market committee
-
ద్రవ్యోల్బణం, ఫెడ్ మినిట్స్‌పై ఫోకస్
ముంబై: దేశీయ ద్రవ్యోల్బణం డేటా, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) ఈ వారం మార్కెట్‌కు దారిచూపొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. తుది దశకు చేరిన కార్పొరేట్ క్యూ1 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం (రేపు) ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే కావడంతో మార్కెట్ వర్గాల పారి్టసిపేషన్ (భాగస్వామ్యం) స్వల్పంగా ఉంటుంది. కావున సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ క్రూడాయిల్ ధరలపై దృష్టి సారించే వీలుందంటున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా సూచీలు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. అయితే ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువు స్థాయిలో 19,300–19,100 శ్రేణిలో కీలక మద్దతు స్థాయిని ఉంది. కొనుగోళ్ల మద్దతు లభిస్తే ఎగువ స్థాయిలో 19,650–19,700 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యల్బోణ అంచనాలను 30 బేసిస్ పాయింట్లు పెంచడం, అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి)ను పదిశాతం పెంపు చర్యలతో గతవారంలో మార్కెట్ నష్టాలను చవిచూసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్ల పతనంతో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి ద్రవ్యోల్బణ ఆందోళనలు అధికమతున్న వేళ నేడు(సోమవారం) రిటైల్, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఈ గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనునున్నారు. టమోటాతో పాటు ఇతర కాయగూరల ధరలు పెరగడంతో ఈ జూలై సీపీఐ ద్రవ్యోల్బణం అర్బీఐ లక్షిత పరిధి ఆరు శాతాన్ని మించి 6.3%గా నమోదుకావచ్చని ఆరి్థకవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీఐ తన సమీక్ష సమావేశంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి గానూ ద్రవ్యోల్బణ అంచనాను 5.1% నుంచి 5.4 శాతానికి పెంచింది. ఇదే రోజున టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలూ వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ సమావేశ వివరాలపై కన్ను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూలైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలో మరోసారి వడ్డీరేట్ల పెంపు సంకేతాలిచి్చన ఫెడ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. చివరి దశకు కార్పొరేట్ ఆరి్థక ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ1 ఫలితాల అంకం తుది దశకు చేరింది. ఐటీసీ, దివీస్ ల్యాబ్స్, వోడాఫోన్ ఐడియాలు నేడు (సోమవారం) తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇదే వారంలో కేరియర్ పాయింట్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఫ్యూచర్ కన్జూమర్, గ్లోబల్ స్పిరిట్స్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, హిందుస్థాన్ కాపర్, జాగరణ్ ప్రాకాశన్, మేఘ్మణి ఆర్గానిక్స్, పీసీ జ్యూవెలరీ, వోకార్డ్ కంపెనీలు ఫలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. మారుతున్న ఎఫ్ఐఐల వైఖరి ఈ ఆగస్టు తొలివారంలో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన వారంలో రూ.3,200 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మొత్తంగా దేశీయ మార్కెట్లో ఈ ఆగస్టు 11 తేదీ నాటికి రూ.3,272 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశి్చతి, చైనా ఆరి్థక వ్యవస్థ మందగమన పరిస్థితులు మన మార్కెట్లో పెట్టుబడులకు ఉతమిస్తున్నాయి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం కలిసొస్తుంది’’ అని మారి్నంగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. అంచనాలకు మించి నమోదైన జూన్ క్వార్టర్ ఫలితాలూ విదేశీ ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చాయనన్నారు. -
ఉల్లి విక్రయాలకు తొలగిన అడ్డంకి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి క్రయవిక్రయాల్లో గత నెల 17 నుంచి నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. యార్డులో నెలకొన్న సమస్యలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవతో పరిష్కారమయ్యాయి. మార్కెట్‌కు ఉల్లిగడ్డలు తెప్పించేందుకు, ఈ–నామ్ అమలుకు కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు అంగీకరించారు. దీంతో ఈ నెల 11 నుంచి కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి సహా అన్ని రకాల పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయి. కొత్తగా మినుములు, కొర్రలను కూడా కొనుగోలు చేసే సదుపాయాన్ని మార్కెట్ కమిటీ కల్పించింది. శనివారం ఉదయం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో సమావేశమయ్యారు. ఉల్లి క్రయవిక్రయాల్లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు, వ్యాపారుల మధ్య పోటీ ఉండటం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉల్లికి కూడా ఈ–నామ్ అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు విధిగా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సహకరించకపోతే కొత్త కమీషన్ ఏజెంట్లు, కొత్త వ్యాపారులను రంగంలోకి దింపి ఉల్లి సహా అన్ని పంటలను ఈ–నామ్లో కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో దిగివచ్చిన కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఈ నెల 11 నుంచి తాము కూడా ఈ–నామ్లో కొంటామని సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి, కమీషన్ ఏజెంట్ల సంఘం నేతలు కట్టా శేఖర్, శ్రీనివాసరెడ్డి, జూటూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రజలకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించిన వ్యక్తులకు లాక్డౌన్ నుంచి మినహాయింపును ఇస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో వ్యవసాయ కూలీలు, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లను నడిపించే మార్కెట్ కమిటీ, ప్యాకేజింగ్ యూనిట్లు లాక్డౌన్ నుంచి మినహాయింపు పొందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన మార్కెట్ కమిటీలు నిర్వహించే మండీలు, కనీస మద్దతు ధరకు సంబంధించిన వ్యవహారాలు నిర్వర్తించే విభాగాలు కూడా దీని నుంచి మినహాయింపు పొందాయి. వీరితోపాటు వ్యవసాయ సంబంధిత పనుల్లో పాల్గొనే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలకు కూడా మినహాయింపు లభించింది. వ్యవసాయ సంబంధిత యంత్రాలు, వాటి తయారీ, ఎరువులు పురుగు మందుల తయారీ, ప్యాకేజింగ్ యూనిట్లు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు పొందాయి. అత్యవసర సరుకులు, మందులను రవాణా చేసే ఈ కామర్స్ సంస్థలకు కూడా మినహాయింపు ఉంది -
‘ఆ ఆనందంలో ఉన్న తీపి ఎలాంటిదో తెలిసిన వాడ్ని’
సాక్షి, తూర్పుగోదావరి : దళారీ వ్యవస్థను తొలగించినప్పుడే రైతులకు విలువ పెరిగి.. వినియోగదారునికి మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో రూ.50 లక్షల నిధులు మార్కెట్ యార్డు అభివృద్ధికి కేటాయించామని పేర్కొన్నారు. అలాగే రైతు బజారును ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గురువారం కాకినాడ అర్బన్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకార సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటేడ్ పదవుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాన్ని సృష్టించరన్నారు. యాభై శాతం రిజర్వేషన్లు ఉండాలని చట్టం రూపంలో తీసుకు వచ్చారని, బహుశా దేశ చరిత్రలో ఇది ఎవ్వరూ చేయని సాహసమని కొనియాడారు. త్వరలోనే మొబైల్ రైతు బజార్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రూ. 3వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేసి.. రైతులకు అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్ ఒక సందేశాన్ని ఇచ్చారని మంత్రి అన్నారు. (11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూ: మంత్రి) పార్టీ కోసం అహర్నిశలు కష్టడిన వారికి గుర్తింపు వస్తే ఆ ఆనందంలో ఉన్న తీపి ఎటువంటిదో తెలిసిన వాడినని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్ట పడే వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన గుర్తింపు, హోదాను కల్పిస్తారన్నారు. దేవాలయ కమిటీలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎవ్వరికి పెన్షన్లు పోలేదని, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ఇచ్చిన తప్పుడు పేర్లను పరిశీలించి తొలగించడమైనదని స్పష్టం చేశారు. నిజమైన లబ్ధిదారులకు పోతే వార్డు సెక్రటేరియట్‌కు వెళ్ళి మళ్ళీ దరఖాస్తూ చేసుకోవాలని సూచించారు. కాకినాడ నగరంలో పది వేల ఇళ్ళు ఇస్తామని హమీ ఇచ్చానని, ఆ హమీని వచ్చే మార్చి 25 న అమలు చేస్తానని తెలిపారు. ఇంటి కోసం 34 వేల దరఖాస్తులు వచ్చాయని, మార్చి 25న నవరత్నాల పథకంలోఅందిరికీ ఇళ్ళు పథకాన్ని ముఖ్యమంత్రి కాకినాడ నుండే ప్రారంభిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. -
సంక్రాంతికే ఉల్లి దిగొచ్చేది!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉల్లి ధరలు మరో నెల రోజుల పాటు ఆకాశంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో ఉల్లి డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా లేకపోవడంతో ఇప్పట్లో ధరలు సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఉల్లి ధర, డిమాండ్ నేపథ్యంలో మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుత యాసంగి సీజన్లో సాగు పెరగడం, మరో పదిపదిహేను రోజుల్లో కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రానుండటంతో సంక్రాంతి నాటికి ఉల్లి కిలో ధర వంద రూపాయల దిగువకి వచ్చే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరికే సాధారణ ధర దేశ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ ఉల్లి సరఫరా గత ఏడాది 3 లక్షల నుంచి 3.5 లక్షల క్వింటాళ్ల మేర ఉండగా.. ఈ ఏడాది 1.17 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా ధర రూ.180–220కి చేరగా, రాష్ట్రంలోనూ రూ.160–180 పలుకుతోంది. అయితే ఉల్లి ధరలు పెరగడం, యాసంగికి నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రలో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో 2.50 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ సీజన్లో 4 లక్షల హెక్టార్లకు మించి సాగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాగైన ఉల్లి దిగుబడులన్నీ జనవరి మాసాంతం వరకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆలోగానే కేంద్రం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న 11 వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటున్న 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డ విదేశాల నుంచి జనవరి రెండో వారంలోగా దేశానికి పూర్తిగా చేరుకుంటుంది. అప్పటివరకు విదేశాల నుంచి విడతలవారీగా ఉల్లి దేశానికి చేరినా ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో ఉల్లి ధర రూ.80–110 వరకు తగ్గే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి ఉల్లి ధర రూ.50–80 మధ్య, ద్వితీయార్ధంలో రూ.35–60 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా పెరిగే అవకాశాలు ఉండటం.. నారాయణఖేడ్, వనపర్తి వంటి ప్రాంతాల నుంచి ఉల్లి మార్కెట్‌కు వచ్చే అవకాశాలు.. కర్నూలు, కర్ణాటక నుంచి దిగుమతులు పెరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్రంలో ఉల్లి ధర రూ.20–30కి సాధారణ స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ బిర్యానీకి కూడా ఉల్లి సెగ తగిలింది. చాలా హోటళ్లు బిర్యానీలో ఉల్లి వాడకాన్ని బాగా తగ్గించాయి. ప్రముఖ హోటళ్ల బిర్యానీలు సైతం రుచిని కోల్పోయాయని పలువురు ఆహార ప్రియులు పేర్కొంటున్నారు. ఉల్లి లేకుండా బిర్యానీ వండాల్సిన పరిస్థితి రావడం ఇదే తొలిసారి అని హోటళ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. -
‘మార్కెట్’ పగ్గాలు సగానికి సగం మహిళలకే
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సగానికి సగం మార్కెట్ కమిటీల చైర్పర్సన్లుగా మహిళలు బాధ్యతలు స్వీకరించనున్నారు. కమిటీల్లో కూడా సగం మంది మహిళలే సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించిన ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుని, వీరంతా రైతులకు ఉపయోగపడేలా కమిటీల పాలనా వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తొలి సారిగా 50 శాతం నామినేటెడ్ పదవులను మహిళలకు రిజర్వ్ చేస్తానన్న వైఎస్ జగన్ హామీ కార్యరూపం దాలుస్తుండడంతో వీరికి ఈ అవకాశం లభిస్తోంది. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా వర్గాల వారు 50 శాతం మందిని ఎంపిక చేసేలా కసరత్తు సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 220 మార్కెట్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు వీటిలో సగం.. అంటే 110 కమిటీలకు చైర్పర్సన్లుగా మహిళలు రానున్నారు. జిల్లాను యూనిట్‌గా చేసుకుని కమిటీల రిజర్వేషన్ల ప్రక్రియ కసరత్తు జరుగుతోంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం మార్కెట్ కమిటీల నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయనుంది. నియోజకవర్గానికి ఒకటి తప్పనిసరి.. శాసనసభ్యుల కోరిక మేరకు రాష్ట్రంలోని మార్కెట్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీ తప్పనిసరిగా ఉండేలా ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 191 మార్కెట్ కమిటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్ కమిటీలు లేని నియోజకవర్గాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 220 మార్కెట్ కమిటీలు రైతులకు సేవలందిస్తాయి. ఎమ్మెల్యేను మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యేతో సహా 20 మంది సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురు అధికారులు, 12 మంది రైతులు, ముగ్గురు వ్యాపారులు. ఎమ్మెల్యే, వ్యాపారులు, అధికారులు కాకుండా మిగతా సభ్యులందరూ తప్పనిసరిగా రైతు అయి ఉండాలి. భూమి లేకున్నా, పాడి పశువులున్న వారిని సభ్యులుగా పరిగణిస్తారు. సభ్యులుగా (అధికారులు మినహా) సైతం సగం మంది మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. గ్రామాల్లో సందడి ప్రభుత్వం రాష్ట్రంలోని మార్కెట్ కమిటీలకు చైర్పర్సన్లను, సభ్యులను నియమించనుందనే సమాచారం రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. కమిటీల చైర్పర్సన్లు, సభ్యుల ఎంపికపై ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయం, పంటల ధరవరలు, క్రయ విక్రయాలపై అవగాహన కలిగిన వారి పేర్లు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేయనున్న ఉత్తర్వుల ప్రకారం ఏడాది కాలానికి కమిటీ ఏర్పాటవుతుంది. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. -
‘టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే ఓనర్లు’
సాక్షి, కరీంనగర్ : అన్ని పార్టీలు ఏకమై వచ్చినా హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపును ఆపలేకపోయారని పౌర సరఫరా, సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. రామడుగు మండలం గోపాల్‌రావు పేట మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణకు మంత్రి హాజరైయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ కారులకు టీఆర్ఎస్ పార్టీ పదవులు ఇచ్చి గౌరవం ఇస్తుందని, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్‌ది కాదని.. తెలంగాణ ప్రజలదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఓనర్ ఎవరూ లేరని.. ప్రజలే ఓనర్లని అన్నారు. -
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో సగం మహిళలకే
సాక్షి, అమరావతి: వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల్లో మహిళలకు సగం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మార్కెట్ కమిటీ సభ్యుల్లో కూడా సగం వారికే కేటాయించాలని స్పష్టం చేశారు. మార్కెటింగ్, సహకార శాఖలపై గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధరల స్థిరీకరణ, మార్కెట్ యార్డుల్లో కనీస సదుపాయాలు, చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు, సహకార రంగం పటిష్టత అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో సగం మహిళలకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. కాగా, ఇప్పటికే జారీ చేసిన జీవో మేరకు ఈ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్లొన్నారు. -
ఎమ్మెల్యే పట్టించుకోరూ జర చెప్పన్నా..?
సాక్షి, నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రం వ్యవహర తీరుపై జిల్లాలోని ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అ న్నదాతలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మ ద్దతు ధరను ఇచ్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పా టు చేస్తే దళారులకు దారులు వేస్తారా అంటూ మార్క్‌ఫెడ్, ఊట్కూర్ సింగిల్ విండో అధికారులతో పాటు మార్కెట్ యార్డు అధికారులకు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే డైరెక్ట్‌గా ఫోన్ చేసి ఆ గ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఊట్కూర్ మండలంలో పెసర పంట ఏ మేరకు వేశారో తె లుసా.. ఆ మండలంలో పెసర ధాన్యం ఎంత వచ్చిందో వివరాలను పంపించాలని సదరు అధికారులకు హెచ్చరించినట్లు తెలిసింది. మీ రు తిరిగి కొనుగోలు కేంద్రం తెరిచినా దాదాపు 200 బస్తాల వరకు బోగస్ పెసర ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చినట్లు సమాచారం అందిందని మీరు ఏమి చేస్తున్నరంటూ అధికారులపై మండిపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని విచారణ చేపడుతున్న అధికారుల బృందంతో కట్టుదిట్టంగా చేయాలని కోరినట్లు సమాచారం. దళారులకు దారులు తెరిచిందెవరు? నారాయణపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఊట్కూర్ విండో ఉండడంతో మార్కెట్ పాలకవర్గంలో స్థానం కల్పించారు. విండో ప్రతినిధి సభ్యుడిగా ఉండడంతో వారికి పెసర కొనుగో లు కేంద్రం నిర్వహించేందుకు ఆదేశించారు. అయితే మార్కెట్ పాలకవర్గంలోని ఓ బడా ప్రతినిధితో పాటు మరో డైరక్టర్ వారికి సంబం ధం లేకున్నా కొనుగోలు కేంద్రంలో పెత్తనం చేలాయిస్తూ రైతుల అవతారమెత్తి విక్రయించేందుకు వచ్చిన దళారులకు దారులు తెరిచినట్లు ఆరోపణలున్నాయి. మార్కెట్‌యార్డు లోని ఓ డైరెక్టర్ మరో డైరెక్టర్‌తో చేతులు కలి పి వారి బంధువులు, శ్రేయోభిలాషుల పేరిటా పెసరను విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వీడియో హల్చల్పై ఎమ్మెల్యేల ఆరా వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలోని ప్రతినిధి చాంబర్లో చోటు చేసుకున్న వ్యవహరంపై ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. ఆ వీడియోలో ఏముంది.. అసలు మార్కెట్ యార్డులోని పెసర కొనుగోలు కేంద్రంలో ఏం అవుతుందని జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆరా తీసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో సైతం ఎమ్మెల్యేల దృష్టికి చేరింది. మన ఎమ్మెల్యే పట్టించుకోరూ జర చెప్పన్నా..? మన ఎమ్మెల్యే పట్టించుకోనేటట్లు లేరన్నా.. మీరైనా జర చెప్పండంటూ మార్కెట్ పాలకవర్గంలోని ఓ ప్రతినిధి మార్కెట్ మాజీ ప్రతినిధితో రాయబారం చేసినట్లు సమాచారం. మీరు చెబితే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే సైతం వింటారాన్న.. మీరు ఒక్కసారి ఈ హెల్ప్ చేయండంటూ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు మాజీ ప్రతినిధి సైతం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆ వ్యవహరం అంతే వదిలేయండి అంటూ సున్నితంగా తిరస్కరించినట్లు వినికిడి. పక్క ఎమ్మెల్యేకు ఈ విషయం తెలిపినా ఓ బాత్ చోడ్దేవ్.. దూస్రాబాత్ క్యాహై బోలో అన్నట్లు సమాచారం. పెసర కొనుగోలు కేంద్రం వ్యవహార తీరుపై ఎమ్మెల్యేలు గుర్రుమీదున్నట్లు తెలుస్తుంది. సీల్డ్ కవర్లో నివేదికలు పెసర కొనుగోలు కేంద్రంలో చోటు చేసుకున్న వ్యవహరతీరుపై కలెక్టర్ ఎస్.వెంకట్రావు రెండు దఫాలుగా ఐదేసి బృందాలను నియమించి జిల్లాలోని గ్రామాల్లో విచారింపజేశారు. అయితే అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేకరించిన నివేదికలను బృందాల వారిగా ఎవరికి వారు కలెక్టర్‌కు సీల్డ్ కవర్లో అందజేయాలని సూచించినట్లు సమాచారం. నివేదించే వివరాలతో దళారుల గుట్టు రట్టు అవుతుందా.. విచారణ తుస్సుమంటుందో వేచి చూడాల్సిందే. నేడు మార్కెటింగ్ డైరెక్టర్ రాక రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి బుధవారం నారాయణపేటకు వస్తున్నారు. అయితే పేటలో కొనసాగుతున్న పెసర కొనుగోలు కేం ద్రం వ్యవహర తీరుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆతర్వాత పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తారు. -
టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం
బంజారాహిల్స్: నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత బి.హనుమంతుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12, ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న హనుమంతు ఇంటికి మంగళవారం ఉదయం సిరిసిల్లకు చెందిన అనిల్‌రెడ్డి, గోపాల్‌నాయక్, గీతారెడ్డితో పాటు మరో నలుగురు అపరిచితులు వచ్చి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కుని రూ.2 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం అతడిని కారులో ఎక్కించుకొని సిరిసిల్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనకు అనిల్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించాలని కోరాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్యానికి చేరువ..
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆదాయ లక్ష్య సాధనలో ముందంజలో ఉన్నాయి. ఈ ఏడాది మార్కెట్ కమిటీలకు తెల్లబంగారమే అధిక ఆదాయాన్ని సమకూర్చింది. జిల్లాలో మొత్తం తొమ్మిది వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మిర్యాలగూడ, దేవరకొండ, నిడమనూరు, హాలియా నల్లగొండ, నకిరేకల్, చిట్యాల, చండూరు, వీటీనగర్(మాల్) వ్యవసాయ మార్కెట్ కమిటీలకు 2018–19 ఆదాయ లక్ష్యం రూ.27.85 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు అంటే జనవరి నెల పూర్తి నాటికి రూ.18 కోట్ల 69లక్షల 56 వేల ఆదాయం సమకూరింది. ఇంకా పత్తిని కొనుగోలు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), ఆయా వ్యవసాయ మార్కెట్లు, ఇతర కేంద్రాల ద్వారా ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేసిన సివిల్ సప్లయ్ కార్పొరేషన్ల నుంచి సుమారు రూ.13 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అవి మార్చిలోగా జమచేస్తే జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం లక్ష్యానికి మించి వచ్చినట్లు అవుతుంది. ఇవీ... మార్కెట్లకు ఆదాయ మార్గాలు జిల్లాలో రైతులు పండించిన వరిధాన్యం, కందులు, పెసర, పత్తి, ఇతర పప్పుధాన్యాలను ఆయా మార్కెట్ పరిధిలో కొనుగోలు చేసిన వ్యాపారులు, మిల్లర్లు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి నుంచి ఒకశాతం కమీషన్‌ను ఆయా మార్కెట్లకు చెల్లించాల్సి ఉంటుంది. అందులో జిల్లాలో మార్కెట్లకు ఆదాయాన్ని సమకూర్చేది కేవలం వరిధాన్యం, తరువాత తెల్లబంగారమే. గత ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 2లక్షల 69 వేల హెక్టార్లలో పత్తిని రైతులు సాగు చేయగా, రెండవ స్థానంలో వరిని 70 వేల 458హెక్టార్లలో సాగు చేశారు. ఖరీఫ్‌లో నాగార్జునసాగర్ ఎడమకాలువతో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని విడుదల చేయడంతోపాటు పత్తికి అనుకూలమైన వర్షాలు కురిశాయి. దీంతో వరితోపాటు పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చింది. దీంతో మార్కెట్లకు కమీషన్ల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. బకాయిలు వస్తే లక్ష్యం చేరినట్లే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోపాటు సివిల్ సప్లయ్ నుంచి రూ.13 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉంది. అవి వస్తే మేము ఈ సంవత్సరం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లే. మార్చి వరకు బకాయిలు వచ్చే అవకాశం ఉంది. పత్తితోపాటు వరిధాన్యం మీద వ్యవసాయ మార్కెట్ కమిటీలకు బాగా ఆదాయం వచ్చింది. –ఎంఏ అలీం, జిల్లా మార్కెటింగ్ అధికారి -
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రకాష్ గౌడ్ గెలుపు ఖాయం
సాక్షి, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ‘‘నార్సింగి మార్కెట్ కమిటీ’’ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో మళ్లీ ప్రకాష్ గౌడ్ గెలుపు ఖాయమని మహేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. నార్సింగి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చంద్రశేఖర్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా అన్నపూర్ణ, డైరక్టర్లను మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. -
అంకాపూర్’ లాంటి మార్కెట్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించే పంటలకు లాభదాయక ధర అందించమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మార్కెట్ కమిటీ ఏర్పాటు కాబోతోంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి నేతృత్వంలో కలసి పని చేయనున్న ఈ కమిటీ.. దేశంలో ఎక్కడ మంచి ధరలున్నాయో గుర్తించి ఆ ప్రకారం పంటను విక్రయించడంలో ప్రముఖ పాత్ర వహించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ ఏర్పాటుపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశముందని అధికారులు చెప్పారు. కమిటీకి ప్రత్యేకంగా డైరెక్టర్‌ను నియమించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని చెబుతున్నారు. అంకాపూర్ ఆదర్శంగా.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ మార్కెట్ కమిటీ ఆదర్శంగా రాష్ట్ర మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. రెండ్రోజుల క్రితం రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అంకాపూర్ అంశాన్ని ప్రస్తావించారు. అంకాపూర్ ప్రాంత రైతులు తమ పంటను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్ముకోరు. అంకాపూర్ మార్కెట్ కమిటీ నిర్దేశించిన విధంగానే నడుచుకుంటారు. పంట కోత దశలో ఉన్నపుడే ఆ మార్కెట్ కమిటీ దేశంలోని వివిధ మార్కెట్లలో ధరలను ఇంటర్నెట్లో పరిశీలిస్తుంది. ఎక్కువ ధరలున్న ప్రాంతానికి వెళ్లి అక్కడి వ్యాపారులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకుంటుంది. పంట కోతలు పూర్తవగానే వ్యాపా రులు అంకాపూర్‌కు వచ్చి పంటను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. రైతులకు అక్కడికక్కడే ధర చెల్లిస్తారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ కూడా అలాగే పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతు సమితులే కీలకం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కృషి చేయడానికి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇందులో 1.62 లక్షల మంది సమితి సభ్యులున్నారు. పంటకు ధర రాని సమయంలో మండల సమన్వయ సమితులు రంగంలోకి దిగుతాయి. రాష్ట్ర స్థాయి కమిటీకి పరిస్థితి వివరిస్తాయి. రాష్ట్ర స్థాయి కమిటీ దేశంలో ధరల పరిస్థితిని అంచనా వేసి, ఏ పంట ఎక్కడ ఎక్కువ ధర పలుకుతుందో గుర్తించి ఆ ప్రకారం పంటను విక్రయిస్తుంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారయ్యాకే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ, ఆ శాఖకు హరీశ్‌రావు మంత్రిగా ఉన్నా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మరో మార్కెట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. -
‘మార్కెట్ కమిటీ’ వేతనాలు పదింతలు
గ్రేడ్–1 మార్కెట్ చైర్మన్ల వేతనం వెయ్యి నుంచి 10 వేలకు పెంపు - రూ.2 వేలున్న వారి వేతనం రూ.20 వేలకు పెంపు - పెంపునకు మంత్రి హరీశ్‌రావు ఆమోదం..10 రోజుల్లో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనాలను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత వేతనాలను ఏకంగా పదింతలు చేయనుంది. సెలక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లకు ప్రస్తుతం రూ.2 వేల వేతనం ఇస్తుండగా దాన్ని రూ.20 వేలకు పెంచనున్నారు. స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనాన్ని రూ.1,500 నుంచి రూ.15 వేలకు, గ్రేడ్–1 మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.10 వేలకు, ఇతర గ్రేడ్ మార్కెట్ల చైర్మన్ల వేతనాన్ని రూ.500 నుంచి రూ.10 వేలకు పెంచనున్నారు. వేతనాల పెంపుపై మార్కెటింగ్‌శాఖ కసరత్తు చేసి మంత్రి హరీశ్‌రావుకు ఫైలు పంపగా.. ఆయన ఆమోదం తెలిపినట్లు సమాచా రం. ఇందుకు సంబంధించి వారం, పది రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సరైన వేతనాలు లేక ఇబ్బందులు... రాష్ట్రంలోని 180 మార్కెట్ కమిటీల్లో 16 సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లు, 29 స్పెషల్ గ్రేడ్ మార్కెట్లు, 26 గ్రేడ్–1 మార్కెట్లు, 109 ఇతర మార్కెట్లు ఉన్నా యి. కొందరు మార్కెట్ కమిటీల చైర్మన్ల వేతనాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న పింఛన్లకన్నా తక్కువగా ఉన్నాయని మార్కెటింగ్‌శాఖ భావించింది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన అనేక మంది మార్కెట్ కమిటీ చైర్మన్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటం, తక్కువ వేతనాల కారణంగా వారు వివిధ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వారి వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు తెలిపాయి. వేతనాల పెంపు నిర్ణయం వాస్తవమేనని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. కాల పరిమితి పొడిగింపు అనేక మార్కెట్ కమిటీ చైర్మన్ల కాలపరిమితి ముగుస్తుండటంతో ప్రభుత్వం వాటిని 6 నెలలకు పొడిగిస్తోంది. 70 మార్కె ట్ కమిటీ పాలక వర్గాలకు 6 నెలలు పొడిగింపు ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్ కమిటీలకు ఏడాది కాలపరిమితి ఉండగా దాన్ని రెండుసార్లు వరకు 6 నెలల చొప్పున పొడిగించే వీలుంది. మార్కెట్ కమిటీలను బలో పేతం చేయాలనుకుంటున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. వచ్చే సీజన్లో మిర్చి, కంది సహా ఇతర ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించామన్నారు. -
రైతు సంక్షేమమే ధ్యేయం
మార్కెట్ కమిటీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి దిలావర్పూర్ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి అన్నారు. దిలావర్పూర్లో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన గోదాం పనులు పూర్తికావడంతో గురువారం జిల్లా మార్కెటింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషి ఫలితంగా నిర్మల్ జిల్లా రైతులకు ఎంతగానో మేలు చేకూర్చేవిధంగా అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. రైతులకు వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే దిలావర్పూర్, సిర్గాపూర్, గుండంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద విద్యుత్ సబ్‌స్టేన్ లు ఉండగా మరో నూతన గుండంపల్లి విద్యుత్ సబ్‌స్టేన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో జిల్లా మార్కెటింగ్ అధికారి టి.శ్రీనివాస్, ఓఎస్వో ఆర్.సుధాకర్, మార్కెట్ కమిటీ సెక్రెటరి సత్యనారాయణ, సూపరింటెండెంట్ భాస్కర్, స్థానిక సర్పంచ్ నంద అనిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధనె నర్సయ్య, నాయకులు ధనె రవి, ముత్యంరెడ్డి, కోడెనవీన్, సప్పల రవి, ముథోల్ నరేందర్, ఉమాశంకర్, గుణవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అందని ‘కూల్’ వాటర్
► బయట పడేసిన వాటర్‌కూలర్ పెద్దపల్లిరూరల్: వ్యవసాయ మార్కెట్‌యార్డులో పంట దిగుబడులను అమ్ముకునేందుకు వచ్చే అన్నదాతల దాహర్తిని తీర్చేందుకు కొనుగోలు చేసిన వాటర్‌కూలర్‌ను నిర్లక్ష్యంగా బయట పడేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ చెప్పుకుంటున్న పాలకవర్గ ప్రతినిధులు రైతాంగానికి కనీస వసతులను కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. కార్యాలయ ఆవరణలో మరోకూలర్ను ఏర్పాటు చేసుకుని కార్యాలయ అధికారులు, సిబ్బంది మాత్రం చల్లని నీళ్లు తాగుతూ తమను విస్మరించడం సమంజసం కాదంటున్నారు. ఇప్పటికైనా మార్కెట్‌కమిటీ పాలకవర్గం యార్డుకు వచ్చిన రైతులకు కనీస సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాలని కోరుతున్నారు. -
ప్రారంభానికి సిద్ధమైన గోదాంలు
► వేగంగా పూర్తయిన నిర్మాణాలు ► గోదాముల్లో పంటలనిల్వపై రైతుల హర్షం దహెగాం: రైతులు పండించిన పంటలను ఇళ్లల్లో నిల్వ ఉంచుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగి రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం గుర్తించి పంటలను నిల్వ ఉంచుకోవడానికి మార్కెట్ క మిటీ ఆధ్వర్యంలో గోదాంల నిర్మాణం చేపట్టి ంది. మండలానికి ఒక గోదాం చొప్పున ఒక్కో గోదాంకు రూ. 3 కోట్లు వెచ్చించి గత సంవత్స రం నిర్మాణాలు ప్రారంభించింది. మార్కెట్‌యార్డు గోదాంల నిర్మాణాలు పూర్తయి అవి నేడు ప్రారంభదశకు చేరుకున్నాయి. రైతుబంధు పథకం కింద రైతులు పండించిన పం టలకు గిట్టుబాటు ధరలేనప్పుడు పంటలను గో దాంలో నిల్వ ఉంచి దానిపై 75 శాతం రుణం పొందే అవకాశం ఉంది. గిట్టుబాటుధర వచ్చిన తరువాత పంటలను విక్రయిస్తారు. మార్కెట్ కమిటీ వారు 75 శాతం రుణాన్ని రికవరీ చేసుకుని మిగతా డబ్బులను రైతులకు చెల్లిస్తారు. నియోజకవర్గంలో వేగంగా నిర్మాణాలు సిర్పూర్(టి) నియోజకవర్గంలో సిర్పూర్(టి), కౌటాల, కాగజ్‌నగర్, దహెగాం, బెజ్జూర్ మండలాల్లో గత సంవత్సరం ఒక్కో గోదాం నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లను మంజూరు చేసింది. ఒక్కో గోదాం సామర్థ్యం 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. దహెగాం, కౌటాల, బెజ్జూర్, కాగజ్‌నగర్ మండలాల్లో గోదాంల నిర్మాణాలు పూర్తి దశకు చేరుకున్నాయి. కాగజ్‌నగర్‌లోని గోదాం పూర్తికాగా రైతులు పండించిన ధాన్యాన్ని అందులో నిల్వ చేస్తున్నారు. సిర్పూర్(టి) మండలంలోని గోదాం నిర్మాణం కొనసాగుతోంది. మరో నెల రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. దీంతో పండించిన పంటల «ధాన్యాన్ని గోదాంలలో నిల్వ ఉంచుకోవచ్చని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 75 శాతం రుణం పొందే అవకాశం రైతులు పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేనప్పుడు పంటలను గోదాం లలో నిల్వ ఉంచుకోవచ్చు. నిల్వ ఉంచిన పం టలకు మార్కెట్‌కమిటీ వారు తక్కువ అద్దెను నిర్ణయిస్తారు. మార్కెట్లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు గోదాం లో నిల్వ ఉంచిన పంటలపై 75 శాతం రుణం పొందే అవకాశం ఉంది. గిట్టుబాటు ధర వచ్చి న తరువాత రైతు పంటను విక్రయించి మార్కె ట్ కమిటీ ద్వారా తీసుకున్న 75 శాతం రుణం రికవరీ చేసుకుంటారు. మిగతా డబ్బులను రై తులకు అందజేస్తారు. రైతులకు లాభం చే కూర్చే దిశగా గోదాంలు ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రబీసాగులో వచ్చిన పంటలను గోదాంలలో నిల్వ చేసుకోవచ్చని రైతులు పేర్కొంటున్నారు. రైతుబంధు పథకం కింద రైతులు అన్ని పంటలను నిల్వ చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ప్రారంభిస్తాం సిర్పూర్(టి) నియోజకవర్గంలో పూర్తయిన గోదాంలను త్వరలో ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. దహెగాం, కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూర్ మండలాల్లో గోదాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. సిర్పూర్(టి) మండలంలోని గోదాం నిర్మాణం కొనసాగుతోంది. మరో నెలరోజుల్లో నిర్మాణం పూర్తికానుంది. పూర్తయిన గోదాంలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతుబంధు పథకం కింద రైతులు పండించిన పంటలను గోదాంలో నిల్వచేసుకోవచ్చు. – సాయిరాంరెడ్డి, మార్కెట్ కమిటీ ఏఈ -
వైఎస్ హయాంలోనే సింగూరు కాల్వలకు నిధులు
• సింగూరు జలాల కోసం పోరాడింది కాంగ్రెస్సే • దివంగత నేత పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే నిధులు • అందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగిపేట : దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రూ.89.98 కోట్లను సింగూరు ప్రాజక్టు కాల్వల నిర్మాణానికి మంజూరు చేశారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు పి.నారాయణ, పద్మనాభరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దివంగత నేత పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో జోగిపేటలో సింగూరు జలాల దీక్షా శిబిరాన్ని సందర్శించారని, అధికారంలోకి రాగానే ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాల సేద్యానికి కాల్వల ద్వారా నీటిని అందిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులకు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేసారన్నారు. సింగూరు నీటిని సేద్యానికి తామే ఇచ్చినట్లు టీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రారంభోత్సవాల పార్టీయేనన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ నేతృత్వంలో 2003వ సంవత్సరంలో 102 రోజుల పాటు రిలే దీక్షలను చేపట్టారన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు మంజూరు చేయకుంటే సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనను విభేదించిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. సింగూరు ప్రాజెక్టు వద్ద నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్, మాజీ డిప్యూటీ సీఎం తల్లితో ప్రారంభించారని అన్నారు. కాల్వల నిర్మాణం ఎవరి హయాంలో ప్రారంభమైందో ప్రజలకు తెలుసన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మీద అనవసర ఆరోపణలు చేయొద్దని సూచించారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీయేనని, ఈ విషయాన్ని సీఎం కేసీఆరే అసెంబ్లీలోనే ఒప్పుకున్నారని, తెచ్చేలా కృషి చేసింది దామోదర్ రాజనర్సింహ అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అందోల్ మండల, పట్టణ అధ్యక్షులు బి.శివరాజ్, సత్తయ్య, మాజీ ఎంపీటీసీలు సురేందర్‌గౌడ్, ఏ.చిట్టిబాబు, రాజిరెడ్డి, రారుుని కృష్ణయ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు అర్పత్ మొహియొద్దీన్, పార్టీ సీనియర్ నాయకులు శేరి సంగారెడ్డి, మహేష్‌గౌడ్ యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు, డి.అశోక్, గణేష్, సర్పంచ్ అశోక్, కౌన్సిలర్లు శరత్‌బాబు, సునీల్‌కుమార్, మైనార్టీ నాయకులు అలీఅబ్బాస్, గోహేర్‌అలీ పాల్గొన్నారు. -
తాడిపత్రి మార్కెట్ కమిటీ గడువు పొడిగింపు
అనంతపురం అగ్రికల్చర్ : తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ పాలక వర్గం గడువు ఆరు నెలలు పొడిగిస్తూ ఆ శాఖ సెక్రటరీ, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదట నిర్ణయించినట్లు ఒక సంవత్సరం కాలపరిమితి గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున ఉన్న పాలకవర్గానికి మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. -
7 మార్కెట్ కమిటీలకు పాలకమండళ్లు
హైదరాబాద్: తెలంగాణలోని ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 169 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 101 కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేయగా.. తాజాగా మరో ఏడు కమిటీలకు పాలక మండళ్లను ఖరారు చేశారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పూడూరి మణెమ్మ, వైస్ ఛైర్మన్‌గా కట్ల శంకర్, మల్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చింతపంటి లక్ష్మి, వైస్ ఛైర్మన్‌గా బోయినపల్లి మధుసూధన్‌రావు నియమితులయ్యారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా అన్నం బ్రహ్మారెడ్డి, వైస్ ఛైర్మన్‌గా భూక్యా రమేశ్ నాయక్, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కమిటీ ఛైర్మన్‌గా నర్సింగోజు పద్మ, వైస్ ఛైర్మన్‌గా కంబగేని సతీష్‌గౌడ్‌ను నామినేట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నల్లగంటి వెంకటయ్య, వైస్‌ఛైర్మన్‌గా గంగనమోని కుమరయ్య, నల్గొండ జిల్లా కోదాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కె.శశిధర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు. ఖమ్మం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా భూక్యా నాగేశ్వర్రావు, వైస్ ఛైర్మన్‌గా తాటి భిక్షంను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లాకు హరితమిత్ర అవార్డులు
నిజామాబాద్ అర్బన్ : జిల్లాకు హరితమిత్ర అవార్డులు వరించాయి. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితమిత్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాకు రెండు అవార్డు దక్కాయి. సదాశివనగర్ మండలం గిద్ద జిల్లా ప్రజాపరిషత్, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఆర్మూర్లు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోనున్నారు. ఈ అవార్డులను గిద్ద మాజీ ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ తరఫున డాక్టర్ శరత్ డైరెక్టర్ ఏఎంసీ అందుకోనున్నారు. కలెక్టర్ యోగితారాణా హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా చేపట్టారు. ప్రతి గ్రామం, మండలం, పట్టణ కేంద్రాలతోపాటు కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు. దీంతో రాష్ట్రంలో హరితహారంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు కలెక్టర్ కృషి వల్ల హరితమిత్ర రెండు అవార్డు లభించాయి. ఈ అవార్డులకు సంబంధించి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.ఆర్.మినా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33%
♦ మహిళా రిజర్వేషన్లు ♦ ఖరారు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ల నియామకంలో మహిళా కోటా కింద 33 శాతం స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా మహిళలకు కూడా కోటా కేటాయించింది. ఈ మేరకు జిల్లాలవారీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న మార్కెట్ యార్డులను కూడా పరిగణనలోకి తీసుకుని లాటరీ విధానంలో జిల్లాలవారీగా బుధవారం రిజ ర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూల్డ్ ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించింది. అవి పోను మిగతా 168 కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు 6 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 29 శాతం చైర్పర్సన్ పదవులు కేటాయిం చింది. మిగతా 84 కమిటీలను ఓసీగా ప్రకటించింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 13 మార్కెట్ కమిటీలు మహిళలకు దక్కాయి. -
సీఎంకు చేరిన ‘మార్కెట్’ జాబితాలు!
నాలుగైదు రోజుల్లో నియామక ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. దసరా వరకు కొన్ని పోస్టులనైనా భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని మార్కెట్ కమిటీల పాలకమండళ్ల నియామకాల కోసం చైర్మన్లు, డెరైక్టర్ల పేర్లతో జాబితాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల జాబితాలు శుక్రవారం కేసీఆర్‌కు అందాయని సమాచారం. దీంతో మరో నాలుగైదు రోజుల్లో మార్కెట్ కమిటీల చైర్మన్లు, డెరైక్టర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల గుర్తింపునకు డిప్యూటీ సీఎం కడియం అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పాలకమండళ్లు ఏర్పాటైతే తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందో అన్న భావనతో పోస్టుల గుర్తింపు, వివరాలు సిద్ధంగా ఉంచడంలో ఆలస్యం చేశారని ఆయా శాఖల అధికారులను మందలించారని సమాచారం. మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థ పాలక మండళ్ల వివరాలు మాత్రమే స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. వీటి తయారీకి రెండు మూడురోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మార్కెట్‌కు దారేది ?
తెనాలి టౌన్: కోట్ల రూపాయల్లో వస్తున్న నిధులను జీతభత్యాలకు, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు అవసరమైన డొంక రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో మార్కెట్ కమిటీల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రైతు శ్రేయస్సును విస్మరించిన మార్కెట్ కమిటీలు సొంత ప్రయోజనాలను చక్కబెట్టుకోవటం గమనార్హం.గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి కమిటీల నుంచి 25శాతం నిధులు మంజూరు చేసేవారు. ఆ నిధులతో డొంక రోడ్లు వేయడం వల్ల రైతు పండించిన ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లడానికి వీలుగా ఉండేది. ప్రస్తుతం డొంక రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు, ముళ్ల చెట్లతో నిండిపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి దుగ్గిరాలకు వెళ్లే రోడ్డు పిచ్చిచెట్లతో మూసుకు పోయింది. గుం టూరు, పల్నాడు ప్రాంతాల రైతులు పండించిన పసుపును దుగ్గిరాల మార్కెట్ యార్డుకు గతంలో ఈ రోడ్డు ద్వారా తీసుకు వెళ్లేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కమిటీలపై తెలుగు తమ్ముళ్ల కన్ను.. జిల్లాలో 20వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో గుంటూరు, తెనాలి, దుగ్గిరాల యార్డులు పూర్తి గా రెగ్యులేటేడ్ యార్డులుగా కొనసాగుతున్నాయి. ఈ కమిటీల ఆదాయం కోట్ల రూపాయల్లోనే ఉంది. ఏడాదికి గుంటూరు యార్డుకు రూ.30 కోట్లు, తెనాలి యా ర్డుకు రూ.5కోట్లు, దుగ్గిరాల యార్డుకు రూ.3నుంచి 4 కోట్లు ఆదాయం ఉంటుంది. తెనాలి, దుగ్గిరాల, పొ న్నూరు, బాపట్ల, ఈపూరు, పిడుగురాళ్ళ, నరసరావుపేట, చిలకలూరిపేట, రాజుపాలెం, వినుకొండ, రొంపిచర్ల మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. గుంటూరు, మంగళగిరి, కూచినపూడి, రేపల్లె, క్రోసూరు, సత్తెనపల్లి, తాడికొండ, ఫిరంగిపు రం, మాచర్ల వ్యవసాయ కమిటీలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. ఈ కమిటీలలో పదవులను ఆశించే తెలుగు తమ్ముళ్లు ఎక్కువ కావడంతో కమిటీ పాలకవర్గ నియామకం ఆలస్యం అవుతుంది. తెనాలి కమిటీ నుంచి వేరుగా వేమూరు కమిటీ ఏర్పాటుకు కొత్తగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి సంబంధించిన దస్త్రం సీఎం కార్యాలయంలో ఉందని అధికారులు తెలిపారు. జీవో జారీ చేయాలి.. ఇంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మార్కె ట్ కమిటీల నిధుల నుంచి లింకురోడ్డుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో వాటిని రద్దు చేశారు. తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రోడ్ల నిర్మాణానికి నిధులు వాడవచ్చని జీవో జారీ చేసినప్పటికి అమలు కాలేదు. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందున దెబ్బతిన్న లింక్ రోడ్డులకు మార్కెట్ కమిటీల నుంచి నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
పాపం ఎమ్మెల్యే...
పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది...నువ్వైతే ఎమ్మెల్యే అయిపోయావు... మా పరిస్థితి అర్థం అయితలేదని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గం టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేత ఒకాయన ఎమ్మెల్యేపై నిష్టూరమాడుతున్నారు. పార్టీ విజయం కోసం కష్టపడ్డావు కాదనలేని సత్యం, అందుకే కదా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నీకే రిజర్వు చేసింది...ఆ పదవి నీకే రాసిపెట్టుకో అని ఎమ్మెల్యే ఊరడించారు. రేపు మాపూ అంటూ ఊరిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు అంటూ ప్రభుత్వం జీవో ఇచ్చేసరికి ఎమ్మెల్యేకు ముచ్చెమటలు...ఏం చేయాలో పాలుపోవడం లేదు. నియోజకవర్గంలో ముఖ్య నేతకు ఇస్తానని ఆశపెట్టిన పదవి ప్రభుత్వం ఎస్టీకి రిజర్వు చేసింది. భూతద్దం పెట్టి వెతికినా ఆ నియోజకవర్గంలో ఎస్టీ నేత కనిపించలేదు. తమకు పదవి వస్తే ఎక్కడ బలపడిపోతామో అని ఎస్టికి రిజర్వు అయ్యేలా ఎమ్మెల్యే పావులు కదిపారంటూ నియోజకవర్గం నేతలు మండిపడుతున్నారు...పాపం ఎమ్మెల్యే. -
గులాబీ నేతల్లో రిజర్వేషన్ గుబులు
♦ మార్కెట్ కమిటీ కోటాపై అసంతృప్తి సెగలు ♦ తమ పదవులకు ముప్పు అంటున్న నాయకులు ♦ పనిచేసిన వారికి పదవులు దక్కని వైనం ♦ నామినేటెడ్ పదవుల పంపకంలో హంసపాదు సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల భర్తీలో అధికార టీఆర్ఎస్కు ఆదిలోనే హంసపాదు పడిందా? ఆయా వర్గాలకు రాజకీయ భరోసా కల్పించేందుకు తీసుకున్న ‘రిజర్వేషన్’ నిర్ణయం బెడిసి కొట్టనుందా? దీనికి అవుననే జవాబిస్తున్నారు ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 168 వ్యవసాయ మార్కెట్లకు గాను గిరిజన ప్రాంతాల్లోని 13 మినహా, 168 మార్కెట్ కమిటీల భర్తీ కోసం ప్రభుత్వం రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభై శాతం (84 మార్కెట్లు) రిజర్వేషన్ ఇవ్వగా, 84 మార్కెట్లను జనరల్ కేటగిరీలో ఉంచింది. బీసీలకు 49, ఎస్సీలకు 25, ఎస్టీలకు 10 చొప్పున రిజర్వు అయిన మార్కెట్లు అధికార పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. రిజర్వేషన్ల వల్ల అసలు రావాల్సిన వారికి పదవులు రాకుండా పోయే ముప్పుందని నేతలు వాపోతున్నారు. పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం నామినేటెడ్ పదవులపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన చెందుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొందరు నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల కోసం జిల్లా అధ్యక్షుడిని, తమ ఎమ్మెల్యేలను, జిల్లా మంత్రిని నమ్ముకున్నారు. కొన్ని జిల్లాల్లో సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కోరుకున్న విధంగానే వారి వారి నియోజకవర్గాల్లో అనుకూలంగా రిజర్వు అయ్యాయని అంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేలు అయినవారు, ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చిన వారు, కార్యకర్తలతో పెద్దగా సంబంధాలు లేని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం రిజర్వేషన్ కోటాను పూర్తి చేసేందుకు చిత్తమున్నట్లు కేటాయించారన్న అభిప్రాయం ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లకు చెక్ పెట్టేందుకు జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. నెల రోజుల కిందటే ఏ మార్కెట్ చైర్మన్ పోస్టు ఏ వర్గానికి ఇవ్వాలో ఖరారైందని సమాచారం. ఈనెల 22న టీఆర్ఎస్ఎల్పీ భేటీ లో రిజర్వేషన్ల జాబితాను ఎమ్మెల్యేలకు ఇచ్చారని చెబుతున్నారు. వీటిలో సుదీర్ఘంగా పార్టీలో ఉన్న వారికి అవకాశం దక్కకుండా పోయిన సెంటర్లు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఉదాహరణకు ఒక్క ఎస్టీ రిజర్వేషన్‌ను పరిశీలిస్తే, ఎస్టీ జనాభా అత్యధికంగా ఉండే నల్లగొండ జిల్లా దేవరకొండ మార్కెట్ కమిటీ జనరల్ కోటాలో ఉంటే, పార్టీలో నామినేటెడ్ పోస్టు ఇవ్వడానికి అర్హుడైన నేత లేని భువనగిరి మార్కెట్ ఎస్టీలకు రిజర్వు అయ్యింది. ఎస్సీలు అధికంగా ఉండే నకిరేకల్ ఎస్టీలకు, బీసీ నేతలు ఎక్కువగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మిర్యాలగూడ ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఎస్టీలకు 10 మార్కెట్లు రిజర్వు అయితే, నల్లగొండ జిల్లాలోనే నాలుగు కేటాయించారు. ఇక ఎస్సీలకు 25 మార్కెట్లు రిజర్వ్ చేస్తే 12 మార్కెట్లు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో అసలు ఎస్సీలకు ఒక్క మార్కెట్‌నూ కేటాయించలేదు. కొందరు మంత్రులు చక్రం తిప్పిన చోట్ల జనరల్ కోటాకు ఎక్కువ కేటాయింపులు జరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
మార్కెట్ కమిటీతో రైతులకు భరోసా
మెదక్ (పాపన్నపేట): మార్కెట్ కమిటీ ఏర్పాటుతో రైతులకు భరోసా లభిస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్‌జిల్లా పాపన్నపేట మండలంలో మార్కెట్ కమిటీ కార్యాలయాలు, గోదాములు నిర్మించడానికి అవసరమైన స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో వరి, చెరకు పంటలు అత్యధికంగా పండించే మండలాల్లో పాపన్నపేట ఒకటి అని ఆయన తెలిపారు. స్థానికంగా మార్కెట్ కమిటీ లేకపోవడంతో రైతులు తాము పండించిన పంటను నిల్వ ఉంచుకునే అవకాశం లేక పొలంలోనే ధాన్యాన్ని తూకం చేసే వారన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి, మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే మార్కెట్ కమిటీ మంజూరు చేస్తూ మంత్రి హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. పాపన్నపేటలో మహిళా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అందుకు అనువైన స్ధలాన్ని ఇచ్చేందుకు దాతలు గాని, ప్రభుత్వ భూమి గాని సిద్ధంగా ఉండేలా చూడాలని స్ధానిక నాయకులకు సూచించారు. పాపన్నపేట ఏపీజీవీ బ్యాంకులో సరైన సేవలందక వినియోగదారులు, రైతులు, ఉపాధి కూలీలు, డ్వాక్రా గ్రూపు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్ధులు తెలిపారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి బ్యాంకు స్థాయి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఎస్‌బిహెచ్ శాఖ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
‘మార్కెట్’ చైర్మన్లకు మళ్లీ షాక్
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ :మార్కెట్ కమిటీల విషయంలో గత పాలకవర్గాలకు, ప్రభుత్వానికి మధ్య దోబూచులాట కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కారు హయాంలో కొనసాగిన పాలక వర్గాలను రద్దు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తమ పదవీ కాలం పూర్తి కాకముందే పదవి నుంచి ఎలా తొలగిస్తారని కొన్ని మార్కెట్ కమిటీల చైర్మన్లు అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు నివ్వడంతో తిరిగి చైర్మన్లుగా బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా మళ్లీ ఈ పాలక వర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ కమిటీలకు మళ్లీ పర్సన్ ఇన్చార్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియమితులైన ఈ పర్సన్ ఇన్చార్జిలు ఉన్న ఫలంగా బాధ్యతలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు శని, ఆదివారాల్లో పదవీ బాధ్యతలు తీసుకున్నారు. 13 కమిటీలకు.. జిల్లాలో మొత్తం 17 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో నాలుగు కమిటీలు ఇంద్రవెల్లి, జైనూర్, బెల్లంపల్లి, భైంసా కమిటీలకు కాంగ్రెస్ హయాంలో కూడా పాలకవర్గాలు లేవు. మిగిలిన 13 మార్కెట్ కమిటీలకు కాంగ్రెస్ నేతలు చైర్మన్లుగా కొనసాగారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సంజీవరెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా విఠల్, ఇచ్చోడకు తిరుమల్‌గౌడ్, నిర్మల్‌కు తక్కల రమణారెడ్డి, సారంగపూర్‌కు రాజేశ్వర్, ఖానాపూర్‌కు అలెగ్జాండర్, కుబీర్‌కు చంద్రశేఖర్, లక్సెట్టిపేట్‌కు కొత్త సత్తయ్య, మంచిర్యాలకు కమలాకర్‌రావు, చెన్నూరుకు జుల్ఫేఖార్ అహ్మద్, కాగజ్‌నగర్ నర్సింగ్‌రావు, ఆసిఫాబాద్‌కు మునీర్ అహ్మద్, బోథ్‌కు ఎం.సత్యనారాయణలు కొనసాగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చైర్మన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరంతా కోర్టును ఆశ్రయిం చగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరంతా గత మూడు నెలలుగా చైర్మన్ బాధ్యతల్లో కొనసాగుతూ వచ్చారు. మళ్లీ ఈ పాలక వర్గాలను రద్దు చేయడంతో మార్కెట్ కమిటీల్లో పర్సన్ ఇన్చార్జిల పాల న కొనసాగనుంది. మళ్లీ పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోమా రు పదవులు కోల్పోయిన చైర్మన్లు తిరిగి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పర్సన్ ఇన్చార్జిలు వీరే.. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పర్సన్ ఇన్చార్జిగా మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్ సుధాకర్‌ను నియమించింది. మంచిర్యాల, బోథ్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీలకు డెప్యూటీ డెరైక్టర్ అశోక్ నియమితులయ్యారు. ఇచ్చోడ, జైనథ్, ఖానాపూర్, లక్సెట్టిపేట్, కుభీర్, సారంగాపూర్, నిర్మల్, చెన్నూరు, కాగజ్‌నగర్‌లకు అసిస్టెంట్ డెరైక్టర్ శ్రీనివాస్ పర్సన్ ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పాలకవర్గాలు లేని భైంసా మార్కెట్ కమిటీ ఇన్చార్జిగా జేడీ కొనసాగనున్నారు. జైనూర్, ఇంద్రవెల్లి, బెల్లంపల్లిలకు ఏడీ శ్రీనివాస్ ఇప్పటికే పర్సన్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. -
నిజమైన రైతులను గుర్తించకపోతే ఎలా?
ఒంగోలు టౌన్ : ‘సుబాబుల్, జామాయిల్ కర్రను మార్కెట్ కమిటీలకు దళారులు తెచ్చి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఎవరు నిజమైన రైతు, ఎవరు దళారీ అనేది తెలుసుకోకపోతే ఎలా..? మీరు ఇలాగే వ్యవహరిస్తే అసలైన రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. కర్ర కొనుగోళ్లకు సంబంధించి దళారీ వ్యవస్థ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్ ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పేపర్ మిల్లుల యజమానులు కర్ర కొనుగోలు చేయాల్సిందేనని జేసీ స్పష్టం చేశారు. బాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చీమకుర్తి నుంచి పెద్ద సంఖ్యలో రైతులు శుక్రవారం జేసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య మాట్లాడుతూ.. ఏపీ పేపర్ మిల్లు తప్పితే ఐటీసీ కర్ర కొనుగోలు చేయడం లేదన్నారు. అదికూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా తక్కువకు కొనుగోలు చేస్తోందన్నారు. కర్రకు తాట తీస్తే ఒక ధర నిర్ణయిస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన జేసీ.. ఐటీసీ కంపెనీ కర్ర కొనుగోలు చేయకుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారని మార్కెటింగ్ శాఖ అధికారులను నిలదీశారు. కర్ర కొనుగోలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధరలు నిర్ణయించడం జరిగిందని, అందులో కర్ర తాట తీస్తే ఒక ధర అనే ప్రస్తావనే లేదన్నారు. పేపర్ మిల్లులు అలాంటి నిబంధనలు విధిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను మార్కెటింగ్ శాఖ అధికారులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జేసీ మాట్లాడుతూ.. ఇక్కడ దాపరికం ఏమీ లేదని, ఉన్నది ఉన్నట్లు చెబితే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దళారులు ఉంటేనే కర్ర కొనుగోలు చేస్తామంటూ ఐటీసీ పేపర్ మిల్లుల ప్రతినిధులు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు రైతులు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోసాలు జరుగుతుంటే మనం దేని కోసం ఉన్నట్లు’ అంటూ మార్కెటింగ్‌శాఖ అధికారులపై మండిపడ్డారు. రైతులకు జారీ చేసిన కార్డుల ఆధారంగా కర్ర కొనుగోలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులను అనుమతించరాదని జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ అధికారులను ఆదేశించారు. -
వారిని పునర్నియమించండి
మార్కెట్ కమిటీ చైర్మన్ల కేసులో టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేయడంద్వారా తొలగించిన మార్కెట్ కమిటీ చైర్మన్లను వెంటనే పునర్నియమించాలని హైకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టును ఆశ్రయించిన ఐదుగురు పిటిషనర్లకే వర్తింప చేసింది. రాష్ట్రంలో మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 16న ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా రద్దు చేసిన మార్కెట్ కమిటీలకు పర్సన్ ఇన్చార్జిలను నియమిస్తూ వ్యవసాయశాఖ అదేనెల 18న జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ పలు మార్కెట్ కమిటీల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం ఆర్డినెన్స్‌ను, జీవోను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ నెల 7న తీర్పునిచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును హైకోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే వర్తింప చేసింది. దీంతో ఆదిలాబాద్, జైనత్, కుబీర్, నిర్మల్, సారంగపూర్ మార్కెట్ కమిటీల చైర్మన్లు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ వ్యాజ్యం విచారణకు రాగానే తెలంగాణ రాష్ట్రం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కొంత గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. కౌంటర్ దాఖలు చేయాలంటే, తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందంటూ, పిటిషనర్లను మార్కెట్ కమిటీ చైర్మన్లుగా తిరిగి నియమించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏజీనీ, దానికి మరో రెండు వారాల్లో సమాధానాన్ని ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశిస్తూ కోర్టు విచారణను వాయిదా వేసింది. -
‘నామినేటెడ్’పైనే ఆశలు
ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం నెలరోజుల్లో కొలిక్కి నర్సీపట్నం టౌన్: పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల నియామకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు అధికార పార్టీ నాయకులు అందుకు తగ్గ కసరస్తు ప్రారంభించారు. ప్రస్తుత పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఆయా పదవులపై ఆశావహుల్లో ఆశలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కని నాయకులతోపాటు కష్టపడి పనిచేసిన ద్వితీయశ్రేణి నాయకులు ఎలాగైనా నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు తీవ్ర పోటీ జిల్లాలో మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ పదవుల కోసం అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 8 మార్కెట్ యార్డులకు పాలకవర్గాలున్నాయి. ఇవి రద్దు కావడంతో చైర్మన్ నుంచి డెరైక్టర ్ల పదవులకు వరకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ ఉంది. వ్యవసాయంతో అనుబంధం ఉన్న వారికే కమిటీ పదవి ఇస్తే రైతులకు మేలు జరుగుతుందన్న ఆలోచనలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ప్రముఖ దేవాలయాలకూ కొత్త కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి అయ్యన్న ఇటీవల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులతో సమావేశమై.. ఎవరెవరికి ఏ పదవి ఇస్తే బాగుటుందనే దానిపై చర్చించడంతో ఆశలు రేకెత్తాయి. వారం రోజుల కిందట మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. ఆ పదవులను చాలా మంది ఆశించినా రాజకీయ సమీకరణాల దృష్ట్యా పాతసంతబయలకు చెందిన వ్యక్తికి ఇచ్చారు. దీంతో భంగపడ్డ ఆశావహులు కొందరు చైర్మన్, డెరైక్టర్లు, దేవాలయాల చైర్మన్ పదవులు వస్తాయనే ఆశతో ఉన్నారు. నెల రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రైతుకష్టం దళారిపాలు
►సుబాబుల్, జామాయిల్‌కు దక్కని ధర ►ఏడాదికి రూ.42 కోట్లు దళారుల పాలు ► దళారులను ప్రోత్సహిస్తున్న పేపర్‌మిల్లుల ప్రతినిధులు ►పెంచిన ధరలను అమలు చేయకుండా మెలికలు ► గుర్తింపు కార్డులంటూ కాలయాపన చేస్తున్న మార్కెట్ కమిటీలు చీమకుర్తి: స్వేదం చిందించి ఏడాదిపాటు రైతుపడ్డ కష్టాన్ని అడ్డదారిలో వచ్చిన దళారులు దోచుకుంటున్నారు. ఏడాదికి సుమారు రూ.42 కోట్లు దళారుల పాలవుతుండగా, కష్టపడిన రైతన్నకు నష్టాలే మిగులుతున్నాయి. పేపర్‌మిల్లుల ప్రతినిధులు, దళారులు కుమ్మక్కవుతుండటంతో సుబాబుల్, జామాయిల్ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెంచిన ధరలను అమలు చేయకుండా టన్నుకు రూ.700 లెక్కన రైతు కష్టాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుబాబుల్, జామాయిల్ సరాసరిన నెలకు 50 వేల టన్నుల కర్ర కొనుగోలు చేస్తున్నారు. 50 వేల టన్నుల మీద టన్నుకు రూ.700 లెక్కన నెలకు రూ.3.5 కోట్లు దారిమళ్లుతున్నాయి. ఏడాదికి రూ.42 కోట్లు రైతుల కష్టం దళారుల పాలవుతోంది. గుర్తింపు కార్డులంటూ మార్కెట్ కమిటీలు కాలయాపన పనులే తప్ప రైతులకు జరుగుతున్న నష్టాన్ని నివారించింది లేదు. వివరాల్లోకి వెళితే.... ►మార్కెట్ కమిటీల ద్వారా పేపర్ మిల్లుల ప్రతినిధులు సుబాబుల్, జామాయిల్ కర్రను కొనుగోలు చేస్తున్నారు. సుబాబుల్ టన్ను రూ.3700, జామాయిల్ టన్నుకు రూ.3900 లెక్కన గతేడాది వరకు కొనుగోలు చే శారు. దానిని గత ఫిబ్రవరి 18వ తేదీన విజయవాడలో రైతుసంఘాల నాయకులు, పేపర్ మిల్లుల యాజమాన్యాలు కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. టన్ను ధర సుబాబుల్‌ను రూ. 3700 నుంచి రూ. 4400కు, జామాయిల్ ధరను రూ.3900 నుంచి రూ.4600కు పెంచారు. అందరి ఏకాభిప్రాయం మేరకు పెంచిన ధరలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఇంత వరకు పెంచిన ధరలను అమలు చేయకుండా పాత ధరలనే పేపర్‌మిల్లుల ప్రతినిధులు చెల్లిస్తున్నారు. దాని వలన ఒక్కొక్క రైతు టన్నుకు రూ.700 లెక్కన నష్టపోతున్నారు. ►జిల్లాలో 14 మార్కెట్ కమిటీలున్నాయి. వాటిలో ఏడు మార్కెట్ కమిటీల ద్వారానే కర్ర కొనుగోలు చేస్తున్నారు. నెలకు సరాసరిన 50 వేల కర్రను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. రైతులకు చెందాల్సిన సొమ్మును అడ్డదారిలో పేపర్ మిల్లుల ప్రతినిధులు, దళారులు కలిసి దోచుకుంటున్నారు. ►దానిపై రైతులు, రైతు సంఘాల నాయకులు పలుమార్లు మార్కెట్ కమిటీ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. కలెక్టర్‌తో పాటు వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు ఇటీవల జిల్లాకు వచ్చినపుడు ఆయన కూ విన్నవించారు. దీంతో ఇంకా ఈ జిల్లాలో పెరిగిన ధరలను ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి ఆరా తీశారు. ►కలెక్టర్, మార్కెట్ కమిటీలు పెంచిన ధర అమలు చేసేందుకు పేపర్‌మిల్లుల ప్రతినిధులపై వత్తిడి తీసుకురావడంతో దానికి వారు రైతులు తీసుకొస్తున్న కర్ర సన్నగా ఉందని, నాణ్యంగా లేదని మెలికలు పెడుతున్నారు. సన్నకర్ర తీసేసి మంచి నాణ్యమైన కర్ర తీసుకొస్తే దానికి పెంచిన ధరలను అమలు చేస్తామని చెబుతున్నారు. దాంతో రైతులు ఏం చేయాలో తోచక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ►మార్కెట్ కమిటీల అసిస్టెంట్ డెరైక్టర్ మహ్మద్ఫ్రీ రైతుల గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వారికి జరిగే అన్యాయాన్ని నివారిస్తానని చెప్తున్నారు. రైతులకు గుర్తింపు కార్డులిచ్చి వారి ఎకౌంట్లలో నేరుగా డబ్బు పడేలా చూస్తానని, తద్వారా దళారి వ్యవ స్థను నిలువరించవచ్చంటున్నారు. ►కానీ దళారులు కూడా అందుకు తగ్గట్లుగానే రైతుల్లో తమకు అనుకూలమైన వారి పేర్ల మీదనే కర్రకొనుగోలు చేసి, వారి ద్వారానే తమకు అనుకూలంగా మలుచుకునే మార్గాలు కూడా ఉన్నాయని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ►పెంచిన ధరలను పేపర్‌మిల్లుల ప్రతినిధులు అమలు చేయకుండా తమ శ్రమను నిలువునా దోచుకుంటుంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ►చీమకుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ర కొనుగోలు చేసే రైతులు ఒక్కొక్క మార్కెట్ కమిటీ పరిధిలో సుమారు ఐదారు వందల మంది ఉన్నట్లు అంచనా. ఇలా జిల్లా మొత్తం మీద వేలల్లో ఉన్న రైతులను దళారులు మోసగిస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కర్ర కొనుగోలుపై పెంచిన ధరలను తక్షణమే అమలు చేసి సన్నకర్ర, నాణ్యత లేదనే మెలికలు పెట్టకుండా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
నోట్లున్నోడిదే.. మార్కెట్టు
అధికారం చేతిలో ఉంది..అనుయాయులను అందలం ఎక్కించి అందినంత దండుకుందామనే యోచనలో అధికార పార్టీ నేతలున్నారు. మార్కెట్ కమిటీల పాలకవర్గాలను రద్దు చేసి..వాటి పగ్గాలను తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు దేశం నేతలు ప్రయత్నిస్తున్నారు. పదవులిచ్చేందుకు వసూళ్ల పర్వానికీ తెరతీశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. సాక్షి, ఒంగోలు: మార్కెట్ కమిటీల్లో కొలువు దీరడానికి తెలుగు తమ్ముళ్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్నింటి కాలపరిమితి ముగియగా.. మరికొన్నింటిని రద్దుచేసి తమకు కొత్తగా బాధ్యతలు అప్పగిస్తారని ఆశిస్తున్నారు. లాభసాటి వ్యవసాయం అందివ్వడం ఏమోగానీ.. అందివచ్చే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని లాభం పొందాలనే ఎత్తుగడతో జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తాపత్రయపడుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొత్తప్రభుత్వం ఏర్పాటుతో మార్కెట్ కమిటీల పాత పాలకవర్గాలను రద్దుచేస్తూ ఉత్తర్వులివ్వడం పాతపద్ధతేనని టీడీపీ చెప్పుకుంటోంది. సందట్లో సడేమియా అంటూ ఇప్పటికే జిల్లాలో కొందరు దళారీల అవతారమెత్తి శాసనసభ్యులు, మంత్రుల చుట్టూ తిరుగుతూ సిఫార్సులు చేస్తున్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గంలో పేరు కనబడాలంటే, సొమ్ము ముట్టచెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి. ద్వితీయ శ్రేణివర్గం గుర్రు.. జిల్లాలో మొత్తం 15 మార్కెట్ కమిటీలున్నాయి. 12 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఉండగా.. మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి నియోజకవర్గాల్లో అదనంగా మరొకటి చొప్పున ఏర్పాటయ్యాయి. ఇందులో కంభం, మినహా మిగిలిన అన్నిచోట్ల పాలకవర్గాలు కాంగ్రెస్ హయాంలో వచ్చాయి. వీరిలో చాలామంది ఏడాది కూడా పదవుల్ని అనుభవించలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. హస్తం కుదేలవడంతో అందులోని కొందరు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరగా, మరికొందరు టీడీపీలోకి వెళ్లారు. అద్దంకి, మార్టూరు కమిటీల కాలపరిమితి ఇప్పటికే ముగిసింది. ఇంకా ఒంగోలు, మద్దిపాడు, కందుకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, పర్చూరు, చీరాల, దర్శి, పొదిలి, కనిగిరి, కంభం, వై.పాలెం మార్కెట్ కమిటీలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ఈ 13 చోట్ల పాలకవర్గాలు రద్దుకానున్నాయి. టీడీపీలో కష్టపడ్డ కార్యకర్తలకు పదవులిస్తామని ఇప్పటికే చంద్రబాబు వేదికలపై ప్రకటించగా, ఆయన మాటలను అడ్డంపెట్టుకుని కొందరు జిల్లాలో పదవులిప్పిస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని ద్వితీయశ్రేణి నేతలు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు పంపారు. జిల్లాలో కొందరు నేతల మధ్య కొనసాగుతోన్న ఆధిపత్యపోరు కూడా దళారీ వ్యవస్థను ప్రోత్సహించినట్టవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నవారు సైతం మరోసారి మార్కెట్ కమిటీలకు ఎంపిక కావాలంటే పార్టీలో ఇప్పటికే ఉన్న సీనియర్ల నుంచి పోటీ ఎదుర్కోవాల్సిందే. -
ఆశల పల్లకి
- మార్కెట్ కమిటీలు, ఆలయ ట్రస్ట్‌బోర్డు పదవులపై కన్నేసిన టీడీపీ నేతలు - వెయ్యి మందికి పదవీ యోగం - వేలాది మంది ఆశావహులు ఏలూరు : నామినేటెడ్ పదవులపై కన్నేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాటిని దక్కించుకునేందు కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మార్కెట్ కమిటీ, ఆలయ ట్రస్ట్‌బోర్డు పదవుల్ని దక్కించుకునేందుకు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా పదవులు లేక అజ్ఞాతవాసం గడిపిన నాయకులు ఇప్పుడు ఆ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అధ్యక్ష, డెరైక్టర్ పదవులు 18చొప్పున మొత్తం 324 ఉన్నారుు. దేవాదాయ శాఖ పరిధిలో 150 ఆలయూలకు ట్రస్టుబోర్డులు ఉన్నారు. వీటిలో 3నుంచి 9 వరకూ పదవులు ఉంటారుు. సగటున 4 పదవులు ఉన్నాయనుకున్నా 600 మంది నాయకులు, కార్యకర్తలకు నామినేటేడ్ పోస్టులు లభిస్తారుు. ఆ పదవులను పార్టీ నాయకులు, కార్యకర్తలకు అప్పగించడం ద్వారా వారి సేవలను ఉపయోగించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ఇదే విషయూన్ని రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశంలో చర్చించడంతోపాటు వెంటనే మార్కెట్ కమిటీ పాలకవర్గాలను, ట్రస్ట్‌బోర్డు కమిటీలను నియమించాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ పదవుల్లో ఉన్నవారు గౌరవంగా తప్పుకునేలా చూడాలని, లేదంటే ఆయూ కమిటీలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు తమకు త్వరలోనే పదవీయోగం పట్టబోతోందని మురిసిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయూ పదవులను అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకుల పరిస్థి తి అగమ్యగోచరంగా తయూరైం ది. నామినేటెడ్ పదవుల భర్తీకి త్వరలోనే ఆర్డినెన్స్ రానుందని సమాచారం. -
మార్కెట్ కమిటీలకు కాసులపంట
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్: 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో తొమ్మిది మార్కెట్ కమిటీలకు లక్ష్యాన్ని మించి ఆదాయం లభించింది. జిల్లా లక్ష్యం 9.37 కోట్ల రూపాయలు కాగా, తొమ్మిది మార్కెట్ కమిటీల నుంచి రూ. 10 కోట్ల 21 లక్షల 86 వేల ఆదాయం సమకూరింది. అత్యధిక ఆధాయంతో పూసపాటిరేగ మార్కెట్ కమిటీ మొదటి స్థానంలో నిలిచింది. పూసపాటిరేగ మార్కెట్ కమిటీ లక్ష్యం 75 లక్షల రూపాయలు కాగా రూ.కోటి ఆరు లక్షల 48 వేల ఆదాయంతో లక్ష్యం సాధించింది. రెండో స్థానం సాధించిన చీపురుపల్లి మార్కెట్ కమిటీ రూ.75 లక్షల లక్ష్యానికి గాను రూ.97.57 లక్షల ఆదాయం సాధించింది. బొబ్బిలి మార్కెట్ కమిటీ లక్ష్యం కోటీ 92 లక్షల రూపాయలు కాగా కోటి 89 లక్షల తొంబైమూడు వేల రూపాయలతో 99 శాతం ఆదాయాన్ని సాధించింది. కొత్తవలస మార్కెట్‌కమిటీ లక్ష్యం నల బై ఐదు లక్షల రూపాయలు కాగా 32 లక్షల తొమ్మిది వేల రూపాయలు, సాలూరు మార్కెట్ కమిటీ లక్ష్యం కోటి 25 లక్షల రూపాయలు కాగా కోటీ 54 లక్షల 37 వేల రూపాయల ఆదాయం సమకూరింది. కురుపాం మార్కెట్ కమిటీకి రూ.28 లక్షలు లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.36 లక్షల 25 వేల ఆదాయం సమకూరింది. పార్వతీపురం మార్కెట్ కమిటీకి రూ.1.65 కోట్ల లక్ష్యం నిర్దేశించగా రూ.కోటి 97 లక్షల 32 వేల ఆదాయం సాధించింది. విజయనగరం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.1.30 కోట్లు కాగా కోటీ 22 లక్షల 15 వేల రూపాయలతో 94 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన గజపతినగరం ఏఎంసీ ఈ ఏడాది ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. గజపతినగరం మార్కెట్ కమిటీ లక్ష్యం కోటీ రెండు లక్షల రూపాయలు కాగా 85 లక్షల 70 వేల రూపాయలతో 84 శాతం ఆదాయాన్ని సాధించింది. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం మార్కెటింగ్‌శాఖకు తగలకపోవడంతో అధికారులు లక్ష్యాన్ని పూర్తి చేయగలిగారు. -
ధాన్యానికి రెక్కలు!
మంత్రాలయం, న్యూస్‌లైన్: ధాన్యం పుష్కలంగా పండుతున్నా.. ఏటా ఏదో ఒక సమయంలో బియ్యం ధర ఆకాశన్నంటుతోంది. ఆ సమయంలో నియంత్రించేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ పండిన ధాన్యం జిల్లా సరిహద్దులు దాటకుండా చర్యలు చేపడితే ధరలు పెరిగే మాటే తలెత్తదు. మంత్రాలయం కేంద్రంగా మాధవరం బ్రిడ్జి మీదుగా కర్ణాటకకు సోనా వరి బియ్యం యథేచ్ఛగా తరలిపోతోంది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు చేతులెత్తేశారు. తుంగభద్ర నది నీటి ఆధారంగా నియోజకవర్గంలోని వేలాది ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ ప్రాంతంలో నెల్లూరు సోన, బీపీటీ 5204, 64, 1010, కావేరి తదితర రకాలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. బీపీటీ రకం తప్ప మిగతా ధాన్యానికి ఇక్కడితో పోలిస్తే కర్ణాటకలో ఎక్కువ ధర లభిస్తోంది. రాంపురంలో కెనాల్ కింద 20వేల ఎకరాలు, కోసిగిలో 18వేల ఎకరాలు.. కౌతాళంలో 10వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా.. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ మూడు మండలాల నుంచి 42వేల టన్నులు ధాన్యం కర్ణాటకకు తరలినట్లు అంచనా. ఇందులో నెల్లూరు సోన 20వేల టన్నులు, బీపీటీ 5వేలు, 64 రకం 10వేలు, 1010 రకం 5 వేలు, కావేరి 2వేల టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం దళారులకు వరంగా మారుతోంది. చెక్‌పోస్టులు ఉన్నా అధికారుల కొరత సాకుతో తాళాలు వేసేశారు. ఫలితంగా దళారులు రైతుల పొలాల వద్దకు వెళ్లి లారీల కొద్ది ధాన్యాన్ని సేకరించి మాధవరం మీదుగా రాయచూరు, ఆదోని మీదుగా శిరుగుప్పకు యథేచ్ఛగా తరలించేస్తున్నారు. అప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తుండటంతో రైతులు దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ సాగవుతున్న వరికి స్థానికంగా ధర తక్కువ లభిస్తుండటంతో.. దళారులు వారికి అధిక ధర ఆశ చూపి కొనగోలు చేస్తున్నారు. ఇదిలాఉండగా గత ఏడాది క్వింటా బియ్యం రూ.4వేల నుంచి రూ.6వేల ధర పలికింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ ధరతో బియ్యం కొనుగోలు చేసేందుకు బెంబేలెత్తారు. అక్రమ రవాణా ఇదే తరహాలో సాగితే ఈ సంవత్సరం కూడా ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
రచ్చబండ రణరంగం
అచ్చంపేట, న్యూస్‌లైన్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన రచ్చబండ కార్యక్రమానికి నిరసనలు, నిలదీతల మధ్య సాగుతోంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ఉండటంపై టీఆర్ఎస్ శ్రేణు లు, తెలంగాణవాదులు మండిపడుతున్నారు. గురువారం అచ్చంపేటలో జరిగిన మూడోవిడత రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. సర్పంచ్‌లకు ఆహ్వానం లేకుండా ఎ లా ఏర్పాటు చేశారని తెలంగాణవాదులు, టీ ఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశా రు. రచ్చబండ బ్యానర్‌ను తొలగించారు. దీం తో మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీపతిరావు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గువ్వల బాలరాజ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురు తోసుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపై మరొకరు కుర్చీలను విసురుకున్నారు. మంత్రి డీకే అరుణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొడవను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జిచేశారు. ఇరువర్గీయులను సభావేదిక నుంచి దూరంగా నెట్టేశారు. తెలంగాణవాదులు, టీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కనిపించని సీఎం ఫొటో రచ్చబండ బ్యానర్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ఉండటంపై జిల్లాలో జరుగుతున్న రగడను దృష్టిలో ఉంచుకుని అచ్చంపేట రచ్చబండ కార్యక్రమంలో అధికారులు, అధికారపార్టీ నాయకులు సీఎం ఫొటో కనిపించకుండా బ్యానర్‌ను మడిచిపెట్టి జాగ్రత్తపడ్డారు. మంత్రి డీకే అరుణ రచ్చబండకు హాజరైనా సీఎం సందేశాన్ని వినిపించలేదు. మంత్రి అరుణ ఎదుటే టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగినా ఏమీ అనకుండా మిన్నకుండిపోయారు. ఈ సందర్భంగా మంత్రి అరుణ మాట్లాడుతూ..ఉద్దేశపూర్వకంగా కొందరు రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ఏర్పాటుచేసిన వేదికపై రాజకీయాలు మాట్లడటం సరికాదని హితవుపలికారు. సీఎం ఫొటోపై ఎమ్మెల్యే నిరసన మహబూబ్‌నగర్ రూరల్: రచ్చబండను గురువారం స్థానిక జెడ్పీ మైదానంలో ఆర్డీఓ, మండల ప్రత్యేకాధికారి హన్మంతరావు అధ్యక్షతన ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సీఎం ఫొటోలను తొలగించిన తరువాతే రచ్చబండను కొనసాగించాలని పట్టుబట్టారు. సమైక్యవాది అయిన సీఎం ఫొటో ముందు తాము రచ్చబండను నిర్వహించాలా?, తెలంగాణ అంతటా, సీఎం ఫొటోను బహిష్కరించినా, ఇక్కడ మాత్రం ఏర్పాటు చేయడం ఏమిటని ఆయన అధికారులను నిలదీశారు. ఫొటోను తొలగించేవరకు కూర్చునేది లేదని పట్టుబట్టారు. ఆయనకు టీఆర్ఎస్ నేతలు జత కలిశారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలుచేస్తూ ఫ్లెక్సీలను చించేశారు. ఆ వెంటనే ఫ్లెక్సీలను చించేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఎమ్మెల్యే పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులు తీసుకెళ్లిన కార్యకర్తను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు సభను కొనసాగించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ క్రమంలో కార్యకర్తలు టెంట్లలో ఏర్పాటుచేసిన సీఎం ఫొటోలను చించేశారు. వాటిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో కొందరు టెంట్లను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకుని పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తిని ఇక్కడికి తీసుకురావాలని ఆదేశించారు. సీఎం ఫొటోలను తొలగించామని, సభ నిర్వహణకు సహకరించాలని కోరడంతో తిరిగి 12గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. పోలీసు పహారాలో.. అయిజ మండలకేంద్రంలో రచ్చబండ కార్యక్రమం పూర్తి పోలీసు పహారాలో జరిగింది. ప్రజల కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. 0మండల ప్రత్యేకాధికారి మదనమోహన్శెట్టి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండలో ఎమ్మెల్యే అబ్రహాం పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు రంగు సుమలత, జిల్లా కార్యదర్శి బూషణం, రంగుసూరి వేదికపైకి ఎక్కారు. అధికారి మాట్లాడుతుండగా మైక్న లాక్కొని జై తెలంగాణ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
బెల్లంపై తీపి ఆశలు
=ఈ ఏడాది రూ.30 కోట్ల లావాదేవీలు =ఊపందుకోనున్న క్రయవిక్రయాలు అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి మార్కెట్ కమిటీ అధికారుల సమ్మె విరమణతో లావాదేవీలపై ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం లావాదేవీలు బాగానే ఉన్నా, బెల్లం ధరలలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. రెండు నెలల పాటు మార్కెట్ కమిటీ అధికారులు విధులకు గైర్హాజరుతో ఔట్సోర్సింగ్ సిబ్బంది బెల్లం బీట్ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. ఈ సమయంలో బెల్లం క్రయవిక్రయాలలో ఆటంకాలు ఏర్పడనప్పటికీ ఉత్పత్తి చేసే రైతులు మాత్రం వెనుకంజ వేశారు. 2012-13లో మొదటి ఆరు నెలల లావాదేవీలు రూ.19.46 కోట్లు జరగ్గా 2013-14లో తొలి ఆరు నెలలు రూ.30.86 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే 2011-12లో రూ.161 కోట్లు, 2012-13లో రూ.143.50 కోట్ల వ్యాపారం జరిగింది. రూ.17 కోట్ల లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో 2013-14 పై కూడా ఇదే తరహా ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశా యి. కానీ 2013-14 మొదటి అర్థ సంవత్సర లావాదేవీలతో గత ఆర్థిక సంవత్సరాన్ని పోలిస్తే రూ.11 కోట్ల లావాదేవీలు అదనంగా జరిగినట్టు స్పష్టమవుతోంది. అంతేకాదు.. బెల్లం పరిమాణంలోనూ పు రోగతి కనిపిస్తోంది. ఈ ఆగస్టులో మాత్ర మే లావాదేవీలు తగ్గగా, సెప్టెంబర్‌లో కాసింత పెరుగుదల కనిపించింది. ఆగస్టులో తగ్గుదల గత ఏడాది ఆగస్టులో అనకాపల్లి మార్కెట్లో 2408 క్వింటాళ్ల లావాదేవీలతో 66 లక్షల 93 వేల 72 రూపాయల వ్యాపారం జరిగింది. 2013 ఆగస్టులో బెల్లం లావాదేవీలు 1207 క్వింటాళ్లకు పడిపోయి, 27 లక్షల 91 వేల 329 రూపాయలకు తగ్గింది. అక్టోబర్ తొలిపక్షంలోనూ నెమ్మదిగా లావాదేవీలు కొనసాగుతున్నాయి. సమ్మె విరమణ నేపథ్యంలో బెల్లం లావాదేవీలు ఊపందుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నా, ధరలు మాత్రం ఆశాజనకంగా లేవని రైతులు వాపోతున్నారు. ఉదాహరణకు గత అక్టోబర్ 19న ఈ మార్కెట్లో 1715 బెల్లం దిమ్మలు క్రయవిక్రయాలు జరగ్గా, మొదటిరకం బెల్లం గరిష్టంగా 3480 రూపాయల ధర పలికింది. కాగా శనివారం అనకాపల్లి మార్కెట్‌కు 3512 బెల్లం దిమ్మలు రాగా, మొదటిరకం గరిష్టంగా 3410 రూపాయలు పలికింది. అంటే బెల్లం ధర గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే 70 రూపాయలు తగ్గినట్లయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 8 లక్షల 17 వేల 958 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు జరగ్గా, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల 89 వేల 685 క్వింటాళ్లకు పడిపోవడంతో మార్కెట్ వర్గాలు డీలాపడ్డాయి. ఈ ఏడాది తొలి అర్థ భాగంలో లక్షా 24 వేల 102 క్వింటాళ్ల లావాదేవీలు జరగడంతో బెల్లం సరఫరా తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. వచ్చే ఆరు నెలల్లో జరిగే వ్యాపారంపైనే టర్నోవర్ ఆధారపడి ఉంటుంది. -
