
రైతులకు అందని ‘కూల్’ వాటర్
► బయట పడేసిన వాటర్‌కూలర్
పెద్దపల్లిరూరల్: వ్యవసాయ మార్కెట్‌యార్డులో పంట దిగుబడులను అమ్ముకునేందుకు వచ్చే అన్నదాతల దాహర్తిని తీర్చేందుకు కొనుగోలు చేసిన వాటర్‌కూలర్‌ను నిర్లక్ష్యంగా బయట పడేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ చెప్పుకుంటున్న పాలకవర్గ ప్రతినిధులు రైతాంగానికి కనీస వసతులను కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.
కార్యాలయ ఆవరణలో మరోకూలర్‌ను ఏర్పాటు చేసుకుని కార్యాలయ అధికారులు, సిబ్బంది మాత్రం చల్లని నీళ్లు తాగుతూ తమను విస్మరించడం సమంజసం కాదంటున్నారు. ఇప్పటికైనా మార్కెట్‌కమిటీ పాలకవర్గం యార్డుకు వచ్చిన రైతులకు కనీస సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాలని కోరుతున్నారు.