Rays
-
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకాయి. దాదాపు 7 నిమిషాల పాటు భానుడి లేలేత కిరణాలు మూలవిరాట్ను స్పృశించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి ఏడాది మార్చి 9,10 అలాగే అక్టోబరు 1,2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ను తాకడం ఆనవాయితీగా వస్తుందని పురోహితులు తెలిపారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు పులకరించిపోయారు. చదవండి: TTD: ఈనెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు -
కిరణ కరుణ లేదు
శ్రీకాకుళం, అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుడిని తొలి సూర్యకిరణాలు తాకే దృశ్యాన్ని చూడాలని ఆశ పడిన భక్తులకు నిరాశ తప్పలేదు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చిన కాలమార్పుల్లో భాగంగా కన్పించే తొలికిరణ అద్భుత దృశ్యం ఆదివారం ఆలయ రాజగోపురం వద్ద మబ్బులు కమ్మిన దృశ్యం కనిపించలేదు. ఏటా మార్చి, అక్టోబర్ నెలల్లో తొలి సూర్యకిరణాలు నేరుగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును స్పృశిస్తుంటాయి. ఆదివారం ఉదయం మబ్బులు కమ్మేయడంతో ఈ దృశ్యం కనిపించలేదు. భక్తుల కోసం ఆలయ ఈఓ శ్యామలాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులకు కిరణ దర్శన ప్రాప్తి కలుగలేదు. నేడు, రేపు కూడా అవకాశం ఏటా మార్చి 8, 9, 10 తేదీలతో పాటు అక్టోబర్ 1,2,3 తేదీల్లో తొలి సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకుతాయి. తూర్పు దిశ నుంచి తొలి కిరణాలు ఆలయ రాజ గోపురం మధ్య నుంచి అనివెట్టి మండపం గుండా ధ్వజ స్తంభాన్ని తాకుతూ నేరుగా గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్ పాదాలపై పడి అలాగే స్వామి వారి ముఖం వరకు కిరణ స్పర్శ కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఆదివారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆకాశం మేఘావృతం కావడంతో తొలిరోజు మబ్బులు సూర్య కిరణాలను తాత్కాలికంగా అడ్డుకున్నాయి. దీంతో సూర్యోదయ సమయంలో సుమారు ఐదారు నిమిషాలు వరకు కనిపించే ఈ దృశ్యం ఈ మారు కన్పించలేదు. సోమ, మంగళవారాల్లో కూడా ఈ దృశ్యం చూసేందుకు అవకాశముందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. -
కిరణాలతో క్రిములు ఖతమ్!
వంటింట్లో, హాల్లో, బాత్ రూముల్లో ఎక్కడ బ్యాక్టీ రియా ఉందో ఎక్కడ క్రిములు దాక్కున్నాయో అన్న టెన్షన్... వాటి వల్ల పిల్లలను ఎలాంటి వ్యాధులు చుట్టుముడ తాయోనన్న కంగారు ఇకపై అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లోకి ‘సానిటైజింగ్ వాండ్’ వచ్చింది కాబట్టి. ఇది అల్ట్రా-వయొలెట్ కిరణాల ద్వారా క్రిములను, బ్యాక్టీరియాను క్షణాల్లో చంపేస్తుంది. అంతేకాదు, బ్యాక్టీరియాతో వచ్చే దుర్వాసనను కూడా తొలగిస్తుంది. పిల్లల మంచాలపై, వారు ఆడుకునే ఆట వస్తువులపై, పెంపుడు జంతువుల బెడ్లపై కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే కంప్యూటర్ కీబోర్డుపై, తల దిండుపై చేరే బ్యాక్టీరియాని కూడా క్షణాల్లో ఇది హరించేస్తుంది. వాడటం చాలా ఈజీ. ఈ వాండ్ను ఏదైనా వస్తువుపై పెట్టి, బటన్ను నొక్కితే చాలు... అల్ట్రా వయొలెట్ కిరణాలు బయటి వస్తాయి. రీచార్జబుల్ బ్యాటరీలతో పని చేస్తుంది కాబట్టి బ్యాటరీ డౌన్ అవ్వగానే చార్జ చేసుకుంటే చాలు!