ప్రకృతి అంటేనే మనిషికి అందని రహస్యాల పుట్ట. అప్పుడప్పుడు అద్భుతమైనవి వెలుగులోకి వచ్చి మనల్ని ఆశ్చర్యంలో ముంచుత్తుతాయి. అయితే కొన్ని అరుదైన జీవులు కూడా అంతరించిపోతున్న తరుణంలో, మారుతున్న కాలంతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన జీవులు వెలుగులోకి రావడం విశేషం. ఆస్ట్రేలియా తీరంలో అత్యంత అరుదైన లెపార్డ్ టోబీ పఫర్ ఫిష్ దర్శనమిచ్చింది. దీంతో ప్రకృతి ప్రేమికులు సంబర పడుతున్నారు.
Super Rare Leopard Toby Puffer Fish సముద్రపు లోతుల్లో సంచరిస్తున్న కోరల్ సీ మెరైన్ పార్క్‌లో ఈత కొడుతున్న డీప్ సీ డైవర్ దృష్టిలోచిరుతపులిని పోలిన మచ్చలున్న చిన్న తెల్ల చేప పడింది. దీన్నే లెపార్డ్ పఫర్ ఫిష్ లేదా కాంతిగాస్టర్ లెపార్డ్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా తీరంలోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో ఈత కొడుతుండగా, ఒక డైవర్ 'అత్యంత అరుదైన' సముద్ర జీవిని చూసి ఆశ్చర్యపోయాడు టోబీ పఫర్ అందమైన ఫోటోను గ్రేట్ బారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీకి అనుబంధ సంస్థ మాస్టర్ రీఫ్ గైడ్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసింది. ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని సంస్థ తెలిపింది.
ఇవి సాధారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, గ్వామ్, మైక్రోనేషియా జలాల్లో కనిపిస్తుందని, అయితే ఈ తెల్లని చేప ఆస్ట్రేలియాలో కనిపించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ప్రతిరోజూ మనల్ని ఆశ్చర్యపరిచే శక్తి సముద్రానికి ఉంది.ఇంకా కనుగొనలేని అద్భుతమైన జంతువులు సముంద్రం నిండి ఉంది. తన జీవితంలో చిన్న తెల్ల చేపను చూడటం చాలా అదృష్టం అని డైవర్ కేథరీన్ లోగాన్ పేర్కొన్నాడు.
చిరుత టోబీ పఫర్ అంటే ?
రాక్ ఎన్ క్రిటర్స్ ప్రకారం, ఇది అక్వేరియంలో ఎక్కువగా వాడతారు. దీని ముందు భాగంలో రెండు చారలు ఉంటాయి. ముత్యం లాంటి తెల్లటి శరీరంపై చిరుత పులికి ఉండే మచ్చల్ని పోలిన మచ్చలు ఉంటాయి. అలాగే దీన్నిపట్టుకున్నప్పుడు కొద్దిగా "పఫ్"(ఉబ్బుతాయి) అవుతాయి. దాదాపు 3 అంగుళాల పొడవు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment