ప్లాస్టిక్ను తినేసే బాక్టీరియా గుర్తింపు! | Scientists discover bacteria that eats plastic | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ను తినేసే బాక్టీరియా గుర్తింపు!

Published Sat, Mar 12 2016 11:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

ప్లాస్టిక్ను తినేసే బాక్టీరియా గుర్తింపు!

ప్లాస్టిక్ను తినేసే బాక్టీరియా గుర్తింపు!

వాషింగ్టన్: పాస్టిక్ వ్యర్థాలను నిర్వీర్యం చేయడం తలకుమించిన భారంగా పరిణమించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు తీపికబురు అందించారు. జపాన్లోని క్యోటో యూనివర్సిటీ పరిశోధన బృందం ఇడియోనెల్లా సాకైన్సిస్ అనే బాక్టీరియాను కనుగొన్నారు. కేవలం రెండు ఎంజైమ్ల సహాయంతో ఈ బాక్టీరియా పాలీఇథిలిన్ టెరిప్తలేట్(పీఈటీ)ను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుందని వారు గుర్తించారు. పీఈటీని బాటిల్స్, వస్త్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు. ఒక్క 2013లోనే ప్రపంచవ్యాప్తంగా 56 మిలియన్ టన్నుల పీఈటీ ఉత్పత్తి జరిగిందంటే పర్యావరణానికి ఇదెంత హానికారో తెలుస్తుంది.

ఈ బ్యాక్టీరియా గుర్తింపుతో ప్లాస్టిక్ను నిర్వీర్యం చేసే సూక్ష్మ జీవులను గుర్తించడం కోసం ఐదేళ్లుగా చేస్తున్న కృషి విజయవంతమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్లాస్టిక్ను విచ్ఛిన్నం చేసే శిలింద్రాలను గతంలోనే పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ తరహా బాక్టీరియాను గుర్తించడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారని సైన్స్ జర్నల్లో వెల్లడించారు. 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ బాక్టీరియా సమర్థవంతంగా పీఈపీని నిర్వీర్యం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తిచారు. ప్లాస్టిక్ డీకంపోజింగ్ ఎంజైమ్ల తయారీ కోసం ఇడియోనెల్లా సాకైన్సిస్ డీఎన్ఏపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement