car racing
-
నేడు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
-
దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
దుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో 24హెచ్ కార్ రేసింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు.రేసుకు ముందు ప్రమాదం.. అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో విజయం సాధించింది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ కుమార్ వీడియోను రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయని' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్‌తో అజిత్ కుమార్ జతకట్టారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈ సినిమాను సమ్మర్లో అంటే ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Big congratulations to you, AK sir, for your perseverance. Proud moment, sir 👏👏 🏆 👍❤️❤️#AjithKumarRacing pic.twitter.com/YQ8HQ7sRW2— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 12, 2025 -
ఫార్ములా ఈ రేస్ కేసులో.. అసలు నిందితులు ఎవరు ?
-
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
మరోసారి హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
-
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
-
BIG Update : ఫార్ములా ఈ-రేస్ కేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ
-
ఈ-రేసు కేసులో కేటీఆర్‌పై కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు
-
ఫార్ములా ఈ రేసుల కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Formula E case: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ-రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేద్వారా సవాల్ విసిరారాయన.‘‘ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తోంది. విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేసు నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు.రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది. కాబట్టే మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి అని లేఖలో కోరారాయన.💥 దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS లేఖ❇️ ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై, అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది.❇️ ఈ అంశంపై ఇటీవల మీ… pic.twitter.com/Iv2fNkjAfl— BRS Party (@BRSparty) December 18, 2024 -
కేటీఆర్‌పై ‘ఫార్ములా’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుపై ‘ఫార్ములా–ఈ’ అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ ప్రారంభించాలని సోమవారం సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంది. దీనిపై తక్షణమే ఏసీబీకి లేఖరాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌ను తక్షణమే అరెస్టు చేస్తారా? అన్న అంశంపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు జరుగుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మంత్రివర్గ భేటీ తర్వాత కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలుతాయని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన సమయంలోనే.. ‘ఫార్ములా–ఈ’ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను అరెస్టు చేయవచ్చంటూ ప్రచారం జరిగింది. గవర్నర్ అనుమతితో ముందుకు.. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ‘ఫార్ములా–ఈ’ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ అంశంపై సూటిగా స్పందించేందుకు ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి. విదేశీ సంస్థలకు నేరుగా నిధులు ఎలా చెల్లిస్తారు? ‘విదేశీ కంపెనీలైన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించే విషయంలో నిర్ణయాధికారం నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు ఉందా? రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించవచ్చా? ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ ఒప్పందం ఎలా చేసుకుంటారు?’ అనే అంశాలపై ఏసీబీ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. భారీగా డబ్బులు చేతులు మారాయని.. ఫార్ములా–ఈ కార్ల రేసులో అవకతవకలు జరిగాయని.. భారీగా డబ్బులు చేతులు మారాయని మంత్రివర్గం అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ క్రీడల నిర్వహణతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇటీవల కేటీఆర్ పేర్కొన్న నేపథ్యంలో... ఈ విషయాలను ఆయన ఏసీబీకి చెప్పుకోవాలని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. కేటీఆర్ అరెస్టు భయంతోనే ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నారని, కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఎవరినో అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందా?, బీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారులు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే! ‘ఫార్ములా–ఈ’ కారు రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌తోపాటు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, ఇతర అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. అరవింద్‌కుమార్ విచారణకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) అనుమతి అవసరం లేదని.. సీఎస్ అనుమతిస్తే సరిపోతుందని తెలిపారు. అధికారిపై నేరారోపణలు నమోదు చేసే సమయంలోనే డీఓపీటీ అనుమతి అవసరమని వెల్లడించారు. ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై సైతం ఏసీబీ విచారణ చేపడుతుందని, వాటికి కూడా నోటీసులు ఇస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఆ రెండు కంపెనీలకు నిధులు చెల్లించినట్టు అరవింద్‌కుమార్ ఇప్పటికే తెలిపారని గుర్తు చేశారు. కీలక నిర్ణయాలు.. అసెంబ్లీలోనే ప్రకటన సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా అధికారికంగా వెల్లడించలేదు. వీటిపై అసెంబ్లీలోనే ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవకతవకలపై వేసిన జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికపై మంత్రివర్గం చర్చించి ఆమోదించినట్టు సమాచారం. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన కోసం కొత్తగా తెచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్ఓఆర్) బిల్లుతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల బిల్లులు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులను కూడా కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. ఇక ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా కింద భూమి లేని రైతుకూలీలకు డిసెంబర్ 28 నుంచి రూ.12 వేల ఆర్థిక సాయం చెల్లింపు, కొత్త రేషన్ కార్డుల జారీపైనా చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో వీటిపై అసెంబ్లీ ప్రకటన చేయనుంది. -
రేసింగ్‌లో అక్కినేని నాగ చైతన్య టీమ్.. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ హీరో అక్కినేని నాగ చైతన్య తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లోకి అడుగు పెట్టారు. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే ‘ఫార్ములా 4’లో భాగమయ్యాడు. ఈ సీజన్‌కు సంబంధించిన రేసులు ఈ నెల 24న మొదలవనున్నాయి. యూత్ ఫాలోయింగ్ ఉన్న యువ హీరో నాగ చైతన్యకు ఫార్ములావన్ అంటే క్రేజీ! బుల్లెట్లా దూసుకెళ్లే ఈ కారు రేసింగ్‌ను కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా టీవీల్లో చూస్తుంటారు. ఈ ఆసక్తితోనే ఆయన సూపర్ కార్స్, కొత్తకొత్త హై రేంజ్ స్పీడ్ మోటార్ సైకిళ్లను కొని తన గ్యారేజీలో పెట్టుకుంటారు.సినీ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని వారసుడు తమ రేసింగ్ లీగ్‌లో భాగం కావడంతో లీగ్‌పై ప్రేక్షకాదరణ కూడా అంతకంతకు పెరుగుతుందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నాగ చైతన్య మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచే రేసింగ్ అంటే ఇష్టం. ఫార్ములావన్ అంటే పిచ్చి. హైస్పీడ్ డ్రామాను ఎంజాయ్ చేస్తాను. ఈ ఫార్ములావన్ క్రేజీతోనే నేను సూపర్ కార్స్, బైక్స్ కొనేలా చేశాయి. నాకు తెలిసి ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ కేవలం ఈవెంట్ మాత్రమే కాదు. అంతకు మించిన ఆడ్వెంచర్ కూడా! అందుకే నేను నా అభిరుచి ఉన్న రేసింగ్ క్రీడలో భాగమయ్యాను. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ మా అంచనాలకు అనుగుణంగా రేసింగ్‌లో దూసుకెళ్తుంది’ అని అన్నారు. నిజానికి రేసింగ్ అంటే అక్కినేని ఇంటికి కొత్తేం కాదు. స్టార్ హీరో నాగార్జున కుమారుడు నాగ చైతన్య రేసింగ్ ప్రేమికుడైతే... ఆయన సోదరుడు ఆదిత్య (అక్కినేని వెంకట్ కుమారుడు) స్వయంగా రేసర్. కొన్నేళ్ల క్రితం ఆదిత్య మోటార్ రేసింగ్ ట్రాక్‌పై పలు రేసుల్లో పాల్గొన్నారు. -
ఇలాంటి కార్లు ఎప్పుడూ చూసుండరు (ఫోటోలు)
-
హైదరాబాద్‌లో మరోసారి ఇండియన్ రేసింగ్ లీగ్
హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలకు నగరం మరోసారి ఆతిథ్యమివ్వనుంది. ఇండియన్ రేసింగ్ లీగ్ అనంతరం వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా– ఈ పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ఇండియన్ మోటార్ రేసింగ్ లీగ్ కోసం హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేపట్టింది. నెక్లెస్‌రోడ్డులోని స్ట్రీట్ సర్క్యూట్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. గతంలో కార్ రేసింగ్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్లు, బారికేడ్లు, ఎత్తైన కంచెలను తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో అన్ని పనులను పూర్తి చేసి నవంబర్ నాటికి రేసింగ్ నిర్వహణకు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే ట్రాక్‌పై ఫిబ్రవరి 10న ఫార్ములా–ఈ పోటీలు జరుగుతాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి లోపాలకు తావు లేకుండా ట్రాక్ పునరుద్ధరణ చేపట్టారు. -
కార్ రేసింగ్ గురించి నటి నివేతా పేతురాజ్
-
అనంతగిరి అడవుల్లో రేసింగ్ పై స్పందించిన పోలీసులు
-
కోకాపేటలో కార్ రేసింగ్
హైదరాబాద్: కోకాపేట నియోపోలీస్ కేంద్రంగా కార్రేసింగ్కు పాల్పడిన ఆరుగురు యువకులను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి కౌన్సిలింగ్‌కు తరలించారు. నార్సింగి సీఐ శివకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ నగరానికి చెందిన కొందరు యువకులు ఖరీదైన కార్లలో శుక్రవారం సాయంత్రం రేసింగ్‌కు పాల్పడుతున్నారు. వీంతో భయాందోళనకు గురైన స్థానికులు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్లతో సహా వారిని అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి ట్రాఫిక్ సీఐ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రేసర్లను గురువారం కౌన్సెలింగ్‌కు పంపామని, సీజ్ చేసిన కార్లను కోర్టుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. సదరు కార్లు పాండిచ్చేరి, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నందున అవి మన రాష్ట్రంలో తిరిగేందుకు అవకాశం ఉందా..లేదా స్పష్టం చేయాలని ఆర్టీఏ అధికారులకు లేఖ రాశామన్నారు. రేసింగ్‌కు పాల్పడిన యువకులు సంపన్న కుటుంబాలకు చెందిన వారు కావడంతో వారి పేర్లను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వారం రోజుల క్రితం రేసింగ్‌కు పాల్పడితే వారిని గురువారం కౌన్సెలింగ్‌కు, కార్లను కోర్టుకు అప్పగించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేసింగ్‌కు పాల్పడిన వారిలో సయ్యద్ మాజీద్ హుస్సేన్, రాకేష్, నారాయణ, ధన్‌రాజ్, రమణ, మణికొండ కంఠ శర్మ ఉన్నట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో బ్రాండెడ్ కార్లతో రేసింగ్.. బడాబాబుల పిల్లల రచ్చ రచ్చ
సాక్షి, హైదరాబాద్: నగరంలో కుర్రోళ్లు కారు రేసింగ్‌తో రెచ్చిపోతున్నారు. బడా బాబుల పిల్లలు బ్రాండెడ్ కార్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ శివారు నార్సింగిలో మితిమీరిన వేగంతో కారు రేసింగ్ నిర్వహించిన యువకులు.. స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. దీంతో స్థానికులు ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. కార్లను సీజ్ చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. సయ్యద్ మాజీద్ హుస్సేన్, రాకేష్, నారాయణ, ధనరాజ్, రమణ, మణికంఠ శర్మలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారంతా బడా బాబులు పిల్లలు కావడంతో వదిలిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. సంచలనాలు వెలుగులోకి.. -
మయామి గ్రాండ్‌ప్రి విజేత వెర్స్టాపెన్
ఫ్లోరిడా: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యం చాటుకుంటూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మూడో విజయం నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మయామి గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌ల ఈ రేసును తొమ్మిదో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 27 నిమిషాల 38.241 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. అలోన్సో (ఆస్టన్ మార్టిన్) మూడో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో ఐదు రేసులు జరగ్గా... ఐదింటిలోనూ రెడ్‌బుల్ డ్రైవర్లే విజేతగా నిలువడం విశేషం. డ్రైవర్స్ చాంపియన్ షిప్ రేసులో వెర్స్టాపెన్ (119 పాయింట్లు), పెరెజ్ (105 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
తీవ్ర విషాదం.. కార్ రేసింగ్ పోటీల్లో ప్రముఖ రేసర్ దుర్మరణం
చెన్నై: ఎంఆర్ఎఫ్–ఎఫ్ఎమ్ఎస్ సీఐ జాతీయ కార్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరిగిన రెండో రౌండ్ రేసింగ్‌లో సీనియర్ రేసర్ కె.ఇ.కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో పోటీపడిన 59 ఏళ్ల సీనియర్ రేసర్ కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై భారత మోటార్ స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్ఎమ్ఎస్సీఐ) దర్యాప్తు చేయాలని ఆదేశించింది. -
Roundup 2022: సిటీలో మొట్టమొదటిసారి కార్ రేసింగ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఈ ఏడాది మొట్టమొదటిసారి మోటారు క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో రెండు దఫాలుగా జరిగిన ఈ రేసింగ్‌లు మోటార్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ► నవంబర్ 19, 20 తేదీల్లో సాంకేతిక కారణాల దృష్ట్యా పోటీలను నిర్వహించలేకపోయినా రెండు రోజుల ట్రయల్స్ హైదరాబాద్ నగరానికి ఒక కొత్త క్రీడను పరిచయం చేశాయి. ► వచ్చే ఏడాది అంటే 2023 ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల రేసింగ్ పోటీలు ఫార్ములా–ఈ కి సన్నాహకంగా భావించే ఇండియన్ రేసింగ్ కార్కు నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ వేదికైంది. ► ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీల కోసం సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ ఈ ట్రాక్‌ను నిర్మించింది. ఇదే ట్రాక్‌పై నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇండియన్ రేసింగ్ కారు పోటీలను నిర్వహించారు. హోరెత్తిన పోరు... ► హుస్సేన్‌సాగర్ తీరంలో రయ్‌మంటూ భారీ శబ్దంతో దూసుకెళ్లిన కార్లు నగరవాసులకు కొత్త పరిచయం. నవంబర్‌లో ఒక కారు ప్రమాదానికి గురికావడం, తరచు బ్రేక్‌డౌన్స్ చోటుచేసుకోవడం, రేసర్లు సన్నద్ధంగా లేకపోవడంతో ఈ నెలలో పోటీలను నిర్వహించలేదు. ► హైదరాబాద్‌కు చెందిన బ్లాక్బర్డ్స్తో పాటు చెన్నై, బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, ప్యారిస్, ఇటలీ తదితర నగరాలకు చెందిన 12 బృందాలు, 22 మంది రేసర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ► వాహనాల నిర్వహణ కోసం మెకానిక్‌లు, సాంకేతిక నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన బృందాలతో నెక్లెస్ రోడ్డు కోలాహలంగా మారింది. ► డిసెంబర్లో రెండవ దఫా నిర్వహించిన పోటీల్లో కొచ్చి టీమ్ విజేతగా గెలిచింది. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రన్నరప్‌గా నిలిచింది. ► యువతను ముఖ్యంగా మోటార్ స్పోర్ట్స్ అభిమానులను అలరించిన ఈ పోటీలతో హైదరాబాద్ నగరం ఈ రంగలో మొట్టమొదటిసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ► ఈ పోటీల వల్ల నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరానికి వెలుపల పోటీలను నిర్వహించాలని వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. ► ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలతో అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ -
హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడి
హైదరాబాద్‌లో మరోసారి కార్ రేసింగ్ సందడి షురూ అయింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్ జరుగుతుంది. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్‌పై కార్లు రయ్.. రయ్‌మని దూసుకెళ్లాయి. కాగా రేసింగ్‌లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు.గంటకు 250-300 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోతూ అభిమానులను అలరిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో జరిగిన ప్రమాదం, బ్రేక్‌డౌన్స్ కారణంగా పోటీలు లేకుండానే ట్రయల్స్‌కే కార్ రేసింగ్ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయిన కార్లు సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్‌ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బర్డ్స్ (రేసర్ల టీమ్) ఢిల్లీకి చెందిన స్పీడ్ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్‌స్టర్స్, చెన్నై టీమ్ టర్బోరైడర్స్, గోవా ఏసెస్ బృందాలు ఈ పోటీల్లో నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్‌పై దూసుకెళ్లనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రవీంద్రలతోపాటు ఫిమేల్ ఎఫ్–4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు ఈ సారి ప్రేక్షకులు, మోటార్ స్పోర్ట్స్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భారతీయ మోటర్‌స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు. -
హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై ఫార్ములా కారు రేసింగ్..
-
Hyderabad: కార్ రేసింగ్ పోటీలతో మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్ రేసింగ్ పోటీలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. కార్ రేసింగ్ పోటీలతో నగరంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ► ఖైరతాబాద్ ఫ్లైఓవర్,నెక్లెస్ రోడ్,ఐమాక్స్ రోటరీ వైపు రోడ్ మూసివేత. ► బుద్దభవన్,నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపు నో ఎంట్రీ. ► రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు రోటరీ ట్రాఫిక్ అనుమతించరు. ► ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్,ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలకు నో ఎంట్రీ. ► ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే రోడ్స్ క్లోజ్. ► బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ► ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్,నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్. ► ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ఘాట్,నెక్లెస్ రోడ్,లుంబినీ పార్క్ రోడ్లు మూసివేతయబడతాయి. కాగా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో గత నెలలో నిర్వహించిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ అర్థాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. నవంబర్ 19, 20న జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లు రద్దు చేశారు. తొలి లీగ్ రౌండ్లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రధాన రౌండ్ పోటీలను నిర్వహించలేదు. ఈ షోకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఇండియన్ రేస్ లీగ్ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించింది. చదవండి: Hyderabad: కుర్రకారు.. ‘సోషల్’ జోరు.. రోజుకు 6 గంటల పాటు వీటితోనే