
సాక్షి, ప్రకాశం: బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద కమల్‌హాసన్.. ఆయనతో సినిమా తీయొచ్చు అంటూ దర్శి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం జనసేనలో చేరి ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హెచ్చరించారు. బాలినేని బ్రతుకు ప్రకాశం జిల్లా ప్రజలకు బాగా తెలుసు అని వ్యాఖ్యలు చేశారు.
దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బాలినేని.. నీ గురించి అందరకీ తెలుసు. జిల్లాలో ప్రతీ ఒక్కరినీ వేధించి వారి వద్ద దోచుకున్నావ్. నీ బాధితుడు కానీ వాడు ప్రకాశం జిల్లాలో ఒక్కడు కూడా లేడు. బాలినేని పార్టీ మారిన తర్వాత జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంతోషించారు. నటనలో బాలినేని.. కమల్‌హాసన్‌ను మించిపోయారు. ఆయనతో ఒక సినిమా తీయవచ్చు. టీడీపీలో చేరేందుకు నువ్వు ప్రయత్నిస్తే.. రిజక్ట్ చేస్తే.. ఆస్తుల కోసం జనసేనలో చేరావు. జడ్పీ చైర్‌పర్సన్‌ని మార్చేస్తానని చాలెంజ్ చేస్తున్నావు. నీలాగా అమ్ముడుపోయే జడ్పీటీసీలు జిల్లాలో లేరు. నీలాగా వెన్నుపోటు పొడిచే వారు పార్టీకి అవసరం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment