
సాక్షి, హైదరాబాద్: నగరంలో కుర్రోళ్లు కారు రేసింగ్‌తో రెచ్చిపోతున్నారు. బడా బాబుల పిల్లలు బ్రాండెడ్ కార్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ శివారు నార్సింగిలో మితిమీరిన వేగంతో కారు రేసింగ్ నిర్వహించిన యువకులు.. స్థానికులను భయాందోళనలకు గురిచేశారు.
దీంతో స్థానికులు ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. కార్లను సీజ్ చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. సయ్యద్ మాజీద్ హుస్సేన్, రాకేష్, నారాయణ, ధనరాజ్, రమణ, మణికంఠ శర్మలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారంతా బడా బాబులు పిల్లలు కావడంతో వదిలిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. సంచలనాలు వెలుగులోకి..
Comments
Please login to add a commentAdd a comment