water cooler
-
ఎయిర్ కూలర్‌ను నేరుగా వాడొద్దు!
ఎండలు బాగా ముదురుతున్నాయి కదా. ఇక చాలాకాలం పాటు వాడకుండా ఎప్పటినుంచో అలా ఓ మూల పడి ఉన్న వాటర్‌కూలర్ తీసి వాడాలనుకుంటున్నారా? దాన్ని అలా తీసేసి, వెంటనే ఇలా వాడేయకండి. నిద్రపోతున్నప్పుడు గదిని చల్లబరిచేందుకు వాడే ఎయిర్‌కూలర్ విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించడం అవసరం. గతేడాదో లేదా చాలాకాలం కిందటో వాటర్‌కూలర్ వాడటం మానేసిన సమయంలో దాని కింది భాగంలో ఎన్నో కొన్ని నీళ్లు ఉన్నాయనుకోండి. అక్కడ లీజియోనెల్లా అనే ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ బ్యాక్టీరియా కారణంగా ‘వాటర్ కూలర్ నిమోనియా’ అని వాడుక భాషలో పిలిచే ప్రమాదకరమైన నిమోనియా రావచ్చు. అందుకే అట్టడుగున ఎంత మాత్రమూ చెమ్మలేకుండా చేసేందుకు ఓసారి వాటర్‌కూలర్‌ను లోపలి చెమ్మ అంతా ఇగిరిపోయేలా చూడాలి. ఆ తర్వాతే వాటర్ కూలర్‌ను వాడాలి. ఎయిర్ కూలర్ విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించాలి. ఇక ఎయిర్‌కూలర్‌లో అడుగున నీరు ఉంటే ఇదే లీజియోనెల్లా బ్యాక్టీరియా ఇక్కడ కూడా చేరవచ్చు. అందుకే ఇలా ఎయిర్ కూలర్‌ను వాడేముందు ఒకసారి ఆరుబయటకు తీసుకొచ్చి, కాసేపు ఆన్ చేసి, అడుగున ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చూడాలి. ఇలా ఆన్ చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. కూలర్ తాలూకు పాత తడికల్లోనూ డస్ట్‌మైట్స్ ఉండవచ్చు. నేరుగా ఆన్ చేయడం వల్ల వాటి కారణంగా ఆస్తమా రోగుల్లో... (ఆ మాటకొస్తే కొందరు సాధారణ వ్యక్తుల్లో సైతం) దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ట్రిగర్ అయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఈ జాగ్రత్తలు. చదవండి: మీ తలగడ, పరుపు సౌకర్యంగా ఉన్నాయా? -
ఖైదీల కూలర్లో భారీగా ‘కట్టలు’.. వైరల్!
అమృత్సర్ : విడుదలైన ఖైదీలు బహుకరించిన వాటర్ కూలర్లో బయటపడ్డ వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు జైలు అధికారులు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అమృత్సర్ సెంట్రల్ జైలు అధికారులు వేసవి తీవ్రతను తట్టుకోవడానికి జైల్లోని కొన్నిచోట్ల వాటర్ కూలర్లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇటీవలే కొందరు ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. వారికి ఈ విషయం తెలిసింది. దీంతో తాము కూడా జైలు కోసం కూలర్ బహూకరిస్తామని అభ్యర్థించారు. అందుకు అధికారులు అంగీకరించడంతో ఓ వాటర్ కూలర్ని తెచ్చి వారికి అందజేశారు. అయితే, కూలర్ విషయంలో జైలు సిబ్బందికి ఎక్కడో అనుమానం వచ్చింది. దాంతో తెరచిచూసిన అధికారులు కంగుతిన్నారు. అందులో నుంచి ఏకంగా 1780 బీడీ కట్టలు, రెండు ప్యాకెట్ల పొగాకు బయటపడ్డాయి. జైలు లోపల ఉన్న తమ సహచర ఖైదీల కోసం విడుదలైన ఖైదీలు ఈ ప్లాన్ వేశారని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. మహిందర్ సింగ్ అనే వ్యక్తికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. -
వైరల్ : ఖైదీలు బహుకరించిన వాటర్ కూలర్లో
-
రైతులకు అందని ‘కూల్’ వాటర్
► బయట పడేసిన వాటర్‌కూలర్ పెద్దపల్లిరూరల్: వ్యవసాయ మార్కెట్‌యార్డులో పంట దిగుబడులను అమ్ముకునేందుకు వచ్చే అన్నదాతల దాహర్తిని తీర్చేందుకు కొనుగోలు చేసిన వాటర్‌కూలర్‌ను నిర్లక్ష్యంగా బయట పడేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ చెప్పుకుంటున్న పాలకవర్గ ప్రతినిధులు రైతాంగానికి కనీస వసతులను కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. కార్యాలయ ఆవరణలో మరోకూలర్ను ఏర్పాటు చేసుకుని కార్యాలయ అధికారులు, సిబ్బంది మాత్రం చల్లని నీళ్లు తాగుతూ తమను విస్మరించడం సమంజసం కాదంటున్నారు. ఇప్పటికైనా మార్కెట్‌కమిటీ పాలకవర్గం యార్డుకు వచ్చిన రైతులకు కనీస సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాలని కోరుతున్నారు. -
వాటర్ కూలర్ వ్యాధి ‘లీజియొన్నేరిస్ డిసీజ్’!
మెడిక్షనరీ ఎండలు బాగా ముదురుతున్నాయి. అప్పటివరకూ మూల పడి ఉన్న వాటర్ కూలర్స్ తీసి వాడబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఇది కాస్త చదవండి. వాటర్ కూలర్‌లోని అడుగు భాగంలో నీళ్లు ఉన్నా... కాసేపు వాటర్ కూలర్‌ను బయట పెట్టి ఆన్ చేయకుండా ఉన్నా ఆ మెష్‌లోని ఒక రకం బ్యాక్టీరియా వల్ల ఈ వాటర్ కూలర్లో దాగి ఉండే లీజియొనెల్లా అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల వాటర్ కూలర్ నిమోనియా అని పరిగణించే ‘లీజియొన్నేరిస్ డిసీజ్’ అని పేరున్న ఒక విధమైన నిమోనియా రావచ్చు. అప్పటికే ఆస్తమా వంటి వ్యాధిగస్తులైతే ఈ లీజియొనెల్లా బ్యాక్టీరియాతో మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే పాత నీరు అంతా బయటకు పోయేలా, మెష్ భాగంలో ఉన్న తడిక వంటి భాగంలోని బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్లేలా కాసేపు కూలర్‌ను ఆరుబయటే ఆన్ చేసి ఉంచాలి. కూలర్లో పాత నీరు... ఒక్క చుక్క కూడా లేకుండా డ్రై అయిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత తాజా నీళ్లు (ఫ్రెష్ వాటర్) పోసి అప్పుడు మాత్రమే వాడుకోవాలి.