అమీబియాసిస్ అంటే...?
హెల్త్ క్విజ్
1. అమీబియాసిస్ లక్షణాలు ఏమిటి?
2. ఈ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది?
3. ఇది ఎలా వ్యాపిస్తుంది?
4. నివారణ ఎలా?
5. వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం ఏమిటి?
జవాబులు
1. తీవ్రమైన కడుపునొప్పి, వికారం, వాంతులు, జ్వరం, నీరసం, నీళ్ల విరేచనాలు... ఒక్కోసారి ఇందులో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. లేదా ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు.
2. ఎంటమిబా హిస్టోలిటికా అనే ఏకకణ జీవి వల్ల
3. ఎంటమిబా హిస్టోలిటికా జీవి లేదా దాని గుడ్లు ఏదైనా ఆహారపదార్థాల మీద చేరడం లేదా నీళ్లలో కలవడం వల్ల.
4. ఆహారం తీసుకునే ముందు, మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన నీటిని తాగడం.
5. నీటి కాలుష్యం