won
-
దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
దుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో 24హెచ్ కార్ రేసింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు.రేసుకు ముందు ప్రమాదం.. అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో విజయం సాధించింది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ కుమార్ వీడియోను రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయని' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్‌తో అజిత్ కుమార్ జతకట్టారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈ సినిమాను సమ్మర్లో అంటే ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Big congratulations to you, AK sir, for your perseverance. Proud moment, sir 👏👏 🏆 👍❤️❤️#AjithKumarRacing pic.twitter.com/YQ8HQ7sRW2— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 12, 2025 -
రెండుసార్లు నోబెల్ పొందిన ఏకైక మహిళ
ఆమె పుట్టింది రష్యా దేశంలోని వార్సాలో. ఐదుగురు పిల్లల్లో ఈ పాప చిన్నది. పదేళ్ల వయసులో తల్లి క్షయ వ్యాధితో మరణించింది. దీంతో తోబుట్టువులే ఆమెను పెంచారు. చిన్ననాటి నుంచి ఆమెకు విజ్ఞాన శాస్త్రమంటే చాలా ఇష్టం. ఆ విషయాల గురించి ఆ పాప తెలుసుకుంటూ ఉండేది. ఇంట్లో పేదరికం కారణంగా ఆమె ఎక్కువగా చదువుకోలేకపోయింది. తనకొచ్చిన చదువుతో ఉపాధ్యాయురాలిగా మారింది. విశ్వవిద్యాలయానికి వెళ్లాలనే ఉద్దేశంతో 1891లో ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడ సోర్బోన్ యూనివర్సిటీలో చేరింది. అక్కడ భౌతిక, గణిత శాస్త్రాలను చదివింది. 1894లో ప్యారిస్ నగరంలో శాస్త్రవేత్త పియరీ క్యూరీని కలుసుకుంది. ఏడాది తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పరిశోధనలు చేశారు. యురేనియంపై పలు ప్రయోగాలు చేసి కీలకమైన విషయాలు కనుక్కున్నారు. ఆ సమయంలోనే రేడియో ధార్మికతను కనిపెట్టారు. ఆ పరిశోధనలకుగానూ 1903లో ఆమెతోపాటు ఆమె భర్త పియర్, హెన్రీ బెక్వెరెల్లకు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారు. 1906లో పియరీ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జీవితంలో మరోసారి ఆమెను విషాదం చుట్టుముట్టింది. అయినా కుంగిపోక పరిశోధనలు కొనసాగించింది. ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. రేడియో ధార్మికతను కొలిచే సాధనాన్ని రూపొందించినందుకు 1911లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుందామె. ఇలా రెండు వేర్వేరు విభాగాల్లో నోబెల్ బహుమతి అందుకున్న ఏకైక మహిళ ఆమె. ఆమె కనిపెట్టిన రేడియో ధార్మికత ఇవాళ అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో దానికి కీలకపాత్ర ఉంది. తన జీవితమంతా పరిశోధనలకే అంకితం చేసిన ఆమె పేరు ‘మేరీ క్యూరీ’. ఆమెనే ‘మేడమ్ క్యూరీ’ అని కూడా అంటారు. తన జీవితంలో ఆమె ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఏనాడూ వెనకడుగు వేయకుండా కష్టపడి అనుకున్నది సాధించారు. ఆమె స్ఫూర్తితో మీరూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. -
అందర్నీ వెనక్కి నెట్టి కిరీటం ఎగరేసుకుపోయిన అందాల తార తృష్ణా రే (ఫోటోలు)
-
ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయం సాధించారు. ఇల్లినోయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్‌ను దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. 2016లో తొలిసారి ఆయన అక్కడినుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినోయిస్‌లో పలు పదవులు నిర్వహించారు. కాగా, ఇల్లినోయిస్‌లో డెమోక్రటిక్ పార్టీ హవా కొనసాగింది. మొదటినుంచి కమలకు బలమైన అండగా రాష్ట్రం నిలబడింది. దీనిలో ఆమె విజయం సాధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: కమలాహారిస్ గ్రామంలో ఉత్సవ వాతావరణం -
మగ్ధలీనాకు తొలి టైటిల్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?! (ఫోటోలు)
-
Jannik Sinner: యూఎస్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సిన్నర్ (ఫోటోలు)
-
పారిస్ ఒలింపిక్స్ 2024 : ఈసారి పతకాలు తగ్గాయి..! (ఫొటోలు)
-
బంగారు బైల్స్.. ప్యారిస్ ఒలిపింక్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ (ఫోటోలు)
-
SL VS IND 3rd T20 : ఉత్కంఠ మ్యాచ్.. సూపర్ ఓవర్లో శ్రీలంక చిత్తు (ఫొటోలు)
-
సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుని.. ఒలింపిక్ మెడల్ గెలిచి! (ఫొటోలు)
-
వరల్డ్స్ ఫస్ట్ మిస్ ఏఐగా కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో బ్యూటీ..! (ఫొటోలు)
-
ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్ట.. అందంలోనూ తగ్గేదేలే (ఫొటోలు)
-
పాక్‌పై విజయం: ‘వన్ విత్ నేచర్’ అంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (ఫొటోలు)
-
మూడో రౌండ్లోకి దూసుకెళ్లిన మనిక!
కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా మూడో రౌండ్లోకి చేరింది. ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక బుధవారం జరిగిన రెండో రౌండ్లో 11–9, 6–11, 11–8, 9–11, 11–5తో వాంగ్ జిజు (చైనీస్ తైపీ)పై గెలిచింది.భారత్‌కే చెందిన కృత్విక, యశస్విని, స్వస్తిక కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కృత్విక 11–9, 11–8, 11–7తో ఆద్రీ జరీఫ్ (ఫ్రాన్స్)పై, యశస్విని 11–9, 11–7, 8– 11, 11–4తో సిమే కులాక్సెకెన్ (టర్కీ)పై, స్వస్తిక 11–5, 11–5, 11–9తో గరీమా గోయల్ (భారత్) పై విజయం సాధించారు.ఇవి చదవండి: Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం కీలక ప్రకటన -
మొదటి దశలో 102 సీట్లు... 2019లో ఎవరు గెలిచారు?
2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు అంటే శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 19 న జరగనున్న లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్డిఏ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖలు రాశారు. మొదటి దశ ఓటింగ్‌కు ముందు ప్రధాని ఎన్డీఏ అభ్యర్థులను వ్యక్తిగతంగా సంప్రదించారు. లోక్‌సభ మొదటి దశ పోలింగ్‌లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్‌లోని ఐదు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని రెండు, మేఘాలయలో రెండు, అండమాన్ నికోబార్‌లో ఒకటి, మిజోరంలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, సిక్కింలోని ఒక స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా లక్షద్వీప్‌లోని ఒక సీటు జత చేరింది. వీటితో పాటు రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో ఆరు, అసోం, మహారాష్ట్రల్లో ఐదు, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్లో మూడు, మణిపూర్‌లో మూడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీఏ 41 స్థానాలు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రేపు జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ తదితరులు పోటీలో ఉన్నారు. -
పోటీ లేదు.. ప్రచారం లేదు.. గెలిచేసిన బీజేపీ అభ్యర్థులు!
Arunachal Pradesh Assembly Elections: షెడ్యూల్ ప్రకారం ఎన్నికల తేదీకి వారాల ముందే అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుందని ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రకటించారు. శనివారం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్‌తోపాటు మరో ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. "మేము పోటీ లేకుండా 10 సీట్లు గెలుచుకున్నాం. ఎన్నికలకు ముందే ఇది చాలా పెద్ద విజయం. మా అభివృద్ధి పనులకు ప్రజలు ఇస్తున్న భారీ మద్దతుకు ఇదే నిదర్శనం. ప్రజలు మమ్మల్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. మా ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. అలాగే రెండు లోక్‌సభ స్థానాలను కూడా భారీ మెజారిటీతో గెలుచుకుంటాం” అని సీఎం ఖండూ అన్నారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో బీజేపీ మద్దతుదారులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 60 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో పోటీ చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
‘విక్రమార్కుడి’ విజయ పరంపర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క విజయపరంపర మరోసారి కొనసాగింది. భారీ మెజార్టీతో ఆయన మధిర ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచారు. 2009, 2014, 2018లో వరుసగా విజయం సాధించిన భట్టి ఈ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భట్టి భారీ మెజార్టీ కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై 35,452 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో భట్టికి 1,08,970 ఓట్లు రాగా.. కమల్‌రాజ్‌కు 73,518 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ లింగాల కమల్రాజ్పైనే ఆయన విజయం సాధించడం మరో విశేషం. 2009లో ఆయన 1,417 ఓట్లతో, 2014లో 12,329 మెజార్టీతో, 2018లో 3,567 ఓట్లతో విజయం సాధించగా.. ప్రస్తుతం 35,452 ఓట్ల భారీ మెజార్టీతో పొందారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న భట్టికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత పదవి దక్కుతుందని మధిర నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఏ పదవినిచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తా.. ‘సీఎంగా ఎవరనేది సీఎల్పీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. ఆ తర్వాత సీఎం ఎవరనేది పార్టీ అధిస్టానం ప్రకటిస్తుంది. నాకు ఏ పద వి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తాను’అని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్న ప్రగతిభవన్‌ను ప్రజాపాలన భవన్‌గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తుందని తెలిపారు. ఖమ్మంలో ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పుడు ఆ లక్ష్యాలను నిజం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ అధికారి, ఉద్యోగి సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయాలని భట్టి కోరారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన ఆయన, యావత్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. -
85 సీట్లతో అధికారం మాదే
సాక్షి, హైదరాబాద్: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 85 సీట్ల దాకా గెలుపొంది బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకుని బీజేపీ సంచలనం సృష్టించబోతోందన్నారు. రాబోయే 50, 55 రోజుల్లో ఇది వాస్తవరూపం దాల్చడాన్ని అందరూ చూస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, త్యాగాలను కేసీఆర్ సర్కార్ విస్మరించి విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. సకల జనులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అవినీతి మయం చేయడంతో పాటు, పూర్తిగా కుటుంబ స్వామ్యంగా మార్చివేయడాన్ని ఇక్కడి ప్రజలు అస్సలు ఊహించలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ సరిగా లేదని, తెలంగాణ ఏర్పడ్డాక మండలి చైర్మన్‌తో సహా ఎమ్మెల్సీలందరూ టీఆర్ఎస్లో విలీనం కావడం, 2014లో ఆరుగురు ఎమ్మెల్యేలు, 2018లో 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం ద్వారా ఆ రెండు పార్టీలూ ఒక్కటే అన్న విషయం స్పష్టమైందని చెప్పారు. దీనికి పూర్తి భిన్నంగా బీజేపీ ఎమ్మెల్యేలెవరూ బీఆర్ఎస్లోకి వెళ్లలేదని, ఇతర పార్టీల్లోంచే బీజేపీలోకి వస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వహించకపోవడం గర్హనీయమన్నారు. ఈ విషయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని వారు నమ్ముతున్నారని చెప్పారు. జవదేకర్ గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. వైఎస్ విజయం సాధిస్తారని ముందే చెప్పా 2004 ఎన్నికలకు ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్రను, దానికి వచ్చిన స్పందనను నేను స్వయంగా గమనించా. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పా. నేను చెప్పినట్టే ఆయన అధికారంలోకి వచ్చారు. అదే విధంగా ఇప్పుడు కూడా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వస్తుందనే నా జోస్యం నిజం అవుతుంది. అది పూర్తిగా అబద్ధం బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అ న్నారన్నది పూర్తిగా అబద్ధం. ఈ వార్త మీడియాలో వచ్చాక కూడా దానిని ఖండిం చకపోవడంపై నేను పార్టీ అధికార ప్రతినిధులను మందలించా. తెలంగాణలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని ఆ అంతర్గత సమావేశంలో సంతోష్ చెప్పారు. అయితే హంగ్ అని అన్నట్టుగా వార్త వచ్చినందుకు నేను జర్నలిస్టులను కూడా తప్పుబట్టను. ఎందుకంటే ఇందుకు సంబంధించి ఎలాంటి వీడియో, ఆడియో రికార్డ్ లేదు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్‌లో ప్రస్తుతం అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల అది అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కర్ణాటకలో గెలుపు ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశముంది. అయితే కాంగ్రెస్ తమను మోసం చేసిందనే భావనలో ఉన్న తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ వేరు, రాహుల్‌గాంధీ కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ నేత రాహుల్ జేఎన్‌యూ గాంధీ. ఆయన లెఫ్టిస్ట్ల భాష మాట్లాడుతున్నారు. అందువల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయింది. మోదీ మ్యాజిక్ పనిచేస్తుంది తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ పాపులారిటీ అత్యు న్నత స్థాయికి చేరుకుంది. ఒక్క అవినీతి మర కలేదు. పదేళ్ల యూపీఏ పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగు చూడగా, తొమ్మిదేళ్ల ఎన్డీఏ ఆధ్వర్యంలోని మోదీ పాలనలో ప్రధాని మోదీ లేదా మంత్రులపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం ముఖ్య మైన సానుకూల అంశం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాలు, కులం, మతం, వర్గాలకు అతీతంగా ప్రజలకు చేరవేయడంతో ..మోదీని వారు పూర్తి స్థాయిలో విశ్వసించే పరిస్థితి ఏర్పడింది. ఆ మ్యాజిక్ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్పష్టంగా పనిచేయబోతోంది. బీజేపీని గెలిపించబోతోంది. బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల్లో బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ప్రభుత్వంపై విశ్వసనీయత అనేది అత్యంత అధమ స్థాయిలో ఉంది. ఓటమిపై భయంతోనే కొన్ని మినహా అన్ని సీట్లకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే నామినేషన్ల చివరినాటికి ఆ అభ్యర్థుల్లో కనీసం 20 మందిని మార్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరే కతను మాకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే ప్రజల వద్దకు వెళుతున్నాం. మా వద్ద ఉన్న ఏకైక మార్గం ప్రజలను కలుసుకోవడం, బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు తెలియజేసి వారి మద్దతు సాధించడం. మేం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుస్తోంది. మరోవైపు ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. -
CWC 2023 SA VS SL: శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం (ఫొటోలు)
-
ఏపీలో ప్రజాస్వామ్యమే గెలిచింది
తాడికొండ: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందని, బహుజనుల ఉసురు తగిలి బాబు జైలు పాలయ్యాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హర్షంవ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం నాటికి 1,078వ రోజుకు చేరాయి. రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పలువురు ముఖ్యఅతిథులు సందర్శించి, మాట్లాడా రు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి అలవాటుపడ్డ చంద్రబాబు ప్రభుత్వ ధనం రూ. లక్షల కోట్లు దోపిడీ చేసి ప్రజలను మోసం చేశాడని చెప్పారు. బాబు అవినీతి పాపం పండి పక్కా ఆధారాలతో దొరకడంతో చట్టబద్ధంగా ప్రభుత్వం అరెస్ట్ చేయడం హర్షణీయమన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్‌లో అరెస్ట్ చేసిన చంద్రబాబుపై గతంలో ఉన్న కేసులను సైతం వెలికి తీసి స్టేలు ఎత్తివేసి పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బాబు అండ్‌కో అవినీతి బయటపడకుండా చేసేందుకు ఎల్లో మీడియా చేసిన హడావిడి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, పేదలకు ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కోర్టులో అనుమతించి తమకు సహకరించాలని కోరారు. నాయకులు మాదిగని గుర్నాధం, ఈపూరి ఆదాం, పల్లెబాబు, నూతక్కి జోషి, తదితరులు పాల్గొన్నారు. -
WI vs IND 1st T20 Match Photos : ఉత్కంఠపోరులో విండీస్ విజయం (ఫొటోలు)
-
ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన టాప్ 10 క్రీడాకారులు
-
లక్ నవూతో ఘోర ఓటమి తర్వాత ఫామ్ లోకి పంజాబ్ కింగ్స్
-
అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం
-
హంపికి గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం
-
లాటరీలో జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు
-
గుజరాత్ : రవీంద్ర జడేజా సతీమణి రివాబా గెలుపు
-
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పాగా వేసిన ఆప్
-
న్యూజీలాండ్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ
-
బిగ్ క్వశ్చన్ : మునుగోడు ఓటమి బీజేపీకి నేర్పిన పాఠం ఏంటి ..?
-
టీఆర్ఎస్ కు ఇంకా భారీ మెజారిటీ రావాల్సింది : కేటీఆర్
-
మునుగోడు లో టీఆర్ఎస్ విజయం.. కార్యకర్తల సంబరాలు
-
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం
-
ఎంఐఎం తరపున గెలిచిన అరుణ
భోపాల్: ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ఫేజ్‌లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్గావ్ మున్సిపల్ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్‌కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది. #ArunaUpadhyaya Thanked #AIMIM President Barrister @asadowaisi after Winning Corporator Election on AIMIM Ticket from City of #Khargone for the First Time in #MadhyaPradesh, #AIMIM has Registered a Big Victory in Corporator Elections. pic.twitter.com/hRIjsP8eqk — Syed Mubeen (Tez Dhar) (@SyedZiya_Mubeen) July 21, 2022 -
గెలుపంటే ఇది అనిపించేలా సాధించింది: వీడియో వైరల్
Despite Losing Shoe She Won Track Race: మనం చాలా క్రీడల్లో చూస్తుంటాం. అసలు వాళ్లు ఆ ఆటలో ఓడిపోతారేమో అనుకునే సమయంలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచి చూపిస్తారు. అంతెందుకు క్రికెట్ మ్యాచ్ లేదా టెన్నిస్ మరే ఏ ఆటైన ఆ క్రీడాకారులు ఆడుతున్న తీరు చూసి గెలవరని అర్థమైపోతుంది. కానీ వాళ్లు అందరీ అంచనాలను తారుమారు చేసి మరీ మంచి గా ఆడి గెలుస్తారు. అచ్చం అలాంటి సంఘనటనే అమెరికాలో నెబ్రాస్కాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ప్రముఖ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్ కుమార్తె 7 ఏళ్ల తలయా నార్త్‌వెస్ట్ హై స్కూల్లోని స్ప్రింట్ పోటీ(పరుగుల పోటీ) లో పాల్గొంది. ఐతే ఆ ట్రాక్ రేస్ మొదలైనప్పుడూ ఆమె కాలి షూ జారిపోతుంది. దీంతో ఆ రేస్‌లో పాల్గొన్న వాళ్లంతా తలయా కంటే చాలా ముందంజలో ఉన్నారు. కానీ ఆమె ఆ షు వేసుకోవడంలోనే ఉండిపోతుంది. ఆమె పరుగు మొదలు పెట్టేటప్పటికే చాలా ఆలస్యమవుతుంది. ఆ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా ఆమె గెలవదనే అనుకుంటారు. కానీ అందరీ అభిప్రాయలను తలకిందులు చేస్తూ అనుహ్యంగా తనతోటి రేసర్లను వెనక్కి నెట్టి మరీ ముందుంటుంది. చివరికీ ఆ పోటీలో ఆమె గెలుస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: పొట్టు పొట్టు చినిగిన నాశనం అయిన షూస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం) -
హుజూరా‘బాద్’షా ఈటలే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నాలుగున్నర నెలల ఉత్కంఠ పోరుకు తెరపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో మొత్తం 2,36,873 ఓటర్లు ఉండగా.. రికార్డు స్థాయిలో 2,05,236 మంది (86.64%) ఓటేశారు. మరో 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్‌కు 1,07,022 ఓట్లు (ఇందులో పోస్టల్ బ్యాలెట్ 242).. టీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు 83,167 ఓట్లు (ఇందులో పోస్టల్ బ్యాలెట్ 455) వచ్చాయి. మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థిపై 23,855 ఓట్ల మెజార్టీతో ఈటలవిజయం సాధించారు. నియోజకవర్గంపై తనపట్టును మరోసారి నిరూపించుకున్నారు. దాదాపు 20ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ (ఇంతకుముందు కమలాపూర్) నియోజకవర్గంలో తొలిసారిగా కాషాయ జెండా ఎగిరింది. ప్రతి రౌండులోనూ.. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించా రు. 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఈవీ ఎం ఓట్లు లెక్కిం చారు. అప్పటి నుంచి చివరిదాకా బీజేపీ అభ్యర్థి ఈటలకు మెజారిటీ కొనసాగింది. 8వ రౌండులో 162 ఓట్లు ఎక్కువ రావ డంతో టీఆర్ఎస్ శిబిరంలో ఆశలు రేగాయి. కానీ 9, 10 రౌండ్లలో టీఆర్ఎస్ వెనుకబడింది. తిరిగి 11 రౌండ్లో 385 ఓట్లు ఎక్కువగా సంపాదించింది. ఆ తర్వాత ఏ దశలోనూ టీఆర్ఎస్ పోటీ ఇవ్వలేదు. కారుకు పట్టున్న చోటా.. హుజూరాబాద్ అర్బన్, హుజూరాబాద్ రూరల్, వీణవంక మండలాల్లో టీఆర్ఎస్కు బాగా పట్టు ఉంది. కానీ ఆ ప్రాంతాల్లో కూడా కారు జోరు కనిపించలేదు. బీజేపీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా 15వ రౌండు (జమ్మికుంట మండలం)లో 2,049 ఓట్లు లీడ్, 18వ రౌండు (ఇల్లందకుంట మండలం)లో 1,876 ఓట్ల ఆధిక్యం, 19వ రౌండు (కమలాపూర్ మండలం)లో 3,047 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎక్కువ ఆధిక్యం వచ్చిన కమలాపూర్ ఈటల సొంత మండలం కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందినట్టు రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఈటల రాజేందర్‌కు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. -
13 ఏళ్ల తర్వాత... భారత్‌పై సిరీస్ నెగ్గిన శ్రీలంక
కొలంబో: టీమిండియాకు యువ శ్రీలంక టీమ్ షాకిచ్చింది. సిరీస్ విజేతను తేల్చే చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో హసరంగ (4/9) తన స్పిన్ మాయాజాలంతో భారత్‌ను కట్టడి చేశాడు. దాంతో శ్రీలంక ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఈ ఫార్మాట్లో ఎనిమిది వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు శ్రీలంక రూపంలో బ్రేక్ పడింది. శ్రీలంకకు ఐదు వరుస టి20 సిరీస్ పరాజయాల తర్వాత దక్కిన తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా 2008 తర్వాత భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతగా నిలువడం శ్రీలంకకు ఇదే తొలిసారి. గురువారం జరిగిన పోరులో తొలుత భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేసింది. టి20ల్లో భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. బౌలర్లు కుల్దీప్ యాదవ్ (28 బంతుల్లో 23 నాటౌట్), భువనేశ్వర్ (32 బంతుల్లో 16) పోరాడటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బౌలింగ్‌లో హసరంగకు కెప్టెన్ దసున్ షనక (2/20) కూడా తోడవ్వడంతో భారత్ కోలుకోలేదు. స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 82 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (20 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు), హసరంగ (9 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన హసరంగ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను అందుకున్నాడు. చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఏ దశలోనూ కుదురుగా ఆడలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కెప్టెన్ శిఖర్ ధావన్ (0)ను చమీర అవుట్ చేశాడు. ఫోర్ కొట్టి టచ్‌లో కనిపించిన దేవ్‌దత్ (9; 1 ఫోర్)ను రమేశ్ మెండిస్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక బౌలింగ్‌కు వచ్చిన హసరంగ ఒకే ఓవర్లో రుతురాజ్ (14; 2 ఫోర్లు), సంజూ సామ్సన్ (0)లను అవుట్ చేయడంతో భారత్ కోలుకోలేదు. భువనేశ్వర్, కుల్దీప్ కాసేపు ప్రతిఘటించడంతో భారత్ టి20లో తన అత్యల్ప స్కోరు (74)ను దాటగలిగింది. మరోసారి బౌలింగ్‌కు వచ్చిన హసరంగ... భువనేశ్వర్‌తో పాటు వరుణ్ చక్రవర్తి (0)లను అవుట్ చేశాడు. రాహుల్ తిప్పేసినా.... ఛేదనలో శ్రీలంకను రాహుల్ చహర్ కాసేపు భయపెట్టాడు. పిచ్ స్పిన్‌కు సహకరిస్తుండటంతో రాహుల్... అవిష్క ఫెర్నాండో (12; 1 ఫోర్), మినోద్ భానుక (18; 1 ఫోర్), సమరవిక్రమ (6) వికెట్లను తీసి లంకేయుల శిబిరంలో గుబులు రేపాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో క్రీజులో ఉన్న ధనంజయ డిసిల్వా, హసరంగ అజేయమైన నాలుగో వికెట్‌కు 26 పరుగుల జోడించి శ్రీలంకను గెలిపించారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీ) (బి) హసరంగ 14; ధావన్ (సి) ధనంజయ (బి) చమీర 0; పడిక్కల్ (ఎల్బీ) (బి) మెండిస్ 9; సామ్సన్ (ఎల్బీ) (బి) హసరంగ 0; నితీశ్ రాణా (సి అండ్ బి) షనక 6; భువనేశ్వర్ (సి) షనక (బి) హసరంగ 16; కుల్దీప్ (నాటౌట్) 23; రాహుల్ చహర్ (సి) భానుక (బి) షనక 5; వరుణ్ చక్రవర్తి (సి) కరుణరత్నే (బి) హసరంగ 0; సకారియా (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1–5, 2–23, 3–24, 4–25, 5–36, 6–55, 7–62, 8–63. బౌలింగ్: చమీర 4–0–16–1; కరుణరత్నే 2–0–12–0; రమేశ్ మెండిస్ 2–0–13–1; హసరంగ 4–0–9–4; అకిల 4–0–11–0; షనక 4–0–20–0. శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (సి అండ్ బి) రాహుల్ చహర్ 12; మినోద్ (ఎల్బీ) (బి) రాహుల్ చహర్ 18; సమరవిక్రమ (బి) రాహుల్ చహర్ 6; ధనంజయ డిసిల్వా (నాటౌట్) 23; హసరంగ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (14.3 ఓవర్లలో 3 వికెట్లకు) 82. వికెట్ల పతనం: 1–23, 2–35, 3–56. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–9–0; వరుణ్ చక్రవర్తి 3.3–0–15–0; సందీప్ 3–0–23–0; చహర్ 4–0–15–3; కుల్దీప్ 2–0–16–0. -
తానా అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తానా ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ గెలుపొందింది. దీంతో శృంగవరపు నిరంజన్ తానా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై ఆయన విజయం సాధించారు. నిరంజన్ ప్యానెల్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలి ప్యానెల్‌కు 9,108 ఓట్లు దక్కాయి. కర్నూలు వాసి నిరంజన్ ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్‌లో నివసిస్తున్నారు. తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుత అధ్యక్షుడు జై తాళ్లూరి తెలపారు. టీం నిరంజన్ ప్యానల్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు జై తాళ్లూరి ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని విడుదల చేశారు. తానాలో గెలుపోటములు ఉండవని.. బరిలో దిగిన ప్రతి వాళ్లూ గెలిచినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పాల్గొన్నందుకు నరేన్ కొడాలి టీంకు ఆయన అభినందనలు చెప్పారు. తానా అభ్యున్నతకి అందరూ కలిసి పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. చదవండి: భారత సంతతి కుటుంబం నిజాయతీ.. రూ.7 కోట్లు తిరిగిచ్చేసింది -
అన్ని చోట్ల గుబాళింపు: టీఆర్ఎస్లో డబుల్ జోష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఫుల్ జోష్‌లో ఉంది. నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో గెలిచిన ఆనందంలో ఉండగానే మినీ మున్సిపల్స్‌లో అద్భుతమైన విజయంతో డబుల్ సంతోషంలో టీఆర్ఎస్ శ్రేణులు మునిగారు. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని గులాబీ పార్టీ సత్తా చాటింది. ఇక వరంగల్, ఖమ్మం కార్పొఒరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో డబుల్ జోష్ వచ్చింది. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. నకిరేకల్‌లో 20 వార్డులు ఉండగా వాటిలో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 గెలిచారు. ఆ ఇతరుల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. రేపోమాపో వారు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్ సంఖ్య పెరగనుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ 7 స్థానాలతో సొంతం చేసుకుంది. 12 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 7 గెలవగా కాంగ్రెస్ 5 డివిజన్లలో గెలిచింది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 13 గెలిచి చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ భారీగా డివిజన్లు సొంతం చేసుకుంది. మొత్తం 27 డివిజన్లు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 డివిజన్లతో సరిపెట్టుకున్నాయి. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్ రావు మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తోంది. 43 స్థానాలు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఏకంగా 36 సొంతం చేసుకుంది. ఒకటి చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలవగా ఇతరులు 5 డివిజన్లలో గెలిచారు. ఇతరులు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించగా కొద్దిలో ఆ అవకాశం మిస్సయ్యింది. సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సత్తా చాటారు. కార్పొరేషన్ ఫలితాలు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. చదవండి: థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’ చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
బోణి కొట్టిన భారత్
లక్నో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా బోణి కొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా బౌలర్లు జులన్ గోస్వామి (4/42), గైక్వాడ్ (3/37), మాన్సీ జోషి (2/23) ధాటికి 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో లారా గుడాల్(49) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. కేవలం 28.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకొని సునాయాస విజయాన్ని సాధించింది. ఓపెనర్ జేమిమా రోడ్రిగ్స్ (20 బంతుల్లో 9) విఫలమైనప్పటికీ, మరో ఓపెనర్ మంధన ( 64 బంతుల్లో 80 పరుగులు;10 ఫోర్లు, 3 సిక్స్‌లు), వన్ డౌన్ బ్యాటర్ పూనమ్ రౌత్‌లు ( 89 బంతుల్లో 62 పరుగులు; 8 ఫోర్లు) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి 5 వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. 4 వికెట్లతో రాణించిన జులన్ గోస్వామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. -
ఆసీస్ అదుర్స్...
బ్రిస్బేన్: టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఆస్ట్రేలియా క్రికెట్ మహిళల జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వన్డే ఫార్మాట్లో ఆసీస్ జట్టుకిది వరుసగా 19వ విజయం కావడం విశేషం. తదుపరి రెండు వన్డేల్లోనూ గెలిస్తే 2003లో 21 వరుస విజయాలతో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా పురుషుల జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును మహిళల జట్టు సమం చేస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 181 పరుగుల విజయలక్ష్యాన్ని 33.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (70 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ చేయగా... ఓపెనర్లు రాచెల్ హేన్స్ (62 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్), అలీసా హీలీ (27 బంతుల్లో 26; 5 ఫోర్లు) రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్ జట్టు 49.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కేటీ పెర్కిన్స్ (32; 3 ఫోర్లు), మ్యాడీ గ్రీన్ (35; 3 సిక్స్‌లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జార్జియా, జెస్సికా, సోఫీ మోలినెక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
ముంబై మెరుపులు
ముంబై ఇండియన్స్ గర్జించింది. మెరుపులు ఆలస్యమైనా... ఆఖర్లో అనూహ్య విధ్వంసంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిన్నాభిన్నం చేసింది. సింహభాగం ఓవర్ల దాకా ఆధిపత్యం చలాయించిన కింగ్స్ బౌలింగ్ చివరకొచ్చేసరికి చేతులెత్తేసింది. రోహిత్, పొలార్డ్, పాండ్యా చూపించిన చుక్కలకు, కొట్టిన బౌండరీలకు స్కోరు బోర్డు వాయు వేగంతో దూసుకెళ్లింది. అనంతరం అద్భుతమైన బౌలింగ్‌తో కింగ్స్‌పై పంజా విసరడంతో విజయం సులువుగానే దక్కింది. అబుదాబి: ముంబై ఆల్‌రౌండ్ సత్తాకు పంజాబ్ దాసోహమైంది. డెత్ ఓవర్లో అయితే బ్యాటింగ్ విశ్వరూపానికి ప్రత్యక్ష సాక్ష్యమైంది. తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు చేతులెత్తేసింది. దీంతో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా... పొలార్డ్ (20 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) విరుచుకుపడ్డారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. డికాక్ డకౌట్ ముంబై ఇండియన్స్ పరుగు ప్రారంభించక ముందే డికాక్ డకౌటైతే... రెండో ఓవర్లో రోహిత్ ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. షమీ తొలి బంతిని బౌండరీకి తరలించడంతో హిట్‌మ్యాన్ ఈ మార్క్ చేరాడు. కానీ ముంబై స్కోరు మాత్రం జోరుగా సాగలేదు. పది ఓవర్లు గడిచినా... రోహిత్ శర్మ క్రీజులో ఉన్నా ఒక్క సిక్సరైనా లేదు. అడపాదడపా ఫోర్ల రూపంలో పరుగులొచ్చినా మ్యాచ్ చప్పగా సాగింది. ఈ దశలో ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) భారీ సిక్సర్‌తో మురిపించాడు. కానీ పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు అతని ఆటలు ఎంతోసేపు సాగలేదు. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై 3 వికెట్లకు 87 పరుగులే చేయగలిగింది. పూరన్ ఒక్కడే... పంజాబ్ ఆరంభం అదిరింది. తొలి ఓవర్లోనే మయాంక్, రాహుల్ చెరో బౌండరీ బాదారు. రెండో ఓవర్లో 12, మూడో ఓవర్లో 9 పరుగుల రావడంతో కింగ్స్ 3 ఓవర్లలో 33 పరుగులు చేసింది. అయితే మయాంక్ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు) జోరుకు బుమ్రా కళ్లెం వేశాడు. కాసేపటికే కరుణ్ నాయర్ (0), రాహుల్ (17) అవుట్ కావడంతో పంజాబ్ గెలుపు దారి మూసుకుపోయింది. ఈ దశలో నికోలస్ పూరన్ ధాటిగా ఆడాడు. సిక్స్‌లు, ఫోర్లతో జోరందుకున్నాడు. కానీ చేయాల్సిన రన్‌రేట్‌కు అతనొక్కడి ధనాధన్ ఏమాత్రం సరిపోలేదు. 14వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు చేరింది. అయితే ఆ మరుసటి బంతికే పూరన్ ఔట్ కావడం, హిట్టర్ మ్యాక్స్‌వెల్ (11) చేతులెత్తేయడంతో పంజాబ్ ఓటమి 15వ ఓవర్లోనే ఖాయమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కృష్ణప్ప గౌతమ్ (13 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆట 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు పనికొచ్చింది. సచిన్ మాట! ముంబై 18వ ఓవర్లో 18 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 19 పరుగులు చేసింది. హిట్టర్లు పొలార్డ్, హార్దిక్ పాండ్యా క్రీజులో విధ్వంసరచన చేస్తుంటే పంజాబ్ కెప్టెన్ రాహుల్ 20వ ఓవర్ వేసేందుకు ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్‌కు బంతినిచ్చాడు. ఈ పరిణామం బ్యాటింగ్ లెజెండ్ సచిన్‌ను సైతం విస్మయపరిచింది. అందుకేనేమో ట్విట్టర్లో ఆ దిగ్గజం తలబాదుకునే ఇమోజీతో వ్యాఖ్య జోడించి పోస్ట్ చేశాడు. ‘పొలార్డ్, పాండ్యా క్రీజ్‌లో ఉన్నప్పుడు 20వ ఓవర్ ఒక ఆఫ్ స్పిన్నర్ బౌల్ చేయడమా’ అని అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టే రాహుల్ వ్యూహం ఎంత తప్పో అర్థమవుతుంది. ఆరు... ఫోరు... ఆఖర్లో ముంబై జోరు.. ముంబై 14 ఓవర్లు ఆడింది. ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ క్రీజులో ఉన్నాడు. అయినా జట్టు స్కోరు వంద పరుగులైనా చేయలేదు. మిగిలినవి 6 ఓవర్లు. పిచ్ స్వభావం, మ్యాచ్ జరిగిన విధానం బట్టి... కాస్త ధాటిగా ఆడినా ఈ 36 బంతుల్లో 60, 70 పరుగులు చేస్తుందిలే అనుకున్నారంతా! కానీ ఈ ఆరు ఓవర్లే ముంబై దశను మార్చాయి. ఈ సమయంలో ఫోర్లు, సిక్సర్లు పోటీపడ్డాయి. బౌండరీ లైనును అదే పనిగా దాటాయి. బిష్ణోయ్ 15వ ఓవర్లో రోహిత్ రెండు సిక్సర్లతో స్కోరు వంద దాటింది. నీషమ్ 16 ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 6 బాదడంతో అర్ధసెంచరీ దాటి ఏకంగా 70 పరుగులకు చేరింది. అదే స్కోరుపై రోహిత్‌ను మరుసటి ఓవర్ తొలి బంతికే షమీ ఔట్ చేయగా... 17వ ఓవర్లో ఐదే పరుగులొచ్చాయి. 18, 19, 20 ఓవర్లలలో హార్దిక్ పాండ్యా, పొలార్డ్‌ల ధనాధన్‌తో దద్దరిల్లింది. ఈ 18 బంతుల్లో బంతి ఏకంగా 11 సార్లు బౌండరీని దాటింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై 104 పరుగులు చేయడంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేవలం 23 బంతుల్లోనే పొలార్డ్, పాండ్యా అబేధ్యమైన ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. 3 ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని దాటిన మూడో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (5430), సురేశ్ రైనా (5368)లు రోహిత్ శర్మ (5068)కంటే ముందున్నారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) కాట్రెల్ 0; రోహిత్ (సి) నీషమ్ (బి) షమీ 70; సూర్య కుమార్ (రనౌట్) 10; ఇషాన్ కిషన్ (సి) కరుణ్ నాయర్ (బి) గౌతమ్ 28; పొలార్డ్ (నాటౌట్) 47; హార్దిక్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 191 వికెట్ల పతనం: 1–0, 2–21, 3–83, 4–124. బౌలింగ్: కాట్రెల్ 4–1–20–1, షమీ 4–0–36–1, రవి 4–0–37–0, గౌతమ్ 4–0–45–1, నీషమ్ 4–0–52–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) చహర్ 17; మయాంక్ (బి) బుమ్రా 25; కరుణ్ నాయర్ (బి) కృనాల్ 0; పూరన్ (సి) డికాక్ (బి) ప్యాటిన్సన్ 44; మ్యాక్స్‌వెల్ (సి) బౌల్ట్ (బి) చహర్ 11; నీషమ్ (సి) సూర్య కుమార్ (బి) బుమ్రా 7; సర్ఫరాజ్ (ఎల్బీ) (బి) ప్యాటిన్సన్ 7; గౌతమ్ (నాటౌట్) 22; రవి (సి) సూర్య కుమార్ (బి) బౌల్ట్ 1; షమీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–38, 2–39, 3–60, 4–101, 5–107, 6–112, 7–121, 8–124. బౌలింగ్: బౌల్ట్ 4–0–42–1, ప్యాటిన్సన్ 4–0–28–2, కృనాల్ 4–0–27–1, బుమ్రా 4–0–18–2, చహర్ 4–0–26–2. -
ఆఖరి ఓవర్లలో... ఆరేశారు
ఈల... గోల... లేని మ్యాచ్‌లో బంతి డీలా పడింది. ఇరు జట్ల బ్యాటింగ్ విధ్వంసం ముందు బౌలింగే మోకరిల్లింది. బంతి తీరాన్ని తాకిన అలల్లా పదే పదే బౌండరీ లైన్‌ను తాకింది. నోరులేకపోయినా... బంతి మాత్రం మైదానం మొత్తం గగ్గోలు పెట్టింది. కింగ్స్ ఓపెనర్లు మయాంక్, రాహుల్ వీరవిహారానికి తెరలేపితే... రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ స్మిత్, సామ్సన్, రాహుల్ తేవటియా విజృంభణతో తెర వేశారు. 224 పరుగుల లక్ష్యం కూడా సిక్సర్ల జాతరలో చిన్నబోయింది. విజయం అసాధ్యమనుకుంటే ఇంకో 3 బంతులు మిగిలుండగానే రాజస్తాన్‌కు సుసాధ్యమైంది. షార్జా: బ్యాట్‌ను బ్యాటే గెలిచింది. విధ్వంసాన్ని విధ్వంసమే జయించింది. కొండంత లక్ష్యం సిక్సర్ల పిడుగులతో కరిగిపోయింది. ఐపీఎల్ టి20 టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ అసాధారణ విజయం సాధించింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ లక్ష్యానికి పునాది వేయగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు. వీరిద్దరి శ్రమకు రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలనాన్ని జతచేశాడు. 224 పరుగుల అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీస్కోరు చేసింది. మయాంక్ అగర్వాల్ (50 బంతుల్లో 106; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ బాదగా, కెప్టెన్ రాహుల్ (54 బంతుల్లో 69; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్తాన్ జట్టులో మిల్లర్, యశస్వి జైస్వాల్ స్థానాల్లో బట్లర్, అంకిత్ రాజ్‌పుత్‌లను తుది జట్టులోకి తీసుకుంది. కింగ్స్ ధనాధన్ 100... రాజస్తాన్ బౌలర్ల పాలిట మయాంక్, లోకేశ్ రాహుల్ బ్యాటింగ్ ‘కింగ్స్’ అయ్యారు. బంతి పడితే... మేం బాదితే... ఇక అంతే! అన్నట్లుగా ఓపెనర్ల విధ్వంసరచన సాగింది. జట్టు స్కోరు 50 పరుగులు చేరేందుకు 27 బంతులే (4.3 ఓవర్లు) అవసరమయ్యాయి. ఇవి వందగా మారేందుకు 53 బంతులే (8.4) సరిపోయాయి. మరో 60 బంతులు (18.5) పడేసరికి ఆ వంద కాస్తా 200 పరుగుల ప్రవాహమైంది. ఈ 20 ఓవర్లలో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌండరీలైను బతికిపోయింది. 16 ఓవర్ల పాటు 31 సార్లు బంతి సిక్స్ లేదంటే ఫోర్‌గా రేఖ దాటింది. రాయల్స్ చేజింగ్... యమ స్పీడ్‌గా ఆడిన స్మిత్ ఔటయ్యాడు. స్పీడ్‌ను కొనసాగించిన సామ్సన్ నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న తేవటియా అగచాట్లు పడుతున్నాడు. 17 ఓవర్ల వద్ద రాజస్తాన్ స్కోరు 173/3. మిగిలినవి 18 బంతులే. చేయాల్సినవి 51 పరుగులు. అంటే ఆఖరి 3 ఓవర్లలో 17 పరుగుల చొప్పున చేయాలి. అప్పుడు సాగింది కాట్రెల్ బౌలింగ్... తేవటియా బ్యాటింగ్... 6, 6, 6, 6, 0, 6 లాంగ్‌లెగ్, బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్, మిడ్ వికెట్, బంతి గ్యాప్ తర్వాత మళ్లీ మిడ్ వికెట్ల మీదుగా మొత్తం 5 సిక్స్‌లు. అంతే సమీకరణం మారింది. రాజస్తాన్ రాయల్స్ విజయం ఫటాఫట్‌గా మారిపోయింది. స్మిత్ మెరుపులతో... ఏ రకంగా చూసినా... 224 పరుగులు అసాధ్యమైన లక్ష్యమే. ఓవర్‌కు 11 పరుగుల పైగా బాదితేనే రాజస్తాన్ గెలుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో బట్లర్ (4) చేతులెత్తేయగా... స్మిత్, సామ్సన్తో కలిసి మెరుపు షాట్లతో ఆశలు రేపాడు. అతని జోరుతో రాయల్స్ అచ్చూ కింగ్స్లాగే దూకుడుగా సాగిపోయింది. మయాంక్లాగే స్మిత్ 26 బంతుల్లోనే (7ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. కానీ జట్టు స్కోరు 100 పరుగుల వద్ద అతని మెరుపులకు నిషమ్ అడ్డుకట్ట వేయడంతో జోరు తగ్గింది. తేవటియా బంతులు వృథా చేశాడు. మరోవైపు సామ్సన్ చెలరేగడం మొదలు పెట్టడంతో మళ్లీ ఆశలు చిగిరించాయి. కానీ ఇతన్ని షమీ ఔట్ చేయడంతో రాజస్తాన్‌కు లక్ష్యం భారంగా మారి విజయానికి దూరమైంది. ఈ దశలో తేవటియా తన ఆటతో మ్యాచ్తీరే మార్చేశాడు. దాంతో మూడు బంతులు మిగిలి ఉండగానే రాయల్స్ నెగ్గింది. మయాంక్ సూపర్ సెంచరీ అంతకుముందు రాహుల్‌తో పరుగులు మొదలుపెట్టిన మయాంక్ తానెదుర్కొన్న నాలుగో బంతి (1.3 ఓవర్)తో విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. మిడాఫ్‌లో భారీ సిక్సర్ బాదిన ఈ ఓపెనర్ ఇక అక్కడినుంచి వెనుతిరిగి చూసుకోనేలేదు. ఏ బౌలర్ వచ్చిన విడిచి పెట్టలేదు. కుదిరితే ఫోర్, బాగా కుదిరితే సిక్సర్ ఇలా అతని బ్యాటింగ్ కొనసాగింది. మరోవైపు కెప్టెన్ రాహుల్ కూడా ధాటిగా ఆడటంతో ఈ మ్యాచ్ లైవ్ మ్యాచ్‌గా కాకుండా హైలైట్స్‌ను తలపించింది. 26 బంతుల్లో (4 ఫోర్లు, 5 సిక్సర్లు) మయాంక్ ఫిఫ్టీ పూర్తయింది. కొంచెం ఆలస్యమైనా రాహుల్ 35 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ అధిగమించాడు. అరుపులు లేని చోట వీరిద్దరి మెరుపులు వాటిని భర్తీ చేశారు. ప్రేక్షకులెవరూ ఓవర్ బ్రేక్‌లోనూ చానల్ మార్చే సాహసం చేయలేనంతగా ఈ ఓపెనింగ్ జోడీ ప్రతాపం చూపింది. 45 బంతుల్లోనే (9 ఫోర్లు, 7 సిక్సర్లు) మయాంక్ శతక్కొట్టాడు. ఆ తర్వాతే టామ్ కరన్ అతన్ని ఔట్చేయగలిగాడు. దీంతో 183 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రాహుల్ ఆట ముగియగా... పూరన్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లతో) జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) గోపాల్ (బి) అంకిత్ రాజ్‌పుత్ 69; మయాంక్ అగర్వాల్ (సి) సంజూ సామ్సన్ (బి) టామ్ కరన్ 106; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 13; పూరన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–183, 2–194. బౌలింగ్: జైదేవ్ ఉనాద్కట్ 3–0–30–0, అంకిత్ రాజ్‌పుత్ 4–0–39–1, ఆర్చర్ 4–0–46–0, శ్రేయస్ గోపాల్ 4–0–44–0, రాహుల్ తేవటియా 1–0–19–0, టామ్ కరన్ 4–0–44–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జోస్ బట్లర్ (సి) సర్ఫరాజ్ (బి) కాట్రెల్ 4; స్టీవ్ స్మిత్ (సి) షమీ (బి) నీషమ్ 50; సంజూ సామ్సన్ (సి) రాహుల్ (బి) షమీ 85; రాహుల్ తేవటియా (సి) మయాంక్ అగర్వాల్ (బి) షమీ 53; ఉతప్ప (సి) పూరన్ (బి) షమీ 9; ఆర్చర్ (నాటౌట్) 13; రియాన్ పరాగ్ (బి) మురుగన్ అశ్విన్ 0; టామ్ కరన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–19, 2–100, 3–161, 4–203, 5–222, 6–222. బౌలింగ్: కాట్రెల్ 3–0–52–1, షమీ 4–0–53–3, రవి బిష్ణోయ్ 4–0–34–0, నీషమ్ 4–0–40–1, మురుగన్ అశ్విన్ 1.3–0–16–1, మ్యాక్స్‌వెల్ 3–0–29–0. -
ఢిల్లీ కమాల్...
176 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో తొలి 10 ఓవర్లలో స్కోరు 3 వికెట్లకు 47 పరుగులు... ఈ స్కోరు చూస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఆడిందో అర్థమవుతుంది. పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో మాజీ చాంపియన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో ధోని సేనకు భారీ పరాజయం ఎదురైంది. మరోవైపు ముందుగా పరిస్థితికి తగినట్లుగా సాగిన బ్యాటింగ్, ఆ తర్వాత చక్కటి బౌలింగ్‌తో ఢిల్లీ మరో విజయాన్ని అందుకుంది. ఏ ఒక్కరో కాకుండా సమష్టి ప్రదర్శన క్యాపిటల్స్‌ను గెలిపించింది. దుబాయ్: శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ టి20 మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పృథ్వీ షా (43 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (25 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు), శిఖర్ ధావన్ (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (35 బంతుల్లో 43; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... రబడ 3 వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌తో నెగ్గిన ఢిల్లీకి ఈ విజయంతో తమ సత్తాను ప్రదర్శించింది. భారీ భాగస్వామ్యం... ఢిల్లీ ఇన్నింగ్స్ సరిగ్గా రెండు ‘సమ భాగాలు’గా సాగింది. తొలి 10 ఓవర్లలో 88 పరుగులు చేసిన ఆ జట్టు తర్వాతి 10 ఓవర్లలో 87 పరుగులు చేయగలిగింది. చహర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతి తన బ్యాట్‌కు తగిలి కీపర్ ధోని చేతుల్లో పడినా ఎవరూ అప్పీల్ చేయకపోవడంతో బతికిపోయిన పృథ్వీ షా తర్వాతి రెండు బంతుల్లో ఫోర్లు కొట్టి జోరును ప్రదర్శించాడు. తర్వాత స్యామ్ కరన్, పీయూష్ చావ్లా ఓవర్లలోనూ అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే పవర్‌ప్లేలో ఢిల్లీ 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరోవైపు తొలి 15 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా కొట్టని ధావన్ ఎట్టకేలకు జడేజా బంతిని భారీ సిక్సర్‌గా మలచి బౌండరీల బోణీ చేశాడు. ఆ తర్వాత చావ్లా ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన షా 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చావ్లా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి ధావన్ అవుట్ కావడంతో 94 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే షా అవుటైనా... పంత్, శ్రేయస్ అయ్యర్ (22 బంతుల్లో 26; 1 ఫోర్) భాగస్వామ్యం ఢిల్లీని నడిపించింది. అయితే ఆశించిన మెరుపులు క్యాపిటల్స్ నుంచి రాలేదు. వీరిద్దరు 40 బంతుల్లో 58 పరుగులు జోడించారు. చివర్లో హాజల్‌వుడ్ వేసిన 18వ, 20వ ఓవర్లలో కలిపి 5 ఫోర్లు సహా మొత్తం 25 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ మెరుగైన స్కోరు సాధించగలిగింది. డు ప్లెసిస్ మినహా.. 10 ఓవర్లలో 3 వికెట్లకు 47 పరుగులు... ఛేదనలో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి చెన్నై స్కోరిది. ఆరంభం నుంచి ఆ జట్టు బ్యాటింగ్ తడబాటుకు లోనైంది. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నెమ్మదిగా ఆడిన ఇద్దరు ఓపెనర్లు విజయ్ (15 బంతుల్లో 10; ఫోర్), వాట్సన్ (16 బంతుల్లో 14; ఫోర్, సిక్స్) తక్కువ వ్యవధిలోనే వెనుదిరగ్గా, అవకాశం లేని చోట పరుగుకు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ (10 బంతుల్లో 5) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో డు ప్లెసిస్ కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. 22 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హెట్‌మైర్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. కేదార్ జాదవ్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు) కొంత పోరాడినా పెద్దగా జట్టుకు పనికి రాలేదు. ధోని మళ్లీ మళ్లీ... చాలా కాలం తర్వాత క్రికెట్ ఆడుతున్నాను కాబట్టి నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకుంటున్నానని గత మ్యాచ్‌లో చెప్పిన ధోని ఈసారి కూడా ప్రభావం చూపలేకపోయాడు. 26 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ధోని మరోసారి పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కుర్రాడు అవేశ్ ఖాన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినా, చివరకు కొండంత లక్ష్యం ముందు చేతులెత్తేయాల్సి వచ్చింది. 12 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన అనంత రం చివరి ఓవర్ మూడో బంతికి రబడ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందుగా వచ్చి పాత ధోని తరహాలో జట్టును గెలిపించాలని కోరుకుంటున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (స్టంప్డ్) ధోని (బి) పీయూష్ చావ్లా 64; శిఖర్ ధావన్ (ఎల్బీ) (బి) పీయూష్ చావ్లా 35; రిషభ్ పంత్ (నాటౌట్) 37; శ్రేయస్ అయ్యర్ (సి) ధోని (బి) స్యామ్ కరన్ 26; స్టొయినిస్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–94; 2–103; 3–161. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–38–0; స్యామ్ కరన్ 4–0– 27–1; హాజల్‌వుడ్ 4–0–28–0; పీయూష్ చావ్లా 4–0–33–2; జడేజా 4–0–44–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) రబడ (బి) నోర్జే 10; షేన్ వాట్సన్ (సి) హెట్‌మైర్ (బి) అక్షర్ పటేల్ 14; డు ప్లెసిస్ (సి) రిషభ్ పంత్ (బి) రబడ 43; రుతురాజ్ గైక్వాడ్ (రనౌట్) 5; కేదార్ జాదవ్ (ఎల్బీ) (బి) నోర్జే 26; ధోని (సి) రిషభ్ పంత్ (బి) రబడ 15; రవీంద్ర జడేజా (సి) అమిత్ మిశ్రా (బి) రబడ 12; స్యామ్ కరన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–23; 2–34; 3–44; 4–98; 5–113; 6–130; 7–131. బౌలింగ్: రబడ 4–0–26–3; అక్షర్ పటేల్ 4–0–18–1; నోర్జే 4–0–21–2; అవేశ్ ఖాన్ 4–0–42–0; అమిత్ మిశ్రా 4–0–23–0. -
రాహుల్ మైండ్‌బ్లాక్ ఇన్నింగ్స్
పంజాబ్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ మైండ్‌బ్లాక్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ భారత ఆటగాడికి సాధ్యం కానీ అత్యధిక స్కోరును ఆవిష్కరించాడు. అతని జోరుకు సిక్స్‌లు, ఫోర్లు బౌండరీ లైను తాకేందుకు పదేపదే పోటీపడ్డాయి. అతని దెబ్బకు బెంగళూరు బౌలింగ్ విలవిల్లాడింది. తర్వాత కొండంత లక్ష్యఛేదనలో గోరంత స్కోరుకే ఆర్సీబీ టాప్ లేచింది. చివరకు కనీసం రాహుల్ స్కోరుకు చేరువగా కూడా రాలేక చేతులెత్తేసింది. దుబాయ్: తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండో మ్యాచ్‌లో భారీ విజయంతో సత్తా చాటింది. గురువారం జరిగిన పోరులో పంజాబ్ 97 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లోకేశ్ రాహుల్ (69 బంతుల్లో 132 నాటౌట్; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ప్రవాహంలా సాగి... ఇన్నింగ్స్‌లో సగానికి పైగా బంతులు (69) ఎదుర్కొన్న రాహుల్ చివరి వరకు నిలబడి పరుగుల వరద పారించాడు. తొలి ఓవర్లో ఫైన్ లెగ్‌లో మొదలైన బౌండరీల ప్రవాహం అదే రీతిలో కొనసాగింది. ఉమేశ్ వేసిన పదో ఓవర్లో రాహుల్ డీప్ ఎక్స్ట్రా కవర్లో సిక్స్, ఫైన్‌లెగ్‌లో ఫోర్ కొట్టాడు. 12వ ఓవర్లో అతని అర్ధసెంచరీ (36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) పూర్తికాగా, జట్టు 100 పరుగులకు చేరింది. ఇక సిక్సర్లయితే అన్ని ‘తార’తీరం చేరినవే! పవర్ ప్లేలో కింగ్స్ ఎలెవన్ సరిగ్గా 50 పరుగులు చేసింది. ఓవర్‌కు సగటున 8 పరుగుల రన్‌రేట్‌తో పంజాబ్ దూసుకెళ్లింది. పేసర్లను పక్కనబెట్టిన బెంగళూరు సారథి కోహ్లి బంతిని స్పిన్నర్ చహల్‌కు అప్పగించగా... చహల్ గూగ్లీకి మయాంక్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు) క్లీన్‌బౌల్డయ్యాడు. 57 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. శివమ్ దూబే వరుస ఓవర్లలో పూరన్ (17), మ్యాక్స్‌వెల్ (5)ను అవుట్ చేసినా...ఏ ఒక్కరు రాహుల్ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. వెటరన్ పేసర్ స్టెయిన్, సీనియర్ పేసర్లను లెక్క చేయకుండా రాహుల్ విధ్వంసం అజేయంగా సాగింది. 62 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కవర్, డీప్ మిడ్ వికెట్, లాంగాన్, లాంగాఫ్ ఇలా మైదానమంతా అతను విరుచుకుపడ్డాడు. స్టెయిన్ 19వ ఓవర్లో 6, 4, 0, 6, 6, 4లతో ఐదుసార్లు బంతిని ఫీల్డర్లకు అందకుండా బాదేసి 26 పరుగులు పిండుకున్నాడు. దూబే వేసిన ఆఖరి ఓవర్లోనూ రాహుల్ వరుసగా ఫోర్, రెండు సిక్స్‌లు (4, 6, 6) కొట్టాడు. దీంతో ఆఖరి 9 బంతుల్లోనే అతని విధ్వంసం 42 పరుగుల్ని తెచ్చిపెట్టాయి. 16 బంతులకే... భారీ లక్ష్యం ముందుంటే బెంగళూరు బాధ్యతే మరిచింది. మొదటి 16 బంతులకే పరాజయానికి బాటలు వేసుకుంది. తొలి ఓవర్లో పడిక్కల్ (1), రెండో ఓవర్లోనే ఫిలిప్ (0), మూడో ఓవర్లో స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లి (1) ఔటయ్యారు. కాట్రెల్ దెబ్బకు 4 పరుగులకే 3 టాప్ వికెట్లను కోల్పోవడంతో ఆర్సీబీ పరాజయం వైపు మళ్లింది. రవి బిష్ణోయ్ అద్భుతమైన డెలివరీకి ఫించ్ (21 బంతుల్లో 20; 3 ఫోర్లు) బౌల్డ్ కాగా, ఆపై డివిలియర్స్ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) వల్లా కాలేదు. ఆ తర్వాత సుందర్ మినహా... అంతా విఫలం కావడంతో బౌలర్లకు 20 ఓవర్లు వేసే శ్రమ తప్పింది. అవతలివైపు రాహు ల్ ఒక్కడే 14 ఫోర్లు కొడితే ఇక్కడ మాత్రం అంతాకలిసి కొట్టిన ఫోర్లు (10), సిక్స్‌లు (3) కూడా ఆ సంఖ్యను చేరలేకపోయాయి. 1 ఐపీఎల్లో భారత ఆటగాడు నమోదు చేసిన అత్యధిక స్కోరు (132 నాటౌట్) ఇదే. గతంలో రిషభ్ పంత్ (128 నాటౌట్) పేరిట ఈ ఘనత ఉంది. లీగ్‌లో కెప్టెన్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా రాహుల్ నిలిచాడు. ఇంతకు ముందు వార్నర్ 126 పరుగులు చేశాడు. కోహ్లి మిస్సింగ్స్ మైదానంలో పాదరసంలా కదిలే ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి మిస్ ఫీల్డింగ్ విస్మయపరిచింది. ఈ చురుకైన ఫీల్డర్ ... వరుస ఓవర్లలో రాహుల్ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. స్టెయిన్ బౌలింగ్‌లో 83 పరుగుల వద్ద రాహుల్ డీప్ మిడ్వికెట్లో కొట్టిన షాట్‌ను ఓ సారి, సైని బౌలింగ్‌లో 89 పరుగుల వద్ద లాంగాఫ్‌లో మరోసారి క్యాచ్‌ల్ని చేజార్చాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 132; మయాంక్ (బి) చహల్ 26; పూరన్ (సి) డివిలియర్స్ (బి) దూబే 17; మ్యాక్స్‌వెల్ (సి) ఫించ్ (బి) దూబే 5; కరుణ్ నాయర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–57, 2–114, 3–128. బౌలింగ్: ఉమేశ్ 3–0–35–0, స్టెయిన్ 4–0–57–0, సైనీ 4–0–37–0, చహల్ 4–0–25–1, సుందర్ 2–0–13–0, దూబే 3–0–33–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పడిక్కల్ (సి) రవి (బి) కాట్రెల్ 1; ఫించ్ (బి) రవి 20; ఫిలిప్ (ఎల్బీ) (బి) షమీ 0; కోహ్లి (సి) రవి (బి) కాట్రెల్ 1; డివిలియర్స్ (సి) సర్ఫరాజ్ (బి) మురుగన్ అశ్విన్ 28; సుందర్ (సి) మయాంక్ (బి) రవి 30; దూబే (బి) మ్యాక్స్‌వెల్ 12; ఉమేశ్ (బి) రవి 0; సైనీ (బి) మురుగన్ అశ్విన్ 6; స్టెయిన్ (నాటౌట్) 1; చహల్ (ఎల్బీ) (బి) మురుగన్ అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 109. వికెట్ల పతనం: 1–2, 2–3, 3–4, 4–53, 5–57, 6–83, 7–88, 8–101, 9–106, 10–109. బౌలింగ్: కాట్రెల్ 3–0–17–2, షమీ 3–0–14–1, బిష్ణోయ్ 4–0–32–3, మురుగన్ అశ్విన్ 3–0–21–3, నీషమ్ 2–0–13–0, మ్యాక్స్‌వెల్ 2–0–10–1. -
ఆసీస్ చేజేతులా...
మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (73; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... లబ్‌షేన్ (48; 3 ఫోర్లు), క్యారీ (36; 2 ఫోర్లు) రాణించారు. 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా... ఫించ్, లబ్‌షేన్ మూడో వికెట్‌కు 107 పరుగులు సాధించడంతో జట్టు గెలుపు దిశగా సాగింది. అయితే లబ్‌షేన్‌ను వోక్స్ అవుట్ చేశాక జట్టు పతనం వేగంగా సాగిపోయింది. 21 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన కంగారూలు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. 65 పరుగుల తేడాలో చివరి 8 వికెట్లు కోల్పోయి ఆ జట్టు ఓటమి పాలైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్చర్ (3/34), వోక్స్ (3/32), స్యామ్ కరన్ (3/35) ప్రత్యర్థిని పడగొట్టారు. అంతకు ముందు ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. మూడు మ్యాచ్‌లు సిరీస్‌లో రెండు జట్లు ప్రస్తుతం 1–1తో సమంగా ఉండగా మూడో వన్డే రేపు జరుగుతుంది. -
నమో నయోమి
ఏ లక్ష్యంతో న్యూయార్క్‌లో అడుగుపెట్టిందో ఆలక్ష్యాన్ని అందుకుంది జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా. కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడంతోపాటు అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి లేదా జాతి వివక్ష కారణంగా తమ ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయులకు ఒసాకా తన విజయంతో ఘనమైన నివాళులు అర్పించింది. పోలీసుల చేతుల్లో లేదంటే జాతి వివక్ష కారణంగా మరణించిన పలువురు నల్లజాతీయుల్లో ఏడుగురిని (ఏడు రౌండ్లలో గెలిస్తే విజేత అవుతారు) ఎంచుకున్న ఒసాకా ఆ ఏడుగురి పేర్లు రాసి ఉన్న మాస్క్‌లను ధరించి యూఎస్ ఓపెన్‌లో ఆడతానని... ఆ ఏడుగురికీ నివాళులు ఇవ్వాలంటే టైటిల్ గెలవాల్సి ఉంటుందని టోర్నీ ప్రారంభానికి ముందు వ్యాఖ్యానించింది. ఆమె అన్నట్టే ప్రతి మ్యాచ్‌లో ఒక్కో బాధితుడి పేరు రాసి ఉన్న మాస్క్‌ను ధరించి ఆడింది. ఆఖరికి తన వద్ద ఉన్న చివరిదైన ఏడో మాస్క్‌ను ధరించి ఆడి విజేతగా నిలిచింది. తాను అనుకున్న రెండు లక్ష్యాలనూ సాధించి ఒసాకా ఔరా అనిపించింది. మరో వైపు యూఎస్ ఓపెన్ ఫైనల్లో మూడో సారి ఓడిన అజరెంకా తీవ్ర నిరాశతో వెనుదిరిగింది. న్యూయార్క్: ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదల కోల్పోకుండా ఆడిన జపాన్ యువతార నయోమి ఒసాకా తన కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగో సీడ్ ఒసాకా చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 22 ఏళ్ల ఒసాకా గంటా 53 నిమిషాల్లో 1–6, 6–3, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత 27వ ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై విజయం సాధించింది. ఒసాకా కెరీర్లో ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఆమె 2018లోనూ చాంపియన్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ అజరెంకాకు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి సెట్ కోల్పోయినా... 26 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 6–1తో నెగ్గిన అజరెంకా ఆ తర్వాత రెండో సెట్లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అజరెంకా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని ఉంటే సెట్‌తోపాటు, మ్యాచ్‌నూ సొంతం చేసుకొని తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడేది. కానీ ఒసాకా అలా జరగనీయలేదు. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్లో 0–2తో వెనుకబడి... మూడో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌లో 30–40తో గేమ్‌ను కోల్పోయే దశ నుంచి ఒసాకా కోలుకుంది. గేమ్ కోల్పోయే స్థితి నుంచి తేరుకున్న ఒసాకా మూడో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–2తో స్కోరును సమం చేసింది. అనంతరం అదే జోరులో ఒసాకా రెండో సెట్‌ను 41 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్ నాలుగో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జపాన్ అమ్మాయి తన సర్వీస్‌ను కాపాడుకొని 4–1తో ముందంజ వేసింది. అయితే అజరెంకా కూడా తన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. ఏడో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన అజరెంకా ఆధిక్యాన్ని 3–4కి తగ్గించింది. అయితే ఒసాకా వెంటనే ఎనిమిదో గేమ్‌లోనే అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఒసాకా తన సర్వీస్‌నూ కాపాడుకొని 46 నిమిషాల్లో మూడో సెట్‌ను కైవసం చేసుకొని చాంపియన్‌గా నిలిచింది. ఆ ఏడుగురు... అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న వివక్ష పట్ల ఓ క్రీడాకారిణిగా నయోమి యూఎస్ ఓపెన్‌లో అద్భుత రీతిలో స్పందించింది. కొన్నేళ్లుగా పోలీసుల చేతుల్లో బలైన నల్ల జాతీయుల్లో ఏడుగురిని ఎంచుకొని వారి పేర్లను తన మాస్క్‌పై రాసుకొని మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత వాటిని ధరించి సంఘీభావం తెలిపింది. తొలి రౌండ్లో బ్రెనా టేలర్... రెండో రౌండ్లో ఎలిజా మెక్లెయిన్... మూడో రౌండ్లో జార్జి ఫ్లాయిడ్... నాలుగో రౌండ్లో అహెమౌద్ ఆర్బెరీ... క్వార్టర్ ఫైనల్లో ట్రెవన్ మార్టిన్... సెమీఫైనల్లో ఫిలాండో క్యాజిల్ బాధితుల పేర్లు రాసి ఉన్న మాస్క్‌లు ధరించిన ఒసాకా... ఫైనల్లో మాత్రం 2014లో క్లీవ్‌లాండ్‌లో పోలీసుల చేతుల్లో చనిపోయిన 12 ఏళ్ల బాలుడు తామిర్ రైస్‌కు నివాళిగా మాస్క్‌ను ధరించింది. తమను వీడి వెళ్లిపోయిన వారిని ఒసాకా మరోసారి గుర్తు చేసిందని ఈ సందర్భంగా ఆయా బాధితుల తల్లిదండ్రులు జపాన్ క్రీడాకారిణిని అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. నయోమి ఒసాకా తల్లి తమాకి జపాన్ దేశస్థురాలు కాగా తండ్రి లెనార్డ్ ఫ్రాన్సువా హైతీ దేశానికి చెందిన వ్యక్తి. ఒసాకా చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలో నివాసం ఉంటున్నా నయోమి జపాన్ పౌరసత్వం కలిగి ఉంది. తనను అమెరికన్‌గా కాకుండా జపనీయురాలిగానే గుర్తించాలని నయోమి కోరుకుంటోంది. ‘గొప్ప క్రీడాకారులందరూ ఫైనల్లో గెలిచిన వెంటనే కోర్టులో పడిపోయి ఆకాశంవైపు ఎందుకు చూసేవారో ఆలోచించేదాన్ని. వాళ్లకేమి కనిపించేదో తెలుసుకోవాలని గెలిచిన వెంటనే నేనూ అలాగే చేశాను. ఈ టోర్నీ కోసం చాలా కష్టపడ్డాను. శ్రమకు తగ్గ ఫలితం ఎందుకు రాకూడదో ప్రయత్నించి సఫలమయ్యాను. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్లో వెనుకబడిన దశలో ఆందోళన చెందకుండా ఒక్కో పాయింట్ గురించి ఆలోచించాను. నేనిక్కడ ఒక లక్ష్యంతో వచ్చాను. ఫైనల్‌కు వచ్చినందుకు 1–6, 0–6తో ఓడిపోయి ఇంటికి వెళ్లకూడదని అనుకున్నాను.’ – నయోమి ఒసాకా ► 3 ఆసియా నుంచి మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్ (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) నయోమి ఒసాకా. నా లీ (చైనా) రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గింది. ► 1 మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1975లో ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక టాప్–20 క్రీడాకారిణులను ఎదుర్కోకుండా యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణి ఒసాకానే. ► 5 తమ కెరీర్లో ఫైనల్ చేరుకున్న తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ గెలిచిన ఐదో క్రీడాకారిణి ఒసాకా. మోనికా సెలెస్ అయితే వరుసగా ఆరు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. ► 3 యూఎస్ ఓపెన్ ఫైనల్లో అత్యధికంగా మూడుసార్లు ఓడిపోయిన రెండో క్రీడాకారిణి అజరెంకా. ఇవాన్ గూలాగాంగ్ (ఆస్ట్రేలియా) అత్యధికంగా నాలుగు యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయింది. -
బిల్లింగ్స్ సెంచరీ వృథా
మాంచెస్టర్: చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న ఇంగ్లండ్‌కు వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం లభించలేదు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి వన్డేలో ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 295 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసి పరాజయం పాలైంది. జేసన్ రాయ్ (3), జో రూట్ (1), బట్లర్ (1), మొయిన్ అలీ (6) విఫలమయ్యారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ స్యామ్ బిల్లింగ్స్ (110 బంతుల్లో 118; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ... ఓపెనర్ బెయిర్‌స్టో (107 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఇన్నింగ్స్ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాయి. బిల్లింగ్స్‌తో కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించాక బెయిర్‌స్టో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ బిల్లింగ్స్‌కు సహకరించడంలో విఫలమయ్యారు. దాంతో ఇంగ్లండ్‌కు ఓటమి ఖాయమైంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు జాతీయ అవార్డులు
శంషాబాద్: ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి. 2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ జాతీయ అవార్డుల్లో భాగంగా ‘నేషనల్ ఎనర్జీ లీడర్’అవార్డుతో పాటు ‘ఎక్స్లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్’అవార్డును పొందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లుగా శంషాబాద్ విమానాశ్రయం ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా 4.55 మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసింది. హైదరాబాద్ విమానాశ్రయం ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో అవార్డులు పొందిందని, తమ పనితీరుకు అవార్డులు కొలమానమని జీహెచ్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ అన్నారు. -
హామిల్టన్ ‘హ్యాట్రిక్’
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): సొంతగడ్డపై దుమ్మురేపిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని నాలుగో రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నిర్ణీత 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, ముందుగా గంటా 28 నిమిషాల 01.283 సెకన్లలో ముగించాడు. తద్వారా రికార్డుస్థాయిలో ఏడోసారి (2008, 2014, 2015, 2016, 2017, 2019, 2020) బ్రిటిష్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రేసు మరో ల్యాప్‌లో ముగుస్తుందనగా హామిల్టన్ కారు టైరు పంక్చర్ కావడం గమనార్హం. పంక్చర్ టైరుతోనే హామిల్టన్ రేసును పూర్తి చేశాడు. మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రేసింగ్ పాయింట్ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ రేసును ప్రారంభించలేదు. క్వియాట్ (అల్ఫా టౌరి) 11వ ల్యాప్‌లో, మాగ్నుసెన్ (హాస్) తొలి ల్యాప్‌లో వైదొలిగారు. ఈ గెలుపుతో సొంతగడ్డపై అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు సృష్టించాడు. ఈ రేసుకంటే ముందు ఫ్రాన్స్ డ్రైవర్ అలైన్ ప్రాస్ట్ (ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి–6 సార్లు)తో హామిల్టన్ సమఉజ్జీగా ఉన్నాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 87వ ఎఫ్1 టైటిల్. మరో నాలుగు టైటిల్స్ గెలిస్తే అత్యధిక ఎఫ్1 టైటిల్స్ నెగ్గిన మైకేల్ షుమాకర్ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేస్తాడు. సీజన్‌లోని ఐదో రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి వేదికపైనే ఈనెల 9న జరుగుతుంది. ఆస్ట్రియా, హంగేరి, బ్రిటిష్ గ్రాండ్‌ప్రి విజయాలతో హామిల్టన్ 88 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. -
హరికృష్ణకు మూడో విజయం
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్ క్లాసికల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఖాతాలో మూడో విజయం చేరింది. రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్)తో మంగళవారం స్విట్జర్లాండ్‌లో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 44 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేడు జరిగే ఏడో రౌండ్లో డేవిడ్ గిజారో (స్పెయిన్)తో హరికృష్ణ తలపడతాడు. -
హమిల్టన్ రికార్డు
బుడాపెస్ట్: ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్ దూసుకుపోతున్నాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ చాంపియన్‌గా నిలిచాడు. 70 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించి తన కెరీర్లో 86వ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 12.473 సెకన్లలో రేసును ముగించి విజేత అయ్యాడు. హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను ఎనిమిదో సారి నెగ్గిన హామిల్టన్ (2007, 09, 2012, 13, 16, 18, 19, 2020)... ఈ క్రమంలో ఒకే వేదికపై అత్యధిక రేసులు నెగ్గిన జర్మనీ దిగ్గజ రేసర్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. గతంలో షుమాకర్ ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిని ఎనిమిదిసార్లు గెలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఆగస్టు 2న జరుగుతుంది. హంగేరి గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 5. ఆల్బోన్ (రెడ్‌బుల్), 6. వెటెల్ (ఫెరారీ), 7. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 8. రికియార్డో (రెనౌ), 9. మాగ్నుసెన్ (హాస్), 10. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్). -
హామిల్టన్‌దే విజయం
స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): క్వాలిఫయింగ్ సెషన్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అద్భుతంగా రాణించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ప్రధాన రేసులోనూ అదే జోరు కొనసాగించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 71 ల్యాప్‌లను అందరికంటే ముందుగా గంటా 22 నిమిషాల 50.683 సెకన్లలో పూర్తి చేసి టైటిల్ గెలిచాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 85వ టైటిల్ కావడం విశేషం. జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ (91) పేరిట ఉన్న అత్యధిక ఎఫ్1 టైటిల్స్ రికార్డు సమం చేసేందుకు హామిల్టన్ మరో ఆరు విజయాల దూరంలో ఉన్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్లు వెటెల్, లెక్లెర్క్ తొలి ల్యాప్‌లోనే పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి నిష్క్రమించారు. సీజన్‌లోని మూడో రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది. ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10) 1. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), 2. వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. ఆల్బోన్ (రెడ్‌బుల్), 5. నోరిస్ (మెక్లారెన్), 6. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 7. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 8. రికియార్డో (రెనౌ), 9. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 10. డానియల్ క్వియాట్ (అల్ఫాటౌరి). -
వావ్ విండీస్...
కరోనా మహమ్మారిని ఏమార్చి ఎట్టకేలకు ప్రపంచానికి ‘ప్రత్యక్ష’ంగా’ క్రికెట్ చూపించిన ఇంగ్లండ్‌లో అంచనాలకు మించి రాణించిన వెస్టిండీస్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. ఆఖరి రోజు మొదట ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ రసవత్తరానికి తెరలేపినా... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జెర్మయిన్ బ్లాక్‌వుడ్ పోరాటం చివరకు విండీస్‌నే విజయం వరించేలా చేసింది. దీంతో ఆట ఆరంభం మినహా మ్యాచ్ ముగిసేదాకా ఎలాంటి నాటకీయత లేకుండా తొలి టెస్టులో వెస్టిండీస్ విజయబావుటా ఎగరేసింది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్లు తీసిన విండీస్ బౌలర్ గాబ్రియెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో విండీస్ మూడు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సిరీస్‌లోని రెండో టెస్టు ఈనెల 16 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది. సౌతాంప్టన్: తొలి టెస్టులో మొదటి రోజు మినహా ప్రతీ రోజూ పైచేయి సాధించిన వెస్టిండీసే విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 64.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఆర్చర్ (3/45) దెబ్బకు ఆఖరి మజిలీ రసవత్తరం అవుతుందనుకుంటే... జెర్మయిన్ బ్లాక్‌వుడ్ (154 బంతుల్లో 95; 12 ఫోర్లు) ఆ అవకాశమివ్వలేదు. చేజ్, డౌరిచ్‌లతో కలిసి రెండు విలువైన భాగస్వామ్యాలతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో అతను ఔటైనా... రిటైర్డ్‌హర్ట్ అయిన ఓపెనర్ క్యాంప్‌బెల్ తిరిగొచ్చి ఆ లాంఛనం కానియ్యడంతో సిరీస్‌కు ఫలితంతో ముందడుగు పడింది. పేలవమైన ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుంది. విండీస్ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన బ్లాక్‌వుడ్ వ్యక్తిగత స్కోరు 5, 20, 29 పరుగులవద్ద ఉన్నపుడు ఇచ్చిన క్యాచ్‌లను ఇంగ్లండ్ ఫీల్డర్లు జారవిడిచారు. లేదంటే తుది ఫలితం మరోలా ఉండేదేమో! ఆట చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 284/8తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 29 పరుగులు జోడించి 313 పరుగుల వద్ద ఆలౌటైంది. విండీస్‌కు 200 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఆర్చర్ (23; 4 ఫోర్లు), మార్క్‌వుడ్ (2) ఇద్దరినీ గాబ్రియెలే ఔట్ చేశాడు. దీంతో అతనికి ఈ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు దక్కాయి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో అతను 9 వికెట్లు పడగొట్టాడు. ఆర్చర్ అదరగొట్టినా... వెస్టిండీస్ విజయలక్ష్యం సరిగ్గా 200 పరుగులు. ఇదేమీ భారీ లక్ష్యం కాదు. విండీస్‌కు అసాధ్యమైందీ కాదు. కానీ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ టాపార్డర్‌పై నిప్పులు చెరిగాడు. తన వరుస ఓవర్లలో బ్రాత్‌వైట్ (4)ను క్లీన్‌బౌల్డ్... బ్రూక్స్ (0)ను డకౌట్ చేశాడు. 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన విండీస్‌పై మార్క్‌వుడ్ మరో దెబ్బ వేశాడు. హోప్ (9)ను సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేర్చాడు. విండీస్ స్కోరు 27/3. ఓపెనర్ క్యాంప్‌బెల్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో టెస్టుపై రస‘పట్టు’ పెంచుకునే పనిలో స్టోక్స్ బృందం నిమగ్నమైంది. లక్ష్యం చిన్నదైనా ఆట రసకందాయంలో పడింది. పరుగు... పరుగు పేర్చుతూ... లంచ్ బ్రేక్ స్కోరు 35/3 కష్టాల్లో పడేయడంతో క్రీజులో ఉన్న చేజ్ (88 బంతుల్లో 37; 1 ఫోర్), బ్లాక్వుడ్లకు పరిస్థితి అర్థమైంది. లక్ష్యం చేరాలంటే వికెట్ల నిర్లక్ష్యం తగదని భావించారు. బాధ్యతగా పరుగు పరుగు పేర్చారు. అంతకంటే ముందు ఎవరూ పట్టుమని పది పరుగులైనా చేయకుండానే పెవిలియన్‌లో కూర్చుకున్నారు. కానీ వీరిద్దరు కలిసి జట్టు స్కోరును 100 పరుగులకు తీసుకెళ్లారు. అయితే అదేస్కోరు వద్ద ఆర్చర్... చేజ్‌ను ఔట్ చేశాడు 73 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అయినా నిరాశ చెందకుండా లక్ష్యంపైనే గురిపెట్టిన బ్లాక్‌వుడ్ కీపర్ డౌరిచ్‌ను జత చేసుకున్నాడు. తను అర్ధసెంచరీ పూర్తిచేశాడు. ఈ జోడీ నిలబడటంతో రెండో సెషన్ స్కోరు 143/4 జట్టులో విశ్వాసాన్ని పెంచింది. కలవరమైనా... డౌరిచ్ (37 బంతుల్లో 20; 1 ఫోర్) చేసింది తక్కువ స్కోరే. కానీ బ్లాక్‌వుడ్‌తో కలిసి జతచేసింది విలువైన భాగస్వామ్యం. ఇద్దరు ఐదో వికెట్‌కు 68 పరుగులు జోడించాక డౌరిచ్‌ను స్టోక్స్ ఔట్ చేశాడు. అదే స్టోక్స్ కాసేపయ్యాక సెంచరీకి చేరువవుతున్న బ్లాక్‌వుడ్ ‘షో’ను ముగించేశాడు. అప్పటికి వెస్టిండీస్ స్కోరు 189/6. గెలుపు వాకిట కొంత కలవరపాటుకు గురైనా... ఓపెనర్ క్యాంప్‌బెల్ (8 నాటౌట్; 1 ఫోర్) తిరిగి క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ హోల్డర్ (14 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి కంగారు పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశాడు. గత 20 ఏళ్లలో ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం వెస్టిండీస్కిది మూడోసారి మాత్రమే. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై వెస్టిండీస్కిది 58వ టెస్టు విజయం. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 204; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 318; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 313 వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (బి) ఆర్చర్ 4; క్యాంప్‌బెల్ (నాటౌట్) 8; హోప్ (బి) వుడ్ 9; బ్రూక్స్ (ఎల్బీ) (బి) ఆర్చర్ 0; చేజ్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 37; బ్లాక్‌వుడ్ (సి) అండర్సన్ (బి) స్టోక్స్ 95; డౌరిచ్ (సి) బట్లర్ (బి) స్టోక్స్ 20; హోల్టర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (64.2 ఓవర్లలో ఆరు వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–27, 4–100, 5–168, 6–189. బౌలింగ్: అండర్సన్ 15–3–42–0; ఆర్చర్ 17– 3–45–3; వుడ్ 12–0–36–1; బెస్ 10–2–31–0; స్టోక్స్ 10.2–1–39–2. -
వెస్టిండీస్‌దే టి20 సిరీస్
పల్లెకెలె (శ్రీలంక): శ్రీలంకతో జరిగిన రెండో టి20లో వెస్టిండీస్ 7 వికెట్లతో నెగ్గింది. దాంతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. వన్డేల్లో 0–3తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. శుక్రవారం ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. దసున్ శనక (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు 17 ఓవరల్లో మూడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలుపొందింది. బ్రాండన్ కింగ్ (21 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (42 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), రసెల్ (14 బంతుల్లో 40 నాటౌట్; 6 సిక్స్‌లు) రాణించారు. ముఖ్యంగా రసెల్ సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రసెల్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా విండీస్ మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే గెలుపొందింది. -
భారత్‌ను గెలిపించిన పూనమ్
బ్రిస్బేన్: టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. శిఖా పాండే (16 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, దీప్తి శర్మ (21) మోస్తరు స్కోరు సాధించింది. అనంతరం విండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేయగలిగింది. లీ ఆన్ కిర్బీ (41 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హేలీ మాథ్యూస్ (25) రాణించారు. పూనమ్ యాదవ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ చివరి ఓవర్లోనే పూనమ్ 2 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించింది. -
భారత మహిళల శుభారంభం
కాన్బెర్రా: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు విజయంతో బోణీ చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ హీతర్ నైట్ (44 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, ట్యామీ బీమాంట్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, శిఖా పాండే తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ షఫాలీ వర్మ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు నిలిచి గెలిపించింది. ఆఖరి 4 బంతుల్లో విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా భారీ సిక్సర్‌తో హర్మన్ మ్యాచ్ ముగించింది. -
నాదల్‌దే పైచేయి
మెల్బోర్న్: మైదానం బయట తరచూ తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసే ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిరియోస్తో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రాఫెల్ నాదల్ పైచేయి సాధించాడు. 3 గంటల 38 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6–3, 3–6, 7–6 (8/6), 7–6 (7/4)తో 23వ సీడ్ కిరియోస్‌ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నాదల్ డజన్ ఏస్‌లు సంధించి 64 విన్నర్స్ కొట్టాడు. తాజా విజయంతో కిరియోస్తో ముఖాముఖి రికార్డులో నాదల్ 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో థీమ్ 6–2, 6–4, 6–4తో పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై, ఏడోసీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4, 6–4తో 17వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, 15వ సీడ్, మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–2, 2–6, 4–6, 7–6 (7/2), 6–2తో నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించారు. కెర్బర్ ఓటమి... మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ హలెప్ 6–4, 6–4తో మెర్టెన్స్ (బెల్జియం)పై.. ముగురుజా 6–3, 6–3తో తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై... పావ్లీచెంకోవా 6–7 (5/7), 7–6 (7/4), 6–2తో 2016 చాంపియన్ కెర్బర్ (జర్మనీ)పై... కొంటావీట్ 6–7 (4/7), 7–5, 7–5తో ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై గెలుపొందారు. -
ఇంగ్లండ్‌దే మూడో టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో నెగ్గింది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 102/6తో చివరి రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 26.5 ఓవర్ల పాటు ఆడి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. కేశవ్ మహరాజ్ (71; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), 11వ నంబర్ ఆటగాడు ప్యాటర్సన్ (39; 6 ఫోర్లు) పదో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. రూట్ వేసిన 82వ ఓవర్లో కేశవ్ మహరాజ్ 4,4,4,6,6 బాదడంతో మొత్తం 28 పరుగులు (4 బైస్) వచ్చాయి. తద్వారా టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధికంగా 28 పరుగులు ఇచ్చిన మూడో బౌలర్‌గా రూట్ గుర్తింపు పొందాడు. గతంలో పీటర్సన్ (దక్షిణాఫ్రికా), అండర్సన్ (ఇంగ్లండ్) కూడా 28 పరుగులు చొప్పున ఇచ్చారు. -
న్యూజిలాండ్‌దే టెస్టు సిరీస్
హామిల్టన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ 1–0తో సొంతం చేసుకుంది. మంగళవారం ముగిసిన రెండో టెస్టులో చివరి రోజు కివీస్ బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ (234 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు), రాస్ టేలర్ (186 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకాలతో కదంతొక్కారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసి 140 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వాన ఎంతకీ తగ్గకపోవడంతో ఆటను ముగించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ రూట్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు నెగ్గగా... కివీస్ పేసర్ నీల్ వాగ్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది. కివీస్‌కు ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డు న్యూజిలాండ్ జట్టుకు ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డు దక్కింది. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. ‘సూపర్ ఓవర్’దాకా ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో సమఉజ్జీగా నిలిచిన న్యూజిలాండ్... బౌండరీల లెక్కల్లో వెనుకబడి ఓడింది. అయితే ఆ టోర్నీలో కేన్ విలియమ్సన్ సేన చూపిన హుందాతనం అందరి మనసుల్ని గెలుచుకుంది. ఫైనల్లో క్షణానికోసారి పైచేయి మారుతున్నా... స్టోక్స్ (ఇంగ్లండ్) బ్యాట్‌ను తాకుతూ ఓవర్ త్రో బౌండరీ వెళ్లినా... అంపైర్ అదనపు పరుగు ఇచ్చినా... కివీస్ ఆటగాళ్లు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) న్యూజిలాండ్ జట్టును ‘క్రిస్టోఫర్ మార్టిన్–జెన్కిన్స్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన రెండో టెస్టు ‘డ్రా’గా ముగియగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ), బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్లు ఉమ్మడిగా స్పిరిట్ అవార్డును కివీస్ జట్టుకు అందజేశారు. విలియమ్సన్, టేలర్ -
అఫ్గాన్‌పై విండీస్ విజయం
లక్నో: అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో వెస్టిండీస్ 9 వికెట్లతో నెగ్గింది. విండీస్ స్పిన్నర్ కార్న్‌వాల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు మూడే రోజుల్లో ముగిసింది. 109/7 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకు ఆలౌటైంది. తర్వాత 31 పరుగుల లక్ష్యాన్ని విండీస్ వికెట్ కోల్పోయి ఛేదించింది. -
రెండు గేమ్‌లే కోల్పోయి...రెండింటిలోనూ గెలిచి...
ఊహించినట్టే జరిగింది. పేరుకు చిరకాల ప్రత్యర్థి అయినా... పాకిస్తాన్‌తో భారత టెన్నిస్ జట్టు ఓ ఆటాడుకుంది. కేవలం రెండంటే రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో 2–0తో ఆధిక్యం సంపాదించింది. నేడు రెండు రివర్స్ సింగిల్స్, ఒక డబుల్స్ మ్యాచ్ జరుగుతాయి. ఒక దాంట్లో భారత్ నెగ్గినా... వచ్చే ఏడాది మార్చిలో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌తో క్రొయేషియా జట్టుతో పోరుకు సిద్ధమవుతుంది. నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ఏమాత్రం అనుభవంలేని ఆటగాళ్లను పంపించిన పాకిస్తాన్ టెన్నిస్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనామకులైనప్పటికీ భారత యువ తారలు సహజశైలిలో ఆడి అలవోక విజయాలు అందుకున్నారు. ఫలితంగా పాకిస్తాన్‌తో తటస్థ వేదికపై శనివారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత్ 2–0తో ఆధిక్యాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 176వ ర్యాంకర్, 25 ఏళ్ల రామ్‌కుమార్ రామనాథన్ 6–0, 6–0తో 17 ఏళ్ల షోయబ్ మొహమ్మద్‌పై గెలిచాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఐదు ఏస్‌లు సంధించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఇంకా పేరు కూడా నమోదుకాని షోయబ్ రెండు సెట్లలోనూ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 131వ ర్యాంకర్, 22 ఏళ్ల సుమీత్ నాగల్ 6–0, 6–2తో 17 ఏళ్ల అబ్దుల్ హుజైఫా రెహ్మాన్‌పై గెలిచాడు. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సుమీత్ రెండో సెట్లో రెండు గేమ్‌లను కోల్పోయాడు. మూడో మ్యాచ్‌గా నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లియాండర్ పేస్–జీవన్ నెడుంజెళియన్ జోడీ అబ్దుల్ హుజైఫా రెహ్మాన్–షోయబ్ మొహమ్మద్ జంటతో ఆడుతుంది. -
నవ్య ‘డబుల్’
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కందేరి నవ్య సింగపూర్ యూత్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నమెంట్లో రెండు విభాగాల్లో విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. సింగపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో చిత్తూరు జిల్లాకు చెందిన నవ్య అండర్–13 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ గెల్చుకుంది. సింగిల్స్ ఫైనల్లో నవ్య 21–8, 21–13తో నాలుగో సీడ్ నిసా అలిఫెనియా తానెవగస్తిన్ (ఇండోనేసియా)పై నెగ్గగా... డబుల్స్ ఫైనల్లో నవ్య–వలిశెట్టి శ్రియాన్షి (భారత్) ద్వయం 21–18, 17–21, 21–16తో సుకిత్త సువచాయ్–నారద ఉడోర్న్‌పిమ్ (థాయ్‌లాండ్) జంటను ఓడించింది. మరోవైపు ఇదే టోర్నీ బాలుర అండర్–15, అండర్–13 డబుల్స్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాళ్లు కలగోట్ల లోకేశ్ రెడ్డి, తీగల సాయిప్రసాద్, నాగలింగ ప్రణవ్ రామ్ టైటిల్స్ గెలిచారు. అండర్–15 బాలుర డబుల్స్ ఫైనల్లో లోకేశ్ రెడ్డి–అంకిత్ మోండల్ (బెంగాల్) ద్వయం 25–23, 4–21, 21–18తో రెండో సీడ్ జొనాథన్ గొసాల్–అడ్రియన్ ప్రతమ (ఇండోనేసియా) జంటపై... అండర్–13 బాలుర డబుల్స్ ఫైనల్లో సాయిప్రసాద్–ప్రణవ్ రామ్ జోడీ 21–11, 21–16తో చౌ యు సియాంగ్–ఫాన్ వాన్ చున్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించాయి. -
న్యూజిలాండ్ ఘన విజయం
మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన న్యూజిలాండ్ తొలి టెస్టులో ఇన్నింగ్స్, 65 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా డబుల్ సెంచరీ హీరో వాట్లింగ్ నిలిచాడు. చివరి రోజు తన బౌలింగ్‌తో వాగ్నర్ ( 5/44) ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు. ‘డ్రా’ చేసుకోవాలంటే రోజు మొత్తం ఆడాల్సిన ఇంగ్లండ్... ఓవర్‌నైట్ స్కోర్ 55/3తో చివరి రోజు ఆటను ఆరంభించింది. వాగ్నర్ ధాటికి నిలువలేకపోయిన ఇంగ్లండ్ 96.2 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. రూట్ (11), స్టోక్స్ (28), బట్లర్ (0) నిరాశ పరిచారు. అయితే స్యామ్ కరన్ (59 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు), జోఫ్రా ఆర్చర్ (50 బంతుల్లో 30; 5 ఫోర్లు) న్యూజిలాండ్ విజయాన్ని కాసేపు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరు తొమ్మిదో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ సమయంలో బంతిని అందుకున్న వాగ్నర్ వరుస బంతుల్లో ఆర్చర్, బ్రాడ్‌లను అవుట్ చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ మ్యాచ్‌లో కొందరు ప్రేక్షకులు తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని ఇంగ్లండ్ బౌలర్ ఆర్చర్ ఆరోపించగా... ఈ సంఘటనపై అతనికి క్షమాపణలు చెబుతామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. -
ఐదు టెస్టులూ అదరహో...
స్వదేశంలో భారత్ టెస్టు సీజన్ ముగిసింది. సాధారణంగా 10–12 టెస్టులు ఉండే ‘హోం సీజన్’లో ఐదు టెస్టులంటే చాలా తక్కువ. కానీ రెండు నెలల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మ్యాచుల్లోనూ భారత్ సాధించిన ఏకపక్ష విజయాలు సొంతగడ్డపై మన బలమేమిటో మళ్లీ చూపించాయి. ఇందులో నాలుగు ఇన్నింగ్స్ విజయాలు కాగా, మరో మ్యాచ్ 203 పరుగుల తేడాతో గెలవడం కోహ్లి సేన సత్తాకు నిదర్శనం. టీమిండియా దెబ్బకు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు బెంబేలెత్తిపోయాయి. మన ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగిపోవడంతో జట్టుకు ఎదురులేకుండా పోయింది. భారత్ వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ గడ్డపై తమ తర్వాతి టెస్టు ఆడనుండగా... 2021 వరకు స్వదేశంలో టెస్టులు ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలి ఐదు టెస్టుల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కొన్ని అంశాల్లో భారత ప్రదర్శనను విశ్లేషిస్తే... పేస్ బౌలర్ల హవా... స్వదేశంలో భారత స్పిన్నర్లకంటే పేసర్లు అద్భుతంగా ఆడి గెలిపించడం అరుదైన విషయం. కానీ అదిప్పుడు రొటీన్‌గా మారిపోయినట్లు అనిపిస్తోంది. హోం సీజన్లో ఉమేశ్ యాదవ్ 23, షమీ 22 వికెట్లు, ఇషాంత్ 14 వికెట్లు చొప్పున పడగొట్టారు. స్పిన్నర్లందరూ కలిపి 37 వికెట్లు తీస్తే ముగ్గురు పేసర్లు కలిపి తీసినవి 59 వికెట్లు కావడం విశేషం. అందులోనూ మరో ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఇది సాధ్యమైంది. బుమ్రా కూడా అందుబాటులో ఉండి ఉంటే తాజా ఫామ్ ప్రకారం సొంతగడ్డపై కూడా కోహ్లి నలుగురు పేసర్లతోనే ఆడేవాడేమో! స్పిన్నర్ ఒక్క వికెట్ కూడా తీయకుండానే స్వదేశంలో తొలిసారి టెస్టు గెలుపు అందుకోవడం మన పేస్ బౌలర్ల ప్రదర్శనను చూపిస్తోంది. జోరు తగ్గిన స్పిన్నర్లు... సుదీర్ఘ కాలంగా భారత ప్రధాన స్పిన్నర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్‌కు ఈ ఏడాది వెస్టిండీస్‌లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. అయితే స్వదేశానికి వచ్చేసరికి మాత్రం అతను ఐదు టెస్టుల్లోనూ భాగమయ్యాడు. 20 వికెట్లు పడగొట్టిన అశ్విన్ అనుభవం కీలక సమయాల్లో జట్టుకు పనికొచ్చింది. మరో స్పిన్నర్ జడేజా బ్యాటింగ్‌లో అదరగొట్టినా అసలు పని విషయంలో మాత్రం విఫలమయ్యాడు. 36.07 సగటుతో అతను 13 వికెట్లు తీశాడు. జట్టులో అతనికి ఉన్న స్థానంతో పోలిస్తే ఇది పేలవ ప్రదర్శనే. స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్ ఉంటే తప్ప జడేజా రాణించలేడనే విమర్శలకు ఇది మళ్లీ తెర తీసింది. ఇక మూడో స్పిన్నర్‌గా జట్టులో ఉన్న కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. సాహా వహ్వా... వికెట్ కీపర్‌గా 35 ఏళ్ల సాహాను ఎంపిక చేయడమా... లేక 22 ఏళ్ల రిషభ్ పంత్‌ను ప్రోత్సహించడమా అన్న సందేహంలో ఉన్న టీమ్ మేనేజ్మెంట్కు ఈ ఐదు మ్యాచుల్లో సరైన సమాధానం లభించింది. టెస్టులకు సాహానే సరైన వాడంటూ నిరూపణ అయింది. గాయం నుంచి తిరిగొచ్చిన తర్వాత సాహా సూపర్‌గా కీపింగ్ చేశాడు. వికెట్ల వెనక అతని చురుకుదనం, పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు సాహా సత్తాను చూపించాయి. ముఖ్యంగా పింక్‌బాల్ టెస్టులో అతని కదలికలు చాలా బాగున్నాయి. మరోవైపు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో వైఫల్యాల ప్రభావం పడటంతో పంత్‌కు ఒక్క టెస్టు ఆడే అవకాశం కూడా రాలేదు. కివీస్ గడ్డపై సులువు కాదు... బౌల్ట్, సౌతీ, వాగ్నర్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్... ఈ బౌలింగ్ బలగాన్ని ఎదుర్కోవడం భారత్‌కు పెద్ద సవాల్వంటింది. మన పేస్ బౌలింగ్ దళం కూడా చాలా బాగున్నా బ్యాటింగ్ విషయంలో భారత్ శ్రమించాల్సిందే. స్వింగ్‌కు బాగా అనుకూలించే పరిస్థితుల్లో దూసుకొచ్చే బంతులను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఎంతో పట్టుదల కనబర్చాల్సి ఉంటుంది. స్వదేశంలో పరుగుల వరద పారించిన భారత ఓపెనర్లకు కివీస్ వాతావరణంలో ఇబ్బందులు తప్పవు. గతంలో అత్యుత్తమ భారత జట్లు కూడా న్యూజిలాండ్‌లో తడబడ్డాయి. భారత్‌లాగే స్వదేశంలో బలమైన జట్టయిన న్యూజిలాండ్ 2017 నుంచి సొంతగడ్డపై టెస్టు ఓడిపోలేదు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటే చాలు కివీస్ బౌలర్లు మ్యాచ్ మలుపు తిప్పేయగలరు. తాజా ఓటమితో ఇంగ్లండ్‌కు కూడా ఇది అర్థమైంది. వచ్చే ఏడాదిలో జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ టూర్లో భారత్ 5 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్‌లలో భారత్ టెస్టు మ్యాచుల్లో తలపడుతుంది. వెల్లింగ్టన్లో భారత్ 7 టెస్టులు ఆడింది. కేవలం ఒక టెస్టులో గెలిచి (1968లో), నాలుగింటిలో ఓడింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిశాయి. క్రైస్ట్‌చర్చ్‌లో భారత్ 4 టెస్టులు ఆడింది. రెండింటిలో ఓడిపోయి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. సూపర్ ఓపెనింగ్... గత రెండేళ్ళలో విదేశాల్లోనే ఎక్కువ టెస్టులు ఆడిన భారత్‌కు ఓపెనర్ల వైఫల్యం పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే ఇప్పుడు హోం సీజన్ కొత్త దారులు తెరచింది. ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్య అవకాశం దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ తాజా ప్రదర్శన తర్వాత నంబర్–1 ఓపెనర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. ఐదు టెస్టుల్లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీతో అతను అదరగొట్టాడు. ఇక రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్టుల్లో మిడిలార్డర్లోనే చెప్పుకోదగ్గ రికార్డు లేని అతను తొలిసారి ఓపెనర్‌గా దిగి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఒకే టెస్టులో రెండు సెంచరీలు, మరో టెస్టులో డబుల్ సెంచరీతో తన స్థాయిని ప్రదర్శించాడు. ఈ సీజన్ వరకైతే మన ఓపెనర్ల ప్రదర్శన తిరుగులేని విధంగా సాగింది. క్యాచింగ్ వైఫల్యం... వరుస విజయాల్లో భారత్‌ను కొంత ఇబ్బంది పెట్టిన అంశం ఇది. ఐదు టెస్టుల్లో కలిపి భారత ఆటగాళ్లు ఏకంగా 14 క్యాచ్‌లు వదిలేశారు. ఇందులో సగం అతి సులువైనవి కాగా, మిగిలినవి కొంత కష్టంతోనైనా అందుకోగలిగేవే! పేసర్లు చెలరేగుతున్న సమయంలో స్లిప్ క్యాచ్‌లే కీలకంగా మారుతాయి. దీనిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. -
50 చేసినా... మనమే గెలిచాం
ప్రావిడెన్స్ (గయానా): విండీస్ గడ్డపై భారత్ మహిళల జట్టు విజయగర్జన కొనసాగుతోంది. ఇప్పటికే ఎదురులేని విజయాలతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ నాలుగో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టును కంగుతినిపించింది. చిత్రంగా కేవలం 50 పరుగులే చేసినా... ప్రపంచ చాంపియన్ జట్టుపై టీమిండియా గెలుపొందడం విశేషం. వర్షంతో ఈ 20 ఓవర్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 9 ఓవర్లలో 7 వికెట్లకు 50 పరుగులు చేసింది. పూజ పది పరుగులే టాప్ స్కోర్! హేలీ మాథ్యూస్ 3, అఫీ, షెనెటా చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన విండీస్ 5 పరుగుల దూరంలో నిలిచింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్లకు 45 పరుగులే చేయగలిగింది. హేలీ 11, హెన్రీ 11, మెక్లీన్ 10 పరుగులు చేశారు. విండీస్ గెలిచేందుకు చివరి 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా... అనూజ వేసిన ఆఖరి ఓవర్లో విండీస్ 7 పరుగులే చేసి 2 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో అనూజ పాటిల్ (2/8) రెండు వికెట్లు తీయగా... దీప్తి శర్మ (1/8), రాధా యాదవ్(1/8)లకు ఒక్కో వికెట్ దక్కింది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4–0తో ఆధిక్యంలో ఉన్న భారత్... గురువారం ఆఖరి మ్యాచ్‌ను ఇదే వేదికపై ఆడనుంది. -
వెస్టిండీస్ క్లీన్‌స్వీప్
లక్నో: అఫ్గానిస్తాన్‌తోజరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా అఫ్గాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అస్గర్ అఫ్గాన్ (85 బంతుల్లో 86; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (59 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ నబీ (66 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. కీమో పాల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం విండీస్ 48.4 ఓవర్లలో 5 వికెట్లకు 253 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షై హోప్ (145 బంతుల్లో 109 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్), కింగ్ (39), పొలార్డ్ (32) రాణించారు. ఛేజ్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఇదే మైదానంలో గురువారం నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. -
సూపర్ షఫాలీ
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): టీనేజ్ క్రికెటర్ షఫాలీ వర్మ (35 బంతుల్లో 69 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మళ్లీ మెరిసింది. వరుసగా రెండో టి20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టింది. ఫలితంగా ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పై భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో టి20 మ్యాచ్‌లో భారత మహిళలు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 103 పరుగులు చేసింది. షెడీన్ నేషన్ (32; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... భారత స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 4 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. 104 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన (28 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడైన ఆటకు భారత్ 10.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. విండీస్‌పై తొలి టి20లోనూ షఫాలీ వర్మ (49 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసిన సంగతి విదితమే. మూడో టి20 మ్యాచ్ ఈనెల 14న గయానాలో జరుగుతుంది. -
ఆసీస్ గెలిచేదాకా... స్మిత్ ధనాధన్
కాన్బెర్రా: స్టీవ్ స్మిత్ (51 బంతుల్లో 80 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆస్ట్రేలియా గెలిచేదాకా దంచేశాడు. దీంతో రెండో టి20లో కంగారూ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇఫ్తెకార్ అహ్మద్ (34 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (38 బంతుల్లో 50; 6 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్ అగర్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ (20), ఫించ్ (17) జట్టు స్కోరు 50 పరుగులలోపే నిష్క్రమించగా... స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని దూకుడు జట్టు గెలిచేదాకా అడ్డుఅదుపు లేకుండా సాగింది. స్మిత్, మెక్‌డెర్మట్ (21)తో కలిసి మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టి20 వర్షంతో రద్దవగా... ఆసీస్ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్ 8న పెర్త్‌లో జరుగుతుంది. -
తప్పటడుగులతో కుప్పకూలిన ఇంగ్లండ్
నెల్సన్: ఇంగ్లండ్ లక్ష్యం 181 పరుగులు. 15వ ఓవర్ పూర్తవకముందే 139/2 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. 5.1 ఓవర్లలో అంటే 31 బంతుల్లో 42 పరుగులే చేస్తే గెలిచేది! పొట్టి ఫార్మాట్లో ఇది సులువైన విజయ సమీకరణం. మరో 8 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లండ్‌కు ఇది ఇంకా ఇంకా సులువైన లక్ష్యం. కానీ విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచి అనూహ్యంగా ఓడింది. 10 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు తీసిన న్యూజిలాండ్ గెలుపు మలుపు తీసుకుంది. నాటకీయంగా ముగిసిన మూడో టి20లో కివీస్ 14 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ (35 బంతుల్లో 55; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), గప్టిల్ (17 బంతుల్లో 33; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. రాస్ టేలర్ 27, నీషమ్ 20 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ స్యామ్ కరన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేయగలిగింది. మలాన్ (34 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), విన్స్ (39 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు చకచకా 63 పరుగులు జతచేశారు. అయితే 15వ ఓవర్ వేసిన సాన్‌ట్నర్ ఆఖరి బంతికి కెప్టెన్ మోర్గాన్ (18)ను ఔట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తర్వాత వచ్చిన బిల్లింగ్స్ (1) రనౌట్ కావడం, క్రీజ్‌లో పాతుకుపోయిన విన్స్‌తో పాటు కరన్ (2), గ్రెగరీ (0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ (2/25), టిక్నెర్ (2/25) రాణించారు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టి20 మ్యాచ్ 8న నేపియర్‌లో జరుగుతుంది. -
వార్నర్ మళ్లీ మెరిసె...
మెల్బోర్న్: శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం చలాయించిన ఆస్ట్రేలియా టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఫించ్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక మరోసారి బ్యాటింగ్‌లో తడబడింది. కుశాల్ పెరీరా (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, సిక్స్) మినహా మిగతావారు విఫలమవ్వడంతో... శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసింది. 143 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వార్నర్ (50 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీతో మెరిశాడు. ఫించ్ (37; ఫోర్, 3 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులు జతచేశాడు. స్మిత్ (13), మెక్‌డెర్మట్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... టర్నర్ (22 నాటౌట్; 2 సిక్స్‌లు)తో కలిసి వార్నర్ జట్టును గెలిపిం చాడు. వార్నర్ తొలి మ్యాచ్ లో అజేయ సెంచరీ... రెండో మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీ.... మూడో మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచి సిరీస్‌లో 217 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం కూడా గెల్చుకున్నాడు. -
ఇంగ్లండ్ శుభారంభం
క్రైస్ట్‌చర్చ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో మోర్గాన్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 153 పరుగులు సాధించింది. రాస్ టేలర్ (35 బంతుల్లో 44; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ రెండు వికెట్లు తీయగా... స్యామ్ కరన్, రషీద్, బ్రౌన్‌లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జేమ్స్ విన్స్ (38 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (21 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), బెయిర్‌స్టో (35; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఆకట్టుకున్నారు. కివీస్ స్పిన్నర్ సాన్ట్నెర్ మూడు వికెట్లు తీశాడు. -
భారత మహిళలదే ఎమర్జింగ్ కప్
కొలంబో: ఆసియా కప్ మహిళల ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. శ్రీలంక మహిళల జట్టుతో మంగళవారం జరిగిన ఫైనల్లో దేవిక వైద్య నాయకత్వంలోని టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 14 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. తనుశ్రీ సర్కార్ (47; 4 ఫోర్లు), సిమ్రన్ బహదూర్ (34; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతితో శ్రీలంక లక్ష్యాన్ని 35 ఓవర్లలో 150 పరుగులుగా సవరించారు. శ్రీలంక 34.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో తనుజా కన్వర్ (4/15), దేవిక వైద్య (4/29) నాలుగేసి వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. -
భారత్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
బెంగుళూరు: మూడో టీ20లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోసుకోవాలనుకున్న టీమిండియాకు సఫారీలు షాకిచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 36, రిషభ్ పంత్ 19, రవీంద్ర జడేజా 19 టాప్ స్కోరర్లు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా కేవలం వికెట్ (రీజా హెన్రిక్స్ 28) మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ క్వింటన్ డీకాక్ 79 (6 బౌండరీలు, 5 సిక్సర్లు) తో విరుచుకుపడ్డాడు. అతనికి తోడు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బావుమా (27) చెలరేగడంతో పర్యాటక జట్టు మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా) తీసిన బ్యూరెన్ హెన్రిక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. క్వింటన్ డీకాక్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. -
తులసీ చైతన్యకు ఆరు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పోలీసు క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విజయవాడ స్విమ్మర్ తులసీ చైతన్య అద్భుత ప్రదర్శన చేశాడు. చైనాలోని చెంగ్డూలో జరిగిన ఈ క్రీడల్లో తులసీ చైతన్య ఒకస్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు సాధించాడు. విజయవాడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే తులసీ చైతన్య ట్రయాథ్లాన్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకం గెల్చుకోగా... 4్ఠ50 మిక్స్డ్ ఫ్రీస్టయిల్ రిలేలో, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజత పతకాలు సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీస్టయిల్, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 4్ఠ50 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో తులసీ చైతన్య కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు తులసీ చైతన్య మూడుసార్లు (2013, 2017, 2019) ప్రపంచ పోలీసు క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 20 పతకాలు సాధించాడు. -
హిమ దాస్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: భారత యువ మహిళా అథ్లెట్ హిమ దాస్ మరోసారి మెరిసింది. చెక్ రిపబ్లిక్లో జరిగిన అథ్లెటికీ మిటింక్ రీటెర్ మీట్లో 300 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. గత నెలన్నర వ్యవధిలో యూరోపియన్ సర్క్యూట్లో హిమ దాస్కిది ఆరో స్వర్ణం కావడం విశేషం. అయితే వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియ న్షిప్కు మాత్రం హిమ ఇంకా అర్హత సాధించలేదు. -
సూపర్ సిద్ధార్థ్
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ సత్తా చాటాడు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న హరియాణా స్టీలర్స్‌ను తన రైడ్లతో మట్టికరిపించాడు. మ్యాచ్‌లో సూపర్ ‘టెన్’ (మొత్తం 16 పాయింట్లు)తో అదరగొట్టాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 40–29తో హరియాణా స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసిన టైటాన్స్ ఈ లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30–30తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్లో ఇది ఐదో ‘టై’ కావడం విశేషం. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్, రాహుల్ చౌదరిలు చెరో 8 పాయింట్లతో రాణించారు. నేటి మ్యాచ్‌ల్లో యుముంబాతో హరియాణా స్టీలర్స్; యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
యూపీలో బీజేపీకి షాక్
గోరఖ్‌పూర్/ఫుల్పూర్/పట్నా: ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు యూపీలో రిహార్సల్‌గా భావించిన ఎన్నికల్లో కమలదళానికి కోలుకోలేని దెబ్బతగిలింది. 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్ పార్లమెంటు స్థానంతోపాటు, ఫుల్పూర్ ఎంపీ సీటుకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ కూటమి అఖండ విజయం సాధించింది. 20 ఏళ్లుగా ఉప్పు–నిప్పుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు చివరి నిమిషంలో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం బీజేపీని దారుణంగా ఓడించింది. గోరఖ్‌పూర్.. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట కావటం గమనార్హం. కాగా, ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. దీంతో లక్నోలో ‘భువా (అత్త), భతీజా (అల్లుడు) జిందాబాద్’ నినాదాలు మార్మోగాయి. అటు బిహార్‌లో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాను ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ 21వేల ఓట్లతో ఓడించారు. అటు ఫుల్పూర్లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ తొలి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థి కుశలేంద్రసింగ్పై ఆధిక్యాన్ని ప్రదర్శించారు. 59,613 ఓట్ల తేడాతో నాగేంద్ర ప్రతాప్ విజయం సాధించారు. మఠానికి ఎదురుదెబ్బ! లోక్‌సభ ఎన్నికల అనంతరం.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి యూపీ ప్రజలు పట్టంగట్టారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పార్టీ విజయం నల్లేరుపై నడకే అవుతుందని భావించినా.. అది బెడిసి కొట్టింది. 1989 నుంచి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠం ప్రధాన పూజారులే ఈ ఎంపీ స్థానాన్ని గెలుస్తూ వస్తున్నారు. అలాంటిది.. ఈ మఠం ప్రధాన పూజారిగా ఉన్న యోగి.. ప్రస్తుతం సీఎంగా ఉండగానే రికార్డు బద్దలై ఓటమిపాలవటం వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి ఇబ్బందికరమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారాన్ని యోగి అంతా తానై నడిపించారు. కేంద్రం నుంచి స్టార్ క్యాంపేనర్లు రాకుండానే బీజేపీ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులెవరూ ఈ రెండు స్థానాల్లో ప్రచారానికి వెళ్లలేదు. అటు, ఫుల్పూర్ స్థానం మొదటినుంచీ బీజేపీకి పెద్దగా పట్టులేని నియోజకవర్గమే. గతేడాది కేశవ్ ప్రసాద్ మౌర్య గెలిచినప్పటికీ.. మొదట్నుంచీ ఇక్కడ ఎస్పీ, బీఎస్పీలే గెలుస్తూ వస్తున్నాయి. కౌంటింగ్‌పై ఆందోళన కౌంటింగ్ ప్రారంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠతోపాటు గందరగోళం నెలకొంది. కౌంటింగ్ ప్రాంతానికి 15 అడుగుల దూరంలోనే మీడియాను ఆపేశారు. అంతటితో ఆగకుండా పరదాలు వేసి కౌంటింగ్ మీడియాకు కనబడకుండా చేశారు. అయితే ఈ విషయంపై పార్లమెంటుతోపాటు యూపీ అసెంబ్లీలో విపక్షాలు నిరసన చేపట్టడంతో ప్రభుత్వం, అధికారులు దిగొచ్చి మీడియాను లోపలకు అనుమతించారు. షాక్‌కు గురయ్యాం: బీజేపీ నేతలు తాజా ఫలితాలపై యూపీ బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గోరఖ్‌పూర్ మొదట్నుంచీ మా కంచుకోట. యోగి ఆదిత్యనాథ్ వరుసగా నాలుగుసార్లు ఇక్కడినుంచి విజయం సాధించారు. ఎస్పీ ఓడిపోయేదే.. కానీ బీఎస్పీతో దోస్తీ వారికి కలిసొచ్చింది. మేం ఎక్కడ విఫలమయ్యామో సమీక్షించుకుంటాం. మేం సంతృప్తి చెందాల్సిన ఫలితాలు కావివి. మేం కొత్త వ్యూహాలను అనుసరించాల్సిన అవసరముంది’ అని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. బిహార్‌లో ఆర్జేడీ, బీజేపీ విజయం: బిహార్‌లోని జెహనాబాద్, భబువా అసెంబ్లీ స్థానాలకు, అరారియా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. జెహనాబాద్‌లో ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ యాదవ్.. జేడీయూ అభ్యర్థిపై 35వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. భబువాలో బీజేపీ అభ్యర్థి రింకీరాణి పాండే గెలిచారు. ఇటీవలే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సర్ఫరాజ్ ఆలం.. బీజేపీ అభ్యర్థిపై 61,988 ఓట్ల తేడాతో గెలిచారు. తప్పుగా అంచనావేశాం: యోగి ఎస్పీ–బీఎస్పీ కూటమిని తక్కువగా అంచనా వేయటం వల్లే ఓటమిపాలయ్యామని యూపీ సీఎం యోగి పేర్కొన్నారు. ఈ ఓటమి బీజేపీకి ఓ గుణపాఠమన్నారు. ‘గోరఖ్‌పూర్, ఫుల్పూర్ల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. మితిమీరిన విశ్వాసం, ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రభావాన్ని అంచనావేయలేకపోవటమే మా ఓటమికి కారణం. విజేతలకు శుభాకాంక్షలు. బీఎస్పీ ఓటు.. ఎస్పీకి బదిలీ అవుతుందని అసలు ఊహించలేకపోయాం. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ–కాంగ్రెస్ కూటములు కలిసి పోటీచేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్నీ సమీక్షించుకుంటాం.2019లో మళ్లీ మెజారిటీ సీట్లు గెలిచేందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటాం’ అని యోగి వెల్లడించారు. బీజేపీ అహంకార ఫలితమిది: అఖిలేశ్ యూపీలోని రెండు పెద్ద లోక్‌సభ సీట్లను గెలుచుకోవటంపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ అహంకారపూరిత ప్రవర్తన, పరిపాలనపై అలక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ‘సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లోనే ప్రజాగ్రహం ఇలా ఉందంటే.. రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా పరిస్థితి ఏంటనేది ఊహించుకోవచ్చు’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. సంపూర్ణంగా మద్దతిచ్చిన మాయావతి ఆంటీకి కృతజ్ఞతలు అని చెప్పారు. ఎస్పీ–బీఎస్పీ అనూహ్య నిర్ణయంతో.. గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఎస్పీ, బీఎస్పీలకు ఈ ఉప ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. వీటిలో గెలవని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ ప్రభావం పెద్దగా ఉండబోదనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టేందుకు ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. బీఎస్పీ పార్టీ తరపున అభ్యర్థులెవరూ బరిలో దిగకుండా.. ఎస్పీ అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించాయి. దీనికి ప్రతిగా వచ్చేనెల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు ఎస్పీ మద్దతివ్వాలనే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఇరుపార్టీలో క్షేత్రస్థాయిలో కలిసి ముందుకెళ్లి ఘన విజయం సాధించాయి. ఎన్నికల ప్రచారంలో ఆదిత్యనాథ్ ఎస్పీ, బీఎస్పీల దోస్తీని పాము, ముంగీస బంధంతో పోల్చారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని.. అయినా కలసి పోటీ చేయటం విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లోనూ ‘పొత్తు’ పొడుస్తుందా? యూపీ ఉప ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కొత్త పొత్తులకు తెరలేవనుంది. బీజేపీని ఓడించేందుకు.. 20 ఏళ్లుగా బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీలు ఏకమవటం 2019 ఎన్నికల్లో జాతీయ రాజకీయ ఎన్నికల ముఖచిత్రంలో మార్పులను సూచిస్తోంది. మొదట ఈ ఎన్నికల వరకే సహకరించుకోవాలని అఖిలేశ్, మాయావతిలు నిర్ణయించుకున్నారు. అయితే తాజా ఫలితాలు, ఇలాంటి కూటమి అవసరంపై దేశవ్యాప్త చర్చ నేపథ్యంలో ఇరువురు నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే.. రెండు బలమైన ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీలు ఎంతకాలం ఒకే ఒరలో కొనసాగగలవనేదే ప్రశ్నార్థకం. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ పొత్తులు కొనసాగటం సాధ్యం కాకపోవచ్చు.. కానీ బీజేపీ జోరును అడ్డుకునేందుకు లోక్‌సభ ఎన్నికల వరకైనా కలిసే ముందుకెళ్లే అవకాశాలున్నాయి. బుధవారం రాత్రి మాయావతిని ఆమె నివాసంలో కలిసి అభినందించిన అఖిలేశ్.. దాదాపు 20 నిమిషాలసేపు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. కూటమి కొనసాగింపుపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో సోనియాగాంధీ ఇచ్చిన విందుకూ ఇరుపార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. ఇది కూడా కాంగ్రెస్ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటును బలపరిచే దిశగా ముందడుగేనని భావన వ్యక్తమవుతోంది. ‘వెయిట్ అండ్ సీ’ అయితే, కూటమిపై బయట చర్చ జరుగుతుండగానే అఖిలేశ్ సన్నిహితుడు, ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ‘పొత్తుపై వేచి చూడండి’ అని చెప్పటం 2019లో కలిసి పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. ఈ ఫలితాలు విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి చిక్కులు తప్పవనే సంకేతాలను ఇస్తున్నాయి. కమలంలో అంతర్మథనం సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యూపీ ఉప ఎన్నికల్లో ఓటమిని బీజేపీ అధిష్టానం జీర్ణించుకోలేపోతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోనే ఎక్కువ స్థానాలను గెలుపొంది కేంద్రంలో సొంతంగా మెజారిటీని సాధించిన బీజేపీ.. ఇప్పుడు ఆ యూపీలోనే ఓడిపోవటంతో ఆత్మరక్షణలో పడింది. యూపీలో ఎంపీ స్థానాలు, తర్వాత అసెంబ్లీకి, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఏకపక్షంగా దూసుకుపోయింది. అలాంటిది.. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో ఇప్పుడు ఓడిపోవటం ఆ పార్టీని కలవరానికి గురిచేసింది. ఈ ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ప్రభావం చూపించవచ్చని, దీంతోపాటుగా మోదీ, అమిత్‌షాల నాయకత్వానికి సవాల్ విసిరే అవకాశముందన్న రాజకీయ విశ్లేషణలూ బీజేపీలో అంతర్మథనానికి కారణమయ్యాయి. ‘ఫలితాలను ఊహించలేదు. ఆత్మపరిశీలన చేసుకుంటాం’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. జిల్లా నేతల్లో విభేదాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్నికల ఫలితాలు రాగానే అమిత్ షా హుటాహుటిన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు ఓపీ మాథుర్‌ను యూపీ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిసింది. యూపీలోని చాలా జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది. వారంతా ఈ ఫలితాలపై సంతృప్తితో ఉన్నట్లు ఢిల్లీకి సమాచారం వచ్చింది. ఇది బీజేపీ అధిష్టానానికి, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణ వ్యూహాన్ని మార్చి.. జాటవేతరులు, యాదవేతర ఓబీసీలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్పీ, బీఎస్పీ జతకట్టడం.. కాంగ్రెస్ కూడా లోపాయికారిగా వీరికి సహకరించటం ద్వారా బీజేపీ ఓడిందనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రాంతీయ పార్టీలతో నేరుగా తలపడిన ప్రతిసారీ బీజేపీ ఓడిపోయిన విషయాన్ని మరవొద్దని.. విపక్షాలు చీలినప్పుడే బీజేపీ గెలిచిందని ఎస్పీ ఎంపీ ఒకరు తెలిపారు. అసలేం జరిగుంటుందనే దానిపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మేధోమథనం జరుగుతోంది. యూపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా కుల సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది.. ఈ ఎన్నికల్లో బీజేపీ కుల సమీకరణాలను సరిగ్గా పట్టించుకోకపోవటమూ ఓటమికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు, రాష్ట్ర నాయకత్వం మితిమీరిన విశ్వాసం కారణంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి సహకారం లోపించిందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఫలితాలు పునరావృతమైతే.. ఒకవేళ యూపీలో గతంలోలాగా ఎక్కువసీట్లు గెలవలేని పక్షంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావటం కష్టమే. అలాంటప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలూ లేకపోలేదు. తెరపైకి మూడోఫ్రంట్ రావొచ్చనే చర్చా జరుగుతోంది. ఇదంతా ప్రస్తుత పరిస్థితిపై విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చు. గుజరాత్ ఎన్నికల తర్వాత విపక్షాలను ఒక్కటొక్కటిగా కూడగడుతున్న కాంగ్రెస్.. తాజా ఫలితాలతో మరింత దూసుకుపోయే అవకాశాలున్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో కలసి కాంగ్రెస్ కూటమిగా ముందుకెళ్లాలని భావిస్తోంది. గోరఖ్‌పూర్‌లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్, ఫుల్పూర్లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ -
రప్ఫాడించిన రాయుడు
విజయనగరం మున్సిపాలిటీ: ఇరు జట్ల కెప్టెన్లు కష్టించి అర్ధ సెంచరీలతో రాణించినా ... మొదటి విజయం హైదరాబాద్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడిని వరించింది. డెంకాడ మండలం చింతలవలసలోని డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం వేదికగా సోమవారం నుంచి ప్రారంభమైన సయ్యద్ ముస్తాక్ అలీ టి–20 క్రికెట్ టోర్నీలో భాగంగా హైదరాబాద్–కేరళ జట్లు ఇక్కడ తలపడగా హైదరాబాద్ జట్లు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కేరళ జట్టు కెప్టెన్ సచిన్ బేబీ ముందుగా హైదరాబాద్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరవై ఓవర్ల మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ క్రీడాకారులు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 168 పరుగులు చేశారు. జట్టు కెప్టెన్ అంబటి రాయుడు 31 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేయగా.. అక్షత్ రెడ్డి 30 బంతుల్లో 34 పరుగులు, సందీప్ 25 బంతుల్లో 25 పరుగులతో రాణించారు. అనంతరం 168 పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన కేరళ జట్టు బ్యాట్స్మన్లను హైదరాబాదీలు కట్టడి చేయటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేయగా.. 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టు కెప్టెన్ సచిన్ బేబీ 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. మిగిలిన జట్టు క్రీడాకారుల్లో వి.విష్ణు 22 పరుగులు, రోహన్ 22 పరుగులతో పర్వాలేదనిపించారు. మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.దేవవర్మ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వాసుదేవరాజు, మైదానం అడ్మినిస్ట్రేటివ్ అధికారి జె.త్రినాథ్‌రెడ్డి పర్యవేక్షించారు. -
చరిత్ర సృష్టించిన విదర్భ
సాక్షి, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టు చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ 2017-18 సీజన్ ఫైనల్లో ఢిల్లీ జట్టును మట్టికరిపించింది. తద్వారా 83 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 295 పరుగులు సాధించగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు అక్షయ్ వినోద్ వాడ్కర్ అజేయ శతకంతో 547 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఢిల్లీ 280 పరుగులు సాధించింది. ఆపై స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ ఒక వికెట్ కోల్పోయి అలవోక విజయాన్ని, తొలిసారి రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ప్రారంభం నుంచే సమిష్టి కృషితో విదర్భ జట్టు తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తోంది. -
జంషెడ్పూర్ ఎఫ్‌సీపై పుణే సిటీ విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో జంషెడ్పూర్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో పుణే ఎఫ్‌సీ 1–0తో విజయం సాధించింది. ఆదిల్ ఖాన్ (30వ ని.) గోల్ సాధించి ఆ జట్టుకు విజయాన్నందించాడు. మరో మ్యాచ్‌లో ముంబై సిటీ 1–0తో చెన్నయిన్ ఎఫ్‌సీపై గెలుపొందింది. ముంబై తరఫున అచిలె ఎమనా (60వ ని.) ఓ గోల్ చేసి జట్టును గెలిపించాడు. గురువారం జరగనున్న మ్యాచ్‌లో పుణే సిటీతో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తలపడనుంది. -
షరపోవా మళ్లీ సాధించెన్...
రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో ఆదివారం జరిగిన తియాన్జిన్ ఓపెన్‌లో షరపోవా విజేతగా నిలిచింది. ఫైనల్లో 7–5, 7–6 (8/6)తో అర్యానా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది. గతేడాది డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్న షరపోవా ఈ ఏడాది ఏప్రిల్‌లో పునరాగమనం చేసింది. చివరిసారి షరపోవా 2015 మేలో రోమ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచింది. -
సవీరా జట్టు ఘన విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురం నగర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఉద్యోగుల క్రికెట్ టోర్నీలో సవీరా జట్టు విజయం సాధించింది. ఆదివారం స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సవీరా , జేఎన్టీయూ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సవీరా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులో ఓపెనర్లు చంద్రశేఖర్ 55, నరేంద్ర 54 పరుగులతో రాణించారు. జేఎన్టీయూ జట్టు బౌలర్లలో రవి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన జేఎన్టీయూ జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. సవీరా జట్టు బౌలర్ బిస్మిల్లా 3 వికెట్లు సాధించాడు. దీంతో సవీరా జట్టు 112 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ క్రీడా పోటీలను అనంతపురం నగర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి విజయరాజు పర్యవేక్షించారు. ఈ నెల 13న మునిసిపాలిటీ జట్టు, మెడికల్, హెల్త్ జట్లు తలపడతాయని ఆయన చెప్పారు. -
దక్షిణాఫ్రికా బోణీ
లీసెస్టర్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. మొదట పాక్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. నహిదా ఖాన్ (79; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. తర్వాత దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఓపెనర్లు లారా వొల్వార్డ్ (52; 5 ఫోర్లు), లీజెల్లి లీ (60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. -
జూనియర్స్ హాకీ విజేత ‘అనంత’
• సత్తాచాటిన అనంత బాలికలు • సెమీస్‌లో ట్రైబ్రెక్స్ ద్వారా విజయం • రన్నర్స్‌గా తూర్పుగోదావరి జట్టు అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఏడవ రాష్ట్ర జూనియర్స్ బాలికల హాకీ విజేతగా అనంత జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో అనంత జట్టు తూర్పుగోదావరి జట్టు పై 3–0తో విజయం సాధించింది. జట్టులో జ్యోతి, సంధ్య, రోషిత చెరొ ఒక గోల్‌చేసి జట్టుకు విజయాన్ని అందించారు. తూర్పుగోదావరి జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు ట్రోఫీల ప్రదాన కార్యక్రమానికి సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ దామోదరన్, ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. మన ఆలోచన విధానమే మన లను ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుందన్నారు. ఎస్కేయూ మాజీ వీసీ రామకష్ణారెడ్డి, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరామప్ప, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జాకీర్‌హుస్సేన్, హాకీ అసోసియేషన్ ట్రెజరర్ బాబయ్య, టోర్నీ కో–ఆర్డీనేటర్ రవిరాజా, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సెమీఫైనల్స్ వివరాలు అనంతపురం–విశాఖపట్టణం మధ్య జరిగిన మ్యాచ్‌లో 1–1 తో డ్రా కాగా ట్రైబ్రేక్స్ లో 4–3 తో విజయం సాధించింది. అనంత క్రీడాకారిణీ రోషిత–4, గోల్స్ చేయగా, విశాఖ క్రీడాకారిణీ భవానీ–3 గోల్స్ చేసింది. తూర్పు గోదావరి–వైయస్సార్ కడప జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 3–0తో వైయస్సార్ జట్టును తూర్పుగోదావరి జట్టు ఓడించింది. తూర్పుగోదావరి జట్టులో వరలక్ష్మీ–2, పద్మావతీ–1 గోళ్లు చేశారు. మూడవ ప్లేస్ కోసం జరిగిన పెనాల్టీ షూట్–అవుట్లో వైయస్సార్ కడప జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. -
సత్తాచాటిన ఎస్ఎస్బీఎన్ జట్లు
♦ వాలీబాల్, కబడ్డీ, బాల్‌బాడ్మింటన్, బాస్కెట్ బాల్ పోటీల్లో విజేత హిందూపురం టౌన్ : పట్టణంలోని ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహించిన ఎస్కేయూ అంతర్ కళాశాలల క్రీడాపోటీల్లో అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాల జట్టు పలు విభాగాల్లో సత్తాచాటి విజేతగా నిలిచింది. పోటీలు ఆదివారం ముగిశాయి. స్థానిక ఎస్‌ఎస్‌పీఆర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అందజేశారు.కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శంకరయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్కేయూ స్పోర్ట్స్ డైరెక్టర్ జెస్సీ పాల్గొన్నారు. హాకీ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అలాగే తైక్వాండో, జూడో, ఫెన్సింగ్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎస్కేయు జట్టుకు ఎంపిక చేశారు. వైస్ ప్రిన్సిపల్ అంజలీదేవి, కోఆర్డినేటర్ యశోదారాణి, పీడీలు వెంకట నాయుడు, కెనడీ, చంద్ర, శ్రీరామ్, క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలు వీరే.. – వాలీబాల్ పోటీల్లో ఎస్‌ఎస్‌బీన్ కళాశాల (అనంతపురం) విన్నర్స్, శ్రీ వాణి వ్యాయామ కళాశాల(హిందూపురం) రన్నర్స్ – షటిల్ బ్యాడ్మింటన్‌లో ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల (హిందూపురం) విన్నర్స్, ఎస్కేయు కళాశాల(అనంతపురం) రన్నర్స్. – కబడ్డీ పోటీల్లో ఎస్ఎస్బీఎన్ కళాశాల విన్నర్స్, ఎస్వీ డిగ్రీ కళాశాల(అనంతపురం) రన్నర్స్. – టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆర్ట్స్ కళాశాల(అనంతపురం) ప్రథమస్థానంలో, ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల ద్వితీయస్థానంలో నిలిచింది. – బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఎస్ఎస్బీఎన్ కళాశాల విన్నర్స్, కేఎస్ఎన్ కళాశాల (అనంతపురం) రన్నర్స్. – బాస్కెట్ బాల్ పోటీల్లో ఎస్‌ఎస్‌బీన్ కళాశాల విన్నర్స్, కేఎస్ఎన్ కళాశాల (అనంతపురం) రన్నర్స్. – ఖో ఖో పోటీల్లో ఎస్కేపీ కళాశాల(గుంతకల్లు) విన్నర్స్, కెఎస్ఎన్ కళాశాల (అనంతపురం) రన్నర్స్. – యోగా పోటీల్లో ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల విన్నర్స్, సప్తగిరి కళాశాల (హిందూపురం) రన్నర్స్‌గా నిలిచారు. . చెస్ పోటీల్లో ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల (హిందూపురం), ఎస్వీ డిగ్రీ కళాశాల(అనంతపురం) కళాశాలలకు జాయింట్ విన్నర్స్. -
జిల్లా క్రీడాకారుల హవా
ఖమ్మం స్పోర్ట్స్ : ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. అండర్–13 బాలుర డబుల్స్ పోటీల్లో అభినవ్ సాయిరాం (వరంగల్), కె.లోకేష్‌రెడ్డి(హైదరాబాద్), అండర్–15 డబుల్స్ విభాగంలో బి.రితిన్(వరంగల్), టి.పవన్‌కృష్ణ(ఖమ్మం) టైటిల్స్ చేజిక్కించుకున్నారు. -
చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుట్టావ్!
ఓటమిని రుచి చూసిన వాళ్లకే గెలుపు విలువ తెలుస్తుంది... అవమానాన్ని ఎదుర్కొన్నవాళ్లకే గౌరవం గొప్పతనం అర్థమవుతుంది.. వివక్షను అనుభవించిన వారికే దాని వెనకున్న బాధ బోధపడుతుంది.. నల్లజాతి సూరీడు పుట్టిన గడ్డ నుంచి అందుకున్న స్ఫూర్తితో... జాతికి వెలుగులు నింపుతూ... ప్రపంచానికి క్రీడోపదేశం చేస్తూ.. చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుట్టిన సెమెన్యా విజయగాథ ఇది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా సమీపంలో ఓ కుగ్రామంలో పుట్టిన సెమెన్యా కాస్టర్‌కు చిన్నప్పటినుంచి సాకర్ అంటే అభిమానం. ఎలాగైనా ఈ క్రీడలో రాణించాలనే సంకల్పంతో పరుగును ప్రారంభించింది. అయితే ఈ పరుగు కాస్త ఆమెను ట్రాక్ ఎక్కించి ప్రపంచానికి కొత్త అథ్లెట్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో చిన్నచిన్న ఈవెంట్లలో పాల్గొన్న సెమెన్యా.. జాతీయ రికార్డులతో శభాష్ అనిపించుకుంది. 2008లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ యూత్‌గేమ్స్‌లో 800 మీటర్ల ఈవెంట్లో 2.04.23 టైమింగ్‌తో స్వర్ణం గెలుచుకుంది. 2009లో జరిగిన ఆఫ్రికన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్లు, 1500 మీటర్లలో రికార్డు టైమింగ్స్‌తో స్వర్ణాలు సాధించింది. గెలుపుపై అనుమానాలు 2009లో బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ 800 మీటర్ల ఫైనల్ రేసుకు అంతా సిద్ధమైంది. అప్పటికే జోరుమీదున్న సెమెన్యా మీదే అందరి దృష్టి. రేసు ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు... సెమెన్యా నిషేధిత డ్రగ్స్ వాడి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేసిన ఐఏఏఎఫ్ (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్) ఈ అథ్లెట్‌పై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన అథ్లెట్లు ఆశ్చర్యపోయినా... దీన్ని ఏమాత్రం పట్టించుకోని సెమెన్యా మరింత మెరుగైన టైమింగ్‌తో (1.55.45) బంగారుపతకాన్ని అందుకుంది. దీంతో ఐఏఏఎఫ్ మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసి... డ్రగ్స్ కాదు, సెమెన్యాకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. సెమెన్యా.. హమ్ హైనా సెమెన్యాపై ఐఏఏఎఫ్ ఆరోపణలను తోటి క్రీడాకారులు తీవ్రంగా ఖండించారు. స్ప్రింటర్ దిగ్గజం మైకెల్ జాన్సన్ కూడా క్రీడాసంఘం తీరుపై బహిరంగంగానే మండిపడ్డారు. నల్లజాతీయురాలైనందుకే సెమెన్యా హక్కులు, వ్యక్తిగత జీవితాన్ని అవమానిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మీడియా కూడా ఆమెకు అండగా నిలిచింది. గొప్ప అథ్లెట్‌ను అవమానపరుస్తున్నారంటూ పతాకశీర్షికలో వార్తలు రాసింది. అయితే సెమెన్యా మోసం చేసిందని భావించటం లేదని.. ‘అరుదైన ఆరోగ్య స్థితి’ (రేర్ మెడికల్ కండీషన్) ఉండొచ్చనే అనుమానంతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు 2009లోనే క్రీడాసంఘం స్పష్టం చేసింది. పరీక్షల ఫలితాలు వచ్చేంతవరకు సెమెన్యా ఏ ఈవెంట్లో పాల్గొనరాదని ఆదేశించింది. ఏడాది నిరీక్షణ తర్వాత 2010లో సెమెన్యా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఐఏఏఎఫ్ పచ్చజెండా ఊపింది. 2010, 2011లో పలు ఈవెంట్లలోనూ ఈ నల్లజాతీయురాలు సత్తాచాటింది. ఈమెపై ఉన్న వివాదాలన్నీ పక్కనపెట్టి.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తమదేశ పతాకధారిగా సెమెన్యాను దక్షిణాఫ్రికా ఎంచుకుంది. ఈ ఒలింపిక్స్‌లో ఆమె 800 మీటర్లలో రజతం సాధించింది. ఆ తర్వాత పలు ఈవెంట్లలోనూ పతకాలు గెలిచింది. 2016 ఒలింపిక్స్‌లో 800 మీటర్ల రేసులో స్వర్ణంతో తనలో సత్తా తగ్గలేదని నిరూపించింది. ‘మనం ఎలా ఉంటామనేది కాదు. మనమెలా పరిగెడతామనేదే ముఖ్యం’ అని చెప్పింది. బాల్యం నుంచి కసి, పట్టుదలతో రాణించిన సెమెన్యాకు జీవితంలో ఎత్తుపల్లాలు తెలుసు. అందుకే అవమానాలను, ఛీత్కారాలను మౌనంగా భరించింది.తనపై ఆరోపణలు అసత్యమని తేలాక.. మళ్లీ ట్రాక్ ఎక్కి రికార్డుల మోత మోగిస్తోంది. సంబరాలకు దూరమే చిన్న ఈవెంట్లు గెలిస్తేనే.. ప్రపంచాన్ని గెలిచినట్లు సంబరపడతాం. కానీ సెమెన్యా మాత్రం జీవితంలో బాధను, సంతోషాన్ని ఒకేలా చూస్తుంది. ‘ఏడేళ్లుగా చాలా బాధపడ్డా. మళ్లీ ఈ స్థితికి చేరుకుంటానని అనుకోలేదు. నేనూ ప్రపంచ చాంపియన్‌నే. కానీ ఎప్పుడు గెలిచినా సంబరాలు చేసుకోలేదు. సంబరాలు నా దృష్టిలో ఓ జోక్. నేను చిన్నప్పటినుంచే అబ్బాయిల మధ్య పెరిగాను. దీన్నిప్పుడు మార్చుకోలేం’ అని సెమెన్యా తెలిపింది. ఆరోపణలతో అంతర్జాతీయ కెరీర్‌కు దూరంగా ఉన్న విరామంలో.. ప్రిటోరియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ సైన్స్ కోర్సులో చేరింది. 2015లో తన దీర్ఘకాల మిత్రురాలు వాయిలెట్ లెడ్లీ రసేబోయాను 2015 చివర్లో సెమెన్యా పెళ్లి చేసుకుంది. సెమెన్యా రేసుకు సెక్యూరిటీ మొన్నటివరకు సెమెన్యాను అవమానించిన క్రీడా సంఘమే.. రియోలో జరిగిన 800 మీటర్ల ఫైనల్‌కు పటిష్టమైన భద్రత ఏర్పాటుచేసింది. ఈ భద్రత సెమెన్యా కోసమే. ఆమె తోటి రన్నర్ల అభిమానులు.. సెమెన్యాపై దాడిచేసే అవకాశం ఉందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతోనే అప్రమత్తమయ్యారు. శభాష్... సెమెన్యా మహిళల 800 మీటర్ల విభాగంలో స్వర్ణం సొంతం రియో డి జనీరో: వివాదాస్పద దక్షిణాఫ్రికా అథ్లెట్ కాస్టర్ సెమెన్యా అంచనాలకు అనుగుణంగా రాణించి రియో ఒలింపిక్స్‌లో మెరిసింది. మహిళల 800 మీటర్ల విభాగంలో సెమెన్యా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో 25 ఏళ్ల సెమెన్యా ఒక నిమిషం 55.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాంకైన్ నియోన్‌సబా (బురుండి-1ని:56.49 సెకన్లు) రజతం, మార్గరెట్ వాంబుయ్ (కెన్యా-1ని:56.89 సెకన్లు) కాంస్యం సాధించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సెమెన్యా ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేసి ఈ విభాగంలో పసిడి పతకం నెగ్గిన తొలి దక్షిణాఫ్రికా అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్ రేసులో సెమెన్యాకు తన ప్రత్యర్థుల నుంచి ఎలాంటి పోటీ ఎదురుకాలేదు. తొలి ల్యాప్‌ను 57.59 సెకన్లలో ముగించి అగ్రస్థానంలోకి వెళ్లిన సెమెన్యా ఆ తర్వాత ఇదే దూకుడు కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ద్యుతి దెబ్బకు నిబంధనల మార్పు 2015లో భారత అథ్లెట్ ద్యుతిచంద్పై కూడా సెమెన్యాకు ఆపాదించిన ఆరోపణలు తలెత్తాయి. దీనిపై మరోసారి లింగ నిర్ధారణపైనా.. కొందరు మహిళల్లో టెస్టోస్టెరాన్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల వారి సామర్థ్యం పెరుగుతుందన్న ఐఏఏఎఫ్ వాదనపైనా తీవ్రమైన చర్చ జరిగింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో ‘ద్యుతి వర్సెస్ భారతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్, ఐఏఏఎఫ్’ కేసులో వాదోపవాదనల తర్వాత టెస్టోస్టెరాన్‌తో సామర్థ్యం పెరుగుతుందనేది అపోహ అని నిరూపితమైంది. దీంతో ఐఏఏఎఫ్ నిబంధనల్లోని ‘హైపర్‌ఆండ్రోజెనిజమ్’ను రద్దుచేశారు. -
ఆమె హృదయాలను గెలుచుకుంది: సచిన్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీపాను కీర్తించిన జాబితాలో తాజాగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేరారు. ఆటలో గెలుపోటములు సహజమని దీపా తన అద్భుత ప్రదర్శనతో కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకుందని, దేశం ఆమెను చూసి గర్విస్తోందని సచిన్ ట్వీట్ చేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో ముందుంచడానికి దీపా, ఆమె కోచ్ గొప్ప కృషి చేశారని మరో భారత క్రికెటర్ శిఖర్ ధవన్ కొనియాడారు. జిమ్నాస్టిక్ పోటీలో 0.150 పాయింట్ల తేడాతో దీపా నాల్గవ స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పథకాన్ని కోల్పోయింది. Winning & losing is a part of sport.. You've won millions of hearts & the entire nation is proud of ur achievements. https://t.co/qSpiWFSp2K — sachin tendulkar (@sachin_rt) 15 August 2016 Congratulations to you and your coaches @dipakarmakar for placing the tricolour at the forefront of world gymnastics. Proud #DipaKarmakar — Shikhar Dhawan (@SDhawan25) 15 August 2016 -
తెలంగాణ మజ్దూర్ యూనియన్‌దే గెలుపు
ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతం నార్కట్‌పల్లిలో డిపోలో 100 శాతం పోలింగ్ ఎంప్లాయీస్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిపై 176 ఓట్ల మెజార్టీ నార్కట్పల్లిః ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. రాత్రి విడుదలైన ఫలితాల్లో ఎంప్లాయీస్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిపై టీఎంయూ విషయం సాధించింది. నార్కట్‌పల్లి డిపోలో 284 ఓట్లు ఉండగా అందులో 8 బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి, 276 ఓట్లకు 276 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, ఎస్డూబ్ల్యూఎఫ్ కూటమిగా, తెలంగాణ మజ్దూర్, ఎన్‌ఎంయూలు ఒంటరిగా బరిలోకి దిగాయి. నార్కట్‌పల్లి డిపోలో క్లాస్ 3 తెలంగాణ మజ్జూర్ యూనియన్‌కు 222 ఓట్లు రాగ, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమికి 46 , ఎన్ఎంయూకు 6 , చక్రం గుర్తుకు ఒక ఓటు పోలయ్యాయి. ఒక ఓటు చెల్లలేదు. క్లాస్ 6లో టీఎమ్యూకు 212, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియాలకు 55,ఎన్‌ఎంయూకి 6 , చక్రం1 ఓటు రాగ రెండు ఓట్లు చెల్లలేదు. దీంతో 176 ఓట్లతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వీరికి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
భారత్ ‘బి’ శుభారంభం
కాన్పూర్: కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (82 బంతుల్లో 77 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీ సహాయంతో దేవధర్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’పై ఉన్ముక్త్ సేన 5 వికెట్లతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టు 44.2 ఓవర్లలో 161 పరుగులు చేసింది. పర్వేజ్ రసూల్ (94 బంతుల్లో 66; 6 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (91 బంతుల్లో 58; 4 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పవన్ నేగి, నాథూ సింగ్‌లకు మూడేసి, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘బి’ 29.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 162 పరుగులు చేసి నెగ్గింది. -
సాహసబాలలకు జాతీయ పురస్కారాలు ప్రదానం
-
కళింగ లాన్సర్స్ విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో కళింగ లాన్సర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ప్రారంభ మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ చేతిలో ఓడిన కళింగ ఈసారి మెరుగ్గా ఆడింది. గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దబాంగ్ ముంబైపై 4-2 తేడాతో నెగ్గింది. తొలి అర్ధభాగం వరకు ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే 35వ నిమిషంలో ఫ్లోరియన్ ఫచ్ ముంబైకి తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత పుంజుకున్న కళింగ 45వ నిమిషంలో ఆడమ్ డిక్సన్, 51వ నిమిషంలో గ్లెన్ టర్నర్ ఫీల్డ్ గోల్స్‌తో గెలిచింది. -
సుదీర్ఘ కౌంటింగ్‌లో సూచీకి 880 స్థానాలు
సుదీర్ఘంగా జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మయన్మార్ ఆశాకిరణం ఆంగ్‌సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ 77.3 శాతం స్థానాలను గెలుచుకుంది. 1,139 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ 880 స్థానాలను గెలుచుకోగా అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ పది శాతం సీట్లతో 115 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన స్థానాలను వేరు వేరు చిన్న పార్టీల వారు గెలుచుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మయన్మార్ పార్లమెంట్ సభ్యులలో 75 శాతం సభ్యులను ఈ ఎన్నికల ద్వారా భర్తీ చేయనుండగా మిగిలిన 25 శాతం మందిని నేరుగా మయన్మార్ మిలిటరీ నామినేట్ చేస్తుంది. మయన్మార్ పార్లమెంట్ తొలి సమావేశాలు జనవరిలో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం మార్చిలో కొలువుదీరనుంది. మార్చి చివరిలో ప్రస్తుత అధికార ప్రభుత్వం రద్దుకానుంది. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి సూచీ విజయం ఎప్పుడో ఖరారైనా, అక్కడి ఎన్నికల కౌటింగ్ ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతన, అధికార పాలకుల ఉద్దేశపూర్వక కాలయాపన ఫలితంగా ఫలితాల విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తుంది. -
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ యాదవ్
హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పోటీకి జరిగిన ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందాడు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ముగిసింది. ఈ ఎన్నికల్లో భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌పై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ 1,800 ఓట్ల తేడాతో గెలుపొందాడు. -
టీమిండియా విజయోత్సవాలు
-
ఏషియన్ అవార్డు గెలుచుకున్న షారుఖ్
లండన్ : బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఏషియన్ అవార్డును గెలుచుకున్నారు. సినిమా రంగానికి చేసిన ప్రతిష్టాత్మక సేవలకు గాను ఆయన్ను ఈ అవార్డు వరించింది. శుక్రవారం లంబన్ గ్రోస్వెనార్ హోటెల్లో జరిగిన 5వ వార్షిక ఏషియన్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును షారుఖ్ అందుకున్నారు. తనకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు షారూఖ్. తనను ప్రపంచానికి పరిచయం చేసిన భారతీయ సినిమా రంగానికి ఋణపడి వుంటానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విచ్చేసిన ప్రముఖులు, సెల్రబిటీలతో వేదిక కళకళలాడింది. ఈ సందర్భంగా అవార్డులు గెలుచుకున్న అందరికీ షారుఖ్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సంగీతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న జైన్ మాలిక్ షారుఖ్‌తో కలిసి వున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలకు ఇచ్చే ఈ అవార్డును గెలుచుకున్న వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. క్రీడారంగంలో శ్రీలంక బ్యాట్స్‌మేన్ సంగక్కర, సంగీతంలో జైన్ మాలిక్, సైన్స్ అండ్ టెక్నాలజీలో తేజేందర్ సింగ్, టెలివిజన్ రంగంలో ప్రముఖ హాస్యనటుడు, సంజీవ్ భాస్కర్, వ్యాపార రంగంలో హిందూజా బ్రదర్స్ తదితరులు ఆ అవార్డులను అందుకున్నారు. కాగా గతంలో ఇర్ఫాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ ఈ అవార్డును గెలుచుకున్నారు.