
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన మెహబూబా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న పూరి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పూరి నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట.
తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే వాస్కోడగామా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్ సరసన గాయత్రి భరద్వాజ్ అనే మోడల్‌ను హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.