హీరోగా సెట్ అయిన తర్వాత అది చేస్తా: హీరో ఆకాశ్ పూరీ | Akash Puri Comments On His New Movies And Puri Jagannath | Sakshi
Sakshi News home page

Akash Puri: పిల్లాడిలా ఉంటాననే కంప్లైంట్ ఇప్పటికీ ఉంది

Published Sun, Mar 10 2024 4:19 PM | Last Updated on Sun, Mar 10 2024 4:27 PM

Akash Puri Comments On His New Movies And Puri Jagannath - Sakshi

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ చాలామందికి తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడు. చివరగా 2022లో 'చోర్ బజార్' అనే మూవీతో వచ్చాడు. కానీ ఫ్లాప్ అయింది. ఇలా చాలారోజుల తర్వాత ఇప్పుడు కనిపించాడు. ఓ క్లాతింగ్ బ్రాండ్‌కి ఆకాశ్ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో లాంచ్ ఈవెం‍ట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ))

'నా కెరీర్ పరంగా చూస్తే గత సినిమా 'చోర్ బజార్' అంతగా ఆదరణ దక్కించుకోలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను. లవ్ స్టోరీ, యాక్షన్ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ దశలో ఉన్నాయి. ప్రాజెక్ట్ లాక్ అయ్యాక మీకు వివరాలు చెబుతాను. ఇప్పటికీ నేను చిన్న పిల్లాడిలా ఉంటాననే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ తరహా క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పట్లో నటించకూడదని అనుకున్నా' 

'నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్‌లో మూవీ చేస్తా. నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ లాంటివి చూసినప్పుడు ఇలాంటి వాటిలో నటించాలనే కోరిక కలుగుతుంటుంది. ఇప్పుడు నేను సింగిల్‌గానే ఉన్నా. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు' అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 100 కోట్ల కలెక్షన్ సూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీ సంస్థ కొనట్లేదు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement