
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘నీ ఇంటికి వచ్చి కొడతా నా కొ...క... మరోసారి పొట్టి శ్రీరాములు గురించి మెసేజులు పెడితే బాగుండదు’ అంటూ ఒంగోలు (Ongole) ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ (Damacharla Janardhana Rao) పీఏ అనిల్... పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పేరకం నాగాంజనేయులుపై బెదిరింపులకు దిగడం సంచలనం సృష్టించింది.
బాధితుడు తెలిపిన కథనం ప్రకారం... ఒంగోలులో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పేరకం నాగాంజనేయులుకు పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం ఉంది. రెండు రోజుల క్రితం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు సంబంధించిన ఓ వీడియోను అందరితో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏ అనిల్‌కు కూడా పంపారు. దీంతో అనిల్ రెచ్చిపోయాడు.
ఫోన్ చేసి తిట్లదండకం అందుకున్నాడు. ‘అడుక్కుతినే నా కొ...క. మరోసారి మెసేజ్ పెడితే బాగుండదు.. ఇంటికొచ్చి కొడతా..’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నాగాంజనేయులపై టీడీపీ నేతలు దాడి చేశారని, అయినా తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని నాగాంజనేయులు ‘సాక్షి’కి తెలిపారు.
చదవండి: మొత్తానికి రెడ్‌బుక్‌పై కన్నెర్ర.. కూటమికి ఇక బ్యాడ్ టైం!
Comments
Please login to add a commentAdd a comment