మాజీ మంత్రి బాలినేని, ఎమ్మెల్యే దామచర్ల మధ్య మాటల యుద్ధం
పార్టీ మారినా కేసుల నుంచి తప్పించుకోలేరన్న దామచర్ల
తాను రాజీపడబోనంటున్న బాలినేని
ఒంగోలు టౌన్/టంగుటూరు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలినేని ఆ పారీ్టలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒంగోలు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. మొదట్నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల ఇప్పుడు ఒక కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
శుక్రవారం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఫొటో కూడా ముద్రించడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వారి్నంగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆలూ లేదు సూలు లేదు అన్నట్లు ఇంకా పారీ్టలో చేరక ముందే ఇలా ఉంటే రానురాను ఈ ఇరుపార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో చూడాలి.
ఏ పార్టీలోకి వెళ్లినా వదలను..: ఎమ్మెల్యే దామచర్ల
బాలినేని వంటి అవినీతిపరుడిని ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేదే లేదని, అతనిని, అతని కుమారుడిని చట్టపరంగా శిక్షిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం, ఒంగోలులో టీడీపీ శ్రేణులు, నాపై బాలినేని 32 కేసులు పెట్టారు, మా నాయకుడు చంద్రబాబుని కూడా దూషించారు, అధికారం పోయి వంద రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారు. జనసేన పార్టీలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలను బయటకు తీస్తాం, వాటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పారీ్టలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం..’’ అని దామచర్ల జనార్దన్ అన్నారు.
నేనెప్పుడూ కాంప్రమైజ్ కాను.. బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి
‘‘నేనెప్పటికీ కాంప్రమైజ్ కాను. జనసేన ఫ్లెక్సీలు ఎవరు వేశారో నాకు తెలియదు. ఆయన బొమ్మేశారని తీసేయమన్నాడంటా, సంతోషమే... ఆయన బొమ్మ వద్దంటే తీసేద్దాం’’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడని, జనసేన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అడిగానని, అంతకుమించి తానేమీ మాట్లాడలేదన్నారు.
దానిమీద కూడా ఆయన అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తాను జనసేనలోకి వెళ్లడం ఇష్టం లేకనే రెచ్చగొట్టేందుకు కావాలని ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడో చూస్తానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని విన్నానని, అంతపనికి రాదు... ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రశ్నించేందుకే జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఇప్పుడు కూడా ఏదైనా తప్పులు జరిగితే తాను ప్రశి్నస్తానన్నారు. జనసేన పార్టీలో ఉన్న పాతవారిని, తనతో పాటు వస్తున్న వారిని కలుపుకొని జనసేన బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment