plastic
-
టీ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్ పుడ్స్ ప్రిపరేషన్లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్‌లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్‌లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బార్సిలోనా అటానమస్ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్‌లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్‌లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. "మనం ఈ టీ బ్యాగ్‌లతో తయారైన టీని సిప్ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్‌ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు. ముఖ్యంగా పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్‌లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్‌లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్‌లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్‌కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా, సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్‌కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు. (చదవండి: భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..) -
మోడ్రన్ లైఫ్ ఎకో స్టయిల్: వాడి పారేసిన వాటితోనే అద్భుతాలు..!
ఇది ఈశాన్య రాష్ట్రాల మహిళల విజయం. వారు ప్లాస్టిక్, ఇతర ఫైబర్లకు ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగిస్తున్నారు. సంప్రదాయ లాంగ్‌పై పోటరీని క్యాండిల్ తయారీకి మలుచుకున్నారు. పంటను నిల్వచేయడానికి కరెంటుతో పని లేని ప్రత్యామ్నాయాన్ని కనుక్కున్నారు. తమ దగ్గర దొరికే వస్తువులను అది కూడా పర్యావరణహితమైన వస్తువులు, వాడి పారేసిన తర్వాత త్వరగా మట్టిలో కలిసిపోయే వస్తువులతో మోడరన్ లైఫ్‌స్టయిల్‌ని ఎకో ఫ్రెండ్లీగా మారుస్తున్నారు. నాటి కుండల్లో నేటి క్యాండిల్..మణిపూర్ రీజియన్‌లో విస్తరించిన హస్తకళలలో లాంగ్‌పై ఒకటి. నల్లటి మట్టితో కుండల తయారీ అన్నమాట. రిన్ఛోన్ అనే మహిళ లాంగ్‌పై కళను మోడరన్ లైఫ్‌స్టయిల్‌కి అనుగుణంగా మలుచుకుంది. పరిమళాలను వెదజల్లే సోయా వ్యాక్స్ క్యాండిల్ జార్లు తయారు చేసింది. పారాఫిన్ వ్యాక్స్‌కు బదులుగా సోయా వ్యాక్స్‌ను ఉపయోగిస్తోందామె. సువాసన కోసం పర్యావరణానికి ఏ మాత్రం హానికరం కాని వస్తువులనే వాడుతోంది. ఆ ఉత్పత్తులన్నీ పర్యావరణహితమైనవే కావడంతో వీటికి ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. ఇలాంటి ప్రయోగాలను చేస్తోన్న రిన్ఛోన్ వెంచర్ ‘అక్టోబర్ పంప్కిన్’ను రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీ విద్యాసంస్థ ‘ఉమెన్‌ప్రెన్యూర్ ఫర్ భారత్ 2.0 పప్రోగ్రామ్’ కింద 15 లక్షల ప్రోత్సాహకానికి ఎంపిక చేసింది. తాంగ్ఖుల్ ఆదివాసీ తెగకు చెందిన రిన్ఛోన్ తన కుటుంబంలో మాత్రమే కాదు, ఆ తెగలోని తొలితరం ఎంటర్ప్రెన్యూర్.మేఘాలయకు చెందిన వెస్ట్ ఖాసీ హిల్స్‌లో నివసించే బినోలిన్ సైయిమ్లే జీరో ఎనర్జీ స్టోరేజ్ యూనిట్స్ తయారీలో విజయవంతమైంది. కాల్చిన ఇటుకలు, నదిలో దొరికే ఇసుక, వెదురు, సీజీఐ షీట్స్, ఇనుపమేకులు, సిమెంట్, గులకరాళ్లు ఉపయోగించి రైతులకు ఉపయోగపడే స్టోరేజ్ కంటెయినర్స్ తయారు చేసింది. ఇక్కడ రైతుల ప్రధానపంట కూరగాయల సాగు. పంటను కోసి మార్కెట్‌కు తరలించే లోపు పాడయ్యేవి. ఈ స్టోరేజ్ కంటెయినర్ల వల్ల రైతులు పండించిన పంట మార్కెట్‌కు చేరేలోపు పాడయ్యే దుస్థితి దూరమైంది. అర్థవంతమైన వ్యర్థంమరో మహిళ నాగాలాండ్‌కు చెందిన నెంగ్నెథెమ్ హెంగ్నా. ఆమె అరటి నారతో ఇంట్లో ఉపయోగించే వస్తువులను తయారు చేసి పాలిమర్ ఫైబర్‌కు ప్రత్యామ్నాయాన్ని చూపించింది. టేబుల్ మ్యాట్, కోస్టర్, పండ్లు, కూరగాయలు నిల్వ చేసే బుట్టలు, క్యారీ బ్యాగ్‌ల వరకు పదమూడేళ్లుగా ఆమె తయారు చేస్తున్న అరటినార వస్తువులు దేశమంతటా విస్తరించాయి. ఇక అస్సామీయులు పడవ తయారీలో ప్రయోగం చేశారు. నాటుపడవలను చెక్కతో తయారు చేస్తారు. మన్నిక దృష్ట్యా వాటికి ప్రత్యామ్నాయంగా ఫైబర్ గ్లాస్ బోట్స్ వాడుకలోకి వచ్చాయి. వీటికి పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని వెదురుతో కనుక్కున్నారు. ఈ ఇన్నోవేటివ్ బోట్స్ తయారీలో 85 శాతం వెదురు, పది శాతం పాలిమర్, ఐదు శాతం ఫైబర్ గ్లాస్ వాడుతున్నారు. ఈ పడవలు పదిహేనేళ్లపాటు మన్నుతాయి. పాడైన తర్వాత ఈ విడిభాగాలు భూమిలో కలిసిపోతాయి. (చదవండి: కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..) -
ప్లాస్టిక్స్ బరువును పెంచుతాయా..?
ఇంతవరకూ ప్లాస్టిక్ బౌల్స్‌లో తినకూడదు... అందులోని ప్లాస్టిక్ ఒంట్లోకి చేరడంతో ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. కానీ ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నోట్లోకి వెళ్లని వస్తువులతోనూ ఒంటి బరువు పెరుగుతుందనీ, దాంతో పెరిగిన బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనీ, అందుకే ఈ ప్లాస్టిక్‌ను ‘ఒబిసోజెన్స్’ అంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఉదాహరణకు... షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచేస్తుందంటున్నారు నిపుణులు. షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్లాంటి ప్లాస్టిక్ సీసాలూ, తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువును పెంచేస్తుందని నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనంలో 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లోని దాదాపు 55,000 రకాలకు పైగా రసాయనాలను పరీక్షించారు. ప్లాస్టిక్‌లోని దాదాపు పదకొండు రకాల రసాయనాలు బరువు పెంచడానికి కారణమవుతున్నాయంటూ తెలుసుకున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ పేర్కొన్నారు. ఆ ప్లాస్టిక్ సీసాలను వాడినప్పుడు దేహంలోకి ప్రవేశించే పదకొండు రకాల రసాయనాల కారణంగా బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ అని వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో పాల్గొనడంతోపాటు కొవ్వు నిండిపోయేలా ఫ్యాట్ సెల్స్ సంఖ్యను పెంచుతాయని తేలింది. దాంతో దేహం బరువు అమాంతం పెరుగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నరాల సంబంధిత వ్యాధులూ, వ్యాధినిరోధకతను తగ్గించే సమస్యలూ, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగవచ్చని తేలింది. ఇప్పుడు అవే ప్లాస్టిక్ ఉపకరణాలూ, పరికరాలు... బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తాజా పరిశోధనల్లో విస్పష్టంగా తేలింది. ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. (చదవండి: నెత్తురు చిందించకుండానే చక్కెర పరీక్ష..! ) -
ప్లాస్టిక్‌కు చెక్.. వచ్చేసింది గ్రీన్‌వర్క్స్ బయో పాలిమర్
హబ్సిగూడ(హైదరాబాద్)లోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో.. 'గ్రీన్‌వర్క్స్ బయో', సీఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్-ఐఐసీటీ) సహకారంతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులైన.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లకు (SUP) ప్రత్యామ్నాయాలను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మొదలైనవారు పాల్గొన్నారు.ప్లాస్టిక్ కాలుష్యాన్ని స్థిరమైన పరిష్కారాలతో ఎదుర్కోవడమే లక్ష్యంగా గ్రీన్‌వర్క్స్ బయో పాలిమర్లను ప్రవేశపెట్టింది. ఇవి కంపోస్టబుల్, బయోడిగ్రేడబుల్. కాబట్టి భూమిలో తొందరగా కలిసిపోతాయి. సీఎస్ఐఆర్-ఐఐసీటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ ఉత్పత్తులు స్టార్చ్.. వ్యవసాయ వ్యర్థాల వంటి పునరుత్పాదక వనరుల నుంచి తయారు చేశారు. ఇవి నేషనల్ కంపోజిబిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.ఈ కార్యక్రమంలో మంత్రి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ.. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో వినూత్నమైన సైన్స్ ఆధారిత పరిష్కారాల ప్రాముఖ్యతను వెల్లడించారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీతో గ్రీన్‌వర్క్స్ బయో సహకారం సాంకేతికతతో స్థిరమైన అభివృద్ధిని ఎలా నడిపించగలదో చూపిస్తుంది. సాంప్రదాయ ప్లాస్టిక్‌లకు వినూత్నమైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను పరిచయం చేయడమే కాకుండా.. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నామని అన్నారు.ముఖ్య అతిథి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హరిత ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో రాష్ట్ర నిబద్ధతను ఎత్తిచూపారు. తెలంగాణ స్వచ్ఛమైన.. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడే కార్యక్రమాలను నిర్వహించడం, దానికి మేము మద్దతు ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని అన్నారు. -
Fire Accident : జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
-
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఇంకా అదుపులోకి రాని మంటలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు. అంతకంతకూ మంటలు పెరుగుతున్నాయి. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ మంటలు వ్యాపించాయి. చుట్టూ పక్కల పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 0ట్యాంకర్లతో నీటి సరఫరా చేశారు. నాలుగున్నర గంటలకు పైగా భవనం మంటల్లోనే ఉంది. ఏడు ఫైర్‌ఇంజిన్లు, 40 వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు ఉండడంతో మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది. రాత్రి కావడంతో సహయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. -
‘అమ్మో’ అన్నవారే ‘ఆహా’ అంటున్నారు! ఇతిషా మహిమే!
అస్సాంలోని గౌహతికి చెందిన ఇతిషా సారా పుణెలోని ‘సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో చదువుకుంది. దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ‘సోషల్ డిజైన్’ కోర్సు చేసింది. ‘ఈ కోర్సు వల్ల తరగతి బయట అడుగు పెట్టడానికి, ప్రజలతో నేరుగా మాట్లాడడానికి, రోజువారీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి నాకు అవకాశం వచ్చింది’... గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఇతిషా.తన పరిశోధన అంశానికి ఈ–వ్యర్థాలను ఎంచుకుంది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై పరిశోధనలు చేసిన వారు తక్కువ. ఈ–వ్యర్థాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవడంతో పాటు దిల్లీ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైకిలింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి పరిశీలించేది. ఈ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఎన్నో విషయాల గురించి అవగాహన చేసుకుంది. ‘రీసైకిలింగ్’పై ఇతిషాకు ఉన్న అవగాహన సాంగ్టీని మార్చడానికి ఉపయోగపడింది.అరుణాచల్‌ప్రదేశ్‌లోని సాంగ్టీలో అద్దె ఇంట్లో ఉంటూ, హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణ స్పృహను రేకెత్తించ డానికి గ్రామస్తులతో కలిసి పనిచేసింది. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండకుండా ఒకేచోట ఉండేలా వెదురుతో ప్రత్యేక నిర్మాణాలు చేయించింది.కమ్యూనిటీల నిర్వహణలోని ‘వేస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్’ లతో సాంగ్టీ ప్రాంతంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ గ్రూప్‌లు స్థానిక సంస్కృతి, సాహిత్యాలను ప్రతిబింబించే మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న కాలంలో కోవిడ్ దెబ్బతో పరిసరాల పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్ మూలన పడ్డాయి. లాక్డౌన్ తరువాత ఈ ప్రాంతానికి తిరిగి వచ్చిన ఇతిషా వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో కమ్యూనిటీ గ్రూప్‌లలో ఉత్సాహవంతులైన కొత్త సభ్యులను చేర్చుకున్నారు.ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణను పర్యవేక్షించేందుకు నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వంతుల వారీగా వ్యర్థాలను సేకరించి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ(ఎంఆర్ఎఫ్) సెంటర్లకు తరలిస్తారు. ఒకప్పుడు సాంగ్టీ పేరు వినబడగానే ‘బాబోయ్’ అనుకునేవారు. ఇప్పుడు అలాంటి గ్రామం ‘జీరో వేస్ట్ విలేజ్’గా మారి ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిని ఇస్తోంది. వారిలో ఒకరిగా...అప్పుడప్పుడూ వస్తూ, పోతూ పని చేయడం కంటే సాంగ్టీలోనే ఉండి పనిచేయాలనుకున్నాను. ఆ గ్రామస్థులలో ఒకరిగా కలిసి పనిచేయడం వల్ల అందరూ సహకరించారు. నన్ను వారిలో ఒకరిగా చూసుకున్నారు. ‘జీరో వస్ట్ విలేజ్’గా సాంగ్టీని నిలబెట్టే క్రమంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనకడుగు వేయలేదు. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రతి ఇంటిలో అవగాహన కలిగించడంలో విజయం సాధించాం. - ఇతిషా సారా View this post on Instagram A post shared by Northeast Waste Collective (@northeastwastecollective) -
పరదా చాటున అలర్జీ మాటేస్తది!
తలుపులకూ, కిటికీలకు పరదాలు (డోర్ అండ్ విండో కర్టెయిన్స్) అందాన్నీ, ప్రైవసీని ఇస్తాయి. కొన్ని స్టార్ హోటల్స్‌లో మంచి రాజసపు లుక్ కోసం వెరైటీగా కర్టెన్లు అమరుస్తారు. ఇటీవల ఇండ్లలోనూ ఈ తరహాలోనే రంగురంగుల ఆకర్షణీయమైన కర్టెన్స్ అమర్చుకోవడం చాలా సాధారణం. కొన్నిసార్లు ఇంటి పై సజ్జబల్లల మీద / అటక మీద పాత సామాన్ల వంటివి సర్దిపెట్టినప్పుడు అవి బయటకు కనపడకుండా పరదాలు అడ్డుగా అమర్చి ఉంచడమూ మామూలే. అయితే వాటిని నెలల తరబడి అలాగే ఉంచడం వల్ల వాటి వెనక అలర్జీకి కారణమయ్యే డస్ట్‌మైట్స్ చేరి అలర్జీ కలిగించవచ్చు. అది ఎన్ని రకాలుగా కలుగుతోందో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.సాధారణంగా కర్టెన్లతో వచ్చే అలర్జీలు రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం వల్ల... అత్యంత చురుకుగా పనిచేసే ఆ వ్యాధి నిరోధక వ్యవస్థ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల అలర్జీలు వస్తాయి. అది ఈ కింది విధాలుగా జరుగుతుంది. ఫ్యాబ్రిక్ కర్టెన్లలో చేరే అలర్జెన్లూ, డస్ట్‌మైట్స్ : కరై్టన్లు ఇళ్లలోకి దుమ్మూ, ధూళి రాకుండా నిరోధిస్తాయి. ఈ క్రమంలో దుమ్ము ధూళిలో ఉండే డస్ట్‌మైట్స్... తలగడల్లో, పక్కబట్టల్లో చేరినట్టే పరదాల్లోకీ చేరతాయి. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్‌మైట్స్ ఉంటాయి. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) వరకు ఉండవచ్చు. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఈ విసర్జకాల్లోని ఒక రకమైన ప్రోటీన్ మనుషులు శ్వాసించేటప్పుడు ముక్కులోకి వెళ్లి... అది వారిలో అలర్జీ కలిగిస్తుంది. కొన్నిసార్లు అలర్జీలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. కేవలం డస్ట్‌మైట్స్ మైట్స్ మాత్రమే కాకుండా అనేక రకాల అలర్జెన్స్ సైతం కర్టెన్లలో దాగి ఉంటాయి. అవి కలిగించే అలర్జీ కారణంగా దగ్గడం, తుమ్ములు రావడం, అదేపనిగా ముక్కుకారడం, భయం కలిగించేలా కళ్లెర్రబడటం వంటి రియాక్షన్స్ కనిపిస్తాయి. కొందరిలో ఈ డస్ట్‌మైట్స్, అలర్జెన్లు తీవ్రమైన ఆస్తమాను కలిగించి, ఊపిరాడకుండా చేస్తూ తీవ్రంగా బాధిస్తాయి. మౌల్డ్స్ లాంటి ఫంగస్ చేరడం : కర్టెన్లలో మౌల్డ్స్ వంటి ఫంగల్ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి. ఇవి ఒకరకంగా బూజు లాంటివి. గాలిలో తేమ ఉండేచోట్ల, వెలుతురు తక్కువగా ప్రసరించే చోట్లలో ఈ మౌల్డ్స్, ఇతర ఫంగస్‌లు పెరుగుతాయి. అన్ని చోట్లలాగే కర్టెన్లలో చేరినప్పుడు అవి కలిగించే అలర్జిక్ రియాక్షన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. సూక్ష్మజీవుల ఆవాసంగా : అనేక రకాల సూక్ష్మజీవులు (జెర్మ్స్) సైతం పెద్దసంఖ్యలో కర్టెన్లలో చేరి అవి కూడా ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ∙దుమ్ము కణాలు : అత్యంత సూక్ష్మమైన దుమ్ము కణాలు కూడా అలర్జీలకు తెచ్చి పెడతాయి. ప్లాస్టిక్ కర్టెన్ల విషయంలో : మొదట్లో ఇళ్లలో, నివాస ప్రదేశాల్లో కేవలం క్లాత్ కర్టెన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇటీవల ఉపయోగాలూ, ఫ్యాషన్ దృష్ట్యా ప్లాస్టిక్‌తో తయారైనవీ వాడుతున్నారు. ఇక బాత్రూమ్ల విషయానికి వస్తే... అక్కడ అవి నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం పూర్తిగా వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని ప్లాస్టిక్కర్టెన్లు ఫ్యాబ్రిక్‌లతో చేసిన పరదాల్లో అటు ఇటు ఒంగకుండా (ఫ్లెక్సిబుల్‌గా లేకుండా) ఉంటాయి. అందుకే అవి బట్టలాగే ఎటు పడితే అటు కాస్తంత వంగేందుకు వీలుగా వాటిల్లో ‘థాలేట్’ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఇదే పదార్థాన్ని వాల్పేపర్లు, ఫ్లెక్సీల్లో కూడా వాడతారు.ప్లాస్టిక్కరై్టన్లతో ఎంతో హాని... ఈ ప్లాస్టిక్వంటి కర్టెన్లలోని హానికర / విష పదార్థాలు (టాక్సిక్ మెటీరియల్స్) కేవలం అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలను తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా హార్మోన్ల వ్యవస్థపైన కూడా ప్రతికూలంగా పనిచేసి ప్రత్యుత్పత్తి వ్యవస్థనూ దెబ్బతీస్తాయి. ఇక గర్భవతులపై కూడా ప్రతికూలంగా పనిచేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ అటెన్షన డిజార్డర్) వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్వంటి పదార్థాలతో తయారైన కర్టెన్ల కారణంగా నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలో ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్) వచ్చే అవకాశాలు ఎక్కువని ‘మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలింది.అలర్జీలు వస్తే... కర్టెన్లు లేదా ఇతరత్రా కూడా అలర్జీలు వచ్చినప్పుడు తీవ్రతను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీహిస్టమైన్స్ వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన మోతాదుల్లో స్టెరాయిడ్స్ ఇస్తూ చికిత్స అందిస్తారు. ఈ పరిస్థితి తెచ్చుకోవడం కంటే కర్టెన్స్‌ను ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసుకోవడం వల్ల ఇంటి పరిశుభ్రతతో పాటు ఒంటి ఆరోగ్యాన్నీ కాపాడుకున్నట్లు అవుతుంది.అలర్జీల నివారణకు...∙డోర్, విండో కర్టెన్ల కోసం వీలైనంతవరకు వస్త్రంతోతయారైన పరదాలు (ఫ్యాబ్రిక్ కర్టెన్స్) వాడటమే మంచిది షవర్ కర్టెన్లు కోసం ఫ్యాబ్రిక్ మెటీరియల్ వాడటం మంచిది ∙అయితే... బాత్రూమ్ల్లో వాడటం వల్ల అవి తడిసే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ పీవీసీ మెటీరియల్ కంటే హానికరం కాని అలర్జీ ఫ్రెండ్లీ బ్లైండ్స్ వంటివి వాడటం మంచిది ∙కర్టెన్లు ఫ్యాబ్రిక్ లేదా ప్లాస్టిక్మెటీరియల్తో చేసినవైనా బాగా మాసిపోయే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం. ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారైన కర్టెన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి, పూర్తిగా పొడిబారే వరకు ఆరబెట్టడం... అదే విధంగా ప్లాస్టిక్మెటీరియల్తో తయారైన వాటిని డిస్ఇన్ఫెక్టెంట్స్తో తరచూ శుభ్రపరచడం చాలా అవసరం. ఇలా ΄్లాస్టిక్తో తయారైనవి వాడాల్సి వచ్చినప్పుడు హైపో అలర్జెనిక్ వాషబుల్వి వాడాలి. దాంతో వాటిని కూడా సబ్బుతో కడిగినట్టే కడిగే అవకాశం ఉంటుంది. -
ప్లాస్టిక్ బౌల్స్‌లో ఆహారం ఎందుకు తినకూడదంటే..?
ఇటీవల డైనింగ్ టేబుల్స్ మీద ఉండే కిచెన్ వేర్లలో అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్‌లో కూడా ఉంటున్నాయి. అందులో వేడివేడి కూరలూ, పులుసు, అన్నం వంటి ఆహారాలు తీసి ఉంచి వడ్డిస్తూ ఉండటం చాలా మంది ఇళ్లలో కనిపించేదే. పైకి అనేక డిజైన్లతో చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్... అందులో ఉంచే ఆహారం విషయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యానికి అంత మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణంగా ఈ బౌల్స్‌ను ‘మెలమైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసుల వంటి ఆహారపదార్థాలను ఇందులోకి తీయగానే ఆ వేడికి మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందనీ, దేహంలోకి ప్రవేశించే ఈ మెలమైన్ వల్ల మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అధ్యయనం నిర్వహించిన తీరిది... ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్‌లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి చేసిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్‌లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతోపాటు కేన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఈ పని అస్సలు వద్దు... మెలమైన్తో చేసిన వంటపాత్రలలో వేడి ఆహారాన్ని తీయడమే చాలా ప్రమాదకరమంటే కొందరు మెలమైన్ బౌల్లో పెట్టిన ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేస్తుంటారు.ఇలా అస్సలు చేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. అనర్థాలేమిటంటే... ఈ మెలమైన్ దుష్ప్రభావాలు ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావాలపై ఉంటాయి. దాంతో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యతలలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. అలాగే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, వీర్య కణాల కదలికలు తగ్గడం, పురుష హార్మోన్ల స్రావం తగ్గడం వంటివి జరగవచ్చు. ఇక చాలామందిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలో తేలింది. ఈ ప్లాస్టిక్ పాత్రలలో తింటున్నవారిలో స్థూలకాయం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రొమ్ము కేన్సర్ వంటి కేన్సర్ల రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు, అల్జిమర్స్ కేసులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే కూరలు, పులుసుల వడ్డింపునకు ప్లాస్టిక్ బౌల్స్‌కు బదులు పింగాణీ బౌల్స్ మంచిదన్నది నిపుణుల మాట. ఈ పరిశోధనల ఫలితాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
26 ఏళ్లుగా ముక్కులోనే ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ ముక్క!..కట్‌చేస్తే ..!
చిన్నప్పుడూ చేసే పిచ్చిచేష్టల కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటాం. ఆ సమయంలో మన తల్లిందండ్రులు సకాలంలో స్పందించి కాపాడితే ఏ సమస్య ఉండదు. అదే సమయంలో వాళ్లు చూడకపోయినా లేదా మనం ప్రమాద బారిన పడిన విషయం గురించి ఇంట్లో వాళ్లక చెప్పకపోయినా..ప్రాణాంతక సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చిన్నతనంలో ఆకతాయి పనులతో ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. అయితే అతడి తల్లి సకాలంలో స్పందించి రక్షించే యత్నం చేసింది కూడా. అక్కడితో ఆ సమస్య సమూలంగా పరిష్కారంగాక పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారినపడి ఇబ్బంది పడ్డాడు. గమ్మత్తుగా ఆ సమస్య ఇటీవల పరిష్కారమయ్యింది. ఊహించని విధంగా ఏదో ఫన్నీగా ఆ సమస్య నుంచి బయటపడితే ఆ ఆనందం మాటకందనిది కదా. అలాంటి ఫీల్‌ని అనుభవిస్తున్నాడు అరిజోనా వ్యక్తి..ఏం జరిగిందంటే..అరిజోనాకు చెందిన 32 ఏళ్ల ఆండీ నార్టన్ అనే వ్యక్తి ఇన్నాళ్ల నుంచి పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గల కారణం తెలుసుకుని విస్తుపోయాడు. ఆ అనుభవాన్ని ఇన్స్టావేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ఆరేళ్లప్రాయంలో జరిగిన ఘటన కారణంగా ఇన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో అసౌకర్యానికి గురయ్యానా..అని తెలుసుకుని దిగ్బ్రాంతికి గురయ్యాడు. స్లీప్ అప్పియా, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో మొన్నటివరకు చాలా ఇబ్బంది పడ్డాడు.అయితే ఒకరోజు అనుకోకుండా బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆ సబ్బు నురుగకు పెద్దప్దెగా తుమ్ములు వచ్చాయి. అంతే ఆ తుమ్ముల్లో అతడి అనారోగ్య సమస్యలన్ని కొట్టుకుపోయాయి. ఆ తుమ్ముల కారణంగా ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకొచ్చింది. దాన్ని చూడగానే తన చిన్ననాటి ఘటన స్పురణకు వచ్చింది. 1990లలో జరిగా బాల్యపు ఘటన గుర్తుకొచ్చింది నార్టన్కి. లెగో బ్రాండ్‌కి సంబంధించిన చిన్న ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటూ దాన్ని ముక్కులో పెట్టుకున్నాడు. ఇది గమనించిన వాళ్ల అమ్మ ఆ బోమ్మను తొలగించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఓ చిన్న ముక్కలో అతడి ముక్కులో ఇరుక్కుపోవడంతో దీర్ఘకాలికి అనార్యో సమస్యల బారిన పడ్డాడు. అనుకోని విధంగా వచ్చిన తుమ్ముల కారణంగా ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకు వచ్చి ముక్కు అంతా ఫ్రీగా ఉన్నట్లు అనిపించింది. దాన్ని చూడగానే బాల్యంలో జరిగిన ఘటన గుర్తుకొచ్చి..ఎంత సులభంగా ఈ సమస్య పరిష్కారం అయ్యిందని సంబరపడ్డాడు.ఆ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎలాంటి సర్జరీలు జరకుండా బయటపడ్డావని తెగ మెచ్చుకున్నారు. దీంతో ఇన్నాళ నుంచి నార్టన్ పడ్డ ఇబ్బందులకు తెరపడింది. హాయిగా ముక్కుతో గాలి పీల్చుకుంటున్నాడు కూడా. View this post on Instagram A post shared by 🇵🇭 Ben Havoc (@bigoompalumpia) (చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!) -
అమ్మో.. ప్లాస్టిక్ భూతం!
సాక్షి, అమరావతి: భారత్‌ను ప్లాస్టిక్ భూతం భయపెడు తోంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తోంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే ప్లాస్టిక్ ఉద్గారాలకు భారత్ నిలయంగా మారుతోంది. నేచర్ జర్నల్‌లో ప్రచురించిన లీడ్స్ విశ్వవిద్యాలయ (ఇంగ్లడ్) బృందం అధ్యయనం ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యాలు లేకపోవడంతో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో చైనాను దాటుకుని భారత్ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో 2 లక్షల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌ను నింపొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే 5.21 కోట్ల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ కాకపోవడంతో ఎక్కువ భాగం పర్యావరణంలోకి ప్రవేశించి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నట్టు నివేదిక చెబుతోంది. ఇందులో దాదాపు ఐదో వంతు (18 శాతం) భారత్ నుంచే వస్తుండటం గమనార్హం.ఈ క్రమంలోనే చైనాలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ అక్కడి రీసైక్లింగ్ వ్యవస్థ ద్వారా వాటిని నియంత్రిస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. భారత్ తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనా ప్లాస్టిక్ ఉద్గారాల్లో పోటీపడుతున్నాయి. యూకే మాత్రం 4 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో 135వ ర్యాంకు పొందింది.ఏటా వివిధ దేశాలు ఉత్పత్తి చేస్తూ నిర్వహణకు నోచుకోని ప్లాస్టిక్ వ్యర్థాలు (లక్షల టన్నుల్లో)ఆరోగ్యానికి ముప్పుప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారకాలకు కారణం అవుతోంది. జనాభా పెరుగుదలకు తోడు ఆదాయ వనరులు పెరగడంతో విలాసాల జీవితం దగ్గరవుతోంది. ఫలితంగా ఎక్కువ వ్యర్థాలు బయటకొస్తున్నాయి. దీంతో దేశంలో వ్యర్థాల నిర్వహణను చేపట్టడం సవాల్‌గా మారింది. దేశంలో డంపింగ్ యార్డుల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ఇక్కడ సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.12 కేజీల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.అయితే, దేశంలో 95 శాతం వ్యర్థాలను సేకరిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, విచ్చలవిడిగా తగలబెడుతున్న వ్యర్థాలు, అనధికారికి రీసైక్లింగ్‌లోని వ్యర్థాలను లెక్కించడం లేదని అధ్యయనం పేర్కొనడం గమనార్హం. మరోవైపు ప్లాస్టిక్‌ను బహిరంగంగా కాల్చడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత రసాయనాలు విడుదల అవుతున్నాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కేన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. 20 దేశాల నుంచే 69 శాతం వ్యర్థాలుప్రపంచంలో 69 శాతం వ్యర్థాలు 20 దేశాల నుంచే వస్తున్నట్టు అధ్యయనం నమోదు చేసింది. ఇందులో 4 తక్కువ ఆదాయ, 9 తక్కువ మధ్య ఆదాయ, 7 ఉన్నత మధ్య ఆదాయ దేశాలున్నాయి. అధికాదాయ దేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రపంచంలో రీసైక్లింగ్ చేయని ప్లాస్టిక్‌లో దాదాపు 43 శాతం చెత్తగా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. అయితే.. అత్యంత ప్లాస్టిక్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంటే.. అక్కడ సగటున రోజులో ఒక వ్యక్తి ఉత్పత్తి చేస్తున్న వ్యవర్థాలు తక్కువగా ఉండటంతో 153వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ 127వ స్థానంలో ఉంది. -
రీ సస్టేనబిలిటీ రీసైకిల్డ్ పాలిమర్స్
పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న రీ సస్టేనబిలిటీ అధిక నాణ్యత కలిగిన రీసైకిల్డ్ పాలిమర్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మ్యారికో వ్యవస్థాపక కుటుంబమైన హర్ష మారివాలా ఫ్యామిలీ యాజమాన్య మూలధనాన్ని నిర్వహిస్తున్న షార్ప్ వెంచర్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది.ఈ సంయుక్త భాగస్వామ్యంలో రీ సస్టేనబిలిటీకి 85 శాతం, షార్ప్ వెంచర్స్ మిగిలిన వాటాను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు హైదరాబాద్‌తోపాటు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వద్ద ఏఐ సాంకేతికతతో కూడిన అత్యాధునిక ప్రాసెసింగ్ కేంద్రాలను నెలకొల్పుతామని రీ సస్టేనబిలిటీ ఎండీ, సీఈవో మసూద్ మాలిక్ తెలిపారు. మ్యారికో ఫౌండర్, చైర్మన్ హర్ష మారివాలాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వచ్చే ఏడాది రెండు ప్లాంట్లు కార్యరూపంలోకి వస్తాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా ఏటా 32,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తాం’ అని ఆయన ఈ సందర్భంగా వివరించారు.ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ దాదాపు అన్ని దేశాలకు సవాలుగా మారుతోంది. ఎఫ్ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలతో పాటు ఇతర చాలా రంగాల్లో అనివార్యంగా ఇంకా ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఆయా రంగాల్లో దాని స్థానంలో ఇతర ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇవి పూర్తయి ప్రాచుర్యం పొంది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పడుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే అప్పటివరకు విడుదలయ్యే ప్లాస్టిక్‌తో మానవాళికి ప్రమాదం పొంచి ఉంది. దాని నిర్వహణ కోసం కంపెనీలు కొత్త టెక్నాలజీలను వాడుతున్నాయి. అందులో భాగంగానే రీ సస్టేనబిలిటీ, షార్ప్ వెంచర్స్ కంపెనీలు సంయుక్తంగా ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్లాస్టిక్‌ను రిసైకిల్ చేసి పాలిమర్స్‌ను తయారు చేసేందుకు సిద్ధం అయ్యాయి.ఇదీ చదవండి: ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టతఇప్పటికే ప్లాస్టిక్ అంతటా వ్యాపించింది. నేల, చెరువులు, నదులు, సముద్రాలన్నింటినీ ఆక్రమిస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ప్రతి ఏడాది 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే 2040కల్లా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతాయని అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తి సమయంలో వెలువడే ఉద్గారాలు తీవ్ర వాయు కాలుష్యానికి కారకాలుగా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పందించి ఈ విభాగంలో సేవలందిస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకాలు పెంచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పాదనలో భారత్ నంబర్ వన్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది రెండవ అతిపెద్ద ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారు కంటే రెండు రెట్లు అధికం. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది.ఈ అధ్యయనం ప్రకారం ఈ 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ గ్లోబల్ సౌత్ నుండి వస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన కోస్టాస్ వెలిస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోట చేరిస్తే, అది న్యూయార్క్ నగరంలోగల సెంట్రల్ పార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకంటే అధికంగా ఉంటుంది. పరిశోధకులు ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా నగరాలు, పట్టణాలలో స్థానికంగా ఉత్పత్తి అయిన వ్యర్థాలను పరిశీలించారు.ఈ అధ్యయన ఫలితాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం బహిరంగ వాతావరణంలో కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించింది. ప్రపంచ జనాభాలో 15 శాతం మంది నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పారవేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆగ్నేయాసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తికి ఇదే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. ఈ 15 శాతం జనాభాలో భారతదేశంలోని 25.5 కోట్ల మంది ఉన్నారు.నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ఇదేవిధంగా న్యూఢిల్లీ, లువాండా, అంగోలా, కరాచీ, ఈజిప్ట్‌లోని కైరోలు ప్లాస్టిక్ కాలుష్య కారకాల విడుదలలో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా ఈ విషయంలో నాల్గవ స్థానంలో ఉంది. వ్యర్థాలను తగ్గించడంలో ఆ దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని వెల్లడయ్యింది. -
Ashay Bhave: షూట్ ఎట్ ప్లాస్టిక్స్! నీవంతుగా ఒక పరిష్కారం..
ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి నిట్టూర్చడం కంటే.. ‘నీవంతుగా ఒక పరిష్కారం’ సూచించు అంటున్నాడు ముంబైకి చెందిన ఆశయ్ భవే. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్నీకర్స్ తయారుచేసే ‘థైలీ’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయం సాధించాడు..మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘థైలీ’ అనే కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది. వ్యాపారపరంగా పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది.‘థైలీ’ అంటే హిందీలో సంచి అని అర్థం.‘ప్లాస్టిక్ సంచులను సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుందనే విషయం తెలుసుకున్నాను. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి థైలీ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాను. పారేసిన ప్లాస్టిక్ సంచుల నుండి ప్రత్యేకంగా సృష్టించిన వినూత్న లెదర్‌ను స్నీకర్స్ కోసం వాడుతున్నాం’ అంటున్నాడు ఆశయ్ భవే.షూస్‌కు సంబంధించిన సోల్‌ను ఇండస్ట్రియల్ స్క్రాప్, టైర్ల నుండి రీసైకిల్ చేసిన రబ్బరుతో తయారుచేస్తారు. షూబాక్స్ను రీసైకిల్ చేసిన జతల నుండి కూడా తయారుచేస్తారు. వాటిలో విత్తనాలు నిక్షిప్తం చేస్తారు. మొక్కలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. 2000 సంవత్సరంలో బాస్కెట్‌బాల్ స్నీకర్ ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘థైలీ’ స్నీకర్ డిజైన్ చేశారు. డిస్కౌంట్ కావాలనుకునేవారు పాత స్నీకర్లు ఇస్తే సరిపోతుంది. షూ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో పర్యావరణ స్పృహతో వ్యవహరించడం అనేది ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఆశయ్ శ్రమ వృథా పోలేదు. కంపెనీకి ‘పెటా’ సర్టిఫికేషన్‌తో పాటు ఆ సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక ఉత్తమ స్నీకర్ అవార్డ్ లభించింది. పర్యావరణ స్పృహ మాట ఎలా ఉన్నా బడా కంపెనీలతో మార్కెట్లో పోటీ పడడడం అంత తేలిక కాదు.లాభ, నష్టాల మాట ఎలా ఉన్నా... ‘డోన్ట్ జస్ట్ డూ ఇట్ డూ ఇట్ రైట్’ అనేది కంపెనీ నినాదం.‘మా కృషికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని ప్రపంచం నా కల’ అంటున్నాడు 24 సంవత్సరాల ఆశయ్ భవే. న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఫుట్‌వేర్ డిజైన్ కోర్సు చేశాడు ఆశయ్. ఈ స్టార్టప్ పనితీరు, అంకితభావం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రకు బాగా నచ్చింది. ‘థైలీ ఇన్స్పైరింగ్ స్టార్టప్. యూనికార్న్‌ల కంటే పర్యావరణ బాధ్యతతో వస్తున్న ఇలాంటి స్టార్టప్‌ల అవసరం ఎంతో ఉంది’ అంటూ ఆశయ్ భావేను ప్రశంసించాడు ఆనంద్ మహీంద్ర.ఆ పోటీని తట్టుకొని నిలబడింది ‘థైలీ’ కంపెని..‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాడక్ట్‌గా గుర్తింపు పొందిన ‘థైలీ’ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌పై కూడా దృష్టి సారించింది. ఇప్పటి వరకు కంపెనీ వేలాది ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగులను రీసైకిల్ చేసింది.ఇవి చదవండి: ముగ్గురు పాక్ హాకీ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం -
గ్రీన్ చాయిసెస్..! ఎంపవర్ వాయిసెస్..!!
విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్ఓ అనంత్ శంకర్ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిస్టమ్‌పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఐటి బూట్ క్యాంప్ ్రపోగ్రామ్ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.ప్లాస్టిక్‌ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్ పేపర్‌తో నోట్ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్ బ్రష్‌లు, దువ్వెనలు, పెన్‌స్టాండ్, మొబైల్ స్టాండ్, అందమైన రంగులతో కాటన్ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్ చాయిసెస్.. ఎంపవర్ వాయిసెస్. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ ఎక్స్పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్‌ఫామ్‌లను కోరారు.స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్‌లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho) -
శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం
శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్(ఎన్ఎస్టీఆర్) కోర్ ఏరియాలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు అటవీశాఖ నిర్ణయించింది. శ్రీశైలం దేవస్థానానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలు, ప్లాస్టిక్ ప్యాకింగ్ కలిగిన తిను బండారాలు తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో పడేస్తున్నారు. వాటిని తిని జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అలాగే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా దోర్నాల, నంద్యాల జిల్లా సున్నిపెంట వద్ద గల అటవీ చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ వస్తువులను సరఫరా చేసే వాహనాలు వెనక్కి పంపుతున్నారు. యాత్రికుల వాహనాలలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను పడవేస్తున్నారు. దేవస్థానంలో స్వామి అమ్మవార్ల ప్రసాదానికి జ్యూట్, కాగితంతో తయారు చేసిన బ్యాగ్‌లను వాడాలని, శ్రీశైలంలో గాజు బాటిళ్ల ప్యాకింగ్‌తో కూడిన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అదనంగా 20 మంది సిబ్బందిని నియమించి అటవీ ప్రాంతంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్ ఏరియాలో ప్లాస్టిక్ పూర్తి నిషేధానికి మూడోసారి బుధవారం అటవీ, దేవస్థానం అధికారులు సున్నిపెంట బయోలేబరేటరీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కన్జర్వేటర్ బి.ఎన్ఎన్.మూర్తి, డీఎఫ్ఓలు విఘ్నేష్ అపావ్, సాయిబాబా, రేంజ్ అధికారి నరసింహులు, దేవస్థానం అధికారులు రామకృష్ణ అయ్యన్న, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్లాస్టిక్ఫ్రీ జోన్’గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను జూలై ఆఖరులోగా పూర్తి ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు. కాగితపు సంచులు, జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. టైగర్ రిజర్వ్‌లో ప్లాస్టిక్ నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాలని చెప్పారు.ఈ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. హరిత నిధి కింద ఉన్న నిధులను సంబంధిత ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని మైసమ్మ ఆలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పీసీబీ సభ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంత రావు పాల్గొన్నారు -
అన్నీ తెలిసినా అలసత్వమే!
సమస్య తెలుసు... దానికి పరిష్కారమూ తెలుసు... తక్షణమే అందుకు నడుము కట్టకపోతే మానవాళి జీవనానికే ప్రమాదమనీ తెలుసు. అన్నీ తెలిసినా ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒక్కతాటి మీదకు రాలేకపోతున్నాయంటే ఏమనాలి? ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతంపై పరిస్థితి సరిగ్గా అదే! సరికొత్త అంతర్జాతీయ ఒడంబడిక నిమిత్తం గత వారం ఒట్టావాలో జరిగిన సమావేశం స్పష్టమైన నిర్ణయాలేమీ తీసుకోకుండానే చప్పగా ముగిసింది. అందరిలోనూ అసంతృప్తి మిగిల్చింది. 192 దేశాల ప్రతినిధులు వారం పాటు సమావేశమై చర్చలు జరిపినా, ఆఖరి రోజున సమావేశాన్ని అర్ధ రాత్రి దాకా పొడిగించినా ఫలితం లేకపోయింది. ఒప్పందంపై ఒక నిర్ణయం కుదరలేదు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని అధిక భాగం దేశాలు అంగీకరించినప్పటికీ, ఉత్పత్తిపై పరిమితులు విధించడం మీద ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. ఇది నిరాశ కలిగించే పరిణామం.పెట్రోలియమ్ ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్‌లపై దేశాల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన అనేక ధనిక దేశాల్లో ప్లాస్టిక్‌ల తయారీ, పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతోంది. సహజంగానే పెట్రోకెమికల్ పరిశ్రమ వృద్ధిచెందిన ఆ దేశాలు, పారిశ్రామిక గ్రూపులేమో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలనే యోచనను వ్యతిరేకించాయి. ప్రస్తుతానికి వాటి మాటే పైచేయి కాగా, ఒడంబడికపై నిర్ణయం అక్కడికి ఆగింది. ప్లాస్టిక్‌పై అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే మొదలైంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వాటి ఉత్పత్తిని ఆపేయడానికి ఒక నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఒడంబడికను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా ఒట్టావాలో నాలుగో విడత చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రకాల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నా యాలు లేని పరిస్థితి. ఇది పెద్ద ఇబ్బంది. గణాంకాలలో చెప్పాలంటే... ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950లో 20 లక్షల టన్నులుండేది. 2019 నాటికి 4600 లక్షల టన్నులకు చేరింది. వచ్చే 2060 నాటికి అది అంతకు మూడింతలు అవుతుందని అంచనా. దానికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నానాటికీ తీసి కట్టుగా మారింది. పైపెచ్చు, భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఏటా 740 టన్నులుండగా, రానున్న 2050 నాటికి అది ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుంది. విధానపరమైన మార్పులు చేపట్టకుంటే ఇది పెను సమస్యే. అందుకే, వ్యర్థాల లోపభూయిష్ట నిర్వహణను వచ్చే 2040 కల్లా సున్నా స్థాయికి తేవాలనేది లక్ష్యంగా ఒడంబడిక ప్రక్రియకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. వ్యర్థాలే కాదు... అసలు ప్లాస్టిక్ ఉత్పత్తే పర్యావరణానికి పెను ప్రమాదం. ప్లాస్టిక్ భూమిలో కలసిపోదు గనక పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ పెద్ద దెబ్బ. ప్లాస్టిక్ ఉత్పత్తితో గ్రీన్ హౌస్ వాయు వులు వెలువడి భూతాపం పెరుగుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తికి ఉపకరించే పెట్రోకెమికల్స్ తయారీకై శిలాజ ఇంధనాల వెలికితీత, రిఫైనింగ్‌తో ఒక్క 2019లోనే 2.24 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలినట్టయిందట. పాత లెక్కల వంతున ఏటేటా 4 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగినా సరే, వచ్చే 2050 నాటికి ఇది మూడు రెట్లై ఈ గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం 6.78 గిగా టన్నులకు చేరుతుంది. ఒడంబడికతో ఈ పరిమాణాన్ని 26 శాతం మేర తగ్గించాలని లక్షించారు. మనం వాడే ప్లాసిక్లలో 16వేల రకాల రసాయనాలుంటాయి. వాటిలో కనీసం 4200 విషపూరితమే. వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికాలో 9200 కోట్ల డాలర్ల పైగా ఖర్చయింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్‌ల వినియోగం తగ్గించాలనీ, వాటిని రీసైక్లింగ్ చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవేవీ ఇప్పటి దాకా అనుకున్నంత విజయం సాధించలేదు. ఉత్పత్తిపై పరిమితులు విధించడం కన్నా, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని తాజా భేటీలోనూ ప్రధాన దేశాలు పట్టుబట్టాయి. అయితే, కేవలం వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్లతో ప్లాస్టిక్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టడం జరగని పని. నిష్ఠురమైనా అది నిజం. ప్రపంచంలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో 10 శాతమే ఇప్పటి దాకా పునర్వినియోగమైంది. మిగతా వ్యర్థాలన్నీ సముద్రాలు, నేలల్లో మిగిలాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి మాత్రం ఏటేటా పెరుగుతూ పోతోంది. అందుకే, ప్లాస్టిక్‌ల ఉత్పత్తిపై నియంత్రణకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. ఒట్టావా సమావేశంలో కొంత పురోగతి సాధించినట్టు ఐరాస అంటున్నా, అది వట్టి కంటి తుడుపే!కొన్నేళ్ళుగా మైక్రో, నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో, చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తు న్నాయని శాస్త్రవేత్తల మాట. ఇది ఆందోళనకర పరిణామం. అందుకే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలదు. ఉత్పత్తిని బాగా తగ్గించడమే దీర్ఘకాలంలో ఉపయోగం. మన దేశం 2022లోనే ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు’ తీసుకొచ్చి, 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింది. అయితే, ప్రాంతానికో రకం నిబంధనలున్నందున వాటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలోనే మరో విడత బుసాన్‌లో సమావేశం కానున్నాయి. అప్పటికైనా అవి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొదలైన వందేళ్ళ లోపలే మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్‌లపై పోరుకు ఒక్క మాట మీద నిలవాలి. ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకు పక్కనబెట్టి మరీ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే పనిలో మిగతా దేశాల చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ప్రమాదం తెలుస్తున్నా పట్టించుకోకుండా, పరిష్కారంపై చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తూ పోతే మనకే కష్టం, నష్టం. -
గుట్ట గుట్టలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు : ఈ పాపంలో మనం కూడా!
మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి కాలుష్య భూతం. ముఖ్యంగా భూమి మీద గుట్టలుగుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై కీలక సర్వే మరింత ఆందోళన రేపుతోంది. ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయని తాజా రిపోర్టులో వెల్లడైంది. ప్రపంచంలో ఈ ఏడాది ఉత్పత్తి అయిన 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో దాదాపు 7 కోట్ల టన్నులను ప్రపంచ దేశాలు శుద్ధి చేయకుండా వదిలివేశాయని ‘ఈఏ ఎర్త్ యాక్షన్’ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి చేటు కలుగుతోంది. ఇది ప్రపంచానికే పెను సవాల్‌గా మారింది. భూగోళానికి మరింత ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలపై చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతూనే ఉన్నారు. తాజా ఎర్త్ యాక్షన్ సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో సగానికి పైగా అంటే దాదాపు 60 శాతం వ్యర్థాలకు కారణం కేవలం 12 దేశాలేనని తేలింది. ఈ జాబితాలో భారత దేశం పేరు కూడా ఉండటం గమనార్హం.అయితే, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు తక్కువని చెప్పింది. కెనడాలోని ఒట్టావాలో ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ (INC) నాల్గవ సమావేశానికి ముందు ఈ రిపోర్ట్ వెలుగులోకిచ్చింది. అమెరికా, చైనా, భారత్ సహా ఈ జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండినేషియా, టర్కీ, వియత్నాం దేశాలున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శుద్ధి చేయని ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాల్లో మూడోవంతు, చైనా వ్యర్థాల్లో ఐదో వంతు కన్నా తక్కువే. ప్లాస్టిక్ మిస్ మేనేజ్మెంట్లో చైనా టాప్‌లో ఉందని పేర్కొంది. తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. -
కిచెన్‌లో ఉండే ఆ రెండిటితోటే మైక్రోప్లాస్టిక్‌కి చెక్!
మైక్రోప్లాస్టిక్‌లు ప్రస్తుతం ఆహారం, నీరు, గాలిలో ఇలా ప్రతి చోట ఉంటున్నాయి. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యలా మారింది. వీటిని ఫిల్టర్ చేయడానికి శాస్త్రవేత్తలు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి పలు టెక్నిక్లను అభివృద్ధి చేశారు. అయితే తాజగా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం సమర్థవంతంగా మైక్రో ప్లాస్టిక్‌కు చెక్‌పెట్టింది. ఇక్కడ మైక్రోప్లాస్టిక్‌లు అంటే 5 మిల్లీమీటర్లు(0.2 అంగుళాలు) కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్‌లని అర్థం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి పెద్దగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల కీణత కారణంగా వచ్చేవే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇక యునెస్కో ఓషన్ లిటరసీ పోర్టల్ ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ ముక్కలు చాలా వరకు మహాసముద్రాల్లోనే కలిసిపోతాయని పేర్కొంది. వాటిలో సుమారు 50 నుంచి 70 మిలియన్ల వరకు పెద్ద, చిన్న సైజులో ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్లాస్టిక్ రేణువుల్లో చాలా విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవే కాలక్రమేణ ఈ నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి చాల చిన్నవి కాబట్టి ప్రేగులు, ఊపిరితిత్తులు గుండా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి మన హృదయం, మెదుడు వంటి అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉండే ఈ చిన్న కణాలు తాగు నీటిలో కూడా చేరడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల విడుదలకు అంతరాయం కలిగించడమే కాకుండా పునరుత్పత్తి లోపాలు, కేన్సర్ ప్రమాదాలను పెంచుతాయి. దీన్ని చెక్ పెట్టేందుకు చైనాలోని గ్వాంగ్జౌ మెడికల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వంటగది సామాన్లనే ఉపయోగించింది. వీటితోనే మైక్రో ప్లాస్టిక్‌లకు సంబంధించి దాదాపు 80%పైగా తొలగించింది. కేవలం ఒక కేటిల్ సాధారణ వాటర్ ఫిల్టర్‌ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్‌లో వెల్లడించారు. ఆ పరికరాలతో ఝాన్జున్ లీ, ఎడ్డీ జెంగ్ అనే శాస్త్రవేత్తల బృందం ఖనిజాలతో కూడిని నీటి నమునాలను సేకరించారు. వాటిలో నానో, మైక్రో ప్లాస్టిక్‌ల కణాల డోస్‌ని పెంచింది. వాటిని ఐదు నిమిషాల మరిగించింది. ఐతే ప్రతిసారి ఆ నీరు మరుగుతున్నప్పుడూ పైకిలేచే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాస్టిక్ మొత్తాన్ని బృందం తొలగించే ముందు చల్లబరిచి వేరు చేసేది. ఖనిజాలతో కూడిని ఈ నీటిలో లైమ్‌స్కేల్, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడు టీ, కాఫీ వంటివి కాచినప్పుడూ ఎలా పైకి నల్లటి తెట్టు వస్తుందో అలా తెట్టులాగా తెల్లటి ఒట్టు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలను నీటి నుంచి వేరు చేస్తుంది. తద్వారా ఈజీగా తాగే నీటి నుంచి ప్లాస్టిక్ కణాలను వేరవ్వుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!) -
Kamana Gautam: ప్రతి ఇంటి నుంచి పచ్చటి అడుగు
ఒక మంచి పని చేసినప్పుడు అభినందించే వారే కాదు అనుసరించే వారు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కామ్నా గౌతమ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ‘పర్యావరణహిత మార్గం వైపు ప్రయాణం మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటుంది కామ్నా గౌతమ్... ‘పర్యావరణ సంరక్షణకు మన వంతుగా ఉడతాభక్తిగా చేయడానికి ఎంతో ఉంది. అందుకు మన ఇంటి నుంచే శ్రీకారం చుట్టాలి’ అంటుంది కామ్నా గౌతమ్. తన ఇన్స్పైరింగ్ మాటలతో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన కామ్నా నూట్రీషనిస్ట్. వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్‌లు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం... మొదలైన వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది కామ్నా గౌతమ్. బేబీ–వియరింగ్, బ్రేస్ట్ఫీడింగ్లాంటి అంశాలకు సంబంధించి ఉపయోగకరమైన సమాచారం అందించడంతో కామ్న సోషల్ మీడియా జర్నీ మొదలైంది. ‘నేను ఒక బిడ్డకు తల్లిని. బిడ్డ భవిష్యత్ బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అందుకే బిడ్డల బంగారుభవిష్యత్ కోసం పర్యావరణహిత మార్గాన్ని ఎంచుకున్నాను’ అంటుంది కామ్న. పర్యావరణ హిత మార్గంలో తన ఇంటి నుంచే తొలి అడుగు వేసింది. ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా చేసింది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. ‘మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఎందుకు ఉపయోగించడం లేదో తెలుసా?’ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పింది. ‘నేను ఇలా చేస్తున్నప్పుడు ఇతరులు కూడా చేయవచ్చు కదా. వారిలో ఎందుకు స్పందన కనిపించడం లేదు?’ అంటూ బాధ పడేది కామ్నా. అయితే ఆ తరువాత మాత్రం ఒక్కరొక్కరుగా ఆమెను అనుసరించడం ప్రారంభించారు. ఇంటిని ఎన్విరాన్మెంట్–ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడం మొదలు పెట్టారు. ప్లాస్టిక్ బ్యాగులు కనిపించకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో క్లాత్‌బ్యాగులు ఉండాలి, డిస్పోజబుల్ వాటర్ బాటిల్ కాదు మీదైన సొంత వాటర్ బాటిల్ ఉండాలి, ట్రెండ్లను అనుసరిస్తూ పర్యావరణానికి హాని కలిగించే వస్త్రాలు లేదా వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఇంట్లోని వ్యర్థాలను తడి, పొడి విభాగాలుగా వేరు చేయండి...ఇలాంటి విషయాలెన్నో చుట్టుపక్కల వారికి చెబుతున్నప్పుడు మొదట్లో వారి స్పందన ఎలా ఉండేదో తెలియదుగానీ ఆ తరువాత మాత్రం మార్పు కనిపించింది. -
ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా!
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మంచిది కాదన్న విషయం తెలిసిందే. ఆ నీటిలోకి ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అవి మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయిని విన్నాం. అంతవరకు తెలుసు కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. ఈ తాజా అధ్యయనాల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ కణాలు, నానో ప్లాస్టిక్స్ ఉండొచ్చిన వెల్లడయ్యింది. అవి నేరుగా రక్తంలో ప్రవేశించి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో పీర్ రివ్యూడ్ స్టడీ పేరుతో ఈ పరిశోధన ప్రచురితమయ్యింది. ఈ నానో ప్లాస్టిక్ కణాలు మనిషి వెంట్రుకలో డెబై వంతు వెడల్పుతో ఉన్నాయని అన్నారు. మునపటి అధ్యయనాల్లో అంచనావేసిన దానికంటే వందరెట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే? గత అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్‌లు సుమారు ఐదు వేలు ఉన్నట్లు అంచనా వేశారు. అంతేగాదు మైక్రోప్లాస్టిక్‌ల కంటే రేణువుల్లా ఉండే ఈ నానో ప్లాస్టక్లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా మాన రక్తప్రవాహంలో ప్రవేశించి అవయవాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. అంతేగాదు ఇవి పుట్టబోయే బిడ్డలోకి మాయ ద్వారా చేరే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నానోప్లాస్టిక్ని గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొత్త మైక్రోస్కోపీ టెక్నీక్‌ను కనుగొన్నారు. అందుకోసం యూఎస్‌లోని మూడు ప్రసిద్ధ బ్రాండ్ల నుంచి సుమారు 25 లీటర్ వాటార్ బాటిళ్లను కొనుగోలు చేశారు. ప్రతి లీటర్లలో సుమారు ఒక లక్ష నుంచి మూడు లక్షల దాక ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. వాటిలో దాదాపు 90% వరకు నానోప్లాస్టిక్‌లు. ఈ పరిశోధన నానోప్లాస్టిక్‌లను విశ్లేషించడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుందని కొలంబియా పరిశోధకుడు నైక్సిన్ కియాన్ అన్నారు. వీటిలో ఏడు సాధారణ ప్లాస్టిక్ రకాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పాలిథిన్ టెరెఫ్లాలేట్(పెట్), పాలిమైడ్ వంటి వాటిపై దృష్టిసారించారు. ఎందుకంటే వీటిని సీసాలు తయారు చేయడంలోనూ, బాటిల్‌ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగిస్తారు. అయితే వీటికి సంబంధించిన నానోప్లాస్టిక్ బాటిల్ నీటిలో చాలమటుకు గుర్తించబడవని అన్నారు. గత పరిశోధనలు పరిశీలిస్తే.. 2022 అధ్యయనంలో నీటి పంపుల కంటే వాటర్ బాటిల్లోనే మైక్రోప్లాస్టిక్ సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 2021లో జరిపిన అధ్యయనంలో మూతను తెరిచి మూయడం వల్ల కూడా చిన్ని బిట్ల మాదిరిగా ప్లాస్టిక్ కణాలు నీటిలో చేరతాయని చెప్పారు. ఈ తాజా అధ్యయనం మాత్రం వాటర్ బాటితో ఆగకుండా పంపు నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌లను కూడా కనుగొనడమే తమ లక్ష్యం అని పరిశోధకులువివరించారు. అందుకోసం అంటార్కిటికా పంపు నీటిలోని మంచు నుమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ నానోప్లాస్టిక్ చూడటానికి అత్యంత చిన్న రేణువులు, కానీ వీటి వల్ల మానవాళికి వాటిల్లే ముప్పు అంతా ఇంత కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. (చదవండి: 'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం! తయారు చేసిన శాస్త్రవేత్తలు) -
పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!
సైంటిస్టులను కలవరపెడుతున్న ప్లాస్టిక్ శిలలు. ఇప్పటికే ఐదు ఖండాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి గనుకు వేగంగా ఏర్పడటం మొదలైతే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి పర్యావరణం, మానువుని ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ ప్లాస్టిక్ శిలలు?. ఎలా ఏర్పడతాయంటే.. ఇప్పటి వరకు ఐదు ఖండాల్లో ఈ ప్లాస్టిక్ శిలలు ఆవిర్భవించి విస్తరిస్తున్నట్లు నివేదికల్లో వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కనిపించే ఈ శిలలు విచిత్రమైన రూపాలను కలిగి ఉంటాయి. ఇవి కంప్రెస్డ్ రాక్ మాదిరిగా ప్లాస్టిక్ పాలిమర్లతో కూడి ఉంటాయి. సుమారు 11 దేశాలలోని తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనిపించాయి. వీటిని ఏమని పిలుస్తారంటే.. ఈ ప్లాస్టిక్ ఇన్ఫ్యూజ్డ్ శిలలను పిలవడంపై శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అయితే ఆయా ప్రదేశాల్లో వీటిని ప్లాస్టిక్స్టోన్, ప్లాస్టిక్రస్ట్, ప్లాస్టిగోమెరేట్, ప్లాస్టిటార్, ఆంత్రోపోక్వినాస్, ప్లాస్టిసాండ్స్టోన్లు అని పిలుస్తారు. ఆ పేర్లన్నీ అలా ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియలను వివరిస్తున్నాయి. ఎలా కనుగొన్నారంటే.. జియాలజిస్ట్ ప్యాట్రిసియా కోర్కోరాన్ దాదాపు ఒక దశాబ్దం క్రితం హవాయిలో మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ రాక్‌ను కనుగొన్నారు. అప్పుడే దీని గురించి చర్చ మొదలైంది. ఆ టైంలోనే ప్లాస్టిక్ గొమెరైట్ అనే పదం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల సింఘువా విశ్వవిద్యాలయం పర్యావరణ అసోసీయేట్ ప్రొఫెసర్ దేయీహౌ అతని బృందం ప్లాస్టిక్, రాక్ మధ్య రసాయన బంధంపై చేసిన పరిశోధనల్లో లోతట్టు ప్రాంతాల్లో కనుగొన్న తొలి ప్లాస్టిక్ శిలను కనుగొన్నారు. ఆ తర్వాత వారి విస్తృతమైన పరిశోధనల్లో ఐదు ఖండాలు, 11 దేశాల్లో వీటి ఉనికిని గుర్తించారు. ఎలా ఏర్పడ్డాయంటే.. ఇవి ఏర్పడ్డ విభిన్న పద్ధతులపై అధ్యయనం చేయగా మంటలు లేదా వ్యర్థాలను కాల్చడం వంటి కార్యకలాపాలాల్లో ప్లాస్టిక్ శిథిలాలు కరిగిపోవడం, చలబడి ఖనిజ మాతృకలో మిళితం అవ్వడంతో ఏర్పడతున్నట్లు తెలుసుకున్నారు. ఇందుకు సముద్రపుప అలల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ కలిగి ఉన్న చమురు సముద్రంలోకి లీక్ అయితే అది అలల కారణం బీచ్‌లకు చేరుకుంటుంది. అక్కడ రాళ్లకు ప్లాస్టిక్ చమురు తట్టు అతుక్కుని పాక్షికంగా బాష్పీభవనం చెంది ఘనీభవించడం జరుగుతుంది. అలాగే సూర్యకాంతి కారణంగా ఈ ప్లాస్టిక్ ఆక్సీకరణ చెంది రసాయన బైండింగ్ జరిగి ఈ ప్లాస్టిక్స్టోన్ ఉత్పత్తికి దారీతీస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. బ్రెజిల్, బంగ్లాదేశ్, హవాయి, చైనా, జపాన్, ఇండియా, ఇటలీ, పోర్చుగల్, పెరూ, యునైటెడ్ కింగ్డమ్, స్పానిష్ ద్వీపాలలో ఈ ప్లాస్టిక్ రాళ్లు కనపడ్డాయి. ఇది ఒకరకంగా ప్లాస్టిక్ కాలుష్యానికి అద్దం పడుతుందనే చెప్పాలి. ఈ విచిత్రమైన రాతి నిర్మాణాల ఏర్పాటుకు దారితీస్తున్న క్లిష్టమైన ప్రక్రియలే అందుకు నిదర్శనం. కలిగే పర్యావరణ ప్రభావాలు.. ఈ ప్లాస్టిక్ శిలలు సమీపంలోని నేలలో సూక్ష్మజీవులు పెరిగేందుకు కారణమవుతుంది. స్థానిక పర్వావరణ వ్యవస్థలన్నీ దీనికి ప్రభావితం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు జంతువులు, మనుషులు శరీరాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. మానవులు కారణంగా ఈ భూమిపై ప్లాస్టిక్ ద్రవ్యరాశి సుమారు 22 నుంచి 28 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు. దీనికీ తోడు ఆవిర్భవిస్తున్న ఈ ప్లాస్టిక్ రాక్లు మరింత కాలుష్యానికి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వీటికారణంగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందితే మైక్రోప్లాస్టిక్‌లు బెడద ఎక్కువ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యాని తగ్గించే తక్షణ చర్యలకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోందని శాస్త్రవేత్తలు అన్నారు. (చదవండి: కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే రౌడీబేబీని ఎదుర్కొండి ఇలా! ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండిలా..!) -
సూపర్ మార్కెట్ల తిండి...
ఆధునిక యుగంలో సర్వం ప్లాస్టిక్‌మయం.. మనం తీసుకొనే ఆహారం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కంటికి కనిపించిన సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు ఆహారంలో చేరుతున్న సంగతి తెలిసిందే అయినా ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారంలో ప్లాస్టిక్ పరిమాణంపై ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యే రెడీమేడ్ ఆహారంతోపాటు ఫాస్ట్‌ఫుడ్‌ను ప్రయోగశాలలో క్షుణ్నంగా పరీక్షించింది. ఆహార తయారీ సమయంలోనే అందులో ప్లాస్టిక్ కలుస్తున్నట్లు గుర్తించింది... ► ఫాస్ట్ఫుడ్స్తోపాటు సూపర్ మార్కెట్లలో లభించే 85 రకాల ఆహార పదార్థాలను పరీక్షించగా, 84 పదార్థాల్లో ఫ్తాలేట్స్ అనే ప్లాస్టిక్ రసాయనం ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్లాస్టిక్ ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఈ కెమికల్‌ను ఉపయోగిస్తుంటారు. పోలార్ సెల్ట్జెర్ కంపెనీ తయారు చేసిన రాస్బెర్రీ లైమ్ అనే పండ్ల రసంలో ప్లాస్టిక్ లేదని తేలింది. ► తాము పరీక్షించిన వాటిలో 79 శాతం ఆహార నమూనాల్లో బైస్ఫెనాల్–ఏ(బీపీఏ) అనే మరో ప్లాస్టిక్ రసాయనం ఉన్నట్లు తేలిందని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రకటించింది. కానీ, 2009 నాటితో పోలిస్తే ఇప్పుడు ఆహార పదార్థాల్లో ఈ కెమికల్ పరిమాణం తక్కువే ఉన్నట్లు వెల్లడించింది. ► ఆహారంలో ఫ్తాలేట్స్ స్థాయి ఎంతవరకు ఉంటే క్షేమం అనేదానిపై సైంటిస్టులు ప్రమాణాలేవీ నిర్దేశించలేదు. అవి ఎంత తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ముప్పేనని చెబుతున్నారు. ► ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ శరీరంలో ఈస్ట్రోజెన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణను అస్తవ్యస్తం చేస్తాయి. ► ఇలాంటి రసాయనాలు కలిసిన ఆహారం తీసుకుంటే పుట్టుక లోపాలు, క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, స్థూలకాయం, నరాల సంబంధిత వ్యాధులతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ► చీరియోస్, గెర్బర్ బేబీ ఫుడ్, యోప్లాయిట్ యోగర్ట్‌తోపాటు వెండీస్, బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్స్ వంటి ప్రఖ్యాత కంపెనీల బర్గర్లు, చికెన్ నగ్గెట్స్, ఫ్రైలలో ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ ఉన్నట్లు గుర్తించారు. ► ఆహారంలో ప్లాస్టిక్‌ల నియంత్రణ కోసం ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని, నిబంధనలను కఠినతరం చేయాలని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రతినిధి జేమ్స్ రోజర్స్ సూచించారు. – సాక్షి, నేషనల్ డెస్క్