రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
Published Wed, Oct 26 2016 10:54 AM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని పాత ఆంధ్రాబ్యాంకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. బైక్‌పై ముగ్గురు విద్యార్థులు రంపచోడవరం నుంచి గోకవరం వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన నరేష్(20), తూర్పుగోదావరి జిల్లా కొంకుదూరు గ్రామానికి చెందిన అనిల్(20) అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. రవికుమార్(20) అనే మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement