పదహారేళ్ల బాలికకు తలపెట్టిన వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
పదహారేళ్ల బాలికకు తలపెట్టిన వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం విగాం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలికకు(16), అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో బుధవారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయమై స్థానికులు సమాచారం అందించటంతో ఎస్సై అనిల్ అక్కడికి చేరుకుని, బాలికలకు 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయరాదని సూచించారు.