మాట్లాడటం మినహా, మనుషులకుండే అన్ని భావోద్వేగాలు ప్రపంచంలోని అన్ని ఇతర జీవుల్లోనూ సహజమే. ఆకలి దప్పికలతోపాటు, కోపం,శోకం, దుంఖం ఇలా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తాజాగా జీవిత సహచరుడిని కోల్పోవడాన్ని మించిన విషాదం మరొకటి ఉండదు. అలా ఒకచెట్టుకింద, ప్రేయసిని కోల్పోయి విలపించిన కోలా హృదయ విదారక వీడియో ఒకటి నెట్టింట తెగషేర్ అవుతోంది.
సౌత్ ఆస్ట్రేలియన్ వాలంటీర్ కోలా రెస్క్యూ గ్రూపు ఈ కోలాని గుర్తిచింది. అక్కడ చనిపోయిన ఆగ కోలాను పట్టుకుని మగ కోలా విలపిస్తోంది. ఇది చాలా హృదయ విదారకంగా ఉంటూ ఈ టీం ఈ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ జంటను చూసినప్పుడు గుండె పగిలిందన్నారు కోలా రెస్క్యూ అధికారి హార్ట్లీభావోద్వేగానికి లోనయ్యారు. అత్యంత విషాదకరమైన వీడియో. గుండె పగిలిపోయింది.. నా కళ్లలోనూ నీళ్లు తిరుగుతున్నాయంటూ చాలామంది కమెంట్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది.
A koala mourning its female friend who has passed , holding and hugging her
— Science girl (@gunsnrosesgirl3) February 23, 2024
pic.twitter.com/zLO9JZE3Ox
కాగా ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలోని యూకలిప్టస్ అడవుల్లో ఇవి కనిపిస్తాయి. యూకలిప్టస్ ఆకులు తింటాయి. ఈ ఆకులే వాటి ఏకైక, ప్రధాన ఆహారం. అంతేకాదు ప్రపంచంలోనే రోజుకు 22 గంటలు నిద్రించే జంతువు. తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా నీళ్లు తాగవు. అందుకే వీటిని 'నో డ్రింక్' జంతువు అని కూడా అంటారు. ఆకుల్లో ఉండే తేమే వీటికి ఆధారం.
Comments
Please login to add a commentAdd a comment