
నివేదికల్లో వెల్లడి
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోను, రాష్ట్రంలో ఆహార తనిఖీలలో రోజుకొక ఆహారం బండారం బయటపడుతోంది. ఇప్పటివరకు బొంబై మిఠాయి, టమాటా సాస్, బేకరీలలో కేక్‌లు, పానీ పూరి, గోబీ, ఇడ్లీ, కళింగర పండ్లు తదితరాలలో కల్తీలు, కాలుష్య కారకాలు ఉన్నాయని ఆహార భద్రతా శాఖ ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు పన్నీర్ వంతు వచ్చింది. స్టార్ హోటళ్ల నుంచి తోపుడు బండ్ల వరకు పన్నీర్ వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఆ పన్నీర్ ఎంత శుభ్రమైనది అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. మసాలాలు వేసి వండి వడ్డిస్తే ఆబగా తినేయడం కనిపిస్తుంది.
ఆహారశాఖ అధికారులు బెంగళూరులో పలు చోట్ల పన్నీర్ శాంపిల్స్‌ను సేకరించి నాణ్యత పరీక్షకు పంపించారు. రిపోర్టుల్లో పన్నీర్‌లో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు పేర్కొన్నారు. 231 పన్నీర్ శాంపిల్స్‌లో 17 శాంపిల్స్ రిపోర్టు మాత్రం వచ్చింది. వాటిలో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు, దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. కల్తీ పదార్థాలతో పన్నీర్ తయారీ, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ, దానిని వట్టి చేతులతో తాకడం వల్ల కలుషితం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment