
ప్లాస్టిక్ భూతం మానవాళిని ఎంతగా నాశనం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకి ఎంతలా పెరిగిపోతుందే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్లాస్టిక్ నివారణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ మనుషులతోపాటు జంతువులకు కూడా హానీ కలిగిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో కలపడంతో అక్కడ ఉండే మత్య్స సంపద సైతం అంతరించి పోతుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘కడుపులో ప్లాస్టిక్‌తో నిండిపోయిన చేప దొరికింది అనే క్యాప్షన్‌తో’ ట్విటర్‌లో షేర్ చేశారు.
స్పెయిన్‌లోని కెనారాస్ దీవుల్లో ఓ మత్య్సకారుడు రెండు ఆక్టోపస్‌లను, ఒక చేపను పట్టుకున్నాడు. చేపలో ఏదో విచిత్రంగా ఉందని భావించిన అతడు చేపను కోసి చూడగా దాని పొట్ట మొత్తం ప్లాస్టిక్‌తో నిండిపోయి ఉంది. ఆశ్యర్యకర విషయమేమిటంటే పొట్టలో ప్లాస్టిక్ చేరినప్పటికీ చేప సజీవంగానే ఉంది. చేప పొట్టలో ప్లాస్టిక్ ఉండటం చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మనుషులు భూమినే కాకుండా సముద్రంలోని చేపలను కూడా నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. అలాగే చిన్న చేపలోనే ఇంత ప్లాస్టిక్ ఉంటే తిమింగలం కడుపులో ప్లాస్టిక్ ఏ స్థాయిలో ఉంటుందోనని పలువురు కామెంట్ చేస్తున్నారు.
Fish found with a stomach full of plastic. pic.twitter.com/ymdkwGmAsb
— 🌏💧Yasmin Scott (@YASMINSCOTTREAL) January 22, 2020