నాన్న డైరెక్షన్‌లో సినిమా చేయను: ఆకాశ్‌ పూరి | 'Will Not Do Film With My Father Puri Jagannadh': Akash Puri - Sakshi
Sakshi News home page

నాన్న డైరెక్షన్‌లో సినిమా చేయను: ఆకాశ్‌ పూరి

Mar 10 2024 1:51 PM | Updated on Mar 10 2024 1:59 PM

Akash Puri Says Will Not Do Film With My Father Puri Jagannadh - Sakshi

టాలీవుడ్‌లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా మారిన నటులు చాలా మంది ఉన్నారు. వారిలో ఆకాశ్‌ పూరి కూడా ఒకరు.   ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆకాశ్‌. చిరుత, బుజ్జిగాడు, ఏక్‌ నిరంజన్‌తో పాటు పలు సినిమాల్లోనూ హీరోల చిన్ననాటి పాత్రను పోషించాడు. ‘ఆంధ్రా పోరి’తో హీరోగా మారాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

దీంతో స్వయంగా పూరినే రంగంలోకి దిగాడు. కొడుకుతో డిఫరెంట్‌ లవ్‌స్టోరీ ‘మెహబూబా’ తీశాడు. అయితే అది కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని ‘రొమాంటిక్‌’ ఫిల్మ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అదీ కూడా ఫ్లాప్‌ అయింది. చివరగా చోర్‌ బజార్‌ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే  ఆ చిత్రానికి కూడా తొలి రోజే ప్లాప్‌ టాక్‌ వచ్చింది.

ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కథల వేటలో పడ్డాయి. అయితే ఎంతో మందిని స్టార్‌ హీరోలుగా మలిచిన పూరి జగన్నాథ్‌.. కొడుకును మాత్రం హీరోగా పెట్టి మరో సినిమా తీయలేకపోయాడు. పూరి అనుకుంటే.. ఆకాశ్‌ను ఓ మాస్‌ హీరోగా నిలబెట్టగలడు. కానీ అది ఆకాశ్‌కి ఇష్టం లేదు. తండ్రి డైరెక్షన్‌లో ఇప్పుడే సినిమా చేయాలని లేదట. తాజాగా జరిగిన ఓ ప్రెస్‌ మీట్‌లో ఇదే విషయాన్ని చెప్పాడు ఆకాశ్‌. ‘నాన్న డైరెక్షన్‌లో ఇప్పుడే సినిమా చేయాలని లేదు. నటుడిగా నన్ను నేను ఫ్రూవ్‌ చేసుకున్న తర్వాత నాన్నతో సినిమా చేస్తాను. అప్పటి వరకు నేను నాన్నతో సినిమా చేయను. ఒకవేళ సినిమా చేయాల్సి వస్తే.. ‘పూరి జగన్నాథ్‌-ఆకాశ్‌ కాంబోలో ఓ సినిమా రాబోతుంది’ అనుకునే స్థాయికి వచ్చినప్పుడే చేస్తాను’ అన్నాడు. నేనింతే సినిమాకు సీక్వెల్‌ వస్తే.. అందులో హీరోగా నటించాలని ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement