bacteria
-
ఇన్ఫెక్షన్: సెల్యు'లైట్' తీసుకోకండి..!
ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మానికి సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్పై అవగాహన కోసం ఈ కథనం.సెల్యులైటిస్ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్తో కూడిన సెల్యులైటిస్‌ను తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్‌లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... సెల్యులైటిస్ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్‌కు దారితీయవచ్చు. ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. సెల్యులైటిస్‌లో ఎలా వస్తుందంటే?వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది.చర్మం రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ అనిపిస్తుంటుంది. ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్‌కు తావిచ్చే కండిషన్స్చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్ ఫూట్ వంటివి). ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉందాహరణకు చికెన్‌పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్ ఉన్నవారిలో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్ వెయిన్స్ వంటివి). పెరిఫెరల్ వ్యాస్క్యులార్ డిసీజ్ వంటి జబ్బుల కారణంగా. శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్‌కు అవకాశాలెక్కువ). స్థూలకాయం ఉన్నవారిలో. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్ రావచ్చు. ఒకసారి సెల్యులైటిస్ సోకాక...ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్‌కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్‌లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్‌కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు.సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇలా జరుగుతుంది. సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్‌గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్ సెల్యులైటిస్ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. చికిత్స యాంటీబయాటిక్స్‌తో చికిత్స స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.వ్యాయామం (ఫిజియోథెరపీ) వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. కొన్ని జాగ్రత్తలుసెల్యులైటిస్ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం. గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం. కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్‌ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్తోపాటు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం వేరికోస్ వెయిన్స్ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం. చివరగా... సెల్యులైటిస్ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్డా.జి. వెంకటేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ – కాస్మటిక్ సర్జన్ (చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
వాష్‌రూంలో టూత్‌బ్రష్.. మీ పళ్లు మటాష్!!
‘మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా?’.. అంటూ వచ్చే టీవీ యాడ్‌ను చూసే ఉంటారుగా.. దృఢమైన దంతాలు, చిగుళ్ల కోసం ఉప్పున్న తమ పేస్ట్‌నే వాడాలంటూ ఓ ప్రముఖ టూత్‌పేస్ట్ కంపెనీ చేసుకొనే ప్రచారం అది. మరి మీ టూత్‌బ్రష్‌లు వాష్‌రూంలో ఉంటాయా? బ్రష్ చేసుకొని తిరిగి వాటిని అక్కడే ఉంచుతారా? అయితే మీకు పంటి సమస్యలు తప్పవని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది!! సాక్షి, సిద్దిపేట: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవడం ఒక్కటే సరిపోదని.. టూత్‌బ్రష్‌లను సరైన చోట ఉంచడం కూడా ముఖ్యమని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేపట్టిన పరిశోధన తేల్చిచెబుతోంది. టూత్‌బ్రష్‌లపై ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నాయని.. బ్రష్‌ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. వాష్‌రూంలలో ఉంచితే అంతే.. అటాచ్డ్ వాష్‌రూంలు ఉన్న ఇళ్లలో నివసించే వారిలో చాలా మంది తమ టూత్‌బ్రష్‌లను భద్రపరుస్తుండటం సహజమే. అయితే అలా వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌లపై భారీగా సూక్ష్మజీవులు పేరుకుపోతున్నాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయనంలో తేలింది. టూత్ బ్రష్‌లను వాష్‌రూంలో ఉంచడం వల్ల ఫ్లష్ చేసిన ప్రతిసారీ కమోడ్ నుంచి నీటితుంపర్లు ఎగిరిపడతాయని.. తద్వారా కమోడ్‌లో ఉండే బ్యాక్టీరియా నీటితుంపర్ల ద్వారా గాల్లో వ్యాపిస్తూ అక్కడ ఉండే బ్రష్‌లపైకి ఎక్కువగా చేరుతున్నాయని నిర్ధారణ అయింది. అదే వాష్‌రూంకు దూరంగా, కాస్త గాలి, ఎండ తగిలే చోట టూత్‌బ్రష్‌లను ఉంచిన చోట సూక్ష్మక్రిములు నశిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అలాగే ఇంట్లోని అందరి టూత్‌బ్రష్‌లను కూడా ఒకే దగ్గర పెట్టడం అంత సురక్షితం కాదని నిరూపితమైంది. 45 రోజులపాటు సాగిన పరిశోధన టూత్ బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణ అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు పరిశోధన చేపట్టారు. కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర ఇన్చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ పర్యవేక్షణలో 45 రోజులపాటు పరిశోధన చేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌ల నుంచి 100 నమూనాలను శ్వాబ్‌ల ద్వారా సేకరించారు. వాటిలో బ్యాక్టీరియా ఉందా? ఉంటే ఏయే రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయనే దానిపై పరిశోధన చేపట్టారు. మూడు రకాల బ్యాక్టీరియాల గుర్తింపు శాంపిల్స్ సేకరించిన టూత్బ్రష్లలో ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ రకం బ్యాక్టీరియా 50 శాతం, స్టెఫైలోకోకస్ ఆర్‌యస్ 40 శాతం, ఎస్చెరిషియా కోలి (ఈ–కొలి) బ్యాక్టీరియా 20 శాతం ఉన్నట్లుగా తేల్చారు. పిప్పిపళ్లు, దంతాల క్షీణత, అరుగుదలకు స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ బ్యాక్టీరియా కారణమవుతుందని చెప్పారు. అలాగే స్టెఫైలోకోకస్ ఆర్‌యస్ వల్ల గొంతు సమస్యలు, మౌత్ అల్సర్, ఈ–కోలి బ్యాక్టీరియా వల్ల జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.యూవీ లైట్‌తో బ్యాక్టీరియా మాయంబ్యాక్టీరియా ఉన్న బ్రష్‌లను ఆయా విద్యార్థులు సొంతంగా తయారు చేసిన యూవీ లైట్బాక్స్లో పెట్టి పరీక్షించగా వాటిపై ఎలాంటి క్రిములు లేవని తేలింది. టూత్ బ్రష్‌లను వినియోగించే ముందు యూవీ లైట్ బాక్స్‌లో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచడం ద్వారా బ్రష్ శానిటైజ్ అవుతుందన్నారు. మరోవైపు ఒకవేళ బ్రష్‌లను ఒకేచోట పెట్టాల్సి వస్తే వాటికి క్యాప్‌లను పెట్టాలని ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న విద్యార్థులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ వేడినీటితో బ్రష్‌ను శుభ్రం చేశాకే వాడాలని.. మూడు నెలలకోసారి టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా మార్చాలని చెబుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రిన్సిపాల్ సునీత సూచనలతో సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పర్యవేక్షణలో టూత్‌బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణపై పరిశోధన చేశాం. ప్రజలకు అవగాహన కల్పించాం. యూవీ బాక్స్‌ను సైతం తయారు చేశాం. – విద్యార్థినులు.. మౌనిక, షారోన్, నాగలక్ష్మి, సిద్ద, స్నేహ, సుష్మిత ప్రభుత్వ జిజ్ఞాస పోటీలకు పంపుతాం.. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే జిజ్ఞాస పోటీలకు పంపిస్తున్నాం. టూత్ బ్రష్‌ల ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతోందన్న విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పరిశోధన చేపట్టాం. – డాక్టర్ మదన్ మోహన్, సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
తక్కువ ఖర్చుతో...పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్
రసాయనిక వ్యవసాయం వల్ల కాలుష్య కాసారంగా మారిపోయిన వ్యవసాయ భూములను తక్కువ ఖర్చుతో, సులభంగా, సమర్థవంతంగా శుద్ధి చేసే కొన్ని జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ముంబై ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందుల వల్ల, ఇతరత్రా కాలుష్య కారకాల వల్ల పంట భూములు నాశనమవుతున్న సంగతి తెలిసిందే.విషతుల్య కాలుష్య కారకాలను హరించటంతో పాటు నేలలో ఉన్నప్పటికీ మొక్కలకు అందుబాటులో లేని పోషకాలను అందుబాటులోకి తేవటం ద్వారా పనిలో పనిగా పంట దిగుబడిని కూడా పెంపొందించడానికి ఈ ‘బ్యాక్టీరియా కాక్టెయిల్’ ఉపయోగపడుతున్నదని ముంబై ఐఐటి పరిశోధకులు ప్రకటించారు. ముంబై ఐఐటిలో బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే మార్గ దర్శకత్వంలో సందేశ్ పపడే ఈ పరిశోధన చేశారు. మట్టిలోని విషాలను విచ్చిన్నం చేసి తీసివేయటంతో పాటు ఈ బ్యాక్టీరియా అధికోత్పత్తికి దోహదం చేసే గ్రోత్ హార్మోన్ల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయని, అదేసమయంలో హానికారక శిలీంధ్రాలను అరికడుతున్నాయని, తద్వారా పోషకాల లభ్యత పెరుగుతోందని గుర్తించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకాన్ని తగ్గించటానికి.. నేలల ఆరోగ్యం, ఉత్పాదకశక్తిని పెంపొందించడానికి ఉపయోడపడుతోందని ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే వెల్లడించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందులలోని బెంజీన్ వంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్ వల్ల నేలలు కలుషితం కావటం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ సమ్మేళనాలు విషతుల్యమైనవి. విత్తనం మొలక శాతాన్ని ఇవి తగ్గిస్తాయి. పంట మొక్కల ఎదుగుదలకు, దిగుబడికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ధాన్యాలు, గింజల్లో, మొక్క భాగాల్లో ఈ విషతుల్యమైన సమ్మేళనాలు చేరి΄ోతాయి. కార్బారిల్, నాఫ్తలిన్, బెంజోయేట్, 2,4–డ్రైక్లోరోఫెనాక్సియేసెటిక్ ఆసిడ్, థాలేట్స్‌ను పురుగుమందుల్లో విస్తృతంగా వాడుతున్నారు. సౌందర్యసాధనాలు, దుస్తులు, నిర్మాణ రంగం, ఆహార రంగంలో వాడే ప్రిజర్వేటివ్స్, అద్దకం, పెట్రోలియం, ప్లాస్టిక్ ఉత్పత్తి రంగాల్లో కూడా ఈ విషతుల్యమైన సమ్మేళనాలను వాడుతున్నారు. వీటి వల్ల మట్టి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. అయితే, ఈ కలుషితాలను తొలగించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రసాయనిక పద్ధతి లేదా కలుషితమైన మట్టిని తొలగించటం వంటి పద్ధతులు అధిక ఖర్చుతో కూడినవే కాక సమస్యను సమూలంగా పరిష్కరించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా సమస్యాత్మక నేలలను శుద్ధి చేసుకోవటానికి ఐఐటి ముంబై పరిశోధకుల కృషి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.సహజ పద్ధతిలో శుద్ధిఘాటైన వాసనలతో కూడిన రసాయనిక విషపదార్థాలను చక్కగా విచ్ఛిన్నం చేయటానికి సూడోమోనాస్, అసినెటోబాక్టర్ తదితర జాతుల బ్యాక్టీరియా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇవి విషతుల్య సమ్మేళనాలను తిని.. హానికరం కాని, విషరహిత సమ్మేళనాలుగా మార్చుతున్నాయి. ఆ క్రమంలో కలుషిత∙పర్యావరణాన్ని ఇవి సహజంగా శుద్ధి చేస్తున్నాయని ఫలే వ్యాఖ్యానించారు.పెరిగిన పోషకాల లభ్యత ఫాస్ఫరస్, పొటాషియం వంటి నీట కరగని స్థూల పోషకాలను ఈ బ్యాక్టీరియా నీట కరిగేలా చేస్తుంది. తద్వారా పంట మొక్కల వేర్లు అదనపు పోషకాలను పీల్చుకునే అవకాశం కల్పిస్తాయి. నిస్సారమైన భూముల్లో పెరిగే పంట ఐరన్‌ను ఎక్కువగా తీసుకోలేకపోతుంటుంది. ఈ సూక్ష్మజీవులు సైడెరోఫోర్స్ అనే పదార్ధాన్ని విడుదల చేయటం ద్వారా ఐరన్‌ను సరిగ్గా తీసుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ఇండోల్ అసెటిక్ ఆసిడ్ (ఐఎఎ) అనే గ్రోత్ హార్మోన్‌ను ఈ బ్యాక్టీరియా విడుదల చేసి దిగుబడిని పెంచుతుంది. ఇంకా ప్రొఫెసర్ ఫలే ఇలా అన్నారు.. ‘సూడోమోనాస్, అసెనెటోబాక్టర్ జెనెరకు చెందిన అనేక జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని వాడిన తర్వాత గోధుమ, పెసర పాలకూర, మెంతికూర తదితర పంటల దిగుబడి 40–45% వరకు పెరిగింది. మట్టిలో రసాయనాలను కొన్ని రకాల బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంటే, మరికొన్ని సూక్ష్మజీవులు మొక్కల పెరుగుదలను పెంపొందించే హార్మోన్ ఉత్పత్తికి, చీడపీడల బెడద నుంచి దీటుగా తట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయని, కలసికట్టుగా పనిచేస్తే కలిగే ప్రయోజనం ఇదే అన్నారు ప్రొ. ఫలే. -
లొంగని బ్యాక్టీరియాకు విరుగుడు
సాక్షి, అమరావతి : ‘అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వాడకంవల్ల శరీరంలోని చెడు బ్యాక్టీరియా రోగనిరోధకత పెరుగుతోంది. దీంతో కొన్నిరకాల బ్యాక్టీరియాపై యాంటిబయోటిక్స్ పనిచేయకుండాపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెనువిపత్తులా మారింది. ఇలా యాంటిబయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ఫేజ్ థెరపీతో చెక్‌పెట్టొచ్చు’.. అని క్లినికల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్), యూరోపియన్ స్టడీ గ్రూప్ ఆన్ నాన్–ట్రెడిషనల్ యాంటిబయోటిక్స్ సొసైటీ (ఈఎస్జీఎన్టీఏ) సభ్యులు డాక్టర్ కళ్యాణచక్రవర్తి అన్నారు.జార్జియా, రష్యా, అమెరికా, యూరప్ దేశాల్లో న్యూమోనియా, క్షయ, చర్మ, మూత్రనాళ, ఇతర బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లలో యాంటిబయోటిక్స్‌కు బ్యాక్టీరియా లొంగని క్రమంలో ఫేజ్ థెరపీ వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్‌లోనూ అక్కడక్కడా ఇది వినియోగంలో ఉన్నా ఈ విధానం భవిష్యత్తులో పెద్దఎత్తున వాడుకలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఈఎస్జీఎన్టీఏ ఆధ్వర్యంలో ఫేజ్ థెరిపీపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డా. కళ్యాణ్‌చక్రవర్తి పాల్గొన్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్సల్లో ఫేజ్ థెరఫీకి సంబంధించిన అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. 1900 దశకంలోనే..బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి బ్యాక్టీరియా వైరస్ (ఫేజ్)లను వినియోగించడమే ఫేజ్ థెరపీ. యాంటిబయోటిక్స్ కనిపెట్టడానికంటే ముందు 1900 దశకం ప్రారంభంలో ఈ ఫేజ్ థెరపీ వినియోగంలో ఉండేది. మానవులపై దాడిచేసి వ్యాధుల బారినపడేలా చేసే బ్యాక్టీరియాను నశింపజేసే బ్యాక్టీరియా ఫేజ్‌లు ప్రకృతిలో ఉంటాయి. నీరు, మట్టి, ఇతర ప్రకృతి వనరుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను ప్రయోగశాలల్లో శుద్ధిచేసి అందులోని చెడు రసాయనాలను వేరుచేసిన అనంతరం ఫేజ్లను సాధారణ మందుల మాదిరిగానే చికిత్సలో వినియోగిస్తారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనిపెట్టిన అనంతరం పెద్దఎత్తున యాంటిబయోటిక్ మందులు అందుబాటులోకి రావడంతో ఫేజ్ థెరపీ కనుమరుగైంది.రోగ నిరోధకత పెరుగుదల..మార్కెట్లో ఉన్న యాంటిబయోటిక్స్‌కు లొంగకుండా బ్యాక్టీరియా రోగ నిరోధకత పెంచుకోవడంతో మందులు పనిచేయకుండాపోతున్నాయి. ఆస్ప త్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రమాణాలు సరిగా పాటించకపోవడం. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 90 శాతం, ఆస్పత్రులకు వచ్చే వారిలో 50 శాతం మందిలో యాంటిబయోటిక్స్ పనిచేయని దుస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచానికి ఫేజ్ థెరపీ ప్రత్యామ్నాయంగా ఉంటోంది. కొన్నేళ్ల క్రితం నేను న్యుమోనియాతో బాధపడే 60 ఏళ్ల వృద్ధురాలికి ఈ విధానం ద్వారా నయంచేశాను. రోగుల డిమాండ్ మేరకు ఆస్పత్రుల్లోని ఎథిక్స్ కమిటీ ఆమోదంతో మన దేశంలో ఇప్పటికే ఈ విధానాన్ని వినియోగి స్తున్నారు. ఈ విధానంలో రోగుల్లో రోగనిరోధకత పెరగడంతో పాటు, త్వరగా వ్యాధుల నుంచి కోలుకుంటారని పలు పరిశో«ధనల్లో సైతం వెల్లడైంది. మార్పు రాకపోతే కష్టం..ప్రజలు, కొందరు వైద్యులు లెక్కలేనితనంగా యాంటిబయోటిక్స్‌ను వినియోగిస్తుండటంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది ప్రపంచానికి పెనుముప్పుగా అవతరించింది. ఏఎంఆర్ పెను ఆరోగ్య సమస్యగా మారి ఫేజ్ థెరపీని ఆశ్రయించాల్సిన దుస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. మనం పెరట్లో పెంచుకునే మొక్కకు తెగులు వస్తే ఆ తెగులు ఏంటో నిర్ధారించుకుని మందు కొని పిచికారి చేస్తాం. మొక్కకే ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రజలు ఆరోగ్యానికి ఇవ్వకపోతుండటం దురదృష్టకరం. జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ చిన్నజబ్బు వచ్చినా వెంటనే మెడికల్ స్టోర్‌కు వెళ్లి వాళ్లిచ్చే యాంటిబయోటిక్స్ వాడుతున్నారు. ఈ దురలవాటును ప్రతిఒక్కరూ విడనాడాలి. సాధారణ దగ్గు, జలుబు, జ్వరానికి యాంటిబయోటిక్స్ వాడొద్దు. వైద్యుడిని సంప్రదించి, వ్యాధి నిర్ధారణ చేసుకుని, వైద్యుడి సూచన మేరకు మాత్రమే యాంటిబయోటిక్స్ వాడితే చాలావరకూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. -
జూపార్కులో 10 రోజుల్లో 12 కోతుల మృతి
హాంకాంగ్: హాంకాంగ్ జూ పార్కులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా 10 రోజుల వ్యవధిలో 12 కోతులు మృతిచెందాయి. కొద్ది రోజుల క్రితమే జూపార్కులో ప్రమాదకర బ్యాక్టీరియా విస్తరణను అధికారులు గుర్తించారు.మృతిచెందిన కోతులకు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో జూ ఎన్క్లోజర్ల మట్టిలో ఒక రకమైన బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం కోతులు సెప్సిస్ బారిన పడి మృతిచెందాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఆ కోతులలోని కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అవయవాలు పనిచేయడం ఆగిపోయి, అవి మృతిచెందాయి. జూ కార్మికుల బూట్ల ద్వారా కలుషితమైన మట్టి జంతువుల ఎన్క్లోజర్లకు చేరిందని అధికారులు భావిస్తున్నారు. జంతువుల కోసం గుహలు, ఇతర ఆవాసాల నిర్మాణ పనుల సమయంలో కోతుల సామూహిక మరణాలు సంభవించాయి.అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం మట్టి ద్వారా అంటువ్యాధులు సంక్రమించడమనేది సాధారణమే. కానీ జంతుప్రదర్శనశాలలలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా కాటన్ టాప్ టామరిన్, వైట్-ఫేస్డ్ సాకి, కామన్ స్క్విరెల్ మంకీ, డి బ్రజ్జాతో సహా పలుకోతులు మృతిచెందాయి. మెలియోయిడోసిస్ అనేది కలుషితమైన మట్టి, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఇదే కోతుల ప్రాణాలను తీసింది. హాంకాంగ్ జూ పార్కు నగరం నడిబొడ్డున 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కోతులు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా
వంట చేయడం ఒక ఎత్తయితే...అంట్ల గిన్నెలను తోమడం, కడగడం అంతకు రెండింతలు. శుభ్రంగా తోమాలి. ఎలాంటి మరకలు లేకుండా కడగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యానికి చేటే. మన ఇంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంటికి, ఒంటికీ అంత మంచిది. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే వంట గిన్నెల్ని శుభ్రం చేసే స్క్రబ్బర్, స్పాంజ్‌ల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సోకవచ్చని తాజా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం కాలంలో వంట పాత్రల్ని శుభ్రం చేసేందుకు ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్‌ని, లేదా స్పాంజ్‌ని వాడుతూ ఉంటాం కదా. ఈ డిష్ స్క్రబ్బింగ్ స్పాంజ్ హానికరమైన బాక్టీరియాకు హాట్‌స్పాట్ అంటే నమ్ముతారా? ఇది టాయిలెట్ బౌల్ కంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుందని తాజా స్టడీ తేల్చింది. కిచెన్ స్పాంజ్లు ఎందుకు ప్రమాదకరం?డ్యూక్ యూనివర్శిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు స్పాంజ్లు తేమతో కూడిన నిర్మాణం కారణంగా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని ధృవీకరించారు. ఒక చిన్న క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్లో 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. 5 శాతం వరకు సాల్మొనెల్లాను కలిగి ఉండవచ్చు. దీంతో తేలికపాటి గ్యాస్ట్రోఎంటెరిటిస్ మాత్రమే కాకుండా మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరాలు, బ్లడీ డయేరియా, ప్రాణాంతక బ్లడ్ పాయిజిన్లాంటి తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్తో ఆహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటికి చికిత్స చేయకపోతే ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అంతేకాదు అందులో ఉండే రకరకాల బ్యాక్టీరియాలతో కిడ్నీ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఈ స్పాంజ్‌లలో వృద్ధి చెందే ఈ-కొలి కారణంగా మూత్రపిండ వైఫల్య ప్రమాదం కూడా ఉంది. దీన్నే హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఆహార కాలుష్యం వల్ల వస్తుంది. స్టెఫిలోకాకస్ అనేది స్పాంజ్‌లలో కనిపించే మరొక వ్యాధికారకం. చర్మ వ్యాధులకు, ఇంపెటిగో, సెల్యులైటిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. పరిష్కారం ఏమిటి? ఏం చేయాలి. పాత్రలను శుభ్రం చేసే స్పాంజ్లు,స్క్రబ్బర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. అలాగే ఏరోజుకారోజు శుభ్రంగా క్లీన్ చేయాలి. తడి లేకుండా బాగా పిండేసి, తర్వాత వాటిని గాలిలో ఆరనివ్వాలి. మాంసం కంటైనర్లు, ఇతర పాత్రలు..ఇలా అన్నింటికి ఒకటే కాకుండా వేరు వేరువస్తువులను శుభ్రం చేయడానికి వేరు వేరు స్పాంజిని ఉపయోగించాలి. బాక్టీరియా ప్రమాదాన్ని నివారించేందుకు స్పాంజ్‌లను తడిపి రెండు నిమిషాలు మైక్రోవేవ్‌లో ఉంచాలి.డిష్ గ్లోవ్స్ ధరించడం వల్ల కలుషితమైన స్పాంజ్లతో వచ్చే చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించు కోవచ్చు. స్పాంజ్లకు ప్రత్యామ్నాయాలుప్లాస్టిక్ స్పాంజ్‌లను తరచుగా వాడి పారేయడం పర్యావరణ అనుకూలమైనది కాదు, కాబట్టి సెల్యులోజ్ ఆధారిత స్పాంజ్ లాంటి ప్రత్యామ్నాయాలుఎంచుకోవాలని పరిశోధకులు సూచించారు. స్పాంజ్‌లను ఉపయోగించడంలో అసౌకర్యంగా ఉన్నవారు, స్క్రబ్ బ్రష్‌లు, సిలికాన్ బ్రష్‌లు, సింగిల్ యూజ్ మెటల్ స్క్రబ్బీలు, డిష్వాషర్లు లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలింటున్నారు. -
స్మార్ట్‌ఫోనా? టైం బాంబా భయ్యా ఇది! వైరల్ వీడియో
పుస్తకం హస్తభూషణం అన్న రోజులు పోయాయి. పగలూ రాత్రి స్మార్ట్ఫోనే ప్రపంచంగా కాలం గడుపుతున్న రోజులివి. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే వైర్లెస్ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనీ, గర్భిణీ స్త్రీలపై ఒత్తిడి, అలసట, నిద్రకు భంగం వంటి ప్రతికూల ప్రభావాలకు ఈ సెల్ రేడియేషన్ కారణమని అనేక పరిశోధనలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు స్మార్ట్పోన్ఎక్కువగా వాడటం కంటి సమస్యలు, చేతి, మెడ కండరాలు సమస్యలు కూడా వస్తాయి.తాజాగా స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోస్కోప్‌లో పరిశీలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మీద ఉంటుందని గతంలో అనేక పరిశోధనలు హెచ్చరించాయి. ఇదే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.Smartphone under a Microscope📹 Rajinder Singhpic.twitter.com/UsHH3AUrvW— Science girl (@gunsnrosesgirl3) August 28, 2024ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయమైన మొబైల్ ఫోన్ వాడకంలో తప్పనిసరి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఫోన్ వాడకాన్ని నియంత్రించడం, అలాగే వాడిన తరువాత, ఆహారం తీనేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. స్మార్ట్‌ఫోన్‌ను రోజులో ఒకసారైనా శానిటైజ్‌తో జాగ్రత్తగా తుడవం( తడిచిపోయేలా కాదు) చేయాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచాలి. -
జపాన్ లో మనిషి మాంసం తినేసే బ్యాక్టీరియా కలకలం
-
దడ పుట్టిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. సోకితే రెండు రోజుల్లో మృతి?
జపాన్‌లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ప్రాణాంతకమని, దీని బారిన పడిన బాధితులు రెండు రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్ వైద్య నిపుణులు చెబుతున్నారు.జపాన్‌లో కరోనా పీరియడ్ ఆంక్షలు సడలించిన అనంతరం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యు ఒడికి చేరుస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ‘స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ (ఎస్టీఎస్ఎస్) అని అంటారు.జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కి చేరుకున్నాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్స్టిట్యూట్ 1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యు ఒడికి చేరుస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటున్నదని పలు పరిశోధనల్లో తేలింది.ఈ వ్యాధి గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకినప్పుడు మరణం 48 గంటల్లో సంభవించే అవకాశం ఉన్నదన్నారు. జపాన్‌లో ఈ ఏడాది చివరినాటికి ఈ కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని కికుచి తెలిపారు. -
మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాతో టీబీ కొత్త వ్యాక్సిన్!
క్షయ వ్యాధి ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అయినా..చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోని దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. ఇది మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వలన వస్తుంది. క్షయ ఈ వ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు. మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది. అలాంటి ఈ వ్యాధికి ఇప్పటి వరకు బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్ మరియు గురిన్), బోవిన్ టీబీ పాథోజెన్ అటెన్యూయేటెడ్ వేరియంట్ అనే ఏళ్ల నాటి పాత వ్యాక్సిన్లే ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ పరిమిత ప్రభావమే ఉంది. అందువల్లే ప్రభావవంతంగా పనిచేసేది, ముఖ్యంగా చిన్నారులు, పెద్దలకు మెరుగైన ఫలితాలనిచ్చే వ్యాక్సిన్‌పై ఎన్నే ఏళ్లుగానో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ పరిశోధనల ఫలితమే ఎంటీబీ వ్యాక్సిన్(ఎంటీబీవీఏసీ). ఇది మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియా నుంచే క్షయ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేసేలా వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. అయితే ఇది ఎంత ప్రభావవంతంగా ఉందనే దానిపై పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్‌ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ Biofabri సహకారంతో 2025లో భారత్‌లో పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని(మార్చి 24) పురస్కరించుకుని ఈ విషయాన్ని బయోఫాబ్రి ప్రకటించింది. ఆ ట్రయల్స్ ద్వారా ఎంటీబీవీఏసీ వ్యాక్సిన్ భద్రత, సమర్థతను అంచనా వేస్తారు. ఈ ఎంటీబీ వ్యాక్సిన్ బీజీజీ కంటే ప్రభావవంతమైనది, ఎక్కువకాలం పనిచేసే వ్యాక్సిన్‌గా పేర్కొన్నారు పరిశోధకులు. ఇది పెద్దలు, యుక్త వయసులు వారికి మంచి సమర్థవంతమైన వ్యాక్సిన్‌గా అని చెప్పొచ్చన్నారు. ఈ మేరకు బయోఫ్యాబ్రి సీఈవో ఎస్టేబాన్ రోడ్రిగ్జ్ మాట్లాడు.. ఈ క్షయ వ్యాధి కారణంగా ఏటా 1.6 మిలియన్లకు పైగా ప్రజలు చనిపోతున్నారు. అంంతేగాక ప్రపంచవ్యాప్తంగా క్షయకు సంబంధించిన కేసులు దాదాపు 28% ఉన్నాయని అన్నారు. ఈ కొత్త వ్యాక్సిన్ కొత్త ఆశను రేకెత్తించేలా భారత్‌లోనే పెద్దలు,కౌమర దశలో ఉన్నవారిపై ట్రయల్స్ నిర్వహించడం అనేది గొప్ప మైలురాయి అని అన్నారు. ఇక బయోఫ్యాబ్రి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..ప్రభావవంతమైన వ్యాక్సిన్ కోసం పడ్డ అన్వేషణ ఇన్నేళ్లకు ఫలించింది. దీనికి తోడు భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్‌తో పెద్ద ప్రొత్సాహం అందినట్లయ్యిందన్నారు. ఈ కొత్త టీబీ వ్యాక్సిన్‌ని ఆవిష్కరించడంలో డాక్టర్ ఎస్టేబాన్ రోడ్రిగ్జ్, డాక్టర్ కార్లోస్ మార్టిన్ల భాగస్వామ్యం ఎంతగానో ఉందన్నారు. ఈ ట్రయల్స్‌కి ముందే ఈ వ్యాక్సిన్ అనేక మైలు రాళ్లను సాధించింది. వాటిలో ఫేజ్2 డోస్ ఫైండింగ్ ట్రయల్ ఇటీవలే పూర్తైయ్యింది. ఇక నవజాత శిశువులలో డబుల్ బ్లైండ్, కంట్రోల్డ్ ఫేజ్3 క్లినికల్ ట్రయల్ 2023లో ప్రారంభమైంది. కాగా, ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి ఏడు వేల మంది, మడగాస్కర్ నుంచి 60 మంది, సెనెగల్ నుంచి 60 మంది నవజాత శిశువులకు టీకాలు వేయనున్నారు. ప్రధానంగా శిశువుల్లో ఈ ఎంటీబీ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని, సామర్థాన్ని అంచనావేయడమే లక్ష్యం. అంతేగాదు హెచ్ఐవీ-నెగిటివ్, హెచ్ఐవీ-పాజిటివ్ పెద్దలు ,కౌమారదశలో ఉన్నవారిపై కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావంపై అంచనా వేయనుండటం గమనార్హం. ఈ ట్రయల్స్‌ని 2024 ద్వితీయార్ధంలో సబ్-సహారా ఆఫ్రికాలో ప్రారంబించనున్నారు. (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!) -
ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా..
ఆస్ట్రేలియా షెగెలోసిస్ వ్యాధి(షిగెల్లా బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి) తీవ్ర కలకలం రేపుతుంది. ఆస్ట్రేలియాలోని స్టేట్ విక్టోరియాలో ఎసోటెరిక్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. దీనికి హాజరైన ప్రజలలో కొంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ ఫెస్టివల్ డోనాల్డ్‌లో మార్చి8 నుంచి మార్చి12వ తేది వరకు జరిగింది. ఆ ఫెస్టివల్‌కి హాజరైన వారిలో దాదాపు 230 మంది దాక షిగెలోసిస్కి సంబంధించిన జీర్ణశయాంతర పేగు సంబంధిత లక్షణాలను ఎదుర్కొన్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు ఆ ఫెస్టివల్‌కి హజరైన వారలో ఇంకెవరికైనా అలాంటి లక్షణాలు తలెత్తితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధి అతిసారం మాదిరిగా జ్వరం, వికారం, వాంతులు, పొత్తికడుపు తిమ్మిరి వంటి గ్యాస్ట్రో లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులే ఈ వ్యాధికి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఎక్కుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ఎక్కువ మందికి ఈ వ్యాధి వ్యాపించడంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, సలహదారులు చెప్పేంత వరకు ఆయా బాధితలు ఎలాంటి విధులకు హాజరుకాకుడదని హెచ్చరించింది. యాంటీ బయాటిక్స్ మందులతో ఈ వ్యాధిని అదుపులోకి తీసుకురావొచ్చుగానీ కేసులు పెరిగితే మాత్రం ఈ వ్యాధి వ్యాప్తి సవాలుగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఏంటీ షెగెలోసిస్ వ్యాధి.. ఈ బ్యాక్టీరియా పేరు షింగెల్లా. ఇది సోకడాన్ని షింగెల్లోసిస్ అంటారు. ఇది సోకితే విరేచనాలు (డయేరియా), జ్వరం, కడుపు నొప్పి వస్తాయి. ఇవి కొన్ని రోజులపాటూ ఉంటాయి. చికిత్సలో యాంటీబయోటిక్స్‌ని వాడుతారు. ఇవి వ్యాధి వ్యాప్తిని తగ్గించగలవు. షింగెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి రకరకాల మార్గాల్లో వ్యాపించగలదు. ఆల్రెడీ సోకిన వ్యక్తికి డయేరియా తగ్గి నయం అయిపోయినా… ఆ వ్యక్తి నుంచి ఈ బ్యాక్టీరియా ఇతరులకు సోకగలదు. అలాగే ఈ వ్యాధి కలుషిత ఆహారం లేదా లైంగిక సంబంధం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పారిశుద్ధ్యం సరిగా లేని ప్రాంతాల్లో నివసించడం లేదా ప్రయాణించడం, పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ: తరచుగా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. మంచి పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు ఆహార పరిశుభ్రతను పాటించాలి ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాల మేరకు తీసుకోవాలి. ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట కేవలం పరిశుభ్రంగా ఉండటమే కీలకం (చదవండి: ఇదేం వ్యాధి.. సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ గ్లాస్లు తినేస్తోంది..) -
మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!
టీనేజర్లను బాగా వేధించే సమస్య మొటిమలు. ముఖంపై చిన్న బొడిపెల మాదిరిగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కొసారి వాటి నుంచి జిడ్డుగా ఉండే ఒక రకమైన ద్రవం కారుతుంది. గిల్లడం వల్ల ముఖంపై ఎర్రటి పొక్కుల్ల అసహ్యంగా కనిపిస్తాయి. ఓ పట్టాన తగ్గవు. ఇంతవరకు మొటిమలు తగ్గేందుకు యాంటీ బయోటిక్ మందులతో చికిత్స అందిస్తున్నాం. అవి కేవలం మొటిమలు రావడానికి కారణమయ్యే సెబమ్ అనే జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలతో పోరాడేవి లేదా నాశనం చేసేవి. నిజం చెప్పాలంటే ఆ ఔషధాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకునే చికిత్స చేసేవారు వైద్యులు. అయితే ఆ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియానే మనకు మేలు చేసేలా మారిస్తే..! అనే సరికొత్త అధ్యయానికి నాంది పలికారు స్పెయిన్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు పాంప్యూ ఫాబ్రా విశ్వవిద్యాలయం(యూపీఎఫ్) శాస్త్రవేత్తలు మొటిమల మందులలో క్రియాశీల పదార్థాలు ఉత్పత్తి అయ్యేలా చర్మంలో ఉండే బ్యాక్టీరియాను ఎలా ఇంజనీర్ చేయాలనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. మొట్టిమలకు కారణమయ్యే క్యూటిబాక్టిరియాని రిపేర్ చేయడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మన చర్మంపై ఉండే వెంట్రుకల కుదుళ్లలో లోతుగా నివశిస్తుంది. ఇది సెబమ్ అనే ఒక విధమైన జిడ్డు అధికంగా ఉత్పత్తి చేసి మొటిమలు వచ్చేందుకు కారణమవుతోంది. అందువల్ల వైద్యులు ఆ జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలను చంపేలే ట్రీట్మెంట్ చేసేవారు. ఇప్పుడూ ఆ సెబమ్ అనే జిడ్డు తక్కువగా ఉత్పత్తి చేసేలా చర్మంలోని బ్యాక్టీరియాని మార్చే టెక్నిక్‌ని అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం మానవ చర్మ కణాల్లోని బ్యాక్టీరియాను ల్యాబ్‌లో పరీక్షించగా మెటిమలను రాకుండా చేసే ఎన్జీఏఎల్ అనే ప్రోటీన్‌ను కూడా స్రవించగలదని గుర్తించారు. దీంతో ఆ బ్యాక్టీరియాతోనే ముఖంపై ఏర్పడే జిడ్డు ఉత్పత్తికి కారణమ్యే సెబమ్ ఉత్పత్తిని నియంత్రించొచ్చని కనుగొన్నారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించగా.. ఆ బ్యాక్టీరియా ఎలుకల్లో జీవించగులుగుతుందని గుర్తించారు. ఆ విధానం పనిచేస్తుంది కానీ మొటిమల ప్రభావాల గురించి ఎలుకలపై ప్రయోగించి తెలుసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే? ఎలుక చర్మం మానవ చర్మాని కంటే విభిన్నంగా ఉంటుంది. కచ్చితంగా మనుషులపైనే ఈ టెక్నిక్ ట్రయల్స్ నిర్వహించక తప్పదు. అయితే ఈ టెక్నిక్‌ని తొలుత త్రీడీ స్కిన్ మోడల్లో ప్రయత్నిస్తే బెటర్ అని భావిస్తున్నారు. ఎందుకంటే? అన్ని రకాల చర్మ పరిస్థితులకు ఈ విధానం అనువుగా ఉంటుంది. అదే సమయంలో మానువులపై ట్రయల్స్ నిర్వహించేందకు మరింత లోతుగా ఈ టెక్నిక్‌పై పరిశోధనుల చేయాల్సి ఉందని కూడా చెప్పారు పరిశోధకులు. అలాగే తాము ఈ బ్యాక్టీరియాను వివిధ రకాల చర్మ వ్యాధులకు కూడా మేలు చేసేలా మార్చేలా ఆ టెక్నిక్‌ని అభివృద్ధిపరచనున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అంతేగాక మొటిమల నివారణకు మొటిమలనే ఉపయోగించడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు కూడా తెలిపారు. (చదవడం: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
'సైంటిస్ట్‌గానే కాదు... భార్యగానూ గెలిచింది'!
ఆమె అంటువ్యాధులకు సంబంధించిన వైద్యురాలు, పరిశోధకురాలు. ఆమె భర్త అనుకోకుండా యాంటీబయాటిక్స్‌కి లొంగని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు గురయ్యాడు. తన కళ్లముందే భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతి క్షణం ఓ యుగంలా భయం ముంచుకొస్తోంది. అంత పెద్ద పరిశోధకురాలు అయినా ఓ సాధారణ మహిళలా భర్త ప్రాణాల ఎలా రక్షించాలో తెలియక తల్లడిల్లిపోయింది. ఇంతవరకు అలాంటి యాంటీబయోటిక్ బ్యాక్టీరియల్ కోసం ఎలాంటి చికిత్స లేదని తెలిసి హుతాశురాలైంది. ఎలాంటి యాంటి బయాటిక్‌లు వాడిన ఫలితం ఉండదని తెలిసిన క్షణంలో ఆమె మెదడు తట్టిన మెరుపులాంటి ఆలోచనతో.. కలియుగ సావిత్రలా మారి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. అందరిచేత శభాష్ అనిపించుకుంది. దాని గురించి ఓ పుస్తకం సైతం ప్రచురించింది కూడా. ఇంతకీ ఆమె ఏం చేసింది. ఎలా భర్త ప్రాణాలు కాపాడుకుంది అంటే.. యూఎస్‌కి చెందిన స్టెఫానీ స్ట్రాత్డీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎపిడెమియాలజిస్ట్. ఆమె భర్త టామ్ ప్యాటర్సన్ సూపర్ బగ్(యాంటీబయాటిక్స్‌కి లొంగని బ్యాక్టీరియా) ఇన్ఫెక్షన్ బారినపడ్డాడు. సరిగ్గా 2015లో టామ్ నదిపై సర్ఫింగ్ చేస్తూ.. అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పితో పడిపోయాడు. తక్షణమే స్ట్రాత్ డీ ఈజిప్ట్‌లోని ఒక క్లినిక్‌కి తరలించగా, అక్కడ అతడి ఆరోగ్య మరింతగా దిగజారడం ప్రారంభమయ్యింది. దీంతో ఆమె అతడిని జర్మనీలోని ఓ ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యుల యాంటీబయోటిక్స్‌కి లొంగని "బాక్టీరియం అసినెటోబాక్టర్ బౌమన్ని"తో బాధపడుతున్నట్లు తెలిపారు. అది అతడి కడుపులో ద్రాక్షపండు సైజులో ఓ గడ్డలా ఉందని చెప్పారు. అది ఎలాంటి యాంటీ బయోటిక్‌లకు లొంగదని చెప్పారు. నిజానికి ఈ బ్యాక్టీరియాని మధ్యప్రాచ్యంలోనే గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇరాక్ యుద్ధంలో చాలామంది అమెరికన్ దళాల గాయపడ్డారు. అయితే వారంతా ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లాక ఈ బ్యాక్టీరియా బారిన పడే చనిపోయినట్లు నిర్థారించారు. అప్పుడే ఈ బ్యాక్టీరియాకు ఇరాకీ బాక్టీరియాగా నామకరణం చేశారు. దీనికి ఆధునిక వైద్యంలో సరైన చికత్స లేదు. ఇప్పటికీ ఈ బ్యాక్టీరియాని అంతం చేసేలా పరిశోధనలు జరుగుతున్న దశలోనే ఉన్నాయి. ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా జరగలేదు. దీంతో స్ట్రాత్ డీ డీలా పడిపోయింది. కళ్ల ముందు మృత్యు ఒడిలోకి జారిపోతున్న భర్త, ఏం చేయాలేని స్థితిలో తాను ఏంటీ స్థితి అని పరివిధాలుగా ఆలోచించింది. ఈ క్రమంలో ఎందరో పరిశోధకులను సంప్రదించింది. దీనికి సంబంధించిన సమాచారాన్నంత క్షుణ్ణంగా పరిశీలించింది. దేనికి లొంగని ఈ యాంటీ బ్యాక్టీరియాలను తినేసే ఫేజ్ వైరస్‌లే(పరాన్నజీవులు) శరణ్యమని అర్థమయ్యింది. ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే బ్యాక్టీరియాలని కూడా చెప్పొచ్చు. ఇవి మురికి నీటిలోను, చెరువులు, పడవల్లో, సముద్రాల్లో ఉంటాయని గుర్తించింది. అయితే వాటిలో ఏది తన భర్తకు వచ్చిన బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ను తినేయగలదో అంచనావేసి, ఆ ఫేజ్ వైరస్‌ని శుద్ధి చేసి రక్తంలోకి ఇంజెక్ట్ చేయాలి. అయితే ఇంతవరకు ఈ ఫేజ్ థెరఫీని ఏ పేషెంట్‌కి ఇవ్వలేదు. ఎందుకంటే దీనిపై పూర్తి స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ జరగలేదు. తన భర్త ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ సాహసం చేయకు తప్పదు స్ట్రాత్ డీకి. అందుకోసం ముందుగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో పాటు ఈ ట్రీట్మెంట్ చేసేందుకు పరిశోధకులు కూడా స్వచ్ఛందంగా ముందుకురారు ఎందుకంటే? ఈ టీట్మెంట్ పేషెంట్ ప్రాణాలతో చెలాగాటమనే చెప్పాలి. చివరకు టెక్సాస్ యూనివర్శిటీ బయోకెమిస్ట్ రైలాండ్ యంగ్ అనే పరిశోధకుడు మాత్రమే ముందుకొచ్చారు. ఆయన గత 45 ఏళ్లుగా ఈ ఫేజ్లపైనే ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ టెక్సాస్ యూనివర్సిటీ ల్యాబ్ స్ట్రాత్ డీ భర్త టామ్‌కి సరిపడా ఫేజ్ కోసం ఆహర్నిశలు యత్నించి టామ్ శరీరంలోని బ్యాక్టీరియాతో క్రియాశీలకంగా పనిచేసే ఫేజ్ వైరస్‌ని కనుగొన్నారు. ముందుగా అతడి పొత్తికడుపులో చీముతో నిండిన గడ్డలోని ఈ ఫేస్‌ని ఇంజెక్ట్ చేశారు. ఏం జరగుతుందో తెలియని ఉత్కంఠతో ప్రతి రెండు గంటలకు చికిత్సు కొనసాగిస్తూ పరిశోధక బృందమంతా అతడిని పర్యవేక్షించారు. ఆ తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలను వ్యాపించిన బ్యాక్టీరియాను నివారించటం కోసం ఆ ఫేజ్లను టామ్ రక్తంలోకి ఇంజెక్ట్ చేశారు. నెమ్మదిగా టామ్ కోలుకోవడం కనిపించింది. దీంతో పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తూ..ఇలా యూఎస్‌లో సిస్టమిక్ సూపర్‌బగ్ ఇన్ఫెక్షన్కు చికిత్స చేయడానికి ఇంట్రావీనస్ ఫేజ్ థెరపీని పొందిన తొలి వ్యక్తి టామ్ అని చెప్పారు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా కోమాలోకి వెళ్లిన టామ్ కాస్త బయటకు రావడమే కాకుండా తన కూతురిని గుర్తుపట్టి ఆమె చేతిని ముద్దాడాడు. దీని నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డాకు దీర్ఘాకాలిక వ్యాధులైన డయాబెటిస్ వంటి రోగాల బారిన పడ్డాడు. ఆహార సంబంధ జీర్ణశయ సమస్యలను కూడా ఫేస్ చేశాడు. అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలో కరోనా బారిన పడి శ్వాస సంబంధ సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే వాటన్నింటిని విజయవంతంగా జయించి కోలుకున్నాడు. ఇప్పుడూ తన భార్య స్ట్రాత్ డీతో కలిసి ప్రపంచాన్ని చుట్టి వచ్చే పర్యటనలు కూడా చేస్తున్నాడు. ఒకరకంగా టామ్‌కి ఇచ్చిన ఫేజ్ థెరఫీ కొత్త శాస్త్రీయ ఆలోచనకు నాందిపలికింది. ఇక స్ట్రాత్ డీ తన భర్త ప్రాణాల కోసం సాగించిన అలుపెరగని పోరాటాన్ని “ది పర్ఫెక్ట్ ప్రిడేటర్: ఎ సైంటిస్ట్ రేస్ టు సేవ్ హర్ హస్బెండ్ ఫ్రమ్ ఎ డెడ్లీ సూపర్‌బగ్” అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించి మరీ ఈ బ్యాక్టీరియా పట్ల అవగాహన కల్పిస్తోంది. తనలా ధైర్యంగా ఉండి తమవాళ్లను ఎలా కాపాడుకోవాలో ఈ పుస్తకం ద్వారా ప్రచారం చేస్తోంది కూడా. కాగా, అయితే యాంటీబయటిక్లను ఈ ఫేజ్‌లు భర్తీ చేయవు కానీ యాంటీబయోటిక్‌లకు లొంగని బ్యాక్టీరియాలకు(సూపర్ బగ్‌లు) ఈ ఫేజ్‌లు మంచి ప్రత్యామ్నాయమైనవి, సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు పరిశోధకులు. నటుడు కృష్ణంరాజు సైతం.. అంతేగాదు 2050 నాటికి ప్రతి మూడు సెకన్లకు ఒకరు చొప్పున ఏడాదికి 10 మిలియన్ల మంది దాక ప్రజలు ఈ సూపర్‌బగ్ ఇన్ఫెక్షన్తో మరణిస్తారని యూస్ లైఫ్ సైన్స్ అంచనా వేసింది. అంతేగాదు దివంగత సినీనటుడు కృష్ణంరాజు మృతికి కారణం పేర్కొంటూ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన నివేదికలో కూడా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ప్రస్తావన ఉండటం గమనార్హం. ఇది ఎక్కువగా సుదీర్ఘ కాలం ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందిన వారికే వస్తున్నట్లు వెల్లడించారు వైద్యులు. దీన్ని నెగిటివ్ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. భారత్‌లో కూడా దీని తాలుకా కేసులు పెరుగుతుండటంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. (చదవండి: 41 ఏళ్ల క్రితం చనిపోతే..ఇప్పుడామె ఎవరనేది గుర్తించి కూతురికి అందజేస్తే..!) -
కుక్కలకు పచ్చిమాంసం తినిపిస్తున్నారా? ఆ ఇన్ఫెక్షన్ మనుషుల్లోనూ..
ఈరోజుల్లో కుక్కల్ని పెంచుకోవడం కామన్ అయిపోయింది. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కుక్కలు బెస్ట్ స్ట్రెస్ బస్టర్‌గానూ ఉంటాయి. అందుకే చాలామంది తమ ఇంట్లో మనిషిలాగే కుక్కలను కూడా ట్రీట్ చేస్తుంటారు. కుటుంబసభ్యులకు చేసినట్లు కుక్కలకు కూడా ఘనంగా బర్త్‌డే పార్టీలు, సీమంతాలు నిర్వహిస్తుంటారు. మరికొందరైతే కుక్కలకి పెట్టకుండా ఏమీ తినరు. అయితే కొన్నిసార్లు అతి ప్రేమతో తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. ఇష్టంగా తింటున్నాయి కదా అని ప్రతిరోజూ వాటికి ఆహారంలో పచ్చి మాంసం పెడుతుంటారు. దీని వల్ల మనుషులకు అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది. కుక్కలకు పచ్చిమాంసం పెట్టడం వల్ల యాంటీ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకు కారణం అవుతుందని తేలింది. యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు వాడతారు. కానీ మితిమీరి యాంటీబయోటిక్స్‌ను వాడితే శరీరం బాక్టీరియాను నిరోధించే శక్తిని క్రమంగా కోల్పోతుంది. అయితే కుక్కులకు పచ్చి మాంసం తినిపించడం వల్ల సిప్రోఫ్లోక్సాసిన్ నిరోధక E. కోలిని విసర్జిస్తుందని తాజాగా యూకేకు చెందిన బ్రిస్టోల్ సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధారణంగా Fluoroquinolones అనే యాంటిబయోటిక్స్‌ను మనుషులకు, పశువైద్యంలోనూ ఉపయోగిస్తారు. కుక్కలకు పచ్చి మాంసం తినిపించం వల్ల బాక్టీరియా ఏర్పడి యాంటీబయాటిక్-రెసిస్టెంట్ E. కోలితో కలుషితమవుతుందని శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్‌లో కనుగొన్నారు. సుమారు 600 ఆరోగ్యకరమైన కుక్కలను పరిశీలించగా వాటి నమూనాల్లో మానుషులు, జంతువుల ప్రేగుల్లో E. coli బాక్టీరియా రకాన్ని గుర్తించారు. ఇది పరిశుభ్రత సరిగా లేని, పచ్చి మాంసం తినడం వల్ల పేరుకుపోయిందని తేలింది. దీనివల్ల యాంటిబయోటిక్స్ నిరోధం తగ్గిపోతుందని, ఫలితంగా బాక్టీరియా ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. పచ్చిమాంసాన్ని కుక్కలకు స్వయంగా తినిపించం వల్ల మనుషుల్లోనూ అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అంతేకాకుండా ఇది ప్రేగుల్లో కొన్ని సంవత్సరాల పాటు పేరుకుపోయి తర్వాత ట్రీట్మెంట్ అందివ్వడానికి సైతం కష్టమవుతుంది. సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో సుమారు 7.3% గ్రామీణ కుక్కలు, 11.8% పట్టణాల్లో కుక్కల మలంలో సిప్రోఫ్లోక్సాసిన్-రెసిస్టెంట్ E. కోలి ఉన్నట్లు గుర్తించారు. వండని మాసం తినిపించడే ఈ బాక్టీరియాకు కారణమని నమూనాల్లో తేలింది. అందుకే కుక్కల నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
బాక్టిరియాతో డ్రెస్సింగ్.. గాయలను త్వరగా తగ్గిస్తుంది!
మన శరీరంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే బ్యాండేజీ వేసుకుంటాం. ఇక గాయం మానడానికి చాలా రోజులే పడుతుంది. ఈ క్రమంలో బాక్టీరియా చేరకుండా వైద్యుల సూచనతో డ్రెస్సింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ కొత్తరకమైన డ్రెస్సింగ్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఏకంగా గాయాన్ని మాయం చేస్తుందట. దీర్ఘకాలిక గాయాలకు చికిత్స చేస్తున్నప్పుడు వాటికి బాక్టీరియా దరిచేరకుండా నిత్యం డ్రెస్సింగ్ చేయడం మనకు తెలిసిందే. అయితే ప్రతిసారి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు పేషెంట్స్‌కి నొప్పి కలగడం సహజమే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్తరకం డ్రెస్సింగ్ గాయాలను త్వరగా మానేలా చేస్తుందట. గాయపడిన ప్రాంతంలో నొప్పి కలిగించే బయోఫిల్మ్‌లను నాశనం చేసేలా MIT, స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్. కున్ రెన్ నేతృత్వంలోని సైంటిస్టులు బయో-కె+ అనే అక్వాసెల్ను కనుగొన్నారు. ఇందులో మూడు రకాల లాక్టోబాసిల్లి ప్రోబయోటిక్ అనే బాక్టిరియా ఉంటుందట. ఇది బయోఫిల్మ్ pH స్థాయిపై దాడిచేసి దానిని నాశనం చేస్తుందట. ఈ కొత్తరకమైన డ్రెస్సింగ్ టెక్నాలజీతో 99.999% వ్యాధికారకాలను చంపేసి గాయం తాలూకూ నొప్పిని తగ్గించిందని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఇందులోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా..గాయాన్ని త్వరగా మానేలా చేయడమే కాకుండా కొత్త చర్మం రావడానికి సహాయపడిందని సైంటిస్టులు తెలిపారు. -
స్మార్ట్‌వాచ్, రిస్ట్ బ్యాండ్లను వినియోగిస్తున్నారా?..ఇదొకసారి చదవండి!
స్మార్ట్‌వాచ్, రిస్ట్‌బ్యాండ్‌ను వినియోగిస్తున్నారా? అయితే, వాటిని రోజులో ఎన్నిసార్లు శుభ్రం చేస్తున్నారు? ఎందుకంటే? మీకెంతో ఇష్టమైన యాపిల్‌వాచ్, ఫిట్‌బిట్ రిస్ట్‌బ్యాండ్‌ల వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. అమెరికాకు చెందిన ఫ్లోరిడా అంట్లాటిక్ యూనివర్సిటీ (ఎఫ్ఏయూ) పరిశోధకులు ప్లాస్టిక్, రబ్బర్, క్లాత్, లెదర్, గోల్డ్ అండ్ సిల్వర్‌తో తయారు చేసిన రిస్ట్ బ్యాండ్,స్మార్ట్‌వాచ్‌ల పై పరిశోధనలు నిర్వహించారు. ఈ రీసెర్చ్‌లో స్మార్ట్‌వాచ్, రిస్ట్ బ్యాండ్లను ధరించడం బ్యాక్టీరియాను ఆహ్వానించడమేనని గుర్తించారు. 95 శాతం వేరబుల్స్ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతయాని అంశాన్ని వెలుగు చూశారు. తద్వారా ఫివర్, డయేరియా, వ్యాధినిరోదక శక్తి తగ్గడం వంటి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ప్రత్యేకించి రిస్ట్‌బ్యాండ్ ధరించడం వల్ల చర్మ సమస్యలకు దారితీసే స్టెఫిలోకాకస్ ఎస్పీపీ అనే బ్యాక్టీరియాతో స్టాఫ్ ఇన్ఫెక్షన్, 60 శాతం ఈ కొల్లీ, 30 శాతం సూడోమోనాస్ ఎస్పీపీ (Pseudomonas spp)లు వంటి బ్యాక్టీరియాలు ఉన్నాయని పరిశోధనల్లో తేటతెల్లమైంది. సురక్షితంగా ఉండాలంటే ప్లాస్టిక్, రబ్బరు రిస్ట్‌బ్యాండ్‌లలో ఎక్కువ బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉందని, మెటల్, బంగారం, వెండితో తయారు చేసిన రిస్ట్ బ్యాండ్లలో వైరస్ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రిస్ట్బ్యాండ్లు వినియోగించే స్థానాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని రీసెర్చర్ న్వాడియుటో ఎసియోబు అన్నారు. జిమ్‌కి వెళ్లే వారు సైతం వాచ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు వారు ధరించే వాచ్‌లను శుభ్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి👉 ‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’ -
కలవరం రేపుతోన్న కళ్లకలక.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే డెంగీ, మలేరియా జ్వరాలు సోకుతుండగా తాజాగా కళ్ల కలక.. కలవరం రేపుతోంది. దీనిని పింక్ ‘ఐ’ అని కూడా అంటున్నారు. సాధారణ బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. జలుబు కారకమైన వైరస్‌తో కూడా కలక వస్తుందని వారు తెలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా మందే ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది. వర్షాకాలం కావడంతో వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్ఫెక్షన్ సోకి కలక వస్తోందని, గాలిలో ఎక్కువగా ఉండే తేమ బ్యాక్టీరియాకు కారణమవుతోందని, ఇది కళ్లను ప్రభావితం చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఎలా వస్తుంది? బ్యాక్టీరియా, కెమికల్స్, వైరస్ ద్వారా వస్తుంది. ఒకరిద్వారా ఒకరికి విస్తరిస్తుంది. లక్షణాలు.. ♦ కన్ను ఎర్రగా మారుతుంది ♦ కంటి నుంచి నీరు కారుతుంది ♦ కంటి రెప్పలు వాపు, ఉబ్బుతాయి. ♦ నిద్రించినప్పుడు కంటి రెప్పలు అంటుకుంటాయి. ♦ కంటి నుంచి పూసి రావడం ♦ కంటి నొప్పి దురద, మంట వస్తుంది. చికిత్స... యాంటీ బయోటిక్ ‘ఐ’ డ్రాప్స్, లుబ్రికాటింగ్ ‘ఐ’ డ్రాప్స్ వేసుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన పరిసరాలలో (ఆఫీస్‌లు, స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రులు, ఇంటిలో) ఎవరికైనా కండ్ల కలక ఉండే వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు (టవల్స్, సబ్బులు ఇతర వస్తువులు) తాకడం, వాడడం చేయొద్దు. తప్పని పరిస్థితుల్లో తాకితే తరచూ చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక వస్తే తప్పని సరిగా కళ్లద్దాలు ఉపయోగించాలి. ♦ కండ్ల కలక చాలా సాధారణ కంటి జబ్బు. అయినా మొదట్లోనే దీనిని నివారించుకోవాలి. పెద్దగా ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. అయినా జాగ్రత్తలు పాటించాలి. ♦ కళ్లను మంచి నీటితో శుభ్రం చేస్తే అరికట్టొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి కంటి వైద్యులను సంప్రదించాలి. జాగ్రత్తలు తీసుకోవడంతో తగ్గింది.. వారం క్రితం చాలా మంది విద్యార్థినులకు కండ్ల కలక వచ్చింది. కంటి వైద్యుల సలహా మేరకు ‘ఐ‘ డ్రాప్స్ వేశాం. పిల్లలను దూరంగా ఉంచాం. దాదాపుగా అందరికీ తగ్గుతోంది. జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కసూ్తర్బా ఆందోళన చెందొద్దు కంటి కలక వచ్చిన వారు ఆందోళన చెందొద్దు. పరిశుభ్రత పాటించాలి. సొంత వైద్యం చేయకుండా కంటి వైద్యులను సంప్రదించాలి. కంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతాపగిరి ప్రసాద్, ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ జాగ్రత్తలు పాటించాలి గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో వాతావరణంలో మురుగు, కాలుష్య కారకాలు పెరిగిపోవడం వల్ల వస్తుంది. ప్రస్తుతం అనేక జిల్లాలలో ప్రజలు కండ్ల కలకతో బాధపడుతున్నారు. కండ్లకలక సమస్యకు మందులు వాడకపోయినా కొందరికి తగ్గుతుంది. అయితే ఇది ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. – డాక్టర్ చీర్ల శ్రీకాంత్, పీహెచ్సీ వెంకటాపురం 100 మందికి పైగా ప్రజలకు కండ్ల కలక .. వెంకటాపురం(ఎం) మండలంలోని 9 సబ్‌సెంటర్ల పరిధిలో సుమారు 100 మందికి పైగా ప్రజలు కండ్ల కలక లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. వైద్య సిబ్బంది కూడా ఎప్పటికపుడు గ్రామాల్లో పర్యటిస్తూ కండ్ల కలక వచ్చిన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా?
కుక్క కరిస్తే ఎంత ప్రమాదమో అని అందరికీ తెలుసు. అందుకే అది కరిచిన వెంటనే ర్యాబిస్ వ్యాధి రాకుండా ఇంజెక్షన్లు తీసుకుంటాం. కొద్ది రోజులు ఆహార నియమాలు పాటిస్తాం. అయితే కుక్క కాటు కంటే మనిషి కరిస్తేనే అత్యంత ప్రమాదకరమట. ఆ వ్యక్తి కోలుకోవడానికే ఆరు నెలల పడుతుందట. ఔను! ఈ విచిత్ర ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే..డోని ఆడమ్స్ ఫిబ్రవరిలో టంపా బేలో ఒక కుటుంబ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ చిన్న గొడవ జరిగింది. దీంతో ఇద్దరు బంధువులు కలబడ్డారు. వారిని విడదీసేందకు మధ్యలో కలగజేసుకున్న ఆడమ్స్‌ని ఒక వ్యక్తి కోపంతో మోకాలిపై కరిచాడు. దీంతో అతను నైక్రోటైజింగ్ షాసిటిస్ వ్యాధి బారినపడ్డాడు. దీనిని సాధారణంగా మాంసం తినే భ్యాక్టీరియా అని పిలుస్తారు. దీని కారణంగా శరీరీం కుళ్లిపోతూ ఇన్ఫెక్షన్కు గురై చనిపోతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా చర్శంలోకి ప్రవేశించి కండరాల తొడుకు ఉండే ఆరోగ్యకరమైన కణజాలాన్ని నాశనం చేస్తుంది. పాపం ఆ ఘటన కారణంగా ఆడమ్స్ ఆస్పత్రికి సందర్శించాల్సి వచ్చింది. అక్కడ వైద్యలు ఈ విషయాన్నే ఆడమ్స్ తెలిపారు. వెంటనే శస్త్ర చికిత్స చేయలని లేదంటే ప్రాణాంతకమని చెప్పారు. కుక్క కాటు కంటే మనిషి కాటు ఎంత ప్రమాదమో వైద్యులు అతనికి వివరించి చెప్పారు. శస్త్ర చికిత్సలో ఆడమ్స్కి 70 శాతం కణజాలాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ శస్త్ర చికిత్స త్వరిత గతిన చేయకపోతే గనుక ఆడమ్స్ కాలుని కోల్పోవలసి ఉండేది. అతను కోలుకోవడానికి మూడు వారాలు పడితే..పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. దీంతో ఆడమ్స్ ఈ భయానక ఘటన నుంచి కోలుకునేలా చేసిన వైద్యులకు రుణపడి ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆడమ్స్. కుక్క కాటు కన్న మనిషిక కాటు ఇంతా భయానకంగా ఉంటుందని తాను అస్సలు అనుకోలేదని వాపోయాడు. అందుక సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్) -
తిని.. పూడుస్తుంది!.. ‘గుడ్’ బ్యాక్టీరియా
సాక్షి, అనంతపురం: సిమెంట్ కాంక్రీట్‌ను పటిష్టంగా ఉంచడానికి మధ్యలో ఇనుప కడ్డీలను వినియోగిస్తారు. ఈ కడ్డీలు కాంక్రీట్‌కు అదనపు బలం చేకూర్చినా.. వాటివల్ల పగుళ్లు ఏర్పడతాయి. కాంక్రీట్ మిశ్రమాన్ని బట్టి కూడా చిన్నపాటి పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇందులోకి నీరు లేదా తేమ చేరి ఇనుప కడ్డీలు తుప్పు పట్టడం, పగుళ్లు పెరిగి పెచ్చులు ఊడిపోవడం వంటివి చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లోని గృహాల్లో ఉప్పునీటి ఆవిరి కారణంగా స్లాబ్‌లలో పగుళ్లు ఏర్పడతాయి. పగుళ్లతో వచ్చే సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వివిధ రకాల విధానాలు అనుసరిస్తున్నారు. గ్రౌటింగ్, ఎఫ్ఆర్సీ ఫిల్లింగ్ విధానాలు ఉన్నా.. వీటివల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే. పైగా ఈ విధానాలు అత్యధిక ఖర్చుతో కూడుకున్నవి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అనంతపురం జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్లు హెచ్.సుదర్శనరావు, వైశాలి జి.గోర్పడే వినూత్న పరిశోధనకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జేఎన్టీయూలో వివిధ విధానాలపై ఆరేళ్లపాటు పరిశోధనలు, ప్రయోగాలు జరిపి అత్యంత చౌకగా.. సుదీర్ఘకాలం మన్నికగా ఉండే ‘బ్యాక్టీరియల్ కాంక్రీట్’ విధానానికి రూపకల్పన చేశారు. వీరి పరిశోధన విజయవంతమై ఇండియన్ పేటెంట్ సైతం లభించింది. మిత్ర బ్యాక్టీరియాలతో సమస్యకు చెక్ పరిశోధనలో భాగంగా ప్రొఫెసర్లు ఎయిరోఫిలియస్, ప్లెక్సెస్, స్టార్టోౖస్పెరికాస్ అనే మూడు రకాల మిత్ర బ్యాక్టీరియాలను ఉపయోగించారు. విభిన్న ప్రాంతాల నుంచి మురికి నీటిని సేకరించి అందులో మట్టి కలిపారు. అందులోనే బ్యాక్టీరియాను అభివృద్ధి చేశారు. తక్కువ కాలంలోనే బ్యాక్టీరియా రెట్టింపు అవుతున్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాలు కాంక్రీట్‌లో ఉండే సీఎ‹Üహెచ్(కాల్షియం సిలికేట్ హైడ్రేట్) జెల్‌ను ఆహారంగా తీసుకుంటూ సుదీర్ఘకాలంపాటు బతికేస్తాయని గుర్తించారు. అక్కడ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కాల్షియం కార్బొనేట్ పగుళ్ల లోలోపలకి చొచ్చుకుంటూ వెళ్లి పగుళ్లను పూడుస్తాయి. కాంక్రీట్‌లో ఉన్న సీఎస్హెచ్ జెల్ తింటూ బ్యాక్టీరియా తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూపోతుంది. కాంక్రీట్‌లో ఉండే ‘సీఎస్హెచ్ జెల్’ పూర్తిగా వినియోగం కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. కాబట్టి బ్యాక్టీరియా లోపల హాయిగా బతికేస్తుంది. మిత్ర బ్యాక్టీరియా కాబట్టి మానవాళికి హానికరం కాదు. రెండు పరిశోధనలు విజయవంతం ► కాంక్రీట్ మిశ్రమాన్ని స్లాబ్‌పై వేసే సమయంలోనే బ్యాక్టీరియాను కలిపారు. భవనం పటిష్టంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని తేటతెల్లమైంది. ► కాగా, భవనాలకు పగుళ్లు వచ్చిన తర్వాత బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి.. అభివృద్ధి చేయడం ద్వారా పగుళ్లను వాటితోనే భర్తీ చేశారు. తద్వారా పగుళ్లు పూడుకుపోవడంతోపాటు భవనం పటిష్టత పెరుగుతూ వచ్చింది. ► ఈ రెండు పరిశోధనలు విజయవంతం కావడంతో ప్రొఫెసర్లు హెచ్.సుదర్శనరావు, వైశాలి జి.గోర్పడే ‘మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాంక్రీట్ విత్ సెల్ఫ్ హీలింగ్ ఎబిలిటీస్ అండ్ ప్రొడక్ట్స్ దేర్ ఆఫ్’ పేరిట సమర్పించిన అంశానికి పేటెంట్ దక్కింది. ఆరేళ్ల పరిశోధనల ఫలితమిది కాంక్రీట్‌లో పగుళ్లు ఏర్పడినా.. భవనం దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా బ్యాక్టీరియల్ కాంక్రీట్ విధానంపై సుదీర్ఘమైన పరిశోధనలు చేశాం. అత్యంత చౌకైన విధానం ఇది. మెరుగైన ఫలితం వస్తుంది. భవనాలు ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాం. ఇందుకు పేటెంట్ దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఆరేళ్లపాటు చేసిన పరిశోధనకు ఫలితం దక్కింది. నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్సిటీ వారు ఈ పరిశోధన వినియోగించడానికి జేఎన్టీయూ(ఏ)తో సంప్రదింపులు జరుపుతున్నారు. – ప్రొ. సుదర్శనరావు, ప్రొ.వైశాలి జి.గోర్పడే, సివిల్ ఇంజనీరింగ్ విభాగం, జేఎన్టీయూ అనంతపురం -
ఐదు బ్యాక్టీరియాలకు.. భారత్‌లో 6.8 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: ఈ.కోలి. ఎస్ నిమోనియా, కె.నిమోనియా, ఎస్.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ‘‘2019లో ప్రపంచం మొత్తమ్మీద సంభవించిన మరణాలకు గుండె సంబంధిత వ్యాధుల తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే రెండో అతి పెద్ద కారణంగా నిలిచాయి. ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వీటి ఫలితమే. 33 రకాల సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు 77 లక్షల మరణాలకు కారణమయ్యాయి. వీటిలోనూ కేవలం ఐదు బ్యాక్టీరియాల వల్ల సగానికి పైగా మరణాలు సంభవించాయి’’ అని అధ్యయనం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా బ్యాక్టీరియాలను అదుపు చేయడం తక్షణావసరమని హెచ్చరించింది. ‘‘పటిష్టమైన ఆరోగ్య, వ్యాధి నిర్ధారణ వ్యవస్థల నిర్మాణం, మెరుగైన అదుపు చర్యలు, యాంటీబయాటిక్‌ల వాడకాన్ని గరిష్ట స్థాయికి పెంచడం వంటి చర్యలు చేపట్టాలి’’ అని వాషింగ్టన్ వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ డైరెక్టర్, అధ్యయన కర్త క్రిస్టోఫర్ ముర్రే సూచించారు. చాలా ఇన్ఫెక్షన్లు తదితరాలకు మనకిప్పటిదాకా కారణాలు తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పలు గణాంకాలతో పాటు 3.43 కోట్ల మంది వైద్య రికార్డులను పరిశీలించారు. ‘‘2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 1.37 కోట్ల ఇన్ఫెక్షన్ సంబంధిత మరణాల్లో సగానికి పైగా బ్యాక్టీరియానే కారణం. 77 లక్షల బ్యాక్టీరియా సంబంధిత మరణాల్లో మూడొంతులకు పైగా శ్వాస, రక్త, ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లే. బ్యాక్టీరియాల్లో ఒక్క ఎస్.ఏరియస్ రకమే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 1.1 కోట్ల మరణాలకు కారణమైంది. వయసుపరంగా కూడా 15 ఏళ్ల పై బడ్డ వారిలో అత్యధికంగా 9.4 లక్షల మందిని ఇది బలి తీసుకుంది’’ అని పరిశోధకులు తేల్చారు. సహారా ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 230 మంది బ్యాక్టీరియాకు బలైనట్టు వివరించారు. అదే పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి సంపన్న ప్రాంతాల్లో ఈ సంఖ్య అత్యల్పంగా ప్రతి లక్ష మందికి 52గా ఉందని చెప్పారు. ఇదీ చదవండి: Bruce Lee Death Reason: ఓవర్‌గా వాటర్ తాగితే.. బ్రూస్లీలా మరణం ఖాయమంటున్న పరిశోధకులు! -
వంట పాత్రల్ని శుభ్రం చేసి..ఆరబెట్టే క్రాకరీ శానిటైజర్!
పింగాణి, గాజు వస్తువులను శుభ్రం చేయడం, భద్రపరచడం చాలా జాగ్రత్తతో చేయాల్సిన పని. పూర్తిగా తడి ఆరని ఈ వస్తువులపై సూక్ష్మజీవులు చేరే అవకాశాలూ ఎక్కువే! ఇలాంటి సున్నితమైన పింగాణి, గాజు వస్తువులను చక్కగా శుభ్రంచేసి, వాటిని పొడిగా ఆరబెట్టేందుకు జపానీస్ సంస్థ ‘యొకాయి’ ఈ క్రాకరీ శానిటైజర్‌ను రూపొందించింది. డిష్వాషర్లు పాత్రలను శుభ్రం చేసే మాదిరిగానే, ఇది పింగాణి, గాజు పాత్రలను, వస్తువులను శుభ్రం చేస్తుంది. అవి శుభ్రమయ్యాక 60 డిగ్రీల ఉష్ణోగ్రత విడుదల చేసి, వాటిపై సూక్ష్మజీవులను నాశనం చేసి, పొడిగా ఆరబెడుతుంది. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. దీని పనితీరుపై పరీక్షలు కొనసాగిస్తున్నారు. -
ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? బ్యాక్టీరియా ఎలా పోతుంది?
కొందరు చూడటానికి ఎంతో శుభ్రంగా ఉంటారు. ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. అయితే పరిసరాల పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోరు. ఇల్లు మురికిగా ఉండి, వ్యక్తి మాత్రం శుభ్రంగా ఉన్నా; ఇల్లు, ఇంట్లోని మనుషులు మాత్రమే పరిశుభ్రంగా ఉండి పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. అనారోగ్యం, అంటువ్యాధులు పొంచే ఉంటాయి. ఇంతకీ పరిసరాల పరిశుభ్రత అంటే ఏమిటో, పరిసరాలను ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చూద్దాం. పరిసరాల పరిశుభ్రత అంటే ఇంటికి చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ చెత్తాచెదారం, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవడమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మురికిగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయడం కంటే.. హానికారక సూక్ష్మజీవులను నిరోధించడంపై దృష్టిపెట్టడం చాలా మేలని పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం . సరైన సమయానికి చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఫ్లోర్‌ని తుడవటం ఆరోగ్యవంతమైన వాతావరణానికి కీలకం. అయితే, ప్రతి నలుగురిలో ఒకరు మాత్రం వీటికి ప్రాధాన్యం లేదని భావిస్తున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. . మురికి, క్రిములు, శుభ్రత, ఆరోగ్యవంతంగా ఉండడానికి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. ఒక సర్వే మేరకు 23 శాతం మంది.. హానికారక సూక్ష్మ క్రిముల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారని తేలింది. అయితే, వారి నమ్మకంలో ఏమాత్రం నిజం లేదు. హానికారక సూక్ష్మక్రిములుండే పరిసరాలలో మెసలడం వల్ల్ల పిల్లలు ప్రమాదకరమైన అంటురోగాల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. దానికి బదులు, ఆయా ప్రదేశాలను శుభ్రం చేయడంపై దృష్టి పెట్టాలని, అవి శుభ్రంగా కనిపించినప్పటికీ తగిన శ్రద్ధ పెట్టి ఎలాంటి క్రిములూ లేకుండా చూడాలని, అప్పుడే హానికారక సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శుభ్రత అంటే మురికి లేకుండా చేయడం. ఆరోగ్యవంతంగా పరిసరాలను ఉంచుకోవడం అంటే మురికితోపాటు రోగకారక క్రిములను అరికట్టడం. తద్వారా అంటువ్యాధులు సోకకుండా చూసుకోవడం. ముఖ్యంగా ఆహారాన్ని తయారు చేసేప్పుడు, మరుగుదొడ్డి వాడేప్పుడు, పెంపుడు జంతువులతో గడిపేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ఆరుబయట స్నేహితులు, కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులతో గడపడం, ఆడుకోవడంతో ‘మంచి బ్యాక్టీరియా’ను పొందవచ్చు. ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల్ని పెంపొందించుకోవచ్చు. కానీ, అదే సమయంలో ప్రజలు చెడు బ్యాక్టీరియా బారిన పడకుండా చూసుకోవడం కూడా అంతే కీలకం. ‘‘పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల్ని నియంత్రించవచ్చు. ఇది చాలా సులభమైన, చౌక అయిన వ్యవహారం. ఇంట్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడం ద్వారా అంటురోగాలను తగ్గించొచ్చు. తద్వారా పిల్లల్ని రక్షించుకోవడంతో పాటు, ఆసుపత్రులపై ఒత్తిడిని కూడా తగ్గించవచ్చు’’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటిని మాత్రమే కాదు, ఇంటి పరిసరాలలో ఎక్కడైనా మురికిగుంటలు, చెత్తకుప్పలు, అపరిశుభ్ర వాతావరణం ఉంటే దానిపై దృష్టి పెట్టాలి. శ్రమ అనో, ఖర్చనో అనుకోకుండా చెత్తను క్లీన్ చేయాలి లేదా చేయించాలి. కొంతమంది తమ ఇంటిలోని చెత్తనంతటినీ తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పడేస్తుంటారు. క్రమేణా అవి చెత్తకు, ఆ తర్వాత అపరిశుభ్రతకు, అంటువ్యాధులకు ఆనవాళ్లుగా మారతాయి. అందువల్ల సంబంధిత శాఖ వాళ్లకు చెప్పి ఆ చెత్తను క్లీన్ చేయించాలి. అలాగే మురికిగుంటలపై కూడా దృష్టి సారించాలి. బ్లీచింగ్ పౌడర్ వేయాలి. పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. చెత్తను, తడిచెత్త, పొడిచెత్తగా వేరు చేసి పడెయ్యడం, గాజుపెంకులు, ప్లాస్టిక్, పాలిథిన్ కవర్ల వంటి వాటిని విడిగానూ పడెయ్యాలి. ఇలాంటి వాటన్నింటినీ బాధ్యతగా చేసినప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సూక్ష్మక్రిములు, తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? ►ఆహారాన్ని తయారు చేసే వంట శాలలు, వడ్డించే ఆహార శాలలు ప్రాంతాలు (డైనింగ్ హాల్స్) ►మరుగుదొడ్లు, వాటిని వాడిన తర్వాత చేతులు, ఇల్లు, వంటగదిలో ఉండే మురికి బట్టలు, మసిగుడ్డలు. ►పెంపుడు జంతువులతో ఉన్నప్పుడు. ►ఎవరైనా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కును చీదేటప్పుడు. ►చెత్త, వ్యర్థాలను చేత్తో తాకినప్పుడు, పారేసేటప్పుడు. ►అంటువ్యాధి సోకిన వారికి సపర్యలు చేసేప్పుడు శుభ్రత పాటించడం అత్యవసరం. ►మాంసం వంటి వంటకాలు చేసినప్పుడు వంటగదిలోని నేలను, దిమ్మల్ని, మాంసం కోసిన చెక్క/బోర్డుల్ని శుభ్రం చేయడం చాలా కీలకం. ►అలాగే, శాండ్విచ్లు, చిరుతిళ్లు తయారు చేసేముందు కూడా ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. ►కలుషితమైన ప్రదేశాన్ని, పాత్రల్ని శుభ్రం చేశాక ఆయా గుడ్డలు, స్క్రబ్‌లను, బ్రష్‌లను కడగాలి. ఎందుకంటే ఇంట్లో నేలపైన, కుర్చీలు, బల్లల వంటి ఫర్నీచర్పైన పేరుకుపోయిన దుమ్ములో ఉండే క్రిములతో పోల్చితే ఇవి చాలా వరకు ఆరోగ్యానికి ఎక్కువ హాని చేకూర్చేవి కాబట్టి. బ్యాక్టీరియా ఎలా పోతుంది? ►ఇంట్లో నేలను కానీ, పాత్రల్ని కానీ వేడిగా ఉన్న సబ్బు నీటితో కడగడం ద్వారా బ్యాక్టీరియాను తొలగించవచ్చు. ఆ బ్యాక్టీరియా నీటితో పాటు కొట్టుకుపోతుంది. అయితే బ్యాక్టీరియాను పూర్తిగా చంపాలంటే మాత్రం నీటిని 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొద్దిసేపు మరిగించాలని ఆహార ప్రమాణాల సంస్థ చెబుతోంది. ►ఆహారాన్ని తయారు చేసిన తర్వాత నేలను, రాతి దిమ్మెలను శుభ్రం చేయడానికి గుడ్డకు బదులు పేపర్ టవల్స్ వాడి చూడండి. ఇలా చేయడం వల్ల వంటగదిలో ఉపయోగించే గుడ్డలు అపరిశుభ్రం కాకుండా, కలుషితం కాకుండా ఉంటాయి. -
కంటికి కనిపించే... జంబో బ్యాక్టీరియా
బ్యాక్టీరియా. సూక్ష్మజీవి. కంటికి కనిపించదు. శక్తిమంతమైన మైక్రోస్కోప్‌కు మాత్రమే చిక్కుతుంది. దాని పరిమాణానికి ఏ ఐదారు వేల రెట్లో పెద్దగా ఉంటే తప్ప చూడలేం. అలాంటి ఏక కణ సూక్ష్మజీవి కంటికి కనిపిస్తే? గమ్మత్తుగా ఉంటుంది కదా! సరిగ్గా అలాంటి కంటికి కనిపించే జంబో బ్యాక్టీరియా ఒకటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాని పేరు థియోమార్గరిటా మ్యాగ్నిఫికా. తెల్లగా సేమ్యా పోగులా కన్పించే ఇది ఏకంగా ఓ సెంటీమీటర్ సైజులో ఉంటుందట. కరీబియన్ దీవుల్లో ఉన్న లెసర్ ఆంటిలిస్లోని మడ తడి అడవుల్లో నీటి అడుగున ఇది కనిపించింది. సల్ఫర్ (గంధకం) కణాలతో స్వచ్ఛమైన ధవళ వర్ణంలో ఉండే ఈ బ్యాక్టీరియా కాంతిని వెదజల్లుతూ ముత్యంలా మెరుస్తూ ఉంటుంది. ఒకవిధంగా బ్యాక్టీరియాల్లో ఇది డైనోసార్ టైపన్నమాట. బ్యాక్టీరియా అంటే అతి సూక్ష్మజీవి అనే వాదనను ఇప్పుడిది పటాపంచలు చేసింది. కొత్త పరిశోధనల దిశగా శాస్త్రవేత్తలు చూపు సారించేట్టు చేసింది. మొక్కల్ని పోలిన జీవక్రియ కాలిఫోర్నియాలోని లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబొరేటరీకి చెందిన సముద్రజీవ శాస్త్రవేత్త జీన్ మేరి వోలాండ్ మరికొంత ముందుకు వెళ్లి శక్తిమంతమైన మైక్రోస్కోప్ ద్వారా ఎక్స్‌రే టొమోగ్రపీ పద్ధతి ద్వారా ఈ బ్యాక్టీరియా పొడవును కచ్చితంగా నిర్ధారించారు. ఇది దాదాపు ఒక సెంటీమీటర్ (9.66 మిల్లీమీటర్ల) పొడవున్నట్టు గుర్తించారు. మ్యాగ్నిఫికా సైజును సాధారణ బ్యాక్టీరియాతో ఆయన పోల్చిన తీరు చూస్తే అది ఎంత పెద్దదో అర్థమవుతుంది. మామూలు బ్యాక్టీరియాకూ దీనికీ హిమాలయాలంత ఎత్తున్న మనిషికి, మామూలు మనిషికి ఉన్నంత తేడా ఉందంటారు వోలాండ్! దీని జీవక్రియ మొక్కల జీవక్రియను పోలి ఉంటుంది. జడ సమ్మేళనాల నుంచి కార్పోహైడ్రేట్ల నిర్మాణం ద్వారా మ్యాగ్నిఫికా జీవక్రియ సాగుతుందని వోలాండ్ విశ్లేషించారు. తనలోని గంధకాన్ని మండించడం ద్వారా శక్తిని పొందుతుందని వివరించారు. ఈ బ్యాక్టీరియాను చాలా విశిష్టమైనదిగా గుర్తించి ఆశ్చర్యపోవడం తమ వంతయిందంటారు ఆంటిలిస్ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులార్ బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ సిల్వినా గొంజాలెస్ రిజ్జో. ‘‘మ్యాగ్నస్ అంటే లాటిన్లో భారీ అని అర్థం. అందుకే దీనికి మ్యాగ్నిఫికా అని పేరు పెట్టాం. పైగా అందమైన ఫ్రెంచ్ పదం ‘మ్యాగ్నిఫిక్’కు కూడా ఈ పేరు దగ్గరగా ఉంటుంది’’ అన్నారాయన. దీనికంటే ముందు వరకూ అతి పెద్ద బ్యాక్టీరియా అన్న రికార్డు ‘థియోమార్గరిటా నమీబియెన్సిస్’ పేరిట ఉండేది. దాన్ని నమీబియా దగ్గర్లోని సముద్ర జలాల్లో గుర్తించారు. దాని పొడవు 0.75 మిల్లీమీటర్లని రిజ్జో చెప్పారు. బ్యాక్టీరియాల్లోకెల్లా ఈ బ్యాక్టీరియా వేరయా అన్నట్టు మ్యాగ్నిఫికా ఎందుకంత జంబో సైజులో ఉందో శాస్త్రవేత్తలు ఇతమిద్ధంగా చెప్పలేకపోతున్నారు. బహుశా భారీ బ్యాక్టీరియాల ఉనికికి ఇదో సూచన కావచ్చని వారంటున్నారు. ఇంతకన్నా పెద్ద బ్యాక్టీరియాలు కూడా ఎక్కడో ఉండే ఉంటాయని కూడా వాదిస్తున్నారు. ప్రయోగశాలలో మ్యాగ్నిఫికాను పునరుత్పత్తి చేస్తే మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయని వాషింగ్టన్ యూనివర్సిటీ (సెయింట్ లూయీ)కి చెందిన శాస్త్రవేత్త పెటా ఆన్నె లెవిన్ భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ బ్యాక్టీరియా అంటే... ►ఇది కేంద్రకం ఉండని ఏక కణ సూక్ష్మజీవి ►భూమిపై సర్వత్రా వ్యాపించి ఉంటుంది. పర్యావరణ వ్యవస్థలో దీనిది కీలక పాత్ర. ►కొన్నిరకాల బ్యాక్టీరియా అత్యల్ప, అత్యుగ్ర ఉష్ణోగ్రతలు, పీడనాల వద్ద కూడా మనగలుగుతుంది. ►ఒకరకంగా మానవ శరీరం పూర్తిగా బ్యాక్టీరియామయమే అని చెప్పాలి. అసలు మన ఒంట్లో మానవ జీవ కణాల కంటే కూడా బ్యాక్టీరియా కణాల సంఖ్యే ఎక్కువంటే అతిశయోక్తి కాదు! ►అయితే మన ఒంట్లో ఉండే బ్యాక్టీరియాలో చాలావరకు అపాయరహితమైనవి, ►మనకు ఉపయుక్తమైనవే. చాలా తక్కువ బ్యాక్టీరియా జాతులు మాత్రమే రోగ కారకాలు. 2009లోనే గుర్తించినా... నిజానికి ఈ జీవిని 2009లోనే గుర్తించారు. ఫ్రెంచ్ ఆంటిలెస్ యూనివర్సిటీకి చెందిన ఒలివర్ గ్రాస్ అప్పట్లో దీన్ని గుర్తించారు. కానీ దీన్ని ఫంగస్‌గా పొరబడ్డారు. నిజానికది జంబో బ్యాక్టీరియా అని మరో ఐదేళ్ల పరిశోధన తర్వాత గాని ఆయన గుర్తించలేకపోయారు. ‘‘మొదట్లో ఏదో గమ్మత్తయిన జీవి అనుకున్నాను. తెల్లటి ఫిలమెంట్లా ఉన్న ఈ జీవి అబ్బురంగా తోచింది’’ అని గ్రాస్ తన అనుభవాన్ని ఓ జర్నల్‌లో పంచుకున్నారు. ఈ పరిశోధన ఫలితాన్ని ఓ మామూలు జర్నల్‌లో ప్రచురించినప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు నమ్మలేదు. కానీ ఈ పరిశోధనా క్రమాన్ని, ఫలితాన్ని తాజాగా సైన్స్ జర్నల్‌లో ప్రచురించడంతో అందరికీ నమ్మకం కుదిరింది. -
వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. వాటిల్లోనూ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది.. మనకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. అలాంటి వాటిని సరైన సమయంలో మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పళ్లను శుభ్రం చేసుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేందుకు వినియోగించే తలదిండు వరకు ఎలా ఉపయోగించాలి.. ఎప్పుడు మార్చాలి అనే విషయాలు తెలుసుకుందాం. చదవండి: నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి? మంచినీటి సీసా ఇంట్లో వినియోగించే మంచి నీళ్ల సీసాలు, వాటర్ క్యాన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగంలో నాచు పట్టే వీలుంటుంది. మంచినీటి సీసాలను మాత్రం మూడు, నాలుగు నెలలకోసారి మార్చాలి. వీటితో పాటు మార్కెట్లో అప్పటికప్పుడు తాగేందుకు కొనుగోలు చేసే నీటి సీసాలను తిరిగి ఇంట్లో వాడడం హానికరం. పొపుల పెట్టె వంటింట్లో పప్పు దినుసులు వేసే డబ్బాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఓ సారి వేసిన సరకు అయిపోగానే..డబ్బాలను మళ్లీ శుభ్రం చేసుకుని కొత్త సరకు వేసుకోవాలి. అంతేగాని నీటితో శుభ్రం చేయకుండా అలా ఏడాది పొడవునా సరకులు వేస్తూ ఉండకూడదు. అలా వేస్తే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు సరకుల్లో చేరే వీలుంటుంది. వీలైతే ఏడాదికోసారి డబ్బాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంట్లోని కుండీల్లో పెంచుకునే మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుండీల్లో చెత్త వేయకూడదు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు వృద్ధి చెందే వీలుంటుంది. సాక్స్‌లు, దువ్వెన కాళ్లకు ధరించే సాక్స్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాలపరిమితి ముగిసిన వెంటనే పాతవాటిని మార్చి..కొత్తవి ఉపయోగించాలి. ఇంట్లో పాడైన చెప్పులు, బూట్లను బయట పారేయాలి. లేకపోతే క్రిములు వృద్ధి చెందే వీలుంటుంది. నిత్యం తల దువ్వేందుకు వినియోగించే దువ్వెన విషయంలోనూ శుభ్రత పాటించాలి. పాడైన, పళ్లు సరిగా లేని దువ్వెనను వినియోగించకూడదు. టూత్‌బ్రష్ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వినియోగించే టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా ప్రతి మూడు నుంచి నాలుగు నెలల్లోపు మార్చాలి. బ్రష్ పాడవకపోయినా.. దానిని ఎక్కువ కాలం వినియోగిస్తే..పళ్లకు ఇబ్బంది కలగొచ్చు. చిన్న పిల్లల బ్రష్‌ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బ్రష్‌పై ఉండే కుచ్చు పాడైన వెంటనే కాలంతో సంబంధం లేకుండా మార్చేయాలి. పాడైన బ్రష్‌లతో కొందరు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేస్తుంటారు. అలాంటి వాటిల్లోనూ క్రిములు చేరే వీలుంటుంది. అందుకే వినియోగంలో లేని వాటిని బయట పాడేయాలి. తలదిండులు చాలా మంది ఇంట్లో మంచాలపై ఉండే దుప్పట్లు, దిండుకవర్లను మాత్రమే సకాలంలో శుభ్రం చేస్తూ.. అప్పుడప్పుడు కొత్తవి మార్చుతుంటారు. కానీ దిండ్లను మార్చరు. నిత్యం వినియోగించే దిండ్లపై సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. అవి మన తలలోకి చేరడంతో దురద, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే కొంతకాలం వాడిన తర్వాత వాటిని మార్చుకోవాలి. లోదుస్తులు మనం ధరించే లోదుస్తులను క్రమం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాతే ధరించాలి. వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో కనీసం ఇస్త్రీ అయినా చేసి ధరించాలి. అప్పుడే వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. లోదుస్తుల్లో క్రిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటితో మనకు తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు సోకే వీలుంటుంది. పాడవకపోయినా.. లోదుస్తులను కూడా ఏడాదికోసారి మార్చేయడం మంచిది. -
Health Tips: గర్భవతులకు నోటి పరిశుభ్రత అత్యవసరం... ఎందుకంటే...
Importance Of Oral Health During Pregnancy: గర్భవతి తన నోటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం ఎంతో అవసరం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. గర్భవతుల్లో సాధారణంగా ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్’ అనే చిగుర్ల వ్యాధి వస్తుంటుంది. ఇది గర్భధారణ జరిగిన రెండో నెలలో కనిపిస్తుంటుంది. ఒకవేళ ఆ మహిళకు ముందే చిగుర్ల సమస్య ఉంటే అది గర్భధారణ తర్వాత మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి సమయాల్లో నోటి శుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే చిగుర్లలో వాపురావడం లేదా నోటిలో కణుతులు, నాన్ ఇన్ఫ్లమేటరీ, నాన్ క్యాన్సరస్ వంటి గడ్డలు పెరగవచ్చు. అంతేకాదు... గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే నిర్ణీత వ్యవధి కంటే చాలా ముందుగానే ప్రసవం కావడం (నెల తక్కువ బిడ్డలు పుట్టడం), చాలా తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి సమస్యలు రావచ్చు. నోటిశుభ్రత పరంగా దీనికి కారణాలూ ఉన్నాయి. నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా రక్త ప్రవాహంతో పాటు కలిసిపోయి గర్భసంచి (యుటెరస్)కి చేరి, ప్రోస్టాగ్లాండిన్ వంటి రసాయనాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అదే గర్భధారణ వ్యవధికి ముందే ప్రసవానికి (ప్రీ–మెచ్యుర్ లేబర్‌కు) దారితీసే అవకాశం ఉంది. అందుకే గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను (ఓరల్ హైజీన్‌ను) ఎంత బాగా పాటిస్తే... కాబోయే తల్లికే కాదు... పుట్టబోయే బిడ్డకూ మేలు చేస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవలి కొన్ని పరిశోధన ఫలితాలూ వెల్లడిస్తున్నాయి. చదవండి: Tamarind Leaves: చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. -
కరెంట్ కొరతకు కొత్త జవాబు
నా ఉచ్ఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం.. అన్నాడో కవి. నా ఉచ్ఛ్వాసం మీథేన్.. నా నిశ్వాసం విద్యుత్.. అంటున్నాయి ఒక రకం బ్యాక్టీరియాలు. మానవాళిని వేధిస్తున్న పర్యావరణ కాలుష్యం, ఇంధన కొరతకు అవి సమాధానం చెబుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.. జనాభా పెరిగిపోయే కొద్దీ శిలాజ ఇంధనాల వాడకం పెరిగి వాతావరణ కాలుష్యం హద్దులు దాటుతోంది. అలాగని ఇంధన వాడకాన్ని పరిమితం చేయదలిస్తే మానవ అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత ఇంధనాల కోసం మనిషి అన్వేషణ చాలా రోజులుగా జరుగుతోంది. వాయు, సౌర విద్యుత్‌లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం జరుగుతున్నా అది శిలాజ ఇంథనాలను పరిమితం చేసే స్థాయిలో జరగడంలేదు. వీటికయ్యే ఖర్చు, సాంకేతిక సమస్యలు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని విరివిగా వాడేందుకు అడ్డంకిగా మారుతున్నాయి. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికిందంటున్నారు శాస్త్రవేత్తలు. వాయు కాలుష్యకాల్లో కీలకమైన మీథేన్‌ను వాడుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను కనుగొన్నామని నెదర్లాండ్స్ పరిశోధకులు చెప్పారు. మీథేన్‌ను ఇంధనంగా వాడుకోవడం చాలా రోజులుగా జరుగుతున్నదే. బయోగ్యాస్ ప్లాంట్లలో వ్యర్థాలను సూక్ష్మ జీవులు మీథేన్‌గా మారుస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన మీథేన్‌ను మండించి టర్బైన్లు తిరిగేందుకు వాడతారు. దీంతో విద్యుదుత్పాదన జరుగుతుంది. అయితే ఉత్పత్తి అయిన బయోగ్యాస్‌లో సగానికన్నా తక్కువే విద్యుదుత్పాదనకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో తమ ప్రయోగం ప్రత్యామ్నాయ ఇంధనోత్పత్తిలో ముందడుగు అని రాడ్బౌడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కార్నెలియా వెల్టె చెప్పారు. ప్రయోగ ఫలితాలను ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. ఇలా చేశారు పరిశోధనలో భాగంగా కాండిడేటస్ మిథేనోపెరెండెన్స్ అనే బ్యాక్టీరియాకున్న ప్రత్యేక టాలెంట్‌ను గుర్తించామని వెల్టె చెప్పారు. ఈ సూక్ష్మజీవులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతుకుతుంటాయి. ఇవి మీథేన్‌ను ఆక్సిజన్ అవసరం లేకుండానే విడగొట్టి శక్తిని ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. ఏఎన్‌ఎంఈ (అనరోబిక్ మీథనోట్రోపిక్) ఆర్కియాగా పిలిచే ఈ జీవులు కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా తమ సమీపంలోని పదార్ధాల నుంచి ఎలక్ట్రానులను విడగొడతాయి. కరెంటంటేనే ఎలక్ట్రానుల ప్రవాహం. అంటే ఇవి తమ దగ్గరలోని పదార్ధాలను ఆక్సిడైజ్ చేసి కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ఇందుకు కొద్దిగా నైట్రేట్ల సాయం తీసుకుంటాయి. ప్రయోగంలో భాగంగా ఈ సూక్ష్మజీవులను ఆక్సిజన్ రహిత ట్యాంకులో మీథేన్‌తో కలిపి ఉంచారు. దగ్గరలో ఒక మెటల్ ఆనోడ్‌ను జీరో ఓల్టేజ్ వద్ద సెట్ చేసి పెట్టారు. దీంతో ఈ మొత్తం సెటప్ ఒక బ్యాటరీలా మారిందని, ఇందులో ఒకటి బయో టెర్మినల్ కాగా ఇంకోటి కెమికల్ టెర్మినల్ అని వెల్టె తెలిపారు. సదరు బ్యాక్టీరియా తమ దగ్గరలోని మీథేన్‌నుంచి ఎలక్ట్రానులను విడగొట్టి కార్బన్ డైఆక్సైడ్‌గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో దాదాపు చదరపు సెంటీమీటర్‌కు 274 మిల్లీ యాంప్‌ల కరెంటు ఉత్పత్తి అయింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఆధారంగా భారీ స్థాయిలో బ్యాక్టీరియా బ్యాటరీలను నిర్మించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ► ప్రపంచ జనాభాలో 94 కోట్ల మంది (13 శాతం)కి ఇంకా విద్యుత్ సౌకర్యం లేదు. ► భూతాపాన్ని పెంచే గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్ కీలకమైనది. మొత్తం గ్రీన్‌హస్ వాయువుల్లో దీని వాటా 20 శాతం. ► కార్బన్ డై ఆక్సైడ్తో పోలిస్తే మీథేన్ భూమిపై సూర్యతాపాన్ని 25 శాతం వరకు పట్టి ఉంచుతుంది. ► పశువ్యర్థాలు, బొగ్గు గనుల నుంచి ఎక్కువగా మీథేన్ విడుదలవుతుంది. ► భారీస్థాయిలో శిలాజ ఇంధనాల వాడకం తగ్గితే భూతాపం గణనీయంగా అదుపులోకి వస్తుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
జాతీయ మహమ్మారి ‘బ్రూసెల్లోసిస్’: పశువులతో పాటు మనుషులకూ ప్రమాదమే
సాక్షి, పాలకొల్లు అర్బన్: బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. బ్రూసిల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి పశువులకు సోకుతుంది. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా సోకే అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా. దీనిని బ్యాంగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది అంటువ్యాధి. బ్రూసెల్లా సూక్ష్మజీవులు పశువుల జననేంద్రియాలను, పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. ఈ వ్యాధి సోకితే చూడి పశువుల్లో గర్భస్రావాలు జరుగుతాయి. ఈ వ్యాధి సోకడం వల్ల కోడెలు, దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. జాతీయ ప్రాజెక్టుగా వ్యాధి నివారణ... ఈ వ్యాధి పశువులకు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ దీని నివారణకు వ్యాక్సిన్ ఇటీవలే కనుగొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాధి నివారణను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దశల వారీగా దేశంలోని నాలుగు నెలల వయస్సు దాటి ఎనిమిది నెలల లోపు ఉన్న పెయ్య దూడలన్నింటికీ ఈ వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఏడాదిలో మూడు సార్లు ఈ వ్యాక్సిన్ ఒక్కొక్క మోతాదు చొప్పున పశువులకు అందించాలని కార్యాచరణ రూపొందించాయి. ఈ వ్యాక్సిన్ ఒకసారి పశువులకు చేస్తే జీవిత కాలంలో బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 29,159 పశువులకు ఈ వ్యాక్సిన్ అందించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ పశువులకు వేసేటప్పుడు రక్షణ పరికరాలు వినియోగించాలి. లేనిపక్షంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ వ్యాక్సిన్ చుక్కలు మనిషి శరీరంపై పడితే బోద మాదిరిగా వాపులు వస్తాయని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలకొల్లు మండలం గోరింటాడలో ఆవుదూడకి బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బంది వ్యాధి వ్యాప్తి ఇలా.. వ్యాధిగ్రస్తమైన పశువుల్లో గర్భస్రావం జరిగినప్పుడు పిండం ద్వారా గర్భకోశ స్రవాల ద్వారా సూక్ష్మజీవులు బయటకు వచ్చి పశువులు మేసే మేతను, నీటిని ఆశించి కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని ఇతర పశువులు తీసుకోవడం ద్వారా వాటికి వ్యాధి సోకుతుంది. గర్భస్రావం జరిగిన పశువులు చెరువుల్లో, నీటి కుంటల్లో పొర్లినప్పుడు గర్భకోశ స్రవాలు బయటకు వచ్చి నీటిని కలుషితం చేయడం ద్వారా సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన కోడెలు, దున్నలు ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు చూడి పశువుల్లో గర్భస్రావాలు సాధారణంగా చూడి ఆఖరి దశలో సంభవించడం వ్యాధి ప్రధాన లక్షణం. చూడి మోపగానే సూక్ష్మజీవుల మాయను గర్భకోశాన్ని ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. కాటిలెడెన్సు కుళ్లిపోవడం వల్ల పిండం మరణించి గర్భస్రావం అవుతుంది. గర్భస్రావాలు ఈ విధంగా రెండు, మూడు ఈతల్లో సంభవిస్తాయి. మనుషులకు వ్యాప్తి ఇలా.. బ్రూసెల్లోసిస్ సూక్ష్మజీవులు మనిషి కంటి పొరల ద్వారా లేదా ఈ వ్యాధి సోకిన పశువుల పాలు, వెన్న, మాంసం ఆహారంగా భుజించడం వల్ల వ్యాప్తి చెందుతుంది. పురుషులకు ఈ వ్యాధి సోకితే వృషణాలు వాపు చెందుతాయి. వీర్యం సక్రమంగా విడుదల కాక సంతానోత్పత్తి జరగదు. పురుషులకు నపుంసకత్వం వచ్చే ప్రమాదం ఉంది. మహిళలకు అబార్షన్ జరుగుతుంది. పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు అవగాహన పెంచుకోవాలి బ్రూసెల్లోసిస్ వ్యాధి చాలా కాలం నుంచి పశువులకు సోకుతోంది. ఈ ఏడాది జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మొదటి దశలో కొన్ని పశువులను గుర్తించి వ్యాక్సిన్ అందించాం. ఈ వ్యాధిపై రైతులు అవగాహన పెంచుకోవాలి. వ్యాక్సిన్ వేసే సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ కె.మురళీకృష్ణ, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి, భీమవరం -
నిశ్శబ్ద మహమ్మారి
కోవిడ్ మహమ్మారి సృష్టించే కల్లోలం మనందరికీ తెలుసు కానీ, చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ‘నిశ్శబ్ద మహమ్మారి’ గురించి తెలిసింది చాలా కొద్ది మందికి మాత్రమే. ఏటా 70 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ మహమ్మారి పేరు ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’. బాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు వంటి వివిధ వ్యాధికారక సూక్ష్మక్రిములను సంహరించే బ్రహ్మాస్త్రాల వంటివి యాంటీమైక్రోబియల్ ఔషధాలు. యాంటీబయోటిక్స్ వంటి అతిముఖ్యమైన ఈ ఔషధాలను తొలుత కనుగొని 80 ఏళ్లు దాటింది. సాంక్రమిక వ్యాధుల నుంచి, తీవ్ర ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని, జంతువులను, మొక్కలను కాపాడటంలో ఈ ఔషధాలు అద్భుత పాత్రను పోషిస్తున్నాయి. ముఖ్యంగా శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, కేన్సర్ చికిత్సలను ఇవి కీలక మలుపు తిప్పాయి. అయితే, కాలక్రమంలో ఈ ఔషధాలకు కూడా కొన్ని సూక్ష్మక్రిములు లొంగకుండా మొండికేస్తున్నాయి. రోగుల ప్రాణరక్షణలో చివరి ప్రయత్నంగా చేసే చికిత్సల్లో అవకాశాలు కుంచించుకు పోతున్నాయి. దీన్నే ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’ బెడద అని పిలుస్తున్నాం. ఎ.ఎం.ఆర్. వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అభాగ్యుల్లో 90% మంది ఆసియా, ఆఫ్రికా దేశాల వాసులే. ఈ మహమ్మారిని కట్టడి చేయకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కోటి మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్య కారణాలు బ్రహ్మాస్త్రాల్లాంటి యాంటీమైక్రోబియల్ ఔషధాలను దుర్వినియోగం చేయటం, మోతాదులకు మించి వాడటం వల్ల ఎ.ఎం.ఆర్. మహమ్మారి విజృంభిస్తోంది. మనుషులకు, పశువులకు అందించే వైద్య చికిత్సల్లో.. పాడి పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, రొయ్యలు, చేపలు వంటి ఆహారోత్పత్తులను అందించే పశుపక్ష్యాదుల పెంపకంలో.. పంటలు, పండ్ల తోటల సాగులో యాంటీమైక్రోబియల్ రసాయనిక మందులను విచ్చలవిడిగా వాడటం ఎ.ఎం.ఆర్. విజృంభణకు ముఖ్య కారణాలు. అంతేకాదు.. కర్మాగారాలు, వ్యవసాయ/ పశుపోషణ క్షేత్రాలు, జనావాసాలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, వ్యర్థ జలాలతో ఏర్పడుతున్న కాలుష్యం కూడా ఎ.ఎం.ఆర్. మహమ్మారి పెరుగుదలకు కారణమవుతోంది. కోవిడ్ కాలంలో యాంటీ బయోటిక్స్ దుర్వినియోగం పెచ్చుమీరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. చైతన్య వారోత్సవాలు ఎ.ఎం.ఆర్. సమస్యపై ప్రచారోద్యమం ద్వారా ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, పశువైద్య నిపుణులు, విధాన నిర్ణేతలకు ఈ సమస్యపై చైతన్యం కలిగించడానికి నవంబర్ 18–24 వరకు ప్రతి ఏటా ‘వరల్డ్ యాంటీమైక్రోబియల్ అవేర్నెస్ వీక్’ పేరిట వారోత్సవాలు జరుపుకొంటున్నాం. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు భారత్ ఎ.ఎం.ఆర్. నియంత్రణ కోసం పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక (2017–21) చేపట్టింది. మూలికా వైద్యంతో సత్ఫలితాలు పశుపోషణలో సంప్రదాయ మూలికా చికిత్సలను ప్రాచుర్యంలోకి తేవటం ద్వారా 80% యాంటీబయోటిక్స్ వాడకాన్ని జాతీయ పాడి అభివృద్ధి సంస్థ తగ్గించగలిగింది. రైతులు తమ ఇంటి పరసరాల్లో దొరికే ఔషధ మొక్కలతోనే పొదుగు వాపు వంటి తీవ్ర జబ్బుల్ని కూడా పూర్తిగా అరికట్టవచ్చని రుజువైందని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా అంటున్నారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్త డా. చౌహన్ క్యు పద్ధతులు అనుసరిస్తే రసాయన రహిత, దుర్గంధ రహిత కోళ్ల పెంపకం చేపట్టవచ్చు. ఆక్వా సాగులోనూ యాంటీ బయోటిక్స్ తదితర రసాయనాల వాడకాన్ని తగ్గించటం అవశ్యం. ఆహార పంటలు, ఉద్యాన తోటల సాగులో రసాయనాల అవసరాన్ని దశలవారీగా తగ్గించుకునే మార్గాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ చైతన్యంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణకు ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పూనుకోవాలి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (ఈ నెల 24 వరకు ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్’ సందర్భంగా..) -
కొత్త బ్యాక్టీరియా.. సరికొత్త జ్వరం
పాలకొండ రూరల్: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలం సింగన్నవలస ప్రాంతంలో కొత్త రకం బ్యాక్టీరియాను వైద్యులు గుర్తించారు. ఓ రకం కీటకం కాటు ద్వారా ‘ఓరియన్షియా సుషుగముషి’ అనే బ్యాక్టీరియా సోకి ‘స్క్రబ్ టైఫస్’ అనే జ్వరం వస్తోంది. ఈ జ్వరం కారణంగా రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడంతో పాటు.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే జ్వరం తీవ్రమై ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధికంగా ఉండే ఈ బ్యాక్టీరియా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోనూ కనిపిస్తోంది. పాలకొండ మండలం సింగన్నవలసలో ఈ తరహా లక్షణాలతో కూడిన జ్వర పీడితులను ఇటీవల వైద్యులు గుర్తించారు. సకాలంలో వైద్యులు స్పందించటంతో ప్రమాదం తప్పింది. దీనిని నియంత్రించేందుకు ప్రత్యేక టీకాలు అంటూ ఏమీ లేవు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలి. మురుగుతో పాటు..: పచ్చిక బయళ్లు, మురుగు నిల్వ ఉన్న చోట పెరిగే ఓ రకం (నల్లిని పోలి ఉండే) కీటకాల్లో ఈ ‘ఓరియన్షియా సుషుగముషి’ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ కీటకం కాటు వేసిన చోట నల్లని మచ్చతో పాటు.. చుట్టూ ఎరుపు రంగుతో కూడిన గాయం ఏర్పడి దురద పుడుతుంది. తీవ్రమైన చలి జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు, తలనొప్పితో పాటు ఒంటిపై ఎర్రని దద్దుర్లు ఏర్పడతాయి. డెంగీ మాదిరి లక్షణాలతో ఉండే జ్వరంతో పాటు రక్తంలో సోడియం నిల్వలు తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. జ్వరం తీవ్రమైతే ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం ప్రభావానికి గురవుతాయి. తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అయితే ఈ రకమైన జ్వరాన్ని గుర్తించేందుకు మ్యాల్ కిల్లర్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. -
ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది
సియాటెల్/వాషింగ్టన్: ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతకీ ఫలించడం లేదా? కడుపు కట్టుకున్నా.. రకరకాల వ్యాయామాలు చేస్తున్నా.. ఎంతకీ బరువు తగ్గడం లేదా? అయితే తప్పు మీది కాకపోవచ్చు. మీ జీర్ణ వ్యవస్థలో తిష్టవేసుకున్న కొన్ని రకాల బ్యాక్టీరియా మీరు బరువు తగ్గకుండా అడ్డుకుంటూ ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రయత్నపూర్వకంగా బరువు తగ్గిన.. తగ్గని వారి పేవుల్లోని సూక్ష్మజీవులను పరిశీలించడం ద్వారా ఈ విషయం స్పష్టమైంది. అమెరికాలోని సియాటెల్ కేంద్రంగా పనిచేస్తున్న సిస్టమ్స్ బయాలజీ అనే సంస్థ ఇటీవల ఒక పరిశోధన నిర్వహించింది. బరువు తగ్గాలని నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్న సుమారు వంద మందితో ఈ పరిశోధన జరిగింది. వీరిలో 50 మంది ఆరు నుంచి పన్నెండు నెలల్లోపు శరీర బరువులో ఒక శాతం తగ్గిన వారు కాగా... మిగిలిన వారు ఏమాత్రం బరువు తగ్గనివారు. రక్తం, మలం, జన్యుపదార్థాలను క్షుణ్ణంగా విశ్లేషించినప్పుడు రెండు వర్గాల వారి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మన జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని పులియబెట్టడం ద్వారా జీర్ణం చేసేందుకు అనువుగా అభివృద్ధి చెందిందని, అదే సమయంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం కూడా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్టియన్ డైనర్ తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారు పిండి పదార్థాలను శరీరం శోషించుకోగల చక్కెరలుగా మలచుకోవడంలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారన్నారు. బ్యాక్టీరియా పెరుగుదల మందగిస్తే తిన్న ఆహారంలోని పీచుపదార్థం పులిసేందుకు ముందుగానే చక్కెరలుగా మారిపోయి రక్తంలోకి చేరిపోతాయని, ఫలితంగా బరువు తగ్గడం అసాధ్యంగా మారుతుందని వివరించారు. ఊబకాయులు ఒకొక్కరికీ వేర్వేరు చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. -
ఈ చెరువుల్లో నీరు యమ డేంజర్, అస్సలు తాకొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువుల్లో ప్రమాదకరమైన కొత్తరకం బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. సిటీ వ్యాప్తంగా చెరువులు, కుంటల నుంచి నీటి శాంపిల్స్ తీసుకుని పరీక్షించామని.. ఇందులో చాలావరకు జలాశయాల్లో ‘మెటలో బీటా లాక్టమస్–1’అనే జన్యువు ఉన్న బ్యాక్టీరియాను గుర్తించామని హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు చెప్తున్నారు. గృహ, పారిశ్రామిక కాలుష్యమే ఈ తరహా బ్యాక్టీరియా పెరగడానికి కారణమని వారు అంటున్నారు. మురుగు వ్యర్థాలు, భార లోహాలు అధికంగా ఉన్న నీటిలోనే ఈ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుందని, ఇది యాంటీ బయాటిక్స్‌కు సైతం లొంగని మొండిరకమని పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు. ఆయా చెరువులు, కుంటల్లో నీటిని తాగినా, ఇతర ఏ అవసరాలకు వినియోగించినా కూడా.. డయేరియా, అంటు వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియా భూగర్భజలాల్లో కలిసే అవకాశం లేదన్నారు. అయితే చెరువులు, కుంటల నుంచి వివిధ మార్గాల్లో చుట్టూ రెండు కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆయా జలాశయాల్లో నీటిని ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దని పేర్కొన్నారు. కాలుష్యం కాటు.. బ్యాక్టీరియా వేటు ►గ్రేటర్ పరిధిలో సుమారు 185 చెరువులు ఉండగా.. వాటిలో సగం చెరువుల్లోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వ్యర్థ జలాలు వచ్చి కలుస్తున్నాయి. ►ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల బృందం సిటీలోని అంబర్‌పేట ఎస్టీపీ, దుర్గం చెరువు, అమీన్పూర్, అల్వాల్, హుస్సేన్‌సాగర్, మోమిన్‌పేట్, సరూర్‌నగర్, ఫాక్స్ సాగర్, కంది, మీరాలం, నాగోల్, ఉప్పల్ నల్లచెర్వు, సఫిల్‌గూడ చెరువుల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించింది. ►ఈ చెరువులన్నింటి నీళ్లలో ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’జన్యువు కలిగిన కొత్త రకం బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించింది. ►మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తదితర మంచినీటి జలాశయాల్లో నమూనాలను కూడా పరీక్షించారు. వాటిలో ఈ బ్యాక్టీరియా ఉనికి బయటపడలేదు. ►కొన్నేళ్లుగా చెరువులు కబ్జాకు గురవడం, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోనే భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపాలుగా మారుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. చెరువుల ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతమిస్తోందని, మురుగు చేరకుండా గట్టి చర్యలు తీసుకోవడంలో విఫలమౌతోందని ఆరోపిస్తున్నారు. ►రోజువారీగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వెలువడుతున్న 1,400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మేర మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. ఆ చెరువుల ప్రక్షాళనకు చర్యలివే.. ►గ్రేటర్ పరిధిలోని చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. అడుగున పేరుకున్న ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలి. ►జలాశయాల ఉపరితలంపై పెరిగిన గుర్రపు డెక్కను తొలగించాలి. ►చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ►గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలు చేరకుండా చర్యలు తీసుకోవాలి. మురుగునీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేశాకే.. నాలాల్లోకి వదలాలి. ఈ బ్యాక్టీరియాతో రోగాల ముప్పు తథ్యం సిటీలోని పలు చెరువులు, కుంటల్లో ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’బ్యాక్టీరియా బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ల తరహాలో ఈ బ్యాక్టీరియా సుదూర ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదు. సమీపంలో సుమారు 2 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించే అవకాశముంది. ఆయా చెరువుల నీటిని తాకినా, బట్టలు ఉతికినా, అందులోని చేపలు పట్టుకొని తిన్నా, అధిక సమయం ఈ చెరువుల పరిసరాల్లో గడిపినా ఈ బ్యాక్టీరియా మనుషుల్లో ప్రవేశించి శ్వాసకోశ వ్యాధులు, డయేరియా, చర్మ వ్యాధులు, అంటురోగాలకు కారణమౌతుంది. ఈ బ్యాక్టీరియా భూగర్భ జలాల్లో చేరే అవకాశం లేదు. – ప్రొఫెసర్ శశిధర్, ఐఐటీ హైదరాబాద్ తాగునీటి నాణ్యతకు ఢోకా లేదు మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, గోదావరి (ఎల్లంపల్లి), కృష్ణా మూడుదశల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్న నీటిని 3 దశ ల్లో శుద్ధి చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు క్లోరినేషన్, బూస్టర్ క్లోరినేషన్ నిర్వహణతో ఇక్కడి తాగునీటి నాణ్యతపై జలమండలికి ఐఎస్వో ధ్రువీకరణ లభించింది. నగరవ్యాప్తంగా సరఫరా చేస్తు న్న తాగునీటికి సంబంధించి ఐదువేలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నాం. ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించలేదు. తాగునీటి నాణ్యతపై అనుమానాలు, అపోహలకు తావులేదు. – జలమండలి ఎండీ దానకిశోర్ యాంటీ బయాటిక్స్‌కు లొంగదు! ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’జన్యువు ఉన్న బ్యాక్టీరియా చాలా మొండిదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియాతో చర్మ, శ్వాసకోశ వ్యాధులు వచ్చిన వారికి సాధారణంగా వైద్యులు ఇచ్చే యాంటీ బయాటిక్స్ పనిచేయవని చెప్తున్నారు. కలుషిత జలాలు చేరిన చెరువుల నీటిని తాకడం, బట్టలు ఉతకడం, స్నానం చేయడం, ఆ జలాశయాల్లోని చేపలను తినడం, ఈ నీటిని ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల బ్యాక్టీరియా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం ఆయా జలాశయాల వద్ద గడపవద్దని కూడా సూచిస్తున్నారు. మురుగు నీరు చేరికతోనే.. సిటీ పరిధిలోని చెరువుల్లోకి గృహ, పారిశ్రామిక వ్యర్థాలు చేర డంతో కాలుష్యం బారినపడుతున్నాయి. నీటిలోని భార లోహా లు, రసాయనాలతో చెరువుల్లో కొత్తరకం బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. జలాశయాలను ప్రక్షాళన చేయడంలో బల్దియా విఫలమవుతోంది. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణవేత్త -
బ్రషింగ్ ఎలా చేయాలో ఇటో లుక్కేయండి!
పళ్లను శుభ్రపరచుకోవడంలో భాగంగా బ్రష్ చేసే సమయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తుంటారు. నిజానికి ఒక క్రమపద్ధతిలో బ్రషింగ్ సాగాలి. దంతాలు దెబ్బతినకుండా ఆరోగ్యకరమైన రీతిలో బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. ►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ఇలా చేసుకునే సమయంలో నిలువుగా బ్రష్ చేస్తూనే పళ్ల మీద బ్రష్ కదలికలు సున్నాలు చుడుతున్నట్లుగా గుండ్రంగా సాగాలి. ►మృదువుగా బ్రష్ చేసుకోండి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి. ►రెండు లేదా మూడు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. అంతకుమించి బ్రషింగ్ కూడా పళ్లకు మంచిది కాదు. ►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్లపాటు స్క్రబ్ చేయండి. ►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►మూడు నెలలకు ఓమారు లేదా బ్రిజిల్స్ వంగినట్లు, కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. అలాగే జ్వరం వచ్చాక లేదా ఏదైనా జబ్బుబారిన పడి కోలుకున్న వెంటనే బ్రష్ మార్చడం ఉత్తమం. -
మనలో ఉన్న మంచి బ్యాక్టీరియా తెలుసునా?
బ్యాక్టీరియా.... ఈ పేరు వినగానే రకరకాల వ్యాధులు, వాటితో వచ్చే బాధలు గుర్తొస్తాయి. కానీ, పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు బ్యాక్టీరియాలో కూడా మంచివి, మేలు చేసేవి కూడా ఉంటాయని చాలా తక్కువమందికి తెలుసు. ఇలా మనకు మేలు చేస్తూ మన శరీరంలో ఉంటూ మనతో సహజీవనం చేసే బ్యాక్టీరియా, ఈస్ట్‌లను ప్రోబయోటిక్స్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే గుడ్ బ్యాక్టీరియా అన్నమాట! సాధారణంగా ఈ ప్రోబయోటిక్స్ మన జీర్ణవ్యవస్థలో ఉంటూ, జీర్ణవాహికను ఆరోగ్యంగా ఉంచుతాయి. మన డైజెస్టివ్ ట్రాక్‌లో దాదాపు 400 రకాల ‘గుడ్’ బ్యాక్టీరియా ఉంటాయి. ఆహారపదార్ధాల జీర్ణం, వాటి చోషణ (టuఛిజుజీnజ), ఇమ్యూనిటీ పెంచడం వంటి అనేక విషయాల్లో ఇవి సాయం చేస్తుంటాయి. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు యాంటీ బయోటిక్స్ వాడితే ఆ సమయంలో ఇవి కూడా నశించిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా ’హెల్తీ గట్’(ఆరోగ్యవంతమైన అన్నవాహిక)ను మెయిన్‌టెయిన్ చేయవచ్చు. వేటి ద్వారా పొందొచ్చు? ఎక్కువగా ఫర్మెంటెడ్ పదార్ధాల్లో ఈ ప్రోబయోటిక్స్ లభిస్తాయి. పెరుగు, యాపిల్ సిడార్, యోగర్ట్, క్యాబేజీతో చేసే సౌర్‌క్రౌట్, సోయాబీన్స్‌తో చేసే టెంపె, పచ్చళ్లు, మజ్జిగ లాంటివి గట్‌లో గుడ్ బ్యాక్టీరియా పెండచడంలో సాయం చేస్తాయి. వీటిలో లాక్టోబాసిల్లస్, బైఫిడో బాక్టీరియం రకాలు ఎక్కువ ప్రయోజనకారులు. ఎంత డోసేజ్ మంచిది? సాధారణంగా రోజుకు 30 కోట్ల నుంచి 100 కోట్ల సీఎఫ్‌యూ(కాలనీ ఫామింగ్ యూనిట్స్– బ్యాక్టీరియా కొలమాని) ప్రోబయోటిక్స్‌ను డాక్టర్లు రికమండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యేకించి జీర్ణవ్యవస్థకు సంబంధించి ఇబ్బందులుంటే ఈ మోతాదు మరికొంత పెంచుతారు. లాభాలనేకం: ∙ఇరిటబుల్ బౌల్ సింట్రోమ్(ఐబీఎస్)తో పోరాటంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో పాటు గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, డయేరియాలాంటి జీర్ణకోశ వ్యాధులు తగ్గించడంలో ఉపయోగ పడతాయి. హీలికోబాక్టర్ పైలోరి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, అల్సర్లు, జీర్ణకోశ కాన్సర్పై యుద్ధంలో ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని ప్రోబయోటిక్స్ బరువుతగ్గించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని ఇన్ఫ్లమేషన్లపై పోరాటం చేస్తాయి. కొన్ని కీలక బ్యాక్టీరియాలు డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గించడంలో సాయపడతాయి. మరికొన్ని ఎల్డీఎల్(బ్యాడ్ కొలెస్ట్రాల్) తగ్గించేందుకు ఉపకరిస్తాయి. ప్రొబయోటిక్స్ కారణంగా చర్మం కాంతి వంతంగా కావడం, మొటిమలు తొలగిపోవడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సాధారణంగా ప్రోబయోటిక్స్ వాడకంతో ఎలాంటి ఇబ్బందులుండవు. కొందరికి మాత్రం జీర్ణ సంబంధిత తేలికపాటి సమస్యలు ఎదురుకావచ్చు. ఇవి స్వల్పకాలంలోనే తగ్గిపోతాయి. lఅయితే ఎయిడ్స్ పేషంట్లలో మాత్రం ఇవి ఒక్కోమారు తీవ్రమైన ఇన్ఫెక్షన్స్కు దారితీసే ప్రమాదం ఉంది. ∙ఇమ్యూనిటీ సంబంధిత వ్యాధులున్నవారికి సైతం ఇవి కొత్త తలనొప్పులు తెస్తాయి. అందువల్ల తీవ్రమైన వ్యాధులున్నవాళ్లు, గర్భిణులు, పసిపిల్లలు, వయోవృద్దులు ప్రోబయోటిక్స్ వాడేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. -
ఫ్రిజ్‌లో సాల్మొనెల్లా సూక్ష్మజీవి!
మనమందరం రకరకాల ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో దాచుకుంటాం. ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల అక్కడ సూక్ష్మజీవులు పెరగడానికి అవకాశమే లేదని అనుకుంటాం. నిజానికి అక్కడ కూడా సాల్మొనెల్లా అనే ఓ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఎక్కువే. సాధారణంగా మాంసాహారం నిల్వ చేసే సమయంలో ఈ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా ఉందంటే అది ఫ్రిజ్‌లోని అన్ని రకాల ఆహారపదార్థాలనూ కలుషితం చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ఆహారపదార్థాలను బాగా వేడిచేయకుండా తిన్నప్పుడు కొందరిలో నీళ్ల విరేచనాలతో పాటు డీ–హైడ్రేషన్ ముప్పు తప్పదు. అందుకే ఫ్రిజ్‌ను సైతం ఆరోగ్యకరంగా ఉండేలా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రిజ్‌లో ఆహారపదార్థాలు దాచుకునే క్రమంలో ఫ్రిజ్ హైజీన్ కూడా అవసరమే ఇందుకోసం మనం అందులో మాంసాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు నిలువ చేసుకునే సమయంలో అవన్నీ వేర్వేరుగానూ, హానికరం కాని ప్యాకింగ్ మెటీరియల్‌తో ప్యాక్ చేసి పెట్టుకోవాలి. మాంసాహార పదార్థాల్లోనూ చికెన్, మటన్, సీఫుడ్స్ లాంటి మాంసాన్ని (రా–మీట్‌ను) దేనికదే విడివిడిగా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక మాంసాహారం మరో మాంసాహారంతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవకూడదు. (చదవండి: మంచి నిద్రకూ.. బ్యాక్టీరియాకు లింకు) ఫ్రిజ్‌లోంచి తీసిన ఆహార పదార్థాలను పచ్చిపచ్చిగా ఉన్నవాటిని సాధ్యమైంతగా రా–ఫుడ్ రూపంలో తినకపోవడమే మేలు. ఇక ఆకుకూరలూ, కాయగూరలను తగిన ఉష్ణోగ్రత వద్ద సరిగ్గా ఉడికాకే తినాలి. ఫ్రిజ్ నుంచి తీసిన మాంసాహారాన్ని తప్పనిసరిగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించేలా తప్పక జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా లేదా ఈ–కొలై సూక్ష్మజీవులు చనిపోతాయి. మాంసాహారం తినేవారు దాన్ని సరిగ్గా ఉడికించాక (ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్) మాత్రమే తినాలి. డీప్ ఫ్రీజర్ భాగంలో అర చేయి పెట్టి చూసినప్పుడు అది బాగా చల్లగా తగలాలే తప్ప... బాగా తడితడిగా చిత్తడిగా తగలకూడదు. అలా చిత్తడిగా ఉందంటే అక్కడ తగిన ఉష్ణోగ్రత నిర్వహితం (మెయింటెయిన్) కావడం లేదని అర్థం. ఫ్రిజ్‌లో తగిన చల్లదనం / ఉష్ణోగ్రత లేకపోతే దాని పనితీరు బాగాలేదని గ్రహించి, ఫ్రిజ్ రిపేర్ చేసేవారితో దాన్ని తప్పక బాగు (రిపేర్) చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఫ్రిజ్‌ను నెలకొకసారో లేదా రెణ్ణెల్లకొకసారో... ఇలా నిర్ణీత సమయంలో తప్పక శుభ్రం చేసుకుంటూ ఉండాలి. -
మూసీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిలోని ‘డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన సాగనుంది. మందుల ఉత్పత్తి తర్వాత ఆయా కంపెనీల నుంచి విడుదలైన ‘యాంటీ బయోటిక్స్’వ్యర్థాల గాఢత మూసీలో అత్యధికస్థాయిలో ఉన్నట్టు ఇప్పటికే బయటపడింది. ఈ నేపథ్యంలో వీటిస్థాయి అధికస్థాయిలో ఉన్న మూసీతోపాటు తక్కువస్థాయిలో ఉన్న చెన్నైలోని అడయార్ నదిపైనా ఈ పరిశోధన జరగనుంది. ఇండో–యూకే ప్రాజెక్ట్‌లో భాగంగా బ్రిటన్ బర్మింగ్హమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ అధ్యయనంలో ఐఐటీ–హైదరాబాద్ కూడా భాగస్వామి కానుంది. ఈ కొత్త పరిశోధక ప్రాజెక్ట్ కోసం ఇండియా, యూకే కలిసి 1.2 మిలియన్ పౌండ్ స్టెర్లింగ్‌లు కేటాయించాయి. బ్రిటన్–ఇండియా ప్రభుత్వాల సహకారంతో 8 మిలియన్ల పౌండ్ స్టెర్లింగ్‌ల ఖర్చులో నిర్వహిస్తున్న యాంటీ–మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) సైంటిఫిక్ రీసెర్చ్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను కూడా చేపడుతున్నారు. తల్లుల నుంచి సోకే ‘సూపర్ బగ్ ఇన్ఫెక్షన్ల’తో భారత్‌లో ప్రతిఏటా 58 వేల చిన్నారులు మృత్యువాత పడుతున్నట్టు, యూరప్ యూనియన్‌లో ప్రతి ఏడాది 28–38 వేల మధ్యలో ‘డ్రగ్ రెసిస్టెన్స్ పాథోజెన్ల’తో మరణాలు సంభవిస్తున్నట్టు అంచనా. నదుల్లోకి ప్రవేశించాక... ‘పర్యావరణంలో యాంటీ బయోటిక్స్ ఎంత త్వరగా క్షిణిస్తాయనేది మనకు తెలియదు. పెద్ద నదుల్లోకి ప్రవేశించాక, వర్షాలతో అవి ఏ మేరకు బలహీనమవుతాయన్న విషయమూ తెలియదు. ఏఎంఆర్ ఫ్లోస్ ప్రాజెక్ట్ ద్వారా యాంటీ బయోటిక్స్ ఎలా ఉత్పత్తి అవుతాయి, అవి తట్టుకునే బ్యాక్టీరియాను ఎలా ఎంపిక చేసుకుని నదుల నెట్‌వర్క్‌ల ద్వారా ఎలా వ్యాపిస్తాయి, నదుల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయి, వరదల సందర్భంగా ఎక్కడి నుంచి అవి పంటపొలాల్లోకి, జనసమూహాల్లోకి వ్యాప్తి చెందుతాయి... అనే అంశాలను పరిశీలిస్తారు. నీటివనరుల్లో యాంటీ బయోటిక్స్ ఏ మేరకు కేంద్రీకృతమైతే నష్టం జరగదన్న దాని ప్రాతిపదికన పర్యావరణ ప్రమాణాలను రూపొందించే అవకాశం ఉంది’అని యూకే ప్రాజెక్ట్ లీడ్ హెడ్ డాక్టర్ జాన్ క్రెఫ్ట్ తెలిపారు. పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుందో... ‘మూసీ నది సూపర్‌బగ్‌లకు కేంద్రంగా ఉన్నట్టు గతంలోని పరిశోధనలతోనే మనకు తెలుసు. యాంటీ బయోటిక్స్‌ను తట్టుకునే బ్యాక్టీరియా పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుంది, దాని భవితవ్యం ఏమిటీ అన్నది తెలుసుకునేందుకు నీటి ప్రవాహాల నమూనాలను అంచనా వేయడం కీలకం. ఇతర దేశాలతో పాటు ఇతర నదులకు సరిపోయే నమూనాలను రూపొందించే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం’అని ఇండియన్ ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెసర్, ఐఐటీ–హైదరాబాద్ ప్రొఫెసర్ శశిధర్ తాటికొండ వెల్లడించారు. -
సరికొత్త సాన్స్ మాస్క్!
సాక్షి, హైదరాబాద్: కరోనా నిరోధానికి ప్రస్తుతం అందరూ మాస్కులు ధరిస్తున్నారు. అయితే మనం వాడే ఫేస్ మాస్కులు చిన్న చిన్న తుంపర్లను సైతం అడ్డుకోగలిగితే.. వైరస్ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అచ్చం ఇదే ఆలోచనతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు వినూత్న మాస్క్‌ను డిజైన్ చేశారు. సాన్స్ పేరు గల ఈ మాస్కు అత్యధిక నాణ్యతతో పాటు 2 కంటే ఎక్కువ పొరలు కలిగి ఉంటుంది. దీన్ని చౌక ధరకే తయారు చేయొచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మాస్కులను పెద్దఎత్తున పంచేందుకు దేశంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా తన ఫౌండేషన్ ద్వారా ముందుకొచ్చింది. ఈ మాస్కుల తయారీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ శైలజ తెలిపారు. యాంటీ బ్యాక్టీరియా కూడా..: ఐఐసీటీ డిజైన్ చేసిన ఈ మాస్క్ బ్యాక్టీరియాను దరిచేరనివ్వని ప్రత్యేక వస్త్రంతో తయారుచేస్తారు. 3 నుంచి 4 పొరలుండే ఇది వైరస్ నుంచి 60 – 70 శాతం రక్షణ కల్పిస్తుంది. అదే సమయంలో తుంపర్లను 95 నుంచి 98 శాతం వరకు అడ్డుకుంటుంది. తుంపర్ల సైజు 0.3 మైక్రోమీటర్లున్నా సాన్స్ వాటిని లోపలికి రానీయకుండా అడ్డుకుంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి దాదాపు అసాధ్యం. ఈ మాస్క్‌ను 2–3 నెలల వరకూ పదేపదే వాడొచ్చని, 30సార్లు ఉతికేంత వరకు దాని ప్రభావం అలాగే ఉంటుందని ఐఐసీటీ సీ నియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. శ్రీధర్ తెలిపారు. సాన్స్ ద్వారా ఊపిరి తీసుకోవడం ఇతర మాస్కుల కంటే సులువుగా ఉంటుందన్నారు. సిప్లా లాంటి సం స్థ ఐఐసీటీతో చేతులు కలపడంపై సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మాండే హర్షం వ్యక్తం చేశారు. సాన్స్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ నిరోధం మరింత సమర్థంగా జరుగుతుందని భావిస్తున్నట్లు ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. -
‘కరోనా బ్యాక్టీరియా.. అస్పిరిన్‌తో తగ్గుతుంది’
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి సోషల్‌మీడియాలో ఫేక్ న్యూస్‌కు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. సారా, ఆవు పంచకం తాగితే కరోనా రాదని చెప్పడంతో జనాలు ఎగబడిన వైనం చూశాం. అలానే ఫలానా కషాయాలు తాగినా, వేప చెట్టుకు నీళ్లు పోయడం వంటి పూజలు చేసినా కరోనా బారిన పడరనే వార్తలు తెగ వైరలయిన సంగతి తెలిసిందే. ఓ వైపు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఫేక్ న్యూస్ కట్టడి కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి నిత్యం ఏదో ఒక కొత్త వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా కరోనాకు సంబంధించి మరో ఫేక్ న్యూస్ వీడియో తెగ ప్రచారం అవుతోంది.(ఫేక్ న్యూస్: నటి ఆవేదన) Claim- A widely circulated video on social media claims that #Covid19 is a bacteria & which can be treated with aspirin#PIBFactCheck- This is #Fake. Coronavirus is a virus and there is no specific medicinal cure available yet. pic.twitter.com/ESPzEZ6WgT — PIB Fact Check (@PIBFactCheck) June 4, 2020 కరోనా అనేది వైరస్ కాదని.. బ్యాక్టీరియా అని.. అస్పిరిన్‌తో కోవిడ్ భరతం పట్టవచ్చని ఈ వీడియో సారాంశం. 5జీ ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ వలన కరోనా వ్యాపిస్తుందని.. అస్పిరిన్ తీసుకుంటే తగ్గిపోతుందని వీడియో వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరింది. కరోనా అనేది వైరస్ అని.. దానికి ఇంతవరకు ఎలాంటి మందు తయారు చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం శానిటైజర్‌ను ఎక్కువగా వాడితే.. చర్మ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనే వార్త ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 70శాతం అల్కహాల్ ఉన్న శానిటైజర్‌ను వాడితే ఎలాంటి ప్రమాదం లేదని.. కరోనా నుంచి కాపాడుకోవడానికి ఇది ఎంతో ముఖ్యమని పీఐబీ స్పష్టం చేసింది.(ఎందరినో రక్షించి.. బలయ్యాడు) -
‘కరోనా’ ప్రూఫ్ కారును చూశారా?
బులెట్‌ప్రూఫ్ కార్లు అందరికీ తెలిసినవే. కరోనా వైరస్ పుట్టిన చైనాలో ‘కరోనా’ప్రూఫ్ కారు వచ్చేసింది. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ఆ మహత్తర వాహనమే! చైనాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ ‘గీలీ’ తన ‘హెల్తీ కార్ ప్రాజెక్ట్’లో భాగంగా ఇటీవల ఈ మైక్రోబ్ప్రూఫ్ కారును రూపొందించింది. ఇందులో ‘జీ–క్లీన్’ ఇంటెలిజెంట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కారులోని గాలిలో కలసిన సూక్ష్మజీవులను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ, గాలిని తాజాగా ఉంచుతుంది. ఈ కారులోని ఏసీ నుంచి గాలి వెలువడే ప్రదేశం నుంచి చల్లని గాలితో పాటు శక్తిమంతమైన అల్ట్రావయొలెట్ కిరణాలు కూడా వెలువడుతూ బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను తుదముట్టిస్తాయి. కారు లోపలి భాగం ఫొటోలను ‘గీలీ’ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. (2లక్షలు దాటిన కరోనా కేసులు) యూవీ పెన్... సూక్ష్మజీవుల పాలిటి గన్ ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది అల్ట్రావయోలెట్ స్టెరిలైజేషన్ పెన్. ఇది రాసుకోవడానికి పనికిరాదు గాని, సూక్ష్మజీవుల పాలిటి గన్లా మాత్రం భేషుగ్గా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్. తడిగా ఉన్న ఉపరితలాలపై కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా చక్కగా పనిచేస్తుంది. హైటెక్ వస్తువులను తయారు చేసే చైనీస్ కంపెనీ ‘జియావోమి పెటొనీర్’ ఇటీవల ఈ యూవీ స్టెరిలైజేషన్ పెన్ను తయారు చేసింది. ఇది 2200ఎంఏహెచ్ రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, ఇది నిరంతరాయంగా రెండున్నర గంటల సేపు పని చేస్తుంది. (ఇప్పుడెలాగో.. అప్పుడూ అలాగే) ఇందులో రెండు మోడ్స్ ఉంటాయి. ఒకటి 90 సెకండ్ల మోడ్, మరొకటి 60 సెకండ్ల మోడ్. ఎంపిక చేసుకున్న వేగాన్ని బట్టి ఎంచుకున్న ఉపరితలంపై ఉన్న సూక్ష్మజీవులను పూర్తిగా నిర్మూలిస్తుంది. దీని నుంచి 253.5ఎన్ఎం వేవ్‌లెంగ్త్‌తో విడుదలయ్యే అల్ట్రావయోలెట్ కిరణాలు బ్యాక్టీరియా, వైరస్ వంటి మహా మొండి సూక్ష్మజీవులను సైతం క్షణాల్లోనే ఖతం చేసేస్తాయి. గాఢమైన రసాయనాల వాసనలు సరిపడని వారు సూక్ష్మజీవులను సునాయాసంగా వదిలించుకోవాలంటే, ఇలాంటి పెన్ ఒకటి ఇంట్లో ఉండాల్సిందే! (ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్) -
కాఫ్ & క్లూస్
గాలిని నిరంతరం ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని మళ్లీ వదిలేసే ప్రక్రియే శ్వాసక్రియ. నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో... అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి ఆ గ్లాటిస్నుంచి ఒక్కసారిగా బలంగా నోటి నుంచి బయటకు రావడాన్ని ‘దగ్గు’ అంటారు. అది ఒకే ఒకసారి రావచ్చు. లేదా అలా వస్తూనే ఉండవచ్చు. దగ్గులో రకాలు... తడి దగ్గు : మన ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి జరిగే చోట తడిగా ఉంచేందుకు కొన్ని స్రావాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ స్రావాలు మామూలుగానైతే బయటకు రావు. ఏవైనా కారణాల వల్ల ఈ స్రావాల ఉత్పత్తి సాధారణం కంటే ఎక్కువగా జరుగుతుంటే దగ్గుతో పాటు అవి బయటకు వస్తుంటాయి. అలా వచ్చేదాన్ని తడి దగ్గు (వెట్ కాఫ్) అంటారు. పొడి దగ్గు : దగ్గుతున్నప్పుడు స్రావాలు ఏమీ రాకుండా వచ్చే దాన్ని పొడి దగ్గు అంటారు. తడి, పొడి దగ్గులను బట్టి కొన్ని వ్యాధులను తొలిదశలో ప్రాథమికంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పొడి దగ్గు వస్తుంటే వ్యాధి శ్వాసకోశనాళాల తొలి భాగం (అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్–వే)లో ఉందని, తడి దగ్గు అయితే ఊపిరితిత్తుల్లోపల వ్యాధులు (బ్రాంకైటిస్, నిమోనియా, ఆస్తమా) ఉండవచ్చునని డాక్టర్లు ఒక అంచనాకు వస్తుంటారు. రాత్రీ – పగలూ తేడాను బట్టి... దగ్గు వచ్చే వేళల్లో తేడాను బట్టి కొన్ని వ్యాధిలను అనుమానించవచ్చు. రాత్రి వేళల్లో దగ్గు వస్తుంటే అది అలర్జీ కారణంగా వస్తుందని అనుమానించవచ్చు. మధ్యాహ్నం పూట దగ్గు ఎక్కువగా ఉంటే దానికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చని ఊహిస్తారు. తెమడను బట్టి... తడి దగ్గు వచ్చే సమయంలో బయటకు వచ్చే తెమడ /కళ్లె (స్ఫుటమ్/ఫ్లెమ్) రంగును బట్టి రకరకాల వ్యాధులను అనుమానించి, వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. ఉదాహరణకు ►ఆకుపచ్చరంగులో తెమడ ఉంటే... సూడోమొనాస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు వస్తుండవచ్చు. ►పసుపుపచ్చగా ఉంటే... క్లెబ్సిల్లా నిమోనియా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ►ఎర్రగా ఉంటే... సూడోమొనాలీ, నీమోకోకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఎర్రరంగులో కళ్లెపడవచ్చు. ►నలుపు రంగులో ఉంటే... కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు. మరెన్నో జబ్బులకు సూచిక... దగ్గుతో అలర్జీ, టీబీ, నిమోనియా వంటి జబ్బులని అనుమానించవచ్చు. అలాగే... ►ఊపిరితిత్తుల్లో నీరు నిలిచిపోయే ప్లూరల్ ఎఫ్యూజన్ ►కీళ్ల నొప్పులతో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ►కీళ్లకు సంబంధించిన లూపస్ అరిథమెటోసిస్ వంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా పొడి దగ్గు వస్తూ ఉంటుంది. క్యాన్సర్లలో... స్వరపేటిక, ఊపిరితిత్తులు, నోటికి సంబంధించి క్యాన్సర్లలో మొదటి లక్షణంగా దగ్గు కనిపించవచ్చు. చికిత్స ఏ కారణం వల్ల దగ్గు వస్తోందో నిర్ధారణ చేశాక దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా దగ్గు కనిపించగానే చాలామంది మందుల దుకాణాల్లో దొరికే దగ్గు మందులు వాడుతుంటారు. దాంతో తాత్కాలిక దగ్గు తగ్గినా వ్యాధి మాత్రం అలాగే లోపల ఉండిపోతుంది. అసలు ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుందంటేనే అది లోపలేదో తీవ్రమైన సమస్య ఉందని చెప్పడానికి ఒక సూచన. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలి. దగ్గు వచ్చిన సందర్భాల్లో సాధారణంగా యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ మందులు, శ్వాసనాళాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్స్, తెమడను బయటకు తెచ్చే మందులైన ఎక్స్పెక్టరెంట్స్ వంటి మందులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవిరి పట్టడం కూడా దగ్గు నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వృద్ధాప్యంలో దగ్గు ఎడతెరిపిలేకుండా వస్తుంటే కేంద్ర నాడీ వ్యవస్థలో దగ్గును ప్రేరేపించే కేంద్రాన్ని ఉపశమింపజేయడానికి కోడిన్ వంటి మందులు ఉపయోగిస్తారు. వయసును బట్టి.. దగ్గు కనిపించినప్పుడు రోగి వయసును బట్టి కూడా దాని కారణాన్ని అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు... ►పిల్లల్లో (ఇన్‌ఫాంట్స్ మొదలుకొని ఐదేళ్ల వరకు) దగ్గు వస్తుంటే అది ఏదైనా బయటి పదార్థం (ఫారిన్‌బాడీ) ఊపిరితిత్తుల్లోపలికి వెళ్లడం వల్ల కావచ్చునని డాక్టర్లు అనుమానిస్తారు. అంటే... సాఫ్ట్టాయ్స్లో ఉండే నూగు, రగ్గుల్లో ఉండే నూలు, దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చే అలర్జీ వల్ల దగ్గు రావచ్చు. ►గొంతు, ముఖంలో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్‌లు, శ్వాసనాళంలోని కింది భాగమైన బ్రాంకైలలో వైరల్ ఇన్ఫెక్షన్తో దగ్గు రావచ్చు. ►పిల్లల్లో బోర్డెటెల్లా పెర్ట్యుసిస్ అనే బ్యాక్టిరియమ్ ఇన్ఫెక్షన్ వల్ల నిరంతరాయం దగ్గు రావచ్చు. దీన్నే మనమంతా ‘కోరింత దగ్గు’ (ఊఫింగ్ కాఫ్) అంటుంటాం. అంతేకాదు... మరికొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా దగ్గురావచ్చు. ►పిల్లల్లో గుండె కవాటాలు, గుండె గోడల్లోని చిల్లులకు సంబంధించిన వ్యాధులు (వీఎస్డీ, ఏఎస్డీ, పీడీఏ) వంటివి ఉన్నప్పుడు కూడా దగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆయాసం కూడా ఉంటుంది. కొందరు పిల్లలు నీలంగా మారిపోతుంటారు. ఇలా నీలంగా మారే లక్షణాన్ని ‘సైనోసిస్’ అంటారు. దగ్గుతో పాటు ఈ లక్షణం కనిపిస్తే దాన్ని గుండె జబ్బుగా అనుమానించి తక్షణం చికిత్స అందించాలి. ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లో... దగ్గు ఎక్కువగా వస్తుంటే అలర్జీ వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయాయేమో అని అనుమానించాలి. ఎందుకంటే... అలర్జీ కారణంగా వచ్చే ఆస్తమాలో పిల్లికూతల (వీజింగ్) కంటే మొట్టమొదటగా దగ్గు కనిపిస్తుంటుంది. పెద్దల్లో వచ్చే దగ్గు... పొగతాగడం వల్ల : పొగతాగేవారిలో ఊపిరితిత్తులోకి అనేక విషపూరితమైన రసాయనాలు వెళ్తాయి. పొగతాగడం అలవాటయ్యాక తొలి సిగరెట్లోలా వెంటనే దగ్గు రాకపోయినా, సుదీర్ఘకాలం పొగతాగిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల దగ్గు వస్తూ నల్ల రంగులో తెమడ కూడా పడుతుంటుంది. అలర్జీతో : పెద్దల్లో తగ్గు వస్తుంటే అది అలర్జీ వల్ల అయి ఉంటుందని అనుమానించాలి. ఇన్ఫెక్షన్లతో : టీబీ వ్యాధి ఉన్నవారిలో దగ్గు ప్రధానంగా కనిపిస్తుంది. మన జనాభాలో 75 శాతం నుంచి 85 శాతం మంది దేహాల్లో టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనలోని వ్యాధి నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) వల్ల అది నిర్వీర్యంగా అలా ఉండిపోతుంది. కాని... కొందరిలో ఏవైనా ఇన్ఫెక్షన్లతో వ్యాధినిరోధక శక్తి లోపించినప్పుడు టీబీ వ్యాధి బయటపడుతుంది. అయితే టీబీ ఉన్న ప్రతివారికీ అలా ఎడతెరిపి లేకుండా దగ్గు రాదు. అప్పుడప్పుడు మాత్రమే దగ్గు వస్తూ, కొందరిలో తెమడ పడుతుంది. అయితే సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత (టెంపరేచర్) పెరుగుతుంది. ఈ మూడు లక్షణాలు కనిపిస్తూ సాయంత్రం వేళ జ్వరం కనిపిస్తున్నప్పుడు అది టీబీ వ్యాధి కావచ్చేమోనని అనుమానించాలి. అంతేకాదు... టీబీ కనిపించిందంటే... వారిలో వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి హెచ్ఐవీ లాంటి కారణాలేమైనా ఉన్నాయా అని తగిన పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. నిమోనియా: ఈ కారణంగా వచ్చే దగ్గుతో పాటు తెమడ ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో పడవచ్చు. కొన్ని రకాల మందులు : పెద్దలకు హైబీపీ తగ్గించే కొన్ని మందులు వాడుతున్నప్పుడు వారిలో కొందరిలో దగ్గు కనిపించవచ్చు. ఈ మందులు ఆపగానే దగ్గు తగ్గిపోతుంది. అలాంటప్పుడు వారికి మందులు మార్చాల్సి ఉంటుంది. వృద్ధుల్లో... వయసు పెరుగుతున్న కొద్దీ మనలో తెమడను బయటకు పంపించే శక్తి (కాఫ్ రిఫ్లక్స్) తగ్గుతుంది. దాంతో తెమడ శ్వాసనాళంలోనే ఇరుక్కుపోవడంతో వృద్ధుల్లో దగ్గు చాల సాధారణంగా కనిపిస్తుంటుంది. నివారణ ఇలా... ►మన పరిసరాలను, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ►పొగతాగే దురలవాటును పూర్తిగా మానేయాలి. ►సరిపడని వారు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి. ►పక్కబట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి. ►పుస్తకాల అరలను సాధ్యమైనంతవరకు మూసి ఉంచాలి ►వీలైనంత వరకు ఘాటైన వాసనలు వచ్చే సుగంధద్రవ్యాలు (పెర్ఫ్యూమ్స్)ను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలతో దగ్గునుంచి దూరంగా, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బ్యూటీరియా
మేకప్ చేసుకుంటున్నారు బాగానే ఉంది. వాటి ఎక్స్పైరీ డేట్లు చూస్తున్నారా? పోనీ.. వాడిన బ్రష్‌లను, స్పాంజ్‌లను ఎన్నడైనా శుభ్రం చేశారా? లేదంటున్నారా! అయితే మీరు చిక్కుల్లో పడినట్లే. ఎందుకంటే.. ఇలాటి వాటిల్లో హానికారక బ్యాక్టీరియాలు బోలెడు ఉండిపోతాయి అంటోంది ఓ తాజా అధ్యయనం! మేకప్‌కు ఉపయోగించే వాటిల్లో కనీసం 90 శాతం వాటిల్లో స్టాఫైలోకాకస్ ఔరియస్, ఈ–కోలీ, సిట్రో బ్యాక్టర్ ఫ్రెండీ వంటి హానికారక బ్యాక్టీరియా ఉంటుందని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆస్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నారు. ఇవన్నీ ఒకసారి వాడిన మేకప్ సామగ్రిలో మాత్రమే ఉండేవే అయినప్పటికీ, అలా ఉన్నట్లు తెలియకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశముందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్త అమ్రీన్ బషీర్ తెలిపారు. అధ్యయనం కోసం తాము లిప్‌స్టిక్, లిప్‌గ్లాస్, ఐ లైనర్, మస్కారాలను ఎంచుకున్నామని, వీటిల్లో నీటి మోతాదు ఎంత ఎక్కువ ఉంటే బ్యాక్టీరియా సంతతి అంత ఎక్కువగా ఉన్నట్లు తెలిసిదని చెప్పారు. ఫౌండేషన్, కాంటూరింగ్ల కోసం వాడే బ్లెండర్ స్పాంజిల్లో పరిస్థితి మరీ దారుణమని అన్నారు. మొత్తమ్మీద తాము 467 ఉత్పత్తులను పరిశీలించామని వీటిల్లో 96 లిప్‌స్టిక్‌లు కాగా, 92 ఐ లైనర్లు, 93 మస్కారా ప్యాకెట్లతోపాటు 107 లిప్ గ్లాస్లు, 79 బ్లెండర్ స్పాంజిలు ఉన్నాయని వివరించారు. మేకప్ ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులు అస్సలు ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ఒక ప్రశ్నపత్రం ద్వారా తాము మేకప్ సామాగ్రిలో బ్యాక్టీరియా ఎలా చేరుతోందో తెలుసుకునే ప్రయత్నం చేశామని, అందుకు వాడకందారులదే ఎక్కువ బాధ్యతని తేలిందని అన్నారు. ప్రతి మేకప్ సామగ్రికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని, వినియోగదారులు పట్టించుకోకపోవడం వల్ల ఆ సమయం తరువాత బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుందని అమ్రీన్ వివరించారు. మీరు ఉండే ప్రాంతా న్ని బట్టి ఈ విషయాన్ని తయారీదారులు తెలియజేసే పద్ధతి ఉంటుంది. అమెరికాలోనైతే ప్యాకేజింగ్‌పైనే ఈ సమాచారం ప్రింట్ చేస్తారు. 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం చాలామంది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తరువాత కూడా మేకప్ సామగ్రిని చెత్తబుట్టలోకి పడేయడం లేదని వెల్లడైంది. బ్లెండర్ స్పాంజిల విషయంలో తేలిందేమిటంటే.. 93 శాతం మంది వీటిని ఎప్పుడూ శుభ్రం చేసుకోరూ అని! నేలపై పడిన తరువాత కూడా వాటిని అలాగే వాడేస్తామని 65 శాతం మంది ఒప్పుకున్నారు. వీలైనంత వరకూ ఈ బ్లెండర్ స్పాంజిలను గోరువెచ్చటి నీటిలో, సబ్బులతో శుభ్రం చేసుకోవడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పరిశోధన వివరాలు అప్లయిడ్ మైక్రోబయాలజీ తాజాసంచికలో ప్రచురితమయ్యాయి. -
డెంగీ దోమల్లో వ్యాధి వ్యాప్తిని తగ్గించే ‘వోబాకియా’ బ్యాక్టీరియా!
ఈ సీజన్లో డెంగీ మన తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఎంతగా గడగడలాడించిందో తెలుసు కదా. ఇక్కడే కాదు... మనలాంటి వేడి వాతావరణం ఉండే ఎన్నో దేశాల్లో డెంగీ వేధిస్తోంది. డెంగీ వ్యాధిని అదుపు చేయడానికి ఒక మార్గాన్ని కనుకున్నారు మలేషియాలోని కౌలాలంపూర్ పరిశోధకులు. అక్కడి పరిశోధకులే కాదు... ఆస్ట్రేలియా, వియత్నాం వంటి దేశాలతో పాటు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, మెల్బోర్న్ వంటి విద్యాసంస్థల్లో జరిగిన పరిశోధనల కారణంగా మానవాళికి మేలు చేసే ఒక శుభవార్త లోకానికి తెలిసింది. పరిశోధనశాలల్లో ఉన్న డెంగీని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిపై్ట దోమల్లోకి ‘వొబాకియా (Wolbachia) అనే బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేసి వాటిని బయటి వాతావరణంలోకి విడుదల చేశారు. ఆ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అవే దోమల్లో ప్రత్యుత్పత్తి జరిగాక పుట్టిన తర్వాతి తరం దోమల్లో డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఈ కారణంగానే ఆ మరుసటి ఏడాది అక్కడ 40 శాతం తక్కువగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉష్ణమండల (వాతావరణంలో వేడిమి 36 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న) ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి గణనీయంగా తగ్గడం గుర్తించిన పరిశోధకులు... ఈ పరిశోధన ఫలితాలు ‘కరంట్ బయాలజీ’ అనే జర్నల్‌లో నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఈ వొబాకియా పరిశోధనలు డెంగీకి మాత్రమే పరిమితమయ్యాయి. ఇలాంటి హానిచేయని బ్యాక్టీరియాలను ఉపయోగించి మరిన్ని వ్యాధులను అదుపు చేసే విధంగా పరిశోధనలు సాగుతున్నాయి. -
గ్యాస్ట్రిక్ అల్సర్ నయమవుతుందా?
నా వయసు 35 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి అల్సర్ అన్నారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణాశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ►80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి ►చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది ►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ►మద్యపానం, పొగతాగడం ►వేళకు ఆహారం తీసుకోకపోవడం ►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ►కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ►నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ... జాగ్రత్తలు: ►పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ►మద్యపానం, ►పొగతాగడం అలవాట్లు మానేయాలి ►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ►కంటినిండా నిద్రపోవాలి ►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఆటిజమ్ తగ్గుతుందా? మా బాబుకు మూడున్నర ఏళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో ఈ సమస్యకు చికిత్స అందుబాటులో ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడే వారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ∙వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారికి స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలను బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ తిరగబెట్టడం మామూలే. కారణాలు: ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే!
మనం రోజూ తినే ఇడ్లీలు, దోసెలు, రోజూ తాగే మజ్జిగ కూడా మందులా ఉపయోగపడతాయంటే నమ్మగలరా? ఎన్నోరకాల జబ్బుల్నీ నయం చేస్తాయి కూడా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పూర్తిగా వాస్తవం. అలాగే కాద్దిసేపు వదిలేస్తే పులవడానికి అవకాశమున్న ఇడ్లీపిండి, దోసెపిండి, మజ్జిగ వంటి వాటిల్లో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే మనం ప్రోబయోటిక్స్ అని పిలుస్తాం. ప్రోబయోటిక్స్ ఇచ్చే సందర్భాలు... యాంటీబయాటిక్స్ వాడినప్పుడు: డాక్టర్లు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రయిబ్ చేసినప్పుడు అవి మనలోని హాని చేసే సూక్ష్మజీవులతో పాటు మేలు చేసేవాటినీ చంపేస్తాయి. దాంతో మనలో కొన్ని రకాల సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అంటే కడుపులో గ్యాస్ పెరగడం, మజిల్ క్రాంప్స్, డయేరియా వంటివి. మనలో ఉండే ప్రోబయాటిక్స్ మన దేహానికి అవసరమైన కొన్ని విటమిన్లు స్వాభావికంగానే అందేలా చేస్తాయి. అయితే యాంటీబయాటిక్స్ కారణంగా విటమిన్లు కూడా అవసరమైన మేరకు అందని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అందుకే ఈ పరిణామాన్ని నివారించడానికి యాంటీబయాటిక్స్‌తో పాటు కొన్ని విటమిన్లు, ప్రోబయాటిక్స్ డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. డయేరియాతో బాధపడేవారికి: కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా నీళ్ల విరేచనాలు అవుతున్నవారికి సైతం ప్రో–బయాటిక్స్ ఇస్తారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్): ఈ సమస్య ఉన్నవారిలో విరేచనం సరిగా కాదు లేదా అదేపనిగా విరేచనాలు కావచ్చు. తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య ఉన్నవారికి ప్రో–బయాటిక్స్ బాగా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్: అల్సరేటివ్ కొలైటిస్ లేదా క్రోన్స్ డిజీస్ ఉన్నవారికి ప్రో–బయాటిక్స్ మేలు చేస్తాయి. హెలికోబ్యాక్టర్ పైలోరీ: కొందరిలో పేగులో పుండు పడి, పేగుకు రంధ్రం పడేలా చేసే హెలికోబ్యాక్టర్ పైలోరీ కారణంగా కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సైతం ప్రో–బయాటిక్స్ మంచి మేలు చేస్తాయి. ఇడ్లీ, దోసె, మజ్జిగలు మందెలా అవుతాయంటే... మన చుట్టూ సూక్ష్మజీవులైన అనేకరకాల బాక్టీరియా ఉంటుంది. మన చుట్టే కాదు.. మన చర్మంపైనా, నోట్లో, గొంతులో, మన జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. ఇలా మన జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా మన ఆహారాలు జీర్ణం కావడానికి ఉపయోగపడటంతో పాటు కొన్ని రకాల వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే... పరోక్షంగా అవి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ మనకు మేలు చేస్తుంటాయన్నమాట. మన ఆహార సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రో–బయాటిక్స్‌ను తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీపిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ వాయి దింపుతాం. మన దక్షిణభారతీయులు ఇడ్లీ, దోసె తింటే... గుజరాత్ వంటి చోట్ల ధోక్లా అనే వంటకాన్ని కూడా పిండి పులిసే వరకు ఉంచి చేసుకుంటారు. డాక్టర్ శరత్ చంద్ర జి. మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్. -
వంటగదిని శుభ్రం చేశారా!
దీపావళి పండగకు ముందుగా ఇళ్లు మొత్తం శుభ్రం చేసుకోనిదే మనసుకు సంతోషం అనిపించదు. అమ్మ, బామ్మ.. ఇంట్లోని ప్రతీ గదిని వరసగా శుభ్రం చేసుకుంటూ దుమ్మ దులపడాన్ని మన చిన్ననాటి రోజుల నుంచి చూస్తున్నదే. శుభ్రం చేసిన తర్వాత కొత్త హంగులతో అలంకారాలతో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఇంటి శుభ్రత లేకుండా పండగ పనులేవీ ముందుకు కదలవు. అన్ని గదుల కన్నా వంటగది శుభ్రత కష్టంగా అనిపిస్తుంటుంది. సులువుగా, మరింత శుభ్రంగా వంటగదిని ఎలా ఉంచాలో చూద్దాం... ►బేకింగ్ సోడా, డిష్‌వాషింగ్ సోప్, వేడినీళ్లు, వెనిగర్, కిచెన్‌ను శుభ్రం చేసే టవల్.. ముందు వీటిని సిద్ధం చేసుకోవాలి. వీటితో కిచెన్ జిడ్డును వదిలించడంలో పని సులువు అవుతుంది. ►వంటగదిలో ఎప్పుడూ ఉండే సమస్య క్రిములు. అలాగే చిన్న చిన్న పురుగుల నుంచి బొద్దింకల వరకు అప్పుడప్పుడైనా కనిపిస్తుంటాయి. వీటికి విరుగుడుగా షాపుల్లో పెస్ట్ కంట్రోల్ స్ప్రే లభిస్తుంది. కిచెన్ షెల్ఫ్‌లో వంటసామానంతా పక్కన పెట్టేసి ఆ పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేయాలి. ►వెచ్చని నీటిలో వెనిగర్, డిష్వాషర్ సోప్ కలుపుకోవాలి. సిద్ధంగా ఉంచుకున్న టవల్ని ఆ నీళ్లలో ముంచి, నీళ్లు కారకుండా పిండి దాంతో షెల్ఫ్‌లు, కప్‌బోర్డ్స్ ఉంటే ఆ పై భాగాలను శుభ్రంగా తుడవాలి. దీంతో దుమ్ము, జిడ్డు మరకలన్నీ శుభ్రం అవుతాయి. ►ఆ తర్వాత డబ్బాల్లో మూడు నాలుగు నెలలుగా ఉండిపోయిన దినుసులు ఉంటాయి. ముఖ్యంగా మసాలా దినుసులు.. మరికొన్ని డబ్బాల్లో వాడని, పురుగు పట్టినవి కూడా ఉంటాయి. వాటిని పూర్తిగా తీసేయాలి. ►స్టోర్ నుంచి తెచ్చి, ఇంకా వాడని సరుకుల ప్యాకెట్లపైన ఉన్న తేదీని బట్టి సరిచూసుకొని, షెల్ఫ్‌ల్లో సర్దుకుంటే వాడడమూ సులువు అవుతుంది. ►ఫ్రిజ్‌ను శుభ్రం చేయడం పెద్ద పని. వారానికి ఒకసారి శుభ్రం చేసినా లోపలిభాగంలో కొన్ని పదార్థాల మరకలు అలాగే ఉండిపోతుంటాయి. వెనిగర్ కలిపిన వెచ్చని నీటిలో టవల్‌ను ముంచి ప్రిజ్ లోపలి భాగం అంతా గట్టిగా రుద్దుతూ తుడవాలి. వెనిగర్ లేదంటే నిమ్మరసం కలిపిన నీటితో అయినా తుడిచి, మళ్లీ పొడి టవల్‌తో తుడవాలి. ►ఉన్న వస్తువులన్నింటితో కిచెన్ షెల్ఫ్‌లను నింపేయకుండా అంతగా ఉపయోగించని వస్తువులను పైషెల్ఫ్లో సర్దేయాలి. ఏవి ఎంత వరకు అవసరమో ముందే అవగాహన ఉంటుంది కాబట్టి, ఆ మేరకు మాత్రమే సర్దుకుంటే వంటగది పండగకు శుచిగా, అందంగా కనిపిస్తుంది. -
ఈ ఇంటిదొంగలను పట్టేద్దామా?!
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెత అందరికీ తెలిసిందే. మన ఇంట్లోనే దాగి ఉండి... మనకు హాని చేసే ఈ విషాల విషయంలో అది అక్షర సత్యం. మనం నిరపాయకరంగా భావించే అనేక చోట్ల ఈ విషాలు నక్కి ఉంటాయి. మన నట్టింట్లో అనుక్షణం నడయాడుతుంటాయి. మనింట్లో మనకే తెలియకుండా పొంచి ఉండి కాటేసి చిమ్మే అనేక విషాలనూ... వాటికి విరుగుడు మార్గాలను తెలుసుకుందామా. వాటి గురించి ఒక అవగాహన కల్పించుకోవడం కోసమే ఈ కథనం. ఇటీవల మన ఇండ్లలోకి కొత్తరకం పాత్రలు వస్తున్నాయి. లోహం అయితే చాలా బరువుగా ఉండటం వల్ల ఈ తరహా పాత్రలు ఇప్పుడు వినియోగదారులను ఆకర్శిస్తున్నాయి. నిజానికి చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్ ఆరోగ్యానికి అంత అందమైనవి కాదు. ఈ పాత్రలు ‘మెలామైన్’ అనే ప్లాస్టిక్లాగానే ఉండే ఒకరకం పదార్థంతో తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే వేడికి ఆ మెలామైన్ అణువులు... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా ఒంట్లోకి చేరిపోతుంటాయి. మెలమైన్ వల్ల కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లో సైతం ప్రచురితమైంది. ఈ పదార్థం వల్ల కిడ్నీఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతో పాటు క్యాన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు సాక్షాత్తూ డబ్ల్యూహెచ్ఓ నివేదికలూ పేర్కొంటున్నాయి. కొంతమంది నేరుగా ఈ బౌల్స్‌ను మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేస్తుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదంటూ అమెరికాలో ఔషధాలకు అనుమతి ఇచ్చే అత్యున్నత ప్రమాణాల సంస్థ అయిన ఎఫ్‌డీఏ గట్టిగా సిఫార్సు చేస్తోంది. దీనివల్ల హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ప్రభావం ఉంటుందట. దాంతో గర్భధారణ సమస్యలు వస్తాయంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక పురుషుల్లోనూ... వీర్యకణాల సంఖ్య తగ్గడం, వాటి కదలికలు మందగించడం, హార్మోన్ల స్రావాలు తగ్గడం జరుగుతాయి. చాలామందిలో డయాబెటిస్ వచ్చే ముప్పు విపరీతంగా పెరుగుతున్నట్లుగా కూడా ఒక అధ్యయనంలో తేలింది. నివారించండిలా: వేడివేడి సూప్‌లూ, కూరలు, ఇతరత్రా పదార్థాలను వడ్డించాలనుకుంటే పింగాణీ బౌల్స్ లేదా పింగాణీ ప్లేట్లే మంచివి. వాటిలో తినడమే ఆరోగ్యదాయకం. మన సోఫాల్లో మరెన్నో విషపదార్థాలు... మంటలు అంటుకున్నా సురక్షితంగా ఉండేలా ఇటీవల ఆధునికమైన కొన్నిరకాల సోఫాలను రూపొందిస్తున్నారు. వీటిని ఫైర్ రెసిస్టెంట్ పదార్థాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలను ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటారు. ఈ సోఫాలపై మనం చేతులు ఆనించినప్పుడు ఈ రసాయనాలు చేతులపైకి చేరతాయి. అవే చేతులతో మనం ఏవైనా ఆహారపదార్థాలను తిన్నప్పుడు... ఆ విషాలు ఒంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ విషాలు మన గ్రంథుల వ్యవస్థ (ఎండోక్రైన్ సిస్టమ్)ను దెబ్బతీస్తాయి. ఫలితంగా ఎంజైముల, జీవరసాయనాల సమతౌల్యం దెబ్బతింటుంది.ప్రధానంగా ఈ దుష్ప్రభావం ప్రధానంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడే అవకాశం ఉంది. దాంతో కొన్ని రకాల ప్రత్యుత్పత్తి సంబంధిత వ్యాధులు రావచ్చు. ఒక్కోసారి క్యాన్సర్లు వచ్చేందుకూ అవకాశాలున్నాయి. నివారించండిలా: సోఫాలను క్రమం తప్పకుండా వాక్యూమ్ క్లీనర్‌తో తరచూ శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా శుభ్రపరిచే సమయంలో ఎయిర్‌ఫిల్టర్ ఉపయోగించడం మరింత మంచిది. ఇలాంటి సోఫా మీద కూర్చున్న తర్వాత ఏదైనా తినాల్సి వస్తే... చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తినేముందు నోటిని నీళ్లతో పుక్కిలించడం అవసరం. ప్రకాశవంతమైన లైట్లతో ఆరోగ్యానికి ముప్పు మీరు ఇంట్లో రాత్రి నిద్రపోయే సమయంలో పెద్ద లైట్లు అస్సలు వేసుకోకండి. బాగా కాంతి తక్కువగా ఉండే (డిమ్‌గా ఉండే) జీరో బల్బులు మాత్రమే వాడండి. రాత్రివేళల్లో అలముకునే చీకటి కారణంగానే మన మెదడుల్లో... మెలటోనిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఇది స్రవించడం వల్లనే మనకు నిద్ర వస్తుంది. లైట్లు వేసుకుని పడుకోవడం వల్ల మెలటోనిన్ తగ్గుతుంది. దాంతో రాత్రి నిద్ర పట్టదు. ఫలితంగా నిర్ణీత వేళల్లో నిద్రతెప్పించేందుకు మన మెదడులోని వ్యవస్థ అయిన ‘సర్కాడియన్ రిథమ్’ దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపేందుకు చాలా ఆస్కారం ఉంది.నిద్రలేమి వల్ల మహిళల్లోనైతే బ్రెస్ట్ క్యాన్సర్లకు, పురుషుల్లోనైతే ప్రోస్టేట్ క్యాన్సర్లకు అవకాశం ఉంటుంది. అంతేకాదు... పెద్దపేగు, బ్లాడర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ల రిస్క్ పెరుగుతుందని పేర్కొన్న ఈ అధ్యయన ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడిమియాలజీలో ప్రచురితమయ్యాయి. నివారించండిలా: రాత్రి చీకటి అలముకోగానే మెలటోనిన్ స్రవించేలా చేయడం అన్నది ప్రకృతి స్వాభావికంగా చేసిన ఏర్పాటు. దాన్ని బ్రైట్లైట్స్తో దెబ్బతీయవద్దు. రాత్రివేళల్లో చాలా డిమ్ లైట్స్ మాత్రమే ఉపయోగించండి. కర్టెన్ల వెనక కాలకూటం గతంలో మన ఇళ్లలో బట్టలతో చేసిన కర్టెయిన్లు వాడేవాళ్లం. కానీ ఇటీవల ఒక రకం ప్లాస్టిక్‌తో చేసిన బ్లైండ్లను వాడటం పరిపాటి అయ్యింది. చాలా కాలం పాటు మన్నికతో ఉండటానికి మనం ప్లాస్టిక్ వంటి పదార్థంతో రూపొందించిన ఈ తరహా కర్టెన్లను వాడుతున్నాం. ఇక బాత్రూమ్లలోనైతే నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం మనం వాడే షవర్ కర్టెయిన్లన్నీ తప్పనిసరిగా వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారవుతున్నాయి. వాటిని వాటర్‌ప్రూఫ్‌గా తయారు చేయడానికి విధిగా ఒకరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. ఈ ప్లాస్టిక్ కర్టెన్లు సాధారణ బట్టల్లాగే ఎటు పడితే అటు వంగేందుకు వీలుగా ‘థాలేట్’ అనే పదార్థంతో వీటిని తయారుచేస్తారు. ఈ షవర్ కర్టయిన్లలో మాత్రమే కాకుండా... మన ఇండ్లలో అలంకరణ కోసం ఉపయోగించే వాల్పేపర్లు, అనేక రకాల ఫ్లెక్సీలు కూడా ఈ పదార్థంతోనే తయారుచేస్తుంటారు. ఈ థాలేట్ అనేది పురుషుల సెక్స్ హార్మోన్‌పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వీటి వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత (స్పెర్మ్ క్వాలిటీ) బాగా దెబ్బతింటుంది. ఇక ఈ కర్టెయిన్ల మీదుగా వీచే గాలి అలర్జీలను ప్రేరేపిస్తుంది. దాంతో అనేక శ్వాససంబంధ సమస్యలు రావడం జరగవచ్చు. దీర్ఘకాలంలో ఆస్తమా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. మహిళల విషయానికి వస్తే... ఈ తరహా వాల్పేపర్లు, గృహాలంకరణ వస్తువులు, కర్టెయిన్లు ఉన్న ఇండ్లలో గర్భవతుల ఉంటే ఇవి వారికి మరింత ప్రమాదకరం. ఇవి ఉపయోగించడం అంటే... పుట్టబోయే పిల్లలు ఇంట్లోకి రావడానికి ముందే వారి ఆరోగ్యకరమైన చిన్ని అవయవాలను పూర్తిగా కలుషితం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడమే. ఇలాంటి కర్టెయిన్లు, వాల్పేపర్లు, అలంకరణ సామగ్రి ఉపయోగించే ఇళ్లలో పెరిగిన పిల్లల్లో ఏడీహెచ్‌డీ వంటి రుగ్మతలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాలా అధ్యయనల్లో తేలింది. నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లల్లో ఈ ధోరణులు పెరిగే అవకాశాలు ఎక్కువని మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల ఫలితాలు తెలుపుతున్నాయి. నివారించండిలా: ఇంట్లోని డోర్ కర్టెన్లు, షవర్ కర్టయిన్ల కోసం వీలైనంత వరకు నిరపాయకరమైన మెటీరియల్‌తో తయారు చేసినవే వాడండి. దెబ్బతిన్నప్పుడు మార్చుకోవడం శ్రమ అయినా సరే... కాటన్‌తో తయారైన కర్టెయిన్లనే వాడండి. ఫర్నిచర్‌గా, అందంగా ఉండే ప్లాస్టిక్ పీవీసీతో తయారు చేసిన వాటికంటే కలపతో తయారు చేసిన వాటినే వాడండి. నాన్‌స్టిక్ పాత్రలతో చాలా ప్రమాదం... మనం వంట వండినప్పుడు అది పాత్రల అడుగున అంటుకుపోనివ్వకుండా చేసే నాన్‌స్టిక్ తరహా గిన్నెలు, పెనం వంటి గృహోపకరణాలకు ఇటీవల బాగా ప్రాచుర్యం పెరిగింది. వీటిని ‘నాన్‌స్టిక్ కుక్వేర్’గా అభివర్ణిస్తుంటాం. నాన్‌స్టిక్ కిచెన్వేర్ ఆరోగ్యానికి కీడు చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తరహా వంటపాత్రల్లో వండిన వంటలను తిన్న పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, డయాబెటిస్ వంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని ఈ అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... దీర్ఘకాలంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతౌల్యత వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి గృహోపకరణాలు ఉపయోగించే వారిలో సంతానలేమి అంటే... పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోవడం వంటి అనర్థాలు కలుగుతాయని ‘ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్’ హెల్త్ జర్నల్‌లోని నివేదికలు చెబుతున్నాయి. నివారించండిలా టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్‌స్టిక్ కుక్‌వేర్‌కు బదులుగా సాధారణ స్టెయిన్లెస్ స్టీల్ వంటివి ఉపయోగించడం మంచిది. ఇంట్లో గర్భవతి ఉన్నప్పుడు ఈ నాన్‌స్టిక్ గృహోపకరణాలను ఉపయోగించడం మానేయాలి. మరీ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండాల్సిన వంటకాలకు ఈ నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ను ఉపయోగించకపోవడమే మంచిది. వంటింట్లోకి గాలి ధారాళంగా రావాలి ఇంటి నిర్మాణం సమయంలో వంటింటికి చాలా మంది చాలా తక్కువ స్థలాన్ని కేటాయిస్తారు. ఇదెంతో ప్రమాదకరం. కిచెన్‌లోకి గాలి బాగా వచ్చేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా కిరోసిస్ స్టవ్‌లు ఉపయోగించేవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కిరోసిన్ మండే సమయంలో కొన్ని హానికర వాయువులు వెలువడతాయి. ఇక కట్టెల పొయ్యి అయితే కార్బన్ డై ఆక్సైడ్‌తోపాటు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు వస్తాయి. వీటివల్ల ప్రాణాపాయం కూడా తప్పని పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. అందుకే కిచెన్ తగినంత విశాలంగా, గాలి ఆడేలా ఉండాలి. నివారించండిలా వంటగది విశాలంగా ఉండేలా చూసుకోండి. కిచెన్‌ను అనవసరమైన వస్తువులతో దాన్ని నింపేయవద్దు. బొగ్గులు, నిప్పుల మీద చేసే వంట... కిచెన్‌లో వద్దు. ఆరుబయటే చేయండి. బాత్రూమ్లో హానికర రసాయనాలెన్నో హానికరమైన రసాయనాలకు బాత్రూమ్ కూడా ఒక నెలవే. అక్కడ ఉపయోగించే షాంపూలలో హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇక సువాసన వచ్చేందుకు గాను కొన్ని రకాల సబ్బుల్లో చేర్చే సుగంధ ద్రవ్యాల వల్ల కూడా చర్మంపై అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు రావచ్చు. నివారించండిలా రసాయనాలు తక్కువగా ఉండే స్వాభావిక పదార్థాలతో చేసిన సబ్బులు, షాంపులు ఉపయోగించండి. ఇంటిబయటే చెప్పులూ, బూట్లు, సాక్స్... ఒకటి రెండు రోజులు అవే వేసుకుంటే సాక్స్ (మేజోళ్లు) దుర్వాసన వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కాలిని పట్టుకుని ఉండే మేజోడులో బ్యాక్టీరియా పెరగడం వల్ల ఈ దుర్వాసన వస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇంట్లోకి ప్రవేశించాక సాక్స్ విప్పితే ఆ బ్యాక్టీరియా ఇంట్లోకీ వచ్చేసే అవకాశాలుంటాయి. అందుకే పాదరక్షలు, ప్రధానంగా సాక్స్ ఇంటి బయటే వదలాలి. ఉతికి పొడిగా మారాక మాత్రమే వాటిని ఇంట్లోకి తీసుకురావాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్పులు, పాదరక్షలు, షూస్, సాక్స్ స్టాండ్ ఇంటి బయట ఉండటమే మంచిది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతోనే మన ఇంట్లోనే మనకు తెలియకుండా ఉండే అనేక రకాల విషాలను, హాని చేసే ముప్పులను నివారించుకోవచ్చు. డా‘‘ ఎం. రామకృçష్ణ, సీనియర్ జనరల్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
పిల్లలూ... పెద్దలూ... బ్రష్ చేసుకోండిలా!
మనం బ్రషింగ్ ప్రక్రియను చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ మంచి బ్రషింగ్ అలవాట్ల వల్ల దాదాపు జీవితకాలమంతా మన దంతాలను రక్షించుకోవచ్చు. జీవితాంతం మన స్వాభావిక దంతాలతోనే హాయిగా నమిలి తింటూ, ఎన్నెన్నో రుచులు ఆస్వాదించవచ్చు. ఇలా రోజూ మంచి బ్రషింగ్ అలవాట్లను అనుసరిస్తే... భవిష్యత్తులో దంతవైద్యం కోసం వెచ్చించాల్సిన ఖర్చులూ తగ్గుతాయి. అందుకే వీటిని అనుసరించండి. దంతాలు మెరిపిస్తూ మంచి చిరునవ్వుతో హాయిగా ఉండండి. పిల్లల బ్రషింగ్ కోసం సూచనలివి... ►చంటి పిల్లల తల్లులు మొదట తల్లులు తమ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చాలా సందర్భాల్లో తల్లులు, పిల్లలు ఒకే చెంచాను ఉపయోగిస్తుంటారు. అందువల్ల తల్లుల నోట్లోని బ్యాక్టీరియా పిల్లల లాలాజలంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. అందుకే తల్లులు జాగ్రత్తగా ఉండాలి. తమ కోసం విడిగా చెంచాను ఉంచుకోవాలి. పిల్లల కోసం ఉద్దేశించిన చెంచాను ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. ►ప్రతిసారీ పిల్లలకు పాలుపట్టాక వాళ్ల నోటిని తడి గుడ్డతో గానీ, మామూలు నీళ్లలో ముంచిన దూదితో గానీ శుభ్రం చేయాలి. పాలపళ్లు వచ్చాక టూత్‌బ్రష్‌తో పళ్లు శుభ్రం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. రెండేళ్ల వయసు కంటే ముందే ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ వాడాలనుకుంటే మొదట డెంటిస్ట్‌ను కలిసి వారి సలహా తీసుకోవాలి. ►పిల్లలు ఊయగలరు, టూత్‌పేస్ట్‌ను మింగబోరని నిర్ధారణ అయ్యాక వాళ్ల టూత్‌బ్రష్‌పై బఠాణీగింజంత టూత్‌పేస్ట్ వేసి వాళ్లు పళ్లు తోముకునేలా చేయాలి. ►చిన్నారులకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులే బ్రష్ చేస్తుండటం మంచిది. ►చక్కెర కలిపిన జ్యూస్‌ల వంటి ద్రవాహారాలను పాల బాటిళ్లలో ఇవ్వవద్దు. ►పిల్లలు నిద్రపోవడానికి ముందే పాలుపట్టడం పూర్తిచేయండి. వాళ్లు నిద్రపోయాక ఎట్టిపరిస్థిల్లోనూ బాటిల్‌ను అలాగే నోట్లో ఉంచవద్దు. బాటిల్ నోట్లో పెట్టేసి మరచిపోవద్దు. దాని వల్ల పళ్లన్నీ పుచ్చిపోయి ‘నర్సింగ్ బాటిల్ కేరిస్’ అనే పళ్లసమస్య వచ్చే ప్రమాదం ఉంది. ►పిల్లల మొదటి పుట్టినరోజు నాటి నుంచే... కప్స్ సహాయంతో వాళ్లు ఆహారాన్ని చప్పరించి తీసుకునేలా ప్రోత్సహించండి. ►పిల్లలు ఘనాహారం తీసుకోవడం మొదలుపెట్టాక... వారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అలవాటు చేయండి. ఆహారంలో ఆకుకూరలు, పళ్లు, కాయధాన్యాలు ఎక్కువగా తినేలా, ఆహారం తీసుకునేప్పుడు చక్కెర పదార్థాలు తక్కువగా తినేలా చూడండి. తినగానే నోరు పుక్కిలించేలా జాగ్రత్త తీసుకోండి. ►ఇక బ్రషింగ్ విషయానికి వస్తే... పిల్లలు ఉపయోగించే బ్రష్ మృదువైన బ్రిజిల్స్ ఉన్నదై ఉండాలి. ►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకునేలా వారికి బ్రషింగ్ నేర్పాలి. ►బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోవడం నేర్పాలి. రఫ్‌గా బ్రష్ చేసుకోవడం పిల్లల చిగుళ్లకు హాని జరగవచ్చు. ►పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవడం వారికి నేర్పాలి. ►పిల్లలు అదేపనిగా బ్రష్‌ను నములుతూ ఉండకుండా చూసుకోవాలి. ఆ అలవాటును ప్రోత్సహించవద్దు. ►బ్రష్ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు నిమిషాల పాటు కొనసాగాలి. మరీ ఎక్కువ సేపు కూడా బ్రషింగ్ చేయకుండా చూడాలి. ►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్‌క్లీనింగ్ కూడా పిల్లలకు నేర్పాలి. ►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దలు బ్రషింగ్ ఎలా చేసుకోవాలంటే... ►పెద్దలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా రెండుమార్లు పళ్లు తోముకోండి. కొందరు రాత్రివేళ బ్రషింగ్ అనవసరం అనుకుంటారు. కానీ మన ఆరోగ్యమంతా చాలాకాలం పాటు బాగుండాలంటే రాత్రి బ్రషింగ్ చాలా అవసరం. ►ఆర్నెల్లకోమారు మీ డెంటిస్ట్‌ను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. ►మీరు బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడండి. ►డాక్టర్లు సూచించే ప్రత్యేకమైన మెడికేటెడ్ టూత్పేస్ట్లు మినహా మిగతా టూత్‌పేస్ట్‌లన్నీ బ్రష్షింగ్ సమయంలో ఘర్షణను (ఫ్రిక్షన్‌ను) తగ్గిస్తాయి. కాబట్టి ఫలానా టూత్‌పేస్ట్ మాత్రమే మంచదని అనుకోకండి. మీకు సంతృప్తి కలిగేదాన్ని ఎంచుకోండి. ఏవైనా దంతసమస్యలు వస్తే డాక్టర్లు ఎలాగూ ప్రత్యేకమైన వాటిని సూచిస్తారు. ►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ►బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోండి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అప్పుడు చిగుళ్లు త్వరగా వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది. ►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి. ►లోపలివైపున బ్రష్ చేసుకోడానికి బ్రష్‌ను నిలువుగా పట్టుకొని పైకీ, కిందికీ మృదువుగా కదిలించండి. ►కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. ►నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి. ►బ్రష్షింగ్ తర్వాత టూత్‌బ్రష్‌ను మృదువుగా రుద్దండి. ►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►ప్రతి మూడు నెలలకు ఓమారు బ్రష్‌ను మార్చేయండి. లేదా బ్రిజిల్స్ వంగినట్లు, దెబ్బతిన్నట్లు కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. ఒకసారి మీకేదైనా జ్వరం వచ్చి తగ్గాక పాత టూత్‌బ్రష్‌ను వెంటనే మార్చండి. దాన్ని అలాగే కొనసాగించకండి. ►పిల్లల బ్రష్‌లైనా లేదా పెద్దలవైనా... బ్రష్ ఉపయోగించాక వాటిని టాయిలెట్ ఉన్న గదిలో ఉంచకూడదు. పక్కన ఆ గది బయట వాటిని విడిగా ఉంచాలి. ఎందుకంటే... మనం ఫ్లష్ చేసే సమయాల్లో టాయిలెట్లో ఉన్న బ్యాక్టీరియా మన బ్రిజిల్స్‌కు అంటుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే వాటిని టాయిలెట్ రూమ్‌లో ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం... మనం బ్రష్ చేసుకున్న తర్వాత అలా తడిగా వదిలేస్తాం. కానీ టవల్‌తో తుడవడం లాంటిది చేసి, అది పొడిబారాకే దాన్ని భద్రపరచుకోవాలి. బ్రష్‌కు క్యాప్లాంటి కేస్లు ఉంటే అది మరింత మంచిది. డాక్టర్ ప్రత్యూష దంత వైద్య నిపుణులు ప్రొఫెసర్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
ఆ మందులు ఆయువు పెంచుతాయా?
మధుమేహంతో బాధపడేవారు నిత్యం వాడే మెట్ఫార్మిన్.. మనిషి ఆయువు పెంచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతరులతో పోలిస్తే మధుమేహంతో ఉన్న వారిలో కేన్సర్ తక్కువగా సోకుతుండటం.. ఎక్కువ కాలం జీవిస్తుండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కారణాలను శోధించే పనిలో పడ్డారు. 2017లో జరిగిన ఓ పరిశోధన ప్రకారం.. ఈ మార్పుతో మెట్ఫార్మిన్కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో మెట్ఫార్మిన్ వాటి ఆయువు పెంచినట్లు గుర్తించారు. అయితే ఈ ఫలితాలు ఒకే తీరు ఉండకపోయేవని చెబుతున్నారు. కారణం ఏమిటా.. అని వెతికితే మన కడుపు/పేవుల్లోని బ్యాక్టీరియా విడుదల చేసే అగ్మాటిన్ అనే రసాయనం మెట్ఫార్మిన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో తాము మరిన్ని విస్తృ్తత పరిశోధనలు చేయనున్నామని, నమూనాల ఆధారంగా వ్యక్తుల పేగుల్లో ఉండే బ్యాక్టీరియా రకాలను అంచనా వేసి కంప్యూటర్ సిమ్యులేషన్లు సిద్ధం చేశామని శాస్త్రవేత్త క్రిస్టోఫ్ కలేటా తెలిపారు. మెట్ఫార్మిన్ తీసుకుంటున్న వ్యక్తుల్లో ఈ–కొలీ బ్యాక్టీరియా ఉంటే.. నైట్రోజెన్ ఎక్కువగా ఉండే రసాయనాలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిసిందని.. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వివరించారు. యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఇటీవల ఓ పరిశోధన చేపట్టి మందులపై పేగుల్లోని బ్యాక్టీరియా ప్రభావాన్ని కనుగొన్నారు. -
సూక్ష్మజీవులను నింపుకుంటే వ్యాధులు దూరం!
మన జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులకు, ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యునైటెడ్ కింగ్డమ్కు చెందిన బ్రాబ్రహమ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన బ్యాక్టీరియాను కృత్రిమ పద్ధతుల ద్వారా చేర్చడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పునరుజ్జీవం పొందుతుందని.. తద్వారా వ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కోవడం వీలవుతుందని ఈ పరిశోధన చెబుతోంది. తక్కువ వయసున్న ఎలుకల వ్యర్థాల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను వయసు మీదపడిన ఎలుకల్లోకి జొప్పించినప్పుడు వాటి రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో గణనీయమైన మార్పు కనిపించిందని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త మరిసా స్టెబెగ్ తెలిపారు. పేవుల్లోని బ్యాక్టీరియాకు రోగనిరోధక వ్యవస్థకు మధ్య నిత్యం సమాచార వినిమయం జరుగుతూంటుందని వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని మరిసా తెలిపారు. ఎలుకల్లో బాగా పనిచేసిన ఈ పద్ధతి మనుషుల్లోనూ పనిచేస్తుందా? లేదా? అన్నది ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనలు పేవుల్లోని బ్యాక్టీరియాకు, వయసుతోపాటు వచ్చే సమస్యలకు మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ తాజా పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటే ఏమిటి?
మా నాన్నగారు ఎక్కువగా పొగతాగుతుంటారు. ఆయనకు ఊపిరితిత్తుల క్షయ వచ్చింది. అయితే చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. మాకు తగిన సలహా ఇవ్వగలరు. మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్ బాసిల్లస్) ప్రవేశించినప్పుడు కొన్ని అత్యంత సూక్ష్మజీవులను నిర్మూలించే శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిసిన్ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అంతేగాని ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా, లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి. దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి.ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యింది. ఈ పరీక్షల్లో మాలెక్యులార్ బేస్డ్ అనీ, కల్చర్ బేస్డ్ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్ బెస్డ్ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా ఒక టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) వాడటం మందుపెట్టాలి. ఇందులో నాలుగు లేదా అంతకుమంచి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్ల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 – 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చుకూడా. ఈ రెండో శ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండో శ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి. సిలికోసిస్‌కు చికిత్స ఏమిటి? నా వయసు 57 ఏళ్లు. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడి దగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు. మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వార్ట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్లో మూడు రకాలు ఉన్నాయి. అవి... క్రానిక్ సిలికోసిస్: ఇది సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల కాస్త తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది. యాక్సిలరేటెడ్ సిలికోసిస్: సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది. అక్యూట్ సిలికోసిస్: కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే పెద్దమొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది. క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి. రుతు సమయంలో శ్వాస సరిగా ఆడటం లేదు... ఎందుకు? నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. తద్వారా అటు శరీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు.కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి.పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు.ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం.ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
గ్యాస్ట్రయిటిస్ నయం అవుతుందా?
నా వయసు 47 ఏళ్లు. కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరంతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియోతో నయమవుతుందా? జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: ►20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ►కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ►పైత్య రసం వెనక్కి ప్రవహించడం ►కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: ►కడుపు నొప్పి, మంట ►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ►అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ►ఆకలి తగ్గిపోవడం ►కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ►సమయానికి ఆహారం తీసుకోవాలి ►కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ కాళ్లపై రక్తనాళాలు ఉబ్బుతున్నాయి... ఎందుకిలా? నా వయసు 48 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగిస్తుంది. సిరలు నలుపు/ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పితో నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది.సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ►కొందరు మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ►ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: ►కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ►కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ►చర్మం దళసరిగా మారడం ►చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం చికిత్స: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్రవిసర్జన సమయంలో మంట... తగ్గేదెలా? నా వయసు 36 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
వరి.. బ్యాక్టీరియా పని సరి
హైదరాబాద్: వరి.. దేశంలోనే అతి ముఖ్యమైన పంట. వరి పంట వేసిన తర్వాత అది చేతికందే లోపు అనేక రకాల బ్యాక్టీరియాలు దాడి చేసి రైతుకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వరిని పట్టిపీడిస్తున్న వాటిలో జాంతోమోనాస్ ఒరిజే అనే బ్యాక్టీరియా ఒకటి. ఇది సోకడం వల్ల దేశంలోని రైతులు 60 శాతం పంటను నష్టపోతున్నారు. ఈ బ్యాక్టీరియా తెగులు నుంచి వరి పంటను కాపాడేందుకు గాను హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు డాక్టర్ హితేంద్రపటేల్, డాక్టర్ రమేష్, సోహినీదేవ్‌లు అధ్యయనం నిర్వహించారు. జాంతోమోనాస్ బ్యాక్టీరియాలోని జోప్– క్యూ అనే ఎంజైమ్ వరి పంట నష్టానికి కారణమని గుర్తించారు. జోప్– క్యూ వరి మొక్క కణాలపై దాడి చేసి మొక్క కణకవచాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తుంది. రోగనిరోధక శక్తి కలిగిన మాలిక్యూల్స్‌ను టార్గెట్ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి వాటిపై దాడి చేస్తుంది. ప్రోటీన్ దిశను మార్చి... కణాల మీద బ్యాక్టీరియా దాడి చేసినపుడు మొక్కలోని రక్షిత వ్యవస్థకు, సూక్ష్మక్రిమికి మధ్య జరిగే పోరాటంలో మొక్క తనను తాను కాపా డుకుంటే రక్షించబడుతుంది. లేదంటే వ్యాధి బారిన పడుతుంది. అయితే బ్యాక్టీరియాదే పైచేయిగా నిలవడంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లు తూ వస్తోందని చెప్పారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు వరి మొక్కలో వ్యాధికి కారకంగా మారిన ప్రోటీన్ అనుక్రమాన్ని ఒక దశ వద్ద మార్చివేశారు. రోగనిరోధక శక్తి కలిగి వ్యాధి బారిన పడుతున్న 14–3–3 అనుక్రమం కలిగిన ప్రోటీన్ దిశలో మార్పు చేయడం వల్ల బ్యాక్టీరియా దాడి ప్రభావం చూపలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రోటీన్ దిశను మార్చడం వల్ల వరి మొక్కకణాలను నాశనం చేసే బ్యాక్టీరియల్ హైజాక్‌ను అడ్డుకోవడంతో పాటు మొక్క కణజాలంలో రక్షణ సంబంధ ప్రతిచర్యలను పటిష్టపర్చడం కూడా సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
అంతరిక్షంలో బ్యాక్టీరియా బెడద
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లో కూడా సూక్ష్మజీవుల బెడద తప్పట్లేదు. అక్కడ బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్ఎస్లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని కనుగొనడం వల్ల వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ కోసం, అంతరిక్షంలోకి ప్రయాణం చేసేటప్పుడు, అక్కడ నివసించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చని నాసా పేర్కొంది. ‘ఐఎస్ఎస్ వంటి మూసి ఉన్న ఆవరణలో సూక్ష్మజీవులు ఎంత కాలం జీవించి ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పరిశోధన బృందంలోని భారత సంతితికి చెందిన కస్తూరి వెంకటేశ్వరన్ వివరించారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26 శాతం స్టెఫైలోకోకస్, 23 శాతం పాంటియా, 11 శాతం బాసిల్లస్ ఉన్నట్లు ఆయన తెలిపారు. మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఎంటిరోబ్యాక్టర్, స్టెఫైలోకోకస్ ఆరియస్ (10 శాతం)ను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇవి వ్యోమగాములు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా లేదా అన్న విషయం ఇంకా తెలియదని తెలిపారు. అంతరిక్షంలో ఆ వాతావరణంలో బ్యాక్టీరియాలు క్రియాశీలకంగా ఉంటాయా లేదా అనేది కూడా పరిశోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐఎస్ఎస్లోని లోపలి ఉపరితలంలో 8 ప్రాంతాల్లో (కిటికీ, టాయిలెట్, డైనింగ్ టేబుల్..) సేకరించిన నమూనాలను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. అరుణ గ్రహంపై జీవం అరుణగ్రహంపై జీవం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడికి చెందిన ఉల్కపై బ్యాక్టీరియా ఉందని వారు లండన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. దీన్ని బట్టి అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 1977–78 మధ్య అంటార్కిటికా ప్రాంతంలో జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ జరుపుతున్న తవ్వకాల్లో ఏఎల్‌హెచ్–77005 అనే ఉల్క దొరికినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఎర్త్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అధ్యయనం చేసి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్క లోపల సేంద్రియ పదార్థ రూపంలో బ్యాక్టీరియా ఉందని కనుగొన్నట్లు ఇల్డికో గ్యొల్లయ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ‘భౌగోళిక, జీవ, రసాయన, వాతావరణ శాస్త్ర రంగాలకు చెందిన పరిశోధకులకు మా పరిశోధనలు ఎంతో మేలు చేస్తాయి’అని ఇల్డికో చెప్పారు. తమ పరిశోధనతో భవిష్యత్తులో ఉల్కలు, గ్రహ శకలాలను అధ్యయనం చేసే తీరు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
అందరికీ ఒకే చికిత్స సరికాదు..
మధుమేహం చికిత్సకు వ్యక్తులు జన్యువులు ఆధారంగా చేసుకుని సిద్ధం చేసిన ఆహరం మెరుగైన ఫలితాలిస్తుందని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. కడుపు/పేవుల్లోని బ్యాక్టీరియాల కారణంగా ఒకే రకమైన ఆహారానికి వ్యక్తులు వేర్వేరుగా స్పందిస్తూంటారని అందువల్ల పోషకాల్లో తేడా వచ్చి వ్యాధికి స్పందన కూడా వేరుగా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హెలెనా మెండిస్ సోరేస్ తెలిపారు. ఆహారానికి రక్తంలని గ్లూకోజు మోతాదులకు మధ్య ఉన్న సంబంధాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు తాము ప్రయోగాలు మొదలుపెట్టామని వ్యక్తుల వయసు, ఆహారం, వ్యాయామం వంటి అంశాలు మాత్రమే కాకుండా.. తీసుకునే ఆహారానికి స్పందించే లక్షణం ఆధారంగా రక్తంలోని గ్లూకోజు మారుతూంటుందని వివరించారు. కార్బోహైడ్రేట్లు, కేలరీ లెక్కలేసి ప్రస్తుతం వేస్తున్న అంచనాలు సరికాదని అన్నారు. ఈ కారణంగానే కొంతమంది మధుమేహులుకు కొన్ని రకాల పండ్లు తిన్నా రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరగవని తెలిపారు. దాదాపు 327 మందిపై ఆరు రోజుల పాటు పరిశీలన జరిపామని.. తీసుకునే ఆహారానికి రక్తంలోని చక్కెర మోతాదులకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసకునే ప్రయత్నం చేశామని చెప్పారు. -
ఆరోగ్యానికి తోడు
గడ్డపెరుగు చూశాక ఎప్పుడెప్పుడు భోజనం చివరికొస్తుందా... ఒకింత ఎక్కువ పెరుగన్నం తినేద్దామా అని అనుకోని వారుండరు. కొందరికైతే అసలు పెరుగు తినకుండా భోజనం పూర్తయిన ఫీలింగే ఉండదు. పైగా చలికాలం ముగింపునకొస్తూ... వేసవిలోకి ప్రవేశించబోతున్న ఈ తరుణంలో శీతాకాలం తాత్కాలికంగా పెరుగు తిననివారు కూడా ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రపడే పెరుగు కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. వాటిలో ఇవి కొన్ని... మన జీర్ణవ్యవస్థ పొడవునా మనకు మేలు చేసే బ్యాక్టీరియా కోటానుకోట్ల సంఖ్యలో ఉంటాయి. వీటినే ప్రోబయోటిక్స్ అంటారు. పెరుగు నిండా మనకు మేలు చేసే బ్యాక్టీరియా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూస్తుంది. అంతేకాదు... కడుపులో మంటను తగ్గిస్తుంది.పెరుగులో ఉండే పోషకాల కారణంగా మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనకు రక్షణ కలుగుతుంది. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ వేసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. రోజూ పెరుగు తినేవారికి మేనిలో మంచి నిగారింపు వస్తుంది. చర్మంలో ఎప్పుడూ తేమ ఉండేలా పెరుగు సహాయపడుతుంది కాబట్టి ఒంటికి ఆ నిగారింపు వస్తుందంటున్నారు ఆహార నిపుణులు. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31శాతం తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సెంటిఫిక్ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. మహిళలకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. పెరుగు వల్ల మనకు సమకూరే ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా వల్ల మహిళల్లో పెరిగే... హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దాదాపు 250 గ్రాముల పెరుగులో 275 ఎంజీ క్యాల్షియమ్ ఉంటుంది. కాబట్టి రోజూ పెరుగు తినేవారి ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వారికి కొవ్వు లేని పెరుగన్నం మంచి ఆహారం అన్నది ఒబేసిటీని నియంత్రించే డాక్టర్లు చెబుతున్న మాట. చివరగా చిన్నమాట... గడ్డపెరుగు చూశాక టెంప్ట్ అయి వేసుకున్నా... కనీసం చెంచా నీళ్లయినా అందులో కలుపుకుంటే మంచిదనీ, అది వాతాన్ని హరిస్తుందన్నది పెద్దల మాట. నమ్మితే ఆచరించండి. నమ్మకపోతే రుచిని ఆస్వాదించండి. ఎందుకంటే పెరుగులో కీడు చేసే అంశం దాదాపుగా లేనే లేదు. -
నీటి శుద్ధికి బ్యాక్టీరియా...
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. ఈ మాటలు చాలాసార్లు మనం వినే ఉంటాం. అయితే నీటిని శుద్ధి చేసేందుకు బ్యాక్టీరియాలను ఉపయోగించవచ్చునన్న ఆలోచన మాత్రం వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసి చూపారు. బ్యాక్టీరియా కారణంగా నీరు కలుషితమవుతుందిగానీ.. శుద్ధి ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ అంటున్నారు సింగమనేని శ్రీకాంత్. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసరైన ఈయన తన విద్యార్థులతో కలిసి బ్యాక్టీరియాతో నిర్మితమైన ఓ ఫిల్టర్‌ను తయారు చేశారు. ఈ ఫిల్టర్‌లో గ్రాఫీన్ ఆౖMð్సడ్, బ్యాక్టీరియల్ నానో సెల్యులోజ్ ఉంటాయి. నీటి శుద్ధీకరణకు వాడే సాధారణ ఫిల్టర్లలో బ్యాక్టీరియా చేరడం వల్ల కొద్దోగొప్పో దుర్వాసన వేస్తూంటాయన్నది మనకు అనుభవమైన విషయం. కానీ కొత్త ఫిల్టర్‌లో మాత్రం ఈ సమస్య ఉండదు. శ్రీకాంత్ గతంలోనూ ఇలాంటి ఫిల్టర్లను బంగారు నానోకణాల సాయంతో చేసినప్పటికీ చౌకైన ప్రత్యామ్నాయం కోసం జరిగిన ప్రయత్నాల్లో గ్రాఫీన్ ఆక్సైడ్, బ్యాక్టీరియా ఫిల్టర్ సిద్ధమైంది. గ్రాఫీన్ ఆక్సైడ్ కారణంగా ఫిల్టర్ సూర్యరశ్మితో వేడెక్కుతుందని, అది చుట్టూ ఉన్న నీటిలోకి ప్రవేశించడం ద్వారా నీటిలోని ఇతర బ్యాక్టీరియాను శుద్ధి చేస్తుందని శ్రీకాంత్ అంటున్నారు. -
250 కోట్ల ఏళ్ల క్రితమే భారత్‌లో జీవం!
దేశంలో సుమారు 250 కోట్ల ఏళ్ల క్రితమే సూక్ష్మ జీవజాలం (బ్యాక్టీరియా) ఉన్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాను దక్కన్ పీఠభూమిలోని రాతిపొరల్లో భూమికి దాదాపు 3 కిలోమీటర్ల లోతులో వారు కనుగొన్నారు. ఇది గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ కాలానికి చెందినది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రలోని కొయినా ప్రాంతంలో ఐఐటీ బయోటెక్నాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. 1964 ప్రాంతంలో కరార్ అనే గ్రామం భూకంపం వచ్చి నాశనమైపోయింది. దీనికి కారణాలు ఏంటని భూగర్భశాస్త్రవేత్తలు పరిశోధన ప్రారంభించారు. అతిపురాతనమైన జీవం ఆనవాళ్ల కోసం అక్కడే వెతకడం మొదలుపెట్టారు. నీళ్లు, ఖనిజ లవణాలు ఏవీ లేని ప్రాంతంలో 3 బోరింగ్ యంత్రాలతో రంధ్రాలు చేసి రాతిమట్టిని వెలికితీశారు. ఇలా తీసిన మట్టిలో 5 రకాల సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో కొన్ని బ్యాక్టీరియాలు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్లను ఇంధనంగా వాడుకుని బతికేశాయని.. ఇప్పుడు అవి జీవంతో ఉన్నాయా? లేదా? అన్నది చెప్పలేమని శాస్త్రవేత్త అవిశేక్ దత్తా తెలిపారు. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లోనూ జీవనం కొనసాగించడమెలా అన్న విషయంలో ఈ బ్యాక్టీరియా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఈ పరిశోధన వివరాలు ‘సైంటిఫిక్ రిపోర్ట్స్, నేచర్’లో ప్రచురితమవడంతో మొత్తం వ్యవహారం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీనిపై కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఈ అంశంపై విస్తృత పరిశోధనలు చేయాల్సిందిగా ఐఐటీ శాస్త్రవేత్తలను కోరింది. ఏంటీ ఆక్సిడేషన్ ఈవెంట్..: ‘భూమి పుట్టి 450 కోట్ల ఏళ్లు అవుతోందని అంచనా. విశాల విశ్వం నుంచి దూసుకొచ్చిన అనేక ఉల్కా శకలాలు అప్పట్లో భూమిని ఎడాపెడా ఢీకొడుతుండేవి. కొన్ని కోట్ల ఏళ్ల వరకూ ఈ పరిస్థితి ఇలానే కొనసాగింది. అప్పట్లో భూమ్మీద పెద్దగా జీవజాతులేవీ లేవు. భూమి లోపలి పొరలు అస్థిరంగా ఉండటంతో భూకంపాలు తరచూ వచ్చేవి. అగ్నిపర్వతాలు లావా ఎగజిమ్ముతుండేవి. అయితే 250 నుంచి 6.5 కోట్ల ఏళ్ల మధ్యకాలంలో భూమి లోపలి పొర అప్పుడప్పుడూ చల్లబడుతూ.. లావా చేరినప్పుడు మళ్లీ వేడెక్కేది. వేడి.. చల్లదనం మధ్యలోనే భూమ్మీద తొలి జీవం ఏర్పడిందని అంచనా. ఆ క్రమంలో భూమి వాతావరణంలోకి ఆక్సిజన్ వాయువు ప్రవేశించింది. ఆక్సిజన్ ప్రవేశించిన కాలాన్నే ‘గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్’అని అంటారని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త పినాకీ సార్ తెలిపారు. -
దోమలకు చెక్ పెట్టే బ్యాక్టీరియా..
ఎన్ని రకాల కాయిల్స్, లిక్విడ్స్ వాడినా దోమల బెడద తప్పడం లేదా? మీ సమస్యకు విస్కాన్సిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కున్నారు. మట్టిలో ఉండే ఓ బ్యాక్టీరియా అత్యంత సమర్థంగా దోమలు దూరంగా పారిపోయేలా చేయగల రసాయనాన్ని సృష్టిస్తోందని వీరు గుర్తించారు. ఈ రసాయనం డీడీటీ కంటే చాలా శక్తిమంతమైందని అంచనా. డీడీటీతో దోమల నివారణ జరుగుతున్న కొన్ని ఇతర సమస్యల కారణంగా ఈ రసాయనంపై చాలా దేశాల్లో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన ప్రత్యామ్నాయం కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీనోరాబ్డస్ బుడపెస్టెనిసిస్ అనే బ్యాక్టీరియా కీటకాలను ఎలా చంపగలుగుతోందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనం దోమలు దూరంగా పారిపోయేలా చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తున్న రసాయనం డీడీటీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావశీలి అని కూడా ఈ పరిశోధనల ద్వారా తెలిసింది. అంతేకాకుండా... ఈ రసాయనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దోమలు రక్తం పీల్చకుండా మాత్రమే నిరోధిస్తోందని.. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దోమలు పారిపోయేలా చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. -
కేన్సర్‌పై యుద్ధంలో మరో ముందడుగు
కేన్సర్ వ్యాధి చాలా తెలివైందంటారు. శరీరంలో కేన్సర్ కణాలు మొట్టమొదట చేసే పని రోగ నిరోధక వ్యవస్థను హైజాక్ చేయడం. ఫలితంగా ఈ వ్యవస్థ కాస్తా కేన్సర్ కణాలను కూడా తనవిగానే భావిస్తుంది. ఎంటువంటి దాడులూ చేయదు. దీనివల్ల వ్యాధి కాస్తా ముదిరిపోతుంది. అయితే కాలిఫోర్నియా, రష్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారం లభించింది. శరీరంలో రోగకారక వైరస్లు, బ్యాక్టీరియాలపై నిత్యం నిఘా పెట్టే కణాల్లో మైలాయిడ్ కణాలు రెండు రకాలు. ఒకరకమైన ఎం1 మాక్రోఫేజ్ కేన్సర్ కణితి పెరుగుదలను అడ్డుకుంటూంటే.. రెండోది తోడ్పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ రెండు రకాల కణాలూ రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలను నాశనం చేస్తూంటాయి. రష్, కాలిఫోరియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ మైలాయిడ్ కణాలు ఎందుకు అలా రెండుగా విడిపోతాయో గుర్తించారు. సీడీ11బీ అనే ఒక ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువైతే ఎం1 రకం కణాలు.. తక్కువైతే ఎం2 రకానివి ఎక్కువవుతాయి. కణితి కణాలు ఈ ప్రొటీన్‌ను నియంత్రిస్తూ ఎం2 కణాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేందుకు కారణమవుతూంటాయి. ఈ ప్రొటీన్‌ను మరింత సమర్థంగా నియంత్రించగలగడం.. తద్వారా ఎం1 కణాలు ఎక్కువయ్యేలా చేస్తే కేన్సర్‌కు మెరుగైన చికిత్స లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు కనిపించాయని వినీత్ గుప్తా అనే శాస్త్రవేత్త తెలిపార -
పీచు, బ్యాక్టీరియాలతో? గుండెకు మేలు
మన పేవుల్లోని బ్యాక్టీరియా పుట్టించే.. కొన్ని రకాల పీచుపదార్థాల్లో ఉండే రసాయనం ఒకటి అధిక రక్తపోటుతోపాటు గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా నిరోధిస్తుందని జర్మనీలోని ఓ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ప్రొపయోనైట్ అనే రసాయనం రోగ నిరోధక వ్యవస్థ కణాలను శాంత పరచడం ద్వారా రక్తపోటును నియంత్రిస్తుందని తాము గుర్తించినట్లు మాక్స్ డెల్బర్ తెలిపారు. మన కడుపు/పేవుల్లో ఉండే బ్యాక్టీరియా ఆహారం నుంచి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుందని ఆయన వివరించారు. అధిక రక్తపోటు ఉన్న ఎలుకలకు ప్రొపయోనైట్‌ను అందించినప్పుడు గుండెకొట్టుకునే వేగంలో మార్పులు (అరిథ్రిమియా) ప్రమాదం గణనీయంగా తగ్గిందని నాడులకు జరిగే నష్టమూ తక్కువని చెప్పారు. అధిక రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవారికి ప్రొపయోనైట్‌ను అందించడం ఒక కొత్త చికిత్స పద్ధతి కావచ్చునని సూచించారు. ప్రొపయోనైట్ కారణంగానే గుండెజబ్బుల నివారణకు పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకొవాలని సూచిస్తారని వీటిల్లో పండ్లు, కాయగూరల్లో ఉండే ఇన్సులిన్ పీచు పదార్థాలను ఉపయోగించుకుని పేవుల్లోని బ్యాక్టీరియా ప్రొపయోనైట్‌ను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. -
పేగు బ్యాక్టీరియాపై చక్కెర ప్రభావం
కడుపులో పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆరోగ్యంగా, తగినంత బరువు మాత్రమే ఉండే వారిలో మంచి బ్యాక్టీరియా చేరేందుకు కావాల్సిన కీలకమైన ప్రొటీన్ ఉత్పత్తిని చక్కెర అడ్డుకుంటుందని అంటున్నారు యేల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. చక్కెర పేగుల్లోనే జీర్ణమైపోతుందని కడుపులోకి రాదని శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ కట్టిన అంచనా తప్పని ఈ కొత్త పరిశోధన చెబుతోంది. ఫ్రక్టోజ్ గ్లూకోజ్ వంటి చక్కెరలు ఎక్కువగా ఉండే పాశ్చాత్యదేశాల ఆహారం బ్యాక్టీరియాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు తాము ఈ పరిశోధన చేపట్టామని ఈ రెండు కలిసి తయారు చేసే సుక్రోజ్ ఆర్ఓసీ అనే ప్రొటీన్ ఉత్పత్తిని నిలిపిస్తున్నాయని గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎడ్యురాడో గ్రోయిస్మాన్ తెలిపారు. ఫలితంగా కొన్ని రకాల బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో మనుగుడ సాగించలేకపోతున్నాయని చెప్పారు. -
చుట్టూ టైఫాయిడ్ ఉంది
మనం సురక్షితం అనుకునే ఆహారం శుభ్రత లేని కారణంగా టైఫాయిడ్‌ను వ్యాప్తి చేయవచ్చు. ప్లాస్టిక్ తొడుగు ధరించి ఆహారాన్ని అందజేయాలని డిమాండ్ చేద్దాం. వీలైతే మన బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక గ్లౌవ్స్ జత ఉంచుకుని బండి దగ్గరికి వెళ్లినప్పుడు మనమే వాళ్లకు ఇద్దాం. ఏం తెలుసు... మనకు టిఫిన్ కట్టిచ్చే వ్యక్తి చేతుల నుంచి మనకు టైఫాయిడ్ రావచ్చని. ఏం తెలుసు... వీధిలో పొంగుతున్న డ్రైనేజీలో తడిసిన మన చెప్పులు ఇంట్లోకి టైఫాయిడ్ తేవచ్చునని. ఏం తెలుసు... బహిరంగ మలవిసర్జన మనకు టైఫాయిడ్ వ్యాప్తి చేస్తుందని. ఏం తెలుసు.. చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉంటే టైఫాయిడ్ రాదని. ఏం తెలుసు... దూరప్రయాణాలు చేసేటప్పుడు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే సురక్షితమని. తెలియకుండానే జీవితం గడిపేస్తున్నాం. చుట్టూ టైఫాయిడ్ ఉంది. జాగ్రత్త.టైఫాయిడ్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న చాలా సాధారణ జ్వరం. పారిశుధ్ధ్య వసతులు సరిగా లేని చోట చాలా ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుంది. పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొన్న పాశ్చాత్య దేశాల్లో దీని ఉనికి బాగా తక్కువేగానీ మన దేశం లాంటి ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మురికివాడల్లో, చెత్త నిండిన నివాస ప్రాంతాల్లో టైఫాయిడ్ చాలా ఎక్కువగా బాధిస్తోంది. జబ్బు కనిపించడం ఇలా... ఒక వ్యక్తి శరీరంలోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వారం నుంచి రెండు వారాలలో లక్షణాలు కనిపిస్తూ బయటపడుతుంది. అంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ (బ్యాక్టీరియా ఒంటిలోనికి ప్రవేశించి లక్షణాలు బయటపడటానికి మధ్య వ్యవధి) ఒకటి నుంచి రెండు వారాలన్నమాట. ఒకసారి టైఫాయిడ్ జ్వరం వస్తే అది 3 – 4 వారాల పాటు బాధిస్తుంది. లక్షణాలు... ∙ఆకలి బాగా మందగించడం ∙తలనొప్పి ∙గుండె స్పందనల రేటు బాగా తగ్గడం (బ్రాడీకార్డియా) ∙రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గడం (ల్యూకోపీనియా) ∙నీళ్ల విరేచనాలు (డయేరియా), పొట్టనొప్పి ∙ఒళ్లంతా నొప్పులు ∙తీవ్రమైన జ్వరం (ఒక్కోసారి 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించి జ్వరం ఉండవచ్చు) ∙తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం ∙చాలామందిలో ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙చాలా అరుదుగా ర్యాష్‌తో పాటు మెడ, పొట్ట మీద గులాబిరంగు మచ్చలు కనిపించవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు రాకపోతే మూడు నాలుగు వారాల తర్వాత జ్వరం అదే తగ్గుముఖం పడుతుంది. నిర్థారణ ∙మొదటివారంలో అయితే రక్త పరీక్షతో (బ్లడ్ కల్చర్) నిర్దిష్టంగా దీన్ని కనుగొనవచ్చు. అందుకే మొదటివారంలో నిర్వహించే రక్తపరీక్షను గోల్డ్‌స్టాండర్డ్ పరీక్షగా పేర్కొనవచ్చు. ∙ఇక రెండో వారంలో వైడాల్ టెస్ట్ అని పిలిచే సిరొలాజికల్ పరీక్ష (రక్తపరీక్ష)తో నిర్ధారణ చేయవచ్చు. (కొన్ని సందర్భాల్లో కొంతమంది డాక్టర్లు మొదటివారమే వైడాల్ పరీక్ష చేయిస్తుంటారు. అలా చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే రోగకారక క్రిమి ఒంట్లోకి ప్రవేశించాక ఒంట్లోని రక్తంలో వాటి యాంటీబాడీస్ పుడతాయి. అందుకు ఒక వారం రోజులు పట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో మొదటివారమే పరీక్ష చేయించి తద్వారా వచ్చిన టైటర్ ఫలితాలను తప్పుగా వ్యాఖ్యానించడం వల్ల రోగికి నష్టం చేకూరుతుంది. అందుకే ఏదైనా జ్వరం వచ్చి, వారం రోజులు దాటి, రెండో వారంలోకి ప్రవేశించి, దాన్ని టైఫాయిడ్‌గా అనుమానించినప్పుడే వైడాల్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంతపు వైద్యులు సైతం గుర్తించాలన్నది నిపుణుల మాట). ∙మూడో వారంలో అయితే ఎముక మజ్జ (బోన్‌మ్యారో) కల్చర్ పరీక్షతో నిర్థారణ చేస్తారు. ఈ పరీక్షలతో పాటు బయటకు కనిపించే టైఫాయిడ్ సాధారణ లక్షణాల సాయంతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. అయితే ఇలాంటి లక్షణాలే చాలా సందర్భాల్లో కనిపిస్తాయి కాబట్టి కేవలం లక్షణాలను బట్టే నిర్ధారణ అంత సులభం కాదు. వైద్యపరీక్షల సాయంతో దీన్ని నూరుపాళ్లు కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. చికిత్స టైఫాయిడ్ జ్వరానికి చికిత్స తీసుకోని వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మరణించే అవకాశాలుంటాయి. అందుకే చికిత్స తప్పనిసరి. పైగా 104 డిగ్రీలకు పైగా జ్వరం వచ్చినప్పుడు మరికొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చు. అందుకే టైఫాయిడ్ రోగులు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. పూర్తి కోర్స్ వాడటం కూడా అత్యావశ్యకం. అలా జరగనప్పుడు మళ్లీ మళ్లీ జబ్బు తిరగబెట్టవచ్చు. అది తీవ్రంగా కూడా పరిణమించవచ్చు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ ఇటీవల మందులకు లొంగని టైఫాయిడ్ కూడా వస్తోంది. మనం చిన్న చిన్న సమస్యలకు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడుతుండటం, అది కూడా సరైన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో ఉపయోగిస్తుండటంతో పాటు ఒక్కోసారి వాడాల్సిన వ్యవధి కంటే చాలా ఎక్కువ రోజుల పాటు ఆ మందుల్ని వేసుకుంటూ ఉండటం వల్ల డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ విస్తరిస్తోంది. దీని లక్షణాలు టైఫాయిడ్ లక్షణాల్లా కనిపించవు. ఇలాంటి కేసుల్లో రోగికి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వైద్యం అందించాల్సి ఉంటుంది. విచక్షణ రహితంగా యాంటీబయాటిక్స్ వాడే వారిలో టైఫాయిడ్ వచ్చిందంటే అది ఒక పట్టాన తగ్గక చాలా ఇక్కట్లకు గురిచేస్తోంది. టీకా అందుబాటులో... టైఫాయిడ్‌కు టీకా అందుబాటులో ఉంది. ఈ టీకా వల్ల 60 నుంచి 70 శాతం వరకు నివారణ సాధ్యమవుతుంది. టైఫాయిడ్ టీకాల్లో రకాలు: ∙ఇన్‌యాక్టివేటెడ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ : ఇందులో టైఫాయిడ్‌ను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను నిర్వీర్యం (ఇన్‌యాక్టివేట్) చేసి, ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ∙లైవ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ : ఇందులో బలహీన పరచిన టైఫాయిడ్ టీకాను నోటి ద్వారా (ఓరల్‌గా) ఇస్తారు. దూరప్రయాణాలు చేస్తూ బయటి ఆహారం తీసుకునేవాళ్లు టీకా తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఒక్కోసారి టైఫాయిడ్ జ్వరం కిడ్నీ ఫెయిల్యూర్, పొట్టలోని అంతర్గత అవయవాల్లో రక్తస్రావం, మెదడు పనితీరును ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన లక్షణాలతో మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది. తమ ప్రయాణాలకు కనీసం రెండు మూడు వారాలకు ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ టీకాతో కొద్దిమందిలో కాస్తంత జ్వరం, వికారం వంటివి కనిపించినా టైఫాయిడ్ టీకా నూరు శాతం సురక్షితమే. రూ. 150 నుంచి రూ. 525 వరకు ధరలతో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎలా వ్యాప్తి చెందుతుందంటే... టైఫాయిడ్ జ్వరం కలుషితాహారం వల్ల ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. ఇది ‘సాల్మొనెల్లా టైఫీ’ అనే గ్రామ్‌నెగెటివ్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. మానవ మలం వంటి విసర్జకాలు మంచినీళ్లలో కలిసినప్పుడు లేదా వాటితో తయారైన ఆహారపదార్థాలతో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దీనిలోనే కాస్తంత తక్కువ తీవ్రత ఉన్న సాల్మొనెల్లా పారాటైఫీ అనే మరో రకం బ్యాక్టీరియా కూడా ఉంది. అయితే అది అంత సాధారణం కాదు. చాలా తక్కువ మందిలోనే కనిపిస్తుంది. అయితే ఇది వచ్చినా దీనికి కూడా టైఫాయిడ్ మాదిరిగానే నిర్ధారణ పరీక్షలు చేయించి, చికిత్స అందించాల్సి ఉంటుంది. మరికొంతమందిలో ఈ బ్యాక్టీరియా ఎలాంటి లక్షణాలు కలగజేయకుండా నిద్రాణంగా ఉంటుంది. వారి నుంచి ఇతరులకు ఈ జ్వరం వ్యాపించవచ్చు. ఇలాంటి వారిని వైద్యపరిభాషలో క్యారియర్స్ అంటారు. అన్నట్టు ఈ జీవికి ఆశ్రయం ఇచ్చే ఒకే ఒక జీవి మానవుడు మాత్రమే. మానవ విసర్జితాలతో తాగు నీరుగానీ, తినే తిండిగానీ కలుషితం కాగానే మళ్లీ బ్యాక్టీరియా మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా అది వ్యాప్తి చెందుతుంది. క్రానిక్ క్యారియర్స్ ముందే చెప్పినట్లుగా సాల్మొనెల్లా టైఫీ అనేది మానవుల్లోనే ఆవాసం ఉండే బ్యాక్టీరియా. అయితే లక్షణాలు బయటపడకుండా ఎలాంటి జబ్బూ లేకుండా ఉండే వారిలో అపరిశుభ్రమైన క్యాంటీన్లు, మురికిగా ఉండే హోటళ్లలో పనిచేసేవారిలో ఇది దీర్ఘకాలం పాటు అంటే దాదాపు ఏడాదికిపైగా వాళ్ల గాల్‌బ్లాడర్‌లో నివాసం ఉంటుంది. వారు విసర్జించే విసర్జకాలు ఆహారంతో కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీళ్లను క్రానిక్ క్యారియర్స్‌గా అభివర్ణించవచ్చు. మేరీ టైఫాయిడ్ క్రానిక్ క్యారియర్స్ విషయంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ‘మేరీ మెలాన్’ అనే ఒక హాస్పిటల్ వంటగత్తె (కుక్). ఆమె ఐర్లాండ్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ ఐరిష్–అమెరికన్. టీనేజ్‌లో ఉన్నప్పుడు మేరీ మెలాన్ ఐర్లాండ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు చేరింది. ఎలాంటి లక్షణాలు కనిపించని మొట్టమొదటి అమెరికన్ అసింప్టమేటిక్ క్యారియర్‌గా ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆమె ఓ టైఫాయిడ్ క్యారియర్ అని గుర్తించాక కూడా తనలో ఎలాంటి లక్షణాలూ కనిపించనందున మేరీ ఒంటరిగా ఉండటం (ఐసోలేషన్లోకి వెళ్లడం)గానీ, లేదా చికిత్స తీసుకోవడం గానీ చేయలేదు. దాంతో ఆమె ఒకేసారి 51 మందికి తన ద్వారా టైఫాయిడ్‌ను వ్యాప్తిచేసింది. అందులో ముగ్గురు మరణించారు. అలా ఆమె వ్యాప్తి చేసిన టైఫాయిడ్‌కు ఆమె పేరిట ‘మేరీ టైఫాయిడ్’ అని పేరు రావడం ద్వారా కొంత అపకీర్తిని మూటగట్టుకుంది పాపం మేరీ మెలాన్. నివారణ ∙చేతులు కడుక్కునే అలవాటు లేనివారిలో ఇది ఎక్కువగా రావడం కనిపిస్తుంది. అందుకే తినేముందు లేదా తాగే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మల విసర్జన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ∙నీటిని వడపోసి కాచి చల్లార్చి తాగడం మంచిది. ∙నేరుగా పట్టే నీటితో వేడి చేయకుండా తయారు చేసుకునే పదార్థాలతో టైఫాయిడ్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. అందుకే పానీపూరీ వంటి బయటి ఆహారాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ∙అన్నం, కూరలు వేడివేడిగా ఉండగానే తినెయ్యాలి. ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వస్తే చల్లారిపోయాక అస్సలు తినకూడదు. అలాగే ఈగలు వాలడంతో కలుషితమయ్యే ఆహారాల వల్ల కూడా టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మలం మీద వాలిన ఈగలు మళ్లీ ఆహారపదార్థాల మీద వాలడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అందుకే ఈగలు ముసిరే ఆహారాలు, బయటి పదార్థాలను తినకపోవడం మేలు. అలాగే కలుషిత జలాలతో తయారు చేసే ఐస్‌తో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉన్నందున అది కూడా వాడకపోవడం చాలా మంచిది. -
పొట్ట బ్యాక్టీరియా ఆయుష్షు పెంచుతుందా?
కడుపు/పేవుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే నిత్య యవ్వనాన్ని ఆనందించవచ్చా? కావచ్చునేమో అంటున్నారు మెలిస్సా హీలే. లాస్ ఏంజిలస్ టైమ్స్‌కు చెందిన ఈ జర్నలిస్ట్ ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేకానేక పరిశోధనలను మదింపు చేసి మరీ ఈ అంచనాకు వస్తున్నారు. అక్కెర్మన్సియా ముసినిఫిలియా అనే బ్యాక్టీరియానే ఉదాహరణగా తీసుకుంటే ఇది వయసు పెరిగేకొద్దీ మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని పలు పరిశోధనలు చెబుతున్న విషయాన్ని మెలిస్సా గుర్తు చేస్తున్నారు. వయసుమీరిన ఎలుకలు, కోతుల్లో ఈ బ్యాక్టీరియా జీవక్రియలను ఆరోగ్యకరమైన స్థాయికి పునరుద్ధరించగలిగిందని అంతేకాకుండా ఇన్సులిన్ నిరోధకతను కూడా అడ్డుకుందని తెలిపారు. ఇన్సులిన్ నిరోధకత కేవలం మధుమేహానికి సూచిక మాత్రమే కాదని, ఊబకాయం, వయసుతోపాటు పెరిగే మంట/వాపు, రోగ నిరోధక శక్తిలో తగ్గుదల వంటి సమస్యలకూ కారణమని వివరించారు. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా కేన్సర్ రోగులు ఇమ్యూనోథెరపీకి బాగా స్పందిస్తున్నట్లు ఇంకో పరిశోధన చెబుతోందని.. ఈ రకమైన రోగుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను మానవ కేన్సర్లతో కూడిన జంతువుల్లోకి జొప్పించినప్పుడు అవి కూడా మెరుగ్గా స్పందించినట్లు తెలిసిందని మెలిస్సా వివరించారు. -
బ్యాక్టీరియా వైవిధ్యత ఆధారంగా..కొత్త రకం మందులు!
మొక్కల వేళ్లు.. దాని పరిసర ప్రాంతాల్లో ఉండే వైవిధ్యభరితమైన బ్యాక్టీరియా సాయంతో అనేక కొత్త యాంటీబయాటిక్, కేన్సర్ మందులు తయారు చేయవచ్చునని అమెరికాలోని ఓక్రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనిషి పేవుల్లోని బ్యాక్టీరియా కంటే కనీసం పది రెట్లు ఎక్కువ వైవిధ్యతతో కూడిన బ్యాక్టీరియా మొక్కల వేళ్ల వద్ద ఉంటుందని.. ఇవి ఇప్పటివరకూ పరీక్షించని అనేక వినూత్నమైన రసాయన మూలకాలను ఉత్పత్తి చేస్తాయని వీరు తెలిపారు. చుట్టూ ఉండే సహజసిద్ధమైన పదార్థాలను వాడుకుంటూ బ్యాక్టీరియా ఇతర బ్యాక్టీరియా, మొక్కలతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయని మనకు తెలుసు. ఈ క్రమంలో విడుదలయ్యే రసాయనాలు బ్యాక్టీరియా ఎదుగుదలకు, శత్రు బ్యాక్టీరియా నుంచి రక్షణకు అవసరమైన రసాయనాలూ విడుదలవుతాయని.. వీటిని యాంటీబయాటిక్లుగా వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మిచ్ డోకిచ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అరుదైనవి కాకుండా.. అందరికీ తెలిసిన మొక్కల వేళ్ల వద్ద తాము పరిశీలనలు జరిపామని, సహజసిద్ధమైన రసాయనాలను విశ్లేషించడం ద్వారా కొత్త కొత్త యాంటీబయాటిక్‌లు లభిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
పాప ఎక్కువగా నిద్ర పోతోంది?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి కూడా లేవడం లేదు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటితో ఎలాంటి గుణం కనిపించలేదు. పాప ఇలా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి. – ఆర్. ఉజ్వల, కొత్తగూడెం పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. కానీ ఇది సరికాదు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్ చేయడం కూడా ఒకింత కష్టమే. అతి నిద్రకు కారణాలు: పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్‌లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి... ∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ∙నరాలకు సంబంధించిన సమస్యలు ∙స్థూలకాయం ∙థైరాయిడ్ సమస్యలు ∙ఇన్ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్ డిసీజ్ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది. ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్ క్వాలిటీ ఆఫ్ స్వీప్) లేదా పూర్ స్లీప్ హైజీన్ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్ ఇవాల్యుయేషన్, డీటెయిల్డ్ స్లీప్ ఇవాల్యుయేషన్ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం. ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ ప్రభావపూర్వకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు. బాబుకు ఉన్న కళ్ల సమస్య ఏమిటి? మా బాబుకి పదకొండేళ్లు. చాలా ఆరోగ్యంగా, మంచి చురుగ్గా ఉంటాడు. అయితే బాబుకి రెండు కళ్లలోని కనుగుడ్లు గబగబా కదులుతుంటాయి. ఇతరత్రా ఇబ్బంది లేకపోయినా చదవడంలో కాస్త సమస్యగానే ఉంది. వాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – డి. సూర్యారావు, టెక్కలి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకి కళ్ల పొజిషన్, కదలికలో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిలో చాలా రకాలుంటాయి. మీ ఉత్తరంలో బాబు సమస్యకి సంబంధించి చాలా వివరాలు తెలపలేదు. అందుకే ఖచ్చితమైన కారణం నిర్ధారణ చేయడం సాధ్యం కావడం లేదు. మీరు చెబుతున్న కొద్దిపాటి సమాచారాన్ని బట్టి చూస్తే మీ వాడికి నిస్టాగ్మస్ లేదా ఆప్సోక్లోనస్ అనే సమస్యలు ఉండి ఉండవచ్చుననిపిస్తోంది. ముందుగా నిస్టాగ్మస్కు సంబంధించిన వివరాలలోకి వెళ్తే... ఇదొక వ్యాధి కాదు. బాబులోని రుగ్మతకు సంకేతం మాత్రమే. నిస్టాగ్మస్ ఉన్న వారి కళ్లు రిథమిక్‌గా కదులుతూ (రిథమిక్ ఆసిలేషన్ మూవ్మెంట్స్) ఉంటాయి. ఇది ఒకటి లేదా రెండు కళ్లకు ఉండవచ్చు. ఈ సమస్య పుట్టుక నుంచీ ఉండవచ్చు లేదా మధ్యలోనైనా ఇది రావచ్చు. ఈ పరిస్థితికి అనేక కారణాలుంటాయి. ఉదా. కంటి సమస్యలు, చెవి సమస్యలు (లాబ్రెంతైౖటిస్), ఆల్బెనిజం, మెదడు సమస్యలు, కొన్ని సార్లు కొన్ని మందుల వల్ల కూడా ఈ విధమైన లోపాలు ఏర్పడుతుంటాయి. ఇక ఆప్సోక్లోనస్ విషయానికి వస్తే... కళ్లు నాన్ రిథమిక్‌గా, అనేక డైరెక్షన్స్‌లో తిరుగుతుంటాయి. కళ్లను చూస్తే ఏదో కలవరంతోనో, కోపంతో (ఆజిటేటెడ్గా) ఉన్నట్లు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ స్థితి న్యూరోబ్లాస్టోమా అనే తీవ్రమైన మెదడు జబ్బుకి మొదటి సూచిక అయిండవచ్చు. మీ అబ్బాయి విషయంలో సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేయించడంతో పాటు ఒకసారి బ్రెయిన్ స్కాన్ కూడా చేయించడం మంచిది. ఒకవేళ కంటి సమస్య ఉన్నట్లు నిర్థారణ అయితే (అది ముఖ్యంగా కంటి కండరాలకు సంబంధించిన సమస్య అయినప్పుడు) కొన్ని రకాల శస్త్ర చికిత్సల ద్వారా సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు. మీవాడి సమస్యకు కారణం ఏమిటనేది తెలుసుకుంటేనే ఇదమిత్థంగా పరిష్కారం చెప్పడం వీలవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీ కంటి వైద్య నిపుణులని కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి. బాబుకు మాటిమాటికీ జ్వరం... ఎందుకిలా? మా బాబు వయసు రెండేళ్లు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. తగ్గినా మళ్లీ తిరగబెడుతోంది. మందులు వాడినంత సేపే గుణం కనిపించి ఆ తర్వాత మళ్లీ ఒళ్లు వెచ్చబడుతోంది. వాడికి ఇలా మాటిమాటికీ జ్వరం రావడంతో మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. – వి. రంగారావు, ఒంగోలు పిల్లలు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం మామూలే. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం అనే లక్షణం కనిపించవచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా... యూరినరీ ట్రాక్ట్‌కు సంబంధించిన సమస్య ఉందేమో చూడాలి. కాబట్టి ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలు చేయించండి. అందులో ఏమీ కనిపించకపోతే దీర్ఘకాలికమైన జబ్బులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు – మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం హానికరం. కాబట్టి మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ప్రొబయాటిక్‌తో స్టాఫికోకాకస్ బ్యాక్టీరియా హతం..
శరీరంలో బోలెడన్ని చెడు, మంచి బ్యాక్టీరియా ఉంటాయని మనకు చాలాకాలంగా తెలుసు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన రాజమంగళ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు యాదృచ్ఛికంగా కనుక్కున్న ఓ అంశమిప్పుడు బ్యాక్టీరియాను కూడా కొన్ని రకాల వ్యాధుల చికిత్సకు వాడుకోవచ్చునని చెబుతోంది. జీర్ణక్రియను వృద్ధి చేసేందుకు ఉపయోగించే ఓ ప్రొబయాటిక్ పదార్థంలోని లాసిల్లస్ బ్యాక్టీరియా ప్రమాదకరమైన స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని వీరు గుర్తించారు.స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా శరీరంలో యాంటీబయాటిక్ నిరోధకత పెరిగేందుకు కారణమవుతుంది. ఇంకోలా చెప్పాలంటే ఏ మందు వేసుకున్నా పనిచేయకుండా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్టీరియా కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది మరణిస్తున్నారని, ముక్కుల్లో, పేవుల్లో నిద్రాణంగా ఉంటూ చర్మపు పొర దాటి బయటకు వచ్చినప్పుడు మాత్రం మృత్యుకారకమవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త యాంథొనీ ఫాసీ తెలిపారు. దాదాపు రెండు వందల మంది గ్రామీణ థాయ్‌లాండ్ ప్రజలను పరిశీలించినప్పుడు.. సుమారు స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా లేని వారిలో బాసిల్లస్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. లుకలకు బాసిల్లస్ బ్యాక్టీరియా అందించినప్పుడు వాటిలోని స్టిఫాలోకాకస్ వేగంగా నాశనమైనట్లు తెలిసింది. మనం గుర్తుంచుకునేవి.. 5000 ముఖాలే! ఒక్కసారి చూస్తే చాలు.. నేను ఎవర్నీ మరచిపోను అని ఎవరైనా అంటూంటే వెంటనే నమ్మేయకండి. ఎందుకంటే మనిషిన్నవాడు ఐదువేల కంటే ఎక్కువ ముఖాలను గుర్తుపెట్టుకోలేడని అంటున్నారు యార్క్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. సోషల్ మీడియాతోపాటు వ్యక్తిగత జీవితంలో ఎవరు ఎంతమంది ముఖాలను గుర్తుపెట్టుకోగలరో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక పరీక్ష పెట్టారు. వందమందిపై ఈ పరీక్ష జరిపినప్పుడు ఈ విషయం తెలిసింది. ఓ గంట సమయమిచ్చి.. మీకు గుర్తున్న వారందరి పేర్లు రాయాల్సిందిగా చెప్పినప్పుడు వీరు తమ పాఠశాల మిత్రులు మొదలుకొని సహాద్యోగుల వరకూ చాలామంది పేర్లు రాశారు. ఆ తరువాత కొందరు ప్రముఖుల చిత్రాలు చూపి వారిలో ఎంతమందిని గుర్తించగలరో పరీక్షించారు. సమయం గడుస్తున్న కొద్దీ పేర్లు రాసే, ముఖాలను గుర్తించే వేగం తగ్గిపోవడాన్ని ఆధారంగా చేసుకుని వాళ్లు ఎన్ని ముఖాలు గుర్తుంచుకోగలరో శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఒకే వ్యక్తి తాలూకూ రెండు ఫొటోలను గుర్తించాలన్న నిబంధన కూడా ఉండటం వల్ల ఫలితాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జెర్కిన్స్ తెలిపారు. విమానాల్లో ఉపయోగించే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని అంచనా. కీటోడైట్‌తో మెదడుకు మేలు! పిండిపదార్థాలు తక్కువగా, కొవ్వులు ఎక్కువగా తీసుకునే ఆహారం కీటోడైట్‌తో జ్ఞానశక్తికీ మేలు జరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో కీటోడైట్‌తో వాటి మెదడు సంబంధిత ఆరోగ్యం మెరుగుపడిందని కెంటకీ యూనివర్శిటీకి చెందిన ఐ–లిన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక ప్రయోగం ప్రకారం... కీటోడైట్ అందించిన ఎలుకల నాడీ సంబంధిత క్రియలు మరింత సమర్థంగా జరిగాయి. మూర్ఛతోపాటు ఆటిజమ్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులపై కీటోడైట్ సానుకూల ప్రభావం చూపుతుందన్న గత పరిశోధనల ఆధారంగా ఐ–లిన్ తాజా ప్రయోగాలు చేపట్టారు. మెదడుకు రక్త ప్రసరణ, నాడీ సంబంధిత నాళాల ఆరోగ్యం, మెదడుకు, రక్తానికి మధ్య ఉన్న త్వచం క్రియలు సక్రమంగా జరగడం జ్ఞానశక్తికి ఎంతో కీలకమని ఈ నేపథ్యంలో కొన్ని ఎలుకలను రెండు గుంపులుగా చేసి ఒకదానికి కీటోడైట్ ఇంకోదానికి సాధారణ ఆహారం అందించామని ఐ–లిన్ తెలిపారు. దాదాపు పదహారు వారాల తరువాత పరిశీలించినప్పుడు కీటోడైట్ ఇచ్చిన ఎలుకల మెదళ్లకు రక్తప్రసరణ మెరుగైందని, పేవుల్లోని బ్యాక్టీరియాలో సమతౌల్యత కనిపిచిందని వివరించారు. కీటో ఆహారం మెకనిస్టిక్ టార్గెట్ ఆఫ్ రాపమైసిన్ అనే రసాయనం ఉత్పత్తిని నిరోధించడం దీనికి కారణం కావచ్చునని అన్నారు. కీటోడైట్ కాకుండా.. కేలరీలను తక్కువ చేసినప్పుడు మాత్రమే శరీరంలో ఈ రాపమైసిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. కీటోడైట్ మనుషుల్లోనూ ఇదే రకమైన ఫలితాలు చూపుతుందా? లేదా? అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని అన్నారు. -
బంగారం తింటుంది.. ఇంధనం ఇస్తుంది!
సష్టి చాలా విచిత్రమైంది. మూరెల్లా థెర్మోఅసిటికా అనే బ్యాక్టీరియా విషయమే తీసుకోండి. కాసింత బంగారం పడేస్తే... సౌరశక్తిని వాడుకుని బోలెడంత ఇంధనం ఇస్తుంది. యూసీ బెర్క్లీ శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియంపై కొన్ని పరిశోధనలు చేశారు. కాడ్మియం సల్ఫైడ్ నానో కణాలను బ్యాక్టీరియాపై పొరలకు అతికించి చూసినప్పుడు ఒకొక్కటి మినీ రియాక్టర్లు అయిపోయాయి.ఆ తరువాత ఇవి సౌరశక్తిని వాడుకుని కార్బన్‌డైయాక్సైడ్‌ను కాస్తా ఉపయోగకరమైన రసాయనాలు ఇంధనాలుగా మారుస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు శక్తిని తయారు చేసుకున్నట్లు అన్నమాట. కాడ్మియం సల్ఫైడ్ స్థానంలో బంగారు నానోకణాలను వాడినప్పుడు ఇంధనాల ఉత్పత్తి మరింత మెరుగైనట్లు యూసీ బెర్క్లీ శాస్త్రవేత్త యాంగ్ చేసిన తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కాడ్మియం సల్ఫైడ్ కేవలం దశ్యకాంతిని మాత్రం శోషించుకోగలిగేది. అదే సమయంలో బ్యాక్టీరియాకు ఈ రసాయనం విషం. బంగారు నానోకణాలను వాడినప్పుడు మాత్రం ఈ లోపాలు తొలగిపోయి.. కార్బన్ డైయాక్సైడ్ నుంచి 33 శాతం ఎక్కువ అసిటేట్ ఇంధనం లభించిందని యాంగ్ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఖర్చు తగ్గించడంతోపాటు, ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఆ తరువాత ఈ పద్ధతి ద్వారా చౌకైన, మళ్లీమళ్లీ ఉత్పత్తి చేసుకోగల ఇంధనాల తయారీ సాధ్యమవుతుందని వివరించారు. -
కేన్సర్‌కు బ్యాక్టీరియా చికిత్సతో సత్ఫలితాలు
ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధికి సమర్థమైన చికిత్స అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే హ్యూస్టన్‌లోని ఎండీ యాండర్సన్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ దిశలో ఓ కీలకమైన ముందడుగు వేశారు. కేన్సర్ కణితులు బాగా పెరిగినపోయిన దశలోనూ క్లాస్ట్రీడియం నోవీ అనే బ్యాక్టీరియా ద్వారా మెరుగైన చికిత్స కల్పించవచ్చునని వీరు నిరూపించారు. గతంలోనూ బ్యాక్టీరియాతో కేన్సర్ చికిత్సకు కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ తాజా ప్రయత్నం ద్వారా అతితక్కువ దుష్ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫిలిప్ జాన్‌కూ తెలిపారు. ఎందుకంటే.. సి.నోవీ బ్యాక్టీరియా ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాతావరణంలోనూ బాగా పెరుగుతుంది కాబట్టి. కేన్సర్ కణితులు ఉన్న ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. 2013 – 17 మధ్య కాలంలో తాము మొత్తం 24 మంది కేన్సర్ రోగులను ఎంపిక చేసి ప్రయోగాలు చేశామని.. పదివేల నుంచి 30 లక్షల బ్యాక్టీరియాను ఇంజెక్షన్ల రూపంలో కణితుల్లోకి ఎక్కించినప్పుడు కణితుల సైజు పది నుంచి 23 శాతం వరకూ తగ్గినట్లు తెలిసిందని ఫిలిప్ తెలిపారు. ఇమ్యునోథెరపీతోపాటు బ్యాక్టీరియాను కూడా అందించడం ద్వారా కేన్సర్‌కు మెరుగైన చికిత్స కల్పించవచ్చునని తమ పరిశోధనలు చెబుతున్నాయని వివరించారు. -
గ్యాస్ట్రైటిస్ అంటే ఏమిటి? తగ్గుతుందా? ఫ్యామిలీ డాక్టర్
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 46 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – టి. రామకోటేశ్వరరావు, విజయవాడ జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: ∙20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ హైపో థైరాయిడిజమ్ సమస్య నయమవుతుందా? నా వయసు 37 ఏళ్లు.ఈ మధ్య నేను బరువు పెరుగుతున్నాను. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంతో డాక్టర్‌ను సంప్రదిస్తే టీఎస్‌హెచ్ పరీక్ష చేయించారు. హైపోథైరాయిడిజమ్ అని తెలిసింది. హోమియోలో ఈ సమస్యను శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా? – ఒక సోదరి, నిజామాబాద్ మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙బరువు పెరగడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ రుమ టాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుందా? నా వయసు 57 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉంటున్నాయి. కీళ్లవద్ద ఎర్రగా మారుతోంది. హోమియోలో పరిష్కారం ఉందా? – వెంకటేశ్వరరావు, కర్నూలు సొంత రోగనిరోధక శక్తే దెబ్బతీసే ఆటోఇమ్యూన్ వ్యాధులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యమైనది. ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే వారిలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు బయటపడతాయి. ఇది మహిళలు, పురుషులు, కొన్ని సందర్భాల్లో పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. లక్షణాలు: ఈ వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే ఉండకపోవచ్చు. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేవు. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా కూడా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పేగు బ్యాక్టీరియా కరెంటు పుట్టిస్తుంది
మన పేగుల్లో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా కరెంటు పుట్టిస్తాయట! స్వీడన్‌లోని లుండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా ఈ విషయాన్ని నిరూపించారు. ఎలక్ట్రాన్ల క్రమ ప్రవాహమే కరెంట్ అన్నది మనకు తెలుసు. బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో కొన్ని ఎలక్ట్రాన్లను విడుదల చేస్తూంటాయి.. దీన్నే ఎక్స్ట్రా సెల్యులార్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని పిలుస్తూంటారు. ఖనిజ లవణాలను జీర్ణం చేసుకునే బ్యాక్టీరియాల్లో ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో స్వీడన్ శాస్త్రవేత్తలు ఇతర బ్యాక్టీరియాపై దృష్టి పెట్టారు. మన పేగుల్లో ఉండే ల్యాక్టిక్ యాడిడ్ బ్యాక్టీరియం, ఎంటెరోకాకస్ ఫీకాలిస్ బ్యాక్టీరియాను పరిశీలించినప్పుడు అవి తమ పరిసరాల్లోని చక్కెరలను జీర్ణం చేసుకునే క్రమంలో ఎలక్ట్రాన్లను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాక్టీరియాతోపాటు ఫంగస్, ఇతర బ్యాక్టీరియా సమక్షంలో ఇలా జరుగుతోందని.. మిగిలిన బ్యాక్టీరియా, ఫంగస్‌లు ఈ ప్రక్రియలో సాయపడుతున్నట్లు తెలిసింది. ఈ రకమైన సహకారం కారణంగానే ఎలక్ట్రాన్ రవాణా సాధ్యమవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త చెప్పారు. కొన్ని రకాల రసాయనాలను జీర్ణం చేసుకునేందుకు బ్యాక్టీరియాతోపాటు ఇతర సూక్ష్మజీవుల అవసరం కూడా ఉంటుందని దీన్ని బట్టి తెలుస్తోందని. ఇది కాస్తా మరింత సమర్థమైన మందులను తయారు చేసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. -
పీచుతో కడుపు సమస్యకు పరిష్కారం...
వయసు పెరిగిన కొద్దీ జీర్ణ సంబంధిత సమస్యలు పెరగడం సహజం. మన పేగుల లోపలి పొరలు బలహీనపడటం దీనికి కారణం. ఇంటస్టైనల్ బ్యారియర్ అని పిలిచే ఈ పొరలను గట్టిపరచుకోవడం సులువేనని రెబ్రో యూనిర్శిటీశాస్త్రవేత్తలు జాన్ పీటర్, గండామాల్స్ అంటున్నారు. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా, హానికారక పదార్థాల నుంచి రక్షణ కల్పించే పేగు పొరను గట్టిగా చేసుకోవచ్చునని చెప్పారు. 65 కంటే ఎక్కువ వయసున్న వారి పేగు పొరల నమూనాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన వారి పేగు పొరలతో పోల్చినప్పుడు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారి పొరలు దృఢంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈస్ట్ ఫంగస్ నుంచి లభించే పీచు పదార్థం ఒకటి వయసు మీరిన వారి పేగులపై మంచి ప్రభావం చూపుతున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైంది అన్నారు. కొంతమంది వృద్ధులకు రెండు రకాల పీచు పదార్థాలను ఆరు వారాల పాటు అందించి పరిశీలించినప్పడు మాత్రం పెద్ద తేడా లేకుండా పోయిందని అన్నారు. -
మందుల్లేకుండానే పళ్లపై గార మాయం!
మన నోట్లో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య సమతౌల్యత దెబ్బ తింటే పళ్లపై గార ఏర్పడుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ గార వల్ల పిప్పి పళ్లు రావడంతోపాటు తగిన చికిత్స కల్పించకపోతే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటివి వచ్చే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో నోటిలోని చెడు బ్యాక్టీరియాను తగ్గించేందుకు ఇల్లినాయి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నానో టెక్నాలజీ ఆధారిత పద్ధతిని ఒకదాన్ని అభివృద్ధి చేశారు. ఇది నోట్లో దాగి ఉన్న హానికారక బ్యాక్టీరియాను గుర్తించడంతోపాటు నాశనం చేస్తుంది కూడా. ఇందుకోసం తాము స్టెప్టోకాకస్ మ్యూటన్స్ బ్యాక్టీరియాను గుర్తించేందుకు ఓ వినూత్నమైన ప్రోబ్‌ను సిద్ధం చేశామని, కొన్ని మార్పుల ద్వారా ఈ ప్రోబ్ ఆ బ్యాక్టీరియాను నాశనం చేసేలా చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త దీపాంజన్ పాన్ తెలిపారు. ప్రోబ్‌లో హాఫీనియం ఆక్సైడ్తో కూడిన నానో కణాలు ఉంటాయని, కొన్ని రకాల ఎలుకలపై క్లోరోహెక్సిడైన్ అనే మందుతో కలిపి ఈ ప్రోబ్‌ను ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించారు. యాంటీబయాటిక్ మందులు వాడాల్సిన అవసరం లేకుండానే గారను తొలగించేందుకు ఇది మెరుగైన పద్ధతి అని, ప్రస్తుతం హైఫీనియం ఆక్సైడ్ వాడకం సురక్షితమేనా? కాదా? అన్నదాన్ని రూఢి చేసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ఆ తరువాత ఈ పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. -
కృత్రిమ రసాయనాలకు చెల్లు!
తినుబండారాలు, పానీయాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కృత్రిమ రసాయనాలను వాడతారన్నది అందరికీ తెలిసిందే. రెడీమేడ్ ఫుడ్‌ను తింటే జబ్బులొస్తాయని అనేదీ ఇందుకే. అయితే నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివఉఇటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇకపై కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడాల్సిన అవసరం లేదు. వీటికంటే మెరుగైన, సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన ప్రిజర్వేటివ్స్‌ను తాము అభివృద్ధి చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలవిలియం ఛెన్ తెలిపారు. కాయగూరలు, పండ్లలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్, ఫ్లేవనాయిడ్లు ఆహారాన్ని నిల్వ చేసేందుకు వాడుకోవచ్చునని వీరు నిరూపించారు. అంతేకాదు.. ఫ్లేవనాయిడ్లతో బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు కూడా వీరు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. పండ్ల రసాలు, మాంసం ఉత్పత్తుల్లో ఈ కొత్త రకం ప్రిజర్వేటివ్స్‌ను వాడి మెరుగైన ఫలితాలు సాధించామని కృత్రిమ ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహార పదార్థంలో ఆరు గంటల్లోనే బ్యాక్టీరియా కనిపిస్తే సహజ ప్రిజర్వేటివ్స్ రెండు రోజులపాటు ఆహారాన్ని తాజాగా ఉంచగలిగాయని ఛెన్ వివరించారు. ఈ కొత్త ప్రిజర్వేటివ్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు తాము పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నామని చెప్పారు. పరిశోధన వివరాలు ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఊబకాయానికి.. బ్యాక్టీరియాకు లింకు!
‘‘తినడం తగ్గించేశాను.. రోజూ వ్యాయామం చేస్తున్నాను. కాని ఒళ్లు తగ్గడం లేదు’’ ఈ రకమైన వ్యాఖ్యలు మనం తరచు వింటూంటాం. శరీర™ è త్వం అంతేనేమో అనుకుని సరిపెట్టుకుంటాం కూడా. అయితే అసలు కీలకం మన పేగుల్లోని బ్యాక్టీరియాలో ఉందంటున్నారు మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు. శరీరానికి శక్తినిచ్చే కేలరీలన్నీ ఒకేరకంగా ఉండవని, పేగుల్లోని బ్యాక్టీరియా మనం ఆహారాన్ని ఖర్చుపెట్టే క్రమాన్ని మార్చేడం ద్వారా ఒళ్లు పెరగడం/తగ్గడాలను ప్రభావితం చేస్తున్నట్లు వీరు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. బరువు తగ్గించుకోవాలనుకుంటున్న ఊబకాయుల పేగుల్లోని బ్యాక్టీరియాలో చాలా మార్పులు ఉన్నాయని వీరు గుర్తించారు. సులువుగా ఒళ్లు తగ్గే వారిలో ఫాస్కోలార్కోటో బ్యాక్టీరియం ఎక్కువగా ఉంటే, ఇతరుల్లో డయాలిస్టర్ బ్యాక్టీరియా సమృద్ధిగా ఉన్నట్లు తాము గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త వందనా నెహ్రా తెలిపారు. అలాగే కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయగల ఎంజైమ్‌ల విషయంలోను ఇరువురిలో తేడాలు ఉన్నట్లు తెలిసిందని ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వైద్యులు ఊబకాయులకు మరింత ప్రభావవంతమైన సలహా, సూచనలు ఇవ్వవచ్చునని వందన వివరించారు. -
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ
మీరు తరచూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాల ప్రకటనలు చూసి కూడా పట్టించుకోలేదా? మీరు మరోసారి తప్పక ఆలోచించండి. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనదేశంలో ఏటా 1,34,240 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇది 2025 నాటికి రెండు లక్షలకు పైగా చేరవచ్చని అంచనా. సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఏటా 72,825 మంది మృత్యువు బారిన పడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే...? గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఈ భాగం గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. పేరుకు తగ్గట్టు ఇది గర్భాశయ ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయవచ్చు. కారణాలేమిటి? సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానమైనది. ఈ వైరస్ సెక్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభా జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతివారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే తక్కువ వయసులోనే సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని, ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనే వారిలో హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. ఈ వైరస్‌లోనూ అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. ఒకవేళ అలా నశించకపోతే అది కొంతకాలం తర్వాత క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో పాటు పొగతాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని. నివారణ ఎలా? సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ఉపయుక్తమైన పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. అంటే మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం. హెచ్‌పీవీ వ్యాక్సిన్ అంటే..? శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ను తయారు చేస్తుంది. అయితే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్నూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ (టీకా) ఇప్పించడం వల్ల అది శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి హెచ్‌పీవీ వైరస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ యోని క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. అయితే తొమ్మిదేళ్లు నిండినవారి నుంచి 18 ఏళ్ల వరకు ఉండే ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ఆర్నెల్ల వ్యవధిలో మూడుసార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
తీ ఇన్ వన్ స్మార్ట్ విండో!
మీ ఇంట్లోని కిటికీలు ఒకేసారి మూడు పనులు చేయగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేశారు నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. వీరు అభివృద్ధి చేసిన స్మార్ట్ కిటికీలు ఒకవైపు ఎండను, ఇంకోవైపు వేడిని నియంత్రిస్తూనే మరోవైపు హానికారక సూక్ష్మజీవులను చంపేయగలవు. విమానాలు మొదలుకొని ఆసుపత్రులు, బస్సులు, రైళ్లలో ఈ కిటికీలను వాడితే బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించగలమనీ, అదే సమయంలో ఎండ, వేడిని నియంత్రించడం ద్వారా బోలెడంత డబ్బును కూడా ఆదా చేయగలమని అంటున్నారు షియా అనే శాస్త్రవేత్త. టంగ్స్టన్ ట్రయాక్సైడ్ అనే ప్రత్యేక పదార్థం వాడటం ద్వారా ఇది సాధ్యమవుతోందని, విద్యుత్తు ఛార్జ్ లేదా రసాయనాల ద్వారా ఈ పదార్థం తక్కువ సమయంలో కాంతిని ప్రసారం చే యడం లేదా అడ్డుకునే స్థితికి మారగలదని చెప్పారు. అదే సమయంలో సూర్యరశ్మిలోని పరారుణ కాంతికిరణాలను వేడిగా మార్చడం ద్వారా భవనం లోపలి భాగపు ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చునని వివరించారు. టంగ్స్టన్ ట్రయాక్సైడ్కు నానోస్థాయి బంగారు కణాలను చేర్చడం ద్వారా వేడిని గ్రహించవచ్చునని చెప్పారు. ఈ వేడి వల్ల కిటికీ ఉపరితలంపై ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్లు జీవించలేవని అన్నారు. -
బ్యాక్టీరియా వల్లే డయేరియా
మిరియాల (కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో ప్రబలిన డయేరియాకు నీటిలో ఉన్న బ్యాక్టీరియానే ప్రధాన కారణమని గుంటూరులోని రీజినల్ ల్యాబ్æ నుంచి శుక్రవారం రిపోర్టులు వచ్చాయి. దీంతో డీటీసీవో డాక్టర్ రమేష్ శుక్రవారం గ్రామంలో పర్యటించారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు, డాక్టర్లు ఎస్. ప్రియాంక, సిబ్బందితో గ్రామంలో ఆయన సమావేశమయ్యారు. బోర్లు, రక్షిత నీటి ట్యాంకుల నీటిలో బ్యాక్టీరియా ఉందని రిపోర్టు వచ్చిందని, నివారణ చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రెయినేజీలో ఉన్న నీటి పైపులను మార్చాలని, శిథిలమైన పైపుల స్థానంలో కొత్తవి వేయాలని, ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని, శానిటేషన్‌ను ఇంకా మెరుగుపర్చాలని, తర్వాత గ్రామస్తులకు హెల్త్ ఎడ్యుకేషన్‌పై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ఇప్పటికే ట్యాంకులు శుభ్రం చేయించామని, గ్రామంలో ఉన్న బోర్లను ఫ్లషింగ్ చేయిస్తున్నామని, పైపులు కొత్తవి రాగానే మెయిన్ లైన్ మొత్తం మారుస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్వర్లు వివరించారు. డ్రెయినేజిలో ఉన్న పైపులను తీసివేసి పాత పైపుల స్థానంలో కొత్తవి వేయడానికి నాలుగైదు రోజులు పడుతుందన్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని కూడా క్లోరినేషన్ చేయాలని, ముఖ్యంగా ఇళ్లలో ఉన్న బోరు నీటిని కాచి చల్లార్చిన తర్వాతనే తాగాలని సూచించారు. అలా చేయక పోవడం వల్లే కొత్త కేసులు వస్తున్నాయని అధికారులు చెప్పారు. పరిశుభ్రతపై గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని వైద్య అధికారులకు డాక్టర్ రమేష్ సూచించారు. ఈ పనులన్నీ పూర్తి చేసి వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని ఆయన కోరారు. మరో మూడు కేసులు నమోదు.. గ్రామంలో శుక్రవారం మరో మూడు డయేరియా కేసులు నమోదయ్యాయని వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ ప్రియాంక తెలిపారు. వారి పరిస్థితి అదుపులోనే ఉందని, గ్రామంలోనే చికిత్స అందిస్తున్నామన్నారు. గ్రామంలో చికిత్స పొందుతున్న వారు చాలా వరకు కోలుకున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దారెడ్డి కరుణాకరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆయనకు కిడ్నీ వ్యాధి కూడా ఉండడంతో డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మరో రోగి బత్తుల పున్నయ్యకు కూడా కిడ్నీ సమస్య ఉండడంతో నరసరావుపేట మహాత్మాగాం«ధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారి ఆరోగ్యం మెరుగవుతోందని డాక్టర్లు తెలిపారు. కొనసాగుతున్న నివారణ చర్యలు గ్రామంలో శుక్రవారం నాటికి మూడు ఓవర్ హెడ్ ట్యాంకు క్లీనింగ్ పనులు పూర్తయ్యాయని ఏఈ రత్నబాబు తెలిపారు.మూడు బోర్లు ప్లషింగ్ చేశామని మరో నాలుగు చేయాల్సి ఉందని, కొత్త పైపులైన్ వేయడానికి పైపులకు ఆర్డర్ ఇచ్చామని ఐదు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోందని, బోర్లు, బావుల్లో నీటిని ఎవరు తాగవద్దని సూచించారు. -
జన్యువులను నిర్వీర్యం చేసి బ్యాక్టీరియాను చంపేస్తారు
వ్యాధికారక బ్యాక్టీరియాను చంపేయాలంటే ఏం చేస్తాం. యాంటీబయాటిక్స్ వాడతాం. అంతేకదా.. అయితే ఈ క్రమంలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా కూడా అంతమైపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పెన్ స్టేట్ మెడికల్ కాలేజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. బ్యాక్టీరియా జన్యువులను నిర్వీర్యం చేయడం ద్వారా కేవలం చెడు బ్యాక్టీరియా మాత్రమే నాశనమయ్యేలా చేయవచ్చునని వీరు అంటున్నారు. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మన పేగుల్లో సి.డిఫికైల్ అనే బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆ బ్యాక్టీరియా మనుగడకు కీలకమైన జన్యువులను నిర్వీర్యం చేసే మందులు తయారు చేసి వాడారు. సక్రమంగా పనిచేయడంతో ఇదే పద్ధతిని ఇతర బ్యాక్టీరియాకు వర్తింప చేయవచ్చునని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అరుణ్ శర్మ అంటున్నారు. బ్యాక్టీరియా రకాన్ని బట్టి మందును తయారు చేస్తున్నాం కాబట్టి ఆ బ్యాక్టీరియా మాత్రమే నాశనమవుతుందని.. మిగిలినవాటికి ఏ మాత్రం హాని జరగదు కాబట్టి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని వివరించారు. అభివృద్ధి చేసిన మూడు ముందుల ద్వారా కూడా అతితక్కువ దుష్ప్రభావాలు కనిపించడం ఇంకో విశేషమని చెప్పారు. -
కొంప ముంచేస్తున్న బ్యాక్టీరియా!
నిమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధులొస్తే యాంటీబయాటిక్‌ల వాడకం తప్పనిసరి. వ్యాధి కారక బ్యాక్టీరియాలను ఈ మందులు చంపేస్తాయి. ఈ క్రమంలో కొన్ని మందులకు నిరోధకతను పెంచుకుంటాయి. మరికొన్ని అటు నిరోధకత పెంచుకోవడంతోపాటు ఇటు ఆ మందులను ఆహారంగానూ మార్చేస్తున్నాయి! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. పదేళ్ల క్రితం బ్యాక్టీరియా యాంటీబయాటిక్‌లను తినేసే అవకాశముందని తాము చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారని తాజా పరిశోధనలను బట్టి చూస్తే ఈ బ్యాక్టీరియా కర్బనం కోసం ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోందని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గౌతమ్ దంతాస్ తెలిపారు. యాంటీబయాటిక్ నిరోధకత అన్నది ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో అతి ముఖ్యమైందని, కొత్త మందుల అభివృద్ధి జరగక ముందే నిరోధకత పెరిగిపోతే ప్రాణనష్టం తీవ్రమవుతుందని గౌతమ్ అన్నారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్‌లను కొన్ని రకాల బ్యాక్టీరియా ఎలా తట్టుకుంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించామని, నేలలో ఉండే నాలుగు రకాల బ్యాక్టీరియా పై పరిశోధనలు జరిపినప్పుడు అవన్నీ పెన్సిలిన్పై ఆధారపడి బతుకుతున్నట్లు తెలిసిందని వివరించారు. ఈ పరిశోధనల ఆధారంగా భవిష్యత్తులో మెరుగైన యాంటీబయాటిక్‌లను తయారుచేయడం సాధ్యమవుతుందని అంచనా. -
34 గ్రామాల నీటిలో బ్యాక్టీరియా
సాక్షి, అమరావతి బ్యూరో: నగరంలో డయేరియా వ్యాధికి గురై 30 మందికిపై మృత్యువాత పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ విస్తరణాధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు ఏర్పడ్డారు. ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 3124 శాంపిల్స్ సేకరించారు. హైడ్రోజన్ సల్ఫైడ్ వైల్ ద్వారా నీటి నమూనాలను పరిక్షించారు. అందులో 34 శాంపిల్స్ సురక్షితం కాదని గుర్తించారు. ఈ నీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నీటిని సూపర్ క్లోరినేషన్ చేశారు. పెదకూరపాడు, వినుకొండ, వెల్దుర్తి, మాచవరం, కారంపూడి మండలాలలో ఈ సమస్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 177 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతుందని, రూ.10.23 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నీటి సమస్య రానివ్వం గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్యాంకర్ల సంఖ్యను పెంచుతున్నాం. పైపులైన్లకు మరమ్మతులు చేపడుతున్నాం.– భాను వీరప్రసాద్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్, గుంటూరు -
ప్రోబయాటిక్స్‌తో కాలేయానికి మేలు!
పెద్దల మాట చద్దిమూట అని ఊరికే అన్నారా? మజ్జిగ, ఆవకాయ వంటి ప్రోబయాటిక్ ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారుగానీ.. శాస్త్రవేత్తలు తాజాగా వీటినే శాస్త్ర పరిశోధనల చట్రంలో నిరూపిస్తున్నారు. విషయం ఏమిటంటే.. మన కడుపు, పేవుల్లోని బ్యాక్టీరియాు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిసినప్పటి నుంచి ప్రోబయాటిక్స్‌పై కూడా పరిశోధనలు ఊపందుకున్నాయి. ఎమరీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో ఈ ప్రోబయాటిక్స్ కాలేయానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసింది. బ్యాక్టీరియా మన జీవక్రియల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది? అందుకు ఏ ఏ పరమాణువులు ఎలా కారణమవుతున్నాయి? అన్న అంశాలను తమ పరిశోధనల ద్వారా తెలుసుకోగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సయీదీ తెలిపారు. లాక్టోబాసిల్లస్ రామ్నోసస్ జీజీ అనే బ్యాక్టీరియాపై తమ పరిశోధనలు జరిగాయని, రెండు వారాలపాటు ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న ఆహారంతోపాటు కాలేయానికి చేటు చేయగల రసాయనాన్ని ఉద్దేశపూర్వకంగా అందించామని, ఆశ్చర్యకరంగా ప్రోబయాటిక్స్ తీసుకుంటున్న ఎలుకల్లో నష్టం చాలా తక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని వివరంచారు. బ్యాక్టీరియా కారణంగా శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు స్పందించి రసాయనం కారణంగా ఎక్కువైన ఫ్రీరాడికల్స్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా కాలేయానికి నష్టం తగ్గినట్లు చెప్పారు. ఈ ఫలితాలు మానవుల్లోనూ ఇలాగే ఉంటే.. ప్రోబయాటికక్స్ వాడకం ద్వారా కాలేయానికి జరిగే నష్టాన్ని తగ్గింవచ్చునని అన్నారు. -
జన్యు వైద్యం మరింత చేరువ!
శరీరంలోని ప్రతి కణంలో జన్యుమార్పులను గుర్తించి సరిచేసేందుకు ఓ యంత్రం సిద్ధమవుతోందా? అవునంటున్నారు అల్బ్రెట్టా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. బ్రిడ్జ్డ్ న్యూక్లియిక్ యాసిడ్ లేదా బీఎన్ఏ అనే కృత్రిమ ఆర్ఎన్ఏ ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునని బాసిల్ హబ్బార్డ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. జన్యువులను మన అవసరాల మేరకు కత్తిరించేందుకు, అదనపు భాగాలను జోడించేందుకు ప్రస్తుతం క్రిస్పర్ క్యాస్ 9 పేరుతో ఒక టెక్నాలజీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. బ్యాక్టీరియా తనపై జరిగిన దాడులను గుర్తుంచుకుని భవిష్యత్తులో అవే రకమైన దాడులు జరిగినప్పుడు తగు విధంగా ప్రతిఘటించడం క్రిస్పర్లోని ముఖ్యమైన అంశం. అయితే ఈ టెక్నాలజీ ద్వారా కూడా కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశముందని బీఎన్ఏ ద్వారా జన్యుమార్పులు కనీసం పదివేల రెట్లు ఎక్కువ కచ్చితంగా జరుగుతాయని బాసిల్ తెలిపారు. శరీరంలోని కోటానుకోట్ల కణాల్లో మార్పులు చేయడం క్రిస్పర్‌తో సాధ్యమైనప్పటికీ ఒక్క చిన్న పొరబాటు జరిగినా క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చేస్తాయి. ఈ సమస్యలను కూడా బీఎన్ఏ ద్వారా అధిగమించవచ్చునని బాసిల్ తెలిపారు. ప్రస్తుతానికి తమ పరిశోధన ప్రాథమిక స్థాయిలోనే ఉందని.. కాకపోతే తప్పులకు దాదాపు ఆస్కారం లేని బీఎన్ఏ ద్వారా భవిష్యత్తులో ఎన్నో వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించవచ్చునని హాబార్డ్ అంటున్నారు. -
తింటేనే.. కొవ్వులు కరుగుతాయి!
కొవ్వు పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని. ఇదీ మనం తరచూ వినే మాట. అయితే నిన్నమొన్నటివరకూ నెయ్యి, కొబ్బరినూనెల వాడకంపై ఎన్నో అపోహలు ఉండగా.. మితంగానైనా వాటిని తీసుకోవడం మేలని కొందరు వైద్యులు స్వయంగా సూచిస్తున్నారు. తాజాగా తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే.. కొవ్వు పదార్థాలు మన చిన్నపేవుల్లో బ్యాక్టీరియా పెరుగుదలకు సాయపడతాయని.. అంతేకాదు.. ఈ మార్పు వల్ల కొవ్వు జీర్ణమవడమూ వేగవంతమవుతుందని షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఎగ్యూన్ బి.చాంగ్ అంటున్నారు. అమెరికా వంటి పాశ్చాత్యదేశాల్లో ఎక్కువగా తీసుకునే ఆహారంపై వీరు పరిశోధనలు చేశారు. బ్యాక్టీరియా దాదాపుగా లేని.. బ్యాక్టీరియా లేని అనే రెండు రకాల ఎలుకలకు అధిక కొవ్వులు ఉన్న ఆహారం అందించి పరిశీలించారు. తొలి రకం ఎలుకలు కొవ్వులను జీర్ణం చేసుకోలేక ఇబ్బంది పడితే.. రెండో రకం ఎలుకల పేవుల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందింది. మొదటి రకం ఎలుకలకు ఈ బ్యాక్టీరియాను ఎక్కించినప్పుడు అవి కూడా వేగంగా లావెక్కడం మొదలుపెట్టాయి. ఇంకోలా చెప్పాలంటే వాటికి కొవ్వులు వంటబట్టడం మొదలైందన్నమాట. అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్న 24 నుంచి 48 గంటల్లోనే చిన్నపేవుల్లో బ్యాక్టీరియా గణనీయంగా పెరుగుతుందని.. వీటి స్రావాలు కొవ్వును విడగొడతాయని.. చాంగ్ చెబుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించేందుకు మరింత మెరుగైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. -
వామ్మో గుడ్లు.. సల్మొనెల్లా భయం
న్యూయార్క్, అమెరికా : అమెరికా దేశ ప్రజలను సల్మొనెల్లా బ్యాక్టీరియా వణికిస్తోంది. కోడిగుడ్ల ద్వారా సల్మొనెల్లా వ్యాధి ప్రజలకు సోకుతుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా అమెరికాలోని సెమార్ రోజ్ ఎకర్స్ ఫార్మ్స్ దాదాపు 20 కోట్ల గుడ్లను వెనక్కు తీసుకుంది. ఇప్పటివరకూ 22 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. హైడె కౌంటీ, న్యూయార్క్, కొలరాడో, ఫ్లారిడా, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, సౌత్ కరోలినాయ, వర్జీనియా, పశ్చిమ వర్జీనియాల్లో ఈ బ్యాక్టీరియా ప్రభావం ఉన్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ పేర్కొంది. 2010 తర్వాత అమెరికాలో ఇంత భారీ మొత్తంలో కోడిగుడ్లను వెనక్కు తీసుకోవడం ఇదే తొలిసారి. ఏంటి సల్మొనెల్లా? కోడిగుడ్లలో నిల్వ ఉండే బ్యాక్టీరియా వల్ల జ్వరం, విరేచనాలు, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి కలుగుతుంది. ఈ స్థితి ఎక్కువ సేపు కొనసాగడం వల్ల మరణం కూడా సంభవించవచ్చు. -
బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనేందుకు కొత్త అస్త్రం
అంచనాలు తల్లకిందులవడం సైన్స్‌లో కొత్తేమీ కాదు. ఒకప్పుడు పనికిరావు, విసర్జితాలు అనుకున్న చెడు యాంటీబాడీల విషయంలో ఇప్పుడు అదే రుజువైంది. బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో ఈ చెడు యాంటీబాడీలే మెరుగైన అస్త్రాలుగా మారతాయని గార్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా రుజువు చేశారు. శరీరంలోని కణజాలం పైనే దాడి చేయడం మొదలుపెడుతున్న కారణంగా మన శరీరంలోని కొన్ని యాంటీబాడీలు చెడు చేసేవని.. కొంతకాలం తరువాత ఇవి వాటంతట అవే నిర్వీర్యమైపోతాయని ఇంతకాలంగా శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితి కొంతకాలమే అని ప్రొఫెసర్ డేనియల్ క్రైస్ట్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ చెడు యాంటీబాడీలు కొంతకాలం తరువాత.. శరీరానికి సూక్ష్మజీవుల ద్వారా ముప్పు ఉందని స్పష్టమైనప్పుడు ఇవే వాటిపై పోరాడేందుకు సిద్ధమైపోతాయి అని తాము గుర్తించామని క్రైస్ట్ చెప్పారు. రోగ నిరోధక వ్యవస్థ కళ్లు కప్పే బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో ఇవి మరింత మెరుగ్గా పనిచేస్తాయని తాజా అంచనాలు చెబుతున్నాయి. హెచ్ఐవీ మొదలుకొని అనేక ఇతర వ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని క్రైస్ట్ తెలిపారు. -
బ్యాక్టీరియాతో పెట్రోల్‌లాంటి ఇంధనం ఉత్పత్తి!
పెట్రోల్‌లాంటి ఇంధనాన్ని బ్యాక్టీరియాతో ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ అంటున్నారా? అమెరికా శాస్త్రవేత్తల పుణ్యమా అని త్వరలోనే ఈ అద్భుతం వాస్తవం కానుంది. సరస్సులు, మురికినీటిలోన ఉండే రెండు వేర్వేరు బ్యాక్టీరియా సమూహాల్లోని ఎంజైమ్‌ను ఉపయోగిస్తే బ్యాక్టీరియా స్వయంగా టౌలీన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయగలవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త హారీ బెల్లర్ అంటున్నారు. పెట్రోలు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు టౌలీన్ను ఉపయోగిస్తూంటారు. ఏటా ఈ రసాయనం దాదాపు మూడు కోట్ల టన్నులు విక్రయమవుతూంటుంది. నిజానికి కొన్ని బ్యాక్టీరియా తక్కువస్థాయిలో టౌలీన్ను ఉత్పత్తి చేయగలవని 1980లలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. కాకపోతే ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు మాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలో హారీ ఈ రకమైన బ్యాక్టీరియాపై పరిశోధనలు మొదలుపెట్టారు. చివరకు సరస్సుల అడుగుభాగాల్లో, మురికినీటిలో ఉండే రెండు బ్యాక్టీరియా ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ సాయంతో పెద్దఎత్తున టౌలీన్ను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా టౌలీన్ ఉత్పత్తి పద్ధతులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని.. ఆ తరువాత బ్యాక్టీరియాతోనే ఈ రసాయనాన్ని ఉత్పత్తి చేయడం వీలవుతుందని హారీ వివరించారు. -
కృత్రిమ యాంటీబయాటిక్ సక్సెస్...
బ్యాక్టీరియా, వైరస్లు మనం వాడే మందులకు అలవాటు పడిపోతున్న తరుణంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి కృత్రిమ యాంటీబయాటిక్‌తో వాటికి చెక్ పెట్టేశారు. మూడేళ్ల క్రితం శాస్త్రవేత్తలు టెక్సోబ్యాక్టిన్ అనే ఓ రసాయనాన్ని గుర్తించారు. యాంటీబయాటిక్ నిరోధకతకు ఇదో మేలి విరుగుడని శాస్త్రవేత్తలు అంచనా కట్టినా దాన్ని కృత్రిమంగా తయారు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా ఈ మందు కేవలం పరిశోధనలకు మాత్రమే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ లింకన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేపట్టి విజయం సాధించారు. టెక్సోబ్యాక్టిన్ తయారీ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించగలిగారు. ఈ కృత్రిమ మందుతో ఎలుకలపై పరిశోధనలు జరిపినప్పుడు అది సాధారణ బ్యాక్టీరియాతోపాటు సాధారణ మందులను తట్టుకోగల సూపర్బగ్లనూ సమర్థంగా ఎదుర్కోగలదని తెలిసింది. అంతేకాకుండా ఈ మందు ద్వారా ఇన్ఫెక్షన్ సమస్య కూడా తక్కువగా ఉంటుందని తెలిసింది. టెక్సోబ్యాక్టిన్ కృత్రిమ తయారీ సాధ్యమైన నేపథ్యంలో కొత్తరకం యాంటీబయాటిక్ మందులను అభివృద్ధి చేయడం చాలా సులువు కానుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఈశ్వర్‌సింగ్ తెలిపారు. అయితే అన్ని పరిశోధనలు పూర్తి చేసుకుని టెక్సోబ్యాక్టిన్ మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకా కొన్నేళ్లు పట్టవచ్చునని ఆయన అంటున్నారు. -
పరి పరిశోధన
వానొచ్చినా కరెంటు పుట్టించే సోలార్ ప్యానెల్! సూర్యుడు వెలుగులు చిమ్ముతున్నప్పుడు మాత్రమే కాకుండా.. వాన చినుకులు పడుతున్నప్పుడూ విద్యుత్తు ఉత్పత్తి చేయగల సరికొత్త సోలార్ ప్యానెల్స్‌ను చైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివద్ధి చేశారు. ఏసీఎస్ నానో జర్నల్ తాజా సంచిలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. ఈ హైబ్రిడ్ సోలార్ ప్యానెల్లో సాధారణ సిలికాన్ సోలార్సెల్స్తోపాటు ట్రైబోఎలక్ట్రిక్ నానో జనరేటర్లు ఉంటాయి. సిలికాన్ సెల్స్ సూర్యుడి వెలుతురును విద్యుత్తుగా మార్చేస్తే.. నానో జనరేటర్లు యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మారుస్తాయి. వాన చినుకులు ఈ ప్యానెల్‌పై పడినప్పుడు ఈ జనరేటర్లు వాటి ద్వారా అందే యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మారుస్తాయి. ఇలా రెండు రకాలుగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును జత చేసేందుకు ఒకే ఎలక్ట్రోడ్‌ను వాడటం ఇందులోని విశేషం. నానో జనరేటర్‌కు, సోలార్ సెల్‌కు మధ్య ఉండే ఈ ఎలక్ట్రోడ్ సోలార్ సెల్‌కు రక్షణ కవచంగానూ ఉపయోగపడుతుందని తద్వారా దాని సామర్థ్యం తగ్గకుండా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. అంతేకాకుండా ఈ ఎలక్ట్రోడ్ కాంతి ఎక్కువగా బయటకు వెళ్లకుండా అడ్డుకుని విద్యుదుత్పత్తిని పెంచుతుందని వివరించారు. ఆ బ్యాక్టీరియాతో మధుమేహులకు మేలు! పీచుపదార్థాలను పేగుల్లో పులిసిపోయేలా చేసే బ్యాక్టీరియాతో మధుమేహులకు ఎక్కువ లాభం చేకూరుతుందని రట్గర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. వేర్వేరు రకాల పీచుపదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ రకమైన బ్యాక్టీరియా పేగుల్లో వృద్ధి చెందేలా చేసుకోవచ్చునని.. తద్వారా రక్తంలో గ్లూకోజ్ మోతాదులను నియంత్రణలో ఉంచుకోవచ్చునని వారు అంటున్నారు. ఆరేళ్లపాటు కొంతమంది ఆహారపు అలవాట్లను.. వారు తీసుకునే పీచుపదార్థాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లిపింగ్ ఝావ్ తెలిపారు. పేగుల్లో మనం తినే ఆహారంలోని పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లను బ్యాక్టీరియా చిన్నచిన్న ముక్కలుగా చేస్తుందని.. ఈ క్రమంలో ఏర్పడే షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు పేగు గోడలకు చేరి వాపు/మంటలను తగ్గిస్తాయి. ఈ రకమైన ఫ్యాటీ యాసిడ్లు తక్కువైనప్పుడు మధుమేహం వంటి వ్యాధులు వస్తాయని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో తాజా అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణ ఆహారం తీసుకునే వారితో పోలిస్తే... వేర్వేరు రకాల పీచు పదార్థాలు ఆహారం రూపంలో తీసుకునే వారి రక్తంలో గ్లూకోజ్ మోతాదు నియంత్రణలో ఉన్నట్లు తెలిసింది. దాదాపు పన్నెండు వారాలపాటు సాగిన ఈ అధ్యయనంలో మూడు నెలల గ్లూకోజ్ మోతాదులను లెక్కించారు. బంగారం, టైటానియంతో అంధత్వానికి చెక్? అంధత్వంతో బాధపడుతున్న వారికి ఎంతో కొంత స్థాయిలో చూపు కల్పించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలోని యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల్లో పాక్షిక విజయం సాధించారు కూడా. బంగారం, టైటానియం వంటి లోహాలతో చూపు కోల్పోయిన ఎలుకలు మళ్లీ చూడగలిగేలా చేశారు వీరు. కళ్లల్లో కాంతికి స్పందించే కొన్ని ప్రత్యేక భాగాలు ఉంటాయి. వీటిని ఫొటో రిసెప్టర్లు అంటారు. కొన్ని ఎలుకల్లో జన్యుమార్పుల తద్వారా ఈ ఫొటో రిసెప్టర్లు క్రమేపీ నాశనమయ్యేలా చేసి వీరు కొన్ని పరిశోధనలు చేశారు. నాశనమైన ఫొటో రిసెప్టర్ల స్థానంలో బంగారం, టైటానియం నానో తీగలతో చేసిన ఫొటో రిసెప్టర్లను అమర్చినప్పుడు ఆ ఎలుకలు మళ్లీ కొన్ని రంగులను చూడగలిగినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. అంతేకాకుండా లోహపు ఫొటో రిసెప్టర్లు కలిగి ఉన్న ఎలుకలు వెలుతురుకు స్పందించడం మొదలుపెట్టాయని.. ఎనిమిది వారాల తరువాత కూడా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదని వివరించారు. రెటినైటిస్ పిగ్మెంటోసా, మాక్యులర్ డిజనరేషన్ వంటి కంటివ్యాధులకూ ఈ పరిశోధన ద్వారా మెరుగైన చికిత్స అందించేందుకు వీలుందని నిపుణుల అంచనా. -
హెచ్‌సీయూ చెరువులో అరుదైన బ్యాక్టీరియా
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లోని బఫెల్లో చెరువులో అరుదైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. రెండేళ్లుగా వర్సిటీలోని ప్లాంట్ సైన్సెస్ ల్యాబ్‌లో ప్లాంట్ సైన్సెస్ విభాగాధిపతి ప్రొఫెసర్ సీహెచ్ వెంకటరమణ చేస్తున్న పరిశోధనల్లో దీనిని కనుగొనడం విశేషం. దీనికి ‘ప్లాంటోపైరస్’అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. అరుదైన యాంటీ బయాటిక్‌ను ఉత్పత్తి చేసే ఇలాంటి బ్యాక్టీరియాను కనుగొనడం దేశంలోనే మొదటిçసారని వెల్లడించారు. ఈ యాంటీ బయాటిక్ ద్వారా ప్లాంటోమైసిటీని ఉత్పత్తి చేసి నూతన ఔషధాల తయారీకి వినియోగించవచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా పరిశ్రమల్లోని అమోనియా వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అరుదైన బ్యాక్టీరియాను వర్సిటీ చెరువులో కనుగొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, దీన్ని పెంచడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
శని ఉపగ్రహంలో గ్రహాంతర జీవులు?
గ్రహాంతర జీవుల కోసం బోలెడన్నిచోట్ల వెతికే పని లేదని.. మన సౌర కుటుంబంలోని శనిగ్రహపు ఉపగ్రహమైన ఎన్‌సెలడూస్‌లోనే ఇవి ఉండే అవకాశముందని అంటున్నారు వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. భూమ్మీద అతిక్లిష్టమైన పరిస్థితుల్లో నివసించే మీథెనోథెర్మో కాకస్ అనే బ్యాక్టీరియాతో పరిశోధనలు చేయడం ద్వారా తామీ అంచనాకు వచ్చామని సైమన్ రిట్‌మాన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. సముద్రపు అడుగున ఉండే అగ్నిపర్వత బిలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే చోట్ల ఈ బ్యాక్టీరియా కార్బన్ డైయాక్సైడ్ ను మీథేన్ వాయువుగా మారుస్తూంటుంది. శాస్త్రవేత్తలు ఎన్సెలడూస్పై ఉండే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి ఈ బ్యాక్టీరియాను వదిలినప్పుడు అవి బాగా ఎదిగాయి. ఆ గ్రహపు ఉపరితలంపై కూడా మీథేన్ పొగలు వెదజల్లే బిలాలు కొన్ని ఉన్నాయని ఇప్పటికే వెల్లడైన నేపథ్యంలో ఈ బ్యాక్టీరియా అక్కడ కూడా ఉండే అవకాశమున్నట్లు తాము భావిస్తున్నామని సైమన్ తెలిపారు. తమ పరిశోధన కేవలం బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ఉనికికి సంబంధించింది మాత్రమేనని.. మనలాంటి బుద్ధిజీవులపై ఏమాత్రం కాదన్నది గుర్తుంచుకోవాలని సైమన్ వివరించారు. ఎన్సెలడూస్పై సముద్రాలు ఉన్నాయని గత పరిశోధనలు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజా పరిశోధన అక్కడ ఏదో ఒకరకమైన జీవం ఉండేందుకూ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. -
దిరిశెన ఆకులతో దానిమ్మ తెగుళ్లకు చెక్
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో, తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో విస్తారంగా సాగయ్యే దానిమ్మ పంటకు వివిధ రకాల బాక్టీరియా, శిలీంధ్ర మచ్చ తెగుళ్ల బెడద ఎక్కువ. ముఖ్యంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు.. సర్కోస్పోరా ఆకుమచ్చ, ఆంత్రాక్నోస్, తదితర శిలీంధ్ర మచ్చ తెగుళ్లు సోకుతున్నాయి. ఈ తెగుళ్ల వల్ల ఆకులు, పండ్లపై నల్లటి మచ్చలు ఏర్పడటం, గింజలు పాడవడం వల్ల రైతులకు తీవ్ర దిగుబడుల నష్టం జరుగుతున్నది. ఈ తెగుళ్లకు వాడుతున్న రసాయనిక మందుల అవశేషాల వల్ల వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఈ నేపథ్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వృక్ష శాస్త్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.సంధ్యా దీపిక పర్యవేక్షణలో పరిశోధకురాలు మొట్టాడి లక్ష్మిశ్రీ రైతులకు సులువుగా అందుబాటులో ఉండే మొక్కల కషాయాలతో దానిమ్మలో బాక్టీరియా, శిలీంధ్ర తెగుళ్ల నియంత్రణపై గత రెండున్నరేళ్లుగా చేసిన ప్రయోగాలు ఫలించాయి. విభిన్న మొక్కలతో పాటు మట్టిలో ఉండే బాసిల్లస్ జాతికి చెందిన బాక్టీరియాలతో దానిమ్మ తెగుళ్లను నియంత్రించే విధానాలను అభివృద్ధి చేశారు. ఇందుకు గాను లక్ష్మిశ్రీకి ఏయూ డాక్టరేట్ అందించింది. మన ఊళ్లలో విరివిగా కనిపించే 50 రకాల పశువుల తినని మొక్కలను ఆమె పరిశోధనకు ఎంపిక చేసుకొని, ప్రయోగశాల(ఇన్విట్రో పద్ధతి)లో ప్రయోగాలు జరిపారు. 5 రకాల మొక్కలు చక్కని ఫలితాలనిచ్చాయి. దిరిశెన/నిద్రగన్నేరు (Albezzia lebbeck) చెట్టు ఆకులతో బాక్టీరియా, శిలీంధ్ర తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించవచ్చని నిర్ధారణకు వచ్చినట్లు డా. లక్ష్మిశ్రీ తెలిపారు. చిన్న పల్లేరు (Tribulus terristris) మొక్కతో శిలీంధ్ర తెగుళ్లను అరికట్టవచ్చని తేలిందన్నారు. వీటితోపాటు బిళ్ల గన్నేరు (Catharanthus roseus) కాండం, ఆకులు.. బోడసరం (Shperanthus indicus) మొక్క, తమలపాకు (beetle wine) లతో కూడా దానిమ్మ తెగుళ్ల నియంత్రణలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. రైతులకు భారం కాకుండా, రసాయన రహితంగా దానిమ్మ పంట సాగు జరగాలనేది ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఆచార్య డి.సంధ్యా దీపిక తెలిపారు. దిరిశెన ఆకుల్లోని లుపియోల్ అనే రసాయనిక సమ్మేళనం వలన బాక్టీరియా నియంత్రణ సాధ్యపడినట్లు గుర్తించామన్నారు. మట్టిలో ఉండే బేసిల్లస్ జాతికి చెందిన ఎనిమిది రకాల సూక్ష్మజీవులను సేకరించి ప్రయోగాలు చేశారు. వీటిలో నాలుగు బాసిల్లస్ సూక్ష్మజీవులు దానిమ్మకు వ్యాపించిన బాక్టీరియాను నాశనం చేయడంలో సమర్ధవంతంగా పనిచేశాయి. అక్టోబర్ నాటికి కషాయం మోతాదులు తెలుస్తాయి! దిరిసెన తదితర ఐదు రకాల మొక్కల కషాయాలను, బాసిల్లస్ సూక్ష్మజీవులను ఈ ఏడాది మే నెల నుంచి రైతుల దానిమ్మ తోటల్లో ప్రయోగాత్మకంగా పిచికారీ చేసి, అధ్యయనం చేయబోతున్నాం. అక్టోబర్ నాటికి తుది ఫలితాలు వస్తాయి. ఏయే తెగుళ్లకు ఏయే మొక్కల కషాయాన్ని ఎంతెంత మోతాదులో వాడాల్సిందీ తెలుస్తుంది. భవిష్యత్తులో మరింత లోతైన పరిశోధనలు జరపాలని ఉంది. డా. మొట్టాడి లక్ష్మిశ్రీ, వృక్ష శాస్త్ర విభాగం, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం – వేదుల నరసింహం సాక్షి, ఏయూ క్యాంపస్ -
ఈ బ్యాక్టీరియా మంచిదే!
కన్ను, ముక్కు, నోరు, మెదడు, గుండె.. మన శరీరంలోని వేర్వేరు భాగాలివి. ఒక్కోటి ఒక్కో వ్యవస్థలో భాగాలు. అవేం చేస్తాయో మనకు తెలుసు. కానీ మనం పెద్దగా ఊహించని, మనకు అత్యవసరమైన మరో వ్యవస్థ కూడా మన శరీరంలో ఉంది. శరీరంలోనే ఉన్నా మనది కాని ఆ వ్యవస్థతో ఎంతో మేలు జరుగుతుంది. దానిలో తేడా వస్తే ఎన్నో అనారోగ్య సమస్యలూ చుట్టుముడతాయి. మరి ఆ వ్యవస్థ ఏమిటో తెలుసా.. మన జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు.. అదే మైక్రోబయోమ్ వ్యవస్థ. మన శరీరం తగిన స్థితిలో ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో అవసరమైన ఈ సూక్ష్మ జీవ ప్రపంచం.. మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తింటే మేలు చేసే సూక్ష్మజీవుల శాతం పెరిగి.. మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అదే సమయంలో పలు రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు విస్తృతమైన అధ్యయనం చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. మరి ఈ మైక్రోబయోమ్ వ్యవస్థ ఏంటి, దాని వల్ల లాభాలేంటి, మంచి ఆరోగ్యం కోసం మనం చేయాల్సిందేమిటనే అంశాలపై ఈ వారం ఫోకస్.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ 10,00,00,00,00,00,000 ఒకటి పక్కన పద్నాలుగు సున్నాలు.. అంటే కోటి కోట్లు.. మన శరీరంలోని సూక్ష్మజీవుల సంఖ్య ఇది. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా వంటివన్నమాట. మన శరీరంలో ఉండే మన శరీర కణాల కంటే.. ఇలా ఇతర జీవుల కణాలు పది రెట్లు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ సూక్ష్మజీవుల్లోనూ మనకు ఎక్కువగా తెలిసినవి, ఉపయోగకరమైనవి బ్యాక్టీరియా. ఇందులోనూ అత్యధికంగా ఉండేవి ఫెర్మీక్యూట్స్, బ్యాక్టీరియడైట్స్. ఒకటేమో గ్రామ్ పాజిటివ్. రెండోది నెగటివ్ అంటారు. ఇంకోలా చెప్పాలంటే బ్యాక్టీరియాను చూసేందుకు చేసే పరీక్షలో వంకాయ రంగులో కనిపించేవి గ్రామ్ పాజిటివ్, వేరే రంగులో కనిపించేవి నెగటివ్. ఇక మన శరీరంలో ఉండే సూక్ష్మజీవుల్లో దాదాపు 80% ఉండేది మన జీర్ణ వ్యవస్థలోనే! అంటే నోటి నుంచి జీర్ణాశయం, చిన్నపేగులు, పెద్దపేగు చివరి వరకు ఉండే వ్యవస్థలోనే. ఎన్నో ఉపయోగాలు.. మనం తీసుకునే ఆహారంలోని విటమిన్లను శరీరానికి వంటబట్టేలా చేయడం, కీలకమైన అమినోయాసిడ్లను తయారు చేయడం మన పేగుల్లోని సూక్ష్మజీవులు చేసే ముఖ్యమైన పనులు. చిన్నపేగులో జీర్ణం కాగా మిగిలిన ఆహారం నుంచి జీవక్రియలకు అవసరమైన రసాయనాలను కూడా సూక్ష్మజీవులే తయారు చేస్తాయి. పేగుల గోడలు బలంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని కాపాడేందుకూ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందని అంచనా. ఆహారం మారితే ఇబ్బందే.. ఒక రోజు పూర్తిగా మాంసాహారం తిని, తర్వాతి రోజు పూర్తిగా శాకాహారం తింటే.. పేగుల్లోని బ్యాక్టీరియా వైవిధ్యతలో తేడాలు వచ్చేస్తాయి. అంతా సర్దుకోవాలంటే రెండు రోజులు పడుతుందట. కొవ్వు పదార్థాలు బాగా లాగించినా, చక్కెరలు ఎక్కువగా తీసుకున్నా.. మన శరీర గడియారం గందరగోళానికి గురవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్లూ మనలోని బ్యాక్టీరియా వైవిధ్యతను మార్చేస్తాయి. తగిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచుకోవచ్చు. హాని కలిగించే వాటిని తగ్గించు కోవచ్చు. తినే తిండి, జీవనశైలి మనకొచ్చే రోగాలను నిర్ణయిస్తాయని గుర్తుంచుకోవాలి. మోతాదుల్లో తేడా వస్తే.. కీళ్ల నొప్పులు మొదలుకొని ఊబకాయం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వరకు అనేక సమస్యలకు.. పేగుల్లోని సూక్ష్మజీవ వ్యవస్థలో జరిగే మార్పులకు మధ్య గట్టి సంబంధం ఉన్నట్లు ఇప్పటికే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (కడుపునొప్పి, అతిసారం వంటి లక్షణాలతో కూడిన వ్యాధి)’ని ఉదాహరణగా తీసుకుంటే... ఈ సమస్యతో బాధపడేవారిలో ఫెర్మిక్యూట్స్, బ్యాక్టీరియోడైట్స్ తక్కువగా ఉంటాయి. ఈ రెండు రకాల బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే బ్యూటరైట్ రసాయనానికి వాపు/మంటలను తగ్గించే లక్షణముంది. ఊబకాయుల్లోనూ ఈ రెండు బ్యాక్టీరియాల నిష్పత్తిలో తేడా ఉంటుందని గుర్తించారు. ఇక మధుమేహంతో బాధపడుతున్నవారిలోనూ బ్యూటరైట్ శరీరానికి వంటబట్టకుండా పోతుందని, విటమిన్ల శోషణ సక్రమంగా ఉండదని తేలింది. కొవ్వులతో ప్రభావం ఎక్కువే.. ఆహారంలోని కొవ్వుల విషయానికి వస్తే.. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ఫ్యాట్లు ఎక్కువైతే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండె జబ్బులకు దారితీస్తుందని తరచూ వింటూ ఉంటాం. ఈ రకమైన కొవ్వుల వల్ల పేగుల్లో ఆక్సిజన్ అవసరం లేని సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోవడం కూడా జబ్బులకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేర్వేరు మోతాదుల్లో కొవ్వులు తినే వారిపై పరిశోధనలు జరిపినప్పుడు.. సంతృప్త కొవ్వులు ఎక్కువగా తీసుకునే వారిలో ఒక రకమైన బ్యాక్టీరియా బాగా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బ్యాక్టీరియా వైవిధ్యతలో పెద్దగా మార్పుల్లేవుగానీ.. చెడు కొలెస్ట్రాల్ మాత్రం తగ్గిందని తేల్చారు. సాల్మన్ వంటి చేపల్లో మోనో, పాలీ అన్శ్యాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్లే ఆ చేపలు తినేవారి కొలెస్ట్రాల్ మోతాదులు తక్కువగా ఉంటాయని గుర్తించారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లోనూ అధిక కొవ్వులతో కూడిన ఆహారంతో శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా పెరిగినట్లు వెల్లడైంది. పోషకాలకు బ్యాక్టీరియాకు లింకేమిటి? ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు... మనం తినే ఆహారంలోని ముఖ్యమైన పోషకాలివే. దేని ప్రత్యేకత, అవసరం దానిదే. అయితే కొన్ని రకాల పోషకాలు పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతాయి. 1977లో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం ప్రొటీన్లు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో బ్యాక్టీరియా వైవిధ్యత పెరుగుతుందని తెలిసింది. మాంసం ద్వారా అందే ప్రొటీన్లతో పోలిస్తే.. పాల నుంచి తయారుచేసే ‘వే ప్రొటీన్’, శనగల ప్రొటీన్లు కొన్ని రకాల హానికారక బ్యాక్టీరియాను తగ్గిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. శాకాహార ప్రొటీన్లతో పేగుల్లో వాపు/మంటను తగ్గించే రసాయనాల ఉత్పత్తికి సాయపడుతుందని నిర్ధారించారు. అయితే ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ రకమైన ఆహారం తీసుకునే వారిలో కొన్ని రకాల బ్యాక్టీరియా తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునే వారిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తవుతుందని, అలాంటి వారికి మధుమేహం, కేన్సర్ వంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక శాకరిన్, సుక్రోజ్ వంటి కృత్రిమ చక్కెరలు పేగుల్లోని బ్యాక్టీరియా వైవిధ్యతను తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి చేటు చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పబ్మెడ్ ఆధారంగా అధ్యయనం.. ఇంటర్నెట్లో పబ్మెడ్ అని ఒక సెర్చింజన్ ఉంది. వైద్య సంబంధిత పరిశోధనలన్నింటి సమాచారాన్ని దాని ద్వారా సులువుగా సేకరించవచ్చు. పేగుల్లో సూక్ష్మజీవులకు, మన ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పబ్మెడ్లో విస్తృతంగా వెతికారు. ఆహారంలోని వేర్వేరు పదార్థాల పేర్లతోపాటు కొన్ని ఇతర కీలకమైన పదాలను ఉపయోగించారు. అలా లభించిన పరిశోధనా పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షించారు. 1970 నుంచి 2015 మధ్యకాలంలో ప్రచురితమైన పరిశోధన వ్యాసాలను పరిశీలించారు. మొత్తంగా 188 పరిశోధనల సారాంశాన్ని వెలికితీసి.. ఒక పద్ధతి ప్రకారం అమర్చారు. ముఖ్యంగా జంతువులపై కాకుండా మనుషులపై జరిగిన పరిశోధనలను, ఇంగ్లిష్‌లో ఉన్న పరిశోధనా పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనంలో భారత సంతతి శాస్త్రవేత్తలు రస్నిక్ సింగ్, టినా భూటానీలు కూడా పాల్గొన్నారు. మెడిటరేనియన్ డైట్‌తో మేలు తెలంగాణ, ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం ఎక్కువగా వినియోగిస్తాం. ఉత్తరాదివారైతే గోధుమ ఉత్పత్తులు.. అమెరికా, యూరప్ దేశాల్లో మాంసం ఉత్పత్తులు ఎక్కువగా వినియోగిస్తుంటారు. మరి ఈ వేర్వేరు ఆహారపు అలవాట్లు బ్యాక్టీరియా సంతతిపై ప్రభావం చూపుతాయా.. అంటే కచ్చితంగా ప్రభావం ఉంటుంది. జంతువుల ద్వారా వచ్చే కొవ్వు పదార్థాలు ఎక్కువగా, పీచు పదార్థాలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహారపు అలవాట్లు పేగుల్లోని బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. అంతేగాకుండా కేన్సర్ కారక నైట్రోసమైన్స్ ఉత్పత్తిని పెంచుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. గోధుమల్లో కనిపించే గ్లూటెన్ అనే పదార్థం లేని ఆహారం తీసుకున్నా మేలుచేసే బ్యాక్టీరియా తగ్గిపోయినట్లు మరో పరిశోధన చెబుతోంది. శాకాహారంపై చేసిన పరిశోధనలోనూ కొన్ని రకాల బ్యాక్టీరియా తక్కువైనట్లు గుర్తించారు. ప్రపంచం మొత్తమ్మీద మంచి ఆహారంగా చెప్పే మెడిటరేనియన్ డైట్ మాత్రం మేలు చేసే బ్యాక్టీరియా సంతతిని పెంచుతున్నట్లు తెలిసింది. మెడిటరేనియన్ డైట్ అంటే.. మధ్యధరా సముద్ర ప్రాంతంలోని దేశాలవారీ ఆహార అలవాట్లుగా చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా శాకాహారం.. అందులో కూరగాయలు, పళ్లు, పొట్టు తీయని ధాన్యాలు, చిక్కుడు జాతికి చెందిన గింజలు, ఆలివ్ నూనె, అవిసె నూనెలను ఎక్కువగా ఉంటాయి. చేపలు, చికెన్ వంటి వాటిని కొంతవరకు, ఇతర మాంసాహారం వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఇక వీటన్నింటితోపాటు సరైన శారీరక శ్రమ, వ్యాయామం కూడా మెడిటరేనియన్ డైట్లో భాగమనే చెప్పవచ్చు. మంచి బ్యాక్టీరియా పెంచుకోవాలంటే.. ♦ ఒకే రకమైన ఆహార అలవాట్లకు పరిమితం కాకుండా.. అందుబాటులో ఉండే అన్ని రకాల ఆహా రం తీసుకోవాలి. చిక్కుళ్లు, బీన్స్, పండ్లు ఎక్కువగా తింటే బైఫైడో బ్యాక్టీరియా పెరుగుతుంది. ♦ పెరుగుతోపాటు ఊరబెట్టిన, పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల లాక్టోబాసిల్లీ బ్యాక్టీరియా పెరిగి మేలు జరుగుతుంది. దీనివల్ల హానికారక బ్యాక్టీరియా తగ్గుతుంది కూడా. ♦ కృత్రిమ చక్కెరలు ఒక రకమైన బ్యాక్టీరియాను పెంచడం ద్వారా రక్తంలో చక్కెరల శాతాన్ని పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ♦ అరటిపండ్లు, ఓట్స్, యాపిల్స్ వంటివి ప్రీ బయాటిక్స్‌గా వ్యవహరిస్తాయి కాబట్టి పేగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. ♦ నవజాత శిశువులకు తొలి ఆరునెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం వల్ల వారి పేగుల్లో బ్యాక్టీరియా వైవిధ్యత పెరుగుతుంది. ♦ పాలిష్ చేయని ముడి ధాన్యం/గింజలను తీసుకోవడం వల్ల పీచు పదార్థం, బీటా గ్లూకన్ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి. ఫలితంగా మధుమేహం, కేన్సర్ వ్యాధికారక రసాయనాల ఉత్పత్తిని అడ్డుకోవచ్చు. ♦ శాకాహారం వల్ల ఈ–కోలీ వంటి బ్యాక్టీరియా తగ్గుతుంది. ఫలితంగా కొలెస్ట్రాల్ మోతాదులు నియంత్రణలోకి వస్తాయి. అదే సమయంలో వేర్వేరు వ్యాధులకు కారణమైన వాపు/మంటలను పరిహరించవచ్చు. ♦ మరీ అత్యవసరమైతేనే యాంటీ బయాటిక్ మందులను వాడాలి. ఈ మందులు పేగుల్లో అన్ని రకాల బ్యాక్టీరియా రకాలను నాశనం చేస్తాయి. ♦ గ్రీన్‌టీ, రెడ్‌వైన్, డార్క్ చాకోలెట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారంలో ఉండే పాలీఫినాల్స్ను పేగుల్లోని సూక్ష్మజీవులు నమిలేస్తాయి. తద్వారా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు సాయపడతాయి. ప్రీ బయాటిక్స్‌తో ఎంతో మేలు.. ప్రీ బయాటిక్స్‌లో అత్యధిక శాతం సరిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్లే. అంటే పీచు, పిండి పదార్థాలు అని చెప్పవచ్చు. వీటిలోనూ జీర్ణమయ్యేవి, కానివని రెండు రకాలు. మొదటి రకం వాటికి బియ్యం మంచి ఉదాహరణ. చిన్న పేగుల్లో కొన్ని ఎంజైమ్లతో కలసినప్పుడు ఈ కార్బోహైడ్రేట్లు.. గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోస్ వంటి చక్కెరలుగా మారిపోతాయి. ఇవి రక్తంలోకి చేరడంతో శరీరం స్పందించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సహజ చ క్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే బైఫైడో బ్యాక్టీరియా ఎక్కువ కాగా.. బ్యాక్టీరియోడైస్ తక్కువయ్యాయి. ఇక సరిగా జీర్ణం కాని పీచు, పిండి పదార్థాలు నేరుగా పెద్దపేగుల్లోకి చేరతాయి. అక్కడి సూక్ష్మజీవులు ఈ పదార్థాలను పులిసిపోయేలా చేస్తాయి. పీచు ఎక్కువగా తింటే పేగుల్లోని బ్యాక్టీరియా అంతే చురుకుగా పనిచేసి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ప్రీ బయాటిక్స్ పదార్థాలు వాపు/మంటకు కారణమయ్యే సైటోకైన్ ఐఎల్–6 ను తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతా యని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ప్రీ బయాటిక్ పదార్థాల వల్ల పేగుల్లో ‘షార్ట్ చెయిన్డ్ ఫ్యాటీ యాసిడ్ల’ ఉత్పత్తి ఎక్కువై రోగ నిరోధక వ్యవస్థకు, జీర్ణక్రియకు సాయపడుతుందని పలు కొన్ని పరిశోధనల్లో తేలింది. ‘మీరు తీసుకునే ఆహారంలో పావు వంతు మిమ్మల్ని బతికిస్తుంది. మిగిలిన మూడొంతులు వైద్యులు బతికేలా చేస్తుంది!’ – డాక్టర్ ఆండ్రూ సాల్! ‘తినే తిండి బాగోలేకపోతే ఏ మందూ పనిచేయదు... సరైన తిండే ఉంటే మందుల అవసరమే ఉండదు!’ – ఆయుర్వేదం -
బరువుకు... పొట్టలోని బ్యాక్టీరియాకు లింక్?
తినే తిండే మనం లావెక్కేందుకు లేదా సన్నబడేందుకు కారణమని ఇన్నాళ్లూ అనుకుంటున్నామా? ఇందులో నిజం కొంతే అంటున్నారు శాస్త్రవేత్తలు. మన కడుపులో, పేవుల్లో ఉండే బ్యాక్టీరియా ఏం తింటుందో... దాన్ని బట్టి మన బరువు ఆధారపడి ఉంటుందన్నది జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన చెబుతున్న విషయం. వివరాల్లోకి వెళితే.. ఆహారంలో పీచుపదార్థం ఎక్కువ ఉంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే శరీరానికి బదులు బ్యాక్టీరియా ఈ పీచుపదార్థాన్ని తినేయడం వల్ల ఇలా జరుగుతోంది. ఆహారంలో పీచు తక్కువైనప్పుడల్లా బ్యాక్టీరియా రకాల్లో తేడాలొచ్చేస్తాయి. ఇది కాస్తా ఊబకాయం మొదలుకొని మధుమేహం చివరకు గుండెజబ్బులకు దారితీస్తుంది. అమెరికా తదితర దేశాల ఆహారంలో చక్కెరలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయని, పీచు తక్కువగా ఉంటుందని మనకు తెలుసు. ఈ కారణంగానే అక్కడ ఊబకాయ సమస్యలు ఎక్కువ. జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అండ్రూ గెవిర్ట్తోపాటు యూనివర్శిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్‌కు చెందిన బెడిక్లు వేర్వేరుగా కొన్ని ఎలుకలపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. పీచు తక్కువగా ఇచ్చినప్పుడు పేవుల్లోని బ్యాక్టీరియాలో తేడాలు వచ్చాయని, మోతాదు పెంచినప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినా.. మునుపటి స్థాయికి చేరుకోలేదని వీరు అంటున్నారు. ఏతావాతా తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. బరువు తగ్గాలంటే వీలైనంత వరకూ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తినాలని! -
బ్యాక్టీరియాకు పోటీ పెట్టారు!
‘విభజించి పాలించు’ అన్న రాజకీయ సూత్రం మీరు వినే ఉంటారు. మందులకు లొంగని బ్యాక్టీరియాకు చెక్ పెట్టేందుకు ఈ సూత్రం కరెక్టుగా సరిపోతుందని అంటున్నారు మిషిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. యాంటీబయాటిక్‌లు వాడేందుకు ముందే.. మందులకు లొంగని బ్యాక్టీరియా సంతతిని కనిష్టానికి తీసుకు రావడం.. ఇందుకోసం అవి బతికేందుకు కీలకమైన పోషకాలను తగ్గించడం ఈ కొత్త పద్ధతిలో కీలక అంశాలు. నీళ్లు లేకపోతే మనం కొన్ని రోజులకే మరణిస్తామన్న సంగతి మీకు తెలుసు కదా.. ఇదే పరిస్థితి బ్యాక్టీరియాకు వచ్చిందనుకుందాం. అప్పుడేమవుతుంది. ముందుగా అందుబాటులో ఉన్న నీటి కోసం పోటీ పెరుగుతుంది. శక్తి ఉన్నవి నీటిని వాడుకుంటాయి. బలహీనమైనవి మరణిస్తాయి. కీలకమైన విషయం ఏమిటంటే.. మందులకు లొంగని బ్యాక్టీరియా.. సహజంగానే బలహీనంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మిషిగన్ శాస్త్రవేత్తలు మలేరియాకు గురైన ఎలుకలపై కొన్ని ప్రయోగాలు చేశారు. వ్యాధికారక బ్యాక్టీరియా ఆధారపడే కీలకమైన పోషకాన్ని గుర్తించారు. మందులకు లొంగని బ్యాక్టీరియాతో కూడిన ఎలుకలకు ఈ పోషకాన్ని తక్కువగా.. మిగిలిన వాటికి ఎక్కువ మోతాదులో అందించారు. కొంత కాలం తరువాత రెండు గుంపుల ఎలుకలకూ మలేరియా మందులు ఇచ్చారు. మొదటి గుంపులోని ఎలుకల్లో వ్యాధి నయమైంది. రెండో గుంపులో మందులకు లొంగని బ్యాక్టీరియా వృద్ధి కావడంతో చికిత్స విజయం సాధించలేదు. ఆ తరువాత రెండు రకాల బ్యాక్టీరియా ఉన్న ఎలుకలపై ఇదే ప్రయోగాన్ని మళ్లీ చేసి చూశారు. ఫలితాలు ఒకేలా ఉండటంతో మందులకు లొంగని బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు ఓ కొత్త పద్ధతి ఉన్నట్లు స్పష్టమైంది. -
పాలపౌడర్‌లో అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా!
పారిస్: ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థ, ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తాము తయారు చేసిన బేడీ పౌడర్‌లో అతిప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందంటూ గ్లోబల్ రీకాల్ చేపట్టింది. మిలుమెల్, పికాట్, సెలి బ్రాండ్‌కింద కొన్ని వందల పాలపొడి ఉత్పత్తులను విక్రయిస్తున్న లాక్టాలిస్ కొన్ని వేల టన్నుల ఉత్పత్తులను మార్కెట్‌నుంచి ఉపసంహరించుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ అవుతున్న తమ చిన్న పిల్లల పాల ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ‘సాల్మొనెల్లా’ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తన ఉత్పత్తులను వెనక్కి రప్పిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దాదాపు 7 వేల టన్నుల ఉత్పత్తి కలుషితమైనదని సంస్థ ప్రతినిధి మిచెల్ నాలేట్ స్వయంగా వెల్లడించారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న స్టాక్‌లో ఏ మేరకు దీని ప్రభానికి గురయ్యాయి అనేది స్పష్టం చేయలేదు. సాల్మొనెల్లా ( జంతువుల లేదా మానవుల మలంతో కలుషితమైన) బ్యాక్టీరియా కారణంగా చాలామంది పిల్లలు అస్వస్థతకు గురికావడంతోపాటు ఫ్రాన్స్ ఆరోగ్య అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా ఆహారం విషతుల్యంగా మారి పిల్లలో డయేరియా, కడుపు తిమ్మిరి, వాంతులు తదితర లక్షణాలు వ్యాపించాయి. డిసెంబరు ప్రారంభంలో దేశంలో 26 మంది శిశువులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బ్రిటన్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సూడాన్ సహా పలు దేశాలకు ఎగుమతులపై ప్రభావం చూపనుంది. కాగా అతి ముఖ్యమైన బేబీ పౌడర్ లేదా పాల పొడి ఉత్పత్తులు అతి ప్రమాదకరమైన బాక్టీరియా ప్రభావానికి గురికావడం ఇదే మొదటి సారి కాదు. చైనాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన పాల పౌడర్‌లో పారిశ్రామిక రసాయనం మెలామైన్ కలవడంతో 2008 లో ఆరుగురు పిల్లలు మరణించారు. సుమారు 3లక్షలమంది పిల్లలతో సహా ఇతరులు కూడా అనారోగ్యం పాలయ్యారు. -
మలేరియాపై పోరుకు కొత్త అస్త్రం..
మలేరియా వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు. ఈ వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం ఫాల్సీపరమ్ అనే బ్యాక్టీరియా శరీర కణంలోకి ప్రవేశించేందుకు, బయటపడేం దుకు ఉపయోగపడే కీలకమైన రెండు ఎంజైమ్‌లను జెనీవా, బెన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎంజైమ్‌లలో ఒకటి కణత్వచాన్ని చీల్చి లోపలికి ప్రవేశించేందుకు ఉపయోగపడగా.. రెండోది బ్యాక్టీరియా తన దాడిని మొదలుపెట్టేందుకు ఉపకరిస్తుంది. మన రక్తం, కాలేయంతోపాటు దోమ కడుపులో కూడా ఈ బ్యాక్టీరియా ఈ రెండు ఎంజైమ్లపైనే ఆధారపడుతున్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిని నిర్వీర్యం చేసేందుకు మార్గం సుగమం చేశారు. వాటిని నిర్వీర్యం చేసే మందులు తయారైతే అటు మలేరియా వ్యాధిగ్రస్తుల్లోని బ్యాక్టీరియా నాశనం అవడమే కాకుండా.. అది దోమల్లోకి చేరి వ్యాధిని మరింత ఎక్కువ మందికి వ్యాప్తి చెందే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు. -
అరుదైన బ్యాక్టీరియాతో నిత్యయవ్వనం
వయసు పెరగకుండా.. జీవితాంతం నిత్య యవ్వనంగా కనిపించాలని కోరుకోని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు.. రోజురోజుకూ పైబడుతున్న వయసును నియంత్రించేందుకు రకరకాల మార్గాలను అన్వేషించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక సినిమా వాళ్లయితే వయసు పెరిగినా ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతుంటారు.. ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ థెరపీల వైపు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి కోరికే ఉన్న జర్మనీలోని మోనికర్ మానోష్ అనే 45 ఏళ్ల నటి ఓ వింత పనిచేసి కొంతమేర విజయం సాధించింది. అయితే ఆ నటి వయసు తక్కువగా కనపడేలా ఉండేందుకు చేసిన ప్రయత్నమే అందరినీ విస్తుపోయేలా చేసింది. దాదాపు 3.5 మిలియన్ ఏళ్ల నాటి సైబీరియన్ మట్టిలో లభించే బాసిల్లస్ ఎఫ్ అనే బ్యాక్టీరియాను ఏకంగా తన శరీరంలోకి ఎక్కించేసుకుంది. ఈ బ్యాక్టీరియాను తొలిసారిగా 2009లో వాయువ్య రష్యాలోని శాస్త్రవేత్తలు గుర్తించారు. బాసిల్లస్ ఎఫ్ కణాలు వృద్ధాప్య లక్షణాలను అడ్డుకుని.. నిత్య యవ్వనంగా ఉండేలా చేయగలవు. దీన్ని తెలుసుకున్న సదరు నటి తన రక్తంలోకి ఆ బ్యాక్టీరియాను ఎక్కించుకుంది. ఈ బ్యాక్టీరియా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే చాలా మందికి దీని గురించి తెలిసినా ఏ డాక్టర్ దీన్ని సూచించడు. దీంతో తనకు తెలిసిన ఓ డాక్టర్ నుంచి ఆ నటి అవసరమైనన్ని శాంపిల్స్‌ను తీసుకుంది. ఆ శాంపిల్స్‌ను మాస్కో స్టేట్ యూనివర్సిటీలో జియోక్రయాలజీ విభాగాధిపతి డాక్టర్ అనటోలి బ్రోచ్కోవ్కు అందించింది. ఈ డాక్టర్ కూడా ఆ బ్యాక్టీరియాను తీసుకున్నాడు. అయితే నోటి ద్వారా తీసుకున్నాడు. కానీ మానోష్ మాత్రం నేరుగా రక్తంలోకి ఎక్కించుకుంది. ఆమె కుటుంబ సభ్యులు వద్దని ఎంత వారించినా మానోష్ వినలేదు. ఆమె వయసు తక్కువగా కనబడడానికి చేసిన ప్రయత్నాల్లో ఇదేమీ మొదటిది కాదు.. 20 ఏళ్ల క్రితం 50 వేల డాలర్లు ఖర్చు చేసి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంది. -
చెడు బ్యాక్టీరియాతో యుద్ధానికి సరికొత్త మార్గం
లండన్: శరీరానికి తగిలిన గాయం నయమయ్యే క్రమంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా శరీరం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న రహస్యాన్ని పరిశోధకులు చేధించారు. హానికరమైన బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు నూతన మార్గాలను అన్వేషించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడు తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా రక్తంలోని ప్లాస్మాలో కనిపించని, కేవలం గాయపడిన ప్రదేశంలో మాత్రమే కనిపించే ‘త్రోంబిన్’అనే బ్లడ్ ప్రోటీన్ బ్యాక్టీరియా, టాక్సిన్స్‌ను ఒక సమూహంగా ఏర్పరుస్తుందని అధ్యయనంలో వెల్లడైనట్లు వారు తెలిపారు. ఈ సమూహం ప్రక్రియ చాలా త్వరగా జరగడంతోపాటు ఇలా సమూహంగా ఏర్పడిన బ్యాక్టీరియా, టాక్సిన్స్‌ను శరీరంలోని పాడైన కణాలు తినేలా ప్రేరేపిస్తుందని వెల్లడించారు. మామూలుగా బ్యాక్టీరియా, టాక్సిన్స్‌ను నాశనం చేసే కంటే యాంటిబయాటిక్స్‌తో సమూహంగా చేరిస్తేనే మంచిదని, తర్వాత శరీరం వాటిని నాశనం చేస్తుందని స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జిట్కా పెటర్లోవా స్పష్టం చేశారు. -
మరణ సమయాన్ని గుర్తించొచ్చు!
న్యూయార్క్: మృతదేహంలోని కొన్ని బ్యాక్టీరియాల ఆధారంగా చనిపోయిన సమయాన్ని కచ్చితంగా తెలిపే నూతన పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. మృత దేహంలోని నైక్రోబయోమ్ బ్యాక్టీరియా ను పరీక్షించి మరణించిన సమయాన్ని స్పష్టంగా చెప్పవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని సిటీ యూనివర్సిటీ (సీయూఎన్ వై)కి చెందిన పరిశోధకులు మానవుడి దేహంలోని నైక్రోబయోమ్లు, పలు సూక్ష్మజీవులపై పరిశోధన నిర్వహించారు. కుళ్లిపోయిన 21 మృతదేహాల చెవి, నాసికానాళంలోని నమూనాలను సేకరించి మెటాజెనామిక్ డీఎన్ఏ అనుక్రమణం ద్వారా పరిశీలించినట్లు నాథన్ హెచ్ లెంట్స్ అనే శాస్త్రవేత్త చెప్పారు. -
బ్యాక్టీరియాతో జాగ్రత్త!
దానిమ్మలో సమగ్ర సస్యరక్షణ అవసరం 'మహానంది' ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుబ్రహ్మణ్యం దానిమ్మ తోటలు సాగు చేసిన రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్న వాటిలో బ్యాక్టీరియా మచ్చ తెగులు ప్రమాదకరమైనందున సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి నివారించుకోవాలని కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సి.సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో దానిమ్మ తోటలపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు, మరో శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు హాజరై అవగాహన కల్పించారు. రోగం లేని మొక్కలు ఎంపిక ఇటీవల దానిమ్మ తోటలకు బ్యాక్టీరియా మచ్చతెగులు బాగా దెబ్బతీస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఆకులు, కాండం, కాయలపై విస్తరించి తీవ్ర నష్టం కలిగిస్తున్నందన ముందుస్తు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ తెగులు నర్సరీల నుంచి, వర్షంతో కూడిన గాలులు ద్వారా, కత్తిరింపులు చేసే సమయంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇందుకోసం పంట పెట్టాలనుకున్నపుడే రోగ రహిత మొక్కలు ఎంపిక చేసుకోవాలి. నర్సరీల్లో మొక్కల ఆకులు, లేత కొమ్మలపై నీటితో తడచినట్లు మచ్చలు కనిపిస్తే రోగం ఉన్నట్లుగా గుర్తించాలి. టిష్యూకల్చర్ మొక్కలు బాగున్నా వాటిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కత్తిరింపుల సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కత్తిరించే ప్రతిసారీ కత్తెరలను డెటాల్ లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో ముంచి శుభ్రం చేసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ కత్తిరింపుల తర్వాత ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారి చేసుకోవాలి. కొత్త ఆకులు వచ్చిన తర్వాత మూడు గ్రాములు శాలిసిలిక్ యాసిడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే కాయ ఊరేదశలో కూడా శాలిసిలిక్ యాసిడ్ నెల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. బ్యాక్టీరియా మచ్చ తెగులుకు సంబంధించి లక్షణాలు కనిపిస్తే 25 గ్రాములు బ్లైటాక్స్ + 5 గ్రాములు స్టెప్టోసైక్లీన్ + 5 గ్రాములు బ్యాక్టీరొనాల్+ జిగురు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేత ఇగుర్లు వచ్చిన తర్వాత 2 మి.లీ రీజెంట్ ఒక లీటర్ నీటికి లేదా 3 గ్రాములు ప్రైడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. దీనికి 2 మి.లీ వేపనూనె కలుపుకోవాలి. కాయలపై శిలీంధ్రపు మచ్చ తెగులు కనిపిస్తే గ్రాము బావిస్టన్ లేదా 2.5 గ్రాములు ఎం–45 లేదా 1 మి.లీ టిల్ట్ లేదా 1 మి.లీ స్కోర్ లేదా 2 గ్రాములు అవతార్ లేదా 2 గ్రాములు మిర్జ్ మందులు 20 రోజుల వ్యవధిలో మందులు మార్చి రెండు సార్లు పిచికారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోగ లక్షణాలు కనిపించిన కొమ్మలు, రెమ్మలు, ఆకులు, మొక్కలు పీకేసి కాల్చివేయాలి. తోటలను ఎపుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, పచ్చిరొట్ట పైర్ల ద్వారా భూసారాన్ని పెంచుకుంటే దానిమ్మ రైతు ఇంట ప్రధాన వాణిజ్యపంటగా లాభదాయకంగా మారుతుంది. -
ఏటీఎంలపై భయంకరమైన బ్యాక్టీరియా
న్యూయార్క్: ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బుల కోసం ఏటీఎంల ముందు లైన్లో నిల్చొవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఏటీఎంలకుండే కీప్యాడ్లపై భయంకరమైన బ్యాక్టీరియా ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. చెడిపోయిన ఆహారంలో ఉండే వివిధ రకాల బ్యాక్టీరియాలు ఈ కీప్యాడ్‌పై ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. వీటివల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు తెలెత్తుతాయని హెచ్చరించారు. గాలి, ఆహారం, వాతావరణంలోంచి ఈ భయంకర బ్యాక్టీరియా కీప్యాడ్లపైకి వచ్చి చేరుతున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జానే కర్ల్ టాన్ తెలిపారు. జూలై 2014లో దాదాపు 66 ఏటీఎంలపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఇలాంటి బ్యాక్టీరియా టీవీలు, కిచెన్, దిండ్లలో కూడా ఉంటాయని చెప్పారు. కుళ్లిపొయిన పాలు, మొక్కల్లో ఈ రకమైన బ్యాక్లీరియా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. -
ఆ టైమ్‌లో చాలా ఇబ్బందిగా ఉంటోంది
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. బాగా ముక్కితే గానీ మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ధనరాజు, అనకాపల్లి మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ నా కిడ్నీ పాడైందా?! కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత పదేళ్ల నుంచి డయాబెటిస్తో బాధపడుతున్నాను. క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాను. కానీ ఒకసారి శరీరంలో చక్కెరస్థాయి పెరిగి కళ్లు తిరిగి పడిపోయాను. చికిత్స తర్వాత కొన్నాళ్ల పాటు డాక్టర్లు ఇన్సులిన్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం వారి సూచనల మేరకే మళ్లీ మందులు వాడుతున్నాను. అయితే కొంతకాలం నుంచి నా ముఖం చాలా ఉబ్బినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా కాళ్లలో వాపుతో పాటు మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండి కాస్త ఇబ్బంది కలుగుతోంది. ఈ లక్షణాలతో నేను తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాను. ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు, ఆఫీసులోని కొలీగ్స్ అందరూ కిడ్నీ పాడైపోయిందని భయపెడుతున్నారు. అసలు నాకు ఏమైంది? వాళ్లు చెబుతున్నది నిజమేనా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - శ్రీనివాస్, అనంతపురం మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. మీకు కాళ్లలో వాపులతో పాటు ముఖం ఉబ్బినట్లుగా ఉందని చెబుతున్నారు. అయితే వీటితో పాటు ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం లాంటి లక్షణాలతో ఏమైనా సతమతమవుతున్నారా... అనే విషయాలను కాస్త గమనించండి. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మంచి నెఫ్రాలజిస్టును సంప్రదించండి. వారు మీకు ముందుగా సీరమ్ క్రియాటినిన్, అల్ట్రా సౌండ్ లాంటి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఏమైనా అసాధారణ ఫలితాలు వస్తే మరింత లోతుగా పరిశీలించేందుకు జీఎఫ్ఆర్, స్కానింగ్ లాంటి పరీక్షల ద్వారా కిడ్నీ పనితీరును క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలితే అందుకు తగ్గట్లుగా చికిత్సా విధానాన్ని అవలంబిస్తారు. ఇందుకు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కిడ్నీ సమస్యకు మంచి మందులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన పలితాలు పొందగలుగుతారు. అలాకాకుండా మీరు చికిత్సపై అనుమానాలు పెంచుకుని డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే మీ సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్కు గురైన కిడ్నీకి చికిత్సను తాత్సారం చేస్తే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. ఒక్కోసారి ఏకంగా కిడ్నీనే తొలగించాల్సి వస్తుంది. డయాబెటిస్ ఉందని చెప్పి మీరు మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. మాంసాహారాన్ని మితంగా తినండి. మద్యపానం, పొగతాగడం వంటి దురలవాట్ల జోలికి వెళ్లకండి. మీ ఎత్తుకు తగిన విధంగా మీ శరీర బరువు ఉండేలా చూసుకోండి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, రోజుకు 4 నుంచి 6 లీటర్ల నీటిని తాగడం, తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఆహారాన్ని ఒక్కోసారి పెద్దమొత్తంలో తీసుకోకుండా... కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకునేలా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మీరు విలువైన సమయాన్ని వృథా చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్సను పొందండి. డాక్టర్ సాయిరాం రెడ్డి సీనియర్ నెఫ్రాలజిస్టు అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ సికింద్రాబాద్ -
ఒక పెద్ద ఏసీ మిషన్ = ముక్కు!
పోరాటం నోస్ ఫ్యాక్ట్స్ ముక్కు ఒక ఎయిర్ కండిషనర్‌లా వ్యవహరిస్తుంది. ప్రతిరోజూ అది దాదాపు 500 చదరపు అడుగుల పరిమాణంలోని గాలిని శుభ్రపరచి ఊపిరితిత్తులకు పంపుతుంటుంది. ఊపిరితిత్తులకు ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో ఉన్న గాలి కావాలి. అందుకే తేమ తక్కువగా ఉన్న గాలిలో తేమ కల్పించడానికి ఒక్కో సీజన్లో ముక్కు దాదాపు లీటరు తేమను స్రవిస్తుంటుంది. ముక్కులోని ఎర్రటి స్పాంజ్ కణజాలం నుంచి ఈ తేమ ఊరుతూ ఉంటుంది. ముక్కు రంధ్రాలు గాలిని శుభ్రం చేస్తుంటాయి. నూనెలో ముంచితీసినట్టుగా ఉండే పేపరును గాల్లో వేలాడదీస్తే, దానికి పురుగులు అంటుకున్నట్లుగా ముక్కులోని వెంట్రుకలకు బ్యాక్టీరియా క్రిములు, దుమ్ము ధూళి అలా అంటుకుంటాయి. అయితే ముక్కు రంధ్రాలు వాటిని అక్కడ పేరుకోనివ్వవు. అదే జరిగితే కొద్దిగంటల్లోనే అక్కడంతా బ్యాక్టీరియా మయం అయిపోతుంటుంది. అందుకే అలా పేరుకుపోయిన బ్యాక్టీరియాతో కూడిన మ్యూకస్ బ్లాంకెట్‌ను ముక్కు... ప్రతి 20 నిమిషాలకొకసారి తొలగిపోయేలా చేస్తుంటుంది. -
హెల్త్ క్విజ్
1. మన టూత్‌బ్రష్ బ్రిజిల్స్ ఎలా ఉండాలి? 2. బ్రష్ చేసుకోవడంలో సరైన ప్రక్రియ అంటే ఎలా ఉండాలి? 3. పళ్లకు మధ్య బ్రష్ చేరుకోని ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఏం చేయాలి? 4. బ్రషింగ్ ప్రక్రియ ఎంత సేపు చేయాలి? 5. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంకోసం బ్రషింగ్‌తో పాటు చేయాల్సిందేమిటి? 6. ఎన్నాళ్లకు ఒకసారి బ్రష్ మార్చాలి? జవాబులు: 1. దంతాలను, చిగుళ్లను గాయపరచనంత మృదువుగా ఉండాలి. 2. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోవాలి. 3. ఫ్లాసింగ్ (దారంలాంటిదానితో శుభ్రం చేయడం) ప్రక్రియ ద్వారా వ్యర్థాలను తొలగించాలి. 4. మూడు నిమిషాల పాటు మాత్రమే బ్రష్ చేయాలి. అదేపనిగా బ్రష్ నములుతూ బ్రష్ చేయకూడదు. 5. నాలుకపై ఉండే బ్యాక్టీరియాను తొలగించడం కోసం టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి. 6. {పతి మూడు నెలలకోమారు బ్రష్ మార్చాలి. -
విషం సైతం ఔషధంగా...
బోటులినమ్ టాక్సిన్ విషాన్ని సమర్థంగా వాడితే అది ఔషధంలా పనిచేస్తుంది. బోటులినమ్ అనేది కూడా అంతే. నిజానికి బోటులినమ్ అనేది ఒక విషం. కొన్ని నరాల సమస్యలకు ఆ విషాన్ని ఒక మందులా ఉపయోగించవచ్చు. ఈ విషం గురించి కొన్ని విషయాలు... బోటులినమ్ టాక్సిన్ అంటే... ఈ విషాన్ని క్లాస్ట్రీడియమ్ బోటులినమ్ అనే బ్యాక్టీరియా నుంచి తయారు చేస్తారు. మనం ఒక్కోసారి కింద పడినప్పుడు కాళ్లు, చేతులకు దోక్కుపోవడం లాంటి గాయాలు అయినప్పుడు అక్కడ చీము పట్టడం, పుండు కావడం జరుగుతుంది. దీనికి కారణం మట్టిలో ఉండే కొన్ని బ్యాక్టీరియా గుడ్లు. టెటనిక్ స్పోర్స్ అనే బ్యాక్టీరియా గుడ్లు దెబ్బతగిలిన ప్రదేశంలో 2-3 రోజులు ఉంటాయి. అవి గుడ్డు నుంచి పూర్తిస్థాయి బ్యాక్టీరియాగా మారి పుండులా మారేందుకు కారణమవుతాయి. ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చే విషాలు (బోటులినమ్ టాక్సిన్) రక్తంలో కలిసిపోయి శరీరమంతా పాకుతాయి. అవి శరీరంలో ఉండే కండరాలు చచ్చు పడిపోయేలా చేస్తాయి. దీన్ని వూండ్ బోటులిజం అంటారు. (దాన్ని నివారించడానికే కింద పడినప్పుడు దెబ్బ తగిలిన ప్రదేశంలో సబ్బుతో బాగా శుభ్రం చేసుకుని టెటనస్ ఇంజెక్షన్ తీసుకోవాలి). ఇలాంటి ప్రమాదకరమైన బోటులినమ్ టాక్సిన్ను గత కొంతకాలం నుంచి అనేక నరాల సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. బోటులినమ్ టాక్సిన్ ఉపయోగాలు పెరాలసిస్ వచ్చాక చేతులు, కాళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. ఆ బిగుతు (మజిల్ స్పాస్టిసిటీ)ని తగ్గించడానికి. రైటర్స్ క్రాంప్ : మునుపు రాత సామర్థ్యం ఉన్న వారు ఆ తర్వాత అంతగా రాయలేకపోతున్నప్పుడు. మెడ ఒక పక్కగా ఒంపు తిరిగినవారికి... (సర్వైకల్ డిస్టోనియా) మూతి వంకర పోయినవారికి (హెమీ ఫేషియల్ స్పాజమ్) కనురెప్పలు మూసుకుపోవడం (బ్లెఫరోస్పాజమ్): కనురెప్ప మూసుకుపోయేవారికి. మెల్లకన్ను (స్ట్రాబిస్మస్) ఉన్నవారికి. మైగ్రేన్ తలనొప్పి కి: మందులు వాడినా మైగ్రేన్ వల్ల వచ్చే నొప్పి తగ్గకపోతే. అరచేతులు, అరికాళ్లలో / బాహుమూలాల్లో అతిగా చెమటలు పట్టేవారికి. ముఖంలోని ముడుతలను పోగొట్టేందుకు. మరికొన్ని సమస్యలకు... పైన పేర్కొన్న వాటికేగాక మరికొన్ని సమస్యలకు సైతం బోటులినమ్ ఇవ్వవచ్చు. అన్నవాహికకు వచ్చే అకలేషియా అనే జబ్బుకు, మూత్రాశయానికి వచ్చే డెట్రూసర్ హైపర్ యాక్టివిటీ, న్యూరోజెనిక్ బ్లాడర్‌కూ, యానల్ ఫిషర్‌కు, వెజినస్మస్కు, ఫోకల్ డిస్టోనియాస్ , ఎక్కువగా చొల్లు కారడం, దవడ కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలను తగ్గించడానికి ఇస్తారు. ఎలా ఇస్తారు... కండకు (ఇంట్రా మస్కులార్) చర్మం కింద (సబ్‌క్యుటేనియస్) చర్మంలోకి (ఇంట్రా డర్మల్) {Vంథులలోకి (ఇంట్రాగ్లాండ్యులార్) జబ్బును బట్టి బోటులినమ్ టాక్సిన్ ఎలా ఇవ్వాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎంత మోతాదు? సమస్యను బట్టి ఎంత మోతాదు ఇవ్వాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇచ్చిన తర్వాత దీని ప్రభావం 3 - 7 రోజుల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఆరు నెలలు పనిచేస్తుంది. దాని ప్రభావం తగ్గాక మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది. దీని చాలావరకు సురక్షితం. డా. బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్ రోడ్ నెం.12 బంజారాహిల్స్, హైదరాబాద్ -
స్వచ్ఛ ఊపిరి
నగర జీవితంలో స్వచ్ఛమైన గాలి కూడా కరువే. ఇంట్లో నాలుగు గోడల మధ్య తలుపులన్నీ బిడాయించేసుకున్నా, ఏదో ఒక రూపంలో కాలుష్యాలు చొరబడుతూనే ఉంటాయి. పరిసరాల్లోని దుర్గంధాలన్నీ ఇంట్లోకీ వ్యాపిస్తూనే ఉంటాయి. అగరొత్తుల మొదలుకొని రూమ్ఫ్రెషనెర్ల వరకు ఎన్ని వాడినా పూర్తి ప్రయోజనం ఉండనే ఉండదు. పైగా అగరొత్తుల పొగ, రూమ్ఫ్రెషనర్ల వాసన సరిపడని వారికి పరిస్థితి ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘ఏరోక్యూర్ వన్’ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఇంట్లో ఇక నిశ్చింతగా ఊపిరి పీల్చుకోవచ్చు. గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలను, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవులను, దుర్గంధాన్ని ప్రసరించే ఇతర కారకాలను ఇది సమర్థంగా తొలగిస్తుంది. హెపా ఫిల్టర్లతో పనిచేసే ఎయిర్ ప్యూరిఫయర్ దాదాపు 800 చదరపు అడుగుల మేరకు పరిసరాల్లోని గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. ఇందులోని శక్తిమంతమైన అల్ట్రావయొలెట్ లైట్ రోగకారక సూక్ష్మజీవులను ఇట్టే నాశనం చేస్తుంది. ఇందులోని ఫిల్టర్లు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మన్నుతాయి. ఆ తర్వాత వాటిని మార్చేసుకుంటే చాలు, ఇది యథాప్రకారం పనిచేస్తుంది. -
బ్యాక్టీరియాతో భూతాపానికి చెక్!
భూతాపాన్ని ఎదుర్కోవడంలో అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. జన్యుమార్పిడి చేసిన బ్యాక్టీరియాల సాయంతో వాతావరణంలోని కలుషిత వాయువులను నిరపాయకరమైన ఇంధనంగా మార్చవచ్చని గుర్తించారు. కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు ఇతర గ్రీన్‌హౌజ్ వాయువులను నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ సాయంతో ఒకే దశలో ఇంధనంగా మార్చవచ్చని వీరు చెబుతున్నారు. వాతావరణంలో లభించే ఈ ఎం జైమ్ కారణంగానే నత్రజని.. అమ్మోనియాగా మారి మొక్కలకు ఉపయోగపడుతుంది. నత్రజని స్థాపన అనే ఈ ప్రక్రియను ఇంధనాల తయారీకి కూడా ఉపయోగించొచ్చని భావించిన శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. ఆర్.పాలెస్ట్రిస్ అనే బ్యాక్టీరియాలో జన్యుమార్పులు చేసి నైట్రోజినేజ్ను అధికంగా ఉత్పత్తి చేసేలా తయారుచేశారు. దీంతో సూర్యరశ్మి సాయంతో ఈ బ్యాక్టీరియా కార్బన్‌డైఆక్సైడ్‌ను వంటగ్యాస్ అయిన మీథేన్‌గా మార్చింది. -
కేన్సర్‌కు ‘క్రిస్పర్’
ప్రాణాంతక కేన్సర్ చికిత్సలో శాస్త్రవేత్తలు మరో కీలకమైన ముందడుగు వేశారు. మానవ జన్యువుల్లో అతిసులువుగా అవసరమైన మార్పులు చేయగల క్రిస్పర్ టెక్నాలజీని వాడే సరికొత్త చికిత్స విధానాన్ని తొలిసారి మానవులపై ప్రయోగించనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే కేన్సర్‌కు మరింత మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదు. శరీరంలో ఏదైన రోగకారక బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశిస్తే మొట్టమొదట స్పందించేది రోగనిరోధక వ్యవస్థే అనే విషయం తెలిసిందే. తెల్లరక్త కణాలతో కూడిన ఈ వ్యవస్థ నుంచి తప్పించుకుని కేన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. ఈ నేపథ్యంలో తెల్ల రక్తకణాలనే కేన్సర్‌కు చికిత్సగా వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన పరిశోధకుల్లో వచ్చింది. ఈ విధానాన్ని ఇమ్యునోథెరపీ అంటారు. ఇప్పటి వరకు కొన్ని వైరస్ల ద్వారా తెల్ల రక్త కణాలను చైతన్యవంతం చేసి చికిత్స అందించేవారు. క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ ద్వారా తెల్ల రక్తకణాల్లో జన్యుపరమైన మార్పులు చేసి అప్పటి వరకూ గుర్తించని కేన్సర్ కణాలను కూడా గుర్తించి చంపేలా చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ పద్ధతి పరిశోధనశాలలో మంచి ఫలితాలనిచ్చింది. దీంతో కొందరు చైనా శాస్త్రవేత్తలు మానవులపై వచ్చే నెల ప్రయోగాలు చేపట్టనున్నారు. సిచుహాన్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వెస్ట్ చైనా ఆస్పత్రిలో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ముందు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడ్డవారిలో ఒకరి తెల్ల రక్త కణాలను మార్చి మళ్లీ వారిలో ప్రవేశపెడతారు. ఫలితాలను బట్టి మరికొంత మందిపై ప్రయోగాలు చేపడతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
సరోజినీదేవి ఆస్పత్రిపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సీఎస్, డీజీపీలకు నోటీసులు సాక్షి, హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఇటీవల కేటరాక్ట్ సర్జరీ చేయించుకున్న ఏడుగురు బాధితులకు కంటిచూపు పోయిన ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని కేసు న మోదు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే 15 రోజుల విరామం తర్వాత శుక్రవారం ముగ్గురు బాధితులకు కేటరాక్ట్ సర్జరీలు చేశారు. మరో నలుగురిని ఇన్‌పేషంట్లుగా అడ్మిట్ చేసుకున్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్, లోకాయుక్త విచారణకు ఆదేశించగా, ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీనిపై ఔషధ నియంత్రణ మండలి, ఉన్నత స్థాయి నిపుణుల బృందం విచారిస్తుంది. అయితే ఇన్ఫెక్షన్కు సెలైన్ బాటిల్లో ఉన్న బ్యాక్టీరియానే కారణమని ఇప్పటికే ఆస్పత్రి వైద్యుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, ఈ ఘటనలో వైద్యపరమైన నిర్లక్ష్యం ఉందని రోగులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లలో ఫ్యూమిగేషన్ను చేపట్టి ఎలాంటి బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకున్న తర్వాతే థియేటర్లను తెరిచినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. -
వైద్య పరికరాల టెండర్లలో సంస్కరణలు
ప్రమాణాలు పాటించే కంపెనీల నుంచే మందుల కొనుగోలు: లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్ : వైద్య పరికరాలు, సర్జికల్స్, మందుల కొనుగోళ్ల టెండర్లలో భారీ సంస్కరణలు చేపట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. ఎల్-1 పేరుతో నాసిరకం పరికరాలు సరఫరా చేసే కంపెనీల నుంచి కాకుండా.. నిర్ణీత ప్రమాణాలు పాటించే కంపెనీల ద్వారా నేరుగా వైద్య పరికరాలు, మందులను కొనుగోలు చేస్తామన్నారు. వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో ప్రక్షాళన మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. పశ్చిమబంగలో హసీబ్ కంపెనీకి చెందిన స్టెరైల్ వాటర్ బాటిళ్లు ప్రమాణాల మేరకు లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నా.. ఆ కంపెనీ నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొనే అర్హత ఉందన్నారు. గతేడాది జూన్ నెలలో హసీబ్ కంపెనీ సెలైన్ బాటిళ్ల టెండర్లలో పాల్గొందని మంత్రి వివరించారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచే పదేళ్లుగా ఆ కంపెనీ సెలైన్లు సరఫరా చేస్తోందన్నారు. సరోజిని కంటి ఆస్పత్రి ఘటనలో ప్రాథమిక నివేదిక ప్రకారం సెలైన్‌లో బ్యాక్టీరియా ఉందని తేలిందన్నారు. సెలైన్ నమూనాలను తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామనీ, దానిపై ఒక కమిటీ వేశామన్నారు. పరీక్షల నివేదిక, కమిటీ రిపోర్టు వచ్చాక బాధ్యులపై చర్యలుంటాయన్నారు. ఈ కంటి ఆసుపత్రి ఘటనలో 13 మందిలో 8 మంది పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. మిగిలిన ఐదుగురికి పూర్తిగా కళ్లు పోయినట్లుగా భావించలేమన్నారు. అందులో ఒకరికి శస్త్రచికిత్స చేస్తే సాధారణ పరిస్థితి వస్తుందన్నారు. మిగతా నలుగురికి కూడా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నుంచి వైద్య నిపుణులను రప్పించి చికిత్స చేస్తున్నామని.. వారు వైద్యానికి స్పందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. కేంద్రం నుంచి రాకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే లక్ష దోమ తెరలు కొనుగోలు చేసి గిరిజనులకు అందజేస్తుందన్నారు. ఎక్కడికక్కడ ఫాగింగ్ చేపడుతున్నామని, ఏజెన్సీల్లో మలేరియా, డెంగీ నిర్దారణ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో విషజ్వరాలు లేవని.. పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. హైదరాబాద్‌లో కేవలం ఒక కలరా కేసే నమోదైందని, సామూహిక కలరా కేసులు ఎక్కడా నమోదు కాలేదన్నారు. -
ఆర్థరైటిస్‌కు అన్నిసార్లూ ఆపరేషన్ అవసరం లేదు...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. నాకు తిన్నవెంటనే కడుపులో నొప్పి, మంటగా ఉంటోంది. అంతేకాకుండా అప్పుడప్పుడూ తేన్పులు రావడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం జరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? - నీరజ, రామచంద్రాపురం గ్యాస్ట్రైటిస్ అనేది జీర్ణాశయానికి సంబంధించిన సమస్య. జీర్ణాశయానికి లోపల వైపున అనేక మ్యూకస్ పొరలు ఉంటాయి. వీటిలో మంట, వాపు ఏర్పడితే దాన్ని గ్యాస్ట్రైటిస్‌గా పరిగణిస్తారు. ఇది జీర్ణాశయ గోడలలో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కారణాలు: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం, రసాయనాలు వినియోగం ఎక్కువైనప్పుడు, ఇతరత్ర ఆరోగ్య సమస్యలకోసం మందులు అధికంగా వాడటం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, ఉపవాసాలు ఎక్కువగా ఉండటం, ఆస్పిరిన్, ఐబూప్రొఫెన్ వంటి మందుల్ని వాడటం వల్ల, హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ తలెత్తినప్పుడు గ్యాస్ట్రైటిస్ రావచ్చు. సమస్య కొంతకాలం పాటు వచ్చి తగ్గిపోతే దాన్ని అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. సమస్య ఎక్కువకాలం పాటు బాధిస్తూ ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. లక్షణాలు: జీర్ణాశయంలో లోపలి భాగంలో ఉండే జీర్ణాశయ పొరలలో ఇన్ఫెక్షన్ వచ్చి, జీర్ణప్రక్రియ కుంటుపడుతుంది. కడుపులో మంట వస్తుంది పొడుస్తున్నట్లుగా కడుపులో నొప్పి రావడం, ఏదో మెలిపెట్టినట్లుగా కడుపు మధ్యభాగంలోనూ, కాస్తంత పై భాగంలోనూ నొప్పి రావడం జరుగుతుంది వాంతులు, మలంలో రక్తం కనిపించవచ్చు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు గ్యాస్ట్రైటిస్ ముదిరితే కడుపులో అల్సర్స్ ఏర్పడటంతో పాటు క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. కడుపులోని ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకూ పాకవచ్చు. నిర్ధారణ: రక్తపరీక్షలు, సీబీపీ, మూత్రపరీక్ష, ఎక్స్-రే, మలపరీక్ష, ఈసీజీ, ఎండోస్కోపీ. నివారణ: సరైన ఆహారపు అలవాట్లు పాటించడం, మంచి పోషకాహారం తీసుకోవడం, రసాయనాల వాడకం తగ్గించడం, ఆస్పిరిన్ వంటి మందుల వాడకం తగ్గించడం. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా క్రమేపీ రోగనిరోధక శక్తి పెంచుతూ వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ, వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం.రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 62 ఏళ్లు. ఇటీవల మోకాళ్లలో నొప్పిగా ఉంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. మోకాలి కీలులో ఆర్థరైటిస్ ఉందని చెప్పి ఆపరేషన్ అవసరమని చెప్పారు. ఆపరేషన్ తప్పదా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ధనలక్ష్మి, అనంతపురం ఇటీవల ఆర్థరైటిస్ సమస్య చాలా సాధారణంగా కనిపిస్తోంది. స్థూలకాయం, జీవనశైలి, క్యాషియం లోపం, విటమిన్-డి లోపం లాంటివి కీళ్ల అరుగుదలకు కారణమవుతాయి. కీళ్ల సమస్యకు అందుబాటులో ఉన్న చికిత్సల పట్ల పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది కీళ్లలో ఆర్థరైటిస్‌కు సర్జరీ మేలు అని భావిస్తుంటారు. కానీ ఆర్థరైటిస్ దశను బట్టి మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. ఆర్ఠరైటిస్ ఏ రకానికి చెందినప్పటికీ దానిలో వివిధ దశలు ఉంటాయి. ఒక్కో దశకు ఒక్కోరకమైన చికిత్స ఉంటుంది. సంప్రదాయ చికిత్సలన్నీ ఫెయిల్ అయినప్పుడు, వ్యాధి చివరి దశలో ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. బరువు, వయసు, ఎముక నాణ్యత, పేషెంట్ ఫిట్నెస్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సర్జరీని ఎంచుకుంటారు. ఈ దశల్లో ఆపరేషన్ అవసరం లేదు... కీళ్ల వ్యాధిలో నాలుగు దశలుంటాయి. అవి... 1. కీలులో ఖాళీ ఎక్కువగా ఉండదు. కానీ నొప్పి వల్ల పేషెంటు చురుకుదనం తగ్గుతుంది. ఇది ప్రారంభదశ కాబట్టి చికిత్సగా మందులు, తగిన విశ్రాంతి, ఫిజియోథెరపీతో సరిపోతుంది. 2. రెండో దశలో కీలులో ఖాళీ పెరుగుతుంది. నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో విశ్రాంతి, ఫిజియోథెరపీ మందుల వాడకంతో పాటు ఇంట్రా ఆర్ట్క్యులార్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. 3 - 4 దశలు: ఈ దశల్లో కూడా సాధ్యమైనంత వరకు సంప్రదాయ చికిత్సలకే ప్రాధాన్యం ఇవ్వడాలి. ఇక తప్పదనుకుంటే కీహోల్ సర్జరీ లేదా మినిమిల్లీ ఇన్వేసివ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎంచుకోవచ్చు. అయితే వ్యక్తి వయసు, బరువు, ఎముకల నాణ్యత, ఇతరత్రా ఆరోగ్య సమస్యలన్నింటినీ కీళ్ల సర్జరీ విజయవంతమవుతుందా, ఫెయిలవుతుందా అన్న అంశం ఆధారపడి ఉంటుంది. సర్జరీ తప్పదనుకుంటే... చాలా సందర్భాల్లో ఆపరేషన్ కంటే మందులు వాడుతున్న వారిలోనే జీవనశైలిలో నాణ్యతను గమనించవచ్చు. అయితే సర్జరీ తప్పదనుకుంటే మినిమల్టీ ఇన్వేజివ్ సర్జరీ అయితే గాటు తక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా జాయింట్ ఆర్థరైటిస్ ఉన్న ప్రతి వ్యక్తికీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం లేదు. దాదాపు 95 శాతం వరకు ఆర్థరైటిస్ పేషెంట్లలో సర్జరీ లేకుండానే వ్యాధిని తగ్గించవచ్చు. అయితే ఒకవేళ కీలుమార్పిడి శస్త్రచికిత్స ప్రక్రియను అది చివరి ఆప్షన్‌గా మాత్రమే ఎంచుకోవాలి. దానికంటే ముందు మందులు, ఫిజియోథరపీతోనే తగ్గించవచ్చు. డా. ప్రవీణ్ మేరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 22 ఏళ్లు. నాకు జుట్టు విపరీతంగా రాలిపోతోంది. నా హెయిర్‌లైన్ కూడా క్రమంగా వెనక్కుపోతూ మాడు కనిపిస్తోంది. నేను అనిమిక్‌గా ఉంటాను. హిమోగ్లోబిన్ కూడా తక్కువే. కేవలం 10 శాతం మాత్రమే. దయచేసి నా జుట్టు రాలిపోకుండా ఉండటానికి తగిన సలహా ఇవ్వండి. - శిరీష, వరంగల్ జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో పోషకాహార లోపం చాలా ప్రధానమైనది. పైగా మీ విషయంలో మీలో హిమోగ్లోబిన్ కేవలం 10 శాతం మాత్రమే అంటున్నారు. మీ రక్తహీతన కారణంగానే జుట్టు రాలిపోతూ ఉండవచ్చు. మీ వయసులో అంటే ఇరవైలలో ఉండే యువతలో ఇది చాలా సాధారణమైన విషయం. బహుశా మీ ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. ఇవన్నీ కలిసి మీలో జుట్టు రాలడం ఎక్కువయ్యేందుకు దోహదపడుతూ ఉండవచ్చు. మీరు ఈ కింది సూచనలు పాటించండి. మీలో రక్తహీనతను తగ్గించుకోండి. మీ హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 14 శాతానికి పెరగాలి. ఇందుకోసం ఫై సల్ఫేట్ 50 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున, విటమిన్-సి 500 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల పాటు వాడండి. ఇక మీ జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం బయోటిన్ 10 ఎంజీ, సాపాల్మెథో లేదా ఇతర అమైనోయాసిడ్లను రోజుకు ఒకసారి చొప్పున భోజనం తర్వాత మూడు నెలల పాటు తీసుకోండి. మీ జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మీరు రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు హాయిగా, గాఢంగా నిద్రపోయేలా చూసుకోండి. పై సూచనలన్నీ పాటించాక కూడా మీ జుట్టు రాలడం తగ్గకపోతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స, మీసోథెరపీ వంటి ప్రక్రియలను మీ జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
ఇంటిప్స్
వర్షాకాలం బ్యాక్టీరియా అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. బ్యాక్టీరియా చేరే వస్తువులలో ప్రధానంగా... అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరే వస్తువుల్లో హ్యాండ్ బ్యాగు ఒకటి. వీలైనంత వరకు ఆహార పదార్థాలను బ్యాగు లోపల పెట్టకుండా చూసుకోవడం మేలు. ఒకవేళ పెట్టాల్సి వచ్చినా ప్లాస్టిక్ కవర్లో ఉంచి అప్పుడు బ్యాగ్‌లో ఉంచాలి. వారానికి ఒకసారి తేమ లేకుండా బ్యాగుని గాలికి ఆరబెట్టాలి. ప్రతి పదిరోజులకోసారి బ్రష్‌తో దులిపి లెదర్ కండిషనర్‌తో శుభ్రం చేయాలి. నిత్యం వాడే కీ బోర్డు, మౌస్, టీవీ రిమోట్, ఫ్రిజ్ హ్యాండిల్.. వంటి వాటిపై సూక్ష్మ క్రిములు సులభంగా చేరిపోతాయి. అలాంటప్పుడు వాటిని వాడి, ఆ చేతిని యథాలాపంగా నోటి దగ్గర పెట్టుకోవడం, ముఖానికి రాసుకోవడంతో అవి చర్మంలోనికి చేరుతాయి. దాంతో మొటిమలు, ఇతర చర్మ, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని నివారించాలంటే ఆ వస్తువులను ప్రతి వారానికి, పదిహేను రోజులకోసారి వెనిగర్‌లో ముంచిన దూదితో తుడవాలి. తాగే నీళ్లసీసాలు శుభ్రంగా లేకపోతే శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా చేరిపోతుంది. అందుకే ప్రతి రెండురోజులకోసారి వేడినీళ్లలో రెండు చుక్కల నిమ్మ రసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పు వేసి ఆ నీటితో సీసాలను శుభ్రం చేయాలి. -
కండరాలను తినేసే వ్యాధి..!
మెడిక్షనరీ ఆ వ్యాధి పేరే కండరాలను తినేసే వ్యాధి. ఇంగ్లిష్‌లో దాన్ని ‘ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్’గా పేర్కొంటారు. వైద్య పరిభాషలో నెక్రొటైజింగ్ ఫ్యాషియైటిస్ అని పిలిచే ఈ వ్యాధి ఒక రకం బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోకపోతే అది కాస్త ప్రమాదకరంగా కూడా మారే అవకాశం కూడా ఉంది. చర్మంపై చిన్న చిన్న గాయాలు, గాట్లు, ఏవైనా కీటకాలు కుట్టడం వల్ల ‘గ్రూప్-ఏ స్ట్రెప్టోకోకస్’ (జీఏఎస్) అనే బ్యాక్టీరియా చర్మంలోకి చేరుతుంది. చర్మం కింద ఉంటే సూపర్ఫీషియల్ ఫేషియా అనే కనెక్టివ్ కణజాలంలోకి ఆ బ్యాక్టీరియా విస్తరిస్తుంది. ఫలితంగా చర్మంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలతో పాటు నీళ్ల విరేచనాలు, జ్వరం, మగతగా ఉండటం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే రక్తపోటు పడిపోవడం జరుగుతుంది. ఇంట్రావీనస్ యాంటీబయాటిక్ థెరపీ, ఒక్కోసారి చర్మంపై చచ్చుబడిపోయిన మేరకు మృతకణాజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగించడం, మందులతో పడిపోయిన రక్తపోటును మళ్లీ యథాతథ స్థితికి తేవడం, ఒక్కోసారి రక్తమార్పిడి, ఇమ్యూనోగ్లోబ్యులిన్ వంటి మందులను రక్తనాళానికి ఎక్కించడం (ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్) ... వంటి ప్రక్రియలతో డాక్టర్లు ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్‌కు చికిత్స అందిస్తారు. -
మినరల్ వాటర్ తాగుతున్నారా..? జరభద్రం..!
సాధారణంగా రోడ్డుపై వెళుతున్నప్పుడు దాహం వేస్తే ఏం చేస్తాం? దగ్గర్లో ఉన్న స్టోర్‌లో వాటర్ ప్యాకెట్ కొంటాం. ఎక్కువ మంది ఉంటే వాటర్ బాటిల్ కొని నీళ్లు తాగుతాం. కానీ, ఇక ముందు అలా చేయొద్దని జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ రీసెర్చ్ హెచ్చిరిస్తోంది. వాటర్ బాటిళ్లలో నిల్వ ఉంచే నీరుపై చేసిన పరిశోధనలో.. ఆ నీటిలో కొలీఫాం బాక్టీరియా ఉంటున్నట్లు తెలిపింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి పెడుతున్న దాదాపు 20 రకాల వాటర్ బాటిళ్లను ఘజియాబాద్ నేషనల్ టెస్ట్ హౌస్ లో నిర్వహించిన పరీక్షల్లో బాటిళ్లలో ఈ విషయాన్ని కనుగొన్నారు. దీంతో స్పందించిన ఇండియన్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అనుమతులు లేకుండా నడుపుతున్న కంపెనీలపై చర్యలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ రూ.1,500 కోట్లకు చేరింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ బిజినెస్ స్టాండర్డ్స్(బీఐఎస్)కు ఈ మేరకు భారీగా ఫిర్యాదులు చేరినట్లు తెలిపింది. ప్రముఖ ఆహార సంస్థలే అక్రమంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లను నడుపుతున్నట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయి. బీఐఎస్ హాల్‌మార్క్ లేకుండా ఈ కంపెనీలు నీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏయే చర్యలు తీసుకున్నాయో? ఇప్పటివరకు ఎన్ని ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారనే సమాచారన్ని తమకు అందించాలని బీఐఎస్ ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు వాటర్ అందించే సంస్థలకు లైసెన్స్ ఇచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం దేశం మొత్తంలో 6,513 ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీలకు లైసెన్స్ లు జారీ అయ్యాయి. -
కిరణాలతో క్రిములు ఖతమ్!
వంటింట్లో, హాల్లో, బాత్ రూముల్లో ఎక్కడ బ్యాక్టీ రియా ఉందో ఎక్కడ క్రిములు దాక్కున్నాయో అన్న టెన్షన్... వాటి వల్ల పిల్లలను ఎలాంటి వ్యాధులు చుట్టుముడ తాయోనన్న కంగారు ఇకపై అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లోకి ‘సానిటైజింగ్ వాండ్’ వచ్చింది కాబట్టి. ఇది అల్ట్రా-వయొలెట్ కిరణాల ద్వారా క్రిములను, బ్యాక్టీరియాను క్షణాల్లో చంపేస్తుంది. అంతేకాదు, బ్యాక్టీరియాతో వచ్చే దుర్వాసనను కూడా తొలగిస్తుంది. పిల్లల మంచాలపై, వారు ఆడుకునే ఆట వస్తువులపై, పెంపుడు జంతువుల బెడ్లపై కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే కంప్యూటర్ కీబోర్డుపై, తల దిండుపై చేరే బ్యాక్టీరియాని కూడా క్షణాల్లో ఇది హరించేస్తుంది. వాడటం చాలా ఈజీ. ఈ వాండ్‌ను ఏదైనా వస్తువుపై పెట్టి, బటన్‌ను నొక్కితే చాలు... అల్ట్రా వయొలెట్ కిరణాలు బయటి వస్తాయి. రీచార్జబుల్ బ్యాటరీలతో పని చేస్తుంది కాబట్టి బ్యాటరీ డౌన్ అవ్వగానే చార్జ చేసుకుంటే చాలు! -
అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చు...
హోమియో కౌన్సెలింగ్ మా బాబుకు ఆరేళ్లు. ఎప్పుడూ నోటితో గాలి పీలుస్తుంటాడు. రాత్రి నిద్రలో గురకపెడుతుంటాడు. డాక్టర్లు అడినాయిడ్స్ వాపు ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోపతిలో దీనికి పరిష్కారం ఉందా? - పి.కల్యాణి, కొలనుకొండ అడినాయిడ్స్ అనేది రకరకాల బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ముఖ్యమైన శరీర వ్యవస్థ. ఇది పుట్టుకతో కూడా రావచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, అలర్జీల వల్ల, సిస్టిక్ కార్సినోమా వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కనిపించే ప్రథమ లక్షణం గొంతునొప్పి అయితే ఇన్ఫెక్షన్ను నియంత్రించే ప్రక్రియలో దీని పరిమాణం పెరిగే అవకాశం ఉంది. జలుబుతో ముక్కు మూసుకుపోవడం, గొంతు, మెడలో ఉండే గ్రంథులలో వాపు, నిద్రలేమి, గురక, చెవి సమస్యలు, గొంతు బొంగురు పోవడం, నోటి దుర్వాసన, మింగడానికి ఇబ్బంది కలగడం, పెదవులు పగలడం, నోరు పొడిబారినట్లుగా ఉండటం, నోటి ద్వారా గాలి పీల్చాల్సి రావడం, ఏకాగ్రత లోపించడం, ఆకలి మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం దుష్ర్పభావాలు: చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే కీళ్లవాతం, సైనసైటిస్, చెవి సంబంధ ఇన్ఫెక్షన్, న్యూమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు రావడం, శారీరక ఎదుగుదలపై ప్రభావం వంటివి. నిర్థారణ: రక్తపరీక్షలు, ఎక్స్‌రే, గొంతును పరిశీలన ద్వారా. జాగ్రత్తలు: ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవడం, కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగడం, రోగనిరోధక శక్తిని పెంచే ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేడినీళ్లలో ఉప్పు వేసి రోజూ నాలుగైదుసార్లు పుక్కిలించడం, విశ్రాంతి తీసుకోవడం. హోమియో చికిత్స: శరీరంలోకి ముక్కు, నోటి ద్వారా ప్రవేశించే క్రిములకు అడ్డుకట్ట వేయడంలో ఎడినాయిడ్స్ పాత్రే కీలకం. దీనికి ఇన్ఫెక్షన్ సోకితే పనితీరు మందగించి క్రిములు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హోమియో మందులు ఇన్ఫెక్షన్ని పూర్తిగా నిర్మూలించడంతోపాటు తిరిగి అనారోగ్యం బారినపడకుండా కాపాడుతుంటాయి. రోగి మానసిక, శారీరక లక్షణాలను గుర్తించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. అడినాయిడ్స్ వాపు తగ్గించడానికి ఆపరేషన్ లేకుండా కాల్కేరియా కార్బ్, స్యాంబకస్, కాల్కేరియా ఫ్లోర్, ఆగ్రాఫిస్ వంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయస్సు 46 ఏళ్లు. నేను చాలా రోజుల నుండి అసిడిటి సమస్యతో బాధపడుతున్నాను. గడచిన 6 నెలల నుండి నేను పాంటాసిడ్-హెచ్‌పి మందులు ఒక వారం వాడాను. ప్రస్తుతం ఒమేజ్ మాత్రలు వాడుతున్నాను. అయినా కడుపులో నొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్దకం, తలనొప్పి సమస్య ఉంది. నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు. - వి. భానుమతి, బెంగళూరు మందులు వాడినా ఫలితం కలగడం లేదని చెబుతున్నారు. ఒకసారి మీరు ఎండోస్కోపి చేయించుకొని దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. రెండవది మలబద్దకం, కడుపులో నొప్పి ఉందని అంటున్నారు. సాధారణంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్ల ఇలా జరుగుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మలబద్దకం కడుపులో నొప్పి ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లు, యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల వచ్చే అవకాశముంది. కాబట్టి మీరు మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి చికిత్స తీసుకోండి. మా బాబు వయస్సు 9 సంవత్సరాలు, మూడు సంవత్సరాల క్రితం పచ్చ కామెర్లు వచ్చాయి. ఒక నెల రోజుల తరువాత వాటంతట అవే తగ్గిపోయాయి. అయితే రెండు రోజుల నుండి మళ్లీ కళ్లు పచ్చగా అనిపిస్తున్నాయి. మళ్లీ కామెర్లు వచ్చాయని సందేహంగా ఉంది. దయచేసి ఏమి చేయాలో సలహా ఇవ్వండి. - జి. బాలరాజు, ఆదిలాబాద్ సాధారణంగా చిన్న వయస్సులో వచ్చే పచ్చకామెర్లకు హెపటైటిస్-ఎ, ఇ అనే వైరస్లు కారణమవుతాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వైరస్లు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి కామెర్లు వచ్చాయి అని తెలిపారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ బాబుకి కామెర్లు రావడానికి విల్సన్ డిసీజ్ వంటి ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు. అలాగే మీ బాబుకి దురద, రక్తహీనత వంటి లక్షణాలేమైనా ఉన్నాయో రాయలేదు. ఒక్కసారి మీరు మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నాకు క్రీములు వాడే అలవాటు లేదు. సౌందర్యసాధనాలు వాడటం కూడా ఇష్టం లేదు. ఆహారం ద్వారానే చర్మం మెరిసేలా చేసుకోవడం ఎలాగో చెప్పండి. - డి.ఎల్. అనూరాధ, కొత్తగూడెం మంచి ప్రశ్న వేశారు. ఆహారంతోనే చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మేలు చేస్తాయి. ఇవి ఎక్కువగా ఉండే ఆహారాలైన తాజా చేపలు, అవిశెలు, బాదం... వంటివి తీసుకోవడం ద్వారా చర్మం మెరిసేలా చూసుకోవచ్చు. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్‌లో ఫైబర్ (పీచు పదార్థాలు) ఎక్కువ. ఇవి శరీరంలోని విషాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో వల్ల హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తాయి. నాకు కుడి చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా ఉంటే అక్కడ చాలాసేపు గీరాను. దాంతో అక్కడ నల్లటి మచ్చలు (డార్క్ మార్క్స్) ఏర్పడ్డాయి. అవి వచ్చి నాలుగు నెలలైనా ఇంకా తగ్గలేదు. నేను ఫెయిర్‌గా ఉంటాను. అందుకే అవి ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - పి.పద్మజ, మచిలీపట్నం మీరు చెబుతున్న కండిషన్‌ను పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి ఈ కింది సూచనలు పాటించండి. సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిశ్చరైజర్‌ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి ఆ ప్రాంతంలో ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీములు అప్లై చేయండి ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి. దీనికితోడు మీరు మీ అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి, హైదరాబాద్ -
కమిలిన చర్మానికి...
బ్యూటిప్స్ వేసవిలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ‘ట్యాన్.’ చేతులు, పాదాలు, ముఖం ఎండవేడిమికి నల్లబడుతుంది. ఈ సమస్య దరిచేరకుండానే కాదు, రంగుమారిన చర్మం పూర్వస్థితికి రావాలంటే ఇంట్లోనే కొన్నిర జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో... పసుపు, పెరుగు, తేనె కలిపి శరీరమంతా పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మ సమస్యలు దరిచేరవు. చర్మానికి తగినంత మాయిశ్చరైజింగ్ లభించి మృదువుగా అవుతుంది. స్నానానికి అరగంట ముందు శనగపిండిలో తగినంత పెరుగు కలిపి శరీరమంతా పట్టించి, మర్దనా చేయాలి. ఆరిన తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. ఎండకాలంలో గంధంపొడి చర్మానికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గంధం చెక్కను కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ నూరాలి. ఇలా తీయగా వచ్చిన గంధం చూర్ణాన్ని దేహానికి పట్టించాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ట్యాన్ తగ్గుతుంది. చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. నిమ్మరసం సౌందర్యపోషణలో ఔషధకారిగా పనిచేస్తుంది. అన్ని రకాల చర్మతత్వాలకు సరిపడుతుంది. సహజసిద్ధమైన బ్లీచింగ్‌లా పనిచేసే గుణాలు ఉండటంతో చర్మకాంతి పెరుగుతుంది. అలొవెరా రసం సహజసిద్ధమైన యాంటిసెప్టిక్ లోషన్‌లా పనిచేస్తుంది. దుమ్ము, ధూళి వల్ల చర్మంపై చేరిన బాక్టీరియాను తొలగించడంతో పాటు వైరస్కారకాలను దూరం చేస్తుంది. టేబుల్ స్పూన్ అలొవెరా జెల్, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి, పాదాలకు, చేతులకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి, వారానికి 3 సార్లు ఈవిధంగా చే స్తుంటే ట్యాన్ తగ్గుతుంది. చర్మకాంతి పెరుగుతుంది. -
వాటర్ కూలర్ వ్యాధి ‘లీజియొన్నేరిస్ డిసీజ్’!
మెడిక్షనరీ ఎండలు బాగా ముదురుతున్నాయి. అప్పటివరకూ మూల పడి ఉన్న వాటర్ కూలర్స్ తీసి వాడబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఇది కాస్త చదవండి. వాటర్ కూలర్‌లోని అడుగు భాగంలో నీళ్లు ఉన్నా... కాసేపు వాటర్ కూలర్‌ను బయట పెట్టి ఆన్ చేయకుండా ఉన్నా ఆ మెష్‌లోని ఒక రకం బ్యాక్టీరియా వల్ల ఈ వాటర్ కూలర్లో దాగి ఉండే లీజియొనెల్లా అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల వాటర్ కూలర్ నిమోనియా అని పరిగణించే ‘లీజియొన్నేరిస్ డిసీజ్’ అని పేరున్న ఒక విధమైన నిమోనియా రావచ్చు. అప్పటికే ఆస్తమా వంటి వ్యాధిగస్తులైతే ఈ లీజియొనెల్లా బ్యాక్టీరియాతో మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే పాత నీరు అంతా బయటకు పోయేలా, మెష్ భాగంలో ఉన్న తడిక వంటి భాగంలోని బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్లేలా కాసేపు కూలర్‌ను ఆరుబయటే ఆన్ చేసి ఉంచాలి. కూలర్లో పాత నీరు... ఒక్క చుక్క కూడా లేకుండా డ్రై అయిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత తాజా నీళ్లు (ఫ్రెష్ వాటర్) పోసి అప్పుడు మాత్రమే వాడుకోవాలి. -
కృత్రిమ మాంసం రెడీ
తయారీ బృందంలో తెలుగు శాస్త్రవేత్త నాలుగైదేళ్లలో మార్కెట్లోకి: ఉమా వలేటి వాషింగ్టన్: మాంసం కోసం జంతుబలి అవసరం లేకుండా.. కల్తీలేని, ఆరోగ్యకర మాంసాన్ని అందించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఓ తెలుగు శాస్త్రవేత్తతో కూడిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం.. ప్రయోగశాలలో జంతు కణజాలం నుంచి కృత్రిమంగా మాంసాన్ని రూపొందించింది. ప్రయోగం విజయవంతం కావటంతో రాబోయే రోజుల్లో ప్రయోగశాలలో పెద్ద మొత్తంలో కృత్రిమ మాంసాన్ని తయారుచేయవచ్చని బృంద సభ్యుడైన తెలుగు శాస్త్రవేత్త ఉమా వలేటి తెలి పారు. దీంతో మాంసం కోసం జంతువులను వధించాల్సి న అవసరం ఇకపై ఉండదని హృద్రోగ నిపుణుడు కూడా అయిన వలేటి చెప్పారు. ఇలాంటి మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉండదని, బ్యాక్టీరియా వల్ల చెడిపోదని దీంతో ఎక్కువకాలం నిలువ ఉంచుకోవచ్చన్నారు. కొత్త కణాల్ని తయారుచేసుకునే సామర్థ్యమున్న కొన్ని జంతువుల కణాలు సేకరించి.. దీనికి ఆక్సిజన్, పోషక పదార్థాలు అందిస్తే 9 నుంచి 21 రోజుల్లో మాంసం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఎక్కువగా వినియోగించే ఎద్దు, పంది, కోడి మాంసాలపై ప్రయోగాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడేళ్లలో రెస్టారెంట్లలో, ఐదేళ్లలో రిటైల్ మార్కెట్లలో దీన్ని ప్రవేశపెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. మొదటి ఉత్పత్తి పరిశ్రమ అమెరికాలో నెలకొల్పుతామని, ఇండియా, చైనాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. అమెరికాలోని మెం ఫిస్‌లో స్టెమ్ సెల్ బయాలజిస్టు నికోల స్ జెనోవెసే, బయో మెడికల్ ఇంజినీర్ విల్ క్లెమ్‌తో కలిపి వలేటి మెంఫిక్ మీట్స్‌ను స్థాపించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. -
ప్లాస్టిక్‌ను తినేసే బాక్టీరియా గుర్తింపు!
వాషింగ్టన్: పాస్టిక్ వ్యర్థాలను నిర్వీర్యం చేయడం తలకుమించిన భారంగా పరిణమించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు తీపికబురు అందించారు. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ పరిశోధన బృందం ఇడియోనెల్లా సాకైన్సిస్ అనే బాక్టీరియాను కనుగొన్నారు. కేవలం రెండు ఎంజైమ్‌ల సహాయంతో ఈ బాక్టీరియా పాలీఇథిలిన్ టెరిప్తలేట్(పీఈటీ)ను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుందని వారు గుర్తించారు. పీఈటీని బాటిల్స్, వస్త్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు. ఒక్క 2013లోనే ప్రపంచవ్యాప్తంగా 56 మిలియన్ టన్నుల పీఈటీ ఉత్పత్తి జరిగిందంటే పర్యావరణానికి ఇదెంత హానికారో తెలుస్తుంది. ఈ బ్యాక్టీరియా గుర్తింపుతో ప్లాస్టిక్‌ను నిర్వీర్యం చేసే సూక్ష్మ జీవులను గుర్తించడం కోసం ఐదేళ్లుగా చేస్తున్న కృషి విజయవంతమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే శిలింద్రాలను గతంలోనే పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ తరహా బాక్టీరియాను గుర్తించడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారని సైన్స్ జర్నల్‌లో వెల్లడించారు. 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ బాక్టీరియా సమర్థవంతంగా పీఈపీని నిర్వీర్యం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తిచారు. ప్లాస్టిక్ డీకంపోజింగ్ ఎంజైమ్‌ల తయారీ కోసం ఇడియోనెల్లా సాకైన్సిస్ డీఎన్ఏపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. -
పెరుగుతో బీపీకి చెక్
పరిపరి శోధన పెరుగులోని మేలు చేసే బ్యాక్టీరియా పేగులకు రక్షణగా నిలుస్తుందని, పెరుగులోని కాల్షియం ఎముకలకు పటుత్వాన్ని ఇస్తుందని... ఇలా పెరుగు వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే, తరచుగా పెరుగు తీసుకుంటూ ఉంటే, రక్తపోటు కూడా అదుపులోకి వస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. వారానికి కనీసం ఐదుసార్లు పెరుగు తీసుకున్నట్లయితే, రక్తపోటు గణనీయంగా అదుపులోకి వస్తుందని బోస్టన్ వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 2.40 లక్షల మందిపై విస్తృతంగా నిర్వహించిన పరిశోధనల ద్వారా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు బోస్టన్ పరిశోధకులు చెబుతున్నారు. -
ఈ పిజ్జా మూడేళ్లయినా పాడవదు!
వాషింగ్టన్: మనం ఎంతో ఇష్టంగా తినే పిజ్జా కాస్త మిగిలిపోతే మరుసటి రోజు బయట పడేయాల్సిందే. ఎందుకంటే ఎంత ప్రిజ్‌లో పెట్టినా మహాఅయితే రెండ్రోజులకు మించి పిజ్జా పాడవకుండా ఉండడం కష్టం. కానీ అమెరికా తయారు చేసిన పిజ్జా మాత్రం ఏకంగా మూడేళ్లపాటు నిల్వ ఉంటుందట. మరి మూడేళ్లపాటు పాడవని పిజ్జా ఎందుకు తయారు చేశారో తెలుసా? ఆ దేశ సైన్యం కోసం. అమెరికాలోని మారుమూల ప్రాంతాలు, సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికుల కోసం ఈ పిజ్జాను తయారు చేశారు. దీనికి ‘ఎంఈఆర్ 37’గా నామకరణం కూడా చేశారు. ఏ ఆహార పదార్థమైనా బ్యాక్టీరియా కారణంగానే పాడైపోతుంది. అయితే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా హర్షిల్ టెక్నాలజీతో అమెరికా ఆర్మీ ల్యాబ్‌లో ఈ పిజ్జాను సిద్ధం చేశారు. -
మట్టి మహత్యం... బ్యాక్టీరియా నాశనం
బురదమట్టిని ఒళ్లంతా పూసుకోవడం ఓ చికిత్స పద్ధతన్నది మీకు తెలుసు. ఇలా చేస్తే చర్మరోగాలు పోతాయంటారు. దీని సంగతి ఏమోగానీ... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న సూపర్‌బగ్ బ్యాక్టీరియాను కిసమీత్ బంకమట్టితో నాశనం చేయవచ్చునని యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు అంటున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో సహజసిద్ధంగా లభించే ఈ మట్టి నిమోనియా, స్కెప్టెసీమిమా వంటి వ్యాధులకు కారణమవుతున్న బ్యాక్టీరియాతోపాటు యాంటీబయాటిక్‌లకు లొంగని ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియా చంపేస్తుందని, మొత్తం 16 రకాల బ్యాక్టీరియాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుందని తేల్చారు. కెనడాలోని వాంకోవర్ ప్రాంతంలోని స్థానిక తెగల ప్రజలు ఈ బంకమట్టిని యుగాలుగా కొన్ని వ్యాధుల చికిత్సలో వాడుతున్నారు. 1940 నుంచి వైద్యులు ఈ మట్టిని కాలిన గాయాలు, అల్సర్ల చికిత్సకు వాడినట్లు రికార్డులు చెబుతున్నాయి. యాంటీబయాటిక్‌ల రాకతో మరుగున పడిన ఈ వైద్యవిధానం తాజా పరిశోధనలతో మళ్లీ ప్రాముఖ్యత సంతరించుకుంది. అనేక ఖనిజాలు, బ్యాక్టీరియాలతో కూడిన కిసమీత్ మట్టిపై మరిన్ని పరిశోధనలు జరిపి సరికొత్త యాంటీ బయాటిక్‌లను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
నేను మీ ఊపిరితిత్తిని
నేను ఆనంద్ కుడి ఊపిరితిత్తిని. ఎడమ వైపు ఉన్న నా భాగస్వామి కంటే కాస్త పెద్దగా ఉంటాను. నాలో మూడు భాగాలు ఉంటే, నా భాగస్వామిలో రెండు భాగాలే ఉంటాయి. నేను లేత గులాబిరంగులోని ఫుట్‌బాల్ బ్లాడర్లా తన ఛాతీలో వేలాడుతూ ఉంటాననుకుంటాడు ఆనంద్. నిజానికి నేను రబ్బరుతో చేసిన బాత్ స్పాంజ్‌లా ఉంటాను. తను చంటిపిల్లాడిగా ఉండేటప్పుడే నా ఛాయ లేతగులాబిగా ఉండేది. ఇప్పటి వరకు ఆనంద్ తాగి పారేసిన రెండులక్షల సిగరెట్ల పొగకు తోడు పట్టణ కాలుష్యం ఫలితంగా అసహ్యకరమైన నల్లని మచ్చలతో నేను బూడిద రంగులోకి మారాను. ఆనంద్ ఛాతీలో మూడు మూసేసిన గదులు ఉంటాయి. ఒకటి నాకు, రెండోది నా భాగస్వామికి, మూడోది ఆనంద్ గుండెకు. నేను నా గదిలో వేలాడుతూ ఉంటాను. నాకు ఎలాంటి కండరాలూ లేవు. అందువల్ల శ్వాసక్రియలో నాది పరోక్ష పాత్ర మాత్రమే. దాదాపు అరకిలో బరువు తూగే నేను, నా గదిని పూర్తిగా ఆక్రమించుకుని ఉంటాను. ఆనంద్ ఊపిరి పీల్చుకునేటప్పుడు నేను వ్యాకోచించడానికి వీలుగా నా గదిలో కాస్తంత ఖాళీ జాగా ఉంటుంది. అలాగే, అతడు ఊపిరి విడిచి పెట్టేటప్పుడు నేను ముడుచుకుంటాను. నాలో జరిగే ఈ ప్రక్రియ అంతా ఒక రీకాయిల్ మెకానిజం. స్వచ్ఛంద నియంత్రణ ఆనంద్ శరీరంలోని గుండె, మెదడు వంటి చాలా ఇతర అవయవాల మాదిరిగానే నేను కూడా స్వచ్ఛంద నియంత్రణతోనే పనిచేస్తాను. అంటే, ఆనంద్ ప్రమేయం లేకున్నా నా పని నేను చేసుకుపోతూనే ఉంటాను. శ్వాసక్రియకు సంబంధించిన స్వయం నియంత్రణ అంతా ‘మెడ్యులా ఆబ్లంగేటా’లో జరుగుతూ ఉంటుంది. వెన్నెముక మెదడుకు అనుసంధానమైన చోట చిన్న బుడిపెలా ఉండే ఈ భాగం సున్నితమైన కెమికల్ డిటెక్టర్‌గా పనిచేస్తుంది. శ్రమించే కండరాలు పుష్కలంగా ఆక్సిజన్ వాడుకుంటూ, వ్యర్థమైన కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపే క్రమంలో రక్తంలో స్వల్పంగా ఆమ్లస్వభావం ఏర్పడుతుంది. ‘మెడ్యులా ఆబ్లంగేటా’ ఈ మార్పును సత్వరమే గుర్తించి, నన్ను మరింత వేగంగా పనిచేసేలా ఆదేశిస్తుంది. ఆనంద్ కఠిన వ్యాయామం చేసినట్లయితే, మరింత గాఢంగా, మరింత వేగంగా ఊపిరి తీసుకునేలా ఆదేశిస్తుంది. ఆనంద్ విశ్రాంతిగా మంచం మీద పడుకుని ఉంటే, అతడికి నిమిషానికి తొమ్మిది లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. కూర్చుని పనిచేసుకుంటూ ఉంటే నిమిషానికి 18 లీటర్లు, నడుస్తుంటే నిమిషాలు 27 లీటర్లు, పరుగు తీస్తే నిమిషానికి 56 లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. సాధారణంగా ఆనంద్ నిమిషానికి పదహారుసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఒక్కోసారి అరలీటరు గాలి లోపలకు పీల్చుకుంటాడు. అయితే, అతడు పీల్చిన గాలంతా నా లోపలకు చేరుకోదు. చాలా వరకు గాలి వాయునాళంలో, శ్వాసనాళాల్లో దిశారహితంగా సంచరిస్తూ ఉంటుంది. అయితే, నాలోకి చేరే గాలి వెచ్చగా, కాస్త తేమగా ఉండాలని కోరుకుంటాను. కొద్ది సెంటీమీటర్ల మార్గంలో ప్రయాణించే గాలిని అలా వెచ్చగా, తేమగా మారడం ఒక విచిత్రమైన ప్రక్రియ. ఆనంద్ కంట్లో ఉంటే అశ్రుగ్రంథులు, ముక్కులో, నోట్లో, గొంతులో ఉండే తేమ ఉత్పత్తి చేసే గ్రంథుల ద్వారా నాలోకి వచ్చే గాలిలోకి రోజుకు అరలీటరు వరకు తేమ చేరుతుంది. వాయుకోశాల్లోని రక్తనాళాలు చలికాలంలో వ్యాకోచించుకుని, వేసవిలో సంకోచించుకుని ఉంటాయి. ఫలితంగా నాలోకి చేరే గాలి నిరంతరం ఒకే రకమైన వెచ్చదనంతో ఉంటుంది. వీటి వల్లే ఇబ్బందులు నిజానికి చెప్పుకోవాలంటే నాకు తలెత్తే ఇబ్బందులకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఆనంద్ ప్రతిరోజూ గాలితో పాటే రకరకాల బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను, దుమ్ము ధూళి కాలుష్యాలను కూడా లోపలకు పీల్చుకుంటూ ఉంటాడు. అయితే, చాలా వరకు నన్ను నేను రక్షించుకునే ఏర్పాట్లు నాలోనే ఉన్నాయి. ఆనంద్ ముక్కు, గొంతులో ఉండే లైసోజైమ్ ప్రభావానికి బ్యాక్టీరియా, వైరస్లు చాలా వరకు మరణిస్తాయి. అప్పటికీ అవి తప్పించుకుని శ్వాసకోశంలోకి చేరితే, అక్కడ ఉండే ‘ఫాగోసైట్’ కణాలు వాటిని వెంటాడి మరీ తినేస్తాయి. సూక్ష్మజీవులతో పెద్దగా ఇబ్బంది లేదు గానీ, రసాయనాలతో కలుషితమైన గాలితోనే నాకు ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. గాలితో పాటు నాలోకి చేరే సల్ఫర్ డయాక్సైడ్, బెంజోపైరిన్, నైట్రోజన్ డయాక్సైడ్, లెడ్ వంటి రసాయనాలను చాలా వరకు ఎదుర్కోగలను. ఇలాంటి పదార్థాల్లో కొన్ని నైలాన్‌ను సైతం కరిగించగలవు. ఇవి నేరుగా నాలోకి చేరితే, నాకు ఎంతటి ముప్పు కలిగించ గలవో ఊహించండి. అయితే, చాలా వడపోత తర్వాతే గాలి నాలోకి చేరుతుంది. ముక్కులోని సన్నని వెంట్రుకలు కాస్త పెద్దగా ఉండే కాలుష్య కణాలను అక్కడే అడ్డుకుంటాయి. ముక్కులో, గొంతులో, వాయునాళం, శ్వాసనాళాల్లో ఉండే జిగురు పదార్థం మ్యూకస్ మిగిలిన కాలుష్య కణాలను అడ్డుకుని, బయటకు పంపేస్తుంది. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన కాలుష్య పదార్థాలను శ్వాసనాళాల్లో ఉండే సన్నని వెంట్రుకల వంటి ‘సిలియా’ బయటకు పంపేస్తాయి. ఈ ‘సిలియా’ సెకనుకు పన్నెండుసార్లు కదలాడుతూ కాలుష్యాలను బయటకు తరిమేస్తాయి. వాటి కదలికల వేగానికే, శ్వాసనాళాల్లో దిగువన ఉండే మ్యూకస్ కఫంగా గొంతులోకి చేరుతుంది. పొగ మానేస్తే మళ్లీ పర్ఫెక్ట్ ఆనంద్ సిగరెట్ తాగితే ఆ పొగ ప్రభావానికి ‘సిలియా’ కదలికలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఫలితంగా ఒక్కోసారి శ్వాసనాళంలో దురద ఏర్పడి దగ్గుతెర తరుముకొస్తుంది. ఆనంద్‌కు ముప్పయ్యేళ్లుగా సిగరెట్ అలవాటు ఉంది. ఈ పాడు అలవాటు వల్ల శ్వాసనాళాల్లో మ్యూకస్‌ను స్రవించే పొర మూడురెట్లు మందంగా మారింది. దీనివల్ల తలెత్తే ముప్పును ఆనంద్ తెలుసుకోలేకపోతున్నాడు. బరువెక్కిన మ్యూకస్ శ్వాసకోశాల్లోకి జారుతున్న కొద్దీ, అతడు మునిగిపోతున్నట్లే లెక్క. శ్వాసకోశాలు మ్యూకస్‌తో నిండిపోతూ ఉండటంతో సరిగా ఊపిరి కూడా తీసుకోలేడు. అయితే, ‘సిలియా’ కదలికల వల్ల తరచుగా వచ్చే దగ్గు అతడిని రక్షిస్తూ ఉంటుంది. దగ్గు వేగానికి లోపల పేరుకున్న కాలుష్యాల్లో కొన్ని బయటకు పోతూ ఉంటాయి. అయితే, ఆనంద్ మరీ ఎక్కువగా సిగరెట్లు తాగేస్తూ నాలోకి నానా చెత్తా పంపిస్తూ ఉంటాడు. పొగతో వచ్చే కొన్ని కణాలు నాలోని సూక్ష్మ మార్గాల్లోకి చేరి, వాటిని మూసేస్తూ ఉంటాయి. ఇంకొన్ని నా కణజాలంపై మచ్చలుగా మిగిలిపోతాయి. ఎక్కువ కాలం ఇలా సాగితే, నా గోడలు ఎలాస్టిసిటీని కోల్పోతాయి. అందువల్ల గాలి విడిచేటప్పుడు నేను పూర్తిగా ముడుచుకోలేకపోతాను. అలాంటప్పుడు నాలోని కార్బన్ డయాక్సైడ్ పూర్తిగా బయటకు పోదు. లోపలకు చేరే ఆక్సిజన్‌కు తగినంత చోటు ఉండదు. నా పరిస్థితి బాగుపడాలంటే, సిగరెట్లు మానేయడం తప్ప ఆనంద్‌కు మరో మార్గం లేదు. పొగ తాగడం మానేసిన నెల్లాళ్లలోనే నేను పునరుత్తేజం పొందడం ప్రారంభిస్తాను. కొద్ది నెలల్లో తిరిగి పూర్తి జవసత్వాలను సంతరించుకుంటాను. ఇదీ నా నిర్మాణం పది సెంటీమీటర్ల పొడవున ఉండే ఆనంద్ వాయునాళం దిగువ వైపు రెండు శాఖలుగా విడిపోతుంది. ఇవే శ్వాసనాళాలు వాటిలో ఒకదాని దిగువ నేను, మరోదాని దిగువ నా భాగస్వామి వేలాడుతూ ఉంటాం. వాయునాళం నుంచి ఆకారాన్ని గమనిస్తే, తలకిందులుగా వేలాడే చెట్టులా కనిపిస్తా. శ్వాసనాళాలు కాస్త పెద్దగానే ఉంటాయి. అవి మరిన్ని శాఖలుగా... సూక్ష్మ శ్వాసనాళాలుగా విస్తరించి ఉంటాయి. వీటి వ్యాసం సెంటీమీటరులో నలభయ్యవ వంతు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ నాలోకి గాలిని పంపే వాహకాలు. అయితే, నా అసలు పనంతా వాయుకోశాలలోనే. ద్రాక్షపళ్ల గుత్తిలా ఉంటుందా తిత్తి. బయట దానిని పరిస్తే, టెన్నిస్ కోర్టులో సగం విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. ప్రతి వాయుకోశంలో కొన్ని వేల రక్తకేశనాళికలు సాలెగూడులా అల్లుకుని ఉంటాయి. ఒక్కో కేశనాళిక గుండా రెప్పపాటు కాలంలో ఎర్ర రక్తకణాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఉల్లిపొరలాంటి కేశనాళికల ద్వారా ఈ ఎర్ర రక్తకణాలు తమతో తీసుకువచ్చిన కార్బన్ డయాక్సైడ్ను వదిలేసి, అక్కడ ఉన్న ఆక్సిజన్‌ను తీసుకుని ముందుకు సాగుతాయి. ఇంట్లోని కాలుష్యంతోనూ ఇబ్బందులు కాలుష్యం అనగానే మనం బయటి కాలుష్యమే అనుకుంటాం. కానీ ఇంట్లోనూ కాలుష్యం ఉంటుంది. ఇల్లు ఊడ్చేటప్పుడు, బూజు దులిపేటప్పుడు రేగే ధూళికణాలతో పాటు.. అగరుబత్తీలు, కర్పూరం వంటివి వెలిగించినప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు, వంటింట్లో పోపు పెట్టేటప్పుడు వచ్చే ఘాటైన వాసనను కూడా మనం ఇంటి కాలుష్యంగానే పరిగణించాలి. ఈ ఘాటు వల్ల ఇంట్లోని పిల్లలకు, వయసులో పెద్దవాళ్లకు ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎలర్జీ స్వభావం లేని వాళ్లకు సైతం.. ఘాటు తీవ్రతను బట్టి తమ్ములు, దగ్గు, ఆయాసం, జలుబు వంటివి రావచ్చు. ఎలర్జీ స్వభావం ఉన్నవాళ్లకైతే ఇవే మరింత తీవ్రమై ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావచ్చు. అందుకే ఇంట్లోని కిటికీలన్నీ వీలైనంత వరకు తెరచి ఉంచడం మంచిది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటే మరీ మంచిది. ఇవి లేనప్పుడు, ఇంట్లోని పొగల ఘాటు ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కుకు మందపాటి కర్చీఫ్‌ను కట్టుకోవడం ద్వారా కాలుష్యాన్ని నిరోధించవచ్చు. చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడు ఆటోలలో, బస్సులలో, టూ వీలర్స్‌లో బయటి కాలుష్యానికి గురవుతారు. మాస్కులు ధరించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. - డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్ -
వామ్మో...నూడుల్స్‌లో పురుగులు..!
-
ముగ్గు ముచ్చట్లు
చక్కగా ఆవుపేడతో అలికిన ఇంటి ముందు గుల్లముగ్గులు అంటే బియ్యప్పిండిలో సున్నం పొడి కలిపిన ముగ్గులు పెట్టడం వల్ల క్రిమికీటకాలు ప్రవేశించవని, బ్యాక్టీరియా సోకదని అప్పుడెప్పుడో గడ్డాలు పెంచిన శాస్త్రవేత్తలే తేల్చి చెప్పేశారు. ఓసారి ఆకాశంలో నుంచి కిందికి చూసిన ఓ అనుమానపు తారకకు తమలో కొందరు జారి కిందపడ్డారేమో అనే అనుమానం వచ్చిందట. కంగారు కంగారుగా ఆ విషయం అందరి చెవిలోనూ ఊదేసిందట. తారకలందరూ ఆందోళనగా ఒకరినొకరు లెక్కబెట్టుకుంటే అందరి లెక్కా సరిపోయిందట. దాంతో ‘అసలు నీకెందుకొచ్చిందీ అనుమానం?’ అని నిలదీశారట. ‘అనవసరంగా నన్నాడిపోసుకుంటారేం, మీరోసారి కిందకి చూడండి’అంటూ చికాకుపడిందట ఆ చుక్క. తారామణులందరూ నేలమీద తేరిపార చూస్తే... అందమైన అమ్మాయిలు, పద్ధతి గల గృహిణులు ఎంతో శ్రద్ధాసక్తులతో ఇంటి ముంగిళ్లలో రకరకాల ఆకారాలలో చుక్కలు పెడుతూ, ఆ చుక్కలను కలుపుతూ రంగు రంగుల ముగ్గులు పెడుతూ కనిపించారట. ‘ఇది ధనుర్మాసం కదా... ఈ నెలంతా భూలోకంలో అందరూ ముగ్గులు పెడతారు, ఆ మాత్రం తెలియదా?’ అని దెప్పిపొడిచారట. అప్పుడా తార ‘ఇన్నాళ్లూ మనం ఆకాశంలో ఉన్నామని విర్రవీగుతున్నాం కదా, మనల్ని నేలమీదకు దించేవాళ్లు కూడా ఉన్నారు చూశారా?’ అని ఎదురు పోటు పొడిచిందట. అప్పుడు అందరూ కలసి హాయిగా నవ్వుకున్నారట. వినడానికి సరదాగా ఉన్నా, ముగ్గులు పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. ధనుర్మాసంలో అయితే మరీనూ! ఒకప్పుడు సంక్రాంతి సీజన్లో కార్టూనిస్టులందరూ ముగ్గుల మీదనే తమ కుంచెను ఆనించేవారు. చుక్కల్ని కలుపుకుంటూ పక్కూరి పొలిమేర లు దాటేసిన వాళ్ల గురించి, ముగ్గులు పెడుతూ పెడుతూ చుక్కల పేట వరకూ షికారుకెళ్లిన వాళ్లను, ఎంతో కష్టపడి వేసిన తమ ముత్యాల ముగ్గు తొక్కారని పైటకొంగు బొడ్లో దోపి మరీ చావచితక్కొట్టిన వీరనారులను, ముగ్గు తొక్కకుండా లోనికొచ్చి జాబులందించడం కోసం పోస్ట్మెన్లు పడే పాట్ల దాకా కార్టూనిస్టులు దేనినీ వదిలిపెట్టలేదు. చిన్న పిల్లల చేతిని తమ చేతిలోకి తీసుకుని ఇల్లు అలికి ముగ్గుపెట్టి... అని ఆటాడించడం, ఆ తర్వాత అదే ఆటను మనమూ పిల్లల చేత ఆడించడాలు చాలా మంది బుర్రల్లో ఇప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలే. అంతేనా! పిడికిట్లో ఇమిడిపోయే నడుమును విల్లంబులా వంచి, పైటచెంగును బొడ్డులో దోపి, నల్లతాచు లాంటి జడను నాట్యం చేయిస్తూ, పైనున్న చుక్కలతో పోటీ పడుతూ ముగ్గులు పెట్టే ముగ్గుగుమ్మలను ఆరాధనగా చూస్తూ, మనసు పారేసుకోని కుర్రాళ్లుండేవారా, వారి ముగ్గులో పడని పడతులుంటారా? గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి! ముగ్గులు పెట్టడం వల్ల ముంగిలి ముచ్చటగా ఉంటుంది. అందంగా ముగ్గులు తీర్చిదిద్ది ఉన్న ఇంట శుభకార్యం ఏదో జరుగుతోందని అర్థం. ఎవరి వాకిళ్లలో అయినా అసలు ముగ్గుగీతే పడలేదంటే ఆ ఇంట అశుభం అయి ఉండొచ్చేమో అని అర్థం చేసుకుంటారు. అందుకే ఇల్లాళ్లందరూ ముగ్గు వెయ్యడం విధిగా, అదే తమకు నిధిగా భావిస్తుంటారు.ముగ్గులు పెట్టడంలో మీ కారణాలు మీకుంటే ఉండచ్చు గాక చక్కగా ఆవుపేడతో అలికిన ఇంటి ముందు గుల్లముగ్గులు అంటే బియ్యప్పిండిలో సున్నం పొడి కలిపిన ముగ్గులు పెట్టడం వల్ల క్రిమికీటకాలు ప్రవేశించవని, బ్యాక్టీరియా సోకదని అప్పుడెప్పుడో గడ్డాలు పెంచిన శాస్త్రవేత్తలే తేల్చి చెప్పేశారు. పూర్వం ఇల్లు అలికి ముగ్గుపెట్టనిదే వంట చేసేవారు కాదు. అగ్నిని ఆరాధించే వారు కూడా ముందుగా ముగ్గు పెట్టిన తర్వాతనే అగ్న్యారాధన చేసేవారు. అలాగే ఓ యజ్ఞం చెయ్యాలన్నా, హోమగుండం తవ్వాలన్నా, పాలు పొంగించాలన్నా, పూజకు కలశం పెట్టాలన్నా ముత్యాల్లాంటి ముగ్గులు పడాల్సిందే! అందరి లోగిళ్లూ ముగ్గుమందారాలయినప్పుడు ఊరంతా సంక్రాంతే మరి! - డి.వి.ఆర్. భాస్కర్ అతివల అనాది కళ కోడికూతతోనే నిద్రలేచి, వాకిలి చిమ్మి, పేడనీటితో కళ్లాపి చల్లి ముంగిట్లో ముగ్గులు తీర్చిదిద్దడం తెలుగిళ్లలోనే కాదు, దేశవ్యాప్తంగా భారతీయుల ఇళ్లలో ఇదొక అనుదినచర్య. అభివృద్ధి వేగానికి పట్టణీకరణ పెరిగాక, వాకిళ్లు కుంచించుకుపోయాయి. కళ్లాపి చల్లడానికి వీల్లేని సిమెంటు గచ్చులు వచ్చిపడ్డాయి. నయా జమానాలో నగరాల దుస్థితి చెప్పనే అక్కర్లేదు... మనుషుల్లో అనివార్యంగా అపార్ట్‌మెంటాలిటీ పెరిగింది. అపార్ట్మెంట్లలో ఎవరి గూడు వాళ్లదే! ఎవరి గుమ్మం వాళ్లదే! గుమ్మం ముందు ఉండే ఖాళీ జాగా దోసెడంతే! అనివార్య అధునాతన పరిణామాల ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు కళ్లాపి కనుమరుగైనా, ముగ్గులింకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇదివరకు చాలామంది రాతిపిండితో రంగవల్లికలను తీర్చిదిద్దేవాళ్లు. కొందరు నేరుగా ముగ్గురాతితోనూ , ఇంకొందరు చీమల వంటి చిరుజీవులకు ఆహారంగా కూడా ఉపయోగపడాలనే భూతదయతో వరిపిండితోనూ ముగ్గులు వేసేవాళ్లు. ఇప్పుడు జమానా బదల్‌గయా! పండుగల సీజన్లలో తప్ప మిగిలిన రోజుల్లో చాక్‌పీసులతో హడావుడి ముగ్గులు గీసి పారేస్తున్నారు. ఎలా గీసినా వాకిళ్లలో ముగ్గులు గీయడాన్ని ముదితలింకా మరచిపోలేదు. ముగ్గూ- దాని పుట్టుపూర్వోత్తరాలు గ్రంథస్థం కాలేదు గానీ, ముగ్గులు పురాణాల కంటే ముందే పుట్టి ఉంటాయనే అంచనా ఉంది. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రస్తావన ఉంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణగాథ ఉంది. ఎప్పుడో సత్యకాలంలో ఒక రాజు పాలించేవాడు. ఆ రాజు దగ్గర ఒక రాజగురువు ఉండేవాడు. విధివశాన ఆ రాజగురువు కొడుకు అకాల మరణం చెందాడు. పుత్రశోకంతో ఆ రాజగురువు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమంటే, చనిపోయిన తన కొడుకును బతికించమంటాడు రాజగురువు. అప్పుడు బ్రహ్మదేవుడు... నేలను శుభ్రం చేసి, అక్కడ మనిషి ఆకారంలో ముగ్గు వేయించమని ఆదేశిస్తాడు. అలాగే ముగ్గు వేయడంతో, చనిపోయిన రాజగురువు కొడుకును బతికిస్తాడు. అప్పటి నుంచి ముంగిళ్లలో ముగ్గులు వేయడం ఆచారంగా మారిందని చెబుతారు. ముగ్గులు ఎందుకు వేస్తారంటే, కారణాలను కచ్చితంగా చెప్పలేం. అష్టలక్ష్ములను ఆహ్వానించడానికే కాదు, అతిథులను స్వాగతించడానికి కూడా ముంగిళ్లను ముగ్గులతో అలంకరించడం మన సంప్రదాయం. అతిథులను సాక్షాత్ భగవత్ స్వరూపులుగా గౌరవించే సంప్రదాయం మన దేశంలోనే ఉంది. అందుకే ‘అతిథి దేవో భవ’ అంటారు. తిథి వారాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా వచ్చేవాళ్లే అతిథులు. అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చిన వారిని గుమ్మంలోనే నిలబెట్టి, అప్పుడు స్వాగత సన్నాహాల కోసం తత్తరపడటం సరికాదు. బహుశ ఆ ఉద్దేశంతోనే మనవాళ్లు ముంగిళ్లలో ముగ్గులు వేయడాన్ని దినచర్యగా మార్చుకొని ఉంటారు. - పన్యాల జగన్నాథ దాసు ముగ్గులేసిన ‘మగా’నుభావుడు భారతీయ చిత్రకారుల్లో పురుష పుంగవులెవరూ ముగ్గులు వేయలేదు గానీ, ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో డావిన్సీ మాత్రం ముచ్చటగా ముగ్గులేశాడు. ఇండియన్ ముగ్గుల తీరుతెన్నులు ఈ ఇటాలియన్ చిత్రకారుడికి ఎలా పట్టుబడ్డాయనేది ఆశ్చర్యకరమే! మనవాళ్లు వేసే మెలికల ముగ్గుల్లాంటి డిజైన్లను డావిన్సీ చాలానే వేశాడు. తాను చిత్రించిన చాలా పోర్టరైట్స్లో కూడా దుస్తులపై ముగ్గుల డిజైన్లు వేశాడు. ముగ్గులేసిన ‘మగా’నుభావుడు చరిత్రలో డావిన్సీ ఒక్కడేనేమో! -
గురకతో వస్తున్న గొడవలు..!
హోమియో కౌన్సెలింగ్ మా బాబుకు ఆరేళ్లు. ఎప్పుడూ నోటితో గాలి పీలుస్తుంటాడు. రాత్రి నిద్రలో గురకపెడుతుంటాడు. డాక్టర్లు అడినాయిడ్స్ వాపు ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోపతిలో దీనికి పరిష్కారం ఉందా? - శంకరరావు, రాజమండ్రి అడినాయిడ్స్ అనేది రకరకాల బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ముఖ్యమైన శరీర వ్యవస్థ. ఇది పుట్టుకతో కూడా రావచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, అలర్జీల వల్ల, సిస్టిక్ కార్సినోమా వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కనిపించే ప్రథమ లక్షణం గొంతునొప్పి అయితే ఇన్ఫెక్షన్ను నియంత్రించే ప్రక్రియలో దీని పరిమాణం పెరిగే అవకాశం ఉంది. జలుబుతో ముక్కు మూసుకుపోవడం, గొంతు, మెడలో ఉండే గ్రంథులలో వాపు, నిద్రలేమి, గురక, చెవి సమస్యలు, గొంతు బొంగురు పోవడం, నోటి దుర్వాసన, మింగడానికి ఇబ్బంది కలగడం, పెదవులు పగలడం, నోరు పొడిబారినట్లుగా ఉండటం, నోటి ద్వారా గాలి పీల్చాల్సి రావడం, ఏకాగ్రత లోపించడం, ఆకలి మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం దుష్ర్పభావాలు: చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే కీళ్లవాతం, సైనసైటిస్, చెవి సంబంధ ఇన్ఫెక్షన్, న్యూమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు రావడం, శారీరక ఎదుగుదలపై ప్రభావం వంటివి. నిర్థారణ: రక్తపరీక్షలు, ఎక్స్‌రే, గొంతును పరిశీలించడం ద్వారా. జాగ్రత్తలు: ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవడం, కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగడం, రోగనిరోధక శక్తిని పెంచే ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేడినీళ్లలో ఉప్పు వేసి రోజూ నాలుగైదుసార్లు పుక్కిలించడం, విశ్రాంతి తీసుకోవడం. హోమియో చికిత్స: శరీరంలోకి ముక్కు, నోటి ద్వారా ప్రవేశించే క్రిములకు అడ్డుకట్ట వేయడంలో ఎడినాయిడ్స్ పాత్రే కీలకం. దీనికి ఇన్ఫెక్షన్ సోకితే పనితీరు మందగించి క్రిములు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హోమియో మందులు ఇన్ఫెక్షన్ని పూర్తిగా నిర్మూలించడంతోపాటు తిరిగి అనారోగ్యం బారినపడకుండా కాపాడుతుంటాయి. రోగి మానసిక, శారీరక లక్షణాలను గుర్తించి వైద్యులు తగిన మందులు సూచిస్తుంటారు. అడినాయిడ్స్ వాపు తగ్గించడానికి ఆపరేషన్ లేకుండా కాల్కేరియా కార్బ్, స్యాంబకస్, కాల్కేరియా ఫ్లోర్, ఆగ్రాఫిస్ వంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్త్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నాకు 29 ఏళ్లు. వివాహమై మూడేళ్లవుతున్నా సంతానం లేకపోవడంతో డాక్టర్ చెప్పిన పరీక్షలు చేయించాను. రిపోర్టులో హెచ్‌బీఎస్ ఎజీ-పాజిటివ్ అని వచ్చింది. హెచ్ఇపి-బి వైరస్ నా రక్తంలో, వీర్యంలో ఉంటుందా? నా ద్వారా హెచ్ఇపి-బి వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంటుందా? నేను నా భార్యతో కలవచ్చా? దీని ద్వారా కాలేయానికి హాని జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలుపగలరు. - ఎమ్.ఆర్., కడప హైపటైటిస్-బి రక్తం ద్వారా వస్తుంది. కాని సెక్స్ ద్వారా వ్యాపించడం చాలా తక్కువ. అయినప్పటికీ మీ భార్యకి ముందుజాగ్రత్తగా 3 డోస్‌లు వ్యాక్సిన్ ఇప్పించాలి. వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు మీరు కండోమ్ వాడాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాని రెగ్యులర్‌గా మీరు ఎల్.ఎఫ్.టి. టెస్ట్ చేయించుకోవాలి. మీరు సంతానం కోసం ఇన్ఫెర్టిలిటీ చికిత్స కూడా చేయించుకోవచ్చు. హైపటైటిస్-బి చాలా వేగంగా లివర్‌కు సమస్యలు తెచ్చిపెడుతుంది. ఒక రకంగా హెచ్.ఐ.వి. కన్నా 50 నుంచి వంద రెట్లు ఎక్కువ ప్రమాదమైనది. ఇది రక్తం, లాలాజలం, వీర్యం, సర్వైకల్ ద్రవాల ద్వారా వ్యాపించవచ్చు. వైరస్ చేరిన వెంటనే పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. కొంతమందిలో ఫ్లూలాంటి జ్వరం, తీవ్రమైన అలసట, వికారం, కళ్లు, ఒళ్లు పచ్చబడటం కామెర్ల లక్షణాలు, విరోచనాలు ఉంటాయి. హైపటైటిస్-బి గుర్తించేందుకు మాంటిజన్ పరీక్షను నిర్వహిస్తారు. వైరస్ చేరిన వెంటనే ఈ పరీక్షలో తెలియదు. 6 నుంచి 12 వారాల తర్వాత మాత్రమే పాజిటివ్ అన్న ఫలితం వస్తుంది. కాబట్టి మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. దీని బారిన పడిన 10 మందిలో 9 మందికి ఆరు నెలల్లో దానంతట అదే తగ్గిపోతుంది. కొద్దిమందిలో మాత్రమే శరీరంలో ఉండిపోయి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా మారుతుంది. దాతో లివర్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లివర్ క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్య కారణం హైపటైటిస్-బి అని చెప్పవచ్చు. ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్ ముదరకుండా లివర్‌ను దెబ్బతీయకుండా చికిత్స అందిస్తారు. కొన్ని వారాల పాటు మందులు వాడితే వైరస్ పెరుగుదల ఆగిపోతుంది. జాగ్రత్తలు: శరీరంలో హైపటైటిస్-బి వైరస్ ఉంటే వారి రక్తం, శారీక స్రావాల ద్వారా ఇతరులకు కూడా సంక్రమించే అవకాశం ఎక్కువ. శృంగారం, ఇతరులకు వాడిన ఇంజెక్షన్లు, సూదులు, సిరంజిలు, బ్లేడులు, టూత్‌బ్రష్‌లు, నెయిల్ క్లిప్లర్ల వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. బిడ్డకు కూడా పుట్టగానే టీకా ఇప్పించాలి. హైపటైటిస్-బి వ్యాక్సినేషన్ చేయించాలి. మీరు క్రమం తప్పకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి రెగ్యులర్‌గా చికిత్స తీసుకోవాలి. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ మా వారి వయసు 40. గత ఐదేళ్లుగా మా ఆయనకు రాత్రిళ్లు విపరీతమైన గురక వస్తుంది. గురక పెడుతున్న సమయంలో తడితే కొద్ది సమయం పాటు ఆగి, మళ్లీ అలాగే గురక వస్తుంది. ఆయనకు సిగరెట్ అలవాటు ఉంది. బరువు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువే ఉంటారు. ఆయన గురక వల్ల నేను, మా పిల్లలు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోతున్నాము. గురక కారణంగానే మా కాపురంలో చాలా గొడవలు వస్తున్నాయి. ఈ గురక సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా..? దయచేసి తెలుపగలరు. - ధనలక్ష్మి, కడప చాలామంది గురక సమస్యను అంతగా పట్టించుకోరు. కుటుంబ సభ్యులకు గురక సమస్య ఉన్నా అలాగే సర్దుకుపోతుంటారు. గురక సమస్యకు సరైన కారణం కనుక్కుని చికిత్స అందించడం చాలా అవసరం. ఎందుకంటే గురక ఉండడం ఒక జబ్బు కూడా కావచ్చు. అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. గురక వల్ల బీపీ, షుగర్, గుండె సమస్యలు, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గురక వల్ల కుటుంబపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా సామాజికంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గురక పెట్టేవారితో పాటు వారితో కలిసి పడుకునే వారికి కూడా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. గురక పెట్టేవారితో కలిసి పడుకునే వారిలో నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. నిద్రలేమితో ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం, బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గురక సమస్యను నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు. మీరు సాధ్యమైనంత త్వరగా మీ వారిని పల్మనాలజీ నిపుణులకు చూపించండి. గురక సమస్యకు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. గురకలో మంచి గురక, చెడు గురక అని రెండు రకాలుగా ఉంటుంది. దీనిని తెలుసుకోవడానికి స్లీప్ స్టడీ చేయాల్సి ఉంటుంది. స్లీప్ స్టడీ ద్వారా సమస్యను కనుక్కుని అందుకు తగిన చికిత్స అందిస్తారు. చికిత్స తీసుకోకుండా ఆలస్యం చేస్తే మాత్రం ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వైద్యులను సంప్రదించండి. డాక్టర్ ఎమ్.వి. నాగార్జున సీనియర్ పల్మనాలజిస్టు, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
స్కూల్లో కళ్లు తిరిగి పడిపోతే...?
హోమియో కౌన్సెలింగ్ నేను కెమికల్ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ మేనేజర్‌ను. కడుపులో మంట, వికారం ఉంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. ఎండోస్కోపీ చేసి అల్సర్ అన్నారు. దీనికి హోమియో శాశ్వత పరిష్కారం చూపించండి. - అనిల్‌కుమార్, కరీంనగర్ ఈ మధ్య కాలంలో ఆరోగ్యసమస్యలను వ్యాధులుగా పరిగణించడం జరుగుతోంది. కానీ వాటిని జబ్బుగా అనుకోవడం కంటే జీవనశైలి లోపాలుగా చెప్పుకోవడం సబబు. అలాంటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రధానంగా కనిపించే సమస్యలో ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్. శరీరంలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆసిడ్ ఉండటం అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్స్ తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని యాసిడ్‌తో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే యాసిడ్‌ను తట్టుకొని జీవిస్తుంది. పైగా యాసిడ్ ఉత్పత్తి అధికంగా జరిగేలా దోహదం చేస్తుంది. ఫలితంగా జీర్ణాశయ అల్సర్లు మొదలవుతాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్... ముఖ్యంగా 60 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచ జనాభాలో 35 శాతం నుంచి 40 శాతం గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని ఒక అంచనా. ఇందులో ముఖ్యంగా మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు. గ్యాస్ట్రిక్ అల్సర్స్‌కు కారణాలు: మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం మద్యపానం, పొగతాగడం సమయానికి ఆహారం, నీరు వంటివి తీసుకోకపోవడం కలుషితమైన ఆహారం, నీరు వంటి వాటి ద్వారా మన శరీరంలో క్రిములు చేరి, జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్ధకం తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్తవిరేచనాలు కొంచెం తిన్నా కడుపు నిండినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం నోటిలో ఎక్కువగా నీరు ఊరడం. వ్యాధి నిర్థారణ: ఎక్స్‌రే, ఎండోస్కోపీ, రక్తపరీక్షలు, బయాప్సీ, మలపరీక్ష వంటివి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సినిక్ ఆల్బ్, ఆసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు చక్కగా పనిచేస్తాయి. పల్మొనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గృహిణిని. మేము ఒక పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఇటీవల నాకు తీవ్రంగా దగ్గు, ఆయాసం వస్తోంది. ఊపిరిపీల్చడంలో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాను. ‘ఇది సాధారణ సమస్యే కదా, అదే తగ్గుతుందిలే’ అని అంతగా పట్టించుకోలేదు. ఈ సమస్య తగ్గకపోగా... రోజురోజుకూ తీవ్రమవుతోంది. మా కాలనీలోనే ఒకరికి ఇలాంటి లక్షణాలే ఉంటే హాస్పిటల్లో చూపించుకున్నారు. తనకు ఆస్తమా ఉందని తేలింది. నాకూ అలాంటి సమస్య ఏమైనా ఉందా అని అనుమానంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - సునీత, హైదరాబాద్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. పరిశ్రమల నుంచి వెలువడే పొగలో అనేక రసాయనాలు ఉంటాయి. వాటిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రసాయనాలుతో కూడిన గాలి పీల్చినప్పుడు... కాలుష్యాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అలర్జీ, ఆస్తమా, సీఓపీడీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తాయి. మీకు కొంతకాలంగా దగ్గు, ఆయాసం తగ్గడం లేదని తెలిపారు కాబట్టి మీరు వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ త్వరగా జరిగితే, శ్వాసకోశ సంబంధ వ్యాధులను వాటికి ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందగలగుతారు. మీరు సాధ్యమైనంతవరకు మీ ఇంటి చుట్టూ ఉండే పరిసరాల్లో పచ్చటి చెట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పచ్చదనంతో కాలుష్యప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. దాంతో పాటు మీ ఇంటి పరిసరాల్లో దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎవరికైనా పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేసేలా చూడండి. ఎందుకంటే పొగతాగేవాళ్లతో పాటు ఆ పొగ పీల్చేవారికి కూడా అది ప్రమాదమే. పరిశ్రమలతో పొగతో పాటు, సిగరెట్ కాల్చితే వచ్చే పొగ... ఈ రెండింటి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇక మీరు వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించండి. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు పదేళ్లు. వాడు ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడని స్కూల్లో టీచర్ పిలిపించి చెప్పారు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ అనిపించలేదు. కానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - ధనలక్ష్మి, విజయవాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఉన్న రుగ్మత సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం 47 శాతం మంది స్కూలు పిల్లలు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇది చాలా సాధారణ సమస్య. అయితే పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలా పడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి. అయితే ఇదెంత సాధారణమైన సమస్య అయినప్పటికీ ఇలా పడిపోవడం మాటిమాటికీ కనిపిస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం కూడా ముఖ్యమే. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్ కూడా ఈ రకంగానే కనిపించవచ్చు. సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు తోడ్పడే జాగ్రత్తలు. ఇక మీ బాబు విషయంలో పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అంతా చక్కబడుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరొకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. -
మానవ శరీరంలో బ్యాక్టీరియా వర్తకం
న్యూయార్క్: కొనడం, అమ్మడం, ఇచ్చిపుచ్చుకోవడం లాంటి ఆర్థిక శాస్త్ర భావనలు కేవలం మానవులకే పరిమితం కాదని తేలింది. భూమ్మీద, మానవ శరీరంలో నివాసముండే సూక్ష్మజీవులు కూడా వాణిజ్య సూత్రాలను పాటిస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. సూక్ష్మజీవులు ఒకదానితో ఒకటి క్లిష్టమైన విధానాల ద్వారా ప్రతిస్పందిస్తాయని, ఇది అంత సులభంగా అర్థమయ్యేది కాదని పరిశోధకులు తెలిపారు. పెద్ద సమాజాలుగా ఉండే సూక్ష్మక్రిములు అణువులు, ప్రొటీన్ల పరస్పర మార్పిడి ద్వారా మనుగడ సాగిస్తాయని పేర్కొన్నారు. తమ వృద్ధి కోసం సహచర బ్యాక్టీరియాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరించే సూక్ష్మక్రిములను ఆధునిక సమాజంలోని దేశాలతో సరిపోల్చవచ్చని అన్నారు. క్లారెమంట్ గ్రాడ్యుయేట్, బోస్టన్, కొలంబియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు. ఈ స్థితిని ఆర్థిక శాస్త్రంలోని సాధారణ సమతౌల్య సిద్ధాంతంగా వారు అభివర్ణించారు. -
వణికిస్తున్న మలేరియా
రోజురోజుకు ఉధృతం మంచానపడి వందలాది మంది విలవిల ఐదేళ్ల తర్వాత పరిస్థితి ఆందోళనకరం కొత్తపొలంలో దయనీయం ఏజెన్సీలో కసిగా మలేరియా కోరలు చాస్తోంది. నిరుడీ రోజుల్లో నమోదైన కేసుల సంఖ్యను తలదన్నేలా ఈ రోగం జాడలు కనిపిస్తున్నాయి. వందలాది మంది మంచానపడి లేవలేని స్థితిలో అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు ఇది ఉధృతమవుతోంది. అనంతగిరి, భీమవరం, పినకోట, దారకొండ, గన్నెల, ముంచంగిపుట్టు, రూఢకోట, ఆర్జేపాలెం, గోమంగి పీహెచ్‌సీల పరిధిలో మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 2,10,542 మంది జ్వరపీడితులకు రక్తపరీక్షలు నిర్వహించగా 4,405 మందికి మలేరియా పాజిటివ్‌గా నిర్ధారించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మలేరియా ఉధృతంగా ఉన్నట్టు వెల్లడవుతోంది. మలేరియా కారకమైన దోమల నియంత్రణకు పిచికారీ పనులు చేపట్టినప్పటికీ అది అదుపుకాని పరిస్థితి. ఏజెన్సీలో ఐదేళ్ల కిందట ప్రతి కుటుంబానికి దోమ తెరల పంపిణీ చేశారు. అనంతరం వాటి గురించి మరిచిపోయారు. పీహెచ్‌సీల పరిధిలో సిబ్బంది కొరత కూడా ఉంది. మొత్తంగా మలేరియా నియంత్రణ అదుపుతప్పింది. పాడేరు రూరల్ : మండలంలోని వంట్లమామిడి పంచాయతీ మారుమూల కొత్తపొలం గ్రామంలో ఇంటింటా జ్వరాలు ఉన్నాయి. వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నా తగ్గుముఖం పట్టడం లేదు. గ్రామంలో డుంబేరి బాలన్నకు రక్త పరీక్షలు నిర్వహించగా మలేరియాగా నిర్ధారణ అయింది. వంతాల సత్తిబాబు డయేరియాతో వంతాల రమేష్, కొర్రా అర్సో , వాంతల బంగారమ్మ , కాసులమ్మ , వంతాల స్వాతీ , పంది చిన్నబాయి , ఆర్.చిన్నబ్బాయి, పాంగి బాలన్న , వంతాల గున్న , గెమ్మెలి బాలన్న లు విష జ్వరాలకు గురుయ్యారు. ఆశ కార్యకర్త వద్ద పూర్తి స్థాయిలో మందులు లేవు. కేవలం పారసిట్మాల్, ఐరన్, మెట్రజోల్, క్లోరోక్విన్ మాత్రలే ఉన్నాయి. బిళ్లలేసుకున్నా.. ఫలితం లేదు చింతపల్లి: మండలంలోని బయలుకిం చంగి, చౌటపాడు గ్రామాల్లో మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి బైలు కించంగిలో కాకరి అప్పారావు, కాకరి స్వాతి, కాకరి అరుణ, కాకరి చిట్టిబాబులతోపాటు మరికొంత మంది మంచానపడ్డారు. వీరిలో పలువురికి మలేరియాగా చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రిలో నిర్ధారణ జరిగింది. మలేరియా బాధితులకు గతంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకుంటే నయమయ్యేది. 40 ఏళ్లుగా ఇదే మందును వినియోగిస్తుండటంతో బాధితులలో బాక్టీరియా పూర్తిగా నశించడం లేదని చింతపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌వో కేవీఎస్ శర్మ తెలిపారు. దీంతో ఏసీటీ అనే సరికొత్త మందులను వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఐదేళ్ల తరువాత మళ్లీ.. జీకేవీధి: మండలంలోని నిమ్మపాడులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ గ్రామంలో శుక్రవారం సాక్షి సందర్శించగా ఇంటింటా జ్వరబాధితులు ఉన్నారు. ఈ ఏడాది మొదటి, రెండవ విడత పిచికారీ పనులు చేపట్టకపోవడం, అలాగే దోమ తెరల వాడకం లేకపోవడంతో వ్యాధులు ప్రబలాయి. మండలంలోని జీకేవీధి, ఆర్వీనగర్, జర్రెల, పెదవలస, దారకొండ, సీలేరు, సప్పర్ల పీహెచ్‌సీల్లో ఈ ఏడాది జనవరి 15 నుంచి జూన్ 10 వరకు 685 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదేళ్ళ క్రితం ఇంత ఎక్కువగా వచ్చింది. ఆ తరువాతే ఈ ఏడాదే మలేరియా విజృంభిస్తున్నది. మలేరియాతో మంచాన... జి.మాడుగుల: గెమ్మెలి పీహెచ్సీ పరిధిలో 60 మంది మలేరియాతో బాధపడుతున్నారు. జి.మాడుగుల పీహెచ్సీ పరిధిలో 24 మలేరియా కేసులు నమోదయ్యాయి. మరికొందరిని విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. వై.బి.గొందూరులో తుర్రే కొండలరావు, సుశీల, మత్స్యలింగం రెండు రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నారు. వైద్య సిబ్బంది రక్తపూతలు తీసి సేవలు అందించినా తగ్గలేదని అంటున్నారు. గెమ్మెలి పీహెచ్సీ పరిధిలో పలు గ్రామాల్లో గిరిజనులు జ్వరాలు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. -
కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారూ... కాస్త జాగ్రత్త!
కొత్త పరిశోధన స్వాభావికంగా కంటిలో ఉండే బ్యాక్టీరియాతో పోలిస్తే... కాంటాక్ట్‌లెన్స్‌లు వాడేవారి కళ్లలో ఉండే బ్యాక్టీరియా కాస్త మారిపోయి వేరుగా ఉంటుందట. అందుకే మిగతావారితో పోలిస్తే కాంటాక్ట్‌లెన్స్‌లు వాడేవారిలో కంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ నిర్వహించిన వార్షిక సదస్సులో పరిశోధకులు వెల్లడించారు. వీరు తమ పరిశోధనల్లో కాంటాక్ట్లెన్స్లను ధరించేవారినీ, వాటిని ధరించని వారితో పోల్చిచూస్తూ తమ అధ్యయనాలను కొనసాగించారు. సాధారణంగా కంటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే బ్యాక్టీరియా ఉంటుంది. కానీ కొంతకాలంపాటు కాంటాక్ట్‌లెన్స్‌లు ధరించేవారిలో ఆ బ్యాక్టీరియా మారిపోయి, కనురెప్పల వద్ద ఉండే బ్యాక్టీరియాతో పోలినదానిలా మారుతుందట. కాంటాక్ట్లెన్స్లను ధరించని వారి కంటిలో ఉండే బ్యాక్టీరియాతో పోల్చినప్పుడు అది కాస్త భిన్నంగానూ ఉంటోందట. అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలను పెంచడం మినహా, కళ్లకు జరిగే హాని కాంటాక్ట్‌లెన్స్ వంటి ఫారిన్‌బాడీ వల్ల జరుగుతోందా లేక అది అమర్చుకుంటున్నప్పుడు మన వేళ్ల ఒత్తిడి వల్ల జరుగుతందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదంటున్నారు వారు. అయితే కాంటాక్ట్ లెన్స్‌లు ధరించేవారు తమ చేతులు, కనురెప్పల శుభ్రత విషయంలో మరింత జాగ్రత్త ఉండాలని మాత్రం సూచనలు చేస్తున్నారు ఈ పరిశోధకులు. -
పచ్చిపాలతో ప్రమాదం హెచ్చు
కొత్త పరిశోధన అప్పుడే పితికిన పచ్చిపాలు ఆరోగ్యానికి ప్రశస్తమైనవని చాలామంది నమ్ముతారు. అయితే, తగిన పద్ధతిలో కాచి చల్లార్చకుండా, పచ్చిపాలు తాగితే ప్రమాదమేనని అమెరికన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలలో క్షయ, టైఫాయిడ్ సహా పలు వ్యాధులకు దారితీసే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు జీవించి ఉంటాయని, పాలను మరిగించకుండా వాటిని యథాతథంగా తీసుకుంటే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని అమెరికాలోని వ్యాధి నియంత్రణ కేంద్రం నిపుణులు చెబుతున్నారు. పాలను 72 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కనీసం 15 నిమిషాలు మరిగించినట్లయితే, సురక్షితంగా ఉంటాయని వారు అంటున్నారు. రోగాలపాలు కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పాలను మరిగించాల్సిందేనని సూచిస్తున్నారు. -
నోరు మంచిదైతే... ఊరు మంచిదౌతుంది!
నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్) ఉదయం లేవగానే... మనం మన ఆత్మీయులతో తప్ప మాట్లాడం. ఇతరులతో మాట్లాడాలనుకుంటే తప్పనిసరిగా బ్రష్ చేసుకున్న తర్వాతే మాట్లాడతాం. కారణం... ఉదయం లేచాక మనందరి నోళ్ల నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇది చాలా సహజం. కానీ కొందరిలో మాత్రం బ్రష్ చేసుకున్న తర్వాత కూడా దుర్వాసన వస్తూనే ఉంటుంది. వాళ్లు మన సమీపంలోకి వస్తే మనకు తెలియకుండానే శ్వాస బిగబట్టేసి ముఖం పక్కకు తిప్పుకుంటాం. మీరు దగ్గరికి వచ్చిన ఎవరైనా అలా చేస్తుంటే న్యూనతకు గురికాకండి. మీ నోరు మంచిదిగా చేసుకోండి... అంతే... ఊరంతా మీకు మంచిదవుతుంది. మన నోట్లో, గొంతులో మొదలుకొని, జీర్ణకోశం దారి పొడవునా అనేక బ్యాక్టీరియా నివాసం ఉంటుంటాయి. ఇక మనం ఏదైనా తిన్న తర్వాత పళ్ల మధ్య మిగిలిపోయిన వాటిని మరింత చిన్నముక్కలుగా విడగొట్టి, దానిపై మనుగడ సాగించే బ్యాక్టీరియా నోట్లో, అలాగే గొంతులోనూ ఉంటాయి. రాత్రి మనం నిద్రపోయాక మన నోరు చాలాసేపటివరకు నమలడం, మింగడం లాంటి ఎలాంటి కార్యకలాపాలకూ తావులేకుండా ఉంటుంది. కాబట్టి నోట్లో, గొంతులో ఉన్న ఈ బ్యాక్టీరియా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. నోట్లో ప్లస్ గొంతులో ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియాకు ‘ఓరోఫ్యారింజియల్’ బ్యాక్టీరియా అని పేరు. ఉదయానికల్లా వాటి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ముఖం కడుక్కోడానికి ముందుగా మన నోరు దుర్వాసన వేస్తుంటుంది. బ్రష్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్టీరియా గణనీయంగా తగ్గిపోతుంటుంది కాబట్టి మన నోటి నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. బ్రష్ చేసుకున్న తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే... కొందరిలో బ్రష్ చేసుకున్నా ఫలితం ఉండదు. ఇలాంటి వారిలో బ్రషింగ్ తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే... దానికి కారణాన్ని తెలుసుకుని, అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలి. అప్పుడు దుర్వాసన తగ్గుతుంది. బ్రషింగ్ తర్వాత కూడా నోటి దుర్వాసనకు కారణాలివే... కొన్ని ఆహారాలతో: కొన్ని రకాల ఆహారాలు సహజంగానే దుర్వాసన కలిగించేవిగానూ లేదా పెంచేవిగానూ ఉంటాయి. ఉదాహరణకు ఉల్లి, వెల్లుల్లి, మసాలాల వంటివి తినగానే, నోటినుంచి ఘాటుగా వాసన వస్తుంటుంది. పైగా ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాల్లో సల్ఫర్ పాళ్లు ఎక్కువ. అందుకే వీటిని తినగానే గొంతులో వోలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ (వీఎస్సీ) ఏర్పడతాయి. అంటే వాయు రూపంలో ఉండే గంధకపు ధూమం అన్నమాట. దీనివల్ల విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. పరిష్కారం : పగటి వేళ వీలైనంత వరకు ఉల్లి, వెల్లులి, మసాలాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం మేలు. ఒకవేళ తిన్నా వెంటనే బ్రష్షింగ్ చేసుకోవడం మంచిది. ఇక నాలుకకు మరో చివర తెల్లగా పాచి పేరుకుపోతుంది. అప్పుడు టంగ్క్లీనింగ్తో దుర్వాసన తగ్గుతుంది. పలువరస చక్కగా లేకపోతే... : కొందరిలో పలువరస చక్కగా ఉండదు. పళ్లు గొగ్గిరిగా ఉంటాయి. దాంతో వాళ్లు తిన్న ఆహారం చక్కగా లేనికారణంగా పళ్ల సందులలో చిక్కుకుపోతుంది. ఆహారాన్ని మరింత చిన్నముక్కలు చేసే బ్యాక్టీరియా ఎప్పటిలాగే దానిపై పనిచేస్తుంటుంది. ఈ ప్రక్రియలో శిథిలమయ్యే ఆహారం నుంచి రసాయన వాయువులు వెలువడటం వల్ల నోటి దుర్వాసన వస్తుంటుంది. పరిష్కారం : పలువరస చక్కగా లేని కారణం వల్ల ఆహారం పళ్లమధ్య చిక్కుకుపోయి దుర్వాసన వస్తుంటే... వారు డెంటిస్ట్‌ను కలుసుకుని పళ్లకు మధ్య సందులు లేకుండా చూసుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాలి. పొగతాగడం లేదా పొగాకు నమలడం: పొగతాగే అలవాటు ఉన్నవారిలో పొగాకుకు సంబంధించిన దుర్వాసన భరించలేకుండా ఉంటుంది. అలాగే గుట్కా, ఖైనీ, జర్దా వంటివి తినేవారిలోనూ పక్కవాళ్లు భరించలేనంత దుర్వాసన వస్తుంటుంది. పరిష్కారం : పొగతాగడం, గుట్కా, ఖైనీ, జర్దా... ఇలా ఏ రూపంలో పొగాకును వాడినా అది కేవలం నోటి దుర్వాసన వంటి మామూలు సమస్యకు మాత్రమే పరిమితం కాదు. నోటి క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన, చాలా ఖర్చుతో కూడిన చికిత్సలు చేయించాల్సిన ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. అందుకే ఈ అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానేయాల్సిందే. పైగా పొగతాగే అలవాటు వల్ల ఏర్పడే ప్రమాదం వారికే పరిమితం కాదు. ప్యాసివ్ స్మోకింగ్ (వారు వదిలే పొగను కుటుంబ సభ్యులు, పక్కవారు పీల్చడం) వల్ల వారు ప్రేమించే అతి దగ్గరివారికీ అది ప్రమాదకరం. కాబట్టి ఈ అలవాటును ఎంత త్వరగా వదుల్చుకుంటే అంత మేలు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు / నోట్లో తడి ఆరిపోవడం: మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అంటే మాంసాహారం, పప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని మన నోట్లోని బ్యాక్టీరియా మరింత చిన్న చిన్న అంశాలుగా విడగొడుతుంటాయి. ఉదాహరణకు ప్రోటీన్లను అమైనో ఆసిడ్స్గానూ, ఆ అమైనో ఆసిడ్స్‌ను మరింత చిన్న పదార్థాలుగానూ విడదీస్తాయి. నోట్లో తడి ఆరిపోయి ఉన్నప్పుడు, నోరు చాలాసేపు మూసి ఉన్నప్పుడు ఇలా ఆహారం ఇలా చిన్న అంశాలుగా విడిపోయే ప్రక్రియలో దానిపై జీవించే (థ్రైవింగ్) బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. పరిష్కారం : ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినగానే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే తరచూ మంచినీళ్లు తాగుతూ నోరు తడిగా ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్నప్పుడు : మనం నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నా, ఎప్పటికప్పడు కడుక్కుంటున్నా... అప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుందంటే వాళ్లలో డయాబెటిస్ ఉందేమోనని అనుమానించాలి. డయాబెటిస్ ఉన్నవారిలోనూ తరచూ నోటిలో తడి ఆరిపోతుంటుంది. దాంతోనూ దుర్వాసన రావడం మొదలవుతుంది. పరిష్కారం : మనం నోటి పరిశుభ్రత చర్యలను తీసుకుంటున్నా నోరు దుర్వాసన వస్తుంటే ఒకసారి డెంటిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా మేరకు పరగడుపున చేయించే రక్షపరీక్ష, భోజనం తర్వాత చేయించే రక్తపరీక్షలు చేయించుకొని డయాబెటిస్ బయటపడుతుందేమో చూడాలి. డయాబెటిస్ లేనప్పుడు జీర్ణవ్యవస్థకు సంబంధించిన (గ్యాస్ట్రో ఇంటస్టినల్) వ్యాధుల వల్ల ఇలా జరుగుతుందేమో తెలుసుకొని దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. నోటి దుర్వాసనను తొలగించుకోడానికి కొన్ని మార్గాలు : ప్రతిరోజూ ఉదయం, రాత్రి... రెండుమార్లు పళ్లు తోముకోండి బ్రషింగ్ తర్వాత టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోండి. నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి చిగుళ్లపై పుళ్లు ఉన్నప్పుడు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలిసి పరీక్షలు చేయించుకోండి. కొన్నిసార్లు దంతాల్లో పిప్పిపళ్లు ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేయించుకోవాలి. ఆహారం సరిగా జీర్ణం కాకుండా గ్యాస్ వస్తున్నప్పుడు, సైనస్, టాన్సిల్స్ వంటివి ఉన్నప్పుడు, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ వి. రమణకుమార్, డెంటల్ సర్జన్, ఆర్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, స్మైల్ కేర్ డెంటల్ హాస్పిటల్స్, అమీర్‌పేట, హైదరాబాద్ -
చర్మం... దాని మర్మం!
ట్రివియా {పతి వ్యక్తిలోనూ లోపలి అవయవాలను కప్పి ఉంచే అతి పెద్ద అవయవం చర్మమే. ఒక వ్యక్తి చర్మం సగటు బరువు 4 కిలోలు. అలాగే దాని వైశాల్యం 2 చదరపు మీటర్లు ఒక వ్యక్తి ప్రతి సగటున 28 రోజులకు కొత్త చర్మాన్ని పొందుతుంటాడు. మన గోళ్లపైన ఉండే వెనకభాగం పెరిగి గోరు చివరకు రావడానికి 3 - 6 నెలల వ్యవధి పడుతుంది. ఒక చదరపు అంగుళం వైశాల్యమున్న చర్మంపై కోటీ తొంభైలక్షల చర్మకణాలుంటాయి. ఈ వైశాల్యంలో 60 వెంట్రుకలూ, 90 నూనెగ్రంథులు, 625 చెమట గ్రంథులు, 19,000 స్పర్షజ్ఞానాన్ని కలిగించే సెన్సరీ కణాలుంటాయి. మన చర్మంపై ప్రతి చదరపు సెం.మీ. పై ఉండే బ్యాక్టీరియా సంఖ్య లక్ష. చర్మం నుంచి వచ్చే చెమటకు ఎలాంటి వాసనా ఉండదు. కానీ బ్యాక్టీరియా వల్లనే వాసన వస్తుంది. మానవ చర్మం ప్రతి గంటకూ కనీసం 6 లక్షల కణాలను వదులుకుంటుంది. మనం ముఖం కడుక్కోగానే అది తేటగా శుభ్రంగా కనిపించడానికి కారణం. ముఖంపైన పేరుకున్న మృతకణాలు తొలగిపోయి, ఆ స్థానంలో కొత్త కణాలు రావడమే. మనం కోల్పోయేవీ, కొత్తగా పుట్టే చర్మకణాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక మనిషి జీవితకాలంలో దాదాపు 1000 సార్లు చర్మం మారుతుందని అనుకోవచ్చు. -
డర్మటాలజీ కౌన్సెలింగ్
నాకు ముఖం నిండా విపరీతంగా మొటిమలు వస్తున్నాయి. ఇవి ఇలా ఎందుకు వస్తున్నాయి. దీనికి చికిత్స ఏమిటి? - వైదేహి, ఖమ్మం సాధారణంగా యువతీయువకుల కౌమార దశలో మొటిమలు వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాల లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి. నేను గత కొంతకాలంగా హెల్మెట్ వాడుతున్నాను. ఇటీవలే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. బట్టతల వస్తోంది. ఇలా వెంట్రుకలు రాలడానికి హెల్మెటే కారణమా? నా బట్టతలకు చికిత్స విషయంలో చేయాలో సూచించగలరు. - కిరణ్, కొత్తపేట హెల్మెట్ వాడటానికీ జుట్టు రాలిపోవడానికి ఎలాంటి సంబంధమూ లేదు. పైగా హెల్మెట్ వల్ల తలకు రక్షణ కలుగుతుంది. మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు ఫెనస్టెరైడ్ మినాక్సిడిల్, పీఆర్పీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసి, మీ బట్టతలకు ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీరు మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన డర్మటాలజిస్టును కలవండి. -
నీరు చల్లితే.. బ్యాక్టీరియా ఖతం!
తాజా పండ్లు, కాయగూరలు. కానీ వాటితో పాటు కోట్లకొద్ది బ్యాక్టీరియాలు కూడా ఉచితం! అసలే రసాయనాలు.. ఆపై హానికర సూక్ష్మజీవులు! రైతు పొలం నుంచి మన ఇంటికి చేరేదాకా.. దాదాపు ప్రతిచోటా పండ్లు, కాయగూరలది ఇదే పరిస్థితి. రుద్దిరుద్ది కడిగినా.. ఈ.కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు పోతాయన్న గ్యారంటీ లేదు! అందుకే.. కాయగూరలు, పండ్లపై ఉండే బ్యాక్టీరియాలను హతమార్చే నీటి బిందువులను సృష్టించారు కేంబ్రిడ్జి, మసాచూసెట్స్‌లోని హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. పండ్లపై ఈ నీటి బిందువులను చిలకరిస్తే చాలు.. ఎలాంటి మొండి బ్యాక్టీరియా అయినా హరీమంటుంది. ఈ ‘మంత్రజలం’తో ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు చక్కని పరిష్కారం దొరికినట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. పరీక్షల్లో తేలిందేమిటి? పరీక్షల్లో భాగంగా.. టమాటాలు, స్టీలు పాత్రలపై వీటిని చల్లగా.. ఈ.కోలి, సాల్మొనెల్లా, లైస్టీరియా వంటి బ్యాక్టీరియాలు 30 నిమిషాల్లో 98% వరకూ చనిపోయాయి. ఈ పద్ధతిలో రసాయనాల వినియోగం ఉండదు కాబట్టి.. ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం కాదు. ఆహారం రుచి, రంగు కూడా మారదు. ప్రస్తుతం పలు బ్లీచింగ్ ద్రవాలు, క్లోరిన్ ఉపయోగిస్తూ మాంసం, కాయగూరలు, పండ్ల వంటివాటిని సూక్ష్మజీవరహితం చేస్తున్నారు. విద్యుదావేశ నీటిచుక్కల పద్ధతిని మరింత అభివృద్ధిపర్చి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హార్వార్డ్ పరిశోధకులు వెల్లడించారు. నీటి చుక్కలు ఎలా చంపుతాయి? మామూలు నీటి చుక్కలు అయితే బ్యాక్టీరియాను చంపలేవు. కానీ ఇవి ప్రత్యేకంగా సృష్టించిన విద్యుదావేశ పూరిత నీటి బిందువులు. ‘ఇంజనీర్డ్ వాటర్ నానోస్ట్రక్చర్స్’ అనే ఈ నీటి చుక్కలు జస్ట్ 25 నానోమీటర్ల(ఒక నానోమీటరు అంటే మీటరులో వంద కోట్ల వంతు) పరిమాణంలో మాత్రమే ఉంటాయి. బలమైన విద్యుత్ క్షేత్రం గుండా నీటిని పంపడం వల్ల ఈ నీటి అణువులు స్థిరమైన హైడ్రాక్సిల్, అస్థిరమైన సూపర్‌ఆక్సైడ్ రాడికల్స్ అనే రెండు అణువులుగా విడిపోతాయి. విద్యుదావేశానికి గురికావడం వల్ల స్థిర అణువులు పొరగా ఏర్పడి అస్థిర అణువులను బంధించి ఉంచుతాయి. అందువల్ల ఈ అణువులు గాలిలో కొన్ని గంటల వరకూ ఆవిరి కాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ నీటి బిందువుల ఉపరితలంపై బలమైన ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటుంది. దీనివల్ల ఇవి బ్యాక్టీరియా కణపొరలను ఛిద్రంచేయడంతో అవి చనిపోతాయి. -
అల్సర్స్‌ని అడ్డుకుందాం....
స్టమక్ అల్సర్స్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన కడుపులో ఆమ్లం స్రవిస్తూ ఉంటుంది. అది ఆమ్లం కాబట్టి ఆహారంపై పనిచేయడానికి బదులుగా మన కడుపు కండరాల మీదే పని చేస్తే కడుపులో మంట వస్తుంటుంది. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. యాసిడ్ వల్ల కనిపించే ప్రభావం కాబట్టి దీన్ని వాడుకభాషలో సైతం ‘ఎసిడిటీ’ అంటూ చాలామంది పేర్కొంటుండటం వల్ల ఇది ప్రజల్లో ఎంత ప్రాచుర్యంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అదే యాసిడ్ క్రమక్రమంగా కడుపులోని కండరాలపై పనిచేస్తూ పోతే... జీర్ణవ్యవస్థ పొడవునా చాలా చోట్ల పుండ్లు పడే అవకాశం ఉంది. అయితే ఇలా పుండ్లు పడటంలో వేళ తప్పి తినడం లాంటి వాటి కంటే హెచ్. పైలోరీ అనే బ్యాక్టీరియా, ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పలచబార్చే మందులు, ఐబూప్రొఫిన్ వంటి నొప్పి నివారణ మందులు (ఎన్ఎస్ఏఐడీస్) ఎక్కువగా కారణమవుతాయి. ఈ పుండ్లనే పెప్టిక్ అల్సర్స్ అని వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఈ పెప్టిక్ అల్సర్లు ఎక్కువయ్యాయి. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. అల్సర్లు... రకాలు! జీర్ణవ్యవస్థ పొడవునా యాసిడ్ తన దుష్ర్పభావం చూపి, అక్కడి మెత్తటి కణజాలంపై పనిచేసి, ఆ మృదుకణజాలం ఒరుసుకుపోయేలా చేస్తుంది. ఇలా ఒరుసుకుపోయిన ప్రాంతమే పుండులా మారుతుంది. ఈ ఒరుసుకుపోయిన ప్రాంతం పేరును బట్టి సదరు అల్సర్ పేరును నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఈసోఫేగస్ భాగంలో ఇలా ఒరుసుకుపోతే వాటిని ఈసోఫేజియల్ అల్సర్స్ అంటారు. జీర్ణాశయంలో పుండు పడితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఇక చిన్న పేగులో మూడు భాగాలుంటాయి. చిన్నపేగులోని మొదటిభాగమైన డియోడినమ్ అనేచోట పుండు పడితే దాన్ని డియోడినల్ అల్సర్ అని... ఇలా అది ఏర్పడే ప్రదేశాన్ని బట్టి అల్సర్పేరును నిర్ణయిస్తారన్నమాట. స్థూలంగా చెప్పాలంటే ప్రదేశం వేరైనా అల్సర్లన్నీ ఒకేలాంటి ప్రభావం చూపిస్తాయి. రిఫ్రాక్టరీ అల్సర్స్ ఇవి ప్రత్యేకమైన అల్సర్లు. కొన్నిసార్లు ఎంతగా చికిత్స తీసుకున్నా రోగి తాలూకు వ్యక్తిగత అలవాట్ల కారణంగానో (అంటే పొగాకు వినియోగం, ఆల్కహాల్ తాగడం వంటివి), హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ మందులు పనిచేయకపోవడం వల్లనో (అంటే ఆ బ్యాక్టీరియా సదరు మందులపట్ల నిరోధాన్ని పెంచుకోవడం వల్ల), జోలింగర్-ఎలిసన్ సిండ్రోమ్ వల్లనో... అల్సర్లు ఎప్పటికీ తగ్గవు. పైగా కడుపులోని స్రావాలు మరింతగా పెరుగుతాయి. ఇలాంటి మొండి అల్సర్లను రిఫ్రాక్టివ్ అల్సర్స్ అంటారు. గుర్తుంచుకోండి గతంలో అల్సర్స్‌కు యాంటాసిడ్స్, సైటోప్రొటెక్టివ్ ఏజెంట్స్, హెచ్టూ బ్లాకర్స్ (ట్యాగమెట్, జాంటాక్) వంటి మాత్రలు వాడేవారు. కానీ అవి అల్సర్‌పై పని చేయవని ఆధునిక పరిశోధనల్లో తేలింది. కాబట్టి వాటిని రొటీన్‌గా ప్రిస్క్రయిబ్ చేయడం, వాడటం మంచిది కాదు. లక్షణాలు ►కడుపులో మంటలా అనిపించే నొప్పి. ఒక్కోసారి ఈ మంట గొంతువైపునకు పాకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఛాతీ మీద మంటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ► ఎప్పుడూ ఆకలిగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది. ► ఒక్కోసారి వికారంగా ఉంటుంది. వాంతులు కూడా కావచ్చు. వాంతులు అయినప్పుడు కొన్నిసార్లు రక్తం కూడా పడవచ్చు. ► తిండి సయించకపోవడంతో ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటుంది. ► ఛాతీకి కింద, కడుపునకు పైభాగంలో నొప్పిగా ఉండి, ఆ నొప్పి పెరిగి ఒక్కోసారి రాత్రివేళల్లో నిద్రాభంగం అవుతుంటుంది. ఆ నొప్పి వీపు వైపునకు కూడా పాకినట్లుగా అనిపిస్తుంది. (దీన్నే రిఫర్డ్ పెయిన్ అని అంటారు). ► అల్సర్ల నుంచి రక్తస్రావం జరిగితే... ఆ రక్తం మలంలో కలవడం వల్ల మలం నల్లగా కనిపించే అవకాశాలూ ఉంటాయి. ► బరువు తగ్గడం, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు చాలా సాధారణం. ► అల్సర్ ఉన్నవారిలో భోజనం తిన్న తర్వాత అది ఈసోఫేజియల్ భాగం/ఛాతీ భాగంలో చిక్కుకుపోయినట్లుగా ఉంటుంది. నిర్థారణ ► కడుపులో అల్సర్లు ఉన్న లక్షణాలు కనిపించినప్పుడు రక్తపరీక్షలూ, మల పరీక్షల ద్వారా ముందుగా హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా అనే నిర్ధారణ పరీక్షలు చేయాలి. ► ఎండోస్కోపీ ప్రక్రియతో జీర్ణవ్యవస్థ పైభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ► ఒకవేళ ఎక్కడైనా అల్సర్ కనిపిస్తే... ఆ భాగం నుంచి చిన్న ముక్క సేకరించి, దాన్ని బయాప్సీ పరీక్షకు పంపాలి. ► రోగి చేత బేరియం ద్రవాన్ని తాగించి ఎక్స్-రే తీసి పరీక్ష చేయడం ద్వారా కూడా అల్సర్లను నిర్ధారణ చేయవచ్చు. ► బయాప్సీ చేసినప్పుడు మనం హెచ్. పైలోరీ గురించి నిర్ధారణగా తెలుసుకోవచ్చు. బయాప్సీ ద్వారా అల్సర్‌లో క్యాన్సర్ ఉందా, లేదా తెలుస్తుంది. అందుకే స్టమక్ అల్సర్లన్నింటి విషయంలోనూ బయాప్సీ చేయించాలన్నది అంతర్జాతీయ సిఫార్సు (రికమండేషన్). డాక్టర్‌ను ఎప్పుడు కలవాలంటే... ►మీ కడుపులో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి మొదలై అది కడుపులో శూలంగా గుచ్చుతున్నంత తీవ్రంగా (ప్రికింగ్ పెయిన్) ఆగకుండా నొప్పి వస్తున్నప్పుడు. ► పొట్టను తడిమినప్పుడు మీ చేతికి అది మృదువుగా లేకుండా, చాలా గట్టిగా మారినట్లుగా అనిపిస్తున్నప్పుడు... ► నొప్పితో పాటు వాంతులు కావడం, అందులో రక్తం కనిపించడం వంటివి జరిగినా లేదా మలవిసర్జనకు వెళ్లినప్పుడు మలం నల్లగా కనిపించినప్పుడు... ► స్పృహ తప్పడం, అయోమయంగా మాట్లాడటం, తీవ్రంగా చెమటలు పట్టడం, తల అంతా తేలికైపోయిన భావన కలగడం, నిద్రవస్తున్నట్లుగా మత్తుగా అనిపించడం జరిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చికిత్స ► అల్సర్ ఏ ప్రాంతంలో ఏర్పడింది, అది ఏర్పడటానికి కారణం ఏమిటి అనే అనేక అంశాల మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ హెలికోబ్యాక్టర్ పైలోరీ వల్ల అల్సర్లు ఏర్పడితే దానికి యాంటీబయాటిక్స్‌తో పాటూ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మాత్రలు 10 నుంచి 14 రోజుల పాటు ఇస్తారు. ►హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా లేని అల్సర్స్‌కు కేవలం ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్స్‌ను 4 నుంచి 8 వారాల పాటు ఇస్తూ చికిత్స చేస్తారు. ► కొన్ని సందర్భాల్లో కడుపులో స్రవించే యాసిడ్ పరిమాణం తగ్గేందుకు మందులు ఇస్తూ... దానితో పాటు కడుపులో ఏర్పడ్డ పుండ్లు మానేందుకూ మందులు రాస్తారు. ► చికిత్సలో భాగంగా అల్సర్స్‌ను పుట్టేలా ప్రేరేపించే (అఫెండింగ్ ఏజెంట్స్) పొగతాగడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి. కొన్ని రిఫ్రాక్టరీ అల్సర్స్‌ను శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. ప్రమాదకరంగానూ మారవచ్చు... ఒక్కోసారి జీర్ణాశయంలోగానీ లేదా పేగుల్లో గానీ ఒరుసుకుపోయిన చోటే... మళ్లీ మళ్లీ ఒరుసుకుపోతే అది జీర్ణాశయానికి / పేగుకు రంధ్రంలా పడేందుకు అవకాశం ఉంది. ఇలాంటి కండిషన్‌ను అల్సర్ పెర్ఫొరేషన్ అయి అది పెరిటోనైటిస్ అనే కండిషన్‌కు దారి తీస్తుంది. ఇది ప్రాణాపాయాన్ని కలిగించే స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జీర్ణాశయంలో స్రవించే ద్రవాలు, ఆ మార్గానికే పరిమితం కాకుండా శరీరం (బాడీ-క్యావిటీ)లోని అన్ని భాగాలకూ విస్తరించి శరీరాన్ని విషపూరితం చేసే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన కండిషన్. ఇలాంటప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. నివారణ ► ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోండి. వేళకు భోజనం చేయండి. వేళతప్పి తినకండి. ►సమతులాహారం తీసుకోండి. మీ ఆహారంలో పీచు పదార్థాలు ఉండే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చేసుకోండి. మాంసాహారం తినాల్సి వచ్చినా... దానితో పాటు శాకాహారపు సలాడ్లు అంతే మోతాదులో తీసుకుంటూ ఉండండి. ► బాగా ఉడికిన ఆహారాన్ని కాస్త వేడిగా (మరీ వేడిగా కాదు) ఉన్నప్పుడే తినండి. ఎలాగైనా సద్వినియోగం చేద్దామనే ఉద్దేశంతో చెడిపోయిన ఆహారాన్ని తీసుకోకండి. దానివల్ల జరిగే సద్వినియోగం కంటే మీరు మీ ఆరోగ్యానికి చేసుకునే హానే ఎక్కువ. ► అల్సర్స్ మందులను డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఎందుకంటే ఇందులో ఇచ్చే ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) మందులను భోజనానికి ముందే వాడాల్సి ఉంటుంది. అందుకే అల్సర్ మందుల విషయంలో ఎలాపడితే అలా వాడకుండా డాక్టర్ సూచనలు పాటించడం తప్పనిసరి. ► చిన్న చిన్న నొప్పులకు నొప్పి నివారణ మాత్రలు వాడకండి. వాటితో చాలా అనర్థాలు వస్తాయి. అంతగా నొప్పిని భరించలేకపోతే పారసిటమాల్ వంటి మందులను నొప్పి తగ్గించేందుకు ఒకటి రెండు రోజులు వాడవచ్చు. ఒకవేళ అప్పటికీ నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను కలవడం తప్పనిసరి. ► పొగతాగడం, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి దురలవాట్లను వెంటనే మానేయండి. ఇలాంటి అల్సర్స్ విషయంలో పొగతాగే అలవాటు, ఆల్కహాల్ కంటే మరింత ప్రమాదకారి అని గుర్తించండి. అలాగని ఆల్కహాల్ కూడా మంచిదేమీ కాదు. ► మలబద్దకం లేకుండా చూసుకోవడం మంచిది. ఇందుకోసం పీచు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, ఏ సీజన్లో లభించేవి ఆ సీజన్లో వాడుతూ ఉండండి. ►అలాగే జీర్ణవ్యవస్థలోని కండరాల కదలికలు ఆరోగ్యంగా ఉండటానికి క్రమబద్ధంగా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయండి. చివరగా... పొట్టలో (స్టమక్) అల్సర్స్ ఉన్నవారు చికిత్స తీసుకున్న తర్వాత కూడా అవన్నీ తగ్గాయా లేదా అని మరోసారి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే స్టమక్ అల్సర్స్లో ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఉంటే అలాంటివి చికిత్స తర్వాత కూడా తగ్గవు. కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే వాటిని ఒకసారి బయాప్సీ తీసి పరీక్ష చేయాలి. కానీ డియోడినల్ అల్సర్స్ విషయంలో ఈ జాగ్రత్త అవసరం లేదు. కాబట్టి అల్సర్స్ ఉన్నాయని తేలితే, ఆ అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ గురు ఎన్. రెడ్డి చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రోంటరాలజీ - లివర్ డిసీజెస్, చైర్మన్ - ఎండీ., కాంటినెంటల్ హాస్పిటల్స్, గచ్చీబౌలీ, హైదరాబాద్ -
సూక్ష్మజీవులు.. వ్యాధి కారకాలు
మానవునికి అనేక రకాల సూక్ష్మజీవుల ద్వారా వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు, ప్రోటోజోవా వర్గానికి చెందిన కొన్ని జీవులు. ఇందులో కొన్నిటి ద్వారా స్వల్ప స్థాయిలో ప్రభావం కనిపిస్తే.. మరికొన్ని ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వ్యాధులు అదుపు తప్పి దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. 2009 మార్చిలో మెక్సికోలో మొదలైన స్వైన్‌ఫ్లూ ఇప్పుడు దాదాపు 200 దేశాలకు విస్తరించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. అదేవిధంగా ఎబోలా వంటి వ్యాధులు కూడా ఈ విధంగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంలో వైద్య సంసిద్ధత సరిగా లేకపోతే నష్టం తీవ్రంగా ఉండొచ్చు. సూక్ష్మ జీవులను కేవలం వ్యాధిని కలుగజేసే కారకాలుగా మాత్రమే పరిగణించడం సరికాదు. ఎందుకంటే వీటి వల్ల మానవునికి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్యాక్టీరియా సూక్ష్మజీవుల్లో ముఖ్యమైనవి బ్యాక్టీరియా. ఇవి కేంద్రకపూర్వ జీవులు, ఏకకణ జీవులు. ఒక నిర్దిష్ట కేంద్రకం, ఇతర కణ భాగాలు లేని పూర్వకణాలు.. కేంద్రకపూర్వ కణాలు (్కటౌజ్చుటడౌ్టజీఛి ఛ్ఛిట). వీటిలో జన్యు పదార్థం (డీఎన్ఏ) ఏ ఆచ్ఛాదన లేకుండా కణ ద్రవ్యంలో ఉంటుంది. కేంద్రకపూర్వ కణాలతో ఏర్పడతాయి కాబట్టి వీటిని కేంద్రక పూర్వ జీవులు (Prokaryotes) అంటారు. ఇవి పూర్వపరమైన జీవులు. జీవావిర్భావ ప్రారంభంలో పరిణామం చెందాయి. వీటి నుంచి తర్వాతి కాలంలో నిజ కేంద్రక జీవులు పరిణామం చెందాయి. రాబర్ట విట్టేకర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన జీవుల వర్గీకరణలో కేంద్రకపూర్వ జీవులన్నింటిని మొనీరా (కౌ్ఛట్చ) రాజ్యంలో వర్గీకరించారు. బ్యాక్టీరియా, సయనో బ్యాక్టీరియా అనే రెండు రకాల జీవులను మొనీరా రాజ్యంలో వర్గీకరించారు. సయనో బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియాను పోలిన జీవి. వీటిని అంతకుముందు నీలి-ఆకుపచ్చ శైవలాలు (ఆఠ్ఛ ఎట్ఛ్ఛ అజ్చ్ఛ) గా పిలిచేవారు. ప్రారంభంలో వీటిని శైవలాలుగా భావించడమే దీనికి కారణం. తర్వాతి కాలంలో ఇవి శైవలాలు, నిజకేంద్రక జీవులు కాదని గుర్తించి, బ్యాక్టీరియా ఉన్న మొనీరా రాజ్యంలో చేర్చారు. బ్యాక్టీరియా సాధారణంగా రెండు రకాలు. అవి.. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా. వీటిల్లో ఆర్కీ బ్యాక్టీరియా అతి పురాతనమైంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం బ్యాక్టీరియా తమ మనుగడను సాగించగలదు. 60 నుంచి 800ఛి ఉష్ణోగ్రత వద్ద ఉన్న సల్ఫర్ ఊటలో సైతం ఇవి జీవిస్తాయి. ఉదాహరణ: థర్మోప్లాస్మా, మెథనో బ్యాక్టీరియా. విభిన్న ఆకారాలు: సాధారణంగా బ్యాక్టీరియా అనే పదాన్ని ఉపయోగించినపుడు మనం తెలియకుండానే యూ బ్యాక్టీరియాను సంభోధించినట్టు అవుతుంది. ఇవి విభిన్న ఆకారాల్లో ఉంటాయి. అవి.. దండ ఆకార బ్యాక్టీరియం, బాసిల్లస్, వృత్తాకార బ్యాక్టీరియం, కోకస్, కామా ఆకార బ్యాక్టీరియం, విబ్రియో, సర్పిలాకార బ్యాక్టీరియం, స్పైరిల్లం. సాధారణంగా బ్యాక్టీరి యం నిర్మాణంలో బాహ్యంగా ఒక కణకవచం ఉంటుంది. ఇది పెప్టిడోగ్లైకాన్/మ్యూరీన్/మ్యాకోపెప్ట్మై అనే పదార్థంతో తయారవుతుంది. కొన్ని బ్యాక్టీరియాల్లో కణకవచం మందంగా, మరికొన్నింటిలో పల్చగా ఉంటుంది. ఈ రెండు రకాల బ్యాక్టీరియాను కచ్చితంగా నిర్ధారించే ప్రక్రియ/ పరీక్షను హాన్స క్రిస్టియన్ గ్రామ్ రూపొందించాడు. ఈ పరీక్ష కణకవచం మందంగా ఉంటే పాజిటివ్, పల్చగా ఉంటే నెగిటివ్‌గా స్పందిస్తుంది. కాబట్టి బ్యాక్టీరియాను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.. 1. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉదాహరణ: స్ట్రె ప్టోకోకస్ నియోనియే. 2. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉదాహరణ: విబ్రియో కలరే. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో కణకవచం పల్చగా ఉంటుంది. కాబట్టి వీటిలో కణకవచానికి అదనంగా బాహ్యంగా అవుటర్ మెంబరెన్ (Outer membrane) అనే బాహ్య పొర ఉంటుంది. ఇది కొవ్వు పిండి పదార్థంతో తయారవుతుంది. కాబట్టి దీన్ని ఎల్పీఎస్ (లిపో పాలీ శాఖరైడ్) లేయర్ అంటారు. కణకవచం తర్వాత లోపలి వైపు కణద్రవ్యాన్ని కప్పి ప్లాస్మాత్వచం ఉంటుంది. కణద్రవ్యంలో వృత్తాకార డీఎన్ఏ ప్రధాన జన్యు పదార్థం. నిజకేంద్రక కణాల మాదిరి డీఎన్ఏ కేంద్రకంలో ఉండదు. ఈ రకమైన జన్యు నిర్మాణం, న్యూక్లియామిడ్ లేదా జీనోఫోర్ లేదా బ్యాక్టీరియా క్రోమోజోమ్, రైబో జోమ్‌లు అనే కణ భాగాలు ప్రొటీన్లను నిర్మిస్తాయి. ప్రధాన జన్యు పదార్థానికి అదనంగా కూడా బ్యాక్టీరియా కణద్రవ్యంలో స్వయం ప్రతికృతి చెందే వృత్తాకార డీఎన్ఏ అణువులు ఉంటాయి. వీటిని ప్లాస్మిడ్స అంటారు. వీటి ద్వారా బ్యాక్టీరియాకు అదనపు లక్షణాలు సంభవిస్తాయి. నేడు వివిధ యాంటీబయాటిక్ మందులకు నిరోధకతను అభివృద్ధి చేసుకోవడానికి కారణం ఈ ప్లాస్మిడ్లు. పలు మార్గాల ద్వారా: వివిధ మార్గాల ద్వారా బ్యాక్టీరియాలు వ్యాధులను కలుగజేస్తాయి. అవి.. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: క్షయ, నిమోనియ, డిఫ్తీరియా, కోరింత దగ్గు. కలుషిత ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: కలరా, బొట్యులిజం, షిజెల్లోసిస్, టైఫాయిడ్. దూళి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: టెటానస్ (ధనుర్వాతం), బొట్యులిజం. లైంగికంగా సంక్రమించే వ్యాధులు: సిఫిలిస్, గనేరియా. అధిక శాతం బ్యాక్టీరియాలు మానవునిలోకి ప్రవేశించి విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా తమ ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణ: కలరా బ్యాక్టీరియా చిన్న పేగులో కలరాజెన్ అనే కలరా టాక్సిన్ను విడుదల చేస్తుంది. ఉపయోగాలు: మానవునికి బ్యాక్టీరియా ద్వారా పలు ఉపయోగాలు ఉన్నాయి. ఎశ్చరిషియకొలి అనే బ్యాక్టీరియాను జన్యు పరిశోధనల్లో వినియోగిస్తారు. నీటి కాలుష్యానికి సూచికగా కూడా పని చేస్తుంది. స్ట్రెప్టోమైసిస్ నుంచి అనేక యాంటీబయాటిక్‌లు లభిస్తాయి. కొన్ని బ్యాక్టీరియా మృత్తికలో ఇది స్వేచ్ఛగా ఉంటూ లేదా మొక్కల వేర్లతో సహజీవనం చేస్తూ నేలలో నత్రజని స్థాపనను నిర్వహించి నేలసారాన్ని అభివృద్ధి చేస్తాయి. ఉదాహరణ: లెగ్యూం మొక్కల వేర్లలో రైజోబియం బ్యాక్టీరియాకు చెందిన పలు జాతులు సహజీవనం చేస్తూ వేరు బొడిపెలను ఏర్పర్చి నత్రజని స్థాపనను నిర్వహిస్తుంది. తద్వారా వేర్లకు నత్రజని అందిస్తుంది. ఈ విధంగా నేలలోకి కూడా నత్రజని విడుదలై నేలసారం అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంతోనే లెగ్యూం పంటలను అంతర పంటలుగా, మిశ్రమ పంటలుగా సాగు చేస్తారు. మృతికలో స్వేచ్ఛగా ఉంటూ కూడా కొన్ని బ్యాక్టీరియా నత్రజని స్థాపనను చేపడతాయి. ఉదాహరణ: అజటోబ్యాక్టర్, రోడోస్పైరిల్లం, అజోస్పైరిల్లం. ఇదే విధంగా కొన్ని సయానో బ్యాక్టీరియా కూడా నత్రజని స్థాపనను నిర్వహిస్తూనే మొక్కలకు కావల్సిన పెరుగుదల కారకాలు, విట్జమిన్లు అందిస్తాయి. బాసిల్లస్ తురింజియన్సిస్ (ఆఖీఆ్చఛిజీఠట ్టజిఠటజీజజ్ఛీటజీట) అనే బ్యాక్టీరియంలోని కొన్ని ప్రొటీన్లలో విషగుణాలను గుర్తించి వాటిని, పంట తెగుళ్ల నివారణలో వినియోగిస్తున్నారు. వీటినే బీటీ టాక్సిన్లు అంటారు. జన్యు మార్పిడి టెక్నాలజీ ద్వారా వీటిని అనేక పంటల్లో ప్రవేశపెట్టారు. ఈ విధంగా తెగుళ్ల నియంత్రణలో వాడే బీటీ ట్యాక్సీన్లను జీవక్రిమి సంహారకాలు అంటారు. కొన్ని బ్యాక్టీరియా నుంచి పారిశ్రామికంగా అనేక రసాయనాలను కిణ్వనం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణ: ల్యాక్టోబాసిల్లస్ కిణ్వనం ద్వారా ల్యాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. బ్యాక్టీరియాను కాలుష్య నియంత్రణలో కూడా ఉపయోగిస్తారు. బ్యాక్టీరియం లేదా వాటి మిశ్రమాలను వినియోగించి చేపట్టే జల, భూ కాలుష్య నిర్మూలనను బయో రేడియేషన్ అంటారు. చమురు వ్యర్థాల నిర్మూలనకు ఉపయోగించే ముఖ్యమైన బ్యాక్టీరియం సూడోమొనాస్ పుటిడా. శిలీంధ్రాలు వీటిని సాధారణంగా బూజులు (ఫంగి) అంటారు. నిజ కేంద్రక జీవులు. ఇవి ప్రధానంగా విచ్ఛిన్నకారులు లేదా వినియోగదారులు. మృత జంతు, వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేసి వాటిలోని కర్బన పదార్థాలను అకర్బన ఖనిజాలుగా మార్చి నేల సారాన్ని పెంచుతాయి. భూమిపై దాదాపుగా లక్షకుపైగా శిలీంధ్ర జాతులు ఉన్నాయి. ఇవి ప్రదర్శించే తంతుయుత దేహం మైసీలియం. ఇందులోని శాఖలను హైఫే అంటారు. శిలీంధ్రాలు సిద్ధ బీజాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మానవునికి వీటి ద్వారా సోకే వ్యాధులలో ప్రధానమైనవి.. తామర, కాండిడియాసిస్, మైసిటిస్మస్, సయడ్రా. కొన్ని శిలీంధ్రాలు విడుదల చేసే విష పదార్థాలు ఆహారం ద్వారా మానవునిలోకి చేరి వ్యాధులను కలుగజేస్తాయి. ఉదాహరణ-పప్పు ధాన్యాల్లో పెరిగే ఏస్పర్ జిల్లస్ ఫ్లేవస్ అనే శిలీంధ్రం నుంచి అఫ్లటాక్సిన్స్ అనే విష పదార్థాలు విడుదలవుతాయి. అత్యధిక శిలీంధ్ర వ్యాధి కారకాలు.. అవకాశవాద వ్యాధి కారకాలు. బలహీన అతిథి తారసపడినప్పుడే మాత్రమే వ్యాధి కారకాలుగా వ్యవహరిస్తాయి. ఉపయోగాలు: అనేక శీలింధ్రాలు మానవునికి ఉపయోగపడతాయి. ఈస్టు అనే ఏకకణ శీలింధ్రాన్ని జన్యు పరిశోధనల్లో వినియోగిస్తారు. దీన్ని ద్వారా నిర్వహించే కిణ్వనం ప్రక్రియతో అనేక రకాల మత్తు పానీయాలు..విస్కీ, బ్రాందీ, బీరు, వైన్ వంటి వాటిని తయారు చేస్తారు. కొన్ని శీలింధ్రాలు మొక్కల వేర్లతో సహజీవం చేస్తూ పోషకాలను అందిస్తాయి. ఈ రకమైన సహజీవనాన్ని మైకోరైజా అంటారు. ట్రైకోడెర్మ అనే శీలింధ్రం జీవ క్రిమిసంహారకంగా పని చేస్తుంది. వైరస్లు వైరస్ అనే పదానికి అర్థం విషం. ఇవి కణ వ్యవస్థను ప్రద ర్శించని ప్రత్యేక నిర్మాణాలు. జీవుల శరీరంలో మాత్రమే తమ సంఖ్యను పెంచుకునే జీవ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. జీవి వెలపల ఈ రకమైన లక్షణం లేనివి నిర్జీవులు. వీటి నిర్మాణంలో క్యాప్సిడ్ అనే ప్రోటీన్ తొడుగు.. అందులో జన్యు పదార్థం (డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ) ఉంటుంది. ఇవి దాదాపు అన్ని రకాల జీవులు, మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, శీలింధ్రాలపై దాడి చేస్తాయి. తద్వారా అతిధేయిలోకి ప్రవేశించిన వైరస్ ఒక ప్రత్యేక అతిధేయి కణాన్ని ఎంచుకుని మరీ దాడి చేస్తుంది. ఉదాహరణ- మానవునిలోకి ప్రవేశించిన హెచ్ఐవీ రోగ నిరోధక శక్తిలో కీలకమైన 4 లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలపై దాడి చేసి వాటి సంఖ్యను క్షిణింపచేస్తుంది. బ్యాక్టీరియా మాదిరిగా వైరస్లు కూడా వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తా యి. వైరస్ల మాదిరిగా కణ వ్యవస్థ లేని మరికొన్ని నిర్మాణాలు ప్రకృతిలో ఉన్నాయి. అవి..ప్రయాన్స్, వైరాయిడ్స్. ఇవి పూర్తిగా ప్రోటీన్ నిర్మితాలు. ఇవిక్షీరదాల కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. పశువుల్లో మ్యాడ్‌కౌ, గొర్రెల్లో స్క్రేపీ, పపువన్యూగినియా ప్రాంతంలోని ప్రజలలో కురు అనే వ్యాధులకు కారణమవుతాయి. మొక్కల్లో మాత్రమే వ్యాధులను కలుగజేసే ఆర్ఎన్ఏ నిర్మితాలు వైరాయిడ్లు. బ్యాక్టీరియా- కలుగజేసే వ్యాధులు: కలరా - విబ్రియో కలరే టైఫాయిడ్ - సాల్మోనెల్ల టైఫి బొట్యులిజం - క్లాస్ట్రీడియం బొట్యులినం టెటనస్ (ధనుర్వాతం) - క్లాస్ట్రీడియం టెటనీ షీజెల్లోసిస్ - షీజెల్ల సోని ఆంథ్రాక్స్ - బాసిల్లస్ ఆంథ్రసిస్ నిమోనియ - స్ట్రెప్టోకోకస్ నిమోనియే కుష్టు - మైకోబ్యాక్టీరియం ట్యుబర్కులోసిస్ ప్లేగు - ఎర్సీనియ పెస్టిస్ డిఫ్తీరియా (కంఠసర్పి) - కార్నిబ్యాక్టీరియం డిఫ్తిరియే కోరింత దగ్గు (పర్టుసిస్) - బోర్టెటెల్ల పర్టుసిస్ గనేరియా - నిస్సీరియా గనేరియా ట్రకోమా - క్లామిడియా ట్రకోమ్యాటిస్ సిఫిలిస్ - ట్రెపోనీమా ప్యాలిడం వైరస్ వ్యాధులు ఇన్ఫ్లుయంజా (ఫ్లూ) - ఆర్థోమిక్సో వైరస్ మిజిల్స్ (రుబియోల) - ప్యారామిక్సో వైరస్ పోలియో మైలిటిన్ - పికోర్న వైరస్ జర్మన్ మీజిల్స్ (రూబెల్ల) - టోగా వైరస్ అమ్మ వారు (చికెన్‌పాక్స్) - వారిసెల్ల వైరస్ చికున్ గున్యా - చిక్‌వి (టోగా/ఆల్ఫా) వైరస్ జపనీస్ ఎన్సిఫలైటిస్ - ఫ్లేవీ (ఒఉ) వైరస్ డెంగీ జ్వరం - ఫ్లేవీ వైరస్ హెపటైటిస్ - ఆర్థోహెపడ్నా వైరస్ గవద బిళ్లలు - పారామిక్సో వైరస్ ఎయిడ్స్ - హెచ్ఐవీ జలుబు - రైనో వైరస్ గర్భాశయముఖం క్యాన్సర్ - హ్యూమన్ పాపిల్లోమ క్యాన్సర్ ఎల్లో ఫివర్ - ఆర్బో వైరస్ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ - బున్యా వైరస్ హెర్పస్ సింప్లెక్స్ - హెర్పస్ వైరస్ ఎబోలా-ఫైలో వైరస్ severe acute respiratory syndrome and middle east respiratory syndrome -కరోన వైరస్ శిలీంధ్ర వ్యాధులు కాండిడియాసిస్ - కాండిడ ఆల్చికన్స్ మైసిటిస్మస్ - విష పుట్టగొడుగులు ఫంగల్ మైనింజైటిస్ - క్రిప్టోకోకస్ బ్లాక్ మోల్ట్ - స్టాకిబోట్రిస్ అథ్లెట్స్ఫుట్ - ట్రైకోఫైటాన్ -
విత్తనంలోనే ‘సూక్ష్మ’ రక్షక దళం!
మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులు కొన్నయితే.. హాని చేసేవి మరికొన్ని. మేలు చేసే సూక్ష్మజీవుల (బాక్టీరియా)తో మొక్కలకు ప్రకృతిసిద్ధమైన అనుబంధం ఉంటుంది. మొక్కలు పోషకాలను గ్రహించడంలోనూ, శత్రు పురుగులను అడ్డుకోవడంలోనూ ఈ సూక్ష్మజీవులు సాయపడుతుంటాయి. వ్యాధుల కారణంగా పండ్లు, కూరగాయలు కలుషితం కాకుండా చూడడంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఇంతటి ప్రాణప్రదమైన బ్యాక్టీరియాను మొక్కలు తమ విత్తనాల్లోనే నిక్షిప్తం చేస్తాయని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. మొలకను తొలి దశ నుంచే పరిరక్షించే రక్షణ కవచం విత్తనంలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట! ఈ బాక్టీరియా రక్షణ కల్పించడంతోపాటు నత్రజనిని వాతావరణం నుంచి స్వీకరించి అంకురానికి నేరుగా అందించగలిగినదైఉంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు ఆరా తీశారంటే.. కొన్ని పండ్లు, కూరగాయలను తిన్న జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశస్థులు కొందరికి ఈ-కొలై వ్యాధి సోకిందట. మొక్కలకు హాని కలిగించే వ్యాధికారక బాక్టీరియాతో కలుషితమైనవి తినడం వల్లే ఈ వ్యాధి సోకిందని తేలింది. ఆహారం ఇలా కలుషితం కాకుండా చూడటం ఎలా అని శోధించే క్రమంలో.. విత్తనాల్లో ఉండే మేలు చేసే బాక్టీరియా గురించి ఆరా తీశారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే బాసిల్లస్ పమిలస్ అనే బాక్టీరియాను విత్తనాల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా పండ్లు, కూరగాయల ద్వారా ఈ-కొలై సోకకుండా జాగ్రత్తపడొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ చొప్పించడం సంగతి ఎలా ఉన్నా.. విత్తనాల్లో ప్రకృతిసిద్ధంగా నిక్షిప్తమయ్యే సూక్ష్మజీవులతో కూడిన రక్షణ వ్యవస్థ గురించి మాత్రం స్పష్టమైంది! -
విశ్వకల్యాణ యోగం
సన్నిధి ప్రకృతిపై ఎప్పుడు వికృతి దాడిచే స్తూనే ఉంటుంది (ఉదా- సార్స్, స్తైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఎ బోలా, మ్యాడ్ కౌ ఇత్యాదులు) మానవశరీరంపై ప్రతినిమిషం దాదాపు 50, 000 సూక్ష్మ క్రిములు (బాక్టీరియా) దాడిచేస్తూనే ఉంటాయి. మన రోగనిరోధక శక్తి వాటిని నిరోధిస్తూ ఉంటుంది. ఆ శక్తి మనకు తగ్గినపుడు రోగగ్రస్థులమవుతాం. దేహం - దేశం రెండూ ఒక్కటే. భూమిపై ఏ జీవీ ప్రయత్నించని విధంగా మానవుడు వివిధ ఆయుధాలతో, అణుశక్తి విస్ఫోటనశక్తితో ప్రపంచంలో జీవకణశక్తిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అటువంటి వినాశకారక ఆలోచనలు మార్చుటకు చంద్ర సంబంధమైన సోమలతతో అత్యంత కఠోర నియమావళితో చేయు మా-నవ ప్రయత్నమే సోమయాగం. ఏ యజ్ఞమైనా ప్రకృతిని కాపాడడానికే. శరీరంలో వచ్చే మార్పులను ఎలా తెలుసుకుంటామో దేశకాల గమనంలో మార్పులు, మాయాజాలాన్ని గ్రహించి దేశ రక్షణ చేయడమే యాగం. సోమయాగం అంటే... కలియుగంలో చేయదగిన మహాయాగాలలో అప్తోర్యామం ఏడవది. అగ్నిహోత్రంతో సశాస్త్రీయ సనాతన భారతీయ వేద విజ్ఞాన విధానం ద్వారా ప్రకృతిలో జీవ శక్తిని పెంచేందుకు సోమలత నుండి తీయు సోమరసాన్ని ప్రకృతికి (దేవతలకు) సమర్పించటమే సోమయాగం. సోమ అనగా చంద్రుడు అని, (స+ఉమ) ఈశ్వరుడు అని అర్థం. ఉమ అంటే శక్తి. శివుడు శక్తి సహితుడు. అంటే పదార్ధాన్నీ, శక్తినీ కలిపి సంధాన పరిచే చాంద్రీయశక్తి సోమలత. ఇది ఒక లత (తీగ). భూమండలంపై ప్రతి మొక్క (ఔషధి) చంద్రశక్తి వల్లనే పెరుగుతుంది. చంద్రకళలతో సమానంగా పెరుగుతూ, సమానంగా తరిగే ఏైకక ఓషధీరాజం, అమితంగా చంద్రశక్తిని గ్రహించే ఏకైక లత సోమలత. ఇది హిమాలయాలోనూ, కొంకణ ప్రాంత అరణ్యాలలోనూ లభిస్తుంది. జీవజాలానికి ప్రయోజనం ఏమిటి? జీవజాతి మనుగడకి అవసరమైన స్వచ్ఛమైన నీరు, గాలి, భూమిని శుద్ధిచేయాలంటే పంచభూతాలలో మిగిలిన అగ్ని, ఆకాశం (శూన్యం లేదా శబ్దం)ల ద్వారా మాత్రమే సాధ్యం. ఆజ్యం, ఆవునేయి, సోమరసం, సమిధలు, ఔషధులు... ఇవన్నీ అగ్నిహోత్రంద్వారా, మంత్ర శబ్దాలద్వారా ఆకాశంలోకి ప్రవేశించి విశ్వంలో తగ్గినటువంటి జీవశక్తిని పెంచుతాయి. తద్వారా స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, అన్నీ శుద్ధి అవుతాయి. సోమయాగం నియమాలు సోమయాగాలు 3 రకాలు. ఒకరోజులో పూర్తి అయ్యేది ఏకాహం. పన్నెండు రోజులలో పూర్తి అయ్యేది అహీనం. పన్నెండురోజులకు పైన మరికొన్ని రోజులలో పూర్తి అయ్యేది సత్రం. అప్తోర్యామంలో సత్రం ఒకరోజే కాబట్టి ఏకాహం అనబడుతుంది. మొదటి మూడు రోజులు దీక్షాదినాలు. తరువాతి ఐదు రోజులు రోజుకో వరుస శ్యేనచితిని పేర ్చటం. తొమ్మిదవ రోజు శ్యేనచితిలో అగ్నిని ప్రవేశపెట్టి నిర్విరామంగా శస్త్ర స్తుతులతో సుత్యంలో సోమరసాన్ని సమర్పించి అవభృత స్నానంతో యాగపరిసమాప్తి. ఈ అప్తోర్యామం ఏకాహం. ఫలం ఏమిటి? సోమయాగం ఆచరించటం వల్ల ప్రకృతికి ఏది అవసరమో అవి తప్పనిసరిగా ప్రాప్తిస్తాయి. ఆవునేతితో హోమం చేస్తే ప్రాణ వాయువు పెరుగుతుంది. సోమరసంతో హోమం చేస్తే ప్రకృతిలోని సమస్త మూలకణాలూ శుద్ధిచేయబడి జీవశక్తి పెరుగుతుంది. సోమయాగం జరిగినచోటే గాక హోమధూమం వెళ్ళినచోటల్లా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. భూగర్భజలాలు పైకి అందుతాయి. భూమిలో ఖనిజ శక్తి పెరుగుతుంది. సకాల వర్షాలు పడతాయి. జీవజాతులలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. హానికర సూక్ష్మక్రిములు (బాక్టీరియా) ఉండవు. ఆవులు, గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయి. పాలలో పోషకవిలువలు పెరుగుతాయి. సస్య వృద్ధి (పంటలు) కలుగుతుంది. ఆ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు తగ్గి సహజమైన కాన్పులు కలుగుతాయి. ప్రమాదాలు తగ్గుతాయని శ్రుతి (వేదం) చెప్తున్నది. ఇది శాస్త్రీయ పరిశోధనద్వారా నిరూపితం. సోమయాగ ప్రధాన దేవత ఎవరు? సోమ యాగ ప్రధానదేవత ఇంద్రుడే. ఇంద్రుని అధిపత్యంలో ప్రకృతికి శక్తినిచ్చే పంచభూతాలు, దిక్పాలాకాదులే ప్రధానం. ఇంద్రుడు సర్వదేవతా స్వరూపుడు. కాబట్టి దేవతలలో ప్రథముడైనఇంద్రునికి ప్రీతికరంగా చేయు యాగాలే సోమయాగాలు. విశేషాంశాలు: ఇంద్రుడు దేవతాధిపత్యాన్ని అసురుడైన బలిచక్రవర్తితో కోల్పోతే అవతార స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు స్వయంగా ఉపేంద్రునిగా (వామనుడు) అవతరించి ఇంద్రునికి తిరిగి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. మనం సర్వసామాన్యంగా చేయు చండీ హోమంలో (చండీపాఠంలో) కూడా అమ్మవారు మహిషాసురుడు, చండ, ముండ, శుంభ, నిశుంభాది రాక్షసులను సంహరించింది కేవలం ఇంద్రుని కోసమే. పురాణాదులలో ఎప్పుడు ఇంద్రుడు అసురుల ద్వారా పరాజితుడైనా శ్రీ విఘ్నేశ్వరుడు, సాంబశివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు... ఇలా ప్రతీ దేవతా ఇంద్రాధిపత్యాన్ని నిలుపుటకై అసురులతో యుద్ధం చేశారు. మనం కూడా ప్రకృతమైన ఉగ్రవాదం, అతివాదం, వైపరీత్యాల నుండి రక్షింపబడుటకు ఇంద్ర ప్రీతికరమైన సోమయాగాలు నిర్వహించాలి. సోమయాగాలు 7...అవి 1) అగ్నిష్టోమం 2) అత్యగ్నిష్టోమం 3) ఉక్థ్యం 4) షోడశీ 5) వాజపేయం - 6) అతిరాత్రం 7) అప్తోర్యామం సోమయాగ జంతువులు... సోమ యాగంలో ప్రధాన జంతువులు తెల్ల గుర్రం, నల్లగుర్రం, ఆవు- దూడ, పాలిచ్చు మేక, కొమ్ములు లేని మగ మేక. కప్ప, తాబేలు, సర్పం. మా-నవ అంటే కొత్త జన్మ వద్దు అని అర్థం. మోక్షానికి చేరుకోడానికి వేదాలు చెప్పిన 48 సంస్కారాలలో కనీసం మూడోవంతు అంటే 16 సంస్కారాలనైనా ఆచరించాలి. సంస్కారశుద్ధిని పొందినవాడికే జన్మరాహిత్యం. అందరూ విడిగా చేయలేకపోయినా ఇటువంటి మహాయాగాలలో పాల్గొంటే ఆ ఫలితం అందరికీ లభిస్తుంది. భారతదేశంలో యజ్ఞాలు చేస్తే విశ్వశాంతి ఎలా అవుతుంది? భారత (భరతులు) అంటే యజ్ఞం చేయువారు అని అర్థం. భరత శబ్దం వేదాలలో చెప్పబడింది. మనం నోటితో తిన్న ఆహారం కుక్షిని (కడుపు) చేరి, శరీరంలోని అన్ని అంగాలకు కావలసిన శక్తిని ఎలా ఇస్తుందో సమస్త భూమండలానికి ప్రధాన మధ్యభాగమైన భారతదేశంలో యజ్ఞ, యాగాదులు ఆచరించుటవలన విశ్వమంతటికి ఆ జీవశక్తి చేరుతుంది. గతంలో నిర్వహించిన యాగాల ఫలితాలు ఏమిటి? 2012లో భద్రాచలంలో నిర్వహించిన అతిరాత్రం - మహోత్కృష్ట సోమయాగం సందర్భంగా సమతాలోక్ సేవా సమితి - సేక్రెడ్ సోమ వేదిక్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ పరిశోధనలలో అనేక అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులు, వాతావరణ శాఖ, పోలీసు శాఖ, జలవనరుల శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, ఆచార్య ఎన్.జి.రంగా (ప్రస్తుత ప్రొ.జయశంకర్) అగ్రికల్చరల్ యూనివర్సటీఇత్యాది ప్రభుత్వ శాఖల సమన్వయంతో శాస్త్రీయ పరిశోధనలు చేశారు. నెలరోజుల ముందుగా భద్రాచల పరిసర ప్రాంతాలలో భూసారం, జలం, పశువులు, గాలి, గర్భిణీ స్త్రీలలో సాధారణ కాన్పులు, ప్రమాదాలు, వర్షపాతం... ఇవన్నీ నమోదు చేసి యజ్ఞసమయంలోనూ, యజ్ఞం పూర్తయిన తరువాత దాదాపు సంవత్సరం పాటు పరిశోధన నిర్వహించారు. సోమయాగం వల్ల మానవాళికి ఏ ఋణం తీరుతుంది? మానవునికి ఆజన్మాంతం దేవ, ఋషి, పితృ ఋణములను మూడు ప్రధానమైన ఋణాలు ఉంటాయి. ధర్మాచరణ వల్ల దేవఋణం, అర్థజ్ఞాన సముపార్జన వలన ఋషిఋణం, కామం వలన పితృఋణం తీరతాయి. ప్రస్తుతం అందరూ అర్థ కామాలనే అనుభవిస్తూ ఋషి ఋణ పితృఋణాలు మాత్రం తీర్చుకుంటున్నాం. కానీ దేవఋణం తీరనిదే మోక్షం ప్రాప్తించదు. దేవఋణం తీరాలంటే మనందరమూ యజ్ఞం ఆచరించాలి. సోమయాగంలో భాగమవటం వలన వంశంలో సర్పశాపం, పితృశాపం, దైవ శాపాలు నివారించబడి వంశాభివృద్ధి కలుగుతుంది. అందువల్లే యజ్ఞం ఆచరించటం ఆవశ్యకం. యజ్ఞ ఫలితం అందరికి సమభాగంగా ఎలా వస్తుంది? నేటి కాలమాన పరిస్థితులలో అందరికీ యజ్ఞయాగాలాచరించి దైవఋణం తీర్చుకోవటం అసాధ్యం. అందుకోసమే మనమందరం సామూహికంగా దైవఋణాన్ని తీర్చుకొనటానికి యజ్ఞఫలాన్ని పొందే విధానమే ఈ ఉత్కృష్ట అప్తోర్యామశ్రౌత మహాయాగాలు, మహాసౌర స్మార్త మహాయాగాలు చేయుటకు ప్రజాహిత సేవా సమితి ఈ బృహత్తర కార్యాన్ని సంకల్పించింది.పైన పేర్కొన్న విషయాలన్నీ స్వోదితం కావు. ఎందరో మహానుభావులు యజ్ఞ విజ్ఞానాన్ని శోధించి సాధించిన ఫలిత సారాంశాలు. - కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ కార్య నిర్వాహక సభ్యులు, ప్రజాహిత సేవా సమితి అప్తోర్యామం... ఎప్పుడు..? ఎక్కడ? జనవరి 20, మంగళవారం నుండి ఫిబ్రవరి 1, ఆదివారం వరకు కర్నూలు జిల్లా గార్గేయపురంలోని మయూరి సరోవర్ లే ఔట్, కర్నూలు- నందికొట్కూర్ రోడ్ (10 కి.మీ. దగ్గర) అప్తోర్యామం అని పిలవబడే మహాగ్నిచయన పూర్వక శ్రౌత మహాసోమయాగం, మహాసౌరం అని పిలవబడే మహోత్కృష్ట విశ్వశాంతి మహాయాగాలు జరగనున్నాయి. ఈ యాగాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని, యాగఫలాలు అందుకోవలసిందిగా ప్రజాహిత సేవాసమితి కోరుతోంది. -
అరుణగ్రహంపై మీథేన్, కర్బన అణువులు!
వాషింగ్టన్: భూమిపై 380 కోట్ల ఏళ్ల క్రితం జీవం ఆవిర్భవించిందని భావిస్తున్నట్లే అంగారకుడిపైనా అదే సమయంలో సరస్సులు ఉండేవని, వాటిలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నివసించి ఉండవచ్చని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు తొలిసారిగా కచ్చితమైన ఆధారాలను అంగారకుడిపై ఉన్న క్యూరియాసిటీ రోవర్ గుర్తించిందని వారు వెల్లడించారు. మార్స్‌పై గేల్‌క్రేటర్ ప్రాంతంలో 2012, ఆగస్టులో దిగిన ఈ రోవర్ అక్కడ ఓ మడ్స్టోన్ శిలకు రంధ్రం చేసి దాని పొడిని ‘శాంపిల్ అనలైసిస్ ఎట్ మార్స్’ పరికరంతో పరీక్షించింది. ఆ ఫలితాలను విశ్లేషించగా.. గేల్‌క్రేటర్‌లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సీజన్లతో కూడిన సేంద్రియ అణువులు, క్లోరిన్ అణువులు, క్లోరోబెంజీన్, డైక్లోరోఆల్కేన్ రసాయనాలూ ఉన్నట్లు తేలిందని వారు ప్రకటించారు. మార్స్ వాతావరణంలో మీథేన్ వాయువు ఉనికినీ క్యూరియాసిటీ గుర్తించిందన్నారు. అయితే కర్బన అణువులు, మీథేన్ కొన్ని పరిస్థితుల్లో రసాయనిక చర్యల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున, ఇవి సూక్ష్మజీవుల చర్యల వల్లే ఏర్పడ్డాయనేది చెప్పలేమంటున్నారు. -
కొత్త రోగాల లోకం!
గాంధీ... నిమ్స్... నీలోఫర్... ఉస్మానియా... మహానగరంలోని ప్రధాన ఆస్పత్రులివి. ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన ఈ ఆస్పత్రులు ఇప్పుడు కొత్త రోగాలకు కేంద్రాలుగా అవతరిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో మురికికూపాలుగా మారుతున్నాయి. ఓ వైపు మౌలిక వసతుల కొరతతో ఒక్కో మంచంపై ఇద్దరేసి రోగులు సర్దుకోవాల్సి వస్తోంది. మరోవైపు రోగుల బంధువులూ అక్కడే సేదదీరాల్సి వస్తోంది. వ్యర్థాలు పక్కనే ఉంటాయి. దీంతో వీరంతా రోగాల బారిన పడుతున్నారు. ఎలుకలు... పందికొక్కు లు... నల్లులు... ఈ ఆస్పత్రులకు అదనపు హంగులు. * ఉస్మానియాలో ఎలుకలు, పంది కొక్కులు, దోమలు * నిమ్స్‌లో నల్లులు..ఈగలు... నీలోఫర్‌లో ఇన్ఫెక్షన్ * కంపు కొడుతున్న వార్డులు.. ప్రబలుతున్న వ్యాధులు * ధర్మాస్పత్రుల్లో రోగులకు కొత్త కష్టాలు సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని ప్రభుత్వాస్పత్రులు పారిశుద్ధ్య లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యాధులు నయం కావాలని వెళుతున్న వారికి కొత్త రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. వార్డులు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. సిరంజీలు, ఇతర బయోమెడికల్ వ్యర్థాలు వార్డుల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డంతో దుర్వానస వెదజల్లుతున్నాయి. పారిశుద్ధ్యానికి ప్రభుత్వం వెచ్చిస్తోన్న కోట్లాది రూపాయలు ఆస్పత్రి వ్యర్థాల్లో కలిసి పోతున్నాయి. ఉస్మానియాలో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతుండగా... నిమ్స్‌లో నల్లులు రోగుల రక్తం పీల్చేస్తున్నాయి. నిలోఫర్‌లో ఇన్ఫెక్షన్తో చిన్నారుల ప్రాణాల మీదకు వస్తోంది. గాంధీలో వార్డుల నుంచి వెలువడుతున్న దుర్వాసన భరింపలేనివిధంగా ఉంటోంది. నీలోఫర్‌లో రక్షణ ఏదీ? నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో పారిశుద్ధ్యానికి ప్రభుత్వం నెలకు రూ.5 లక్షలు వెచ్చిస్తోంది. నిబంధనల ప్రకారం నిత్యం రెండు పూటలా ఫినాయిల్‌తో వార్డులను శుభ్రం చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఫినాయిలే వాడటం లేదు. కేవలం తడిగుడ్డతో తుడిచేసి, చేతులు దులుపుకుంటున్నారు. రోగి బంధువులు పడకల చుట్టే కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ల నుంచి వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను వేరు చేయడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బ్యాక్టీరియా, ఇతర వైరస్ పిల్లలకు సులభంగా వ్యాపిస్తోంది. ఆస్పత్రిలో రోజుకు సగటున ఐదు నుంచి పది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రతి పది మంది మృతుల్లో ఒకరు ఇన్ఫెక్షన్ వల్లే చనిపోతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వైద్యులే అంగీకరిస్తున్నారు. హే గాంధీ... గాంధీ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధానికి ప్రభుత్వం నెలకు రూ.23.7 లక్షలు ఖర్చు చేస్తోంది. కానీ రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో వార్డుల్లో పేరుకుపోతోంది. ఆస్పత్రి ఆవరణలోని క్లీనికల్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మూలనపడింది. బ్యాక్టీరియా విస్తరిస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఎలా శుభ్రపరచాలంటే... ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి. అవుట్‌పేషెంట్ విభాగాన్ని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడు సార్లు, ఆపరేషన్ థియేటర్లను ఐదుసార్లు, ఎన్ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడు సార్లు శుభ్రం చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి. నెలకోసారైనా వాటర్ ట్యాంకులను క్లీన్ చే యాల్సి ఉంది. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలనే నిబంధన ఉన్నా శానిటేషన్ ఎజెన్సీలు పట్టించుకోవడం లేదు. వార్డుల్లో డస్ట్బిన్లు కనిపించడం లేదు. ఒప్పంద పత్రంలో రెండు వందల మంది సిబ్బందిని శానిటేషన్ కోసం వినియో గిస్తున్నట్లు చూపుతున్నా.. ఆస్పత్రుల్లో యాభై మందికి మించి కనిపించడం లేదు. ఉస్మానియా వార్డుల్లో దుర్వాసన కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ఉస్మానియా రోగుల పాలిట నరకకూపంగా మారుతోంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కోసం నెలకు రూ.17.8 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. ఓపీతో పాటు ఇన్‌పేషెంట్ వార్డుల్లో చెత్త పేరుకుపోయి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. క్యాజువాలిటీ వెనుక భాగంలోని ఆర్ఎంఓ ఆఫీస్, గుండె, మూత్రపిండాలు, తదితర వార్డుల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. డ్రైనేజ్ లీక్ కావడంతో ఆస్పత్రి చుట్టూ మురుగునీరు ప్రవహిస్తోంది. ఎలుకలు, పందికొక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటర్ ట్యాంక్‌లను రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో వీటిని తాగిన రోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. సిరంజీలు, బ్లేడ్లు వంటి క్లీనిక్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు. నిమ్స్‌లో నల్లుల బెడద నిమ్స్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా రూ.2.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా ప్రయోజనం కానరావడం లేదు. పడకలను రోజుల తరబడి శుభ్రం చేయక పోవడంతో మంచాల్లో నల్లులు తిష్టవేస్తున్నాయి. ఇవి రోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిమ్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్పత్రిని సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని ఇటీవల పీసీబీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి వ్యర్థాలను నేరుగా డ్రైనేజీలోకి వదులుతున్నట్లు తెలిసింది. -
వ్యాధులకు తెర
శీతాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు గొంతు వాపు వ్యాధి ఇది పాశ్యురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా ఒక పశువు నుంచి మరో పశువుకు, నీరు, మేత, శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన పశువులో అధిక జ్వరం, గొంతువాపు, గురక లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన పశువులు 48 గంటల వ్యవధిలో చనిపోతుంటాయి. నివారణకు ఆరు నెలలు పైబడిన పశువులకు ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలి. ఆ తర్వాత ఏటా వ్యాధి నివారణ కోసం టీ కాలు వేయిస్తూ ఉండాలి. జబ్బ వాపు కాస్ట్రీడియం అనే బాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన పశువులో జ్వరం, తుంటి కండరాల్లో నొప్పి, వాపు లక్షణాలు కనిపిస్తాయి. నివారణకు వర్షాకాలం ముందు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పొట్ట జలగ వ్యాధి ఇది వర్షాల వల్ల, ఎక్కువగా నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల, నత్తల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పశువులు నిల్వ ఉన్న నీటిని తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గొర్రెల్లో వచ్చే వ్యాధులు.. నీలి నాలక వ్యాధి : ఇది క్యూలికాయిడిస్ అనే ఇన్సెక్ట్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు ముందస్తు టీకాలు వేయించాలి. ఫుట్రాట్ : ఈ వ్యాధి శీతాకాలంలో గొర్రెలు, మేకల్లో ఎక్కువగా వస్తుంది. దీని వల్ల కాలివేళ్ల మధ్య ఎర్రగా మారడం, వాపు, పగుళ్లు రావడం, కుంటడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణకు కాపర్సల్ఫేట్ లేదా పొటాషియం పర్మాంగనేట్‌తో గొర్రెల పాకలను శుభ్రం చేయాలి. కాళ్లపై గాయాలు, పుండ్లు ఏర్పడితే యాంటీ బయాటిక్స్ వాడాలి. -
ఎబోలాను గుర్తించేందుకు డీఎన్ఏ సెన్సర్!
భారత సంతతి విద్యార్థి బృందం ఆవిష్కరణ మెల్బోర్న్: ఒక చుక్క రక్తాన్ని గాజు స్లైడ్‌పై వేసి ఓ చిన్న పరికరంలో ఉంచితే చాలు.. ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఉనికిని ఇట్టే నిర్ధారించుకోవచ్చు. ఎబోలాతో పాటు ఇంకా అనేక ప్రమాదకర వైరస్లు, బ్యాక్టీరియాలను గుర్తించేందుకూ ఉపయోగపడే అతి చౌకైన డీఎన్ఏ సెన్సర్‌ను ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి విద్యార్థితో కూడిన బృందం ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్ లేదా ఓ చిన్న పరికరంతో ఈ బయో సెన్సర్ పనిచేస్తుంది. అందుకే సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అనిరుధ్ బాలచందర్‌తో పాటు మరో ఐదుగురు విద్యార్థులు రూపొందించిన ఈ బయో సెన్సర్‌కు ‘హార్వార్డ్ బయోమాడ్ కాంపిటీషన్’లో అవార్డు దక్కింది. -
సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు ఎవరు?
కంటికి నేరుగా కనిపించని జీవ జాలాలను సూక్ష్మజీవులు అంటారు. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్ మొదలైనవి సూక్ష్మజీవులకు ఉదాహరణ. వీటిలో వైరస్ తప్ప మిగతా సూక్ష్మజీవులు మానవ సంక్షేమానికి తోడ్పడుతున్నాయి. అదేవిధంగా హాని కలిగించేవి కూడా ఉన్నాయి. వీటి ఉనికికి సంబంధించిన అధ్యయనం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. జెకారియస్ జాన్సన్ 1590లో సూక్ష్మదర్శినిని కనుగొన్నారు. ఆ తర్వాత ఆంటోని వాన్ లీవెన్ హాక్ సంయుక్త సూక్ష్మదర్శినిని కనుగొన్నారు. కొన్ని సూక్ష్మజీవులను అతి శక్తిమంతమైన సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. దీన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అంటారు. దీన్ని నాల్, రస్కా 1932లో కనుగొన్నారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా సూక్ష్మ జీవిని సుమారు లక్ష రెట్లు పెద్దదిగా చేసి చూడొచ్చు. సూక్ష్మజీవులు - బ్యాక్టీరియా బ్యాక్టీరియాను ఆంటోని వాన్ లీవెన్ హాక్ 1676లో కనుగొన్నారు. బ్యాక్టీరియా అని పేరు పెట్టినవారు ఎహెరెన్ బర్గ. బ్యాక్టీరియా విశ్వవ్యాప్తం. దాదాపు అన్ని రకాల ఆవాసాల్లో జీవించగలుగుతుంది. ఆంథ్రాక్స్ను కలగజేసే బ్యాక్టీరియాను కనుగొన్నందుకు రాబర్ట కోచ్‌కు నోబెల్ బహుమతి లభించింది. ఎడ్వర్డ జెన్నర్ (1796) బ్యాక్టీరియా వ్యాధులను - నిర్మూలించే వ్యాక్సినేషన్‌ను కనుగొన్నారు. బెజరింక్ (1888) లెగ్యూమ్ మొక్కల వేరుబుడిపెల్లో రైజోబియం బ్యాక్టీరియాను కనుగొన్నారు. బ్యాక్టీరియాను ‘మిత్రులు, శత్రువులు’, ‘ప్రకృతి పారిశుధ్య కార్మికులు’గా పేర్కొం టారు. బ్యాక్టీరియా కేంద్రక పూర్వజీవకణం. అతిపెద్ద బ్యాక్టీరియా - ఎపులోపిసియం పిసెల్సోని. అతి చిన్న బ్యాక్టీరియా పీపీఎల్ఓ(ప్లూరో న్యుమోనియా లైక్ ఆర్గానిజం). పెద్దపేగులో ఉండే బ్యాక్టీరియా ఎశ్చరీసియా కోలి. గంగా నదిలో ఉండే బ్యాక్టీరియా - డీలో విబ్రియో బ్యాక్టీరియో వోరస్. మట్టిలో ఉండే బ్యాక్టీరియా - క్లాస్ట్రీడియం. బ్యాక్టీరియా కణంలో సుమారు 70% నీరు, 21% ప్రోటీన్స, 4.5% కేంద్రకామ్లాలు, 3% లిపిడ్స, 1.5% పాలీశాఖరైడ్స ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు కశాభాలను కలిగి ఉంటాయి. ఇవి చలనానికి, ఇతర జీవులను అంటుకొని ఉండటానికి తోడ్పడతాయి. బ్యాక్టీరియా వివిధ ఆవాసాల్లో జీవిస్తుంది. ఒక గ్రామ్ మృత్తికలో 106 - 107 బ్యాక్టీరియాలుంటాయి. మంచినీటిలో కంటే మురుగునీటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియాలు పరాన్నజీవులుగా, సహ జీవులుగా, కొన్ని పూతికాహారులుగా జీవిస్తాయి. రైజోబియం, ఇ-కొలీ అనే బ్యాక్టీరియాలు సహజీవనం చేస్తాయి. వ్యాధులను కలిగించేవి పరాన్నజీవ బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియాలు... వేడి బుగ్గల్లో, అతిశీతల ప్రదేశాల్లో, ఆమ్ల (ఎసిడోఫిలిక్), క్షార (ఆల్కలోఫిలిక్), లవణ (హాలోఫిలిక్) స్వభావం ఉండే ప్రదేశాల్లో నివసిస్తాయి. బ్యాక్టీరియా కణ కవచం మ్యూరిన్/మ్యూరామక్ ఆమ్లంతో నిర్మితమై ఉంటుంది. కణ కవచంపై ప్లాజెల్లా (కశాభాలు) ఉంటాయి. కణత్వచం ముడతలను మీసోజోమ్ అంటారు. ఇది శ్వాసక్రియలో తోడ్పడుతుంది. బ్యాక్టీరియాలో కేంద్రకం లోపించి కేవలం డీఎన్ఏ మాత్రమే ఉంటుంది. దీన్ని న్యూక్లియాయిడ్ అంటారు. తక్కువ పరిమాణంలో ఉన్న డీఎన్ఏను ప్లాస్మిడ్ అంటారు. ఇది డీఎన్ఏ టెక్నాలజీ / జెనెటిక్ ఇంజనీరింగ్‌లోనూ తోడ్పడుతుంది. బ్యాక్టీరియాలో నిల్వ ఆహార పదార్థం గ్లైకోజన్. కొన్ని బ్యాక్టీరియాల్లో క్రోమాటోఫోర్ ఉండటం వల్ల అవి పిండి పదార్థాలను తయారు చేసుకోగలుగుతాయి. బ్యాక్టీరియాలో ద్విదావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ప్రతి 18 - 20 నిమిషాలకు ఒకసారి కణాలు ద్విగుణీకరణం చెందుతాయి. బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి విధానాలు 1. జన్యుపరివర్తన: దీన్ని ప్రెడ్గ్రిఫిట్ అనే శాస్త్రజ్ఞుడు ఎలుకల్లో ఉండే స్రెప్టోకోకస్ న్యుమోనియే అనే బ్యాక్టీరియాలో కనుగొన్నాడు. ఒక కణంలోని జన్యు పదార్థం అది పెరిగి యానకం ద్వారా వేరే కణంలోకి బదిలీ అవుతుంది. 2. సంయుగ్మం: ఈ విధానాన్ని లెడెన్బర్గ, టాటం అనే శాస్త్రజ్ఞులు ఇ. కొలి బ్యాక్టీరియాలో కనుగొన్నారు. కణాలు పరస్పరం తాకడం వల్ల జన్యుమార్పిడి జరుగుతుంది. 3. జన్యు వాహనం: దీన్ని లెడెన్బర్గ, జిండర్ అనే శాస్త్రజ్ఞులు సాల్మోనెల్లా టైఫిమ్యారియం అనే బ్యాక్టీరియాలో కనుగొన్నారు. దీంట్లో వైరస్ (బ్యాక్టీరియోఫేజ్) ద్వారా కణంలోకి జన్యు పదార్థం మార్పిడి జరుగుతుంది. అభిరంజన లక్షణాన్ని బట్టి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియాగా గుర్తిస్తారు. దీనిలో క్రిస్టల్ వయోలెట్‌ను ఉపయోగిస్తారు. ఈ అంశాన్ని క్రిస్టియన్ గ్రామ్ కనుగొన్నారు. గ్రామ్ పాజిటివ్సలో ట్రైకోయిక్ ఆమ్లం ఉంటుంది. బ్యాక్టీరియా - ప్రయోజనాలు పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా - లాక్టోబాసిల్లస్ పెద్దపేగులో ఉండి ఆ12 విటమిన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ృ ఇ.కొలీ జెనెటిక్ ఇంజనీరింగ్‌లో ఎక్కువగా తోడ్పడేది ృ ఇ.కొలీ గోబర్‌గ్యాస్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా - మిథనోకోకస్, మిథనో బాసిల్లస్ గంగానదిలో హానికర సూక్ష్మజీవులను నశింపజేసేది - డీలో విబ్రియో బ్యాక్టీరియో వోరస్ వ్యవసాయ రంగంలో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాలు - నైట్రోసో మోవాస్, నైట్రోబాక్టర్, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, క్లాస్ట్రీడియం మొదలైనవి. లెగ్యూమ్ (పప్పుధాన్యాలు) మొక్కల్లో నత్రజని స్థాపన చేసేది - రైజోబియం. రెట్టింగ్ (నార తీయడం), టానింగ్ (తోళ్లను పదును పెట్టడం), పొగాకు క్యూరింగ్, కిణ్వణం మొదలైన ప్రక్రియల్లో ఉపయోగపడేవి... క్లాస్ట్రీడియం బ్యుటలకం, క్లాస్ట్రీడియం ఫెల్సీనియం. వివిధ రకాల యాంటీ బయోటిక్స్ కూడా బ్యాక్టీరియాల నుంచి లభిస్తాయి. {స్టెప్టోమైసిన్ - స్ట్రెప్టోమైసిన్ గ్రిసియస్ (దీన్ని వాక్స్మెన్ కనుగొన్నాడు) టెట్రాసైక్లిన్ (ఆరోమైసిన్) - స్ట్రెప్టోమైసిస్ ఆరోఫేసియస్ ఎరిథ్రోమైసిన్ - స్ట్రెప్టోమైసిన్ ఎరిథ్రియస్ నియోమైసిన్ - స్ట్రెప్టోమైసిన్ ఫ్రాడియే టెర్రామైసిన్ - స్ట్రెప్టోమైసిస్ రియోసస్ కనామైసిన్ - స్ట్రెప్టోమైసిస్ కెనోమైసిటియస్ క్లోరో మైసిటిన్ - స్ట్రెప్టోమైసిన్ వెనిజులె పాలిమిక్సిన్ బి- బాసిల్లస్ పాలిమిక్సా సింథటిక్ రబ్బర్ తయారీలో అసిటో బాక్టర్ను ఉపయోగిస్తారు. జెనెటిక్ ఇంజనీరింగ్‌లో ట్రాన్సజెనిక్ ప్లాంట్స్‌ను తయారు చేసేందుకు బాసిల్లస్ దురెంజియన్సిస్, ఆగ్రో బ్యాక్టీరియం ట్యుమిఫేసియన్స, ఇ-కొలీ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. యురేనియం, కాపర్ గనుల్లోనూ థయోబాసిల్లస్ ఫెరాక్సిడెన్స వంటి బ్యాక్టీరియాను ఉపయోగిస్తున్నారు. జున్ను పరిశ్రమల్లో తయారయ్యే యోగార్టను లాక్టోబాసిల్లస్ సాన్‌ఫ్రాన్సిస్కో నుంచి తీస్తారు. పర్యావరణ పరిరక్షణలో ఎక్రోమోబాక్టర్, అసిటోబాక్టర్, ఫ్లావో బ్యాక్టీరియం వంటివి 2, 4ఈ, ఈఈఖీ వంటి వాటిని నశింపజేస్తాయి. పాలను పెరుగుగా మార్చడానికి ముందు పాలను వేడి చేసి చల్లార్చుతారు. దీన్నే పాశ్చరైజేషన్ అంటారు. పాలను 50 ృ 600ఇ వరకు వేడి చేసి హానికర బ్యాక్టీరియాను నశింప జేస్తారు. ఈ విధానాన్ని లూయిస్ పాశ్చర్ కనుగొన్నారు. ఇతడిని సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. కలరా సంభవించినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. దీన్ని తయారు చేసేందుకు ఒక గ్లాసు నీటిలో 3 చెంచాల చెక్కర, 1 చెంచా ఉప్పును కలపాలి. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతాల నిర్మూలనకు ఈ్కఖీ(ట్రిపుల్ యాంటీజెన్) ఇంజెక్షన్ చేస్తారు. డిప్తీరియా నిర్ధారణకు షేక్ పరీక్ష చేస్తారు. ధనుర్వాతం కండరాలకు సంభవిస్తుంది. టైఫాయిడ్ వ్యాధి పేగు భాగానికి సోకుతుంది. దీని నిర్ధారణకు వైడల్ పరీక్ష చేస్తారు. క్షయ వ్యాధి ఊపిరితిత్తులు, ఎముకలకు సోకుతుంది. దీని నిర్మూలనకు ఆఇఎ టీకా, నివారణకు ఈైఖీ చికిత్స చేస్తారు. గనేరియా, సిఫిలిస్ అనేవి ఖీఈ వ్యాధులు (్ఛ్ఠఠ్చడ ఖీట్చటఝజ్ట్ట్ఛీఛీ ఛీజీట్ఛ్చట్ఛట) గొర్రెల్లో ఆంథ్రాక్స్ వ్యాధి బాసిల్లస్ ఆంథ్రోసిస్ ద్వారా సంభవిస్తుంది. కుక్కలు, పశువుల్లో ట్యుబర్ కులోసిస్ అనేది మెకో బ్యాక్టీరియం ట్యుబర్కులోసిస్ వల్ల సంభవిస్తుంది. పశువుల్లో మైకోబ్యాక్టీరియం బోవిస్ వల్ల ఆక్టినో మైకోసిస్, విబ్రియోటిటస్ వల్ల విబ్రియోసిస్ వ్యాధులు సంభవిస్తాయి. కలుషిత ఆహారాన్ని తిన్నప్పుడు ‘బొటులిజం’ అనే వ్యాధి సంభవిస్తుంది. మొక్కలు - బ్యాక్టీరియా వ్యాధులు వరిబ్లైట్ - జాంథోమోనాస్ ఒరెజై సిట్రస్ కాంకర్ (నిమ్మగజ్జి) - జాంథోమోనాస్ సిట్రె ఆపిల్ బ్లైట్ - ఎర్వీనియా అమైలోవొరా ఆపిల్, పియర్ వ్రణాలు - ఆగ్రో బ్యాక్టిరాయం ట్యుమిఫేసియన్స పత్తి కోణీయ ఆకుమచ్చ తెగులు - జాంథోమోనాస్ మాల్వేసియారం సొలనేసి మొక్కల వడల తెగులు - సూడోమోనాస్ సొలనేసి యారం గతంలో అడిగిన ప్రశ్నలు 1. ట్యుబర్ క్యులోసిస్ వ్యాధి దేని వల్ల వస్తుం ది? (పోలీస్ కానిస్టేబుల్ -2012) 1) వైరస్ 2) ప్రోటోజోవా 3) పోషకాహార లోపం 4) బ్యాక్టీరియా 2. డయేరియాను తగ్గించడానికి వాడే ద్రావ ణం ైఖను విస్తరించండి? (పోలీస్ కానిస్టేబుల్ -2012) 1) Oral Rehydration Solution 2) Oral Recharging Solution 3) Oral Replenishing Solution 4) Oral Reducing Solution 3. కింది వాటిలో దేన్ని నిర్ధారించడం కోసం ‘వైడల్ పరీక్ష’ చేస్తారు? (పోలీస్ కానిస్టేబుల్ -2012) 1) మలేరియా 2) టైఫాయిడ్ 3) ట్యుబర్ క్యులోసిస్ 4) పచ్చజ్వరం 4. తాజా పాలకు కొంచెం ఆమ్లత్వం ఉండటా నికి కారణం? (ఎస్ఐ -2012) 1)ఇౌ2 మాత్రమే 2) ఏ2ఇై3 మాత్రమే 3) లాక్టిక్ బ్యాక్టీరియా మాత్రమే 4) పైవన్నీ 5. ఏ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ప్రత్యక్షంగా సంక్రమించదు? (ఎస్ఐ -2012) 1) తట్టు 2) ధనుర్వాతం 3) కంఠవాతం 4) ఊపిరితిత్తుల క్షయ 6. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లని రుచి రావడానికి కారణం? (ఎస్ఐ -2011) 1) సిట్రిక్ ఆమ్లం 2) ఎసిటిక్ ఆమ్లం 3) లాక్టిక్ ఆమ్లం 4) టార్టారిక్ ఆమ్లం 5) ఆక్సాలిక్ ఆమ్లం మాదిరి ప్రశ్నలు 1. బ్యాక్టీరియా శుద్ధ వర్ధనం చేసిన మొదటి వ్యక్తి? 1) లూయీస్ పాశ్చర్ 2) ఆంటోని వాన్ లీవెన్ హాక్ 3) ఎడ్వర్డ జెన్నర్ 4) రాబర్ట కోచ్ 2. ఒక గ్రాము సారవంతమైన మట్టిలో ఎన్ని బ్యాక్టీరియాలుంటాయి? 1) 100 మిలియన్లు 2) 1 మిలియన్ 3) 500 మిలియన్లు 4) 1 బిలియన్ పైగా 3. ఒక బ్యాక్టీరియా కణం ప్రతి నిమిషానికి ద్విదావిచ్ఛితి చెందుతూ ఒక కప్పును ఒక గంటలో నింపినట్లయితే మొదటి సగం కప్పు నిండటానికి ఎంత సమయం అవసరం? 1) 15 ని. 2) 30 ని. 3) 59 ని. 4) 61 ని. 4. బ్యాక్టీరియో ఫేజెస్ అంటే? 1) బ్యాక్టీరియాలో నివసించే వైరస్ 2) బ్యాక్టీరియాపై దాడిచేసే వైరస్ 3) బ్యాక్టీరియాను నాశనం చేసే వైరస్ 4) వైరస్ పైన దాడిచేసే బ్యాక్టీరియా -
ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి?
వ్యాధులు - కారకాలు: మానవునిలో చాలా రకాలైన వ్యాధులు వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాల వల్ల వస్తాయి. వీటి ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా అంటువ్యాధులు. ప్రత్యక్ష సంబంధం, గాలి, నీరు, లైంగిక సంపర్కం ద్వారా అంటువ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. డీఎస్సీ-2008లో అడిగిన ప్రశ్నలు 1. ఒక పిల్లవాడు జిగట విరేచనాలతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి కారణం? 1) ప్లాస్మోడియం ఫాల్సిఫారం 2) ఉకరేరియా బ్రాన్క్రాఫ్టి 3) ఎంటమీబా హిస్టాలిటికా 4) అమీబా ప్రొటియాస్ 2. ఒక బాలుడు విడువని జ్వరం, పొట్ట భాగంలో నొప్పి, నాలుకపై పూత, తలభారంతో బాధపడుతున్నాడు. ఈ లక్షణాలను బట్టి ఆ వ్యాధి ఏది? 1) మలేరియా 2) కలరా 3) డిఫ్తీరియా 4) టైఫాయిడ్ 3. ఒక పిల్లవాడు రెండు చెవులకు దిగువన దవడ భాగంలో నొప్పి, చెవినొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. ఇది ఏ వ్యాధి? 1) గవదలు 2) ధనుర్వాతం 3) డిఫ్తీరియా 4) మలేరియా 4. పోలియో వ్యాధిలో వైరస్ దేన్ని నాశనం చేస్తుంది? 1) చాలక నాడులు 2) కశేరు నాడులు 3) జ్ఞాన నాడులు 4) కపాల నాడులు సమాధానాలు 1) 3 2) 4 3) 1 4) 1 జీవశాస్త్రం - కంటెంట్ (ఎస్.ఎ.) ఎస్.పి.డి. పుష్పరాజ్ : సబ్జెక్ట్ నిపుణులు, గిద్దలూరు, ప్రకాశం మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో ప్రత్యక్ష సంబంధం వల్ల రాని వ్యాధి? 1) మశూచి 2) జలుబు 3) గవద బిళ్లలు 4) పోలియోైమైలిటిస్ 2. శరీరం బరువు 10 శాతం లేదా అంతకంటే తగ్గడం, మెదడు కంతులు, రక్తనాళాలు చిట్లిపోవడం, విరేచనాలు, లింఫ్ గ్రంథులు వాయడం, కారణం లేకుండా జ్వరం వంటి లక్షణాలు ఏ వ్యాధికి చెందినవి? 1) తట్టు 2) అమ్మవారు 3) ఎయిడ్స 4) డెంగ్యూ 3. టైఫాయిడ్, క్షయ, ప్లేగు వ్యాధుల సంక్ర మణ పద్ధతికి సంబంధించిన సరైన క్రమం? 1) మట్టిలోని బ్యాక్టీరియా- ప్రత్యక్ష సంబంధం- పెంపుడు జంతువుల ద్వారా 2) ఈగలు- ప్రత్యక్ష సంబంధం- దోమల ద్వారా 3) ఈగలు- పత్యక్ష స్పర్శ- ఎలుకల ద్వారా 4) ఎలుకలు- ఈగలు - ప్రత్యక్ష స్పర్శ 4. ఒక వ్యాధిగ్రస్థుడు డాక్టర్ దగ్గరకు వెళ్లి తనకు కండరాలు సంకోచించడం, నరాల తీపులు, గిట్ట కరుచుకోవడం వంటి లక్షణాలున్నాయని తెలిపాడు. డాక్టర్ ఏ వ్యాధి అని నిర్ధారిస్తాడు? 1) క్షయ 2) ధనుర్వాతం 3) న్యుమోనియా 4) డిఫ్తీరియా 5. ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి? 1) కుష్టు 2) కలరా 3) బొటులిజం 4) గనేరియా 6. కిందివాటిలో వైరస్ వల్ల రాని వ్యాధి? 1) జలుబు 2) గవద బిళ్లలు 3) పోలియో 4) క్షయ 7. హెమోఫిల్లస్ పెర్టుసిస్ ఏ వ్యాధిని కలిగిస్తుంది? 1) కోరింత దగ్గు 2) టైఫాయిడ్ 3) డీసెంట్రీ 4) డిఫ్తీరియా 8. కలరా- విబ్రియో కలరా, నిద్రాజాఢ్యం -ట్రిపనో సోమా గాంబియన్స, ఇన్ఫ్లు యెంజా/ఫ్లూ- ఆర్థోమిక్సో కారకాల వల్ల వ్యాధులు కలుగుతాయి. వీటికి సంబంధించి సరైన వరుస క్రమం? 1) కలరా-ప్రోటోజోవా, నిద్రా జాఢ్యం - వైరస్, ఇన్ ఫ్లుయెంజా - బ్యాక్టీరియా 2) కలరా- బ్యాక్టీరియా, నిద్రాజాఢ్యం - ప్రోటోజోవా, ఇన్ఫ్లుయెంజా వైరస్ 3) కలరా-వైరస్, నిద్రాజాఢ్యం- ప్రోటోజోవా, ఇన్ఫ్లుయెంజా - బ్యాక్టీరియా 4) కలరా- బ్యాక్టీరియా, నిద్రాజాఢ్యం- వైరస్, ఇన్ఫ్లుయెంజా- బ్యాక్టీరియా 9. వైరస్ల వల్ల కలిగే వ్యాధికి ఉదాహరణ ఇవ్వాలని ఉపాధ్యాయుడు అడిగిన ప్పుడు, విద్యార్థులు కింది విధంగా వివిధ ఉదాహరణలు ఇచ్చారు. ఏ ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఉదాహరణలు సరికావు? ఎ) మీజిల్స్ బి) టెటానస్ సి) కోరింత దగ్గు డి) మంప్స్ 1) ఎ, బి 2) ఎ, సి 3) బి, డి 4) బి, సి 10. ఊపిరితిత్తులపై ప్రభావం చూపడం ఏ వ్యాధికి సంబంధించింది? 1) సిఫిలిస్ 2) టైఫాయిడ్ 3) ట్యుబర్క్యులోసిస్ 4) డీసెంట్రీ సమాధానాలు 1) 4 2) 3 3) 3 4) 2 5) 3 6) 4 7) 1 8) 2 9) 4 10) 3 బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు వ్యాధిపేరు కారకం సోకే పద్ధతి లక్షణాలు టైఫాయిడ్ సాల్మొనెల్లా టైపి కలుషిత ఆహారం, నీరు, ఈగల ద్వారా. జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు. కోరింత దగ్గు హెమోఫిల్లస్ పెర్టుసిస్ తుమ్ము, దగ్గువల్ల వెలువడే మొదట పొడిదగ్గు, తర్వాత దగ్గు తీవ్రత తుంపర్ల ద్వారా. పెరుగుతుంది. క్షయ (టీబీ) మైకో బ్యాక్టీరియం స్పర్శ, ఆహారం, పాల ద్వారా. జ్వరం, అలసట బరువు తగ్గడం, దగ్గు. ట్యుబర్క్యులోసిస్ గొంతు పుండు స్ట్రిప్టోకోకస్ ముక్కు, నోటి తుంపర్ల ద్వారా. జ్వరం, దగ్గు, గొంతుపుండు పడటం. (సోర్త్రోట్) ధనుర్వాతం క్లాస్ట్రీడియం టెటాని మట్టిలోని బ్యాక్టీరియా, కండరాల సంకోచం, నరాల తీపు. పుండ్ల ద్వారా. డిఫ్తీరియా కార్ని బ్యాక్టీరియా స్పర్శ, శ్వాసనాళాల నుంచి వచ్చే శ్వాసక్రియ కష్టమవడం, గొంతు తుంపర్ల ద్వారా. పుండు పడటం. గొంతులో బూడిద రంగు త్వచం ఏర్పడటం. కలరా విబ్రియో కలరా ఈగలు, ఆహారం, మలం, నీటి ద్వారా. నీళ్ల విరేచనాలు, వాంతులు, కండరాల నొప్పులు, మూత్రం నిలిచిపోవటం న్యుమోనియా డిప్లోకోకస్ బ్యాక్టీరియా శ్వాసనాళం ద్వారా ఛాతిలో నొప్పి, ఎగశ్వాస, పొత్తికడుపులో న్యుమోనియా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. నొప్పి. ప్లేగు షార్ట రాడ్ మెర్సినియా పెస్టిస్ ఎలుకల ద్వారా. జ్వరం, వాంతులు, చర్మం పొడిబారడం, ఉరఃసంధిలోని శోషరసకణుపులు వాయడం. బాసిల్లరి డీసెంట్రీ షిజెల్లా డిసెంట్రియా ఈగలు, ఆహారం, నీటి ద్వారా. వాంతులు విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి మలంలో రక్తం పడటం. గనేరియా నీస్పెరియా గనేరియా లైంగిక సంపర్కం ద్వారా. మూత్రాశయ నాళం వాయడం, ఎరుపెక్కడం, మూత్రాశయ నాళం నుంచి చీము కారడం, మూత్ర విసర్జన సమయం లో మంట. సిఫిలిస్ ట్రిపొనిమాపల్లిడం లైంగిక సంపర్కం ద్వారా. జననావయవాల మీద పుండ్లు, చర్మంపై బొబ్బలు, కణజాలం నశించడం. బొటులిజం క్లాస్ట్రీడియం ఆహారంలో విషం వాంతులు, అతిసారం, అలసట, పక్షవాతం. బొటులిజం ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ద్వారా. కుష్టు (లెప్రసీ) మైకోబ్యాక్టీరియం వ్యాధిగ్రస్థులతో ఎక్కువ కాలం పుండ్లు, వేళ్లు, పాదం వంకరలు, శరీర లెప్రే సన్నిహిత సంబంధం ద్వారా. భాగాలు నశించి పోవడం. ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు వ్యాధిపేరు కారకం సోకే పద్ధతి లక్షణాలు నిద్రాజాఢ్యం ట్రిపనోసోమా సీసీ ఈగ ద్వారా. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, గ్రంథుల వాపు, కీళ్ల గాంబియన్స నొప్పులు, అతినిద్ర, కనురెప్పల వాపు, ఛాతిమీద గుళ్ల్లలు. మలేరియా ప్లాస్మోడియం ఆడ ఎనాఫిలస్ దోమ తలనొప్పి, చలిజ్వరం, వెన్నునొప్పి కాటు ద్వారా. అతిసారం జియర్డియా కలుషిత నీరు, ఆహారం. అధిక కొవ్వు, జిగట మలంతో విరేచనాలు, జ్వరం ఇంటెస్టెనాలిస్ రక్తహీనత, అలర్జీ అమీబియాసిస్ ఎంటమీబా మలంతో కలుషిత రక్తవిరేచనాలు, కడుపునొప్పి, కాలేయ, మెదడు, హిస్టాలిటికా మైన నీరు, ఆహారం ప్లీహంలో పుండ్లు, చర్మం, జననావయవాల్లో పుండ్లు బాయిల్స్ లీష్మానియా అంటువ్యాధి సోకిన ఈగ కాటు వేసిన చోట పుండవడం, కాళ్లు, చేతులు ట్రోఫికా సాండ్ ఈగ కాటు ద్వారా. ముఖంపై పుండ్లు ఏర్పడటం. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ డీఎస్సీ పరీక్షలో బయాలజీ కంటెంట్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను ఎలా అధ్యయనం చేయాలి? ‘వ్యాధులు, కారకాలు’ నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? - కె.గీత, విశాఖపట్నం డీఎస్సీలో జీవశాస్త్రానికి సంబంధించి అధ్యాయాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. మార్కుల పరంగా కంటెంట్‌కు ఎక్కువ వెయిటేజీ ఉంది. కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే 8 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. చదువుతున్నప్పుడే సిలబస్‌లోని అంశాలపై సొంతంగా బిట్స్ రాసుకుంటే బాగా గుర్తుంటుంది. తెలుగు అకాడమీ బిట్స్‌తో కూడిన పుస్తకాలను ప్రత్యేకంగా ప్రచురించింది. ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. ‘వ్యాధులు, కారకాలు’ పాఠ్యాంశం నుంచి ప్రతి డీఎస్సీలో 2 నుంచి 3 ప్రశ్నలు అడుగుతున్నారు. వ్యాధిపేరు, కారకం, వ్యాప్తి చెందే పద్ధతి, వ్యాధి లక్షణాలను పట్టిక రూపంలో పొందు పర్చుకుని అధ్యయనం చేయాలి. అదే విధంగా గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేస్తే ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగాలు విజయా బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్లు బెంగళూరులోని విజయా బ్యాంక్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్యూరిటీ ఆఫీసర్: 15 అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఆర్మీ/ నేవీ/ ఎయిర్ ఫోర్స్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేది: అక్టోబర్ 3 వెబ్సైట్: www.vijayabank.com ఎంఆర్‌పీఎల్ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్/ ఫైనాన్స్) చీఫ్ మేనేజర్ (షిప్పింగ్) సీనియర్ మేనేజర్ (లా) సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్) మేనేజర్ (ఆపరేషన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, లా) అర్హతలు తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20 వెబ్సైట్: http://www.mrpl.co.in -
ఈ వారం వ్యవసాయ సూచనలు
జీవన ఎరువుల వాడకం మేలు! ప్రస్తుత పరిస్థితుల్లో అధిక మోతాదులో రసాయనాలు వాడడం వల్ల సాగు ఖర్చు పెరగడమేకాకుండా వివిధ పర్యావరణ దుష్ఫలితాలు కూడా ఏర్పడుతున్నాయి. రసాయనాల ప్రభావాన్ని కొద్దిగానైనా నియంత్రించాలంటే జీవన ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. * బ్యాక్టీరియాని ఉపయోగించి శిలీంధ్రాలను నాశనం చేయడం ఒక పద్ధతి అయితే.. శిలీంధ్రాలను వాడడం ద్వారా శిలీంధ్రాలను అరికట్టడం ఈ జీవ నియంత్రణలో రెండో పద్ధతి. * సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, బిసిల్లస్ తురంజియన్సిస్ అనే బ్యాక్టీరియా వర్గానికి చెందిన సూక్ష్మజీవులు, ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రంను జీవ నియంత్రణ పద్ధతిలో అధికంగా ఉపయోగిస్తారు. * సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ భూమిలో నివసించే వివిధ పంటల్ని నాశనం చేసే వడలు తెగులు, కాండం కుళ్లు తెగులు, ప్యూజేరియం, మాక్రోఫోమినా, రైజోక్టోనియా, స్క్లీరోషియ, స్క్లీరోషియారంల నుంచి పత్తి, వేరుశనగ, ఆముదం పంటలను, వంకాయ, బెండ, దోస వంటి కూరగాయల పంటలను సమర్థవంతంగా కాపాడుతుంది. * బాసిల్లస్ తురంజియన్సిస్ లేదా బి.టి. మందులు రెక్కల జాతి పురుగులైన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, నామాల పురుగు వంటి పురుగుల లార్వాలను ఆశించి, వాటిని రోగగ్రస్తం చేయటం ద్వారా ఉధృతిని తగ్గిస్తుంది. * కోడెర్మా విరిడి శిలీంధ్రం కంది, పత్తి, వేరుశనగ, శనగ పంటలకు సోకే ఎండుతెగుళ్లకు, పంటలను ఆశించే వేరుకుళ్లు తెగుళ్లకు, కూరగాయ తోటల్లో నారుకుళ్లు తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది. * సూడోమోనాస్ లేదా ట్రైకోడర్మాని విత్తన శుద్ధి కోసం ఒక కిలో విత్తనానికి 10గ్రా. కలిపి విత్తడానికి ముందు 12 గంటలు ఉంచి విత్తుకోవాలి. * 20 కిలోల సూడోమోనాస్ 50 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమంలో మొక్క వేర్లు 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి. * 5 కిలోల సూడోమోనాస్‌ను వర్మీకంపోస్టు/ వేరుశనగ/ వేపపిండితో కలిపి ఒక వారం ఉంచి మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. 5 గ్రా. సూడోమోనాస్‌ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, పరిశోధన, విస్తరణ సంచాలకులు, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సంకరజాతి పశువుల్లో చూడి.. జాగ్రత్తలు! మంచి సంకరజాతి పశువులు ఈనిన 60-90 రోజుల్లో మళ్లీ చూడి కడుతుంది. 300 రోజుల వరకు పాలిస్తుంది. కానీ, ఈనిన 8-9 నెలల్లో క్రమంగా పాలు పితకడం మానేస్తేనే పశువు ఆరోగ్యం, తదుపరి ఈతలో పాలదిగుబడి, దూడ ఆరోగ్యం బాగుంటాయి. ఈనడానికి ముందు 2 నెలల్లో మేపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. తల్లి కడుపులో దూడ ఈ 2 నెలల్లోనే ఎక్కువగా పెరుగుతుంది. తదుపరి ఈతకు కావాల్సిన పోషక నిల్వలను సమకూర్చుకునేదీ ఈ కాలంలోనే. చూడి పశువులకు మేపుదల తగినంత లేకపోతే పశువు నీరసంగా ఉంటే.. ఈనిన తర్వాత పాలదిగుబడి తక్కువగా ఉంటుంది. దూడ నీరసంగా ఉంటుంది. కొన్నిసందర్భాల్లో దూడ చనిపోతుంది. ఈనిన 2-3 నెలల్లోనే మళ్లీ చూడి కట్టించాలి. పాలు ఎండిపోయే వరకు పాలు తీయకూడదు. ఈనిన 8-9 నెలలకల్లా పాలు తీయడం క్రమంగా ఆపేయాలి. తద్వారా తదుపరి ఈతకు అవసరమైన పోషకాల నిల్వలను పశువు సమకూర్చుకోగలుగుతుంది. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా -
బ్యాక్టీరియా ఆదేశిస్తుంది... మనం పాటిస్తాం!
దేవుడు శాసిస్తాడు.. మనం పాటిస్తాం.. చాలామంది విశ్వాసం ఇది. అయితే.. తిండి విషయంలో మాత్రం మన కడుపులో ఉండే బ్యాక్టీరియానే మనకు దేవుడట. అది ఎలా ఆదేశిస్తే మనం అలాంటి ఆహారాన్నే ఎంచుకుంటామట! తమ పెరుగుదలకు ఏ ఆహారం అయితే బాగుంటుందో అలాంటి ఆహారాన్నే మనచేత తినిపించేందుకు పేగుల్లోని బ్యాక్టీరియా ప్రయత్నిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ఫ్రాన్సిస్కో శాస్త్రవేత్త కార్లో మాలే అంటున్నారు మరి. మనిషి పేగుల్లో లక్షలాది బ్యాక్టీరియాలు ఉంటాయని, వాటిలో ఎక్కువమొత్తంలో మేలు చేసేవేనన్న సంగతి తెలిసిందే. అయితే పేగుల్లోని బ్యాక్టీరియా తన ఇష్టాలకు అనుగుణంగా రసాయన అణువులను విడుదలచేస్తుందని, ఆ సంకేతాలు నాడీవ్యవస్థ ద్వారా మెదడుకు చేరి.. మనం ఆ ఆహారాన్నే ఎంచుకునేలా ప్రేరణ పొందుతామని కార్లో వెల్లడించారు. కానీ.. అంతిమంగా మనం తినే ఆహారాన్ని బట్టే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపారు. మంచి బ్యాక్టీరియాను పేగుల్లోకి పంపితే.. స్థూలకాయం, అనారోగ్యపూరిత ఆహారపు అలవాట్లను సైతం అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. అన్నట్టూ.. రేపు మాంసం తినాలనో లేదా ఇంకేదైనా తినాలనో అని అనుకున్నప్పుడు పేగుల్లోని బ్యాక్టీరియా అందుకు ముందుగానే సిద్ధమైపోతుందట కూడా! -
మేనికి వరాల జల్లు...
నిన్న మొన్నటి దాకా ఎండలకు చర్మం కమిలి, దుమ్ము పేరుకుపోయి నల్లబడి ఉంటుంది. చినుకుల వల్ల వాతావరణం చల్లబడటంతో చర్మం పొడిగా మారి పైన తెల్లటి పొలుసులుగా మృతకణాలు కనిపిస్తుంటాయి. జిడ్డుచర్మం అయితే స్వేదగ్రంథులు మూసుకుపోతాయి. దీంతో మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్(చర్మంపై అక్కడక్కడా సన్నని పొక్కులు) వస్తుంటాయి. వేళ్ల మధ్య బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు చోటుచేసుకుంటాయి. ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే... తడిస్తే తప్పనిసరి: వర్షంలో తడవడం ఆరడం ఈ కాలం సాధారణమే! అయితే వర్షంలో తడిసి ఇంటికి చేరుకుంటే మాత్రం స్నానం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు. వర్షపు నీటిలో ఉండే ఆమ్లాలు, మలినాలు ఒంటిని మురికిగా చేస్తాయి. దీని వల్ల చర్మం, శిరోజాలు దెబ్బతింటాయి. అందుకని వానలో తడిస్తే తదుపరి స్నానం తప్పనిసరి. మలినాల తొలగింపు: రోజూ ఉదయం సాయంత్రం యాంటీబ్యాక్టీరియల్ సబ్బు/లోషన్‌ను శరీర శుభ్రతకు ఉపయోగించాలి. వీటి వల్ల చర్మంపై మలినాలు తొలగిపోవడమే గాక ఈ కాలపు బ్యాక్టీరియా దాడిని అడ్డుకోవచ్చు. చర్మంపై పొలుసులుగా కనిపించే మృతకణాల తొలగింపుకు నలుగుపిండి మేలైన ఎంపిక. నిమ్మరసం, పసుపు బ్యాక్టీరియా నాశనకారిగా పనిచేస్తాయి. చర్మంపై మలినాలను తొలగించడానికి ఆల్కహాల్(మద్యం) లేని టోనర్ ఉత్పత్తులను ఉపయోగించాలి. (క్లెన్సింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు ప్రొడక్ట్ వెనక వైపు ఇచ్చే లేబుల్ పరిశీలించాలి) చల్లగా, మబ్బుగా వాతావరణం ఉంటుంది కదా అని వదిలేయకుండా బయటకు వెళ్లడానికి ముందు సన్‌స్క్రీన్ లోషన్/ఎస్.పి.ఎఫ్ 15 నుంచి 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్‌ను సూర్యకాంతి పడే శరీరభాగాలకు కొద్ది మోతాదులో ఉపయోగించాలి. క్రీమ్‌లు కాకుండా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే ఈ కాలం చర్మం డీహైడ్రేట్(నిస్తేజం) కాకుండా, కాంతిమంతంగా కనిపిస్తుంది. ఈ కాలంలో చేయకూడనివి...! పదే పదే ముఖాన్ని శుభ్రపరచకూడదు. దీని వల్ల సహజమైన తేమను కోల్పోయి చర్మం పొడిబారుతుంది. ముఖం తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ని ఉపయోగించినా చర్మానికి హాని కలిగేలా రుద్దకూడదు. అధికంగా చేసే మసాజ్‌ల వల్ల చర్మంపై పొర నిర్జీవంగా తయారవుతుంది. బ్యూటీ బాటలో బామ్మ మాట సెనగపిండి, పాలు, రోజ్‌వాటర్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15-20 నిమిషాలు ఉంచి, ఆరిన తర్వాత శుభ్రపరుచు కోవాలి. ఈ మిశ్రమం మంచి క్లెన్సర్(శుభ్రపరిచే ఉత్పత్తి)లా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక సారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. పండిన బొప్పాయి గుజ్జును మేనుకు పట్టించి, మెల్లగా రుద్దితే, మలినాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది. మృదువైన చర్మానికి సలాడ్స్ శరీర భాగలలో అతి పెద్దది, అత్యంత ప్రాధాన్యం గలది చర్మం. ఇందుకు బయటి వరకే తీసుకునే సంరక్షణ చర్యలు కొంతమేరకే సహాయపడతాయి. చర్మకాంతి మెరుగవ్వాలంటే రోజువారీగా తీసుకునే ఆహారంపై అత్యవసర జాగ్రత్తలు తప్పనిసరి. పూర్తి పచ్చి ఆహారాన్ని కాకుండా ఈ కాలంలో కొద్దిగా ఉడికించిన సలాడ్స్, కూరగాయలు, ఆకుకూరల రసాలు (సూప్స్) తీసుకోవాలి. కాచివడబోసిన నీళ్లు రోజుకు 10-12 గ్లాసులు సేవించాలి. దీని వల్ల చర్మం లోపలి మలినాలు తొలగిపోయి, కాంతిమంతంగా తయారవుతుంది. పాలు, పాల ఉత్పత్తులు, నట్స్, సోయా వంటివి ఆహారంగా తీసుకుంటే చర్మం, శిరోజాల ఆరోగ్యం మెరుగవుతుంది. వేసవిలో తలెత్తిన ట్యాన్ (చర్మం నల్లబడటం) సమస్య తగ్గాలంటే బంగాళదుంప తొక్కతో చర్మంపై నెమ్మదిగా రబ్ చేస్తూ, శుభ్రపరుచుకోవాలి. టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు పొడి, 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టిస్తూ, మెల్లగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది. రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో ముఖమంతా అద్దుతూ, తుడిచేస్తే ఈ కాలంలో తలెత్తే మొటిమల సమస్య తగ్గుతుంది. - డా. షాను చర్మ వైద్య నిపుణురాలు, కాయా స్కిన్‌కేర్ క్లినిక్ -
ముద్దు వద్దు... మోచేతి తాటింపే బెస్టు
చేతులు కలపొద్దు. కావిలించుకోవద్దు. చెంప పై ముద్దు పెట్టవద్దు. పెక్ కూడా వద్దు. అంతగా కావాలంటే పిడికిళ్లు పరస్పరం ఆనించుకొండి. కుదిరితే కేవలం మోచేతులను ఒకరికొకరు తాకించుకొండి అంటున్నారు వైద్యులు. బ్రిటిష్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మిగతా రకాల అభివాదాల వల్ల బ్యాక్టీరియాలు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తాయి. కేవలం మోచేతులు కలుపుకోవడాన్ని ఫిస్ట్ బంప్ అంటారు. షేక్ హ్యాండ్స్ కంటే ఫిస్ట్ బంప్ చేసుకుంటే పది శాతం తక్కువ బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయట. హాయిగా షర్టులు వేసుకుని కేవలం మోచేతులు తాటించుకుంటే మినిమమ్ రిస్క్ అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే స్పృశించుకునే ప్రదేశం తక్కువ. స్పృశించుకునే సమయం మరీ తక్కువ. ఈ అధ్యయనం అబెరిస్ట్విత్ యూనివర్సిటీ చేసింది. ఈ కోలై వంటి బాక్టీరియా వ్యాపిస్తే జీర్ణకోశసంబంధిత ఇన్ ఫెక్షన్ వస్తుందని వారంటున్నారు. వారి అధ్యయనం ప్రకారం మోచేతి తాటింపు బెస్టు. పిడికిలి స్పర్శ పరవాలేదు. హ్యాండ్ షేక్ వద్దు. ఆలింగనం అసలు వద్దు. ముద్దు పెట్టుకుంటే ముప్పు. ఇంత అధ్యయనం చేసిన వారు భారతీయుల నమస్కారాన్ని లెక్కలోకి తీసుకోలేదు. నమస్కారం మరీ మంచిది ఎందుకంటే ఒకరి చేయి మరొకరికి తాకే ప్రసక్తే లేదు మరి. -
అమీబియాసిస్ అంటే...?
హెల్త్ క్విజ్ 1. అమీబియాసిస్ లక్షణాలు ఏమిటి? 2. ఈ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? 3. ఇది ఎలా వ్యాపిస్తుంది? 4. నివారణ ఎలా? 5. వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం ఏమిటి? జవాబులు 1. తీవ్రమైన కడుపునొప్పి, వికారం, వాంతులు, జ్వరం, నీరసం, నీళ్ల విరేచనాలు... ఒక్కోసారి ఇందులో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. లేదా ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. 2. ఎంటమిబా హిస్టోలిటికా అనే ఏకకణ జీవి వల్ల 3. ఎంటమిబా హిస్టోలిటికా జీవి లేదా దాని గుడ్లు ఏదైనా ఆహారపదార్థాల మీద చేరడం లేదా నీళ్లలో కలవడం వల్ల. 4. ఆహారం తీసుకునే ముందు, మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన నీటిని తాగడం. 5. నీటి కాలుష్యం