![Prakash Goud Will Win With Super Majority In Rajendra Nagar Says Mahender Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/5/mahender%20reddy.jpg.webp?itok=aXF5avMo)
మంత్రి మహేందర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ‘‘నార్సింగి మార్కెట్ కమిటీ’’ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో మళ్లీ ప్రకాష్ గౌడ్ గెలుపు ఖాయమని మహేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. నార్సింగి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చంద్రశేఖర్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా అన్నపూర్ణ, డైరక్టర్లను మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment