న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులోలో అరుణ్ పిళ్లైపై ఈడీ కీలక అభియోగాలు నమోదు చేసింది. సౌత్ గ్రూప్ హవాలా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చేరినట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సే కల్వకుంట్ల కవితపై కూడా ఈడీ కీలక అభియోగాలు మోపింది. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర కీలకంగా ఉందని తెలిపింది. ఈ గ్రూప్‌నకు లాభం కలిగేలా ఆప్ నేతలు వ్యవహరించినట్లు తెలిపింది. లిక్కర్ స్కాంలో కవితకు ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించినట్లు అభియోగపత్రంలో పేర్కొంది. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో హైదరాబాద్‌లో భూములు కొన్నట్లు గుర్తించామంది.
మూడో ఛార్జ్‌షీట్‌లో ఫీనిక్స్ పేరును ఈడీ తెరపైకి తెచ్చింది. దీని ద్వారానే భూములు కొన్నట్లు తెలిపింది. ఫీనిక్స్ శ్రీహరి పాత్రపై ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ పేరును కూడా ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. కాగా.. ఆడిటర్ బుచ్చిబాబు మార్చి 28న ఈడీ ముందు కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కవిత ఆదేశాల మేరకే భూముల కొనుగోలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ సంస్థ నుంచి 25 వేల అడుగుల ప్రాపర్టీ ఎంగ్రోత్ సంస్థ కొనుగోలు చేసిందని, ఫినిక్స్ శ్రీహరి ద్వారా ఈ కొనుగోలు తతంగం జరిగిందని తెలిపింది.
'బయటి రేటు కంటే తక్కువ ధరకు కవిత భూములను కొనుగోలు చేశారు. మార్కెట్ ధర అడుగుకు రూ.1,760 అయితే, కవిత డిస్కౌంట్ కు కొనుగోలు చేసిన ధర అడుగుకు రూ.1,260 మాత్రమే. ఎంగ్రోత్ సంస్థలో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ భాగస్వామి. ఆమె పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో భూములను చౌక ధరకు కొనుగోలు చేయగలిగారు. నల్లధనాన్ని వైట్‌గా మార్చేందుకే భూముల కొనుగోలు చేశారు.' అని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
చదవండి: రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..!
Comments
Please login to add a commentAdd a comment