దుబాయ్‌ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్ | Ajith Kumar Team wins Third Place In Dubai 24H Car Racing | Sakshi
Sakshi News home page

Ajith Kumar: దుబాయ్‌ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ రికార్డ్

Published Sun, Jan 12 2025 4:42 PM | Last Updated on Sun, Jan 12 2025 5:26 PM

Ajith Kumar Team wins Third Place In Dubai 24H Car Racing

దుబాయ్‌ కార్‌ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్‌ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో 24హెచ్ కార్ రేసింగ్‌ జరుగుతోంది.  ఈ సందర్భంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

రేసుకు ముందు ప్రమాదం.. 

అయితే ఇటీవల  తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. అజిత్‌ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. 

కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో విజయం సాధించింది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ కుమార్‌ వీడియోను రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అలాగే  కుటుంబం, హార్ట్‌ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. 

కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయని' అని అన్నారు.

కాగా.. కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాకు మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు.  అర్జన్‌ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్డెట్‌లో నిర్మించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్‌తో ‍అజిత్ కుమార్ జతకట్టారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో  ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈ సినిమాను సమ్మర్‌లో అంటే ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.       

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement