సవీరా జట్టు ఘన విజయం | saveera team won | Sakshi
Sakshi News home page

సవీరా జట్టు ఘన విజయం

Published Sun, Aug 6 2017 10:01 PM | Last Updated on Mon, Sep 11 2017 11:26 PM

saveera team won

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: అనంతపురం నగర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ ఉద్యోగుల క్రికెట్‌ టోర్నీలో సవీరా జట్టు విజయం సాధించింది. ఆదివారం స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సవీరా , జేఎన్టీయూ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన సవీరా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులో ఓపెనర్లు చంద్రశేఖర్‌ 55, నరేంద్ర 54 పరుగులతో రాణించారు.

జేఎన్టీయూ జట్టు బౌలర్లలో రవి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన జేఎన్టీయూ జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. సవీరా జట్టు బౌలర్‌ బిస్మిల్లా 3 వికెట్లు సాధించాడు. దీంతో సవీరా జట్టు 112 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ క్రీడా పోటీలను అనంతపురం నగర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి విజయరాజు పర్యవేక్షించారు. ఈ నెల 13న మునిసిపాలిటీ జట్టు, మెడికల్, హెల్త్‌ జట్లు తలపడతాయని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement