క్వార్టర్స్‌లో అపూర్వ, అనిల్ | apoorva, anil enter in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో అపూర్వ, అనిల్

Published Fri, Dec 30 2016 10:31 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

apoorva, anil enter in quarters

క్యారమ్ టోర్నమెంట్


సాక్షి, హైదరాబాద్: వీఏ శర్మ, ఇందిరాంబ స్మారక క్యారమ్స్ టోర్నమెంట్‌లో అపూర్వ, అనిల్ కుమార్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో వరల్డ్ చాంపియన్ అపూర్వ (ఎల్‌ఐసీ) 25-0, 25-0తో శ్రీవాణిపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో టాప్ సీడ్ అనిల్ కుమార్ (ఏజీఏపీ) 13-25, 21-13, 25-14తో కె. కృష్ణపై గెలుపొందగా... రెండో సీడ్ వి. శివానంద రెడ్డి 16-19, 25-23, 15-25తో మొహమ్మద్ వసీమ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నందిని (డెలారుుట్) 25-0, 25-0తో తేజస్వి (వీపీజీ)పై, బి. సునీత 25-0, 15-24, 19-16తో రుక్సర్ (డెలారుుట్)పై, బి. శ్రీవిద్య 25-9, 25-4తో జ్యోతిపై, తేజస్వి (ఆక్సెంచర్) 25-0, 25-8తో ఉమాదేవి (ఏఎంసీ)పై, మాధవి 25-0, 25-17తో రమశ్రీ (పోస్టల్)పై గెలిచారు.

పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు

 ఆదిత్య 13-25, 25-15, 25-13తో హకీమ్‌పై, శ్రీనివాస్ 25-3, 25-4తో జుబేర్ ఖాన్‌పై, ప్రసాద్ 18-12, 25-1తో మునావర్‌పై, మొహమ్మద్ అహ్మద్ 25-11, 25-2తో రాణాపై, గోపీకృష్ణ 22-20, 10-25, 24-23తో సూర్యప్రకాశ్‌పై విజయం సాధించారు.

 పురుషుల డబుల్స్ మూడోరౌండ్ ఫలితాలు
 సందీప్- కృష్ణ జోడీ 25-12, 25-14తో శశి-కల్యాణ్ జంటపై, మునీర్ అహ్మద్-సాహిల్ జోడీ 25-12, 25-5తో రమేశ్-సుమన్ జంటపై, నరేశ్- సారుు జోడీ 25-8, 25-10తో జుబేర్- ఖదీర్ జంటపై, వసీమ్-ఎస్.కే. జఫర్ జోడీ 1-25, 25-11, 25-4తో హకీమ్- సుహృత్ జంటపై, నవీన్- నందకుమార్ జోడీ 25-1, 25-10తో స్వామి- పవన్ జంటపై, శివానంద రెడ్డి-ఆదిత్య జోడీ 25-0, 25-0తో శ్యామ్- రఘు జంటపై, జైకుమార్-సూర్యప్రకాశ్ జోడీ 25-4, 25-0తో వెంకటేశ్-అనంత నారాయణ్ జంటపై, అహ్మద్-మొహమ్మద్ జోడీ 25-9, 25-1తో తాల్-షఫీక్ జంటపై, అబ్దుల్-ఖైజర్ జోడీ 21-7, 23-9తో హరి-శ్రీకాంత్ జంటపై, వినోద్-శ్రీనివాస్ జోడీ 25-6, 25-17తో నాగభూషణం-ప్రసాద్ జంటపై గెలుపొందారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement