వాటర్ కూలర్ వ్యాధి ‘లీజియొన్నేరిస్ డిసీజ్’!
మెడిక్షనరీ
ఎండలు బాగా ముదురుతున్నాయి. అప్పటివరకూ మూల పడి ఉన్న వాటర్ కూలర్స్ తీసి వాడబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఇది కాస్త చదవండి. వాటర్ కూలర్‌లోని అడుగు భాగంలో నీళ్లు ఉన్నా... కాసేపు వాటర్ కూలర్‌ను బయట పెట్టి ఆన్ చేయకుండా ఉన్నా ఆ మెష్‌లోని ఒక రకం బ్యాక్టీరియా వల్ల ఈ వాటర్ కూలర్‌లో దాగి ఉండే లీజియొనెల్లా అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల వాటర్ కూలర్ నిమోనియా అని పరిగణించే ‘లీజియొన్నేరిస్ డిసీజ్’ అని పేరున్న ఒక విధమైన నిమోనియా రావచ్చు. అప్పటికే ఆస్తమా వంటి వ్యాధిగస్తులైతే ఈ లీజియొనెల్లా బ్యాక్టీరియాతో మరింత అప్రమత్తంగా ఉండాలి.
అందుకే పాత నీరు అంతా బయటకు పోయేలా, మెష్ భాగంలో ఉన్న తడిక వంటి భాగంలోని బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్లేలా కాసేపు కూలర్‌ను ఆరుబయటే ఆన్ చేసి ఉంచాలి. కూలర్‌లో పాత నీరు... ఒక్క చుక్క కూడా లేకుండా డ్రై అయిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత తాజా నీళ్లు (ఫ్రెష్ వాటర్) పోసి అప్పుడు మాత్రమే వాడుకోవాలి.