
త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు ఎదురైంది. త్రిపురాంతకం ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు.
సాక్షి, ప్రకాశం జిల్లా: త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు ఎదురైంది. త్రిపురాంతకం ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు. అక్రమ కేసులతో భయపెట్టినా వైఎస్సార్‌సీపీకే ఎంపీటీసీలు పట్టం కట్టారు. టీడీపీ ప్రలోభాలకు గురిచేసినా త్రిపురాంతకం-2 ఎంపీటీసీ సృజన లొంగలేదు. ఎన్నికల హాలులోనే సృజనపై టిడిపి ఎంపీటీసీలు దాడికి కూడా యత్నించారు. సృజనా ఎత్తిన చేయిని బలవంతగా దించివేయడానికి కూటమి అభ్యర్థి చల్లా జ్యోతి ప్రయత్నించింది.
మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలలో వైఎస్సార్ సీపీ గెలిచింది. టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రలోభాలు పెట్టినా... వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు మాత్రం వారి ఒత్తిడి కి తలొగ్గలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హైడ్రామా మధ్య మండల ప్రజా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఐదు ఎంపీపీ, నాలుగు వైస్ ఎంపీపీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి.
కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు ఎంపీపీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్ష్మి దేవి విజయం సాధించారు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీపీ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నాగమ్మ గెలుపొందారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ ఎంపీపీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వండ్రయ్య విజయం సాధించారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా మెజారిటీ ఎంపీటీసీలు చేతులెత్తడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాలు.. బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ ఎమ్మీటీసీలు లొంగలేదు. కోరం ఉన్నా సంతకాలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేయడం, సమయం పూర్తి కావడంతో గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు.

రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడంతో సమయానికి సభ్యులు రాక రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సారసీపీ విజయం సీఎం చంద్రబాబబుకు చెంపపెట్టు అని శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ స్పష్టం చేశారు.
తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మూలం చంద్రమౌళిరెడ్డి గెలుపొందారు. ఆయనకు 33 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు మద్దతునిచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుత్తుల సర్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలం లేకపోవడంతో టీడీపీ ఎంపీటీసీలు పోటీకి దూరంగా ఉన్నారు. మాడుగుల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాళ్లపురెడ్డి రాజారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్. రాయవరం మండల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేసుబోయిన వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరపల్లి మండలం ఎంపీపీగా చింతల భూలోక లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.