narsingi
-
'రాజ్ తరుణ్‌తో విడిపోవడానికి అతనే కారణం'.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య!
లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్, నేను విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. దీంతో నార్సింగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు..పలువురు అమ్మాయిలతో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు వచ్చాయి. ఏకాంతంగా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 వీడియోలకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇది చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)అసలేం జరిగిందంటే..టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వివాదం గతేడాది సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా వారి టాపిక్ పెద్ద దుమారం రేగింది. ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్‌కు రిలేషన్ ఉందని గతంలో లావణ్య ఆరోపించింది. అయినా తనకు రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కోరింది. -
వివాహేతర సంబంధమే ప్రాణాలు తీసిందా?
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో జంట హత్యల ఘటన కలకలం రేపింది. వివాహితను, ఆమె ప్రియుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం గాలిపటాలు ఎగురవేసేందుకు పద్మనాభస్వామి గుట్టల వైపు వెళ్లిన యువకులకు అక్కడ రెండు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించడంతో జంట హత్యల ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బేమెతరా జిల్లా నమాగఢ్కు చెందిన బిందు బింజారె (27)కు, ఇదే రాష్ట్రం ముంగిలి జిల్లా బయక్కాంప గ్రామానికి చెందిన వ్యక్తితో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బిందు కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని ఓ విల్లా ప్రాజెక్ట్‌లో మేస్త్రీ, కూలీలుగా భార్యాభర్తలు కొంత కాలం పని చేశారు. అనంతరం వనస్థలిపురం వచ్చారు. ప్రియుడి మోజులో పడి.. కుటుంబాన్ని వదిలి.. గతంలో శంకర్పల్లి సైట్లో పని చేసినప్పుడు బిందుకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ సాకేత్ (27)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ప్రియుడి మోజులో పడిన బిందు తన కుటుంబాన్ని వదిలేసి ఈ నెల 4న అంకిత్ సాకేత్ ఉంటున్న నానక్‌రాంగూడకు వచ్చేసింది. తన వద్దకు వచ్చిన బిందును సాకేత్ తన స్నేహితుల గదిలో ఉంచాడు. ఈ క్రమంలో తన భార్య బిందు కనిపించడం లేదంటూ భర్త ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అదే రోజు పిల్లలను తీసుకుని స్వస్థలానికి వెళ్లిపోయాడు. నిర్మానుష్య ప్రదేశంలో శవాలుగా బిందు, అంకిత్ సాకేత్.. నానక్‌రాంగూడలో ఉంటున్న అంకిత్ సాకేత్ కనిపించటం లేదని ఆయన తమ్ముడు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 8న ఫిర్యాదు చేశాడు. కాగా.. పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలోని నిర్మానుష్య ప్రదేశమైన పద్మనాభస్వామి ఆలయ పరిసరాల్లోని గుట్టల్లో బిందు, సాకేత్ మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని కత్తులతో పొడిచి, ముఖాలు గుర్తించకుండా బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. జంట హత్యలు ఈ నెల 11, 12 తేదీల్లో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. భిన్న కోణాల్లో విచారణ ముమ్మరం.. జంట హత్యల ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డిలు మంగళవారం పరిశీలించారు. క్లూస్, డాగ్ స్క్వాడ్లతో వివరాలు సేకరించారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. బిందు, అంకిత్ సాకేత్‌లతో పాటు మరో ముగ్గురు అటుగా వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బిందును గదిలో ఉంచిన సాకేత్ మిత్రులా? లేదా గతంలో శంకర్‌పల్లిలో పని చేసిన సమయంలో బిందుతో పాటు పనిచేసిన వారా? లేక ఇతరులెవరైనా వారిని అక్కడ చూసి అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి శరీరంపై దుస్తులు లేకపోవటంతో అత్యాచారం చేసి హతమార్చారా? బిందు, సాకేత్ ఏకాంతంగా ఉన్న సమయంలో హత్య చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం సమీపంలో సుమారు 10 ఖాళీ బీరు సీసాలు ఉన్నాయి. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
HYD: జంట హత్య కేసులో ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: నార్సింగి(narsingi) పుప్పాలగూడ(puppalaguda) జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా దారుణంగానే హత్య చేసినట్లు తేలింది. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు గుర్తించారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా గుర్తించారు.వివరాల ప్రకారం.. నార్సింగిలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధమే వీరి హత్యకు కారణమైనట్టు పోలీసులు తెలిపారు. అంకిత్ సాకేత్‌కు వివాహిత బిందూతో గత పరిచయం ఏర్పడింది. బిందుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నెల 11న బిందును సాకేత్ ఎల్బీనగర్ నుంచి నానక్ రామ్ గూడకు పిలిపించాడు. బిందును తన స్నేహితుడి రూమ్‌లో ఉంచాడు. తర్వాత ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు.అనంతరం, అక్కడ ఏకాంతంగా గడిపారు. అయితే, సాకేత్‌కు తెలియకుండా మరో యువకుడితో బిందు ప్రేమాయణం సాగించింది. మరో ప్రియుడు.. వీరిద్దరినీ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బిందుపై దాడి చేశాడు. బండరాళ్లతో బాది హత్య చేశాడు. సాకేత్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. పారిపోతున్న సాకేత్‌పై కూడా అతడు దాడికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బండరాయితో దాడి చేసి పరారయ్యాడు. హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. వీరిద్దరి హత్య కన్నా ముందు అంకిత్ అదృశ్యమైనట్టు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగా.. వనస్థలిపురంలో బిందుపై మిస్సింగ్ కేసు నమోదైంది. నిన్న నార్సింగిలో ఇద్దరి హత్య జరిగింది. -
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల ఛార్జ్ షీట్లో కీలక అంశాలు!
జానీ మాస్టర్ (Jani Master) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ కొరియోగ్రాఫర్(choreographer) ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జానీ విడుదలయ్యారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఛార్జ్ షీట్లో పోలీసులుపలు ఈవెంట్స్ పేరుతో మహిళ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వేధింపులకు గురి చేసినట్లు అందులో ప్రస్తావించారు. కాగా.. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ మహిళ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్)అసలేం జరిగిందంటే..టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు వాపోయింది. దీంతో జానీపై లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నార్సింగి : సెలూన్ ప్రారంభోత్సవంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు సందడి (ఫొటోలు)
-
Hyderabad: ‘హరేకృష్ణ’ టెంపుల్.. 430 అడుగులు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడానికి ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్’ పేరుతో 430 అడుగుల ఎత్తులో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించనున్నారు. నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. శ్రీరాధా, కృష్ణుల అద్భుతమైన విగ్రహాలతో పాటు సీతారామచంద్రులు, గౌర నితాయి విగ్రహాలను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించనున్నారు.శ్రీనివాస గోవిందుడి కోసం పూర్తిగా రాతి నుంచి దేవాలయాన్ని చెక్కనున్నారు. ఈ ప్రాజెక్టులో కాకతీయులు, చాళుక్యులు, ద్రవిడ సంస్కృతి, విభిన్నమైన పురాతన కాలం నాటి దేవాలయ కట్టడాల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ గోసేవ మండల్ ఈ ప్రాజెక్టుకు భూసేవక్లుగా వ్యవహరించనున్నారు. ఈ క్యాంపస్‌లో లైబ్రరీ, మ్యూజియం, థియేటర్, పిల్లలు, యువతకు ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలపై బోధనలు చేసేందుకు భగవద్గీత హాల్స్ నిర్మించనున్నారు. ఇక, ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి అనంత శేష స్థాపన కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే హరేకృష్ణ మూమెంట్ చైర్మన్ శ్రీమధు పండిట్ దాస ప్రభుజీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీసత్య గౌర చంద్ర దాస ప్రభు జీ తదితరులు పాల్గొననున్నారు. -
హైదరాబాద్ నార్సింగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
దోషికి ఉరిశిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో ఘాతుకానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. 2018 నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలిక లైంగిక దాడి, హత్యకు గురైంది. బాలికపై సెంట్రింగ్ కార్మికుడు దినేష్‌కుమార్ లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు.2021లో దోషి దినేష్‌కుమార్‌కు రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. రంగారెడ్డి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. -
నార్సింగి డ్రగ్స్ కేసులో వీఐపీలు!
సాక్షి, హైదరాబాద్: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైజీరియా డ్రగ్ పెడ్లర్ల నుంచి మరో 30 మంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకొని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్రికా దేశాల నుంచి మాదక ద్రవ్యాలను గోవా, ముంబై, ఢిల్లీ మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను నార్సింగి, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు ఈనెల 16న పట్టుకున్న సంగతి తెలిసిందే. నిందితుల నుంచి రూ.కోట్లు విలువ చేసే 199 గ్రాముల కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్ పెడ్లర్లు అనౌహా బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడేషోలాలతో పాటు బెంగళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, బోరబండకు చెందిన సానబోయిన వరుణ్ కుమార్, కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్‌లను అరెస్టు చేశారు. సెల్ఫోన్లలో డేటాతో.. అరెస్టు సమయంలో నిందితుల సెల్ఫోన్లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని వాట్సాప్ చాట్స్, సందేశాలు, బ్యాంకు లావాదేవీలను పోలీసులు విశ్లేషించారు. దీంతో మరో 30 మంది వీఐపీల పేర్లు బయటికి వచ్చాయి. వీరంతా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారస్తులుగా గుర్తించారు. దీంతో వీరందరికీ నోటీసులు ఇచ్చి, విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అమన్‌తో సహా మరో 20 మంది.. డ్రగ్ పెడ్లర్ల నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన మరో 20 మంది మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ వచి్చంది. దీంతో నిందితులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్‌తో పాటు ఫిల్మ్‌నగర్‌కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్‌కు చెందిన అని, గచి్చ»ౌలికి చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రసాద్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన హృతిక్ కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్, గచి్చబౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ను సరఫరా చేసిన ప్రధాన సూత్రధారులు ఎబుకా సుజీ, ఫ్రాంక్లిన్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. బండ్లగూడ నుంచే చెల్లింపులు.. డ్రగ్స్ కింగ్‌పిన్ ఎబుకా సుజీ నుంచి బ్లెస్సింగ్‌కు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. ఈమె విమానాలు, రైళ్లు, బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను రవాణా చేస్తోంది. ఇప్పటివరకు బ్లెస్సింగ్ 20 సార్లు నగరానికి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చింది. ఈమె నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ వీటిని ఏపీలో రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాల్లో వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఇందుకుగాను గౌతమ్‌కు నైజీరియన్ నుంచి 9 నెలల్లో రూ.10 లక్షల కమీషన్ అందిందని, బండ్లగూడలోని లుంబినీ కమ్యూనికేషన్స్ ద్వారా నగదు చెల్లింపులు జరిగినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. -
బైరాగిగూడలో మరోసారి బుల్లెట్ కలకలం
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి బైరాగిగూడ విద్యానగర్ కాలనీలో మంగళవారం తుపాకీ తూటా కలకలం రేపింది. పద్మ అనే మహిళ కాలును తాకుతూ వెళ్లింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడింది. బాధితురాలు పద్మ, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పద్మ తమ ఇంటి ముందు దుస్తులు ఆరేస్తుండగా కాలుకు అకస్మాత్తుగా ఏదో వస్తువు తగిలినట్లయ్యింది. కాలును గీసుకుని వెళ్లి రక్త్రస్తావమైంది. ఆ ప్రాంతంలో వెతకగా బుల్లెట్ కనిపించింది. కాలికి కాకుండా శరీరం పైభాగంలో అది తగిలి ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు బుల్లెట్‌ను స్వా«దీనం చేసుకుని బాధితురాలిని గోల్కొండ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆర్మీ బుల్లెట్‌గా గుర్తింపు.. గంధంగూడకు ఒకవైపు మిలిటరీ, మరోవైపు పోలీస్ ఫైరింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఇటీవల ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండటంతో బుల్లెట్లు చుట్టు పక్కల ఉన్న జవావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంధంగూడలో మహిళకు తగిలిన బుల్లెట్ ఆరీ్మదిగా గుర్తించామని, వారికి ప్రజలకు హాని కలిగే పరిస్థితులు వివరిస్తూ నోటీసు పంపుతామని పోలీసులు తెలిపారు. క్లూస్ టీంతో ఆదారాలను సేకిరించామని, తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
హైదరాబాద్: మహిళ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
సాక్షి, రంగారెడ్డి: నార్సింగ్‌లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళ కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తుండగా ఘటన జరిగింది. ఈ నెలలోనే ఇది రెండో ఘటనకాగా, ఈ నెల 13న నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది. ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
నార్సింగి కేసులో కీలక మలుపు.. 50 మంది సెలబ్రిటీల గుర్తింపు!
హైదరాబాద్, సాక్షి: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నార్సింగి డ్రగ్స్ కేసులో అమన్ సహా పలువురిని జులై 15వ తేదీన జాయింట్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. వాళ్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ టైంలో 19 మంది ప్రముఖులకు పోలీసులు నోటీసులు పంపించారు. తాజాగా.. నిందితులు మరో 30 మంది సెలబ్రిటీల పేర్లు వెల్లడించారు. ఇందులో ప్రముఖ కంపెనీల యాజమానులు సైతం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో సెలబ్రిటీల సంఖ్య 50కి చేరినట్లయ్యింది. -
నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు కాగా, వారిలో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు.. ఏ 10గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను పోలీసులు చేర్చారు.నైజీరియా-ఢిల్లీ-హైదరాబాద్-ఏపీ లోని పలు ప్రాంతాలకు డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతం, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా సాగుతోంది. పెడ్లర్లను ఆర్థికంగా ఆదుకుంటున్న నైజీరియన్లు.. వారికి కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్ సరఫరాకు ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్‌పిన్‌గా నైజీరియాకు చెందిన ఎబుకాగా పోలీసులు పేర్కొన్నారు. ఎబుకా నుండి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ అంగీకరించాడు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి.9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పేడ్లర్ గౌతంకు నైజీరియన్ ముట్టచెప్పాడు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లించారు. వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకుంది. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు కారణంగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2017లో ఫేస్ బుక్‌లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం అయ్యింది. బెంగుళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పని చేశాడు. -
హైదరాబాద్: అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లిన బులెట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది.ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నార్సింగిలో ఓ ఇంజినీర్‌ను దారుణ హత్య చేశారు. ఇజాయత్ అలీ కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. శనివారం.. దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు ఇంజనీర్‌ను కదలకుండా పట్టుకోగా, మరొకరు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పరారైనట్లు తెలుస్తోంది.వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నార్సింగీ హిట్ అండ్ రన్ కేసుపై అనుమానాలు
సాక్షి, రంగారెడ్డి: నార్సింగీలో సోమవారం మరో హిట్ అండ్ రన్ కేసు చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినా వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్పై ప్రమాద సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ అయిన వాహనాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. యువకుడిని ఢీకొట్టి పరారైంది రెడీ మిక్సర్ వాహనంగా పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుమానం.. రోడ్డు ప్రమాదంలో మృతుడిని ఆర్మీ సైనికుడిగా గుర్తించారు. గోల్కొండ ఆర్టలరీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ కులాన్గా గుర్తించారు. హింట్ అండ్ రన్ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు అసలు ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు ప్రమాద స్థలానికి భారీగా చేరుకున్నారు. -
షణ్ముక్ గంజాయి కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు!
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్, అతని సోదరుడు సంపత్ వినయ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తునకు వెళ్లిన పోలీసులకు వారి వద్ద గంజాయి లభ్యమైంది. వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పోలీసులకు బాధిత యువతి తన వాంగ్మూలం ఇచ్చింది. ఆ యువతితో వినయ్‌కు మూడేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమెకు ఒకసారి అబార్షన్ కూడా చేయించినట్లు సమాచారం. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నయవంచనకు గురి చేశాడని యువతి పేర్కొంది. దీనికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాధిత యువతి వెల్లడించింది. పోలీసులతో కలిసి వినయ్ ఫ్లాట్‌కు వెళ్లగా.. షణ్ముక్ వద్ద డ్రగ్స్, గంజాయి దొరికాయని తెలిపింది. వారితో తనకు ప్రాణహాని ఉందని.. న్యాయం కావాలని యువతి పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యువతి వాంగ్మూలంలో సంచలన విషయాలు.. యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 'సంపత్‌ను యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిచయం చేశాడు. మా పరిచయం ప్రేమగా మారాక సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంత పెట్టగా.. చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్ పేరెంట్స్ అప్పారావుకి చెప్పా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలకు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్‌కి మరో యువతి తో పెళ్లి అయ్యిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.'అని తెలిపింది. పోలీసులతో కలిసి నానక్‌రామ్‌గూడలోని సంపత్ ఫ్లాట్‌కి వెళ్లాను. అక్కడే షణ్ముక్ ఉన్నాడు. అతని వద్ద గంజాయి.. డ్రగ్స్ పిల్స్ ఉన్నాయి. జావేద్ అనే కానిస్టేబుల్ షణ్ముక్‌కు సహకరించే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని వెంటనే కిందకు వెళ్లమని బలవంతపెట్టాడు. నన్ను కాంప్రమైజ్ అవమని కానిస్టేబుల్ ఒత్తిడి తెచ్చాడు. నా దగ్గర విడియో కూడా ఉందని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది -
లావణ్య కథా చిత్రం
-
నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
-
Narsingi Animal Fest Photos: నార్సింగిలో మూడో రోజు పశు సంక్రాంతి (ఫొటోలు)
-
బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారిపై నార్సింగిలో కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కోకాపేట ల్యాండ్స్.. వివరాల ప్రకారం.. నార్సింగిలో భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్ ప్రతినిధి గుండు శ్రవణ్ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. అక్రమంగా తరలింపు.. అయితే, గోల్డ్‌ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్నట్టు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు. డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు అని తెలిపారు. దీంతో, తాము పోలీసులను ఆశ్రయించినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటుగా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హరీశ్వర్ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం -
నార్సింగిలో నీట మునిగిన విల్లాలు
-
HYD: భారీగా గంజాయి స్వాధీనం.. బీటెక్ విద్యార్థులే టార్గెట్..
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ చౌరస్తాలో గంజాయి కలకలం రేగింది. 12 కిలోల గంజాయిని నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి దందా సాగుతోంది. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: Madhapur: డ్రగ్స్‌తో పాటు వ్యభిచారం కూడా! -
హైదరాబాద్ లో విషాదంతమైన బాలుడి మిస్సింగ్
-
హైదరాబాద్‌లో విషాదాంతమైన బాలుడి మిస్సింగ్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పాడుబడ్డ బావిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం కిరాణా షాప్‌కు వెళ్లిన బాలుడు బన్నీ..ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఇంటి పరిసర ప్రాంతాల్లో వెదికారు. అయినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెస్క్యూ టీమ్ సాయంతో ఓ పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నీళ్లు తోడేసి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. -
హైదరాబాద్‌లో బ్రాండెడ్ కార్లతో రేసింగ్.. బడాబాబుల పిల్లల రచ్చ రచ్చ
సాక్షి, హైదరాబాద్: నగరంలో కుర్రోళ్లు కారు రేసింగ్‌తో రెచ్చిపోతున్నారు. బడా బాబుల పిల్లలు బ్రాండెడ్ కార్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ శివారు నార్సింగిలో మితిమీరిన వేగంతో కారు రేసింగ్ నిర్వహించిన యువకులు.. స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. దీంతో స్థానికులు ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. కార్లను సీజ్ చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. సయ్యద్ మాజీద్ హుస్సేన్, రాకేష్, నారాయణ, ధనరాజ్, రమణ, మణికంఠ శర్మలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారంతా బడా బాబులు పిల్లలు కావడంతో వదిలిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. సంచలనాలు వెలుగులోకి.. -
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రేమోన్మాది ఘాతుకం
-
HYD: ఐటీ ఉద్యోగిపై జొమాటో డెలివరీ బాయ్ దాడి.. ప్రేమే కారణం?
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమై యువకుడు దాడి చేశాడు. ఆమె మెడపై, చేతులపై కత్తితో దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో, హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. వాసవిపై గణేశ్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటూ గణేశ్.. వాసవిని హోటల్ వద్దకు పిలిచాడు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చింది. వారిద్దరూ మాట్లాడుకున్న కాసేపటికే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, ఆవేశానికి లోనైన గణేశ్.. తన బ్యాగులో ఉన్న కత్తిలో ఒక్కసారిగి ఆమెపై దాడి చేశాడు. మెడ, చేతిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, తనను ప్రేమించలేదన్న కోపంతోనే గణేశ్ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, వాసవి, గణేశ్.. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, గణేశ్ జొమాటోలో పనిచేస్తున్నాడు. ఇక, వీరిద్దరూ గచ్చిబౌలి ఏరియాలోని ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రియురాలికి చీరను తీసుకెళ్లి శవమయ్యాడు! -
నార్సింగ్: కుర్రాడి అతివేగం.. ఓవర్ టేక్ చేయబోయి..
-
సరదాగా తిరిగొద్దామనుకుంటే.. కబళించిన మృత్యువు
సాక్షి, మణికొండ (హైదరాబాద్): వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతున్న పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. వేసవి సెలవులు కావటంతో ఓ రోజంతా ఓషన్ పార్కు, వండర్లా లాంటి ప్రదేశాల్లో సరదాగా గడుపుదామని స్నేహితులతో కలిసి బయలుదేరారు. ఒకే కారులో 11 మంది ఎక్కారు. కబుర్లు చెప్పుకుంటూ, ఉత్సాహంగా వెళుతున్న వారికి ఊహించని ప్రమాదం ఎదురయ్యింది. ముందు వెళుతున్న బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో.. ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. పిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పార్క్ తెరవక పోవడంతో.. వీరంతా కూకట్పల్లి సమీపంలోని నిజాంపేట్‌లో నివసిస్తూ వాచ్మెన్లు, కూలీలుగా పనిచేస్తూ.. చిన్నచిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న కుటుంబాల పిల్లలు. వీరిలో నిజాంపేటలో కూరగాయల వ్యాపారి అయిన ఈదులపల్లి శివారెడ్డి కుమార్తెలు అక్షిత, అంకిత కూడా ఉన్నారు. వీరు శుక్రవారం ఉదయమే స్నేహితులతో కలిసి తమ ట్రైబర్ (టీఎస్ 08 జీడబ్ల్యూ 3102) కారులో బయలుదేరారు. నిజాంపేటలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న ప్రసాద్ కారును నడుపుతున్నాడు. మొదట గండిపేటలోని ఓషన్ పార్కుకు 9.30 గంటల సమయంలో చేరుకున్నారు. అప్పటికి పార్కు తెరవక పోవటంతో గండిపేట చెరువు వెనుక ఖానాపూర్ వైపు అల్పాహారం కోసం వెళ్లారు. తిరిగి పార్కుకు వస్తూ ఖానాపూర్ గ్రామం దాటగానే లక్షమ్మ అమ్మవారి దేవాలయం వద్ద ముందు వెళుతున్న బస్సును ఎడమవైపు నుంచి ఓవర్ టేక్ చేసేందుకు ప్రసాద్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో రోడ్డుకు ఎడమవైపు నిలిచి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ఎడమమైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. దాంతో అటువైపే కూర్చున్న అంకిత (16), అక్షిత (18)లతో పాటు నితిన్ (17) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారిని పోలీసు లు, స్థానికులు మెహిదీపట్నంలోని ప్రీమియర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తాటి అమృత్ (25) అనే విద్యార్థి మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారు 100 కి.మీ పైగా వేగంతో వెళుతున్నట్లు తెలిసింది. ముగ్గురి పరిస్థితి విషమం.. కారును నడుపుతున్న ప్రసాద్‌కు తీవ్ర గాయా లు కావటంతో తొలుత మెహిదీపట్నంలోని ఆసుపత్రికి, అనంతరం కిమ్స్ ఆసుపత్రికి తర లించారు. అతనితో పాటు ఎమలాపురి అర్జున్, చిన్నవుల ప్రదీప్‌కుమార్‌ల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఎమలాపురి దివ్య, చిన్నవుల సుస్మిత, సత్యవాడ అఖిల, తాటి దనుష్యలు కూడా గాయపడ్డారని, వారి పరిస్థితి సాధారణంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అర్జున్, దివ్యలు అక్కా, తమ్ముడు కాగా.. రెండు కుంటుంబాలకు చెందిన ఇద్దరు మృతి చెందటం, ఇద్దరు గాయపడటంతో వారి తల్లిదండ్రులు ఆసుపత్రుల కన్నీరుమున్నీరుగా విలపించారు. అతి వేగమే కారణం.. అతి వేగంగా కారణంగానే ప్రమాదం జరిగిందని, నార్సింగి పోలీసులతో పాటు ఖానాపూర్ వాసులు తెలిపారు. బైక్ మెకానిక్‌గా పనిచేసే యువకుడు కారును నడపటం, ఎడమవైపు నుంచి ఓవర్ టేక్ చేయాలనుకోవటం, రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని గమనించక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. చదవండి: TS: రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే -
నార్సింగ్: అతివేగం.. తొమ్మిది కుటుంబాల్లో విషాదం!
సాక్షి, హైదరాబాద్: అంతా 20 ఏళ్లలోపు వాళ్లే. ఇంటర్మీడియట్ పూర్తి చేసి.. సెలవుల్లో ఉన్నారు. సరదాగా రిసార్ట్ వెళ్లి వద్దామని బయటకు వచ్చారు. చిన్న వయస్సు కావటం.. కారు డ్రైవింగ్ లో అనుభవం లేకపోవటం ఒకటి అయితే.. ఓవర్ స్పీడ్.. తొమ్మిది కుటుంబాల్లో విషాదం నింపింది. నగరంలోని నార్సింగ్‌లో ఈరోజు(శుక్రవారం, మే 19) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులంతా నిజాంపేట్‌కు చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉండగా.. అందరూ 20 ఏళ్లలోపు వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. వీరంతా నిజాంపేట్ నుంచి ఓషెన్ పార్క్‌కు వెళ్తుండగా నార్సింగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న కారు.. టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొక విద్యార్థి మృతిచెందాడు. ప్రసాద్ అనే కుర్రాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. నితిన్, హర్షిత, అంకిత ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు హర్షిత, అంకిత అక్కా చెల్లెళ్లు. అయితే యాక్సిడెంట్లో బ్రెయిన్ బయటకు రావడంతో డ్రైవర్ ప్రసాద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మృతురాలు హర్షిత తన తండ్రి కారును తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హుషారుగా బయటకు వెళ్లొస్తామంటూ చెప్పిన తమ బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రైట్ సైడ్ అక్కడికక్కడే.. ప్రమాద సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో కారు ముందు సీట్లో డ్రైవింగ్ చేసిన ప్రసాద్‌తో పాటు ఇద్దరు విద్యార్థులు కూర్చున్నారు. కారు మధ్య సీట్లో ఐదుగురు, ఆ వెనుక సీట్లో మరో నలుగురు కూర్చున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ పొజిషన్‌కు రైట్ సైడ్ కూర్చున్న నలుగురు మృతి చెందారు. ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా ఫలితం లేకుండా పోయింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారులోనే హర్షిత, అంకిత అనే సొంత అక్కాచెల్లెళ్లు చనిపోయారు. దీంతో ఆ ఇంట పెను విషాదం నెలకొంది. మిగతా వాళ్లకూ త్రీవ గాయాలు అయ్యాయి. -
మత మౌఢ్యమే సమస్య
మణికొండ (హైదరాబాద్): మందిరాలు, మసీదులు, చర్చిలు ఏవైనా, ఏమతం వారికైనా సాంత్వన చేకూరుస్తాయని.. శాంతిని నెలకొల్పుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని వీలైనంతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరమాత్మను అనేక రూపాలలో ఆరాధించడం మానవజాతి తొలినాళ్ల నుంచీ ఉందని పేర్కొన్నారు. ఆలయాలు సామాజిక కేంద్రాలని (కమ్యూనిటీ సెంటర్లు), అన్ని మతాలు శాంతినే ప్రబోధిస్తాయని చెప్పారు. మతం సార్వజనితమని.. కానీ మత మౌఢ్యం మనిషితో అమానుషమైన పనులు చేయిస్తుందన్నారు. ప్రపంచంలో ఏ మతం హింసను బోధించలేదని.. మధ్యలో వచ్చినవారే దీనిని జతచేసి చిచ్చుపెడుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ రూ.200 కోట్లతో 400 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న శ్రీరాధాకృష్ణ, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాల సముదాయం, హెరిటేజ్ టవర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదుల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత పెంపొదిస్తున్నాం ‘‘హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో మానవ జీవితాల్లో వేగం పెరుగుతోంది. ఎన్నో సమస్యలు, రోగాల వంటివాటిని జనం ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ఆలయాల్లో సాగే భజనలు, కీర్తనలు స్వాంతన చేకూర్చే ఔషధాలుగా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే అత్యద్భుతంగా నిర్మించిన యాదగిరిగుట్ట దేవాలయానికి సర్వత్రా అభినందనలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం..’’అని కేసీఆర్ తెలిపారు. ‘హరేకృష్ణ’సహాకారం గొప్పది హరేకృష్ణ మూవ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహాకారం ఎంతో గొప్పదని సీఎం కేసీఆర్ శ్లాఘించారు. అక్షయపాత్ర, అన్నపూర్ణ పథకం వంటివాటి ద్వారా లక్షలాది మంది ఆకలి తీరుస్తోందన్నారు. ఒక్క ఫిర్యాదు లేకుండా ఒక్కరోజు ఆగకుండా నిర్విరామంగా చేస్తున్న కృషి వారి అంకితభావానికి నిదర్శనమన్నారు. కరోనా వంటి ఉపద్రవాలు వచ్చిన సమయంలో కూడా ముందుకొచ్చి సేవామూర్తులుగా నిలిచారన్నారు. నార్సింగిలో చేపట్టిన ఆలయాన్ని త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఆధ్యాత్మికంగా, సామాజికంగా సేవ అందించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మతమౌఢ్యాన్ని తరిమికొట్టేందుకు హరేకృష్ణ మూవ్మెంట్ వంటి సంస్థలు కృషి చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్ల విరాళం ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుంది హరేకృష్ణ హెరిటేజ్ టవర్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందని.. సాంస్కృతిక పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతుందని హరేకృష్ణ మూవ్మెంట్ చైర్మన్ మధు పండిత దాస అన్నారు. తరాలు మారినా తరగని మన అద్భుత సంస్కృతిని ఆస్వాదిస్తూనే.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.సబితారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, జైపాల్‌యాదవ్, హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌరదాస, శ్రీకృష్ణ గోసేవ మండలి కార్యదర్శి సురేశ్‌కుమార్ అగర్వాల్, పలువురు నేతలు, దాతలు పాల్గొన్నారు. -
రంగారెడ్డి: ఉసురు తీసిన కంత్రీగాళ్లు
సాక్షి, రంగారెడ్డి: నార్సింగిలో జరిగిన దారుణ ఘటనపై స్థానికులు రగిలిపోతున్నారు. పెట్రోల్ బంక్‌లో పని చేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేసి.. అకారణంగా ఒకరిని పొట్టనబెట్టుకున్నారు. అయితే దాడికి పాల్పడిన దుండగలకు నేర చరిత్ర ఉన్నట్లు ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. మరోవైపు సంజయ్ మృతికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని అతని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఏం జరిగిందంటే.. అర్ధరాత్రి 12 గంటలకు జన్వాడలోని ఓ పెట్రోల్ పంప్ వద్దకు కారులో ముగ్గురు యువకులు చేరుకున్నారు. అయితే.. సమయం దాటిపోవడం, పైగా వాళ్లు మద్యం మత్తులో ఉండడంతో పెట్రోల్ లేదని చెప్పారు కార్మికులు. అయితే.. తాము చాలా దూరం వెళ్లాలని ఆ యువకులు బతిమాలారు. దీంతో.. పెట్రోల్ పోశారు కార్మికులు. ఆపై వాళ్లు కార్డు పని చేయట్లేదని యువకులు బుకాయించారు. దీంతో.. క్యాష్ ఇవ్వమని సిబ్బంది కోరడంతో గొడవకు దిగారు. మాకే ఎదురు మాట్లాడుతారా? అంటూ ఆ మగ్గురు రెచ్చిపోయి బంక్ క్యాషియర్‌పై దాడికి దిగారు. అక్కడే పని చేసే సంజయ్ అది గమనించి.. వాళ్లను అడ్డుకోబోయాడు. దీంతో సంజయ్‌పై పిడిగుద్దులు కురిపించడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది చూసి యువకులు పారిపోగా.. సంజయ్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పెట్రోల్ బంక్‌లో అమర్చిన సీసీ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు నమోదు అయ్యాయి. కేసు నమోదు.. వెతుకులాట ఇదిలా ఉంటే.. సంజయ్ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని జన్వాడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి.. ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. జోక్యం చేసుకున్న పోలీసులు న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఉత్తపుణ్యానికే సంజయ్ ప్రాణం పోవడంతో అతని కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. మరోవైపు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూక్‌గా గుర్తించారు. ప్రస్తుతం వాళ్లను పట్టుకునే యత్నంలో ఉన్నారు. ఇక నిందితులు నిందితులు అనూప్, నరేందర్, మల్లేష్ పై నార్సింగిలో పలు కేసులు నమోదు అయ్యాయి. అత్యాచారంతో పాటు దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు ఈ కంత్రీగాళ్లు. గత నెలలో స్థానికంగా ఓ విలేకరిపైనా దాడి చేశారు వీళ్లు. -
ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థి స్వాత్విక్ సూసైడ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు నార్సింగి పోలీసులు హాజరుపరిచారు కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. గత మంగళవారం రాత్రి క్లాస్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. చదవండి: సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు. -
నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ కోమటిరెడ్డి దీక్ష
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు. సాత్విక్ సూసైట్ నోట్లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళకు దిగారు. దీంతో పోలీసులు కాలేజీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై హెచ్ఆర్డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సున్నితమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. చదవండి: సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్! -
టార్చర్ తట్టుకోలేను.. వెళ్లిపోతున్నా..
ఒక్కసారి రా.. నాన్నా.. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్.. కాలేజీలో వేధింపులు భరించలేక చనిపోదామనుకున్నాడు.. నాన్న చివరి చూపు.. అమ్మతో ఆఖరి మాటల కోసం తపించాడు. ‘జ్వరం వచ్చింది.. ఒక్కసారి రా నాన్నా..’ అని ఫోన్ చేసి తండ్రిని పిలిపించుకున్నాడు. ఆఖరి సారిగా అమ్మతో ఆప్యాయంగా మాట్లాడాడు. అంతకు ముందే ‘మిస్ యూ అన్నా.. నన్ను క్షమించు.. అమ్మానాన్నను బాగా చూసుకో’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. తరగతి గదిలోనే ఉరివేసుకున్నాడు. కాలేజీలో పెట్టే నరకం భరించలేక... సూసైడ్ నోట్లో సాత్విక్ ఆవేదన బుధవారం సాయంత్రం నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు. మణికొండ (హైదరాబాద్)/ షాద్‌నగర్: ‘సరిగా చదవడం లేదంటూ తిడుతున్నారు. మార్కులు రాకుంటే గేటు బయట వాచ్‌మన్‌గా కూడా పనికిరావని అవమానిస్తున్నారు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్‌ను, నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను..’’ అంటూ ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ అధ్యాపకులు, హాస్టల్ నిర్వాహకుల వేధింపులతో మనస్తాపం చెంది తరగతి గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అంతేకాదు హాస్టల్లో సాత్విక్ కనిపించడం లేదని చెప్పినా, ఉరివేసుకున్నట్టు తెలిసినా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని తోటి విద్యార్థులు చెప్పారు. తామే మోసుకుంటూ కాలేజీ బయటికి మోసుకొచ్చి, ఓ వాహనదారుడిని లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ అప్పటికే సాత్విక్ మరణించాడని తెలిపారు. బుధవారం విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగటంతో ఈ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి సాత్విక్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం చేశాక కుటుంబ సభ్యులు సాత్విక్ మృతదేహాన్ని షాద్‌నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. పరీక్షలు ఉన్నాయని ఆగి.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన నాగుల రాజు షాద్‌నగర్‌లో ఉంటూ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సాత్విక్ నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. శివరా>త్రి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన సాత్విక్.. కాలేజీలో వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే 15 రోజుల్లో పరీక్షలు ఉన్నాయని, ముగిసిన వెంటనే మరో కాలేజీలో చేర్పిస్తామని తండ్రి సర్దిచెప్పాడు. దీనితో సాత్విక్ నాలుగు రోజుల క్రితం హాస్టల్‌కు తిరిగొచ్చాడు. జ్వరం వచ్చిందంటూ సాత్విక్ ఫోన్ చేయడంతో.. తండ్రి రాజు మంగళవారం రాత్రి 8గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చి మాట్లాడి, మందులు ఇచ్చి వెళ్లిపోయారు. హాస్టల్లో రాత్రి 10.30 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించారు. అందరి కంటే ముందుగా స్టడీ హాల్ నుంచి లేచిన సాత్విక్.. నేరుగా తరగతి గదికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నది ఈ గదిలోనే.. చెప్పినా పట్టించుకోని సిబ్బంది.. స్టడీ హాల్ నుంచి హాస్టల్ గదికి వచ్చాక సాత్విక్ రాలేదని గుర్తించి, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా.. ‘అతడే వస్తాడు, మీరు పడుకోండి..’ అంటూ నిర్లక్ష్యం చేశారని తోటి విద్యార్థులు చెప్పారు. గట్టిగా అరవడంతో అర గంట తర్వాత గేట్ తీశారని, కాలేజీ అంతా వెతకగా సాత్విక్ ఓ తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడని వివరించారు. వెంటనే అతడిని కిందికి దింపామని.. ప్రాణాలతో ఉన్నట్టు కనిపించడంతో కాలేజీ బయటికి తామే మోసుకుంటూ వచ్చామని తెలిపారు. ఇది చూసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని.. పైగా ఎలాంటి శబ్దం చేయకుండా తీసుకెళ్లా్లని చెప్పారని వాపోయారు. దీంతో తాము సాత్విక్‌ను మెయిన్ రోడ్డు వరకు మోసుకుంటూ వచ్చి, ఓ వాహనదారుడ్ని లిఫ్ట్ అడిగి సమీపంలోని నర్సింగ్ హోంకు తరలించామని.. కానీ అప్పటికే సాత్విక్ చనిపోయాడని డాక్టర్ చెప్పారన్నారు. ఇంటికి వచ్చిన అరగంటలోపే.. నాగుల రాజు తన కుమారుడికి మందులు ఇచ్చి సుమారు రాత్రి 10 గంటల సమయంలో షాద్‌నగర్‌లోని ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అర గంట సేపటికి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచ్చింది. దీనితో కుటుంబమంతా హతాశులయ్యారు. సాత్విక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సాత్విక్ తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి అలివేలు, అన్న మిథున్లు పోలీసుల కాళ్లు పట్టుకుని, నిందితులను శిక్షించాలంటూ వేడుకున్న తీరు కలచి వేసింది. సమగ్ర విచారణకు మంత్రి సబిత ఆదేశం సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవాలని, త్వరగా విచారణ నివేదిక ఇవ్వాలన్నారు. అవమానించడంతోనే.. ఎక్కువ మార్కులు రాకపోతే కాలేజీ గేటు ముందు వాచ్‌మన్‌గా కూడా పనికిరారని, ర్యాంకు వచ్చేలా చదవాలని కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్లు వేధించడంతోనే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నా కుమారుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. – అలివేలు, సాత్విక్ తల్లి రోదిస్తున్న సాత్విక్ తల్లి, సోదరుడు చదువు ఒత్తిడి ఇలా చేస్తుందనుకోలేదు సాత్విక్‌కు కాలేజీలో ఎదురవుతున్న ఇబ్బందులను నాకు చెప్పాడు. దీనిపై కాలేజీ వారితో మాట్లాడుతానని సర్దిచెప్పాను. ఇంతగా తట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఉంటే ఇంటికి తీసుకెళ్లే వాడిని. కాలేజీ నిర్వాహకులు ఫీజులు, ర్యాంకులు తప్ప విద్యార్థుల మనోభావాలతో పనిలేకుండా వ్యవహరిస్తున్నారు. కానీ చదువే ఇలా చావు వరకు తెస్తుందని ఊహించలేకపోయాం. – నాగుల రాజు, సాత్విక్ తండ్రి చదవడం లేదని రక్తం వచ్చేలా కొట్టారు గతంలో సరిగా చదవడం లేదం టూ నన్ను ముక్కుమీద గుద్దితే రక్తం వచ్చింది. కనికరం కూడా లేకుండా నాతోనే రక్తాన్ని కడిగించారు. షాద్‌నగర్ నుంచి వచ్చి చదువుకుంటున్న మా ఐదుగురు ఫ్రెండ్స్‌ను గాలి బ్యాచ్ అని హేళన చేసేవారు. కాలేజీ గేటు వద్ద వాచ్మన్లుగా కూడా పనికిరా రంటూ అవమానపర్చేవారు. – ప్రదీప్, తోటి విద్యార్థి వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు కాలేజీలో విద్యార్థులను ఉపాధ్యాయులు వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. దీనికి కారణమైన ముగ్గురు సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తాం. విద్యాసంస్థల్లో వేధింపులు, అసౌకర్యాలపై విచారణ చేస్తాం. – స్వామి, చైతన్య కళాశాల ఏజీఎం నిందితులను అదుపులోకి తీసుకున్నాం విద్యార్థి మృతికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జగన్‌లను అదుపులోకి తీసుకున్నాం. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – జీవీ రమణగౌడ్, ఏసీపీ, నార్సింగి -
‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసులో సాత్విక్ సూసైడ్ లేఖ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తను అనుభవించిన బాధను సాత్విక్ లేఖలో రాసుకొచ్చాడు. ప్రిన్సిపల్, కాలేజీ ఇంచార్జ్, లెక్చరర్ పెట్టే టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ‘అమ్మానాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్ధేశం నాకు లేదు. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులను తట్టుకోలేకపోయాను. వీరు నలుగురు నాతోపాటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సారీ అమ్మా.. నేను పడిన టార్చర్ వేరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా. నన్ను వేధించిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలి. అమ్మా నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్’ అంటూ సాత్విక్ తన సూసైడ్ నోట్లో రాశాడు. కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు. -
బాధ్యులైన వారిని శిక్షిస్తాం : మంత్రి సబిత
-
సాత్విక్ ఆత్మహత్యపై మంత్రి సబితా సీరియస్
-
నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య
-
శ్రీ చైతన్య కాలేజీలో విషాదం
సాక్షి, హైదరాబాద్: శ్రీ చైతన్య కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో, స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీ సిబ్బందిని సాయం కోరగా వాళ్లు పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు. దీంతో, తోటి విద్యార్థులు బయట వాహనం లిఫ్ట్ అడిగి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం, సాత్విక్ పోస్టుమార్టం కోసం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక, కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సాత్విక్ ఘటనపై విద్యార్థి పేరెంట్స్ స్పందించారు. గతంలో లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజులు ఆసుపత్రి పాలయ్యాడు. సాత్విక్‌ను ఏం అనొద్దని గతంలోనే చెప్పాం. మెంటల్ స్ట్రెస్‌కి గురిచేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాత్విక్ మృతితో శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. -
మెదక్: నార్సింగిలో అదృశ్యమైన ప్రేమజంట ఆత్మహత్య
-
3 నెలల క్రితమే పెళ్లి.. వివాహితను బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
సాక్షి,మెదక్ : నార్సింగిలో ఇద్దరి అదృశ్యం మిస్టరీగా మారింది. మండల కేంద్రానికి చెందిన వివాహిత, మరో యువకుడు ఒకే బైక్‌పై సోమవారం రామాయంపేటలో కలిసి తిరిగినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయినట్టు తెలిసింది. అయితే ఆ బైక్ , ఇద్దరి చెప్పులు మంగళవారం ఉదయం నార్సింగి చెరువు వద్ద లభ్యమయ్యాయి. కూతురు కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది. సదరు యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. శివరాత్రి పండగ నిమిత్తం ఈనెల తొమ్మిదివ తేదీన ఆమెను అత్తగారింటినుంచి నార్సింగి తీసుకొచ్చారు. చెరువు వద్ద బైక్, చెప్పులు లభించడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని ముందుగా అందరూ అనుమానించారు. విషయం తెలియగానే గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. పోలీసులు గజ ఈతగాళ్లు, వలలతో చెరువులో గాలించినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. అయితే అందరి దృష్టిని మళ్లించడానికే బైక్, చెప్పులు చెరువు వద్ద విడిచి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మిస్టరీగా మారిన ఈకేసును త్వరలోనే చేధిస్తామని నార్సింగి ఎస్ఐ నర్సింలు పేర్కొన్నారు. -
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
నార్సింగిలో పశుసంక్రాంతి సందడి (ఫొటోలు)
-
నార్సింగిలో పశుసంక్రాంతి సందడి (ఫొటోలు)
-
Hyderabad: తుదిదశకు సైక్లింగ్ ట్రాక్ పనులు.. రెండు నెలల్లో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధునాతన సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో రెండు నెలల్లో ట్రాక్‌పై సైకిళ్లు పరుగులు తీయనున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని 23 కిలోమీటర్ల మార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యారణ పరిరక్షణ కోసం సైక్లింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఈ నిర్మాణాన్ని చేపట్టింది. గతేడాది సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.100 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును రెండు మార్గాల్లో చేపట్టారు. ఔటర్‌ను ఆనుకొని నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, కొల్లూరు నుంచి నార్సింగి వరకు 14.5 కిలోమీటర్ల మార్గంలో 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్లలో ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలకు ధీటైన అభివృద్ధి జరుగుతుందని హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తోన్న సైకిల్ ట్రాక్ నగర ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు. ఆరోగ్యవిహారం... సైక్లింగ్ ట్రాక్‌లో సైకిళ్లపైన పరుగులు తీయడం కేవలం ఒక వ్యాయామ ప్రక్రియగానే కాకుండా ఒక విహారంలాంటి అనుభూతిని కలిగించేవిధంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ట్రాక్ పొడవునా అక్కడక్కడా రెస్ట్రూమ్లు, కెఫెటేరియాలు, బ్రేక్‌ఫాస్ట్ సెంటర్లు ఉంటాయి. అలాగే సైకిళ్లను ఇక్కడే అద్దెకు తీసుకోవచ్చు. సైకిళ్లకు పంక్చర్లయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మరమ్మతులు చేసి ఇస్తారు. ట్రాక్ పొడవునా తాగునీటి సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు ఉంటాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. అలాగే ట్రాక్‌ను పూర్తిగా పచ్చదనం ఉట్టిపడేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్గంలో సైక్లింగ్ చేసేవారికి ఆకుపచ్చ నడవాలు పరుగులు తీస్తున్న అనుభూతి కలుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ ట్రాక్‌పైన సైక్లింగ్ పోటీలను కూడా నిర్వహించనున్నారు. మరోవైపు భద్రత దృష్ట్యా ట్రాక్ పొడవునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్ వినియోగం... ట్రాక్‌పై కప్పును పూర్తిగా సౌరఫలకలతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను ట్రాక్ అవసరాలకు వినియోగించనున్నారు. లైట్లు, తదితర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఇక్కడ వినియోగించగా మిగిలిన విద్యుత్‌ను ఇతరులకు వినియోగించే అవకాశం ఉంది. ఈ 23 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయిన తరువాత రెండో దశలో గండిపేట వద్ద అతి పెద్ద సైకిల్ ట్రాక్ నిర్మిచనున్నారు. -
నార్సింగి దారి దోపిడీ కేసులో విస్తుపోయే విషయాలు
-
నార్సింగీలో ఘనంగా ప్రారంభమైన సదర్ ఉత్సవాలు
-
నార్సింగిలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్‌లో మందుబాబులు బీభత్సం సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ జనాల ప్రాణాలు తీస్తున్నారు. 12 గంటల వ్యవధిలోనే రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూవీ టవర్స్ వద్ద సోమవారం మధ్యాహ్నం కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న దంపతులు ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట నుంచి భార్యభర్తలు తమ యాక్టివా స్కూటీపై పని నిమిత్తం గచ్చిబౌలి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనకనుంచి అతి వేగంగా వస్తున్న కారు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన దంపతులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులను దంపతులు దుర్గం రాజు, మౌనికగా పోలీసులు గుర్తించారు. మౌనిక నార్సింగి మున్సిపాలిటీలో పనిచేస్తోంది. అలాగే నిందితుడిని సంజీవ్‌గా గుర్తించిన పోలీసులు మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిందని తెలిపారు. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 108 చూపించింది. దీంతో సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, -
ఆస్పత్రిలో నరకయాతన; టార్చిలైటు వెలుతురులో డెలివరీ
మణికొండ: ప్రభుత్వ ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దుతాం.. ప్రైవేటుకు దీటుగా సేవలందించేలా చర్యలు తీసుకుంటాం.. ఇవీ ప్రభుత్వ పెద్దల ఊకదంపుడు ఉపన్యాసాలు.. వాస్తవానికి వచ్చే సరికి ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర రాజధానికి ఆనుకునే ఉన్న గండిపేట మండలం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో చీకట్లోనే డెలివరీ(కాన్పులు)లు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుత్ సరఫరాకు అంతారాయం కలిగితే తక్షణ అవసరంగా ఏర్పాటు చేసిన ఇన్వర్టర్లు మరమ్మతులకు గురికావటంతో దాన్ని పట్టించుకోవటం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో డెలివరీల కోసం వస్తున్న మహిళలు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భంలో నరకయాతన అనుభవిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి రోజుల వయసు ఉన్న పిల్లలు సైతం ఉక్కపోతను భరించలేక తీవ్రంగా ఏడుస్తున్నారు. ఇన్వర్టర్ మరమ్మతులకు అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవటంతోనే దాన్ని పక్కన పడేసినట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. శనివారం డెలివరీ నిమిత్తం వచ్చిన ఓ మహిళ బంధువులు సెల్‌ఫోన్ టార్చిలైటు వెలుతురులో డెలివరీ చేస్తున్న సిబ్బంది ఫొటోలను తీసి స్థానిక విలేకరులకు పంపారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ రాష్ట్ర రాజధాని పక్కనే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాలలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు వాపోయారు. మరమ్మతులు చేయిస్తాం గతంలో ఇన్వర్టర్ను మరమ్మతు చేయించినా తిరిగి అదే పరిస్థితికి వచ్చింది. మరమ్మతులకు సంబంధించిన నిధులు రావటం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినపుడు మహిళలు ఇబ్బంది పడుతున్న విసయం వాస్తవమే. వెంటనే తన సొంత డబ్బుతోనైనా మరమ్మతులు చేయిస్తా. – పద్మ, మండల వైద్యాధికారి, గండిపేట మండలం -
తమ్ముడికి ఐస్‌క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పింది.. ఆమె మాత్రం!
సాక్షి, రంగారెడ్డి : తన తమ్ముడికి ఐస్‌క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన నార్సింగిలో చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లలితాబాయి, రాందాస్ దంపతులు కుమార్తె స్వాతి బాయి, కుమారుడితో కలసి నార్సింగిలో నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం స్వాతి బాయి(19) తన తమ్ముడికి ఐస్ క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లింది. అతనికి ఐస్‌క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పి కనిపించకుండా పోయింది. రాత్రి ఇంటికి రాకపోవడం, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో ఆమె తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఆటోలో ఎంజీబీఎస్‌కు వెళ్లినట్టు గుర్తించారు. తల్లి ఫిర్యాదులో ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆదిశగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. ఏం కష్టమొచ్చిందో.. బిడ్డను చంపి ఉరేసుకున్న తల్లి -
భార్యను చంపి.. ఇంటికి తాళం వేసి..
హైదరాబాద్: హైదర్షాకోట్లో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ విలేజ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు బసవప్ప, అతని భార్య పద్మమ్మ నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోటలో నివాసం ఉంటున్నారు. బసవప్ప రోజువారీ కూలీ. బుధవారం రాత్రి, పని చూసుకుని ఇంటికి తిరిగి వచ్చిన బసవప్ప ఏదో విషయంపై తన భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేసినట్లు నర్సింగ్ పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం, పద్మమ్మ ఇంటి నుంచి బయటకు రాకపోయేసరికి పొరుగువారికి అనుమానం వచ్చింది. ఇంతలో బసవప్ప ఇంటికి తాళం వేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, వారు వెంబడించి బసవప్పను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ( చదవండి: కాళ్లపారాణి ఆరకముందే.. ) -
2020లో అతిపెద్ద డీల్ హైదరాబాద్‌లోనే..
సాక్షి, హైదరాబాద్: గతేడాది దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్ హైదరాబాద్‌లోనే జరిగింది. నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ నార్సింగి ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇందులో 18 ఎకరాలను నేరుగా కొనుగోలు చేయగా.. మిగిలిన 7 ఎకరాలను జాయింట్ డెవలప్మెంట్ కింద దక్కించుకుందని ఈ డీల్‌లో భాగస్వామ్యమైన సీబీఆర్ఈ ఇండియా తెలిపింది. గతేడాది హైదరాబాద్ వ్యవస్థీకృత రియల్టీ మార్కెట్లోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, వచ్చే త్రైమాసికాల్లో 50 శాతం మేర వృద్ధి చెందుతాయని పేర్కొంది. ఆయా పెట్టుబడుల్లో ఎక్కువ శాతం వాణిజ్య స్థలాల అభివృద్ధి, రెసిడెన్షియల్ హైరైజ్ బిల్డింగ్స్ విభాగంలోకి వచ్చాయని తెలిపింది. ఈ స్థలంలో ల్యాండ్‌మార్క్‌గా నిలిచే ప్రీమియం రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నట్లు రాజపుష్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. చదవండి: రిటైర్మెంట్ హోమ్స్.. పెద్దల కోసం ప్రత్యేక గృహాలు హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్.. రికార్డ్ బ్రేక్ -
హైదరాబాద్ : నార్సింగిలో పశుసంక్రాంతి జాతర
-
విషాదం: సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని సామ్రాట్ అపార్టుమెంట్లో రమ్యకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలనికి చేరుకొని పరిశీలించారు. రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకొన్న గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రమ్యకృష్ణకు వివాహం జరిగి ఐదేళ్లు అవుతోందని, ఆమె భర్త గోపి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. వీరికి కవల పిల్లలు ఉన్నారు. భార్యభర్తలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావంటతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఐదేళ్ల క్రితం వివాహం జరిగిందని, తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు లేవని రమ్యకృష్ణ భర్త గోపి తెలిపారు. ఆమె ఆత్మహత్యకు కలహాలే కారణమా? వేరే ఇబ్బందులేమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. -
చెవి పక్క నుంచి దూసుకెళ్లిన బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: వినాయకుని విగ్రహం నిమజ్జనం సందర్భంగా ఆర్మీ మాజీ జవాన్ ఒకరు తుపాకీతో హల్ చల్ చేశాడు. పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరపడంతో నిమజ్జనంలో పాల్గొన్నవారు భయభ్రాంతులకు లోనయ్యారు. నార్సింగిలోని హైదర్ష్కోటలో శివం హైట్స్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తిని నాగ మల్లేష్‌గా గుర్తించారు. నాగ మల్లేష్ రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో.. ఒకటి గాల్లోకి వెళ్లగా, మరకొటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: నిబంధనలు గాలికి వదిలేసి.. ప్రయాణం..) మాట వినకపోవడంతో.. ఘటనపై అపార్ట్మెంట్ వాసులు, వాచ్‌మన్ మాట్లాడుతూ.. హై రీచ్ బ్రాడ్ బ్యాండ్ మొదటి ఫ్లోర్లో ఉంది. వాళ్ల ఆఫీస్‌లో గణేష్ నిమజ్జనానికి 40 మందికిపైగా వచ్చారు. లిఫ్ట్ లో కిందకి పైకి తిరుగుతూనే ఉన్నారు. గట్టిగట్టిగా అరుస్తున్నారు. మెట్లపై, టెర్రస్‌పై మద్యం తాగుతూ హంగామా చేశారు. మేము హెచ్చరించినా పట్టించుకోలేదు. మూడో ఫ్లోర్‌లోని ఫ్లాట్‌లో ఉండే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మల్లేష్ పైకి వెళ్లి మద్యం తాగొద్దు అని చెప్పాడు. అయినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో ఓసారి ఫైర్ చేసాడు. అందరూ కిందకి వచ్చి సెల్లార్ లో డ్యాన్సులు చేస్తూ అరుస్తుండటంతో.. మరోసారి గాల్లోకి ఫైర్ చేశాడు. -
నార్సింగిలో తల్లి, కొడుకుల కిడ్నాప్ కలకలం
సాక్షి, నార్సింగి : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి, కొడుకు కిడ్నాప్ గురి కావడం కలకలం రేపింది. వివరాలు.. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని గంధంగూడకు చెందిన 37 ఏళ్ల ఆదిలక్ష్మి నాంపల్లి కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఆదిలక్ష్మి కొన్ని రోజులుగా గంధంగూడలోని అభయ ఆంజనేయ దేవాలయం గుడిలో ప్రదర్శనలు చేస్తున్నారు. బుధవారం కూడా ఆంజనేయ దేవాలయంలో ప్రదర్శనలు చేయడానికి తన కుమారుడు ప్రజ్వన్‌ను వెంటబెట్టుకొని వచ్చింది. ప్రదర్శన చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదిలక్ష్మి, ప్రజ్వన్‌లను కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఆ వ్యక్తులు వారి వెంట తెచ్చుకున్న ఎక్స్‌యూవీ 500 కారులో తల్లి, కొడుకును బలవంతంగా ఎక్కించుకోవడం ఆలయ పూజారి గమనించారు.వెంటనే ఈ విషయాన్ని నార్సింగి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలికి చేరుకున్నారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి రోజు 11 ప్రదక్షిణలు చేయడానికి ఆదిలక్ష్మి వస్తుందని పూజారి పేర్కొన్నారు. -
మహిళ కిడ్నాప్.. సామూహిక అత్యాచారం..!
సాక్షి, రంగారెడ్డి : హైదరాబాద్ శివారులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. నార్సింగి ప్రాంతంలోని పుప్పాల్ గూడలో కామాంధులు బరితెగించారు. ఓ మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు.. పుప్పాల్ గూడలో ఓ మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేశారు. కామంధుల చెర నుంచి తప్పించుకొన్న మహిళ రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. పారిపోతున్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా... ఇద్దరు తప్పించుకున్నారు. పట్టుబడ్డ మూడో వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. -
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రకాష్ గౌడ్ గెలుపు ఖాయం
సాక్షి, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ‘‘నార్సింగి మార్కెట్ కమిటీ’’ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో మళ్లీ ప్రకాష్ గౌడ్ గెలుపు ఖాయమని మహేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. నార్సింగి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చంద్రశేఖర్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా అన్నపూర్ణ, డైరక్టర్లను మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. -
నార్సింగిలో పేలిన సిలిండర్
హైదరాబాద్: రోడ్డు పక్కన తోపుడు బండిపై టిఫిన్ తయారు చేస్తుండగా సిలిండర్ పేలిన సంఘటన మంగళవారం నార్సింగిలో జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు లేచి ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. క్లూస్ టీం రంగంలోకి దిగి ప్రమాద ఘటనపై విచారణ చేపట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. -
నార్సింగిలో పేలిన సిలిండర్
-
నయీం బెడ్ రూంలో సిట్ సోదాలు
-
హైదర్షాకోట్ వద్ద రోడ్డు ప్రమాదం: దంపతుల మృతి
హైదరాబాద్ : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. 9 నెలల చిన్నారి మాత్రం తీవ్రంగా గాయపడింది. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్నారిని మాత్రం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల మాసాబ్ ట్యాంక్‌కు చెందిన అంజాద్ ఖాన్, వసీమా బేగమ్‌గా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి విందులో అశ్లీల నృత్యాలు: 15 మంది అరెస్ట్
హైదరాబాద్: నగర శివారులో మరో అసాంఘిక చర్య వెలుగులోకి వచ్చింది. వివాహ రిసెప్షన్ అంటూ వేడుక జరుపుకున్న కొందరు.. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించి, తాము కూడా చిందులేశారు. పోలీసులు చెప్పిన వివరాలనుబట్టి.. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని జొన్నగడ్డ వద్ద రవి ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి ఓ పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా హైదరాబాద్, ముంబై నుంచి రప్పించిన మోడల్స్ అశ్లీల నృత్యాలు చేశారు. సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు ఫామ్ హౌస్ పై దాడిచేశారు. అయితే నృత్యాలు చేసిన అమ్మాయిలు తమ బంధువులేనని వేడుక నిర్వాహకులు బుకాయించారు. చివరికి ఆరుగురు అమ్మాయిలతోపాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం... ముగ్గురి మృతి
హైదరాబాద్ : నగర శివారు ప్రాంతం నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ ను వేగంగా వెళుతున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మృతులు భారతి(50), విశ్వనాథ్(28), దీపిక(23)గా పోలీసులు గుర్తించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
కరెంటు అడిగితే లాఠీదెబ్బలా?
రామాయంపేట రైతులపై లాఠీఛార్జ్ అమానుషమని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండటం నార్సింగిలో రైతులపై జరిగిన లాఠీ ఛార్జిపై ఆయన స్పందించారు. కరెంట్ అడిగితే లాఠీలతో కొడతారా అంటూ నిలదీశారు. సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామాయంపేట రైతులపై లాఠీఛార్జ్ బాధాకరమని, రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. రైతులు, విద్యార్థుల వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, ఈ విషయాన్ని కేసీఆర్ విస్మరించరాదని చెప్పారు. సమస్యలపై సమీక్షించడం మానేసి పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. విద్యుత్ సరఫరా చేయాలంటూ ధర్నా చేస్తున్న అన్నదాతలపై లాఠీ చార్జి జరగడం దురదృష్టకరమని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు సంయమనం పాటించాలని ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్య ఉన్నమాట వాస్తవమేనని, థర్మల్ పవర్ స్టేషన్లలో వచ్చే లోపాల వల్లే సమస్యలు వస్తున్నాయని అన్నారు. విద్యుత్ కొరత రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని తెలిపారు. -
నార్సింగిలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్
మెదక్ : విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన అన్నదాతలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ సోమవారం రైతులు హైవేపై ఆందోళన చేపట్టారు. విద్యుత్ కోతలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నార్సింగి వద్ద 44వ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. అయితే ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కూడా తిరగబడ్డారు. నిలిపి ఉన్న ఓ పోలీస్ జీపును ధ్వంసం చేశారు. రైతులు రాళ్లదాడి చేయటంతో హైవేపై ఉన్న ఎనిమిది బస్సులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
రాజ్‌కుమార్ హత్యకేసులో మేనమామ అరెస్ట్
-
గ్రేటర్లో విలీనానికి నిరసిస్తూ నార్సింగ్‌లో మహాధర్నా
-
గ్రేటర్లో విలీనానికి నిరసిస్తూ నార్సింగ్‌లో మహాధర్నా
నగర శివారుల్లోని 17 గ్రామ పంచాయితీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో విలీనం చేయడంపై అయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని అయా గ్రామాల ప్రజలు శనివారం నార్సింగ్‌లో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో దుకాణదారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అలాగే పాఠశాలను కూడ మూసివేశారు. ఆ బంద్‌కు మద్దతుగా 17 గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో శనివారం ఉదయం నార్సింగ్ చేరుకుని మహాధర్నాలో పాల్గొన్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలను మెహరించారు.