కిరణాలతో క్రిములు ఖతమ్! | Sanitizing Wand with Bacteria | Sakshi

కిరణాలతో క్రిములు ఖతమ్!

May 1 2016 1:01 AM | Updated on Sep 3 2017 11:07 PM

కిరణాలతో క్రిములు ఖతమ్!

కిరణాలతో క్రిములు ఖతమ్!

వంటింట్లో, హాల్లో, బాత్ రూముల్లో ఎక్కడ బ్యాక్టీరియా ఉందో ఎక్కడ క్రిములు దాక్కున్నాయో అన్న టెన్షన్...

వంటింట్లో, హాల్లో, బాత్ రూముల్లో ఎక్కడ బ్యాక్టీ రియా ఉందో ఎక్కడ క్రిములు దాక్కున్నాయో అన్న టెన్షన్... వాటి వల్ల పిల్లలను ఎలాంటి వ్యాధులు చుట్టుముడ తాయోనన్న కంగారు ఇకపై అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లోకి ‘సానిటైజింగ్ వాండ్’ వచ్చింది కాబట్టి. ఇది అల్ట్రా-వయొలెట్ కిరణాల ద్వారా క్రిములను, బ్యాక్టీరియాను క్షణాల్లో చంపేస్తుంది. అంతేకాదు, బ్యాక్టీరియాతో వచ్చే దుర్వాసనను కూడా తొలగిస్తుంది. పిల్లల మంచాలపై, వారు ఆడుకునే ఆట వస్తువులపై, పెంపుడు జంతువుల బెడ్లపై కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే కంప్యూటర్ కీబోర్డుపై, తల దిండుపై చేరే బ్యాక్టీరియాని కూడా క్షణాల్లో ఇది హరించేస్తుంది.

వాడటం చాలా ఈజీ. ఈ వాండ్‌ను ఏదైనా వస్తువుపై పెట్టి, బటన్‌ను నొక్కితే చాలు... అల్ట్రా వయొలెట్ కిరణాలు బయటి వస్తాయి. రీచార్జబుల్ బ్యాటరీలతో పని చేస్తుంది కాబట్టి బ్యాటరీ డౌన్ అవ్వగానే చార్‌‌జ చేసుకుంటే చాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement