సిడ్నీ : ప్రస్తుతం ఆస్ట్రేలియాను కార్చిచ్చు అతలాకుతులం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోనే పలు రాష్ట్రాలకు కార్చిచ్చు అంటుకొని వేలాది జంతువులు బలైపోయాయి. ఆస్ట్రేలియాలోని కంగారు ఐలాండ్ కూడా కార్చిచ్చు భారీన పడింది. ఈ ఐలాండ్‌లోనే కోలా అనే జంతువులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇద్దరు టీనేజర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోలాలను కాపాడి తమ కారులో భద్రపరిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎవరు ఏమైతే మాకేంటి అన్న ధోరణిలో వెళ్తున్న ప్రస్తుత సమాజంలో ఏదో ఒక మూల మానవత్వం అనేది ఇంకా మిగిలేఉందని మీకా,కాలేబ్‌లు నిరూపించారు. అయితే ఇదంతా వారి కజిన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కారులో వారు కాపాడిన సుమారు 20 కోలాలు ఉన్నట్లు తెలిసింది. ఆ వీడియోతో పాటు ఒక సందేశాన్ని కూడా జత చేశాడు.
'ఈరోజు మీకా, కాలేబ్‌లు చేసిన పని నాకెంతో నచ్చింది. కార్చిచ్చు అంటుకున్న కంగారు ఐలాండ్‌లో తమ ప్రాణాలకు తెగించి కోలాను కాపాడడం నిజంగా అద్భుతం. వారు కాపాడిన కోలాలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయంటూ. మా కజిన్స్ చేసిన పనికి ప్రభుత్వం మెచ్చుకుంటుందేమో చూడాలి' అంటూ అతను పేర్కొన్నాడు. మీకా, కాలెబ్‌లు కలిసి దాదాపు 20 కోలాలను కాపాడారు. కంగారు ఐలాండ్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేవరకు కోలాను తామే పెంచుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం 14 సెకన్ల నిడివి ఉన్న వీడియో ప్రసుత్తం వైరల్‌గా మారింది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ మూగ జీవాలను కాపాడి నిజమైన హీరోలయ్యారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment