వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ కాలేజ్‌లో మండ్య యూత్ గ్రూప్, సాంస్కృతిక వేదికల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు విద్యార్థులపై చూపుతున్న దుష్ర్పభావాలపై శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించవలసిన విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలవుతుండడం శోచనీయమన్నారు. మాదకద్రవ్యాల మత్తులో యువత నేరాలకు పాల్పడుతుండడంతో వారితో పాటు వారి కుటుంబ సభ్యలు కూడా సమాజంలో ఛీత్కారాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. -
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 10th July 2016
-
కరెంటు షాక్ తగిలి ఇద్దరి మృతి
బీబీనగర్ మండలం నాగారం గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఉన్న మోటారును రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ 11 కేవీ వైరు తగిలి ముగ్గురు వ్యక్తులు కరెంటు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో సందెల కుమార్(30), ఎం.అనిల్(20) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..ప్రశాంత్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రశాంత్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
తీరు మారకుంటే చంపేస్తాం
కరీంనగర్ : పోలీస్ ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్న గొల్ల మల్లారెడ్డి, అనిల్ తీరు మార్చుకోవాలని మావోయిస్టులు సూచించారు. తీరు మారకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని వారికి మావోయిస్టులు హెచ్చరించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, రామోజీ పేటలో ఈ మేరకు శనివారం వాల్ పోస్టర్లు వెలిశాయి. -
ప్రేమపెళ్లి వ్యవహారంలో ఘర్షణ.. దారుణహత్య
ముషీరాబాద్ : ప్రేమ పెళ్లి వ్యవహారంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా ముషీరాబాద్ మండలం కుర్విచెడ్ గ్రామంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ సంఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్ ఎస్ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.... మండలంలోని కుర్విచెడ్ గ్రామానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని మంగళవారం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయంపై ఇరు కుటుంబాల సభ్యులు మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఘర్షణ పడ్డారు. యువతి తరపు బంధువులు వెంకటేశ్, సూరి కలసికట్టుగా అనిల్ ఇంపై దాడి చేశారు. ఆ క్రమంలో అనిల్ నాయనమ్మ సాయమ్మపై వారు గొడ్డలితో దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన రమ్యకృష్ణ, పద్మమ్మ అనే మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తాండూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
పదహారేళ్ల బాలికకు తలపెట్టిన వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం విగాం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలికకు(16), అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో బుధవారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయమై స్థానికులు సమాచారం అందించటంతో ఎస్సై అనిల్ అక్కడికి చేరుకుని, బాలికలకు 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయరాదని సూచించారు. -
పాముకాటుతో విద్యార్థి మృతి
పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని పాము కాటు వేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని భాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అనిల్(5) అనే విద్యార్థి పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా.. పాము కాటు వేసింది. ఇది గుర్తించిన ఉపాధ్యాయులు విద్యార్థిని హుటాహుటిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అనిల్ మృతి చెందాడు. -
ఫైర్‌మన్ ఆత్మహత్యాయత్నం
నెల్లూరు: ఫైర్‌మన్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన నెల్లూరు నగరంలో కలకలం సృష్టించింది. ఫైర్ స్టేషన్ కార్యాలయంలో కె. అనిల్ అనే ఉద్యోగి శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. తోటి ఉద్యోగుల వేధింపుల వల్లే అనిల్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ముమ్మాలపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అనిల్(20) అనే యువకుడు వేరుశెనగ పంటను ట్రాక్టర్లో గద్వాల్ మార్కెట్‌కు తరలిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ముందు భాగంలో కూర్చొని ఉన్న అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంటుషాక్‌తో ఇద్దరు రైతులు మృతి
పెద్దారవీడు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో మంగళవారం విషాదం నెలకొంది. పొలంలో పైపులు నేలలో తవ్వి వేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎర్త్ వైరు తగిలి ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గొబ్బూరు గ్రామానికి చెందిన దొండపాటి అనిల్(35), వెన్నా నాగిరెడ్డి(40)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 23rdJanuary 2016
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 16th January 2016
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 10thJanuary 2016
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 3rdJanuary 2016
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 27thDecember 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 20th December 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 11th December 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 6th December 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవ్యాఖ్యోపదేశం 22nd November 2015
-
సారిక డైరీ
-
అత్తింట్లో నరకం
తన లాయర్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక గోడు * అత్తామామ, భర్త కలసి తీవ్రంగా వేధించారు * అడుగడుగునా అవమానాలే.. * భర్త బలాదూర్‌గా తిరిగాడు.. నా డబ్బులన్నీ వాడుకున్నాడు * వివాహేతర సంబంధంపై ప్రశ్నిస్తే కొట్టేవాడు * పిల్లల్ని ఏనాడూ పట్టించుకోలేదు.. పాల డబ్బాలు కొనాలన్నా ఇబ్బందే * వంటగదికి తాళం వేసేవారు.. పస్తులు అలవాటైపోయాయి * భర్త కోసం త్యాగాలు చేయాలని రాజయ్య అనేవారు * ఆయన మాటలకు చచ్చిపోవాలనిపించేది సాక్షి, హన్మకొండ: ప్రేమ పేరుతో సారిక జీవితంలోకి ప్రవేశించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ అనుక్షణం ఆమెకు నరకాన్ని చూపించాడు. భర్తగా కష్టసుఖాల్లో తోడుండాల్సిన వ్యక్తి బాధ్యతలను గాలికొదిలి బలాదూర్‌గా తిరిగాడు. సారిక కష్టార్జితాన్ని ఇష్టారీతిగా వాడుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తప్పు దారిలో వెళ్తున్న కొడుకును మందలించాల్సిన తల్లిదండ్రులు కూడా ఆయనకే వత్తాసు పలికారు. సూటిపోటి మాటలు, భౌతిక దాడులతో సారికకు అనుక్షణం నరకం చూపించారు. భర్త, అత్తమామాలు పెడుతున్న ఇబ్బందులను తన తరఫున న్యాయవాదికి, షాహిన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక పూసగుచ్చినట్టు వివరించింది. ఆ వివరాలివీ.. నా కొడుకును పెళ్లి చేసుకో.. అనిల్, నేను ఉద్యోగాలు తెచ్చుకుంటే మా వాళ్లను, అనిల్ కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నా. పెళ్లికి ముందు మా అత్తగారు మాధవి నన్ను తన కాలేజీకి (కేయూలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో) తీసుకెళ్లి మాయ మాటలు చెప్పింది. నన్ను మా అమ్మవాళ్ల ఇంట్లోంచి బయటకొచ్చి, వాళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది. చదువుకున్న వ్యక్తి, లెక్చరర్, మంచీచెడు అన్ని తెలిసిన పెద్దావిడ అని తల్లిలా భావించాను. ఆమె చెప్పినట్లే ఇంట్లోంచి వచ్చేసి అనిల్‌ను పెళ్లి చేసుకున్నా. ఆవిడ మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. ఘోరమైన తప్పుడు స్టెప్ వేశాను. ఒక తప్పుడు నిర్ణయంతో జీవితం ఎలా నాశనం చేసుకుంటామన్నదానికి నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా భర్త ఇంట్లో ప్రతీ క్షణం నన్ను అవమానించాడు. నా కష్టార్జితాన్ని వాడుకున్నారు. నన్ను, నా పిల్లలను పట్టించుకోలేదు. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ఆస్పత్రికి వెళ్లడం నాకో పెద్ద పరీక్ష. ఇంట్లో మూడు కార్లు ఉన్నా.. ఒక్కటీ తీసేవారు కాదు. చివరికి పాల డబ్బాలు, మందులు కొనడం కూడా ఇబ్బందిగా ఉండేది. ఇంట్లో వంటగదికి తాళం వేసేవారు. వండిన వంటలో అడుగుకు మిగిలినవే నాకు నా బిడ్డలకు దక్కేవి. రెండోసారి గర్భిణిగా ఉన్నప్పుడు ఇంట్లో అన్ని గదులకు తాళం వేసి నన్ను హాల్లోనే ఉంచేవారు. బాత్రూమ్కి వెళ్లడం కష్టంగా ఉండేది. బట్టలుతికే స్థలంలో స్నానం చేయాల్సి వచ్చేది. పెద్ద పొట్టతో హాల్లో నేను ఇబ్బంది పడుతుంటే ఇంట్లోకి వచ్చిన అత్తామామలు.. పెద్దవాళ్లు వచ్చినప్పుడు లేచి నిలబడాలని తెలియదా? అంటూ తిట్టేవాళ్లు. ఇద్దరు కవల పిల్లలు పుట్టాక పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పాలు, సెరిలాక్ డబ్బా కొనడానికి కూడా నేను ఇబ్బంది పడాల్సి వచ్చేది. పస్తులు కామన్ అయ్యాయి.. అనిల్‌తో 2006లో జరిగిన పెళ్లితో నా నరకప్రాయమైన జీవితం మొదలైంది. ఇంట్లో ఎవరూ నన్ను తిన్నావా? అని అడిగేవారు కాదు. అన్నానికి కూడా పిలిచేవారు కాదు. పస్తులు ఉండటం కామన్ అయిపోయింది. నా డబ్బులు రూ.20 లక్షలు, 10 తులాల బంగారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. మా అమ్మ వాళ్లతో మాట్లాడేప్పుడు ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయమనేవాడు. కాల్‌లాగ్ చెక్ చేసేవాడు. మీ చెల్లెలితో మాట్లాడావా.. అంతసేపు ఏం మాట్లాడావు? అంటూ ఆరా తీసేవాడు. ఇదీ అని చెబితే, నాకు చెప్పింది 5 నిమిషాలే కదా.. మిగతా 25 నిమిషాలు ఏమి మాట్లాడావని అడిగేవాడు. ఇలాంటివెన్నో భరించాను. ఎక్కడా ఎప్పుడు ఎవరితో చెప్పుకునేదాన్ని కాదు. మా అమ్మవాళ్లతో కూడా ఏమీ చెప్పలేదు. పెళ్లైనప్పట్నుంచీ అనిల్ ఇంతవరకు ఒక్క పని చేయలేదు. జాబ్ చేయమని ఎంతో నచ్చ చెప్పేదాన్ని. రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, ఇంటర్వ్యూ తేదీలు ఇలా ఏ టూ జడ్ పనులు చేసినా ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండేవాడు. మా అత్తమామలు తలచుకుంటే ఏదైనా మంచి బిజినెస్, జాబ్ పెట్టించి ఉండొచ్చు. కానీ ఏదీ చేయలేదు. 2007 నుంచి 2010 వరకు కలకత్తా, ముంబై, పుణేలో మూడేళ్లు జాబ్ చేశాను. ఆ సమయంలో ఏటీఎం అనిల్ దగ్గరే ఉండేది. సేవ్సింగ్స్ లేకుండా డబ్బులన్నీ వాడుకున్నాడు. 2010లో పుణేలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని. ముందుగా ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకున్నాడు. తప్పులను ప్రశ్నిస్తే చాలు.. నాపై చేయి చేసుకునేవాడు, ఒకసారి నా జుట్టు పట్టుకుని నన్ను విసిరేస్తే, మంచం చివర తగిలి పెద్ద గాయమైంది. అత్తామామకు ఈ విషయం చెబితే పట్టించుకోలేదు సరికదా అనిల్‌కే మద్దతుగా నిలిచారు. అత్త పచ్చి బూతులు తిట్టేది అత్త మాధవి ఈసడింపు మాటలు, బూతులు, చిన్నదానికీ పెద్ద దానికీ వంకలు పెడుతూ తిట్టేది. చీటికీమాటికీ ‘నా మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నావు. బయటకు పంపేస్తాను. గేట్ బయట నించోని మాట్లాడు. పచ్చి బూతులు తిట్టేది. మా మామయ్య, నా భర్త ఏనాడూ ఆవిడను అడ్డుకునేవారు కాదు. ఒకసారి మా అమ్మ నాకు చీర పెట్టింది. ఆ చీర చూసి, నానా రభస చేసి ‘ఎవడేమీ ఇచ్చినా ఇలాగే తీసుకో’ అంటూ ద్వంద్వార్థాలతో మాట్లాడింది. ‘ఇప్పటికిప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్లిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అంటూ నాపైకి వచ్చేసి, వస్తువులు మీదకు విసిరేసి, చేయి చేసుకుని ఇంట్లోంచి గెంటేసింది. నాలుగు జతల బట్టలు తీసుకుని వెక్కివెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. అనిల్ కూడా వాళ్లమ్మకే వంత పాడేవాడు. త్యాగం చేయాలన్న మామ కుటుంబ పెద్దగా మామయ్య సిరిసిల్ల రాజయ్య ఏనాడూ నాకు అండగా నిలవలేదు. ‘‘ఎంతో మంది మహిళలు భర్త కోసం, భర్త కుటుంబం కోసం త్యాగాలు చేస్తున్నారు. నువ్వు కూడా త్యాగం చేయాలి’’ అని అనేవాడు. పనివాళ్లు, పార్టీ కార్యకర్తల ముందే ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా తిట్టేవాడు. దీంతో పైప్రాణం పైనే పోయేది. ఆ మాటలకు ఒక్కోసారి చచ్చిపోవాలనిపించేది. మామయ్య నా పేరు మీద నా అకౌంట్లో రూ.8 లక్షలతో కార్ లోను తీసుకున్నాడు. చేతిఖర్చులకు నా డబ్బులు వాడుకునేవాడు. -
'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?'
-
'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?'
హైదరాబాద్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక అనుమానాస్పద మృతి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయని ప్రముఖ ఫొరెన్సిక్ నిపుణుడు నారాయణ రెడ్డి అన్నారు. ఆమెది హత్యా ఆత్మహత్యా అనే విషయంలో నివృత్తి చేయాల్సిన కోణాలు చాలా ఉన్నాయని చెప్పారు. సాధారణంగా ఏదైనా కాలినప్పుడు రెండు రకాల పొగలు వస్తాయని అందులో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతాయని, మోనాక్సైడ్ ఉంటే కాలిన దేహం బ్రైట్ రెడ్ గా మారిపోతుందని దీనిద్వారా కాలిన గాయాలతోనే చనిపోయినట్లు స్పష్టమవుంతుందని అన్నారు. అలా లేకపోతే ముందే చంపి కాల్చివేశారా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఎడమవైపు ఎక్కువ కాలిందని చెబుతున్నారని అలా ఎందుకు జరిగిందో తెలియాల్సి ఉందన్నారు. అసలు ఘటన జరిగిన తర్వాత తలుపులు ఎవరు తెరిచారన్నది కూడా ముఖ్యమని పేర్కొన్నారు. క్లూజ్ టీంతోపాటు ఫొరెన్సిక్ డాక్టర్లను కూడా ఘటన స్థలానికి తీసుకెళ్తే బాగుండేదని పక్కా సమాచారం తెలిసేదని అన్నారు. తెల్లవారుజామున చనిపోతే.. సాయంత్రం వరకు నేరస్థలంలోనే మృతదేహాలు ఉన్నాయని ముందుగానే అక్కడికి వైద్యులను తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. పెద్దకుమారుడు, తల్లి డోర్ దగ్గరే మరణించారంటే, తలుపులు బయటి నుంచి గడియ వేస్తే తెరవడానికి వెళ్లారా అనే కోణంలో కూడా ఆలోచించాలనన్నారు. కనీసం మంటలు అంటుకునే ముందు పిల్లలు అటూ ఇటూ పరుగెత్తాలని కానీ ఇద్దరు బెడ్‌పై అలాగే పడి ఉండి చనిపోవడం అనుమానం కలిగిస్తోందన్నారు. రెండు సిలిండర్లు తీసుకెళ్లి, ఒకదాన్నే తెరిచారని, ఒకదాన్ని అలాగే వదిలేశారని చెబుతున్నారు కానీ దీనిపై అనుమానమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
-
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక... తన తరఫు న్యాయవాది రెహానాకు 22 పేజీల ఈ మెయిల్ పంపింది. తనను మానసికంగా, శారీరకంగా హింసలను భరిస్తున్నానంటూ ఆమె ఈ మెయిల్లో పేర్కొంది. భర్త అనిల్ వ్యవహారాన్ని సారిక పూసగుచ్చినట్లు మెయిల్లో వివరించింది. ఈ మెయిల్ సారాంశం..ఇదే... 'ఇల్లు విడిచి వెళ్లాలంటూ పదే పదే అత్త, భర్త వేధించేవారు. తిట్లు అరుపులు, కేకలతో రోజు అత్త విరుచుకుపడేది. నా తల్లి ఇచ్చిన చీరను కూడా తీసుకోనివ్వలేదు. రాజయ్య ఎంపీ అయ్యాక వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. ఇంట్లో పనివాళ్లు, పరిచయస్తుల ముందే తిట్టేవారు. అనిల్‌కు వివాహేతర సంబంధాలున్నాయి. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు వెళ్లిపోతాడో తెలియదు. కుటుంబం పట్ల కనీస బాధ్యత లేదు. ఎక్కడకు వెళ్లావని అడిగితే చాలు..భౌతిక దాడులకు దిగేవాడు. ఇంత జరుగుతున్నా...అత్తమామలు పట్టించుకునే వాళ్లు కాదు. వండుకోవడానికి కనీసం సరుకులు కూడా అనిల్ తెచ్చేవాడు కాదు. నేను, పిల్లలు చాలాసార్లు ఆకలితో అలమటించాం. పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి బిల్లులు కట్టేవాడు కాదు. నా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లలతో మాట్లాడేందుకు అనిల్ ఒప్పుకునేవాడు కాదు. నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి పంపిద్దామా? అన్నదే అత్త, మామల ఆలోచన. పిల్లలు నేను హాల్లోనే ఉండేవాళ్లం. నిరంతరం వేధింపులకు గురి చేసేవారు. ఏమైనా అడిగితే ఇంటి నుంచి వెళ్లిపో అనేవారు. జీవితాన్ని త్యాగం చేయాలంటూ రాజయ్య కూడా అనేవారు. చాలామంది మహిళలు... భర్తలు, అత్తమామల కోసం జీవితాలను త్యాగం చేశారని రాజయ్య చెప్పేవారు. రాజయ్య మాటలకు చాలాసార్లు బాధపడ్డా. జీవితాన్ని ఇప్పటితో ముగించాలన్న ఆలోచన అనేకసార్లు వచ్చేది. ఈ షాక్, ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టేది.' అని సారిక పేర్కొంది. -
ఆత్మహత్య కాదు...కచ్చితంగా హత్యే: రెహానా
హైదరాబాద్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆమె తరఫు న్యాయవాది రెహానా అన్నారు. భర్త అనిల్, అత్తమామలపై ఆమె 2014లో గృహహింస చట్టం కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే. సారిక తరఫున న్యాయవాది రెహానా వాదిస్తున్నారు. సారిక అనుమానాస్పద మృతిపై రెహానా గురువారమిక్కడ మాట్లాడుతూ 'పనిమనిషిగా చూస్తున్నారని సారిక నాకు చాలాసార్లు చెప్పింది. కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని నా దగ్గర చాలాసార్లు ఏడ్చింది. అనిల్-సనా అక్రమ సంబంధం గురించి చెప్తూ బాధపడింది. నెల రోజుల క్రితం సారిక నాతో ఫోన్లో మాట్లాడింది. 15 రోజుల క్రితం వచ్చి వ్యక్తిగతంగా కలిసింది. చివరిసారి కలిసినప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఎలాగైనా న్యాయం చేయాలని విలపించింది. కోడలి సంపాదనను కూడా రాజయ్య ఇన్‌కంట్యాక్స్‌లో చూపించారు' అని తెలిపారు. -
సారిక సజీవ దహనం కేసులో మరో ట్విస్ట్
-
'ఆత్మహత్య కాదు..కచ్చితంగా హత్యే'
-
సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్
-
సారిక సజీవ దహనం కేసులో మరో ట్విస్ట్
వరంగల్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు సజీవ దహనం కేసులో మరో కొత్త కోణం బయటపడింది. రాజయ్య నివాసంలో ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. సారిక, పిల్లలు తిన్న అన్నంలో మత్తుమందు కలిపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనమవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వంటగదిలో ఉండాల్సిన రెండు గ్యాస్ సిలిండర్లు బెడ్రూమ్కు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. కుటుంబ తగాదాల కారణంగా సారిక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లను బెడ్రూమ్కు తీసుకొచ్చి ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. వంట గ్యాస్ పూర్తిగా లీక్ కావడం వల్లే పేలిన శబ్దం రాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు సిలిండర్లలోని గ్యాస్ మొత్తం బయటికి వచ్చినా ఎవరూ పసిగట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో వారు తిన్న ఆహారంలో ఎవరైనా మత్తుమందు కలిపారా? అందుకే గ్యాస్ లీక్ అయినా ఆ వాసనను కూడా గుర్తించలేకపోయారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు వారు తిన్న ఆహారాన్ని సేకరించి ...పరీక్షలకు పంపారు. ఇక మాజీ ఎంపీ రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్... మామూనూరు పోలీసులు అదుపులో ఉన్నారు. సారిక, ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాజయ్య కుటుంబసభ్యులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ నిమిత్తం హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి మామూనూరుకు తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్ రెండో వివాహం చేసుకున్న సనా అనే మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా విచారణ నిమిత్తం మామునూరు పోలీస్ స్టేషన్ నుంచి వారిని మరోచోటుకు తరలించే అవకాశం ఉంది. -
సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్
వరంగల్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక..న్యాయవాదికి పంపిన ఈ మెయిల్స్ 'సాక్షి' టీవీ సంపాదించింది. రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక 2013, 2014లో సారిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించడంతో పాటు తనకు న్యాయం చేయాలంటూ మామ ఇంటి ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. 2014 ఏప్రిల్ 25న బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. భర్త, అత్తమామలపై ఫిర్యాదుకు ముందు సారిక తన కష్టాలను ఈ మెయిల్లో న్యాయవాదికి వివరించింది. న్యాయం కోసం తుదివరకూ పోరాడిన ఆమె బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె...ముగ్గురు కొడుకులు అభినవ్, శ్రీయాన్, అయాన్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘోరం..!
కోడలు, ముగ్గురు మనవళ్లు అగ్నికి ఆహుతి తెల్లవారుజామున గ్యాస్ లీకేజీతో ప్రమాదం! మూడేళ్లుగా కుటుంబ తగాదాలు.. మరో వివాహం చేసుకున్న రాజయ్య కొడుకు అనిల్ 2014లో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోడలు అత్తింటివారు వేధింపులకు పాల్పడుతున్నారంటూ కేసు సారిక మృతిపై అనేక అనుమానాలు.. వంటింట్లో ఉండాల్సిన సిలిండర్లు బెడ్రూంలోకి ఎలా వచ్చాయి? ఎవరూ ఊహించని పరిణామం.. వరంగల్ ఉప ఎన్నికల ముంగిట పెద్ద షాక్.. అందరినీ నిశ్చేష్టులను చేసే దిగ్భ్రాంతికర ఘటన.. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు! బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కొడుకులు అభినవ్, శ్రీయాన్, అయాన్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటు చేశారు. రాజయ్య, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల్లో విచారణ నివేదిక రానుంది. కాగా వరంగల్ ఉప ఎన్నిక బరి నుంచి రాజయ్య తప్పుకున్నారు. సాక్షి, హన్మకొండ: రాజయ్య నివాసంలో తెల్లవారుజామున 4, 5 గంటల మధ్య అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకే గదిలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. సారికతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలు పడక గది తలుపు వద్ద నేలపై, మరో బాలుడి మృతదేహం బెడ్‌పై పడి ఉన్నాయి. ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘అగ్ని ప్రమాదం జరిగినట్లు రాజయ్య ఇంటి నుంచి ఐదు గంటల సమయంలో ఫోన్‌కాల్ వచ్చింది. మేం వచ్చి చూసేసరికి ఇంటి మొదటి అంతస్తులో కాలిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. ఈ మరణాలపై శాస్త్రీయంగా విచారణ జరిపిస్తాం.’’ అని తెలిపారు. ఘటన చోటుచేసుకున్న గది వద్దకు పోలీసులు.. మీడియాతో పాటు ఇతరులెవరినీ అనుమతించలేదు. రాజయ్య ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మూడేళ్లుగా గొడవలే.. రాజయ్య, మాధవి దంపతులకు అనిల్ ఒక్కడే సంతా నం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అనిల్‌కు నిజామాబాద్ జిల్లా అడ్లూరుకు చెందిన సారికతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ క్లాస్మేట్స్. కాలేజీ హాస్టల్లోనే ఉండేవారు. ఆ సమయంలోనే ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఎవరికీ తెలియకుండా 2002లో హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. 2003లో చదువుల నిమిత్తం అనిల్ లండన్ వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్ది రోజులకే సారిక కూడా లండన్‌కు వెళ్లింది. 2005లో తిరిగి వచ్చిన తర్వాత వీరి వివాహ విషయం తెలుసుకున్న రాజయ్య కుటుంబీకులు అందరి సమక్షంలో యాదగిరిగుట్టలో పెళ్లి చేశారు. కొన్నాళ్లపాటు బాగానే ఉన్న వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అనిల్.. సనా అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. దీంతో గత మూడేళ్లుగా రాజయ్య కుటుంబ సభ్యులు, సారిక మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక 2013, 2014లో సారిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించడంతో పాటు తనకు న్యాయం చేయాలంటూ మామ ఇంటి ఎదుట ధర్నా చేసింది. బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. సొంతింటికి రావడంతో: గొడవల కారణంగా రాజయ్య హన్మకొండ రెవెన్యూ కాలనీలోని తన సొంత ఇంటిని కోడలికి ఇచ్చి కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఓ అపార్టుమెంట్లో కొంతకాలంగా ఉంటున్నారు. రాజయ్య భార్య మాధవి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ రాజయ్యతోపాటే ఉంటున్నారు. భర్త అనిల్ సారిక ఇంటికి రావడం మానేశాడు. కనీసం ఇంటి ఖర్చులకు సైతం డబ్బులు ఇచ్చేవారు కాదని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. మంగళవారం రాత్రి సమయంలో అనిల్, సారికకు మధ్య గొడవ జరిగిందని తెలిసింది. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ రావడంతో మూడ్రోజుల క్రితమే రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో అపార్టుమెంట్ కంటే సొంత ఇళ్లు బాగుంటుందని భావించిన ఆయన... ఇటీవలే రెవెన్యూ కాలనీలోని తన సొంతింటికి మారా రు. కింది పోర్షన్లో రాజయ్య దంపతులు, ఒకటో అంతస్తులో సారిక కుటుంబం ఉంటోంది. రెండో అంతస్తులోని పెంట్‌హౌస్‌కు అనిల్ వచ్చి వెళ్తుంటారని తెలిసింది. అందరూ ఒకేచోట చేరడంతో రెండ్రోజులుగా గొడవలు జరుగుతున్నాయని సమాచారం. బెడ్రూంలోకి సిలిండర్లు ఎలా వచ్చాయి? సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనమవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వంటగదిలో ఉండాల్సిన రెండు గ్యాస్ సిలిండర్లు బెడ్రూమ్కు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. కుటుంబ తగాదాల కారణంగా సారిక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లను బెడ్రూమ్కు తీసుకొచ్చి ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. వంట గ్యాస్ పూర్తిగా లీక్ కావడం వల్లే పేలిన శబ్దం రాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు సిలిండర్లలోని గ్యాస్ మొత్తం బయటికి వచ్చినా ఎవరూ పసిగట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తన కూతురు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. రాజయ్య కుటుంబీకులే తన కూతురి మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. నాలుగు మృతదేహాలు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్నాయి. సాయంత్రం 6:30 గంటలకు సారిక తల్లిదండ్రులు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. సమయం మించిపోవడంతో పోస్టుమార్టంను వైద్యులు గురువారానికి వాయిదా వేశారు. పోటీ నుంచి తప్పుకుంటున్నా: రాజయ్య వరంగల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు రాజయ్య తెలిపారు. కోడలు, ముగ్గురు మనవళ్లు సజీవ దహనమైన సంగతి తెలియగానే పార్టీ శ్రేణులు పెద్దఎత్తున రాజయ్య నివాసానికి తరలివచ్చాయి. జిల్లా కాంగ్రెస్ నేతలు, మాజీ ఎంపీలు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా.. ‘‘ఉప ఎన్నికల్లో నేను నిలబడను.. పోటీ నుంచి విరమించుకుంటాను’’ అని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా నేతలు పీసీసీ అధ్యక్షుడికి వివరించడంతో మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సంప్రదింపులు జరిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం నార్త్‌జోన్ ఐజీ నవీన్‌చంద్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఘటనాస్థలి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయి. దర్యాప్తు తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. -
'డబ్బు ఆశతోనే నా బిడ్డను చంపిన్రు'
వరంగల్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్యకు డబ్బు పిచ్చి చాలా ఎక్కువ అని సారిక తల్లి తెలిపారు. తన కూతురు చాలా ధైర్యవంతురాలు అని, తాను బతికుండగానే ఎన్నో కష్టాలను స్వయంగా భరించిందని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వివరించారు. తన కూతురు జాబ్ చేసిన పైసలన్నీ రాజయ్య కుటుంబానికే ఇచ్చిందని, ఒక్క పైస కూడా తన వద్ద ఉంచుకునేది కాదని తెలిపారు. ప్రేమ వివాహం కారణంగా కట్నం లేదని వారు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తారో అని నిత్యం కష్టపడి వారికి ప్రతి రూపాయి ఇచ్చిందని పేర్కొన్నారు. 'నేనుండగానే ఎన్నో బాధలు పడ్డది నా బిడ్డ. ఆమె చాలా ధైర్యవంతురాలు. మొన్నే ఫోన్ చేసింది. మంచిగానే ఉన్నా.. ఏమైనా గొడవైతే నేనే చూసుకుంటాను. మీరు రాకండి అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నాయన ఆరోగ్యం కూడా మంచిగ లేదు అని చెప్పింది. నా బిడ్డను వీళ్లే చంపిన్రు.. నా మనవళ్లను కూడా వీళ్లే హత్య చేసిర్రు. నా బిడ్డనాకే ధైర్యం చెప్పేది. నేను అన్ని సరుకులు పంపించినా. ఆమెకు ఎలాంటి అవసరాలు ఉన్నా అందించినా. నా బిడ్డకు వాళ్లు ఏనాడు సరిగా సహాయపడలేదు.. సరిగా చూసుకోలేదు. వాళ్ల అత్తమామకు(రాజయ్య ఆయన భార్య) డబ్బు ఆశ ఎక్కువ. వాళ్లే చంపేశారు' అంటూ ఆమె తీవ్రంగా రోధించింది. బుధవారం తెల్లవారుజామున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. -
'సారికను చంపిన వాళ్లను అలాగే చంపాలి'
-
అసలు రాజయ్య ఇంట్లో ఏం జరిగింది ?
-
'సారికను చంపినవాళ్లను అలాగే చంపాలి'
వరంగల్: తన కూతురు సారికను, తన మనవళ్లను చంపినవాళ్లను అలాగే చంపాలని సారిక తల్లి అన్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె చెప్పారు. బుధవారం తెల్లవారుజామున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తన కూతుర్ని, మనవళ్లను చిత్ర హింసలు పెట్టి హత్య చేశారని సారిక తల్లి ఆరోపించారు. రాజయ్య కొడుకు అనిల్ రెండో పెళ్లి చేసుకున్నాడని.. తన కూతురు, మనవళ్లను వైదొలగించుకోవడానికి వారి ప్రాణాలు తీశాడని సారిక తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నిజామాబాద్ జిల్లా వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన సారికను రాజయ్య కుమారుడు అనిల్ 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. సారిక, ఆమె కొడుకుల మరణవార్త తెలుసుకున్న సారిక పుట్టింటివారు వరంగల్ వచ్చారు.