హైదరాబాద్: హైదర్‌షాకోట్‌లో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ విలేజ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు బసవప్ప, అతని భార్య పద్మమ్మ నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోటలో నివాసం ఉంటున్నారు. బసవప్ప రోజువారీ కూలీ. బుధవారం రాత్రి, పని చూసుకుని ఇంటికి తిరిగి వచ్చిన బసవప్ప ఏదో విషయంపై తన భార్యతో వాగ్వాదానికి దిగాడు.
ఈ నేపథ్యంలో భార్యను హత్య చేసినట్లు నర్సింగ్ పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం, పద్మమ్మ ఇంటి నుంచి బయటకు రాకపోయేసరికి పొరుగువారికి అనుమానం వచ్చింది. ఇంతలో బసవప్ప ఇంటికి తాళం వేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, వారు వెంబడించి బసవప్పను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
( చదవండి: కాళ్లపారాణి ఆరకముందే.. )
Comments
Please login to add a commentAdd a comment