మార్కెట్ కమిటీ ఎంపికతో సిగ్నల్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : నామినేటెడ్ పదవుల పంపకంలో ఇద్దరు మంత్రులు ఒక్కటయ్యారా..? నువ్వొకటి.. నేనెకటి పంచుకుందామని డిసైడయ్యారా..? మనలో మనకెందుకు గొడవలని సర్దుకుపోయారా..? వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారం... నామినేటెడ్ పదవుల రేసులో ఉన్న అధికార పార్టీ నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మంద వినోద్‌ను నియమిస్తూ శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడేళ్లుగా పెండిం గ్లో ఉన్న ఈ పదవి నియామకంలో మంత్రి సారయ్య తన పంతం నెగ్గించుకున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీధర్ సిఫారసులను ఖాతరు చేయకుండా ఢిల్లీ వరకు పైరవీ చేసి తన ప్రధాన అనుచరుడు వినోద్‌కు చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో అడ్డు పడకుండా ఉండేందుకు విభేదాలను పక్కనబెట్టి.. మంత్రి పొన్నాలతో సారయ్య చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల విషయంలో ఇద్దరూ రాజీ ధోరణి అవలంబించాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అదే క్రమంలో మార్కెట్ కమిటీ నియామకం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే మంద వినోద్ హైదరాబాద్‌లో ఉన్న మంత్రి పొన్నాలను కలిసి కృతజ్ఞతలు తెలిపి.. పొన్నాల నుంచి అభినందనలు అందుకోవడం గమనార్హం. దీంతో మంత్రులు ఇద్దరూ కలిసికట్టుగా నామినేటెడ్ పదవులు పంచుకున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీంతో తదుపరి కీలకమైన నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న ముఖ్యులందరిలో ఉత్కంఠ మొదలైంది. జిల్లాలో కాంగ్రెస్ నేతలందరూ కొంతకాలంగా రెండు గ్రూపులుగా చీలిపోయారు. పొన్నాల, సారయ్య వర్గీయులుగా ముద్ర వేసుకున్నారు. వీరికి తోడు చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, కేంద్ర మంత్రి బలరాంనాయక్లకు సైతం ప్రత్యేక అనుచరగణం ఉంది. మరోవైపు మాజీ మంత్రి రామసాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి అనూహ్యంగా జిల్లా పార్టీలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. సీఎం కిరణ్‌తో సాన్నిహిత్యం ఉండటంతో పదవుల నియామకంలో ఆయన సైతం పవర్ సెంటర్‌గా మారారు. ఇవన్నీ గ్రూపులతో పాటు తెలంగాణ ఉద్యమ ఆందోళనలతో నామినేటెడ్ పదవుల పంపకం సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఒక్కటవడంతో వరుసగా పెండింగ్‌లో ఉన్న పదవులకు క్లియరెన్స్ వస్తుందనే వాదనలున్నాయి. తాజాగా ఎనుమాముల మార్కెట్ కమిటీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో అంతకుమించి ప్రాధాన్యమున్న కాకతీయ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కాంగ్రెస్ ముఖ్యులలో నెలకొంది. కీలకమైన ఈ పదవి రేసులో ప్రస్తుత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీలో విసృ్తతంగా చర్చ జరుగుతోంది. రాజేందర్‌రెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి కట్టబెడితే గతంలో చివరి నిమిషంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కోల్పోయిన బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఉంది. రేసులో ఉన్న దుగ్యాలకు, లేదా వరద రాజేశ్వరరావుకు ఛాన్స్ దొరికితే రాజేందర్‌రెడ్డిని తిరిగి అదే గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో కొనసాగిస్తారని తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఇద్దరు మంత్రుల అనుగ్రహం పొందిన వారికే పదవి దక్కుతుందని తాజా పరిణామాలు రూఢీ చేస్తున్నాయి. -
విజయవాడ మార్కెట్ ఆదాయానికి భారీ గండి !
సాక్షి, విజయవాడ : అధికారుల నిర్లక్ష్యం... కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో విజయవాడ మార్కెట్ కమిటీ ఆదాయానికి భారీగా గండిపడింది. ఏకంగా కోట్లలో అదాయానికి గండిపడినా ఇక్కడి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కొంతమంది దేవస్థానం అధికారులతో కుమ్మక్కై అమ్మవారిపేరు చెప్పి కొందరు కాంట్రాక్టర్లు సెస్ చెల్లించకుండా కోట్లాది రూపాయల విలువైన నిత్యావసరాల్ని దేవస్థానానికి సరఫరా చేస్తున్నారు. ఇలా నాలుగేళ్ల వ్యవధిలో రూ.6.79లక్షలు సెస్ ఎగవేతకు పాల్పడారు. దీంతోపాటు అసలు మార్కెట్‌కమిటీ యార్డు నుంచి ఎలాంటి లెసైన్స్ లేకుండా నాలుగేళ్లుగా వీటిని సరఫరా చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వెలువెత్తడంతో విజిలెన్స్ సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపి కాంట్రాక్టర్లపై చర్యలకు సిఫార్సు చేసింది. విజయవాడ నగరానికి చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లే ఈ నాలుగేళ్లుగా టెండర్లు దక్కించుకోవటం గమనార్హం. మార్కెటింగ్‌శాఖ చట్టంప్రకారం ప్రతి ఆహర ఉత్పత్తిపై మార్కెట్‌కమిటీ యార్డులకు పన్ను (సెస్) చెల్లించటం తప్పనిసరి. సాధారణంగా పంటలు పండి విక్రయాలు జరిపే క్రమంలో పంట ఉత్పత్తి విలువపై ఒకశాతం సెస్ చెల్లించాలి. అది కూడా కొనుగోలుదారుడే చెల్లించాలి. దీనిని సమర్ధవంతంగా అమలు చేయటం మార్కెట్‌యార్డుల విధుల్లో ప్రధానమైనది. కానీ విజయవాడ మార్కెట్‌కమిటీ యార్డు అధికారులు దీనిని పట్టించుకోలేదు. పర్యవసానంగా దేవస్థానానికి నిత్యావసరాల్ని సరఫరా చేసే కాంట్రాక్టర్లు కోట్లపన్ను ఎగవేతకు పాల్పడి ఆ మొత్తాన్ని వెనకొసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామలేశ్వరస్వామి దేవస్థానంలో లడ్డులు, పులిహోర, ఇతర ప్రసాదాలు, నైవేద్యాల తయారీకి సుమారు 25 రకాల నిత్యావసరాల్ని వినియోగిస్తుంటారు. ముఖ్యంగా బియ్యం, పచ్చిశెనగపప్పు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పంచదార తదితర అహర ఉత్పత్తులను ఏటా దేవస్థానం వందల క్వింటాళ్లను కాంట్రాక్టర్ల వద్ద కొనుగోలు చేస్తుంది. నెలకు సగటున 3.5టన్నుల బియ్యం, రెండు టన్నుల పచ్చిశనగపప్పు, 2.5టన్నుల జీడిపప్పు, 250కిలోల యాలకులు, 6టన్నుల పంచదార కొనుగోలు చేస్తుంటారు. వీటికిగానూ దేవస్థానం రూ.18కోట్ల బడ్జెట్ కేటాయిస్తుంది. ప్రతిఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి ద్వారా వీటిని కొనుగోలు చేస్తుంటారు. అమ్మవారి దేవస్థానంతోపాటు కొండపై ఉన్న ఉపఅలయాలు, తొమ్మిది దత్తత దేవాలయాలు, స్టోర్స్ ద్వారా నిత్యావసరాలు సరఫరా అవుతాయి. గడచిన నాలుగేళ్లుగా ఈ కాంట్రాక్టులను సాయి మణికంఠ ఏజెన్సీ, రవికిరణ్ ట్రేడర్స్, శ్రీనివాసట్రేడర్స్ దక్కించుకుంటున్నాయి. కొందరు దేవస్థానం ఉద్యోగులు సహకరిస్తుండంతో వ్యాపారం జోరుగా సాగుతుంది. సదరు కాంట్రాక్టరు నేరుగా హోల్‌సేల్ మార్కెట్లో వీటిని కొనుగోలుచేసి దేవస్థానానికి సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి హోల్‌సెల్‌లో కొనుగోలు చేసినప్పటికి మార్కెట్‌కమిటీకి కొనుగోలు విలువలో 1శాతం సెస్ చెల్లించి రశీదు పొందిన తర్వాతనే సరఫరా చేయాలి. రంగంలోకి విజిలెన్స్.... ఈ విషయంపై పలుఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ డీజీ ఈ వ్యవహరంపై సమగ్ర దర్యాపు నిర్వహించాలని ఆదేశించటంతో జిల్లా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. సదరు కాంటాక్ట్రర్ల కొనుగోలు బిల్లులు పరిశీలించి, దేవస్థానానికి సరఫరా అయిన స్టాకు వివరాలను సేకరించి మార్కెట్‌కమిటీలో సెస్ వివరాలను తెలుసుకొని పూర్తిస్థాయి విచారణ నిర్వహించారు. 2009 నుంచి ఇప్పటి వరకు స్టాకు రిజిష్టర్ వివరాలను పరిశీలించారు. దీంతో మొత్తం రూ.6.79లక్షలు సెస్ చెల్లించకుండా నిత్యావసరాల్ని సరఫరా చేశారని గుర్తించారు. దీనిపై విజిలెన్స్ జిల్లా ఎస్పీ ఏ బాలసోని దేవి విచారణ నిర్వహించి నివేదికను పంపి కాంట్రాక్టర్లపై చర్యలకు సిఫార్సు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేయటానికి, విక్రయించటానికి యార్డునుంచి లెసైన్స్ తప్పనిసరి. కాని లెసైన్స్ లేకుండా సరఫరా చేయటం అనధికారమే అవుతుందని విజిలెన్స్ అధికారులు నిర్దారించారు. దేవస్థానం కూడా టెండర్లు ఖరారు చేసే సమయంలో రికార్డులు పరిశీలించాలి. కాని అలా పరిశీలించకుండా కొందరు వ్యక్తులు మాముళ్లతో నడిపేస్తున్నారు. అలాగే మార్కెట్ కమిటీ అ మొత్తం సెస్‌ను వారి నుంచి వసూళ్లు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాల కోసం మార్కెట్‌యార్డు అధికారులు ఎదురుచూస్తున్నారు.